ఒక దొంగ దొంతనానికని వచ్చి.. హాయిగా బాత్రూంలో స్నానం చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో అనుహ్యంగా యజమాని లోపలకి రావడంతో ఊహించని విధంగా కథ మలుపు తిరిగింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..34 ఏళ్ల మహిళ బయటకు వెళ్లి ఇంటికి తిరిగారాగానే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి వాతావరణం చూస్తే కాస్త అనుమానాస్పదంగా అనిపిపించింది.
దీనికి తోడు ఇంటి కిటికి కూడా పగిలి ఉండటం..లోపల ఎవరో ఉన్నట్టు అనుమానం కలిగింది. అనుకున్నదే తడువుగా ఆమె పోలీసుకు కాల్ చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాము ఇంటిని చుట్టుముట్టామని లోపల ఉన్నావాళ్లెవరో బయటకు రావాల్సిందిగా సూచించారు. అయితే ఎంతకీ అటు నుంచి స్పందన రాకపోవడంతో ఇల్లంతా గాలించడం ప్రారంభించారు పోలీసులు.
చివరికి ఆ దొంగ బాత్‌టబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులు లోపలకి వెళ్లి చూసేటప్పటికి..అక్కడి సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు పోలీసులు. పాపం ఆ దొంగ బాత్‌టబ్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పట్టుబడ్డ ఆ 27 ఏళ్ల నిందితుడు తన గురించి వివరణ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం.
(చదవండి: పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష)
Comments
Please login to add a commentAdd a comment