
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్.. ‘డిజిటల్ టెక్నాలజీ సభ–2022’ అవార్డులను గెలుచుకుంది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కించుకుని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం 8 అవార్డులు, తిరుపతి అర్బన్ పోలీస్ యూనిట్ రెండు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ యూనిట్లు ఒక్కోటి చొప్పున గెలుచుకున్నాయి. బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఏపీ పోలీస్, జీఐఎస్ ఆధారిత జీపీఎస్ విధానం, దిశ కమాండ్ కంట్రోల్ రూమ్, రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్, హాక్ వాహనాలు, వీడియోకాన్ఫరెన్స్ విధానం, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ విధానాలకు డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కాయి.
చదవండి: (ఆకలితో బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ.. కనీసం తాగునీరు లేక..)
సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్న పోలీసు శాఖను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల భద్రతకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మెరుగైన పోలీస్ వ్యవస్థ కోసం రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment