బాత్‌రూంలోకి వెళ్లగానే చాలామంది రిలాక్స్ అయిపోయి పాటలు పాడుకుంటూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. ఎవ్వరికైనా కాస్త రిలాక్స్ అయ్యే ప్రదేశం అది. అయితే కొందరూ మరీ విపరీతంగా బాత్‌రూంలో ఎన్ని గంటలు ఉంటారో చెప్పలేం. అవతలి వాళ్లు వీడెప్పుడు ఊడిపడతాడ్రా.. బాబు అని తిట్టుకుంటుంటారు. అలాంటి వారు దయచేసి అంతలా అన్ని గంటలు ఉండకండి. అలా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు.
చాలామంది రకరకాల ఆరోగ్య సమ్యలతో వస్తుంటారు. వారందరీ సమస్యలకు మూల కారణాలపై విశ్లేషించగా ఈ అంశం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆయా సమస్యలతో బాధపడుతున్న రోగులంతా కూడా గంటలకొద్ది బాత్‌రూమ్‌లలో గడిపేవారని అన్నారు. కొందరైతే సెల్‌ఫోన్‌లు, ఐఫోన్‌లు ఇతర గాడ్జెట్‌లు తీసుకుని బాతూరూమ్ టాయిలెట్ సీట్‌పై కూర్చొని రిలాక్స్ అవుతుంటారని అన్నారు.
ఇది అస్సలు మంచిది కాదని తెలిపారు. ఇప్పుడు చాలా వరకు అందరూ వెస్ట్రన్ టాయిలెట్లనే వాడుతున్నారు. అవి ఓవెల్ ఆకారంలో ఉండటంతో దానిపై తక్కువ ఎత్తులో కూర్చొంటాం. ఈ భంగిమలో గురత్వాకర్షణ శక్తి మనపై ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. గురత్వాకర్షణ బలం తోపాటు నేలపై కలుగు చేసి ఒత్తిడి కలగలసి శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తుందట.
ఫలితంగా పేగులో కొంత భాగం జారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ భంగిమ వల్ల రక్త నాళాలు ఉబ్బి హేమరాయిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. ఇలా ఎక్కువ సేపు కూర్చొంటే పెల్విక్ కండరాలపై ఒత్తిడికి దారితీస్తుందని అన్నారు. అంతేగాదు ఈ అలవాటు అంతరర్లీనంగా ఎన్నో ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుందని, ముఖ్యంగా మలబద్ధకం, ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణశయాంతర వ్యాధులను కలుగజేస్తుందని చెప్పుకొచ్చారు.
అందువల్ల సుదీర్ఘంగా బాతూరూమ్‌లో గడపడాన్ని పరిమితం చేయమని చెబుతున్నారు. ముఖ్యంగా టాయిలెట్ సీటుపై కూర్చొనే అలవాటును దూరం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎలాంటి గాడ్జెట్‌లు, మ్యాగ్జైన్‌లు వంటివి బాత్‌రూమ్ దరిదాపుల్లోకి తీసుకెళ్లవద్దని అన్నారు.
(చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..)
Comments
Please login to add a commentAdd a comment