bathtub
-
దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..
ఒక దొంగ దొంతనానికని వచ్చి.. హాయిగా బాత్రూంలో స్నానం చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో అనుహ్యంగా యజమాని లోపలకి రావడంతో ఊహించని విధంగా కథ మలుపు తిరిగింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..34 ఏళ్ల మహిళ బయటకు వెళ్లి ఇంటికి తిరిగారాగానే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి వాతావరణం చూస్తే కాస్త అనుమానాస్పదంగా అనిపిపించింది. దీనికి తోడు ఇంటి కిటికి కూడా పగిలి ఉండటం..లోపల ఎవరో ఉన్నట్టు అనుమానం కలిగింది. అనుకున్నదే తడువుగా ఆమె పోలీసుకు కాల్ చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాము ఇంటిని చుట్టుముట్టామని లోపల ఉన్నావాళ్లెవరో బయటకు రావాల్సిందిగా సూచించారు. అయితే ఎంతకీ అటు నుంచి స్పందన రాకపోవడంతో ఇల్లంతా గాలించడం ప్రారంభించారు పోలీసులు. చివరికి ఆ దొంగ బాత్‌టబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులు లోపలకి వెళ్లి చూసేటప్పటికి..అక్కడి సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు పోలీసులు. పాపం ఆ దొంగ బాత్‌టబ్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పట్టుబడ్డ ఆ 27 ఏళ్ల నిందితుడు తన గురించి వివరణ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. (చదవండి: పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష) -
బాత్ టబ్‌లో శవమై కనిపించిన యంగ్ సింగర్
అమెరికన్ యంగ్ సింగర్ ఆరోన్ కార్టర్(34) తన ఇంట్లోనే శవమై కనిపించడం కలకలం రేపుతోంది. కాలిఫోర్నియాలోని తన ఇంటి బాత్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో ఆరోన్ మృతదేమాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా 1987లో ఫ్లోరిడాలో జన్మించిన ఆరోన్ 7 ఏళ్ల ప్రాయంలోనే సింగర్‌గా స్టేజ్ షోలో పాల్గొన్నాడు. తొమ్మిదేళ్లకే తొలి ఆల్భమ్‌ను రిలీజ్ చేశాడు. ఆరోన్స్ పార్టీ (కమ్ గెట్ ఇట్), ఐ వాంట్ కాండీ వంటి ఆల్భమ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆరోన్ సింగర్‌గానే కాకుండా నటుడిగా కూడా సత్తా చాటాడు. ఆరోన్ మృతిపై పలువురు సింగర్స్ సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. We are shocked and saddened about the sudden passing of Aaron Carter. Sending prayers to the Carter family. Rest in peace, Aaron ❤️ pic.twitter.com/rDUcE4i8Iy — New Kids on the Block (@NKOTB) November 5, 2022 -
విషాదం: ఊహించని రీతిలో మృత్యువు ఒడికి..
ఆ యువ ఆటగాడి జీవితాన్ని విధి విచిత్రంగా కాటేసింది. సంబురంగా గడుపుతున్న టైంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో అతను తీవ్రంగా గాయపడగా.. కొన ఊపిరితో మూడుగంటలు పోరాడి మరీ ప్రాణం విడిచాడు. మాటిస్ కివ్‌లెనిక్స్(24)..లాత్వియాకు చెందిన ఐస్ హకీ ఆటగాడు. నేషనల్ హాకీ లీగ్‌లో కొలంబస్ బ్లూ జాకెట్స్ తరపున గోల్టెండర్(గోల్‌ను అడ్డుకునే క్రీడాకారుడు)గా అతనికి మాంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. తొమిదేళ్ల కెరీర్లో జట్టుకు మంచి సేవలు అందించాడు. అలాంటి టాలెంటెడ్ ఆటగాడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆదివారం రాత్రి బ్లూ జాకెట్స్ కోచ్ మెన్సీ లెగస్ ఇంట్లో(మిషిగాన్)లో పార్టీ జరిగింది. పటాకుల్ని పేల్చి సంబురాలు చేసుకుంది టీం. ఆ టైంలో కివ్‌లెనిక్స్ సహా ఆటగాళ్లంతా హాట్ టబ్‌లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అయితే పటాకులు ఒక్కసారిగా ఆటగాళ్ల వైపు దూసుకొచ్చాయి. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అంతా తలోదిక్కు పరిగెత్తారు. అయితే కాలు జారి బాత్ టబ్‌లో పడిన కివ్‌లెనిక్స్.. గాయపడ్డ విషయాన్ని తోటి టీం మేట్స్ గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొలుత బాత్ టబ్‌లో పడిపోవడంతో అతని తలకు గాయమై చనిపోయి ఉంటాడని డాక్టర్లు భావించారు. అయితే దూసుకొచ్చిన ఫైర్వర్క్స్ మోటర్ బలంగా ఛాతిని ఢీకొట్టడంతో.. అంతర్గతంగా గాయాలై చనిపోయాడని శవపరీక్షలో తేలింది. కాగా, ఈ యువ ఆటగాడి దుర్మరణంపై క్లబ్‌తో పాటు నేషనల్ హాకీ లీగ్ సంతాపం వ్యక్తం చేసింది. కివ్‌లెనిక్స్ లాత్వియా తరపున పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మే-జూన్‌లో జరిగిన ప్రపంచ టోర్నమెంట్లో కెనెడాపై లాత్వియా తొలి విజయానికి కివ్‌లెనిక్స్ షూట్ అవుట్ కారణం కావడం విశేషం. -
బాత్ టబ్ వద్ద బికినీలో నటి వర్కవుట్లు
హిందీ పరిశ్రమలో మందిరా బేడి నటిగా గుర్తింపు పొందారు. దాంతోపాటు ఆమె ఫిట్నెస్ నిపుణురాలిగా రాణిస్తున్నారు. తాజాగా ఆమె వర్కవుట్ చేస్తున్న వీడియో సెగలు రేపుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె వీడియో ట్రెండవుతోంది. బికినీ వేసుకుని.. బాత్ టబ్ వద్ద ఎక్సర్సైజ్లు చేస్తూ అందరినీ కవ్విస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మందిరా బేడీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాత్ టబ్ వద్ద బికినీలో వర్కవుట్‌లో చేస్తూ కనిపించింది. బాత్ టబ్ సహాయంతో కూడా కొన్ని వర్కవుట్ చేసింది. ఆమె బాలీవుడ్లో ఫిట్నెస్ గురుగా గుర్తింపు పొందారు. లంగ్ కిక్స్, గ్లబ్ బ్రిడ్జెస్, ట్రెసప్ డిప్స్ వంటి వర్కవుట్లు మందిరా బేడీ చేశారు. ఆమె గతేడాది తన 365 రోజుల వ్యాయాయం ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. రోజు వ్యాయామం / వ్యాయామం.. నా కార్యాచరణ అంతే అని ఆమె పేర్కొంటుంటారు. దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రంలో ప్రీతి సింగ్ పాత్రలో మందిరా బేడీ నటించారు. 48 ఏళ్ల మందిరా బేడి వర్కవుట్లు చూస్తుంటే కుర్రకారు షాక్‌కు గురవుతున్నారు. View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) -
బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్
మాస్కో : స్మార్ట్‌ఫోన్ ప్రమాదాలకు సంబంధించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాత్‌టబ్‌లో ఉండగా చార్జింగ్‌లో ఉన్న ఐఫోన్ షాక్కొట్టి ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. రష్యాలోని అర్ఖంగెల్స్క్ నగరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో గతంలో ఆమె బాత్‌టబ్‌లో ఉండగా తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. మరోవైపు దేశంలో ఈ తరహా మరణాలు సంభవించడంతో స్పందించిన రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. వాటర్, విద్యుత్ మెయిన్లకు అనుసంధానించబడిన విద్యుత్ ఉపకరణాలు ప్రమాదకరమని, అప్రమత్తంగా ఉండాలంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒలేసియా సెమెనోవా (24) స్నానం చేస్తోంది. ఇంతలో పక్కనే ఛార్జింగ్ మోడ్‌లో ఉన్న ఆమె ఐఫోన్ 8 టబ్‌లో పడిపోయింది. ఏం జరిగిందో ఆమె గమనించేలోపే.. ఒక్కసారిగా ఆమె విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె స్నేహితురాలు డారియా పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది..టబ్‌లో అచేతనంగా పడి ఉన్న ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యా.. గట్టిగా పిలిచా.. పలకలేదు.. ఆమెను తాకినప్పుడు తనకు కూడా షాక్ కొట్టిందంటూ వణికిపోయిందామె. అంతేకాదు అప్పటికి ఇంకా వాటర్లోనే స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతోందని తెలిపింది. అటు ఛార్జింగ్‌లో ఉండగా ఐఫోన్ బాత్‌టబ్‌లో పడిందని, దీంతో విద్యుత్‌షాక్‌తో సెమెనోవా మృతిచెందినట్టు పారామెడిక్స్ ధృవీకరించింది. కాగా 2019 లో, 26 ఏళ్ల రష్యన్ మహిళ, ఆగస్టులో మాస్కోలో 15 ఏళ్ల బాలిక ఇదే తరహాలో మరణించిన సంగతి తెలిసిందే. -
దారుణం: సిగరెట్లతో కాల్చి. బాత్‌టబ్‌లో పడేసి
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బుడ్డోడు ప్యాంటు తడుపుకుంటున్నాడని అతడిని చిత్రహింసలు పెట్టి చంపిందో అత్త. పూర్తి వివరాల్లోకి వెళితే.. జేమీ లైన్ జాక్సన్‌కు పన్నెండేళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఆమె మేనల్లుడు మిచెల్ స్టోవర్ వీరితో కలిసి ఆడుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల వయసున్న ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడ టాయ్‌లెట్ పోయడంతో ఆమె కోపం నషాళానికంటింది. బుడ్డోడని చూడకుండా అతన్ని గదిలోకి తీసుకు వెళ్లి చిత్ర హింసలు పెట్టింది. అతడి శరీరాన్ని సిగరెట్లతో కాల్చింది. మెడకు ప్లాస్టర్‌ను బిగుతుగా చుట్టి కిరాతకంగా ప్రవర్తించింది. తర్వాత అతడిని బట్టలో చుట్టి బాత్‌టబ్‌లో పడేసింది. అందులో నుంచి బయటకు రాలేక అతడు గిలగిలా కొట్టుకుంటున్నా ఆమె మనసు చలించలేదు. 24 గంటల నుంచి 48 గంటల వరకు అతడి బాత్టబ్లోనే వదిలేసింది. () సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం మరోవైపు తను చేసిన నేరం బయటపడకుండా అతడి గదినంతా శుభ్రం చేసింది. ఇది చూసిన ఆమె బంధువు అనుమానం వచ్చిపోలీసులకు సమాచారం అందించాడు. కానీ పోలీసులు ఆ ఇంటికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అతడి చావుకు కారణమైన జాక్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2న ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా హత్యానేరంతో పాటు, మరణాన్ని దాచడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, చిత్రహింసలు పెట్టడం వంటి అభియోగాల కింద ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. స్టోవర్ శవపరీక్ష రిపోర్టులోనూ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడి తల, కళ్లు, మెడ, చేతులు, కాళ్లు తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. మెదడులో రక్తస్రావం జరిగిందని తేలింది. ప్రైవేటు పార్ట్స్‌పై సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. (తల్లిని, భార్యను హతమార్చిన మాజీ అథ్లెట్) -
ప్రపంచంలోనే పెద్ద పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా
లండన్ : యూకేకి చెందిన ఒక మహిళ తన ఇంట్లోని బాత్రూమ్లో 8 అడుగులున్న పెద్ద పాముని చూసి షాక్‌కు గురయ్యారు. కాగా సోమవారం ఆమె ఆ ఫోటోలను తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని బిర్కెన్‌హెడ్ నగరంలోని ఒక అపార్ట్మెంట్లో మహిళ నివసిస్తున్నారు. అయితే తాను స్నానం చేసేందుకని బాత్రూమ్ గది డోర్ తెరిచి చూడగానే ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బాత్‌టబ్ పక్కన ఉన్న సింక్‌హోల్ చుట్టూ బో- కన్స్ట్రిక్టర్ అనే 8 అడుగుల పాము దానిని చుట్టుకొని ఉంది. తర్వాత మెల్లిగా బాత్‌టబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బో- కన్స్ట్రిక్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద పాముల జాబితాలో ఒకటి. కాగా ఈ పాములు విషపూరితమైనవి కాకపోవడం విశేషం. అయితే ఈ అనూహ్య పరిణామంతో ఆమె వెంటనే మెర్సీసైడ్ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని దానిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో తమ కానిస్టేబుల్ ఈస్ట్వుడ్ను పిలిపించి దానిని బయటకు తీశారు. 'పామును బయటికి తీయడానికి చాలా కష్టపడ్డాం. దానిని తీయడానికి ప్రయత్నిస్తుంటే సింక్‌హోల్‌ను మరింత గట్టిగా చుట్టుకొంది. దాంతో దానికి నీటిని తాగించే ప్రయత్నంలో అది తన పట్టును విడవడంతో దానిని ఒక పెద్ద కంటైనర్‌లో పెట్టి భద్రపరిచినట్లు' కానిస్టేబుల్ తెలిపాడు. అయితే ఈ పాము ఎక్కడినుంచి వచ్చిందనేది అర్థం కావడంలేదు. అయితే ఇదంతా సదరు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. ' ఆ పాము మా బాత్రూమ్లో ఉండి ఉంటే నేను ఏడ్చేసిదాన్ని' అంటూ ఒక నెటిజన్ స్పందించారు. ' నేను పామును చూసినప్పటి నుంచి నాకు రాత్రిళ్లు కళలోకి వస్తుందని' మరొక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. -
పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...
సినిమా: జలకాలాటల్లో పూలమాటుల్లో ఏమీ హాయిలే అమలా? ఏమిటి నాటి పాట గతి తప్పిందనుకుంటున్నారా? ఇక్కడ ప్రస్తావన ఆ మధురమైన పాట గురించి కాదు. హీరోయిన్ అమలాపాల్ గురించి. ఈ సంచలన నటి తరచూ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి వార్తల్లోకెక్కింది. అయితే ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు అందుకుందనుకొండి. కానీ ఆ చిత్రం కెరీర్ పరంగా చాలా నష్టాన్నే కలిగించింది. అంతకుముందు అమలాపాల్‌తో చిత్రాలను కమిట్ అయిన దర్శక నిర్మాతలు వాటిని విరమించుకున్నారు. ప్రస్తుతంలో కొత్త అవకాశాలేమీలేవు. దీంతో అమలాపాల్ బాలీవుడ్లో ప్రయత్నాలు మొదలెట్టింది. అలా ఒక చిత్ర అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. తమిళంలో అదో అంద పరవై పోల అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో రూపొందుతున్నదే. ఏదొక విధంగా వార్తల్లో ఉండాలనుకుందో ఏమో నటి అమలాపాల్ తన అర్ధనగ్న ఫొజులతో కూడిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసింది. అదీ బాత్రూమ్లోని టబ్‌లో రంగురంగుల పూల మధ్య జలకాలాడుతూ తీసిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఇక నెటిజన్ల గురించి చెప్పాలా? ఆలా అమలాపాల్ అర్ధనగ్నంగా పూలస్నానమాడుతున్న ఫొటోలను చూసి అమలాపాల్ ఆడై 2కి సిద్ధం అవుతుందా అని అడుగుతున్నారు. అయితే ఈ ఫొటో దృశ్యాలపై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయనుకోండి. దర్శకుడు విజయ్ మీతో వివాహ బంధాన్ని రద్దు చేయడంలో తప్పేలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే ఆడై చిత్రంలో పూర్తిగా నగ్నంగానే నటించావు. ఇలా ఫొటోలు విడుదల చేయడంలో విశేషం ఏముందిలే అంటున్నారు. -
‘వాడి ఏడుపు వినలేకపోయాను.. అందుకే’
వాషింగ్టన్ : అమ్మా ఆకలి.. అమ్మా కడుపు నొప్పి అంటూ నోరు విప్పి చెప్పలేని పసిప్రాయం. తమకు ఏం జరిగినా ఏడుపు ద్వారానే వెల్లడిస్తారు చిన్నారులు. కానీ ఏడుపే ఆ చిన్నారి పాలిట యమపాశమయ్యింది. ఏడుస్తున్న బిడ్డను సముదాయించాల్సిన తల్లి కాస్తా బిడ్డను కడతేర్చింది. విషాదమేంటంటే ఇంటర్నెట్లో వెతికి మరి బిడ్డను చంపింది ఈ కసాయి తల్లి. ఈ విచారకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అరిజోనా(19) అనే యువతి నెల రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టావశాత్తు ఆ చిన్నారి పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడు. దాంతో ఆ పసివాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. అయితే పిల్లాన్ని సముదాయించాల్సిన తల్లి కాస్తా ఆ చిన్నారి ఏడుపు వినలేక బాత్‌టబ్‌లో ముంచి చంపేసింది. అనంతరం ఆ పసివాడి మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో కుక్కి సమీపంలోని పార్క్‌లో వదిలేసి వచ్చింది. తర్వాత ఏం తెలియనట్లు తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫోన్ చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసలకు అరిజోనా మీద అనుమానం రావడంతో నిలదీశారు. అందుకు అరిజోనా తన కుమారుడు జారీ నీళ్లతొట్టిలో పడి చనిపోయాడని బుకాయించింది. కానీ ఆమె సెల్‌ఫోన్ పరిశీలించిన పోలీసులు అరిజోనానే హంతకురాలిగా గుర్తించారు. బిడ్డను చంపడానికి ముందు అరిజోనా ఇంటర్నెట్లో ‘అనుమానం రాకుండా చంపడం ఎలా.. కేసు నుంచి తప్పించుకునే మార్గాలు ఏంటి’ అనే అంశాల గురించి సర్చ్ చేసింది. దాంతో అరిజోనాను అరెస్ట్ చేసి విచారించిగా అసలు విషయం బయటకొచ్చింది. కొడుకు ఏడుపు వినలేక తానే ఆ చిన్నారిని బాత్‌టబ్‌లో ముంచి చంపేసినట్లుగా అరిజోనా నేరం అంగీకరించింది. నా కొడుకుకు సంబంధించి ఏ అచ్చటా.. ముచ్చటా చూడలేదు. ఈ నేరం చేసిన నా భార్యను జీవితాంతం జైలులోనే ఉంచాలి. అప్పుడే ఆమెకు నా బిడ్డ పడిన వేధన అర్థమవుతుంది అంటూ చిన్నారి తండ్రి విలపిస్తున్నాడు. -
బాత్ రూమ్ క్లిప్‌పై నటి వివరణ
సోషల్ మీడియా అప్డేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలనే విషయం మరోసారి రుజువైంది. హిందీ సీరియల్ నటి సారా ఖాన్(28).. బాత్ టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్న ఓ క్లిప్, కొన్ని ఫోటోలు వైరల్ కావటం తెలిసిందే. దీంతో పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే తన సోదరి చేసిన తప్పిదంతోనే అది జరిగిందంటూ సారా వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సారా ఖాన్.. ఆమె సోదరి ఆర్యా అక్కడి సరదా మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు, నాలుగు రోజుల రోజుల క్రితం సారా సోదరి అర్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాత్ టబ్‌లో సారా నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో అది. అది చూసి నెటిజన్లు ఖంగుతిని ‘సిగ్గు లేదా?’ అంటూ సారాను తిట్టి పోశారు. అయితే కాసేటికే ఆర్య ఆ వీడియోను డిలేట్ చేశారు. సారా స్పందన... అయితే అప్పటికే వీడియోలోని స్క్రీన్ షాట్లు కొన్ని నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో జరిగిన పొరపాటుపై సారా మీడియా ముందుకొచ్చారు. మద్యం మత్తులోనే తన సోదరి అలా చేసిందని, సరదా కోసం చేయబోతే అలా వికటించిందని ఆమె ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ప్రపంచం ఇప్పుడు ఎంతో వేగంగా ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ ఒక్కరి అప్డేట్లు వేగంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సింది మేమే. లేకపోతే ఘోరాలు జరిగిపోయే ప్రమాదం ఉంది. ఇక నుంచి అలాంటి పోరపాట్లు జరగకుండా చూసుకుంటా’ అని సారా తెలిపారు. కాగా, సారా ఖాన్ పలు సీరియళ్లతోపాటు బిగ్ బాస్-4 సీజన్లో కంటెస్టెంట్‌గా కూడా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ‘వో అప్నా సా’ సీరియల్లో ఆమె నటిస్తున్నారు. -
‘శ్రీదేవిని ప్లాన్ ప్రకారమే హత్య చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం చెంది మూడు నెలలు కావస్తున్నా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో ఫిబ్రవరి 24 న ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి మరణించారు. మొదట శ్రీదేవి గుండెపోటుతో చనిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల ఆమె చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్ పోలీసులు తేల్చారు. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన వేద్ భూషణ్ అనే మాజీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీదేవి మృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆయన అన్నారు. బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువని, అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆమెను పథకం ప్రకారం చంపేశారని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దుబాయ్ డాక్టర్లు ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదికపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఏసీపీగా రిటైర్డ్ అయి ప్రస్తుతం డిల్లీలో ఓ ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నడుపుతున్న వేద్ భూషణ్ శ్రీదేవి మృతి చెందిన హోటల్‌కు కూడా వెళ్లారని, కానీ శ్రీదేవి మృతి చెందిన గదిలో సిబ్బంది అనుమతించలేదని ఓ మీడియా సంస్థ పేర్కొంది. దీంతో అదే హోటల్లో వేరొక గదిలో ఉన్న ఆయన, శ్రీదేవి మరణానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేసినట్టు తెలిపింది. కాగా, ఇదివరకే శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించారని సందేహం వ్యక్తం చేస్తూ.. స్వతంత్ర విచారణ చేపట్టాలని సునీల్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒమన్‌లో శ్రీదేవి పేరిట ఉన్న రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ మాత్రం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే ఇలాంటి రెండు పిటిషన్లను నిరాకరించామని గుర్తు చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోలేమని దీపక్ మీశ్రా పేర్కొన్నారు. -
బాత్ టబ్‌లో పడి ఎన్నారై మహిళ మృతి!
ఫరిదాబాద్: హరియాణాలో ఓ ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్లో బాత్ టబ్‌లో పడి ఉన్న మహిళ మృతదేహన్ని ఆలస్యంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లండన్‌లో స్థిరపడిన భారత సంతతి మహిళ రీతూ కుమార్ (40) ఈ నెల 22న భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్ బస చేస్తున్నారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు గురువారం రీతూ కుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వారు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం హోటల్లోని వచ్చి ఆమె గదిలోకి వెళ్లి చూడగా బాత్రూంలో ఆమె మృతదేహం లభించింది. కాగా ఆమె గత కొద్ది రోజులుగా తన భర్తతో కలిసి ఉండడం లేదని, ఆమె గదికి కూడా హోటల్ సిబ్బందిని రావద్దని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. -
'శ్రీదేవిని చంపింది భారత మీడియానే..!'
-
'శ్రీదేవిని చంపింది భారత మీడియానే..!'
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను, కుటుంబసభ్యులను, తోటి నటీనటులను వదిలి కానరాని దూరాలకు అందాలనటి శ్రీదేవి తరలివెళ్లారు. దశాబ్ధాల పాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి ఇక జ్ఞాపకాల్లోనే మిగిలిపోయింది. వేలాదిమంది అశ్రునయనాల మధ్య బుధవారం శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. తన నటన, అందం, అభినయం, హావభావాలతో కోట్లాది హృదయాల్లో నిలిచిపోయిన శ్రీదేవి అకాలమరణం ఎంతోమందిని కలిచివేసింది. దుబాయ్‌లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి గత శనివారం ప్రమాదవశాత్తూ హోటల్ గదిలో మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి ఇకలేరు అని తెలిసిన క్షణం నుంచి, ఆమె పార్థీవదేహం ముంబై చేరుకునే వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయ మీడియా సంస్థలతో పాటు, స్థానిక మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాయి. అయితే ఇదే అంశంపై దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ స్పందించింది. శ్రీదేవి మరణంపై భారతీయ మీడియా వ్యవహరించిన తీరును ఆ సంస్థ తప్పుబట్టింది. శ్రీదేవిని ఆ దేశ మీడియానే హత్య చేసిందనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఓ వ్యక్తి మరణంపై నిజానిజాలు తెలుసుకోకుండా.. అత్యుత్సాహం, అసత్య కథనాలు ప్రచారం చేశారని ఖలీజ్ టైమ్స్ గురువారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఆ సంస్థ దాదాపు భారతీయుల పరువును తీసింది. భారత్‌లోని చాలామంది ఇళ్లలో బాత్ టబ్‌లు ఉండవని, వాటి వాడకం గురించి వారికి తెలియదని అవహేళన చేసింది. మొదట శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్ పోలీసులు తేల్చారు. అయితే, ఆ సంఘటనపై అసలేం జరిగిందో తెలుసుకోకుండానే శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ తమ డిటెక్టివ్ కథనాల ప్రసారాన్ని, బాత్ టబ్‌లో సన్నివేశాలను చూపుతూ భారత మీడియా అత్యుత్సాహం చూపడాన్ని ఖలీజ్ టైమ్స్ విమర్శించింది. అన్నీ టీవీ ఛానెళ్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి బాత్‌టబ్‌లో సీన్స్‌ను చిత్రీకరించడంపై విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా రాజకీయ ప్రముఖులైన సుబ్రమణ్య స్వామి, అమర్ సింగ్‌లు శ్రీదేవి మృతిపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ కథనంలో పేర్కొనడం గమనార్హం. సంఘటన జరిగినప్పటి నుంచి తమ సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నించారని.. కానీ భారతీయ మీడియా తమ సమాచారాన్ని వక్రీకరిస్తూ విభిన్న కథనాలను ప్రసారం చేసిందని ఖలీజ్ వెల్లడించింది. దుబాయ్‌లో శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తూ అని తేలినా.. కొంతమంది జర్నలిస్టులు ఆమె మృతి వెనుక ఇదే రహస్యమంటూ.. కాస్మోటిక్ సర్జరీలు, శరీరంలో ఆల్కహాలు జాడలు ఉన్నాయనే కథలు అల్లడం తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ఇలాంటి ఘటనలను మానవతా దృక్పథంతో చూడాలని, కానీ కొన్ని న్యూస్ ఛానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేసి శ్రీదేవిని హత్య చేశాయన్న వ్యాఖ్యలు చేసింది. -
బాత్‌టబ్‌లో రిపోర్టర్.. నెటిజన్ల విస్మయం!
అతిలోకసుందరిగా పేరు గడించిన శ్రీదేవికి దేశవ్యాప్తంగా పాపులారీటీ ఉంది. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఈ పాపులారిటీ నేపథ్యంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయంగా, దాదాపు అన్నిరా ష్ట్రాల్లోనూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దుబాయ్‌లో శ్రీదేవి ఆకస్మిక మృతి.. ఈ తర్వాత చోటుచేసుకున్న ఒకింత నాటకీయ పరిణామాలు.. ఆమె గుండెపోటుతో కాకుండా బాత్‌టబ్‌లో మునిగిచనిపోయిందని పోలీసులు తేల్చడం.. ఇవన్నీ న్యూస్ చానళ్లకు కావాల్సినంత సరంజామా ఇచ్చాయి. దీంతో కొన్ని న్యూస్ చానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీదేవి ఆకస్మిక మృతి విషయంలో న్యూస్ చానెళ్లు జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం.. బాత్‌టబ్‌లోకి కూరుకుపోయి మరీ కథనాలు ప్రసారం చేయడం నెటిజన్లకు వెగటు పుట్టిస్తోంది. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగిచనిపోయిందని వెల్లడైన ఫిబ్రవరి 26న దాదాపు అన్ని జాతీయ చానళ్లు, ప్రాంతీయ చానళ్లు బాత్రూమ్ను టీవీ స్క్రీన్ మీదకు తీసుకొచ్చాయి. బాత్‌టబ్ కొలతలు ఇచ్చాయి. తమ కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్ స్కిల్స్‌కు పదునుపెట్టి.. స్టూడియోలోనే తమ డిటెక్టివ్ బుద్ధికి రెక్కలు విప్పి.. కోడిగుడ్డ మీద ఈకలు పీకన చందంగా కథనాలు వండివార్చాయి. కొన్నిచానళ్లు ఏకంగా బాత్‌టబ్‌లో శ్రీదేవి ఫొటోలు పెట్టి.. ‘మోత్కా బాత్‌టబ్’ అంటూ తమ అతి సృజనాత్మకతను ప్రదర్శించాయి. మరికొన్ని చానళ్లయితే బాత్‌టబ్‌లో శ్రీదేవి పడి ఉంటే..బోనీకపూర్ వచ్చి చూసినట్టు తమ ఫోటోషాపింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించుకున్నాయి. 9 pm lineup on English news TV. @republic: Sridevi. @TimesNow: Sridevi. @CNNnews18: Sridevi. @MirrorNow: Sridevi. @NewsX: Sridevi. @ndtv: Sridevi. If only Judge Loya’s death had elicited such sharp and searing scrutiny. pic.twitter.com/6ArTJXqJSv — churumuri (@churumuri) February 26, 2018 శ్రీదేవి మొదట గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని పోలీసులు తేల్చారు. అయితే, ఆ సమయంలో ఆమె దేహంలో ఆల్కహాల్ జాడలు ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలో తేల్చారు. ఈ సమాచారాన్ని పట్టుకొని.. ఒక టీవీ చానల్ బాత్‌టబ్ మీద వైన్ గ్లాస్.. మరోవైపు శ్రీదేవి ఫొటో పెట్టి కథనాలు వండివార్చింది. ఇక, జాతీయస్థాయిలో పోటాపోటీగా కథనాలు ప్రచురించే రిపబ్లిక్, టైమ్స్ నౌ చానళ్లు కూడా శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ ప్రైమ్‌టైమ్‌లో తమ డిటెక్టివ్ కథనాల ప్రసారంలో అత్యుత్సాహం చూపాయి. మిగతా చానళ్లు కూడా ప్రధాన వార్తలు గాలికొదిలేసి.. ప్రైమ్‌టైమ్ లో శ్రీదేవి మృతి విషయంలోనే చర్చలు నడిపాయి. C'mon, just give them the goddamn Pulitzer already! pic.twitter.com/aU8vBaL0fI — Karnika Kohli (@KarnikaKohli) February 26, 2018 బాత్‌టబ్‌లో రిపోర్టర్..! ఓ ప్రాంతీయ చానల్‌కు చెందిన రిపోర్టర్ బాత్‌టబ్‌లోకి దిగి మరీ రిపోర్టింగ్ చేయడంపై సోషల్ మీడియాలో విస్మయం వ్యక్తమవుతుంది. దీనిపై నెటిజన్లు జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. శ్రీదేవిది బాత్‌టబ్ మరణం కాబట్టి బాత్‌టబ్‌లోకి దిగారు.. ఒకవేళ ఎవరైనా ఉరివేసుకుంటే..రిపోర్టర్ కూడా ఉరి వేసుకున్నట్టు కనిపిస్తూ.. రిపోర్టింగ్ చేస్తారా? నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి మృతి విషయంలో కొన్ని చానళ్లు సాగించిన చిలువలపలువల ప్రచారం,చానళ్ల అత్యుత్సాహంపై సోషల్ మీడియా ఘాటుగా స్పందించింది.‘ఇప్పుడు నడుస్తోంది బ్యాడ్ జర్నలిజం కాదు.. బాత్‌టబ్ జర్నలిజం’ అంటూ కత్తి మహేశ్ టీవీ చానళ్ల ధోరణిపై ట్వీట్ చేశారు. మొత్తానికి ఓవైపు టీవీ చానళ్ల వికృత ధోరణిని పరిహాసిస్తూనే.. మరోవైపు శ్రీదేవి మృతివిషయంలో వదంతులు ప్రచారం చేయకుండా ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ..నెటిజన్లు పెద్ద ఎత్తున లెట్హార్రెస్ట్ఇన్పీస్ యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ అయ్యేలా చేశారు. One anchor is in "the" bathroom, complete with a wine glass! Wow! Excuse me while I step out to bang my head against a wall. BRB. pic.twitter.com/XTdLNI2ckO — Sachin Kalbag (@SachinKalbag) February 26, 2018 Thank God it's bath tub. As somone pointed out, what if it was a fire. pic.twitter.com/as6kqQTMem — Kathi Mahesh (@kathimahesh) February 27, 2018 .@abpnewstv decides to give a platform to all the WhatsApp crap floating around on her death. "Did plastic surgery kill her?" is the important question being probed. pic.twitter.com/f1S0Yyklbp — Manisha Pande (@MnshaP) February 26, 2018 -
బాత్‌టబ్‌లో పడితే చనిపోతారా?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి మృతికేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయినట్టు ఫోరెన్సిక్ నివేదికలు ధ్రువీకరించాయి. అప్పటికీ వరకు ఉత్సాహంగా ఆడిపాడుతూ.. కనిపించిన శ్రీదేవి ఉన్నఫలాన బాత్‌టబ్‌లో పడి చనిపోవడమేమిటి? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బాత్‌టబ్ మరణాలు అనేవి భారతీయులకు కొత్త కావొచ్చు. ఇలాంటి మరణాలు దాదాపు మనదేశంలో చోటుచేసుకోవు కాబట్టి.. ఇదంతా విస్మయం కలిగించవచ్చు. కానీ విదేశాల్లో ఇలాంటి విషాదాలు సాధారణమే.ముఖ్యంగా జపాన్, అమెరికాలో బాత్‌టబ్ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. జపాన్‌లో బాత్‌టబ్ సంబంధిత మరణాలు జాతీయ విషాదంగా మారాయి. ఏడాదికి 19వేల మరణాలు ఇలా సంభవిస్తున్నట్టు 2017 మార్చిలో జర్నల ఆఫ్ జనరల్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ పత్రికలో ఓ అధ్యయనం వెల్లడించింది. గడిచిన పదేళ్లలో ఈ తరహా మరణాలు 70శాతం వరకు పెరిగాయని, ఈ మరణాల్లో ప్రతి పదింటిలో తొమ్మిదిమంది 65 ఏళ్లకుపైగా వృద్ధులే ఉంటున్నారని జపాన్ వినియోగదారుల వ్యవహారాల ఏజెన్సీ 2016లో పేర్కొంది. జపనీయులు 41 సెల్సియస్‌కుపైగా వేడినీళ్లతో స్నానం చేయడం, బాత్‌టబ్‌ల లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఇందుకు కారణం. 2006లో అమెరికా ఫెడరల్ మోర్టాలిటీ డాటా ప్రకారం బాత్‌టబ్, హాట్‌టబ్, స్పా వంటి వల్ల రోజుకొకరు మృతిచెందుతున్నారు. మృతుల్లో అత్యధికులు డ్రగ్స్, మద్యం మత్తులో చనిపోతున్నారని తెలిపింది. 2015లో ఇళ్లలో ఉండే బాత్రూమ్లు ప్రమాదకరంగా మారాయని అట్లాంటాలోని సెంటర్ ఫర్ డీసిసెస్ కంట్రోల్ పేర్కొంది. 15 ఏళ్లకుపైగా ఉన్న రెండు లక్షలమంది ప్రతి ఏడాది బాత్రూమ్ గాయాలకు గురవుతున్నారని,అందులో 14శాతం మంది ఆస్పత్రి పాలవుతున్నారని తెలిపింది. ఇక, భారత్‌కు వస్తే బాత్రూమ్ (మరుగుదొడ్డి) ప్రమాదాల గురించి పెద్దగా అధ్యయనాలు జరిగింది లేదు. మరుగుదొడ్లలో చోటుచేసుకుంటున్న పడటాలు, జారిపడటాల వల్ల మహిళలు, పురుషులు గాయపడుతున్నారని మనదేశపు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ ప్రమాదాలను కూడా ఇంటిలో జరిగే ప్రమాదాలు కాలిపోవడం, విద్యుత్‌షాక్ తగలడం వంటివాటిలో కలిపి పరిగణిస్తున్నారు. బాత్రూమ్ ప్రమాదాల వల్ల దేశంలో చనిపోయినట్టు దాఖలాలు లేవు. పలువురు ప్రముఖులూ.. హాలీవుడ్ నటుడు జిమ్ మారిసన్ (28) బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. 1971లో పారిస్‌లో అతను బాత్‌టబ్‌లో విగతజీవిగా కనిపించాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు కానీ.. డ్రగ్స్ అధికంగా సేవించడం వల్ల చనిపోయినట్టు భావించారు. అమెరికా పాప్ గాయని విట్నీ హుస్టన్ కూడా 2012లో తన హోటల్ గదిలో బాత్‌టబ్‌లో విగతజీవిగా కనిపించింది. అధిక డ్రగ్స్ వల్ల ఆమె మరణించినట్టు తెలుస్తోంది. ప్రముఖ గాయకులు బాబీ బ్రౌన్, విట్నీ హుస్టన్ దంపతుల కుమార్తె బాబీ క్రిష్టా బ్రౌన్ కూడా 2015లో అపస్మారక స్థితిలో బాత్‌టబ్‌లో పడిపోయి ప్రాణాలు విడిచింది. మద్యం, మెడిసిన్స్ వల్ల ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది. నటుడు, గాయకుడు జ్యూడీ గార్లాండ్ కూడా 1969లో బాత్‌టబ్‌లో ప్రాణాలు విడిచాడు. -
బాత్‌టబ్‌లో.. సెన్సేషన్ వీడియో!
-
బాత్‌టబ్‌లో.. సెన్సేషన్ వీడియో!
చాక్లెట్లు అంటే చాలామంది పడిచస్తారు. కొందరు అస్తమానం చాక్లెట్లు నమలడానికి ఇష్టపడితే.. మరికొందరు బాటిళ్లకొద్దీ చాక్లెట్ రసాన్ని తాగే వీరాభిమానుల ఉంటారు. కానీ బ్రిటన్ చెందిన ఓ వ్యక్తి మాత్రం చాక్లెట్ల రసమైన న్యెటెల్లాపై తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. సిమ్రే కాండర్ అనే ఈ యువకుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం గతంలో అతను ఏకంగా 1250 బాటిళ్ల కారం సాస్‌ను తాగాడు. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈసారి మరి వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చాడు. విల్లీవాంక్లోని చాక్లెట్ సరస్సు, చాక్లెట్ ఫ్యాక్టరీలు మనకు తెలుసు. కానీ ఇతను ఏకంగా చాక్లెట్ బాత్‌టబ్ సృష్టించాడు. చాక్లెట్ రసం న్యుటెల్లాతో సాన్నపుకుండీని నింపి.. అందులో మునకవేశాడు. 'వావ్.. వావ్' అంటూ ఒంటినిండా చాక్లెట్ రసాన్ని పూసుకొని.. అందులో జలకాలాడాడు. కొంతసేపటికే ఆ రసం గట్టిగా, జిగటుగా మారిపోవడంతో మనోడికి కదలడమే కష్టమైంది. అయినా అతికష్టం మీద చాక్లెట్ బాత్‌టబ్‌లో మునిగితేలుతూ చిత్రవిచిత్రమైన స్టెప్టులు కూడా వేశాడు. దీంతో రాత్రికి రాత్రే సిమ్రే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో పెట్టిన అతని వీడియోను 30లక్షలమందికి పైగా వీక్షించారు. -
అమెరికాలో భారతీయ చిన్నారి హత్య!
న్యూయార్క్: మూడు నెలల క్రితం అమెరికాకు వెళ్లిన తొమ్మిదేళ్ల భారతీయ చిన్నారి దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తండ్రితో ఉండేందుకు వెళ్లిన ఆ చిన్నారి బాత్‌టబ్‌లో శవమై తేలింది. కాగా సవతి తల్లే ఈ హత్యకు పాల్పడి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చిన్నారి అష్దీప్ కౌర్ న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో తండ్రి సుఖ్జిందర్ సింగ్, సవతి తల్లి అర్జున్ సమ్దితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. అదే ఇంట్లో మరో జంట సైతం ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బాత్ రూంలో అష్దీప్ కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, అర్జున్ సమ్దీతో కలిసి అష్దీప్ బాత్రూంకు వెళ్తుండగా చూశామని అందే ఇంట్లో ఉన్న వ్యక్తి వెల్లడించారు. అష్దీప్ మృతదేహాన్ని కనుగొన్న సమయంలో అర్జున్ సమ్దీ పరారీలో ఉండగా పోలీసులు వెతికి పట్టుకున్నారు. నీళ్లు లేని బాత్ టబ్‌లో పడి ఉన్న బాలిక మృతదేహంపై గొంతుతో పాటు పలుచోట్ల గాయాలను గుర్తించారు. మారు తల్లే గొంతు నులిమి హత్య చేసి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు. కాగా, అష్దీప్ అంటే అర్జున్ సమ్దీకి అసలు ఇష్టం ఉండేది కాదని, పలు మార్లు కొట్టడం తాము గమనించామని, అయితే ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఊహించలేదని బంధువులు అంటున్నారు. సుఖ్జిందర్ సింగ్‌తో విడాకులు తీసుకొని భారత్‌లో ఉన్న అష్దీప్ తల్లి.. కూతురు మరణ వార్త విని కుప్పకూలింది.