
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ‘అంత్రిక్ సురక్ష సేవ పతకం–2020’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను కేంద్రం ఈ మెడల్స్‌కు ఎంపిక చేసింది. వీటిని డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అందజేశారు. మెడల్స్ అందుకున్న వారిలో డీఐజీ పాలరాజు(ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్), అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా, పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబు, నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment