
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై, పోలీస్ శాఖపైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని అన్నారాయాన.
‘‘పోలీసులు మరిచిపోకండి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా కీలకం. పదే పదే ఈ విషయాన్ని మాతో చెప్పించుకోకూడదు. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది?. ఏదైనా తెగే వరకు లాగకూడదు. బయటకు వస్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. డీజీపీ దీనికి బాధ్యత తీసుకోవాలి.
.. ఆడపిల్లలను రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది?. అత్యాచార నిందితుల అరెస్టుకు కులం అడ్డొస్తుందా?. క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది?. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. ఈ విషయాన్ని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో ఎందుకు రేప్‌లు జరగవు?. అక్కడ మాట్లాడాలంటే భయపడతారు.
.. హోం మంత్రి అనిత జరుగుతున్న అఘాయిత్యాలపై రివ్యూ జరపాలి. మంత్రిగా బాధత్య తీసుకోవాలి. విమర్శలను పట్టించుకోకపోతే.. చేతకాకపోతే హోం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఒకవేళ.. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. పదవి ఇవాళ ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు ఐ డోంట్ కేర్.. అని పవన్ అన్నారు.
ఇదీ చదవండి: ఇంతకీ ఆ జనసేన ఎమ్మెల్యే ఎక్కడ?