
బాత్‌టబ్‌లో.. సెన్సేషన్ వీడియో!
చాక్లెట్లు అంటే చాలామంది పడిచస్తారు. కొందరు అస్తమానం చాక్లెట్లు నమలడానికి ఇష్టపడితే.. మరికొందరు బాటిళ్లకొద్దీ చాక్లెట్ రసాన్ని తాగే వీరాభిమానుల ఉంటారు. కానీ బ్రిటన్ చెందిన ఓ వ్యక్తి మాత్రం చాక్లెట్ల రసమైన న్యెటెల్లాపై తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు.
సిమ్రే కాండర్ అనే ఈ యువకుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం గతంలో అతను ఏకంగా 1250 బాటిళ్ల కారం సాస్‌ను తాగాడు. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈసారి మరి వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చాడు. విల్లీవాంక్‌లోని చాక్లెట్ సరస్సు, చాక్లెట్ ఫ్యాక్టరీలు మనకు తెలుసు. కానీ ఇతను ఏకంగా చాక్లెట్ బాత్‌టబ్ సృష్టించాడు. చాక్లెట్ రసం న్యుటెల్లాతో సాన్నపుకుండీని నింపి.. అందులో మునకవేశాడు. 'వావ్.. వావ్' అంటూ ఒంటినిండా చాక్లెట్ రసాన్ని పూసుకొని.. అందులో జలకాలాడాడు. కొంతసేపటికే ఆ రసం గట్టిగా, జిగటుగా మారిపోవడంతో మనోడికి కదలడమే కష్టమైంది. అయినా అతికష్టం మీద చాక్లెట్ బాత్‌టబ్‌లో మునిగితేలుతూ చిత్రవిచిత్రమైన స్టెప్టులు కూడా వేశాడు. దీంతో రాత్రికి రాత్రే సిమ్రే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో పెట్టిన అతని వీడియోను 30లక్షలమందికి పైగా వీక్షించారు.