bath room
-
బాత్రూంలోల ఎక్కువసేపు గడుపుతున్నారా? స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్న నిపుణులు
బాత్రూంలోకి వెళ్లగానే చాలామంది రిలాక్స్ అయిపోయి పాటలు పాడుకుంటూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. ఎవ్వరికైనా కాస్త రిలాక్స్ అయ్యే ప్రదేశం అది. అయితే కొందరూ మరీ విపరీతంగా బాత్రూంలో ఎన్ని గంటలు ఉంటారో చెప్పలేం. అవతలి వాళ్లు వీడెప్పుడు ఊడిపడతాడ్రా.. బాబు అని తిట్టుకుంటుంటారు. అలాంటి వారు దయచేసి అంతలా అన్ని గంటలు ఉండకండి. అలా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. చాలామంది రకరకాల ఆరోగ్య సమ్యలతో వస్తుంటారు. వారందరీ సమస్యలకు మూల కారణాలపై విశ్లేషించగా ఈ అంశం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆయా సమస్యలతో బాధపడుతున్న రోగులంతా కూడా గంటలకొద్ది బాత్రూమ్లలో గడిపేవారని అన్నారు. కొందరైతే సెల్ఫోన్లు, ఐఫోన్లు ఇతర గాడ్జెట్లు తీసుకుని బాతూరూమ్ టాయిలెట్ సీట్‌పై కూర్చొని రిలాక్స్ అవుతుంటారని అన్నారు. ఇది అస్సలు మంచిది కాదని తెలిపారు. ఇప్పుడు చాలా వరకు అందరూ వెస్ట్రన్ టాయిలెట్లనే వాడుతున్నారు. అవి ఓవెల్ ఆకారంలో ఉండటంతో దానిపై తక్కువ ఎత్తులో కూర్చొంటాం. ఈ భంగిమలో గురత్వాకర్షణ శక్తి మనపై ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. గురత్వాకర్షణ బలం తోపాటు నేలపై కలుగు చేసి ఒత్తిడి కలగలసి శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తుందట. ఫలితంగా పేగులో కొంత భాగం జారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ భంగిమ వల్ల రక్త నాళాలు ఉబ్బి హేమరాయిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. ఇలా ఎక్కువ సేపు కూర్చొంటే పెల్విక్ కండరాలపై ఒత్తిడికి దారితీస్తుందని అన్నారు. అంతేగాదు ఈ అలవాటు అంతరర్లీనంగా ఎన్నో ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుందని, ముఖ్యంగా మలబద్ధకం, ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణశయాంతర వ్యాధులను కలుగజేస్తుందని చెప్పుకొచ్చారు. అందువల్ల సుదీర్ఘంగా బాతూరూమ్లో గడపడాన్ని పరిమితం చేయమని చెబుతున్నారు. ముఖ్యంగా టాయిలెట్ సీటుపై కూర్చొనే అలవాటును దూరం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎలాంటి గాడ్జెట్లు, మ్యాగ్జైన్లు వంటివి బాత్రూమ్ దరిదాపుల్లోకి తీసుకెళ్లవద్దని అన్నారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..) -
దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..
ఒక దొంగ దొంతనానికని వచ్చి.. హాయిగా బాత్రూంలో స్నానం చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో అనుహ్యంగా యజమాని లోపలకి రావడంతో ఊహించని విధంగా కథ మలుపు తిరిగింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..34 ఏళ్ల మహిళ బయటకు వెళ్లి ఇంటికి తిరిగారాగానే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి వాతావరణం చూస్తే కాస్త అనుమానాస్పదంగా అనిపిపించింది. దీనికి తోడు ఇంటి కిటికి కూడా పగిలి ఉండటం..లోపల ఎవరో ఉన్నట్టు అనుమానం కలిగింది. అనుకున్నదే తడువుగా ఆమె పోలీసుకు కాల్ చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాము ఇంటిని చుట్టుముట్టామని లోపల ఉన్నావాళ్లెవరో బయటకు రావాల్సిందిగా సూచించారు. అయితే ఎంతకీ అటు నుంచి స్పందన రాకపోవడంతో ఇల్లంతా గాలించడం ప్రారంభించారు పోలీసులు. చివరికి ఆ దొంగ బాత్‌టబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులు లోపలకి వెళ్లి చూసేటప్పటికి..అక్కడి సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు పోలీసులు. పాపం ఆ దొంగ బాత్‌టబ్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పట్టుబడ్డ ఆ 27 ఏళ్ల నిందితుడు తన గురించి వివరణ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. (చదవండి: పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష) -
బాత్రూమ్లో ట్యూషన్ టీచర్.. ఫోన్‌తో వీడియోలు తీసి..
సాక్షి, ముంబై: విద్య నేర్పిన గురువులకు ఎంతో విలువనిచ్చే దేశం మనది. కానీ, కొంత మంది విద్యార్థులు తమకు పాఠాలు నేర్పిన టీచర్ల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ టీచర్ బాత్ రూమ్‌లో ఉండగా విద్యార్థి తన సెల్ ఫోన్ కెమెరాతో ఆమె వీడియోలు రికార్డు చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. పుణెలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థికి పాఠాలు చెప్పిందుకే తన పేరెంట్స్ ఓ ట్యూషన్ టీచర్‌ను ఎంపిక చేశారు. సదరు విద్యార్థికి ఆమె.. గత ఐదేళ్లుగా పాఠాలు చెబుతోంది. టీచర్ ప్రతీరోజు బాలుడి ఇంటికి వచ్చి పాఠాలు బోధిస్తుండేది. ఈ క్రమంలో సదరు బాలుడు.. టీచర్‌పై వ్యామోహంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా బాత్రూమ్లోని ఓ సోప్ బాక్స్‌లో సెల్ ఫోన్‌ను పెట్టి వీడియోలు తీశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు టీచర్.. పాఠం చెప్పిన అనంతరం బాత్రూమ్ వెళ్లింది. ఇంతలో సోప్ బాక్స్‌లో ఏదో ఉన్నట్టు అనిపించడంతో తెరిచి చూసి.. ఒక్కసారిగా షాకైంది. సోప్ బాక్స్‌లో ఉన్న ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఉంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్‌కు చెప్పి.. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బాలుడికి పాఠాలు చేప్పే క్రమంలోనూ తన శరీర భాగాలను ఫొటోలు తీశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
విమానంలో మహిళకు కరోనా పాజిటివ్.. 5 గంటలు బాత్రూమ్లోనే
న్యూయార్క్ : కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి పేరు మార్చుకొని ఒమిక్రాన్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. యూరప్ దేశాల్లో కోవిడ్ ప్రభావం మరింత ఆందోళనకరంగా ఉంది. రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కవ ఒమిక్రాన్ ఎక్కువ సోకుతుండటంతో విమాన ప్రయాణాలపై అన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి, విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టు సిబ్బంది తప్పకుండా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారిని అదుపు చేయడం సాధ్యపడడం లేదు. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శంగా నిలిచింది. విమానం ఎక్కేముందే కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఫ్లైట్‌లో ఉండగానే పాజిటివ్‌గా తేలింది. దీంతో సదరు మహిళ నుంచి ఇతర ప్రయాణికులకు వైరస్ సోకకుండా ఉండేందుకు మహిళను 5 గంటల పాటు విమానం బాత్రూమ్లోనే ఐసోలేట్ చేశారు. చదవండి: టాప్ ఎంఎన్సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా? డిసెంబర్ 19న చికాగో నుంచి ఐస్లాండ్కు 150మంది ప్రయాణికులతో ఓ విమానం బయల్దేరింది. విమానం బయలు దేరిన కొంత సమయానికి మిచిగాన్కు చెందిన మారీసా ఫోటీయో అనే మహిళ టీచర్‌కు అసౌకర్యంగా అనిపించింది. పాటు గొంతులో నొప్పి మొదలవ్వడంతో విమాన సిబ్బంది ప్రయాణంలోనే ఆమెకు కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. ఆ ర్యాపిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. జర్నీ మొదలైన గంటలోపే మారిసాకు పాజిటివ్ అని తేలడంతో తన సీటును వదిలేసి విమానం బాత్రూంకు వెళ్లిపోయింది. చదవండి: ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి అయిదు గంటల పాటు మారిసా బాత్రూంలోనే స్వీయ నిర్బంధంలో ఉండిపోయింది. ఆ నాలుగు గంటలు నరకయాతన అనుభవించానని మారిసా తనకు ఎదురైన దారుణ పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా మారీసా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంది. అంతేగాక విమానం ఎక్కేముందు అయిదుసార్లు కోవిడ్ టెస్ట్ చేయగా నెగెటీవ్ రావడం గమనార్హం. -
రెండు ఇళ్లు ఉన్నా.. బాత్రూంలోనే ఐసోలేషన్
సాక్షి, వికారాబాద్: తన ద్వారా భార్యాపిల్లలకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఓ కోవిడ్ రోగి బాత్రూంలో తలదాచుకున్నాడు. అతడి సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు అతడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్ (30)కు ఐదు రోజులక్రితం కరోనా సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన అతడు వైరస్ తన కుటుంబ సభ్యులకు కూడా సోకుతుందేమోనని భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న బాత్రూంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం అతడు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారులు గమనించి స్థానిక డాక్టర్, ఎంపీడీఓ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడిని అనంతగిరిగుట్టలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్‌కు రెండు ఇళ్లు ఉన్నాయని, ఓ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే చికిత్స అందేలా చూస్తామని చెప్పినా వినలేదని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ( చదవండి: అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం ) -
కిచెన్‌లో బాత్రూమ్: ‘ఓనర్‌ను జైలులో వేయాలి’
సిడ్నీ : ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన శైలిలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు. అలాగే ప్రతి గదిని ప్రత్యేకంగా కట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంటిని వినూత్నంగా నిర్మించాడు. కిచెన్‌లో గోడలు లేకుండా బాత్రూమ్ను నిర్మించుకున్నాడు. ఈ వింత నిర్మాణం ఆస్ట్రేలియాలో జరిగింది. సాధారణంగా సిడ్నీ నగరం ఖరీదైన రియల్ ఎస్టేట్‌కు మారుపేరు. అక్కడ స్థలాన్ని ఆదా చేసేలా భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం ఉంటుంది. కానీ సర్రిహిల్స్లో అపార్ట్మెంట్లో మాత్రం ఇంటిని వినూత్నంగా కట్టించాడు. వంట గదిలో గోడలు లేకుండా గాజు గ్లాస్‌తో బాత్రూమ్ను(టాయిలెట్, షవర్) నిర్మించారు. ఇక వంటగదిని బాత్రూమ్ను కేవలం గాజు గ్లాస్ మాత్రమే వేరుచేస్తుంది. ఇటాలియన్ డిజైనర్ ‘మాడ్రన్ కిచెన్’గా రూపొందించిన ఈ ఫ్లాట్‌ను ప్రస్తుతం అద్దెకు పెట్టారు. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చితే వారానికి దాదాపు రూ.18 వేల చెల్లించి అద్దెకు ఉండొచ్చు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ ) అయితే దీనికి సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇవి చూసిన నెటిజన్లు ‘టాయిలెట్ ఇన్ ది కిచెన్ లే అవుట్’ భయంకరంగా ఉందంటున్నారు. బాత్రూమ్ ఎవరికైనా వ్యక్తిగత ప్రదేశమని, అయితే కిచెన్‌లో బాత్రూమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మించిన వారిని, ఇంటి యాజమానిని జైలులో వేయాలని మండిపడుతున్నారు. కాగా ఈ ఇంటిపై అనేక ప్రతికూల కామెంట్లు వచ్చినప్పటికీ దీనిపై యాజమాని మాట్లాడుతూ.. ఈ ఇంటిపై అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. ఒంటరి వ్యక్తులు, ప్రేమికులు, ఇద్దరు అబ్బాయిలు వంటి వారు అపార్ట్‌మెంట్‌ను అద్దెకు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. (వినూత్నం: గోడలు లేని బాత్రూమ్) -
బాత్ రూమ్‌లో శవాలై తేలారు
ఘజియాబాద్ : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెదంటం కలకలం రేపింది. గ్యాన్ చంద్ ప్రాంతంలో హోలీ వేడుకల్లో పాల్గొన్న జంట.. తర్వాత బాత్రూమ్లో శవాలై కనిపించింది. ఇందిరాపురానికి చెందిన నీరజ్ సింఘానియాకు నాలుగేళ్ల క్రితం రుచితో వివాహం జరిగింది. శనివారం రాత్రి బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నారు. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆపై బంధవులు తమకు సమాచారం ఇచ్చారని ఎస్పీ హెచ్ఎన్ సింగ్ తెలిపారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆ జంట గదిలోకి వెళ్లి తిరిగి రాలేదని నీరజ్ తండ్రి ప్రేమ్ ప్రకాశ్ చెబుతున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టానికి పంపిన పోలీసులు నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటిదాకా ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెబుతున్నారు. పసిపాపపై దాష్టీకం -
బాత్ రూంలో రహస్య కెమెరా పెట్టి..
సాక్షి, బనశంకరి: ఓ యువకుడు చేసిన వికృతచేష్టలకు కటకటాల పాలయ్యాడు. ఓ వ్యక్తి పక్కింటిలో ఉన్న బాత్రూంలో రహస్య కెమెరా అమర్చాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటుచేసుకుంది. వివరాలివి.. మైకోలేఔట్ స్వారభౌమనగర్కు చెందిన జీవన్సెఠ్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి బాత్రూంలో కెమెరా అమర్చాడు. ఉదయం స్నానాల గదిలోకి వెళ్లిన సదరు ఇంటి మహిళ కెమెరా ఉన్నట్లు గమనించి భర్తకు తెలిపింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మైకో లేఔట్ పోలీసులు జీవన్‌ను గురువారం అరెస్టు చేశారు. -
ఒకడు బాత్రూమ్లో.. ఇంకొకడు ఫేస్బుక్లో
హైదరాబాద్: ఇద్దరు కీచకులు, ఒకడు బాత్ రూమ్ లో మాటువేసి స్నానం చేసేందుకు వచ్చిన యువతిని చెరపట్టేప్రయత్నం చేశాడు. ఇంకొకడు 'ఈ అమ్మాయి మంచిదికాదు' అంటూ ఫేస్ బుక్ లో ఫొటోలుపెట్టి అల్లరి చేశాడు. బాధితురాళ్ల ఫిర్యాదుల మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకే రోజు రెండు నిర్భయ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలనుబట్టి.. ఫిలిం నగర్ లోని గౌతమ్ నగర్ కు చెందిన ఓ యువతి మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్ రూమ్ లోకి వెళ్లింది. అప్పటికే బాత్ రూమ్ లోకి దూరి నీళ్ల డ్రమ్ములో దాక్కున్న యువకుడు, ఆమె లోనికి రాగానే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కేకలు వేస్తూ బయటికి పరుగు తీసిందా యువతి. తనపై జరిగిన అఘాయిత్యంపై కుటుంబసభ్యుల సహకారంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడు అదే ప్రాంతంలో కిరాణ షాప్ నడిపించుకునే ఎ.శ్రావణ్(22)గా గుర్తించిన పోలీసులు అతనిపై నిర్భయకేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. మరో సంఘటనలో నల్లగొండ జిల్లా మోత్కూరు ప్రాంతానికి చెందిన యువతి(20) బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని షౌకత్‌నగర్‌లో తన సోదరుడి ఇంట్లో ఉంటూ సమీపంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నది. షాద్‌నగర్‌కు చెందిన న్యారమోని శ్రీనివాస్(24) ఆ యువతికి పరిచయస్తుడు. ఆ చనువుతో ఆమె ఫొటో తీసిన యువకుడు.. ఫేస్బుక్లో ఫొటో పెట్టి 'ఈమె క్యారెక్టర్ మంచిదికాదు' అని రాశాడు. అంతేకాకుండా తాను చేసిన ఘనకార్యాన్ని ఫోన్ చేసిమరీ యువతికి తెలిపాడు. బుధవారం బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత యువతి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేసింది. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అవస్థల హాస్టల్
ఇరుకు గదులే శరణ్యం 104మంది బాలికలకు ఐదే బాత్రూమ్లు పట్టించుకోని బీసీ సంక్షేమ శాఖ ఎంవీపీ కాలనీ: బీసీ బాలికల వసతిగృహాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మొత్తం 104 మంది విద్యార్థినులకు ఐదే బాత్రూంలున్నాయి. వీరందరి వసతికి ఐదు గదులే ఉన్నాయి. నెలకు రూ.17 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వం చదరపు అడుగుకు కేవలం రూ.7 మాత్రమే కేటాయించడంతో అద్దె భవనాలు దొరకని దుస్థితి నెలకొంది. ఈ వసతిగృహంలో వందమందికిగాను 104 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరు నగరంలోని ఏఎస్‌రాజా, వీఎంసీ మహిళావిద్యాపీఠ్, డాక్టర్ వీఎస్ కృష్ణా, బుల్లయ్య, ప్రభుత్వ మహిళా కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదువుతున్నారు. ఇక్కడ కేవలం ఐదు బాత్రూమ్లు మాత్రమే వుండడంతో కళాశాలలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. గదులు కూడా ఇరుగ్గా ఉండడంతో చదువుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వ వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం, పోలీసులు లాఠీలకు పని చెప్పడం తెలిసిందే. అయినప్పటికీ బీసీ సంక్షేమశాఖ అధికారులు హాస్టల్ సమస్యలు పరిష్కరించిన పాపాన పోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అద్దెలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో భవన యజమానులు ఖాళీ చేయమంటున్నారని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. హాస్టల్లో చదువుకునే వాతావరణం లేకపోవడంతో మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. సొంత ఊరు, తల్లిదండ్రులకు దూరంగా వచ్చి అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో గదిలో 21 మంది పడుకోవలసిన పరిస్ధితి నెలకొంది. దుస్తులు, బ్యాగులు ఉంచడానికి స్థలం లేక ఒక చిన్న గదిలో విద్యార్థినుల దుస్తులు ఉంచడంతో అక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అండగా ఉంటున్నామని చెబుతోంది. ఇక్కడ హాస్టల్స్‌లో ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పందించి సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
అమరిక : స్పాత్ రూమ్!
బాత్రూమ్ ప్రతి ఇంటికీ ఉంటుంది. కాని, దానిని ఉపయోగించుకోవడంలోనే బోలెడంత క్రియేటివిటీ అవసరం. స్నానం అంటే... టైమ్ చూసుకుంటూ ఆదరాబాదరాగా నాలుగు మగ్గుల నీటిని ఒంటి మీద పోసుకుని, ఆ తొందరలో రెండు మగ్గుల నీటిని నేలమీద ఒలకబోసి ఈ పూటకి అయిందనిపించుకునేది కాదు. ఒక్కో నీటి చుక్క ఒంటి మీద నుంచి జారుతూ ఉంటే ఆ హాయిని ప్రశాంతంగా ఆస్వాదించాలి. అలా ఆస్వాదించాలంటే బాత్రూమ్ తీరుగా ఉండాలి. అందుకోసం బాత్రూమ్కు స్పా లుక్ తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు చాలామంది నుంచి తక్షణం ‘చాలా ఖర్చవుతుంది’ అనే సమాధానమే వస్తుంది. నిజానికి ఇది పెద్ద ఖర్చేమీ కాదు. కొంచెం పొందిగ్గా ప్లాన్ చేసుకుంటే సింపుల్ బాత్ర్యాక్స్తో బాత్రూమ్కి స్పాలుక్ తీసుకురావచ్చు. సాధారణమైన బాత్రూమ్లోని ఒక మూలగా చిన్నస్టాండు ఏర్పాటు చేసి టవల్స్ చక్కగా రోల్ చేసి సర్దాలి. అలాగే గోడకు చిన్న ఉడెన్ ర్యాక్ చేయించుకుంటే షాంపూలు, లోషన్లు, ఇతరత్రా సౌందర్యసామగ్రి మొత్తం అందులో అమర్చేయవచ్చు. సింక్ పక్కనే టవల్స్ కోసం ఒక రాక్, షవర్ దగ్గరగా కొంచెం ఎత్తులో షాంపూ ర్యాక్ అమర్చుకుంటే సౌకర్యంగా ఉంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కొన్ని ర్యాక్స్‌ను బాత్రూమ్ తలుపుకి వెనుక కూడా తగిలించుకోవచ్చు. ఇలా చేసుకుంటే టవళ్లు, సబ్బులు, షాంపూల వంటివి బెడ్రూమ్ షెల్ఫుల నుంచి వెళ్లిపోతాయి, ఇక ఆ ఖాళీని మనకు నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు.