warn
-
ఆ మంత్రులిద్దరికీ చంద్రబాబు వార్నింగ్?!
అమరావతి, సాక్షి: సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ‘నెల్లూరు పంచాయితీ’ జరిగింది. ఆ జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలపై ఆయన క్లాస్ తీసుకున్నారు.నెల్లూరు మంత్రులిద్దరూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యవహారాల్లో పూర్తిగా ఆయన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి ఆనం నిర్వహించిన సమీక్షకు ఆయన్ని పిలవలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన బీద రవిచంద్ర.. అధినేత చంద్రబాబుని కలిసి ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆనం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చూపిస్తుండడంపైనా గరం అయ్యారని, ఇక నుంచైనా బీద రవిచంద్రతో కలిసి పని చేయాలని మంత్రులిద్దరికీ చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం.ఇంకా భేటీలో మంత్రులతో చంద్రబాబు ఏమన్నారంటే.. నెల రోజుల పని తీరుపై చర్చ జరిపాం. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందే. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. -
ఇదో కొత్తతరహా మోసం.. జాగ్రత్త: సజ్జనార్
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరలేపారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో వారు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాను మొదలెట్టారని... మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు సమర్పించుకోవద్దన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. భయపడిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి… pic.twitter.com/l30JmmPCeS — V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 2, 2024 -
ఛలో లక్షద్వీప్.. మంచిది కాదు!
కవరత్తి: మాల్దీవులపై కోపంతో.. సొంత పర్యాటకాన్ని ప్రొత్సహించుకునే క్రమంలో సోషల్ మీడియాలో ఛలో లక్షద్వీప్ ట్రెండ్ తీసుకొచ్చారు కొందరు భారతీయులు. అయితే.. లక్షద్వీప్‌కు పర్యాటకులు పోటెత్తడం ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు అక్కడి ఏకైక ఎంపీ. పగడాల నేల లక్షద్వీప్ చాలా సున్నితమైందని.. పైగా పర్యావరణపరంగా చాలా పెళుసుగా ఉండటంతో అతి పర్యాటకం దీవులకే ముప్పు తెస్తుందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌కు ఎన్నో పరిమితులున్నాయి. ఇక్కడికి నేరుగా విమాన సౌకర్యం లేదు. హోటల్ గదులు 150 వరకే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ద్వీపం పెళుసు జీవావరణ దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు పోటెత్తడాన్ని నియంత్రించాల్సి ఉంటుంది అని ఎంపీ మొహమ్మద్ ఫైజల్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆలోచనను ప్రతిపాదించింది. ఈ ప్లాన్.. ఇక్కడి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం రూపొందించబడిన గ్రంథం లాంటిది. దీవుల సామర్థ్యం ఆధారంగానే.. ఇక్కడ సౌకర్యాల ఏర్పాటు జరగాలని.. పర్యాటకుల్ని అనుమతించాలంటూ స్పష్టంగా సూచించింది ఈ కమిటీ. కాబట్టి.. ఈ దీవులకు నియంత్రణ పర్యాటకం(controlled tourism) సరైందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌లోని.. 36 దీవులకుగానూ 10 మాత్రమే జనావాసంగా ఉన్నాయి. ఇక్కడి జనాభాలో 8 నుంచి 10 శాతం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పైగా టూరిజం జాబితాలో చాలామందికి ఇది ఉండకపోవచ్చు. కేవలం మాల్దీవుల మీద కోపంతో.. చాలామంది లక్షదీవులకు వెళ్తామంటూ చాలామంది చెబుతున్నారు. ఇది కేవలం భావోద్వేగపూరితమైన చర్య మాత్రమే అని తెలిపారాయన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన.. ఆ సమయంలో దిగిన ఫొటో షూట్ తర్వాత.. మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు బెడిసి కొట్టడాన్ని ప్రధానాంశంగా లేవనెత్తుతూ అక్కడి ప్రతిపక్షాలు రచ్చే చేశాయి. దీంతో ముగ్గురు మంత్రుల్ని తొలగించాల్సి వచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే.. చైనాతో భేటీ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వరం మారింది. ఈ క్రమంలో.. తమది చిన్నదేశమే అయినా బెదిరింపుల్ని ఉపేక్షించబోమని, మార్చి 15వ తేదీలోపు అక్కడ మోహరించిన భారత సైన్య సిబ్బంది వెనుదిరగాలంటూ అల్టిమేటం ప్రకటించారాయన. -
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ.. డీజీపీ రవిగుప్తా పిలుపు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ సరఫరాదారులు, వాడేవాళ్లకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామాల నడుమ.. ఈసీ ఆదేశాలతో డీజీపీగా రవి గుప్తా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన పూర్తిస్థాయిలో కొనసాగించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపించింది. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాదకద్రవ్యాల విషయమై హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని.. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారాయన. Govt. of Telangana resolved to make Telangana, a drug-free State. Let’s all unite to drive away the drugs from the territory of our State. All drug peddlers and consumers are hereby warned in this regard. Stringent legal action would be initiated against the violators. Let’s… — DGP TELANGANA POLICE (@TelanganaDGP) December 20, 2023 -
అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలను అక్బరుద్దీన్‌పై బుధవారం కేసు నమోదు చేశారు సంతోష్ నగర్ పోలీసులు. ఈ మేరకు ఓ వీడియో వైరల్ కావడం కూడా తెలిసిందే. లలితాబాగ్‌లో మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. సమయం అయిపోతుందని, ప్రచారం ముగించాలని స్థానికంగా విధులు నిర్వస్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్‌ను కోరారు. ఆ సమయంలో పోలీసు అధికారిపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలు అయినా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయంగానూ విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 353(విధుల్ని అడ్డుకోవడం)తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు. #WATCH | Telangana: AIMIM leader Akbaruddin Owaisi threatened a police inspector who was on duty and asked him to leave the spot while he was addressing a campaign in Lalitabagh, Hyderabad yesterday. The police inspector asked him to conclude the meeting on time as per the Model… pic.twitter.com/rf2tJAOk3b — ANI (@ANI) November 22, 2023 బీజేపీ స్పందన.. దశాబ్దాలుగా, కాంగ్రెస్ & బీఆర్ఎస్ మద్దతుతో, ఎంఐఎం ఒక నేర సంస్థగా మారిందని, ఇది పాత నగరాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపింది. అలాగే నేరాల బారిన పడకుండా చేసిందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన ఈ గజిబిజిని శుభ్రం చేయడానికి ఇది సమయం అని తెలిపింది. బిజెపి ప్రభుత్వంలో, అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది. -
పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా..?
పాములు కాటేసే ముందు ముందుగానే హెచ్చరిస్తాయట. ఆ ఒక్క పాము మినహా మిగిలిన అన్ని పాములు ముందుగానే వివిధ శబ్ధాలతో మన్నల్ని హెచ్చరిస్తాయి. నిజానికి అవి నేరుగా కాటేయవని ముందుగా సిగ్నల్ ఇస్తాయని నిపుణుల అంటున్నారు. దాన్ని నిశితంగా గమనిస్తే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చట. నిజానికి పాములను చూసి మనం భయపడతాం గానీ వాటికి మనం అంటేనే భయం. అందువల్లే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయట. ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "బుస్స్" "బుస్స్".. అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేసే ప్రయత్నం చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది అన్నారు. కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు. పాము కాటు వేసిన వెంటనే ఏం జరుగతుందంటే.. పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు. పాము కాటు వేస్తే ఏం చేయాలి పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఏం చేయకూడదు..? పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి. వేసకి కాలంలో బయట సంచరిస్తాయట. శీతకాలంలో నిద్రాణ స్థితిలో ఉంటాయట. వర్షాకాలంలో గుడ్లు పెడతాయట. శీతకాలం వచ్చేలోపు ఈ సమయంలో కావల్సిన ఆహరం కోసం వేట మొదలుపెడతాయట. అందువల్ల ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. (చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!) -
ఆపకపోతే నా అనుచరులకి అప్పగిస్తా: జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చా. మీడియా సమావేశం పెట్టినా.. ఇంకా పుకార్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ గుసగుసలు ఇప్పటికైనా బంద్ కావాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీలోనే నేతలు చేస్తున్న ప్రచారంపై ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లపై మండిపడ్డ ఆయన.. ‘‘మళ్లీ చెప్తున్నా.. పార్టీ మారే ఉద్దేశం లేదు. నా గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తే.. పార్టీలో ఫిర్యాదు చేస్తా. పరువునష్టం దావా వేస్తా. లీగల్ నోటీసు ఇస్తా. అయినా మారకపోతే నా అనుచరులకి అప్పగిస్తా’’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ‘‘మీడియా సమావేశంలో నేను చెప్పినప్పటికి కొంతమంది గుసగుసలు పెడుతున్నారు. అనుమానం క్లియర్ చేశాను.. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా?. అనుమానించే వారికీ పనేం లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కస్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది గుసగుసలు ఇప్పటికైనా బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏం సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి పిర్యాదు చేస్తా. రేవంత్, భట్టి లతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించి.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పరువు నష్టం దావా వేస్తా. ఇప్పటికీ నాకు స్వంత ఇల్లు లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి.. అది వారికే ఇచ్చేస్తా. ధరణి లో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే.. వారికే ఇస్తా. 90 శాతం అహింస వాదిని.. 10 శాతం భగత్ సింగ్ లాగా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని అంటూ వ్యాఖ్యలు చేశారాయన. ఇదీ చదవండి: కేసీఆర్ దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ కరివేపాకు! -
ప్రిగోజిన్ ద్రోహి.. వెన్నుపోటు పొడిచాడు: పుతిన్
క్రెమ్లిన్: మాస్కో సహా రష్యా కీలక నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ.. వాగ్నర్ సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డాడు. తాజా పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన పుతిన్.. ప్రిగోజిన్ రష్యాకు వెన్నుపోటు పొడిచాడని, అలాంటి ద్రోహులు ఫలితం అనుభవించక తప్పదని మండిపడ్డారు. రష్యా మిలిటరీపై ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటన నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కో సహా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది క్రెమ్లిన్. ఈ క్రమంలో అంతర్యుద్ధం తప్పదన్న ఊహాగానాల నడమ.. పుతిన్ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. రష్యాలో అంతర్యుద్ధం జరగకుండా శాయశక్తులా అడ్డుకుంటానన్న ఆయన.. ప్రజలను ఉద్దేశించి ఐక్యత పిలుపు ఇచ్చారు పుతిన్. #UPDATE Russian President Vladimir Putin on Saturday acknowledged a "difficult" situation was unfolding in the southern city of Rostov-on-Don, where the Wagner mercenary group has taken control of key military sites in an effort to oust Russian military's top brass. pic.twitter.com/rC9QJXsGKB — AFP News Agency (@AFP) June 24, 2023 వాగ్నర్ తిరుగుబాటును రష్యాకు ఘోరమైన ముప్పుగా అభివర్ణించిన పుతిన్.. వ్యక్తిగత ఉద్దేశాలతోనే వాగ్నర్ చీఫ్ ద్రోహానికి పాల్పడ్డాడని పుతిన్ మండిపడ్డారు. రష్యా దక్షిణ నగరం రోస్తోవ్‌లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉందని.. పరిస్థితిని అదుపులోకి తెస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా వీపులో ప్రిగోజిన్ కత్తి దింపి వెన్నుపోటు పొడిచి ద్రోహానికి పాల్పడ్డాడని, దానిని శిక్ష అనుభవించక తప్పదని పుతిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వాగ్నర్ పేరిట ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్న ప్రిగోజిన్, గతంలో పుతిన్‌కు చాలా దగ్గరగా ఉండేవారు. అయితే గత కొంతకాలంగా రష్యా రక్షణతో ఆయనకు పడడం లేదు. ఈ తరుణంలోనే తమ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు రష్యా మిలిటరీ పాల్పడుతోందని ఆరోపిస్తూ తిరుగుబాటు జెండా ఎగరేశారాయన. ఇప్పటికే పాతిక వేలమందితో కూడిన ఆయన సైన్యం రోస్తోవ్‌లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. #BREAKING Wagner chief 'betrayed' Russia out of 'personal ambition': Putin pic.twitter.com/pRzqpxSKcj — AFP News Agency (@AFP) June 24, 2023 ఇదీ చదవండి: ప్రిగోజిన్ ఒక దొంగ.. రోడ్ల మీద అమ్ముకుంటూ.. ఇప్పుడు ఇలా -
ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించం: సజ్జనార్ సీరియస్
Hyderabad Viral Video: వీసీ సజ్జనార్ మరోసారి తన మార్క్ చూపించారు. ఓ యువకుడికి సలహా ఇస్తూనే.. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇది కాస్త వైరల్ కావడంతో.. సజ్జనార్ స్పందించారు. ప్రమాదాల బారిన పడి.. మీ తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దని సూచిస్తూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు.. చట్టప్రకారం.. ఇలాంటి వారిపై చర్యల కూడా ఉంటాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. మిథానీ డిపోకు చెందిన ఓ బస్సుపై సదరు యువకుడు స్టంట్లు చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఇన్స్టంట్ పాపులారిటీ కోసం పాకులాడుతూ.. ప్రమాదాలు పడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తన సొంత అకౌంట్నుంచి.. వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి అంటూ ట్వీట్ చేశారు. ఆపై ఆర్టీసీ ఎండీ హోదాలో మరో ట్విటర్ అకౌంట్ నుంచి.. ఇలాంటి చర్యలకు కఠిన చర్యలు ఉంటాయని మరో ట్వీట్ చేశారాయన. ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9 — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023 -
కలిస్తే ఖబడ్దార్.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చైనా
బీజింగ్: తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ప్రస్తుతం దౌత్యపరమైన ఒప్పందాల కోసం మధ్యఅమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే.. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యంతో చర్చిస్తే.. చూస్తూ ఊరుకోబోమని డ్రాగన్ హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ.. తైవాన్‌కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు(చైనాను ఉద్దేశించి..) ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేదంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్ హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఒకవేళ తైవాన్ అధ్యక్షురాలు గనుక అమెరికా చట్టసభ స్పీకర్‌ను కలిస్తే మాత్రం పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశంగా భావించక తప్పదని పేర్కొంది. మరోవైపు సాయ్ ఇంగ్-వెన్ వ్యాఖ్యపైనా చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను, చర్యలను బీజింగ్ వర్గాలను రెచ్చగొట్టడం కిందే చూడాల్సి వస్తుందని, ప్రతీకార చర్యలు తప్పవని, తర్వాతి పరిణామాలకు తైవాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పతంజలి పేరు ఇకపై వాడొద్దు! బాబా రాందేవ్‌పై ఫైర్
లక్నో: పతంజలి బ్రాండ్ పేరిట పలు విక్రయాలు చేపడుతున్న బాబా రామ్‌దేవ్, ఆ కంపెనీ ఎండీ బాలకృష్ణన్‌పై మండిపడ్డారు బీజేపీ నేత ఒకరు. మహానుభావుడైన పతంజలి పేరుతో అమ్మకాలను నిర్వహించొద్దని గురువారం డిమాండ్ చేశారు. పేరు మార్చకుంటే ఉద్యమం చేపడతానని హెచ్చరించారు ఆ బీజేపీ నేత. యూపీ కైసర్‌గంజ్ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. రామ్‌దేవ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్నోకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోండా జిల్లా కొండార్ గ్రామ పంచాయతీలో జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ.. పతంజలి బ్రాండ్‌పై మండిపడ్డారు. యోగా పితామహుడైన మహర్షి పతంజలి లాంటి వ్యక్తి పేరును వాడుకుని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్‌దేవ్.. పతంజలి పుట్టిన గ్రామానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ‘‘వారి వ్యాపారం గురించి నాకు అనవసరం. కానీ, నెయ్యి, సబ్బులు, ప్యాంట్లు, చివరకు.. లోదుస్తులకు ఆయన పేరు వాడుకోవడం ఎంత వరకు సమంజసం? అయినా వారికి ఆ హక్కు ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. రామ్‌దేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణ వెంటనే తమ బ్రాండ్‌కు పతంజలి పేరును వాడడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అయోధ్యకు వచ్చే యాత్రికులు కొండార్‌ను సందర్శించాలని, పతంజలి పేరుతో నెయ్యి తింటున్న వారు ఆ మహానుభావుడి స్వగ్రామం ఎలా ఉందో ఓ సారి చూడాలని విజ్ఞప్తి చేశారు. బ్రిజ్ భూషణ్ ఇలా తన ప్రకటనలతో వార్తల్లో నిలవడం కొత్తేం కాదు. ఇదీ చదవండి: సచిన్ పైలట్‌పై గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు -
భారత్‌లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసులు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. ‘తీవ్రత దృష్ట్యా’ ప్రజలు సైతం వైరస్‌ను పెద్దగా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కరోనా కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా కరోనా వైరస్ వేరియెంట్ ఒమిక్రాన్‌లో అత్యంత వేగంగా కేసుల వ్యాప్తికి కారణమయ్యే ఒక ఉప రకాన్ని భారత్‌లో గుర్తించారు. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ కేసులు మన దేశంలో వెలుగు చూశాయి. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ అంటే.. బీఏ.2.75, బీజే.1ల రీకాంబినెంట్. శాస్త్రీయ నామం బీఏ.2.10 (BA.2.10) మహారాష్ట్ర, కేరళ, ఇతర ప్రాంతాల్లో ఈ వేరియెంట్‌కు సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ వేరియెంట్ విషయంలో నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అందుకు కారణం.. సింగపూర్‌లో గత కొన్నిరోజులుగా కేసులు రెట్టింపు సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి కాబట్టి. ఒమిక్రాన్‌లో అత్యంత వేగంగా ఇన్ఫెక్షన్ను వ్యాపించే గుణం ఈ వేరియెంట్‌కు ఉందని పరిశోధకులు నిర్ధారించారు. ఇక గుజరాత్లో ఇప్పటికే బీఏ.5.1.7, బీఎఫ్.7 కేసులు వెలుగు చూశాయి. ఇవి కూడా వైరస్‌ను వేగంగా వ్యాపింపజేసే గుణం ఉన్న వేరియెంట్లే కావడం గమనార్హం. Omicron XBB తీవ్రత.. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ తీవ్రత ప్రమాదకరమేమీ కాదు. కరోనా తరహా దగ్గు, లో ఫీవర్, జలుబు, వాసన గుర్తింపు లేకపోవడం, ఒళ్లు నొప్పులు.. ఇలా కరోనా తరహాలోనే లక్షణాలే కనిపిస్తున్నాయి. అలాగే మంచి చికిత్సతో తొందరగానే కోలుకోవచ్చు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ, దాని గుణం వల్ల ఇన్ఫెక్షన్ను అతిత్వరగా.. వేగంగా వ్యాపింపజేస్తుంది. అంతేకాదు ఆస్పత్రిలో చేర్చే కేసుల్ని పెంచే అవకాశాలు ఎక్కువని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసులు ప్రస్తుతం భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో 70 దాకా నమోదు అయ్యాయి. ఒకవేళ ఈ వేరియెంట్ గనుక విజృంభిస్తూ.. మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఆగస్టులో ఈ వేరియెంట్‌ను మొదట అమెరికాలో గుర్తించారు. ► సింగపూర్‌లో ఒక్కరోజులోనే 4,700 నుంచి 11,700 కేసులు పెరిగాయంటే తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు కూడా. ► ఇతర వైరస్‌లలాగే.. Corona Virus కూడా తన రూపాల్ని మార్చుకుంటూ పోతోంది. ► ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై వ్యాక్సినేషన్ ప్రభావం పెద్దగా ఉండదని.. ఎందుకంటే దాని మ్యూటేషన్ అంతుచిక్కడం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై స్పందించారు. పండుగ సీజన్ దృష్ట్యా భారత్ సహా మరికొన్ని దేశాల్లో ఈ వేరియెంట్ మరో వేవ్‌కు కారణం కావొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు. -
రణం కాదు.. ఇక మరణమే!.. రష్యా బలగాల్లో వణుకు!
రష్యాలో యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు చూపిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ సైన్యం చేష్టలతో రష్యా బలగాలు వణికిపోతున్నాయి. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతం ఖేర్సన్లో మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. గత రెండు రోజుల్లోనే పదిహేను క్షిపణులతో దాడి చేసింది ఉక్రెయిన్. ఈ దెబ్బతో రష్యా బలగాలు.. ట్రూపులు లెక్కన వెనక్కి మళ్లుతున్నాయి. దాడి విషయాన్ని అటు రష్యా సైన్యం సైతం ధృవీకరించడం గమనార్హం. ఖేర్సన్ నుంచి వెనక్కి వెళ్లిపోండి. లేకుంటే ప్రాణాలు పోతాయ్ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్‌కు దిగాడు. దాదాపు మొత్తం ప్రాంతం అంతటా పోరు సాగింది. బతకాలనుకుంటే.. ఈసారికి రష్యా బలగాలు పారిపోవడం తప్ప మరో మార్గం లేదు. పారిపోండి.. ఉక్రెయిన్ తన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’’ అంటూ రష్యా బలగాలను ఉద్దేశించి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు జెలెన్స్కీ. అంతేకాదు.. ఉక్రేనియన్ దళాలు రష్యన్ సైన్యాన్ని ‘సరిహద్దు వరకు’ తరిమివేస్తాయంటూ సోమవారం అర్ధరాత్రి తర్వాత చేసిన ప్రసంగంలో ప్రతినబూనారు జెలెన్స్కీ. ఆరు నెలల కిందట రష్యా దురాక్రమణ మొదలయ్యాక.. మొదటగా ఆక్రమించుకుంది ఖేర్సన్ ప్రాంతన్నే. నల్ల సముద్రం(బ్లాక్ సీ) సరిహద్దుగా ఉండే ఈ ప్రాంతం ద్వారా సముద్రయానంతో పాటు ఉక్రెయిన్‌కు వరక్త, వాణిజ్యాలు ప్రధానంగా సాగుతుంటాయి. రష్యా ఆక్రమిత క్రిమియాకు 60 మైళ్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. మరోవైపు ఖేర్సన్ ప్రాంతంలో రష్యా వ్యవహారాలను చూసుకుంటున్న వ్లాదిమిర్ లియోన్టీవ్ స్పందిస్తూ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలిపారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వరుసగా మిస్సైళ్ల వర్షం కురుస్తోంది ఇక్కడ. రెండు రోజుల్లో పదిహేను క్షిపణి దాడులు జరగ్గా.. ఆరు నెలల్లో ఇప్పటివరకు ఖేర్సన్ను వంద మిస్సైళ్లకు పైగా తాకినట్లు లియోన్టీవ్ ప్రకటించారు. ఇక రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సైతం జెలెన్స్కీ పిలుపుపై స్పందించింది. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుందని, అన్నీ సక్రమంగా జరుగుతాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. అయితే రష్యా బలగాలు వెన్నుచూపుతున్నాయన్న ప్రకటనను మాత్రం ఖండించింది క్రెమ్లిన్. ఇదీ చదవండి: బాగ్దాద్ రణరంగం -
బీఎస్ఎన్ఎల్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్కు కేంద్రం ఈమధ్యే కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఇకపై బీఎస్ఎన్ఎల్ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని.. ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదేం చిన్నకేటాయింపు కాదు. పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ► ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం. ► BSNL ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్ భారీ ప్యాకేజీని ప్రకటించింది. మేము చేయవలసింది చేశాం. ఇక ఇప్పుడు చేయాల్సింది మీరే. పని చేయండి లేదంటే వెళ్లిపోండి. ► ఈ పోటీ పరిశ్రమలో మీ పనితీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాబోయే 24 నెలల్లో మంచి ఫలితాలను చూడాలనుకుంటున్నా. నేనే మీ పనితీరుపై నెలవారీ నివేదిక చూస్తా అంటూ ఆయన మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. గురువారం బీఎస్ఎన్ఎల్ సీనియర్ మేనేజ్మెంట్తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు లీక్ అయ్యింది. అయితే ఆ ఐదు నిమిషాల క్లిప్ ఒరిజినల్‌దే అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అదనంగా.. ఇదిలా ఉంటే.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (BBNL)ని BSNLతో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విలీనం ద్వారా, BSNL దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను అదనంగా పొందుతుంది. ప్రస్తుతం, బీఎస్ఎన్ఎల్కు 6.83 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇదీ చదవండి: ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి? -
ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్. పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి. దుబాయి చెట్టుగా పిలువబడుతున్న ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! శంకురూపంలో ఉండే కోకో కార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని అంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఏడారినుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచి, వేడిగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు. మనదేశంలోకి ప్రవేశించిందిలా.. వేగంగా పెరుగుతూ అధిక పచ్చదనాన్ని కలిగిన కోనోకార్పస్‌పై మనదేశంలోని నర్సరీ పెంపకం దారులు, ల్యాండ్‌స్కేప్ ఎక్స్‌పర్ట్‌ల దృష్టిపడింది. పచ్చదనంతో వెంచర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారులు ఈ మొక్కలను తీసుకొచ్చారు. అలా ఈ మొక్క మనదేశంలో ప్రవేశించింది. అనంతరం నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు మొదలు సాధారణ నగర పంచాయతీల వరకు ఈ మొక్కలను డివైడర్లపై, రహదారుల్లో విరివిగా నాటడం మొదలు పెట్టారు. తూర్పుకనుమల్లో భాగమైన నల్లమల అడవుల కేంద్రీయ స్థానమైన నంద్యాల జిల్లాలో కూడా దుబాయ్ మొక్క ప్రభంజనం తక్కువేమి కాదు. ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ తదితర మున్సిపాలిటీలలో దుబాయ్ మొక్కలను రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెద్ద ఎత్తున నాటుతున్నారు. జీవవైవిధ్యానికి మారు పేరైన నల్లమల సమీప ప్రాంతాల్లో ఈ ఖండాంతర మొక్క ప్రవేశంతో పర్యావరణ పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కోనోకార్పస్‌ను నిషేధించిన తెలంగాణ సర్కారు పలు పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనోకార్పస్ మొక్కలను నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. హరితవనం కార్యక్రమంలో తొలుత ఈ మొక్కలనే ఎక్కువగా వినియోగించిన ప్రభుత్వం త్వరలోనే వీటి దుష్ప్రభావాలను గుర్తించడం గమనార్హం. వన్యప్రాణులకు సంకటం వేరే ఖండాలనుంచి తెచ్చి పెంచే మొక్కలతో పర్యావరణ సమతుల్యతకు విఘాతమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాంటి వాటిని ఎక్సోటిక్ వీడ్ గా పిలుస్తుంటారు. ఇవి ప్రపంచంలో ఒక ప్రాంతం నుంచి సహజంగా అవి ఉండని మరో ప్రాంతంలో ప్రవేశ పెట్టబడినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వీడ్స్(కలుపు మొక్కలు)తో స్థానిక వృక్ష, గడ్డి జాతుల విస్తరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో హెర్బీవోర్స్(గడ్డితినే జంతువులు)కు ఆహార కొరత ఏర్పడి అది కార్నీవోర్స్( మాంసాహార జంతువులు)ఉనికికే ప్రమాదకారణమవుతుంది. కోనోకార్పస్‌తో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తనున్నాయి. ఇది వేగంగా పెరిగే నిత్య పచ్చదనం మొక్క కావడంతో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఇతర స్థానిక జాతి మొక్కలను, గడ్డిని ఎదగనీయదు.అలాగే పక్షులకు తమ జీవావరణంలో వచ్చిన ఈ కొత్త మొక్క గందరగోళానికి గురి చేయడంతో సహజ రక్షణలో గూళ్లు కట్టుకోవడంలో వైఫల్యం చెంది పునరుత్పత్తి అవకాశాలను తగ్గించుకుంటాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలకూ కారణం కోనోకార్పస్‌మొక్కపర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుందని పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో తేల్చింది. గా లిలో ఎక్కువ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి చేటు అని మరికొన్ని అరబ్‌దేశాలు గుర్తించాయి. దుబాయ్ మొక్కలతో పలు సమస్యలు దుబాయ్ మొక్కలు స్థానిక పర్యావరణ పరిస్థితులకు ముప్పుగా మారుతున్నాయి. చాలా మంది ఈ మొక్క గురించి తెలుసుకోకుండా పెంచుతున్నారు. ఆకురాల్చు అడవులున్న మన ప్రాంతంలో నిత్య పచ్చదనం కలిగిన దుబాయి మొక్కలు ఇతర వృక్షజాతుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి. వీటి పుష్పాలు వెదజల్లె పుప్పొడి వల్ల పలు శ్యాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. – విష్ణువర్ధన్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి,ఆత్మకూరు ఈ మొక్కలను నిషేధించాలి మహారాష్ట్రలోని పూణే, మన పొరుగున ఉన్న తెలంగాణలో దుబాయి మొక్కలను నాటడాన్ని నిషేధించినట్లుగానే మన రాష్ట్రంలో కూడా నిషేధించాలి. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ అంశానైనా ప్రభుత్వాలు అడ్డుకోవాలి. – సుబ్బయ్య ఆచారి, పర్యావరణ ప్రేమికుడు, ఆత్మకూరు -
యుద్ధం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన పుతిన్
కీవ్: పాశ్చాత్య దేశాల ఆంక్షల దాడిని రష్యా విజయవంతంగా తట్టుకుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆంక్షలు అంతిమంగా వాటికే బెడిసికొడతాయన్నారు. ‘‘రష్యా, బెలారస్ ఎరువుల ఎగుమతులపై నిషేధం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలకు రెక్కలొస్తాయి. ఇది అంతిమంగా అంతర్జాతీయ ఆహార కొరతకు, వలసలకు దారి తీస్తుంది’’ అన్నారు. ‘‘విదేశీ శక్తులు మమ్మల్ని ఎప్పటికీ ఏకాకి చేయలేవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశాన్నీ ఏకాకిగా మార్చలేం. రష్యా వంటి అతి పెద్ద దేశం విషయంలో అది అసలే సాధ్యం కాదు’’ అని స్పష్టం చేశారు. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకోతో కలిసి ఆయన మంగళవారం తూర్పు రష్యాలోని వొస్తోచ్నీ స్పేస్ లాంచ్ స్టేషన్‌ను సందర్శించారు. పశ్చిమ దేశాలు ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రష్యా వ్యతిరేక స్థావరంగా మారిందంటూ ఉక్రెయిన్‌పై మండిపడ్డారు. ‘‘నయా నాజీయిజం, జాతీయ అతివాదం అక్కడ బలంగా వేళ్లూనుకున్నాయి. అందుకే మా దేశ భద్రత కోసం ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగాల్సి వచ్చింది. మాకు మరో దారి లేకపోయింది’’ అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంత ప్రజలను కాపాడటమే తమ లక్ష్యమన్నారు. సైనిక చర్య ప్రణాళిక మేరకు సాగుతోందని, లక్ష్యం సాధించే దాకా కొనసాగి తీరుతుందని కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ వెనకడుగు వేయడం వల్లే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని ఆరోపించారు. పుతిన్ వాదనను ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు కొట్టిపారేశాయి. మతి లేని యుద్ధాన్ని సమర్థించుకోవడానికి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నాయి. కీవ్ సమీపంలో ఉక్రెయిన్ ఆయుధాగారాన్ని, మరో చోట యుద్ధ విమానాల హాంగర్‌ను దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో ధ్వంసం చేసినట్టు రష్యా చెప్పింది. భారీ రష్యా సైనిక కాన్వాయ్ ఇజుమ్ నగరం వైపు వెళ్తున్నట్టు అమెరికా తెలిపింది. విద్యుత్ గ్రిడ్‌పై రష్యా సైనిక హాకర్ల దాడిని తిప్పికొట్టినట్టు ఉక్రెయిన్ చెప్పింది. మారియుపోల్‌లో రష్యా సేనలు విషపూరిత రసాయనాలను ప్రయోగించాయని ఉక్రెయిన్ అనుమానం వెలిబుచ్చింది. దీన్ని రష్యా అనుకూల వేర్పాటువాదులు ఖండించారు. అదే జరిగితే ఏం చేయాలో తమకు తెలుసని ఇంగ్లండ్ చెప్పింది. రష్యాతో వర్తక, వాణిజ్యసంబంధాలను యూరప్ ఇప్పటికీ కొనసాగిస్తుండటం దారుణమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యాలోని ప్రధాన బ్యాంకులు, 400 మంది వ్యక్తులను కూడా ఆంక్షల పరిధిలోకి తెస్తున్నట్టు జపాన్ ప్రకటించింది. నోకియా కంపెనీ కూడా రష్యా మార్కెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. మరోవైపు యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎరువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఉక్రెయిన్‌లో నిరాశ్రయుల సంఖ్య కోటి దాటిందని ఐరాస శరణార్థుల సంస్థ పేర్కొంది. 50 లక్షల దాకా దేశం వీడారంది. -
Russia-Ukraine War: ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం
ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం ► ఉక్రెయిన్-రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలకుండా ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు చర్చల ముగిసిన కాసేపటికే అగ్ర రాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా ఎంబసీ సిబ్బంది రష్యాను వీడేందుకు అనుమతిచ్చింది. రష్యాలో ఉన్న అమెరికా పౌరులు సైతం వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. కాగా, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం ►ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ దేశాలు వెంటనే కాల్పులు విరమించుకోవాలని ఐరాస పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. యుద్ధంపై 193 దేశాలు తమ అభిప్రాయాన్ని తెలపనున్నాయి. తగ్గేదేలే.. 36 దేశాల విమానాలపై నిషేధం ► ఇప్పటికే పలు దేశాలు రష్యా పై పలు రకాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా మాత్రం వాటికి ఏ మాత్రం బెదరక పోగా తాజాగా బ్రిటన్, జర్మనీ, తదితర 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం ►ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని భారతీయలు తరలింపు ప్రక్రియపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేయడంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెలారస్లో ముగిసిన చర్చలు ►బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ముగిశాయి. సుమారు 4 గంటల పాటు ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడినట్టు సమాచారం. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతుగా వైట్ హౌస్ వద్ద నిరసనలు ► ఉక్రెయిన్-రష్యా సంక్షోభం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌ను తాకింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకుని ఉక్రేనియన్లు నిరసనలు తెలిపారు. తమ స్వదేశానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ముందు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఉక్రెయిన్‌లో పుట్టి రష్యాలో పెరిగిన ఓ వ్యక్తి కూడా పాల్గొనడం విశేషం. #WATCH | With Ukrainian flags, prayers & slogan chanting against Russian President Putin, protesters gathered in front of the White House in Washington, DC in a show of support for Ukraine pic.twitter.com/1nBYZHcl2x— ANI (@ANI) February 28, 2022 స్వదేశం చేరుకున్న 1400 మంది భారతీయులు ► ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా కేంద్రం భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. కాగా, ఇప్పటి వరకు 6 ప్రత్యేక విమానాల్లో 1400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారి అరిండమ్ బాగ్చీ తెలిపారు. ఆరు విమానాల్లో 4 బూచారెస్ట్(రొమేనియా), మరో 2 బుడాపెస్ట్(హంగేరీ) నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. As of now, six flights have arrived carrying around 1400 Indian citizens. Four flights have arrived from Bucharest (Romania) and two flights from Budapest (Hungary): MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/2K7EjEacHF — ANI (@ANI) February 28, 2022 ఉక్రెయిన్‌కు ఈయూలో సభ్యత్వంపై భిన్నాభిప్రాయాలు: చార్లెస్ మిచెల్ ► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో తమ దేశానికి ఈయూలో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్ స్కీ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారి చార్లెస్ మిచెల్ స్పందిస్తూ.. ఈయూ కూటమిలో ఉక్రెయిన్ చేరడంపై కూటమిలోని 27 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఈయూలో ఉక్రెయిన్‌కు వెంటనే సభ్యత్వం ఇవ్వండి: జెలెన్ స్కీ ► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల చేస్తున్న వేళ తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ పేర్కొన్నారు. బెలారస్లో చర్చలు ప్రారంభం ► బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్లో ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారులు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్.. రష్యా తక్షణమే యుద్ధం విరమించుకోవాలని కోరింది. రష్యా దాడుల్లో 102 మంది మృతి : UN ► ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించారు. ► అహింస ఒక్కటే మార్గం : దలైలామా ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దాడులపై ఆధ్యాత్మిక నేత దలైలామా స్పందించారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌పై ఒత్తిడి తీసుకురండి: ఇగోర్ పోలిఖా ► ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలీఖా తెలిపారు. ఈ క్రమంలో తమ దేశ విదేశీ భాగస్వాములందరి సాయాన్ని పోలిఖా అభ్యర్థించారు. మీ ప్రాణాలు కాపాడుకోండి.. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ విజ్ఞప్తి ► ఉక్రెయిన్‌పై రష్యా సైనం దాడులు కొనసాగిస్తున్న వేళ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా బలగాలను ఉద్దేశించి మీ ప్రాణాలు కాపాడుకోండి.. ఉక్రెయిన్‌కు వదిలివెళ్లిపోండి అంటూ విజ్ఞప్తి చేశారు. ► బెలారస్‌లోని ఫ్యాపిట్ వేదికగా కాసేపట్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు.. షరతులు లేకుండా ముందుకొచ్చిన రష్యా. మరోవైపు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న దాడులు. ► ఉక్రెయిన్‌కు ఊహించని సాయం!: యుద్ధ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌కు ఊహించని సాయం అందింది. నాటో దళాలు, ఈయూ దేశాలు పరోక్ష సాయానికి పరిమితమైన వేళ.. యూరప్ దేశం లాట్వియా (లాత్వియా) నుంచి ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష మద్ధతు లభించింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో ఓ కీలక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్న లాట్వియా పౌరులు అవసరమైతే యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పాల్గొనవచ్చని తెలిపింది. ఇందుకోసం పార్లమెంటు సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తమ పౌరులు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వీలు కల్పిస్తున్నందుకు గర్వంగా ఉందని పార్లమెంటు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలనుకునే, ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, మా ఉమ్మడి భద్రత కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే మా పౌరులు తప్పనిసరిగా అలా చేయగలరు" అని పార్లమెంటరీ రక్షణ, హోం వ్యవహారాలు, అవినీతి నిరోధక కమిషన్ ఛైర్మన్ జూరిస్ రాంకానిస్ తరపున ఒక ప్రకటన విడుదల అయ్యింది. లాట్వియా, బాల్టిక్ పొరుగున ఉన్న ఎస్టోనియా -లిథువేనియాతో కలిసి ఒకప్పుడు రష్యా పాలనలోనే ఉండేవి. రష్యాను భద్రతా ముప్పుగా చాలా కాలంగా చూసింది. చివరికి.. ఉక్రెయిన్ మాదిరిగా కాకుండా, ఆ మూడు దేశాలు యూరోపియన్ యూనియన్, NATO లో చేరాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌తో లాట్వియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ► బెలారస్‌కు చేరిన ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధులు. మధ్యాహ్నాం 3గంటలకు చర్చలు మొదలయ్యే అవకాశం. ►ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు: సోమవారం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగే చర్చలు సానుకూల ఫలితం ఇస్తుందని తాను అనుకోవట్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అందుకు ఆశాజనకంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారాయన. చర్చలపై ఆదివారం హైడ్రామా సాగగా.. ఓవైపు రష్యా దళాలను ఎదుర్కొంటూనే చర్చలకు సిద్ధమని ప్రకటించాడాయన. అయితే ఉక్రెయిన్ ప్రతిఘటనను రష్యా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దాడులను తీవ్ర తరం చేస్తూనే.. చర్చల ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో పాటు రష్యా తీవ్రంగా నష్టపోతోంది కూడా. ► కీవ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత. విద్యార్థులు పశ్చిమ వైపు ప్రాంతాల రైల్వే స్టేషన్లకు వెళ్లాలని సూచన. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం. ► ఉక్రెయిన్‌కు ఈయూ విమానాలు: రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు వైపుల నుంచి చుట్టుముట్టి దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై చేతనైనంత మేర పోరాడుతున్న ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. ► రష్యాకు సౌత్ కొరియా షాక్: రష్యాను ఆంక్షలతో ఇరకాటంలో పెడుతున్న పాశ్చాత్య దేశాలకు ఆసియా దేశం దక్షిణ కొరియా తోడైంది. రష్యా ఎగుమతులపై దక్షిణ కొరియా నిషేధం విధించింది. వ్యూహాత్మక వస్తువుల ఎగుమతులను నిషేధించడం ద్వారా.. రష్యాకు వ్యతిరేకంగా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేయాలని దక్షిణ కొరియా భావించింది. ఇప్పటికే SWIFT అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను సౌత్‌కొరియా బ్యాన్ చేసింది. ఈ మేరకు రాజధాని సియోల్ నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ► రష్యాకు మద్ధతుగా ఉన్న బెలారస్‌పై ఆంక్షలకు జపాన్ సిద్ధమైంది. ► సంచలనం.. పుతిన్‌పై ట్రావెల్ బ్యాన్: మొండిగా ఉక్రెయిన్‌పై దూసుకెళ్లి.. ఘోర విధ్వంసానికి తెర తీసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సభ్యులపై ఆస్ట్రేలియా మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వీరందరిపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా ప్రకటించారు. ‘‘మేము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్‌పై చేసిన అన్యాయమైన యుద్ధాన్ని ఖండిస్తున్నాం. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు రష్యా అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలిలో మిగిలిన శాశ్వత సభ్యులపై గత అర్ధరాత్రి నుంచే మా(ఆస్ట్రేలియా) తరపు నుంచి అమలులోకి వచ్చాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా 350 మందికి పైగా రష్యన్ వ్యక్తులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి’’ అని మోరిసన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. యుద్ధంలోనూ ఆస్ట్రేలియా ఉక్రెయిన్‌కు బాసటగా.. రష్యా దాడిని ఎదుర్కొనేందుకు ప్రాణాంతకమైన సైనిక సామగ్రిని అందజేయనుంది. అయితే ఆస్ట్రేలియా తాజా ప్రకటనలో.. ఏ మెటీరియల్‌ను పంపుతుందనే దానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ముట్టడి చేయబడిన ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో ట్రస్ట్ ఫండ్.. ప్రాణాంతకం కాని సైనిక పరికరాలు, వైద్య సామాగ్రి, 3 మిలియన్ డాలర్ల విరాళాన్ని శుక్రవారం అందించిన విషయం తెలిసిందే. ► రష్యా దాడుల్లో 350 మందికి పైగా మా పౌరులు మృతి చెందారు: ఉక్రెయిన్ ► ఆపరేషన్ గంగా.. ఐదో విమానం రాక: ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగను నిర్వహిస్తోంది భారత్. ఇందులో భాగంగా ఐదో విమానం.. 249 మందితో బుచారెస్ట్(రొమేనియా) నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వయంగా గాంధీనగర్ వెళ్లి వంద మంది విద్యార్థులకు స్వాగతం పలికారు. Close to 100 students from Gujarat were welcomed back by CM Bhupendra Patel this morning at Gandhinagar. These students landed from Ukraine in Mumbai and Delhi & were brought to Gujarat by Volvo buses.#RussiaUkraineCrisis pic.twitter.com/AsPR48chXO — ANI (@ANI) February 28, 2022 ► బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్.. కార్కీవ్ నగరం ► దాడులను తక్షణమే నిలిపివేయాలి- భారత్: భద్రతా మండలిలో రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. వీటో అధికారంతో అడ్డుకుంది రష్యా. దీంతో అగ్రరాజ్యాలు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా దాడులను వెంటనే ఈ మేరకు భద్రతా మండలిలో ప్రకటన విడుదల చేసింది. అయితే భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండడంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ► ఈ 24 గంటలే కీలకం: ఉక్రెయిన్ పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రాబోయే 24 గంటలు ఉక్రెయిన్‌కు కీలకమని ఈ సందర్భంగా జెలెన్స్కీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ► ఐరాస అత్యవసర భేటీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం. 11 దేశాల ఓటింగ్‌తో అత్యవసర భేటీకి తీర్మానం. భారత్, చైనా, యూఏఈ దూరం. ► రెడీగా ఉండండి-పుతిన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికీ సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. ఏ క్షణంలోనైనా ‘యుద్ధ విధులకు’ దిగేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందిగా రష్యా అణ్వాయుధ దళాలను పుతిన్ ఆదివారం ఆదేశించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ తదితరులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. నాటో దేశాధినేతల దుందుడుకు వ్యాఖ్యలకు, రష్యాపై, తనపై విధించిన కఠినమైన ఆంక్షలకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో అమెరికా, పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వివాదం చివరికి అణు యుద్ధానికి దారితీస్తుందేమోనని భయపడుతున్నాయి. అదే జరిగితే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ► అమెరికా ఆందోళన: ఈ వివాదంలో తలదూర్చే దేశాలపై అత్యంత కఠినంగా ప్రతి చర్యకు దిగుతామని యుద్ధానికి దిగిన సందర్భంగా పుతిన్ గట్టిగా హెచ్చరించడం తెలిసిందే. రష్యా తిరుగులేని అణు శక్తి అంటూ ఆ సందర్భంగా బెదిరించారు కూడా. ఉక్రెయిన్ను ఎలాగైనా ఓడించేందుకు రసాయనిక, జీవ రసాయన ఆయుధాల ప్రయోగానికి కూడా రష్యా దిగినా ఆశ్చర్యం లేదని ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై అమెరికా ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధోన్మాదాన్ని అస్సలు అంగీకారం కాని స్థాయికి పుతిన్ తీసుకెళ్తున్నారని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ దుయ్యబట్టారు. ఆయన చర్యలను అత్యంత కఠినంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ► వామ్మో ‘అణు’మానాలు: రష్యా, అమెరికా ప్రస్తుతం అతి పెద్ద అణ్వాయుధ దేశాలు. ఇవి రెండూ తమ వ్యూహాత్మక భూతల, జలాంతర్గామి అణ్వాయుధ సంపత్తిని నిరంతరం అప్రమత్తంగా, ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు సన్నద్ధంగా ఉంచుతాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాంబర్లు, యుద్ధ విమానాలు మాత్రం అవసరమనుకున్నప్పుడే రంగంలోకి దిగుతాయి. ఈ సమయంలో పుతిన్ గనక తన బాంబర్లు, యుద్ధ విమానాలను అణు దాడికి సన్నద్ధం చేసే పక్షంలో అది విపరిణామాలకే దారి తీయొచ్చు. అమెరికా కూడా అదే మాదిరిగా స్పందించక తప్పని పరిస్థితి తలెత్తుతుందని ఫెడరేసన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్‌లో న్యూక్లియర్ అనలిస్టు హన్స్ క్రిస్టెన్సన్ అభిప్రాయపడ్డారు. అది అంతర్జాతీయంగా పెను ఉద్రిక్తతలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ► అణు ఆటలొద్దు: ఐఏఈఏ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వెలిబుచ్చింది. వాటికి ప్రమాదం కలిగించే చర్యలకు దిగొద్దని రష్యాకు సూచించింది. అలాంటి చర్యలు భారీ ప్రాణ, పర్యావరణ నష్టానికి దారి తీయవచ్చని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రోసీ హెచ్చరించారు. వాటివద్ద పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నట్టు ఉక్రెయిన్ నుంచి తమకు సమాచారముందని చెప్పారు. ఉక్రెయిన్‌లో నాలుగు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని 15 రియాక్టర్లు దేశ విద్యుత్ అవసరాల్లో సగం మేరకు తీరుస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని గురువారం రష్యా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తాజాగా దానినుంచి కాస్త హెచ్చు స్థాయిలో రేడియో ధార్మికత వెలువడుతోందని ఐఏఈఏ తెలిపింది. -
టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరిక
సాక్షి, అమరావతి: టీడీపీ నేత వర్ల రామయ్య, ఆ పార్టీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు డీజీపీతోపాటు ఇతర పోలీసు అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ పరుష పదజాలంతో దూషించడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు వర్ల రామయ్య తరచు ఉద్దేశపూర్వకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి తప్ప అధికారులను తరచుగా వివాదాల్లోకి లాగి వ్యక్తిగతంగా దూషించడం సబబు కాదన్నారు. ప్రతి స్థానిక సమస్యను డీజీపీకి ఆపాదించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మాట్లాడేటప్పుడు పదప్రయోగం అత్యంత ముఖ్యమన్నారు. ఇదే రకమైన వ్యవహారశైలి కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరించింది. సుమారు 15 మంది సముద్ర మార్గం ద్వారా తమిళనాడులోకి ప్రవేశించారని, తీరం నుంచి కేరళకు వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్ చేరుకునేందుకు పథకం వేశారని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని కోస్ట్‌గార్డ్ దళాలు, ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు ఆదేశించా రు. ఇదిలా ఉండగా చెన్నై పూందమల్లిలోని ఒక అపార్టుమెంటులో అనుమానాస్పదంగా ఉంటున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చైనా కావరం.. అణు బాంబులేస్తామని బెదిరింపులు
డ్రాగన్ కంట్రీ మరోసారి తన తలపొగరును ప్రదర్శించింది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే న్యూక్లియర్ వార్ తప్పదని జపాన్ను గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక ఛానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే గనుక ఊరుకునేది లేదని చెబుతూ.. అవసరమైతే అణు ఆయుధాలు ప్రయోగిస్తామని జపాన్ను హెచ్చరించింది చైనా. ‘‘తైవాన్ విషయంలో కలుగజేసుకున్నందుకు జపాన్‌పై మేం బాంబులు వేస్తాం. ఆ తర్వాత లొంగిపోయామని జపాన్ మమ్మల్ని బతిమాలుకునేదాకా రెండోసారి బాంబులేస్తాం. తైవాన్ విముక్తి మా చేతుల్లో ఉన్న అంశం. జపాన్ జోక్యం సహించే ప్రసక్తే లేదు. జపాన్‌కు సంబంధించి ఒక్క యుద్ధ విమానం, ఒక్క సైనికుడు తైవాన్ సరిహద్దులో కనిపించినా ఆ దేశాన్ని(జపాన్) నామరూపాల్లేకుండా సర్వనాశం చేస్తామని’ని ఆ వీడియోలో కొందరు సైనికులు మాట్లాడినట్లు ఉంది. #CCP Vows to Nuke #Japan if Japan defends #Taiwan. As Japan is the only country that has been nuked, so nuking Japan "will get twice the result with half the effort." 中共軍事頻道威脅對日本實施連續核打擊,直到日本第二次無條件投降。 pic.twitter.com/dp45R2LXtD — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) July 13, 2021 పైగా చైనా అధికారిక ఛానెల్ సీసీపీకి సంబంధించిన ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనే ఈ వీడియో ప్రదర్శితం కావడం విశేషం. అయితే 2 మిలియన్ల వ్యూస్ తర్వాత ఆ వీడియోను ఛానెల్ డిలీట్ చేయగా.. యూట్యూబ్, ట్విటర్లో మాత్రం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తైవాన్ సార్వభౌమాధికారం-సౌభ్రాతృత్వం కాపాడేందుకు తాము ముందు ఉంటామని జపాన్ రెండు వారాల కిందట ప్రకటన చేసింది. బయటి శక్తులు తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తే.. అండగా నిలబడతామని జపాన్ డిప్యూటీ పీఎం తారో అసో ప్రకటించారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో మిలిటరీ ఫ్యాన్ బాయ్స్ పేరిట చైనా నుంచి ఈ వీడియో రిలీజ్ అయ్యింది. -
హెచ్చరికల నేపథ్యంలో స్పందించిన ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రం విడుదలైతే థియేటర్లను తగలబెడతామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘దేశంలో స్వేచ్ఛా హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. సినిమాను అడ్డుకుంటామని.. థియేటర్లు ధ్వంసం చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ చిత్ర యూనిట్ సభ్యులు కోరితే... వారికి కూడా వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని న్యాయమూర్తి పోలీసులకు సూచించారు. కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిత్రంపై నిషేధం విధించగా.. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. చిత్ర విడుదలను అడ్డుకోవద్దంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తెలిసిందే. బండిట్ క్వీన్ చిత్ర విషయంలోనే అభ్యంతరం వ్యక్తం కానప్పుడు.. పద్మావత్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ చిత్రం విడుదలైతే రాజ్‌పుత్ మహిళలంతా సాముహిక ఆత్మహత్యలకు పాల్పడతారని కర్ణిసేన హెచ్చరిస్తోంది. అనధికార నిషేధం...? కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో... సుప్రీం కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనధికారిక బ్యాన్ విధించే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల సంగతి పక్కన పెట్టి.. స్థానిక చట్టాల చొరవతో రాష్ట్రాలు నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కర్ణిసేన అధినేత లోకేంద్ర సింగ్ కల్వి కోరుతున్నారు. గతంలో రాజస్థాన్ లో జోధా అక్బర్ చిత్రాన్ని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు స్వచ్ఛందంగా బహిష్కరించిన విషయాన్ని, మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫనా చిత్రాన్ని గుజరాత్లో నిషేధించిన(అనధికారికంగా) విషయాన్ని లోకేంద్ర గుర్తు చేస్తున్నారు. -
12 మంది మృతి.. అట్టుడుకుతున్న ఇరాన్
టెహ్రాన్ : ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలంటూ ఆందోళనకారులు రోడ్డెక్కగా.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పటంతో పోలీసులు కాల్పులకు దిగారు. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో 12 మంది పౌరులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇజే పట్టణంలో శనివారం పోలీస్ కాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్లు ఎంపీ హదయాతుల్లా ఖదెమి వెల్లడించారు. కాగా, 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు ఇరాన్లో పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తూ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు.. ప్రభుత్వం గద్దెదిగి పోవాలంటూ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా.. సోషల్‌మీడియాలో అది విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో నిరసనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన వస్తోంది. ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ ఆపై మీడియాతో మాట్లాడారు. నిరసనలు తెలపటం తప్పు కాదని.. అలాగని శాంతి భద్రతలకు భంగం కలిగించటం, ప్రభుత్వ- ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం చూస్తూ సహించే ప్రసక్తే లేదని రౌహానీ ఆందోళనకారులను హెచ్చరించాడు. అమెరికా హెచ్చరిక ఇక ఇరాన్ లో నెలకొన్న ప్రతిష్టంభనపై అమెరికా స్పందించింది. పరిణామాలు చక్కబెట్టుకోకపోతే అంతర్జాతీయ సమాజం తరపున తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని యూఎస్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇక ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్ కూడా ఈమేరకు ట్వీట్ కూడా చేశారు. ప్రపంచం మిమిల్ని గమనిస్తోంది.. ప్రజలకు శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. Many reports of peaceful protests by Iranian citizens fed up with regime’s corruption & its squandering of the nation’s wealth to fund terrorism abroad. Iranian govt should respect their people’s rights, including right to express themselves. The world is watching! #IranProtests — Donald J. Trump (@realDonaldTrump) 30 December 2017 -
భారత్‌కు పాక్ వార్నింగ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాదులు మాత్రమే కాదు.. అక్కడ బాధ్యతాయుతమైన అధికారాలు నిర్వహిస్తున్న పెద్ద వ్యక్తులు కూడా భారత్‌ను రెచ్చగొట్టే చర్యలు మానుకోవడం లేదు. జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసంటూ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్‌సోహెయిల్ అమన్ భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. వాస్తవాదీన రేఖ వెంబడి రెండు దేశాల మధ్య హింసాత్మక సంఘటనలు పెరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అయిన తమకు ఎలాంటి ఆందోళన లేదని పేర్కొన్నారు. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు ముగ్గురు తమ జవాన్లు చనిపోయినట్లు పాక్ తెలిపింది. ఈ నేపథ్యంలో కరాచీలో అమన్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇలాంటి చర్యలు భారత్ నిలిపివేస్తే మంచిది. వివాదాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తే పాక్ సైన్యం కూడా ఆ పని చేయగలదు. ఈ విషయంలో భారత్‌తో ఎలా ముందుకు వెళ్లాలో మాకు బాగా తెలుసు’ అంటూ ఆయన బీరాలు పోయాడు. -
‘అబ్బాయిలతో తిరగడం ఆపలేదో.. ఇంటికే ఇక’
కోజికోడ్: తమ క్యాంపస్‌లోని విద్యార్థినులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ-సీ) కాలికట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏ అమ్మాయి కూడా అబ్బాయితో తిరుగుతూ కనిపించవొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు క్యాంపస్ లేడీస్ హాస్టల్ వార్డెన్ నోటీసులను అంటించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ లింగ వివక్షకు గురి చేస్తున్నారంటూ ఆమె చర్యను ఖండించారు. కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆ నోటీసులో ఎస్ భువనేశ్వరీ అనే వార్డెన్ పేరిట చెప్పారంటే.. ’క్యాంపస్ లోని రెండు వసతి గృహాల ప్రాంగణాల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరుగుతున్నట్లు తెలిసింది. మాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. ఇక నుంచి ఏ అమ్మాయి అయినా అబ్బాయితో కలిసి ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిసిందో వారిపై సస్పెన్షన్ వేటుగానీ, హాస్టల్ నుంచి వెళ్లగొట్టే చర్యలుగానీ తీసుకోవడం జరుగుతుంది జాగ్రత్త’ అంటూ పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా అమ్మాయిలను మాత్రమే ఉద్దేశించి చెప్పడంపై అక్కడి వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆ అర్హత మంత్రి గంటాకు లేదు’
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని విమర్శించే అర్హత మంత్రి గంటా శ్రీనివాసరావుకు లేదని కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, నాయకుడు నల్లా విష్ణు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యమం సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడకు ఇచ్చిన గడువు ఆగస్టు నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో, ముఖ్యమం త్రికి లేఖ రాసినట్టు వివరించారు. ముద్రగడపై గంటా వ్యంగంగా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్రీడల్లో పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటే, పద్మనాభం కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముద్రగడ రాజకీయ నిరుద్యో గి అని గంటా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో మంత్రి పదవికి, డ్రెయినేజీ బోర్డు చైర్మన్ పదవికి ముద్రగడ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో గంటా శ్రీనివాసరావుపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికైనా స్పందిం చాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆకుల రామకృష్ణ, అల్లూరి శేషునారాయణ, మానే దొరబాబు పాల్గొన్నారు.