బలవంతంగా నవ్వించిన చంద్రబాబు! | Anitha Pawan Kalyan Laughed In Chandrababu Diversion Politics | Sakshi
Sakshi News home page

బలవంతంగా నవ్వించిన చంద్రబాబు!

Published Thu, Nov 7 2024 6:50 PM | Last Updated on Thu, Nov 7 2024 7:15 PM

Anitha Pawan Kalyan Laughed In Chandrababu Diversion Politics

విజయవాడ, సాక్షి:  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో.. డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎం చంద్రబాబు పడరాని పాట్లు పడ్డట్లున్నారు. ఈ క్రమంలోనే పవన్‌-అనితలను పక్కపక్కనే ఉంచి.. బలవంతంగా నవ్వించి మరీ ఆ ఫొటోలను బయటకు వదిలారు.

సూపర్‌ సిక్స్‌ను అటకెక్కించి మరీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడిపిస్తున్న చంద్రబాబు.. అందుకోసం పవన్‌ను ఏ రేంజ్‌లో వాడుకుంటున్నారో చూస్తున్నాం. మూడు రోజుల కిందట పిఠాపురం సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే..

లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యంపై చంద్రబాబును ఏమీ అనకుండా.. హోం మంత్రి అనితను తిట్టారు. పైగా దళిత మహిళామంత్రిని ఒకవైపు కించపరుస్తూనే.. మరోవైపు తానే హోం మంత్రి తీసుకుంటానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.  పవన్‌ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ను అర్థం చేసుకోగలనంటూ మాట్లాడిన అనిత.. లోలోపల ఫీలైనట్లున్నారు. అందుకే చంద్రబాబు దగ్గర పంచాయితీ పెట్టారు. 

అనితపై పవన్‌ వ్యాఖ్యలే ప్రధానాంశంగా ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి ఇవాళ భేటీ జరిపారు కూటమి నేత చంద్రబాబు. చర్చలో అసలేం జరిగిందో తెలియదుగానీ.. వివాదం సద్దుమణిగిందంటూ ప్రచారం చేయాలని ఎల్లో మీడియాను ఆదేశించినట్లున్నారు. ఈ క్రమంలోనే ఇలా నవ్వులు చిందిస్తూ ఇద్దరి ఫొటోలను బయటకు రిలీజ్‌ చేయించారు. వీటిని పట్టుకుని ఎలివేషన్లతో కథనాలు ఇచ్చేస్తున్నాయవి. గిల్లి గిచ్చి మరీ జోల పాడడం అంటే ఇదేనేమో!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement