చాక్లెట్ అంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఓ చిన్న ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తే ఉండే ఆనందమే వేరబ్బా..!. అలాంటి చాక్లెట్ మీ ముఖ సౌందర్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. ఈ రోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా డార్క్ చాక్లెట్ మీ చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దాం.
ఇది చర్మానికి మంచి సూపర్ పుడ్. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మానికి మెరుపుని అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.
చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందంటే..
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను దూరం చేస్తుంది.
హైడ్రేషన్ బూస్ట్:
డార్క్ చాక్లెట్ తినడం వల్ల పోషకాలు చర్మ కణాలకు వేగంగా చేరుకుంటాయి. ఫలితంగా చర్మ హైడ్రేషన్‌ని పెంచి ముఖం మృదువుగా ఉండేలా చేస్తుంది.
సన్ ప్రొటెక్షన్: ఇది సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కానప్పటికీ డార్క్ చాక్లెట్ కొంత యూవీ సంరక్షణను అందిస్తుంది. చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు సూర్యరశ్మికి చర్మం ప్రతిఘటనను బలపరుస్తుంది. అలాగే కమిలిపోకుండా చేస్తుంది
స్ట్రెస్ బూస్టర్:
ఒత్తిడి చర్మాన్ని యవ్వన హీనంగా చేస్తుంది. దీనివల్ల పగుళ్లు ఏర్పడి నిస్తేజంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఒత్తిడిని తగ్గించి, తాజా యవ్వన మెరుపును మరింత పెంచుతుంది.
డిటాక్స్ డిలైట్: డార్క్ చాక్లెట్‌లో ఉండే మినరల్స్-జింక్, మెగ్నీషియం-కణ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
చాక్లెట్ స్మూతీ గ్లో: బచ్చలికూర, బాదం పాలు, అరటిపండుతో పాటు డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను స్మూతీలో జోడించండి. ఈ రుచికరమైన మిశ్రమం అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా చర్మానికి లోపలి నుంచి అదనపు మెరుపును కూడా ఇస్తుంది.
స్నాక్ స్మార్ట్: రోజువారీ చిరుతిండిలో భాగంగా 70% లేదా అంతకంటే ఎక్కువ డార్క్ చాక్లెట్‌ని చిన్న ముక్కగా తింటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
చాక్లెట్ బాడీ స్క్రబ్: కరిగించిన డార్క్ చాక్లెట్, పంచదార, కొబ్బరి నూనెతో ఉల్లాసంగా ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను తయారు చేయండి. ఈ తీపి స్క్రబ్ శరీరాన్ని మృదువుగా చేయడమే గాక మృత కణాలను తొలగిస్తుంది.
(చదవండి: స్ట్రిక్ట్ మామ్ కాజోల్: సరిగా చేస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం బెస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment