గుంటూరు, సాక్షి: సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వాళ్లు ఒకసారి తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీపై, కూటమి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న పోలీస్ అధికారులకు హితబోధ చేశారు.
‘‘పోలీసులు సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు. ఇల్లీగల్‌గా అరెస్టులు చేయడమేంటి?. రాజకీయ నాయకులు చెప్తున్నారని.. తప్పు చేస్తూ పోతే బాధితుల ఉసురు తగులుతుంది. పోలీసులు ఇప్పటికైనా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మీరు చేసే పనుల వల్ల పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటోంది.
పోలీస్ అధికారిలా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వన్‌సైడెడ్‌గా ఉండకండి. వ్యవస్థపై గౌరవంతో ఉండండి. మేం చూస్తూ ఊరుకోం. తప్పు చేసే పోలీసుల మీద ఫిర్యాదు (ప్రైవేట్ కంప్లయింట్) చేస్తాం. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అందుకు న్యాయసహాయం అందిస్తుంది. జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో.
.. ట్రాన్స్‌ఫర్ అయినవాళ్లనే కాదు.. రిటైర్ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెతాం. రెడ్ బుక్ ఇప్పుడు ఉన్నవాళ్లే కాదు. బాధితులు కూడా రెడ్‌బుక్‌లు పెట్టుకుంటారు. వాటి ఆధారంగా అలాంటి పోలీసులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం అని జగన్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment