Chocolate
-
చాక్లెట్‌పై ఆ గుర్తులు లేవన్న వ్యక్తి.. పరిహారం చెల్లించిన కంపెనీ
ఏ వస్తువుకైనా దాని బ్రాండ్ గుర్తు చేసే కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులే లేకపోతే.. దానిని ఎవరు తయారు చేసారో చెప్పడం కష్టం. కాబట్టి ప్రతి కంపెనీ తమ వస్తువులకు తప్పకుండా కొన్ని గుర్తులను ముద్రిస్తుంది. ఇటీవల ఒక మార్స్ చాక్లెట్ బార్.. సాధారణ చాక్లెట్ మాదిరిగా కాకుండా, స్మూత్‌గా ఉన్నట్లు ఓ వ్యక్తి కనిపెట్టాడు.బకింగ్‌హామ్ షైర్లోని ఐల్స్బరీకి చెందిన 32 ఏళ్ల హ్యారీ సీగర్.. తన ఫేస్బుక్లో స్మూత్ చాక్లెట్ బార్ ఫోటో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ అయింది. అంతే కాకుండా దీనిని కంపెనీకి కూడా మెయిల్ ద్వారా పెంపించాడు. కంపెనీ దీనికి చింతిస్తూ.. క్షమాపణ చెప్పడమే కాకుండా అతనికి పరిహారంగా రూ. 215 చెల్లించింది.నిజానికి సీగర్ స్నేహితులతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని ఒక క్లాసిక్ కార్ షోకు వెళుతుండగా.. ఆక్స్ఫర్డ్షైర్లోని సర్వీస్ స్టేషన్లో ఆగి చాక్లెట్ బార్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ చాక్లెట్ మీద అలలు లాంటి గుర్తులు ఏమి లేకుండా మృదువుగా కనిపించింది. ఇది అతన్ని చాలా ఆకర్శించింది. దానినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే కాకుండా కంపెనీకి మెయిల్ కూడా చేసాడు.కంపెనీ స్పందించి అతని పరిహారం అందించిన తరువాత, అతడు స్పందిస్తూ.. నేను పరిహారం కోసం కంపెనీకి మెయిల్ చేయలేదు. ఇలాంటి చాక్లెట్ ఎందుకు తయారు చేసారు? కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక్కోవడానికి ఇలా చేసాను అని అన్నాడు. అయితే నాకు పరిహారం లభించింది. దీంతో నేను రెండు మార్స్ బార్లు కొనేయొచ్చు అని పేర్కొన్నాడు. -
బ్రిటన్ రాణి సైతం చాక్లెట్ టేస్ట్‌కీ ఫిదా..!
చాక్లెట్లంటే చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమో మనందరికి తెలిసిందే. అలాంటి చాక్లెట్ల టేస్ట్‌కి బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్ కూడా ఫిదా అయ్యిపోయేవారట. ఆమె తన స్నాక్స్ టైంలో చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనట. రాజదర్పానికి తగ్గట్టుగా ఆమె అత్యంత ఖరీదైన చాక్లెట్లనే ఇష్టపడేవారట. అవి అంటే ఆమెకు మహాప్రీతి అని బకింగ్‌హామ్ ప్యాలెస్ చెఫ్ చెబుతున్నారు. అంతేగాదు ఆయన క్వీన్ ఇష్టపడే చాక్లెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.దివంగత క్వీన్ ఎలిజబెత్ II చాలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంభించేవారు. ఆమె మంచి ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధిగాంచిన రాణి కూడా. అయితే క్వీన్ ఎలిజబెత్‌కి సైతం చాక్లెట్లంటే ఇష్టమని ఆ రాజకుటుంబానికి సేవలందించిన చెఫ్ డారెన్ మెక్‌గ్రాడీ చెబుతున్నారు. ఆమె డార్క్ చాక్లెట్లు మాత్రమే ఇష్టంగా తినేవారని అన్నారు. పాలతో తయారు చేసిన చాక్లెట్లను ఇష్టపడేవారు కారట. డార్క్ చాక్లెట్‌తో మిక్స్ చేసి ఉండే పుదీనా బెండిక్స్ ఫాండెట్లను ఇష్టంగా తినేవారట. ఈ చాక్లెట్ బాక్స్ ఒక్కోటినే రూ. 544లు పలుకుతుందట. ఆమె రోజులో ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయం సమయంలో టీ.. ఆపై రాత్రి భోజనంగా జీవనశైలి ఉంటుందట. ఆమె గనుక రోజుని ఎర్ల్ గ్రే టీ విత్ బిస్కెట్స్‌తో ప్రారంభిస్తే..కచ్చితంగా రోజంతా డిఫరెంట్ చాక్లెట్లను ఆస్వాదించేవారని చెప్పుకొచ్చారు మెక్‌గ్రాడీ. అలాగే అత్యంత లగ్జరియస్ చాక్లేటియర్ చార్బొన్నెల్ చాక్లెట్‌ని అమితంగా ఇష్టపడేవారని అన్నారు. దీని ఖరీదు ఏకంగా రూ. 30 వేలు పైనే ఉంటుందట. ఇక్కడ రాణి గారు ఇష్టపడే బెండిక్స్, చార్బొన్నెల్ బ్రాండ్లు రెండు బ్రిటన్‌కి చెందిన ఫేమస్ బ్రాండ్లే కావడం విశేషం. ఇక డైట్ పరంగా క్వీన్ ఎలిజబెత్ సమతుల్య ఆహారాన్నే తీసుకునేవారని చెఫ్ మెక్‌గ్రాడి చెబుతున్నారు. ఆమె చాక్లెట్ పరిమాణం కంటే నాణ్యతపైనే దృష్టి పెట్టి తీసుకునేవారని అన్నారు. ఆరోగ్యం పట్ల ఉన్న ఈ నిబద్ధతే క్వీన్ ఎలిజబెత్ సుదీర్ఘకాల జీవన రహస్యం కాబోలు..!.(చదవండి: వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?) -
చర్మ సంరక్షణకు డార్క్ చాక్లెట్..!
చాక్లెట్ అంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఓ చిన్న ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తే ఉండే ఆనందమే వేరబ్బా..!. అలాంటి చాక్లెట్ మీ ముఖ సౌందర్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. ఈ రోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా డార్క్ చాక్లెట్ మీ చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దాం. ఇది చర్మానికి మంచి సూపర్ పుడ్. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మానికి మెరుపుని అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందంటే..డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను దూరం చేస్తుంది. హైడ్రేషన్ బూస్ట్: డార్క్ చాక్లెట్ తినడం వల్ల పోషకాలు చర్మ కణాలకు వేగంగా చేరుకుంటాయి. ఫలితంగా చర్మ హైడ్రేషన్‌ని పెంచి ముఖం మృదువుగా ఉండేలా చేస్తుంది. సన్ ప్రొటెక్షన్: ఇది సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కానప్పటికీ డార్క్ చాక్లెట్ కొంత యూవీ సంరక్షణను అందిస్తుంది. చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు సూర్యరశ్మికి చర్మం ప్రతిఘటనను బలపరుస్తుంది. అలాగే కమిలిపోకుండా చేస్తుందిస్ట్రెస్ బూస్టర్: ఒత్తిడి చర్మాన్ని యవ్వన హీనంగా చేస్తుంది. దీనివల్ల పగుళ్లు ఏర్పడి నిస్తేజంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఒత్తిడిని తగ్గించి, తాజా యవ్వన మెరుపును మరింత పెంచుతుంది.డిటాక్స్ డిలైట్: డార్క్ చాక్లెట్లో ఉండే మినరల్స్-జింక్, మెగ్నీషియం-కణ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.చాక్లెట్ స్మూతీ గ్లో: బచ్చలికూర, బాదం పాలు, అరటిపండుతో పాటు డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను స్మూతీలో జోడించండి. ఈ రుచికరమైన మిశ్రమం అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా చర్మానికి లోపలి నుంచి అదనపు మెరుపును కూడా ఇస్తుంది.స్నాక్ స్మార్ట్: రోజువారీ చిరుతిండిలో భాగంగా 70% లేదా అంతకంటే ఎక్కువ డార్క్ చాక్లెట్‌ని చిన్న ముక్కగా తింటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. చాక్లెట్ బాడీ స్క్రబ్: కరిగించిన డార్క్ చాక్లెట్, పంచదార, కొబ్బరి నూనెతో ఉల్లాసంగా ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను తయారు చేయండి. ఈ తీపి స్క్రబ్ శరీరాన్ని మృదువుగా చేయడమే గాక మృత కణాలను తొలగిస్తుంది. (చదవండి: స్ట్రిక్ట్ మామ్ కాజోల్: సరిగా చేస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం బెస్ట్!) -
ఈ వంటలను ఎప్పుడైనా వండి చూశారా..!?
పొటాటో–లెమెన్ పోహా..కావలసినవి:బంగాళదుంపలు– 2 (ఉడికించి, చల్లారాక తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి),జీలకర్ర, ఆవాలు– పావు టీ స్పూన్ చొప్పున,కరివేపాకు,ఎండుమిర్చి– కొద్దికొద్దిగావేరుశనగలు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)అల్లం తరుగు– కొద్దిగా, వెల్లుల్లి ముక్కలు– పావు టీ స్పూన్నూనె– సరిపడా,ఉప్పు– రుచికి తగ్గట్టుగాపసుపు, కారం– అర టీ స్పూన్ చొప్పుననిమ్మరసం– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)కొత్తిమీర తురుము– 4 టేబుల్ స్పూన్లు, అటుకులు– ఒకటిన్నర కప్పులుతయారీ..– ముందుగా అటుకులను జల్లెడ తొట్టెలో వేసుకుని మంచినీళ్లు పోసి, 2 సార్లు కడిగి పెట్టుకోవాలి.– ఆపై ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.– అందులో పసుపు, కారం, తగినంత ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసుకుని, 2 నిమిషాలు మూత పెట్టి చిన్నమంట మీద ఉడకనివ్వాలి.– అనంతరం కొత్తిమీర తురుము, అటుకులు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి, మూతపెట్టుకుని 2 నిమిషాలు ఉడికించాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ పోహా.డ్రైఫ్రూట్స్ చాక్లెట్స్..కావలసినవి:కోకో పౌడర్,పంచదార పొడి,కొబ్బరి నూనె (స్వచ్ఛమైనది) – ముప్పావు కప్పు చొప్పున,మిల్క్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు,పిస్తా, బాదం, జీడిపప్పు, వేరుశనగలు(దోరగా వేయించి, తొక్క తీసేసినవి) – 2 టేబుల్ స్పూన్ల చొప్పునతయారీ:– ముందుగా పిస్తా, జీడిపప్పు, బాదం, వేరుశనగలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అనంతరం అదే మిక్సీ బౌల్‌ని కాసిన్ని నీళ్లతో క్లీన్ చేసుకుని, దానిలో కోకో పౌడర్, పంచదార పొడి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మిల్క్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసుకుని క్రీమీగా మారేలా మిక్సీ పట్టుకోవాలి.– అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, దానిలో డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం నచ్చిన షేప్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రేని తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, కొద్దికొద్దిగా ఈ మిశ్రమం వేసుకుని, మూడు నుంచి 5 గంటల పాటు ఆ ట్రేను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం వాటిని ట్రే నుంచి వేరు చేసుకోవచ్చు.ఎల్లో ఎగ్ – కీమా లాలీపాప్స్..కావలసినవి:గుడ్లు– 6 లేదా 7 (పసుపు సొన మాత్రమే, ఉడికించి చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)మటన్ కీమా– పావుకిలో (మసాలా, ఉప్పు, కారం వేసుకుని కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి)బ్రెడ్ పౌడర్– అర కప్పుఓట్స్ పౌడర్– పావు కప్పు,అల్లం–వెల్లుల్లి పేస్ట్– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– ఒకటిన్నర టీ స్పూన్లు,మిరియాల పొడి, జీలకర్ర పొడి– పావు టీ స్పూన్ చొప్పున,ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లుఉప్పు– తగినంత,గడ్డ పెరుగు– తగినంతనీళ్లు– కొన్ని (అభిరుచిని బట్టి),టమాటో సాస్,కొత్తిమీర తురుము– గార్నిష్‌కి సరిపడా,నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ:– ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్ల పసుపు సొన, ఉడికిన మటన్ కీమా, ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా గడ్డ పెరుగు వేసుకుని ముద్దగా చేసుకోవాలి.– ముద్దలా చేసుకోవడానికి పెరుగు చాలకుంటే నీళ్లు కూడా వాడుకోవచ్చు. – ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్‌లా లేదా చిత్రంలో చూపిన విధంగా చేసుకుని, ప్రతి లాలీపాప్‌కు ఒక పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి.– అనంతరం వాటిని మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.– వెంటనే టమాటో సాస్‌లో వాటిని ముంచి, కొత్తిమీర తురుము జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
జెప్టోలో డెలివరీ.. హెర్షే చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ డెలివరీ పార్శిల్లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నోయిడాలలో ఓ వ్యక్తి ఐస్క్రీంను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందులో తెగిన మనిషి వేలు కనిపించడం సంచలనం సృష్టించింది. దీంతో సదరు ఐస్‌క్రీం సంస్థ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. అనంతరం బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేయగా.. పార్శిల్ బాక్స్‌లో చిన్న తాచు పాము వుండడం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోనకు గురయ్యాడు.తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిల ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.జెప్టో నుంచి హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి ఆర్డర్ చేయగా... సిరప్‌ను కప్‌లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిందని అని పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలియక ముందు కుటుంబ సభ్యులు సిరప్ రుచి చూశారని, దీంతో వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసి తినే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని, కేసు వేయాలని సూచిస్తున్నారు.దీంతో హెర్షే సంస్థ స్పందించింది. ఇలాంటి ఘటన ఎదురైనందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. దయచేసి తమకు UPC అలాగే తయారీ కోడ్‌ను consumercare@hersheys.comకు రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపాలని తెలిపింది. తద్వారా తమ బృంద సభ్యులు మీకు సహాయం చేయగలరని పేర్కొంది. View this post on Instagram A post shared by Prami Sridhar (@pramisridhar) -
భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! మరిన్నింటిపై ప్రభావం.. కారణం..
యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకూ హామీ లభించింది. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ఒప్పందంతో ప్రధానంగా స్విస్ వాచీలు, పాలిష్ చేసిన వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టన్స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఉపయోగాలివే.. దేశీయంగా తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకూ సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన ఉత్పత్తులపై ఈ ఏడాది జనవరి నుంచే స్విట్జర్లాండ్ సుంకాలను తొలగించింది. భారత్ కూడా ఈఎఫ్టీఏ ఉత్పత్తుల్లో 95.3 శాతానికి మినహాయింపు ఇస్తోంది. అక్కడ నుంచి బంగారం మనదేశంలోకి అధికంగా దిగుమతి అవుతున్నా, కస్టమ్స్ సుంకం (15%) విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్‌రేటు (అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది)ను మాత్రం 1% తగ్గించి, 39%గా ఉంచింది. ఐరోపా సమాఖ్యకు చేరేందుకు భారత కంపెనీలు స్విట్జర్లాండ్‌ను బేస్‌గా వినియోగించుకోవచ్చు. ప్రెసిషన్ ఇంజినీరింగ్, హెల్త్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, వినూత్నత-పరిశోధనల్లో సాంకేతిక సహకారం సులువవుతుంది. మారనివి ఇవే.. డెయిరీ, సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..! స్విట్జర్లాండ్ నుంచి భారత్ ఎక్కువగా బంగారం (12.6 బి.డాలర్లు), యంత్రాలు (409 మి.డాలర్లు), ఔషధాలు (309 మి.డాలర్లు), కోకింగ్ అండ్ స్టీమ్ కోల్ (380 మి.డాలర్లు), ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లు, ఆర్థోపెడిక్ అప్లియెన్సెస్ (296 మి.డాలర్లు), వాచీలు (211.4 మి.డాలర్లు), సోయాబీన్ ఆయిల్ (202 మి.డాలర్లు) చాక్లెట్లు (7 మి.డాలర్లు) తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రసాయనాలు, రత్నాభరణాలు, కొన్ని రకాల టెక్స్టైల్స్, దుస్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది. -
నల్లగొండ జిల్లాలో చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయాలు
-
HYD: డీమార్ట్‌లో ఫ్రీగా చాకెట్లు తింటూ ఇన్‌స్టా రీల్.. ఇలా బుక్కయ్యాడు
సాక్షి, హైదరాబాద్: డీమార్ట్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందిన రిటైల్ సూపర్‌మార్కెట్ ఇది. దాదాపు అన్ని నగరాల్లో దీని బ్రాంచ్‌లు ఉన్నాయి. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు నెలవారి సరకులు ఇక్కడే కొంటుంటారు. ఇందులో ఉప్పు, పప్పూ నుంచి అన్ని రకాల వంట సామగ్రి, చాక్లెట్లు, బిస్కెట్లు, ఫర్నీచర్, స్టీల్ సామాను, దుస్తులు ఇలా ఏ వస్తువులైనా అందుబాటు ధరలకే లభిస్తాయి. అన్నీ ఒకేచోట ఉండటం వల్ల నిత్యం జనం తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది డీమార్ట్‌లో చెయ్యకూడని పనులు చేస్తుంటారు. తమను ఎవరూ చూడటం లేదనుకొని అమ్మడానికి ఉంచిన వస్తువులను దొంగిలించడం, లేదా చాక్లెట్లను తినడం వంటివి చేస్తుంటారు. కానీ సీసీటీవీ ఫుటేజీలో మన ప్రవర్తన మొత్తం రికార్డవుతోంది. తాజాగా ఓ వ్యక్తి డీమార్ట్‌లో చేసిన దొంగతనం విచిత్రంగా బయటపడింది. ఇటీవల హనుమంతనాయక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్లోకి వెళ్లాడు. అక్క అమ్మడానికి పెట్టిన కొన్ని చాక్లెట్లను డబ్బులు చెల్లించకుండా తిన్నాడు. అంతేగాకుండా ‘బిల్లు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా? అంటూ వీడియో తీశాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్‌మీడియాల్లో పోస్టు చేశాడు. మంగళవారం ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్ షేక్‌పేట బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లను దొంగిలించిన వహనుమంత్నాయక్తోపాటు అతడి స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అవి గంజాయి చాక్లెట్లే
శంషాబాద్: ఊహించిందే నిజమైంది. అవి గంజాయి కలిపిన చాక్లెట్లేనని నిర్ధారణ అయింది. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో చాక్లెట్లు కొనుగోలు చేసి తిన్న తర్వాత మత్తులోకి జోగడం, వింతవింతగా ప్రవర్తిస్తుండటం తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారమిచ్చిన నేపథ్యంలో గంజాయి చాక్లెట్ల బాగోతం బయటపడింది. విద్యార్థుల వింత ప్రవర్తనతో పాటు మత్తులోకి జారుకునేలా చేస్తున్న చాక్లెట్లు గంజాయి కలిపినవేనని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల దాడులు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ డబ్బాతో పాటు మరో మూడు కిరాణ దుకాణాల్లో శంషాబాద్ ఎస్ఓటీ , కొత్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 కేజీల బరువు కలిగిన ‘చార్మి నార్ గోల్డ్ మునకా’అనే పేరుతో ఉన్న 42 చాక్లెట్ల డబ్బాలు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ 1.30 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యూపీ వయా ఒడిశా? ఒడిశా రాష్ట్రం జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బహేరా( 33) కొత్తూరులోని పరిశ్రమల్లో కార్మి కుడిగా పనిచేసేందుకు కొంత కాలం కిందట వ చ్చాడు. అధికంగా డబ్బులు సంపాదించాలనే దు రాశతో అదే రాష్ట్రానికి చెందిన సోమ్‌నాథ్ బెహ్రే (33) సూర్యమని సాహు (35)తో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించడం మొదలు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఓ పాన్ డబ్బాను ఏర్పాటు చేసి విద్యార్థులకు దానిని నెమ్మదిగా అలవాటుగా మార్చారు. అంతేకాకుండా సమీపంలోని మరికొన్ని కిరాణా దుకాణాల్లో కూడా వాటిని కార్మి కులు, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ. 20 లేదా 30కి విక్రయిస్తున్నారు. చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా మగర్ వారా నెహ్రూబాగ్‌లోని ఏఎం ఫార్మా పేరిట ఉంది. చాక్లెట్ల పై భాగంలో మాత్రం పూర్తి గా హిందీ అక్షరాలతో చార్మి నార్ గోల్డ్ మునకా అని ఉంది. అక్కడ నుంచి ఎలా తీసుకొస్తున్నారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు. చాక్లెట్ ఫ్లేవర్‌తో గంజాయి కలిపి కొంత చక్కెర, బెల్లం వంటి పదార్థాల్లో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి అందులో గంజాయిని కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరైనా ఇలాంటి చాక్లెట్లు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఎస్ఓటీ డీసీపీ రషీద్, శంషాబాద్ అదనపు డీసీపీ రామ్‌కుమార్, శంషాబాద్ ఏసీపీ రాంచందర్‌రావు, కొత్తూరు సీఐ వి.నర్సింహారావు శంషాబాద్ ఎస్ఓటీ సీఐ సత్యనారాయణ కేసును ఛేదించారంటూ డీసీపీ అభినందించారు. -
ఖరీదైన చాక్లెట్ చోరీ.. పరారైన అమ్మాయిల కోసం పోలీసుల గాలింపు!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు అమ్మాయిలు ఒక దుకాణంలో ఖరీదైన చాక్లెట్ చోరీ చేసి పరారయ్యారు. దుకాణదారు తెలిపిన వివరాల ప్రకారం ఆ చాక్లెట్ ఖరీదు రూ.500. ఈ ఘటన మొత్తం సీసీటీవీలొ రికార్డయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ చోరీ పట్టణంలోని డీడీ నగర్ గేట్ వద్దనున్న డిపార్ట్మెంటల్ స్టోర్‌లో జరిగింది. ఈ స్టోర్‌కు వచ్చిన నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయి ఆ చాక్లెట్‌ను తన జీన్స్ ప్యాంటు జేబులో దాచుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమెతో పాటు మిగిలినవారు కూడా పరారయ్యారు. ఈ చాక్లెట్ చోరీ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిలో ఆ ఆమ్మాయి చోరీ ఎలా చేసిందీ రికార్డయ్యింది. కౌంటర్లో డబ్బులు చెల్లించకుండా ఎలా తప్పించుకున్నదీ దానిలో రికార్డయ్యింది. వారు ఇక్కడికి సమీపంలోని ఏదో హాస్టల్‌కు చెందినవారిగా స్టోర్ యజమాని అనుమానిస్తున్నారు. దుకాణదారుని ఫిర్యాదు మేరకు మహరాజ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చాక్లెట్ ఖరీదు రూ. 500 ఉంటుందని దుకాణదారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్టోర్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
విస్తారా విమానంలో బాలికపై పడిన హాట్ చాక్లెట్.. తీవ్ర గాయాలు
ఈ మధ్యకాలంలో విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల చేష్టలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా మరో ఘటన జరిగింది. అయితే ఈసారి ప్రయాణికురాలైన 10 ఏళ్ల చిన్నారిపై విమనయాన సిబ్బంది హాట్ చాక్లెట్ ఒలకబోసింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి ఫ్రంక్ఫర్ట్కు వెళ్తున్న విస్తారా విమానంలో ఆగస్టు 11 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆసల్యంగా వెలుగులోకి వచ్చాయి. రచనా గుప్తా అనే మహిళా తన కూతురితో కలిసి ఫ్రంక్ఫర్ట్కు విస్తారా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఓ కప్పు హాట్ చాక్లెట్‌ని ఆర్డర్ చేసింది. దీనిని తీసుకొచ్చిన సిబ్బంది ప్రమాదవశాత్తూ చిన్నారి ఎడమ కాలుపై పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి, విమానం ల్యాండ్ అయ్యాక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు. ఎయిర్‌హోస్టెస్ తప్పిదం కారణంగాబాలికకు గాయాలైనట్లు గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే జరిగిన ఈ పరిణామానికి విమానయాన సంస్థ కనీసం క్షమాపణలు చెప్పలేదని, వైద్య ఖర్చులు కూడా చెల్లించలేదని ఆమె ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ బిల్లు 503 యూరోలు, ఆసుపత్రి బిల్లు కూడా మేమే కట్టున్నామని గుప్తా తెలిపారు. అంతేగాక ఈ ఘటన ద్వారా లిస్బన్‌కు వెళ్లాల్సిన తమ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యామని ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్‌లైన్స్ ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే, తమ బృందాలు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాయని, వారిని భారత్‌కు తిరిగి వచ్చేందుకు వీలు కల్పించామని, వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాయని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్ట ఘటనలు ఎదురవ్వకుండా చూసుకుంటామని తెలిపింది. చదవండి: మణిపూర్ హింసపై 53 సభ్యులతో సీబీఐ దర్యాప్తు.. బృందంలో 29 మంది మహిళా అధికారులు -
చెర్రీ చాక్లెట్ బాల్స్.. ఒక్కసారి రుచి చూస్తే వదలిపెట్టరు
చెర్రీ – చాక్లెట్ బాల్స్ తయారీకి కావల్సినవి: చెర్రీలు – 3 కప్పులు (గింజలు తీసి, శుభ్రం చేసి, గుజ్జులా చేసుకోవాలి), చాక్లెట్ చిప్స్ – అర కప్పు (ఓవెన్లో క్రీమ్‌లా మెల్ట్ చేసుకోవాలి) వాల్ నట్స్ – 1 కప్పు (మెత్తగా పౌడర్ చేసుకోవాలి) జీడిపప్పులు – పావు కప్పు (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి) ఖర్జూరం గుజ్జు – పావు కప్పు (గింజలు తీసి, ముక్కలు చేసి పెట్టుకోవాలి) ఉప్పు – చిటికెడు, దాల్చినచెక్క పొడి – కొద్దిగా, కొబ్బరి పాలు – 100 గ్రాములు కొబ్బరి తురుము – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి), నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీ బౌల్లో ఖర్జూరం ముక్కలు, 50 గ్రాముల కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో చెర్రీ గుజ్జు, దాల్చినచెక్క పొడి, మిగిలిన కొబ్బరి పాలూ పొసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమంలో చాక్లెట్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కచ్చాబిచ్చాగా చేసుకున్న జీడిపప్పు ముక్కలు, వాల్నట్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నేతిని చేతులకు రాసుకుని.. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. కొబ్బరి తురుముతో లేదా కోకోనట్ బటర్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇవి భలే రుచిగా ఉంటాయి. -
చాక్లెట్ గుట్టలుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..
చాక్లెట్ కొండలు చాక్లెట్ రంగులో కనిపించే ఈ కొండలు ఫిలిప్పీన్స్‌లోని బొహోల్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. భారీ ఎత్తున చాక్లెట్‌ను గుట్టలుగా రాశిపోసినట్లు కనిపించే ఇలాంటి 1776 కొండలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి యాభై కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. బొహోల్ ప్రావిన్స్‌లో ఈ చాక్లెట్ కొండలే ప్రధాన పర్యాటక ఆకర్షణ. వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. యూనెస్కో ఈ కొండలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. వీటిలో రెండు కొండలపై ఇటీవలి కాలంలో టరిస్ట్ రిసార్ట్‌లను ఏర్పాటు చేశారు. గోపురాల్లా తీర్చిదిద్దినట్లు కనిపించే ఈ కొండలు ఒక్కొక్కటి సగటున 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటిలో అతి ఎత్తయిన కొండ 120 మీటర్లు ఉంటుంది. (చదవండి: గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే) -
పిల్లలు ఇష్టపడేలా..చాక్లెట్ పాక్ చేసుకోండి ఇలా..!
చాక్లెట్ పాక్‌కి కావలసినవి: శనగపిండి– ముప్పావు కప్పు కోకో పొడి – పావు కప్పు బెల్లం – కప్పు నీళ్లు – ముప్పావు కప్పు నెయ్యి – ముప్పావు కప్పు పిస్తా పలుకులు – టేబుల్ స్పూను. తయారీ విధానం: శనగపిండి ప్చ వాసన పోయి, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. మందపాటి గిన్నెలో బెల్లం, నీళ్లు వేసి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. శనగపిండి వేగాక కోకో పొడి, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి. పిండి మిశ్రమం వేగాక బెల్లం పాకం పోసి ఉండలు కట్టకుండా తిప్పుతనే ఉండాలి. ఐదారు నిమిషాలు తిప్పాక పిస్తాపలుకులు వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. వెన్న రాసిన ప్లేటులో ఈ వేడివేడి పాకం మిశ్రవన్ని వేయాలి. ఐదు నిమిషాలు ఆరాక నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే చాక్లెట్ పాక్ రెడీ. (చదవండి: ఈ కేక్ చాలా హెల్తీ.. మిల్లెట్స్‌తో చేసుకోండి ఇలా) -
రూ.1,600 కోట్లతో ‘మాండలీజ్ చాక్లెట్స్’ విస్తరణ
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ సంస్థ మాండలీజ్ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. శ్రీసిటీలో ఇప్పటికే రూ.2,078 కోట్లతో 133 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు చేసిన మాండలీజ్.. ఆ యూనిట్లోనే రూ.1,600 కోట్లతో విస్తరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విస్తరణ ద్వారా 57 వేల చదరపు మీటర్ల మేర అభివృద్ధి చేయనున్నామని, తద్వారా ఏటా 2.20 లక్షల టన్నుల కోకోను వినియోగించుకునే సామర్థ్యం వస్తుందని మాండలీజ్ ఇండియా సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ మానేపల్లి తెలిపారు. కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లు విస్తరణలో భాగంగా కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 400 మంది పనిచేస్తుండగా.. విస్తరణ తర్వాత ఉపాధి లభించే వారి సంఖ్య 973కు చేరనుంది. అలాగే.. ఈ యూనిట్ ద్వారా 18 వేల మంది కోకో రైతులకు ప్రయోజనం లభించనుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడు సంవత్సరాల్లో ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ సందర్భంగా వెంకట్ మానేపల్లి మాట్లాడుతూ.. ‘భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థగా మా వృద్ధికి అనుగుణంగా దేశంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించటం పట్ల సంతోషంగా ఉన్నాం. కీలకమైన శ్రీ సిటీ తయారీ యూనిట్ కార్యకలాపాలను విస్తరిస్తూ పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో మరిన్ని విజయాలను నమోదు చేస్తాం’ అని పేర్కొన్నారు. మాండలీజ్ శ్రీసిటీ యూనిట్ ద్వారా క్యాడ్బరీ, బార్నొవిటీ, ఓరియో వంటి బ్రాండ్స్‌కు చెందిన చాక్లెట్లు, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను అందిస్తోంది. -
100 కేజీల డ్రగ్స్ చాక్లెట్లు స్వాధీనం
యశవంతపుర(బెంగళూరు): మంగళూరు నగర డ్రగ్స్ నిఘా విభాగం పోలీసులు 100 కేజీల డ్రగ్స్ పూతగల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాండేశ్వర పోలీసులు మంగళూరు లో కార్స్ట్రీట్, ఫళ్నీర్లో రెండుచోట్ల దాడులు చేసి మత్తు పదార్థాలు పూతపూసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మనోహర్ శేఠ్, చెచ్చన్ సోంకర్ అనేవారిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ కులదీప్ కుమార్ జైన్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నట్లు వివరించారు. మరో ఘటనలో.. తండ్రిని హతమార్చిన కూతురు దొడ్డబళ్లాపురం: మానసిక అస్వస్థురాలైన కుమార్తె.. కన్నతండ్రిని హత్య చేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా నాయిదొళె గ్రామంలో చోటుచేసుకుంది. పుష్ప అనే వివాహిత తండ్రి హుచ్చీరయ్య (68)ను పారతో కొట్టి హత్య చేసింది. మానసిక ఆరోగ్యం బాగా లేకపోవడంతో పుష్ప గత కొంత కాలంగా భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. వైద్యం చేయించుకోక మరింత ముదిరింది. రోజూ తండ్రితో గొడవ పడేది. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగ్గా, ఇంట్లోని పార తీసుకుని ఇష్టానుసారంగా బాదడంతో వృద్ధుడు ప్రాణాలొదిలాడు. చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుష్ప పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఇంత పిచ్చా?....వధువు హెయిర్‌స్టైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక. అందుకే తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లిలో ఓ వధువు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా ఉంటుందని చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తమ పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ముచ్చటపడిపోతుంటారు. అందుకే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఏం చేసినా కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే వినూత్నంగా కనిపించాలని భావిస్తుంటారు. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ ప్రత్యేకం. ఈమధ్య అలా రకరకాల పూలజడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి చాక్లెట్స్‌తో జడను అలంకరించుకుంది. ఇయర్ రింగ్స్,నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్స్‌తో చేసినవే. జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లికూతురి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by chitrasmakeupartist (@_chitras_makeup_artist_28) -
Chocolate: కోకో పౌడర్, గోధుమ పిండి.. చాకొలెట్లు ఇంట్లోనే ఇలా ఈజీగా..
కాలం కరిగిపోతుంది. చాక్లెట్లు కూడా... నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాక్లెట్లనగానే మనకు బయటినుంచి కొనుక్కుని రావడం మాత్రమే తెలుసు. కానీ కాస్త సమయం కరిగిస్తే ... ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాక్లెట్లతో పాటే తీపి జ్ఞాపకాలను కూడా చప్పరించేయొచ్చు. అదెలాగో చూడండి మరి! మిల్క్ చాక్లెట్ కావలసినవి: ►కోకో పౌడర్ – 2 కప్పులు ►చక్కెర – అర కప్పు ►గోధుమ పిండి– పావు టీ స్పూన్ ►బటర్ – ముప్పావు కప్పు (ఉప్పు లేనిది) ►పాలు – ముప్పావు కప్పు ►నీరు – కప్పు. తయారీ: ►కోకో, బటర్‌ను ప్రాసెసర్‌లో మెత్తని పేస్టు చేయాలి. ►ఇప్పుడు పెనం వేడి చేసి పావు కప్పు నీరు పోసి వేసి చేసి అందులో కోకో, బటర్ మిశ్రమం పేస్ట్ ఉన్న పాత్రను ఉంచాలి. ►కోకో మిక్స్ బాగా కరిగిన తర్వాత ఆ పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ వేడి చేయాలి. ►మరిగే స్థాయికి వచ్చిన తర్వాత దించేసి మిశ్రమాన్ని విస్కర్‌తో బాగా చిలకాలి. ►ఇప్పుడు పాలను మరిగించి పిండి, చక్కెర వేసి కరిగే వరకు కలపాలి. ►ఇందులో కోకో మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు మిశ్రమాన్ని చాకొలెట్ మౌల్డ్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్ మ్యాగ్జిమమ్లో ఉంచాలి. ►మిశ్రమం గట్టిపడిన తర్వాత బయటకు తీసి మౌల్డ్ నుంచి వేరు చేయాలి. ►వెంటనే వేరుపడకపోతే ట్రేని గోరువెచ్చని నీటి మీద తేలేటట్లు నాలుగైదు సెకన్ల పాటు ఉంచితే చాక్లెట్లు ట్రే నుంచి విడివడుతాయి. వైట్ చాక్లెట్ కావలసినవి: ►కోకో బటర్– కప్పు ►చక్కెర పొడి– 3 టేబుల్ స్పూన్లు ►పాల పొడి– 3 టేబుల్ స్పూన్లు ►వెనిల్లా ఎసెన్స్– మూడు చుక్కలు. తయారీ: ►ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో కోకో బటర్ ఉన్న పాత్రను పెట్టి కలుపుతూ కరిగించాలి. ►దించిన తర్వాత అందులో చక్కెర పొడి, పాల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి ఉండలు లేకుండా సమంగా కలిగే వరకు కలపాలి. ►ఈ మిశ్రమాన్ని చాక్లెట్ మౌల్డ్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ►మిశ్రమం గట్టి పడడానికి మ్యాగ్జిమమ్ డిగ్రీల్లో అర గంట నుంచి ముప్పావు గంట పడుతుంది. ►ఇంకా త్వరగా కావాలంటే ఫ్రీజర్‌లో పెడితే 20 నిమిషాల్లో చాక్లెట్ తయారవుతుంది. -
వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్’
సాక్షి, వరంగల్ జిల్లా: చాక్లెట్ గొంతులో ఇరుక్కుని వరంగల్ జిల్లాలో ఓ బాలుడు మరణించాడు. కంగర్‌సింగ్ తన ఎనిమిదేళ్ల కుమారుడు సందీప్‌ను స్కూల్ దగ్గర దించి.. ఇటీవలే విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్ ఇచ్చాడు. సందీప్ చాక్లెట్ తీసుకుని పాఠశాల మొదటి అంతస్తులోని తన తరగతి గదికి వెళ్లాడు. చాక్లెట్ తింటూ క్లాస్‌రూమ్‌లోనే సృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం తండ్రికి సమాచారం అందించడంతో కంగర్ సింగ్ స్కూల్‌కు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సందీప్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేదు. ఊపిరి అందక సందీప్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్ వరంగల్‌లో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్ షాపును ఆయన నిర్వహిస్తున్నారు. చదవండి: క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు.. -
చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య
కోల్‌కతా: దొంగతనం చేసిన ఘటన సోషల్ మాధ్యమంలో వైరల్ అయ్యిందన్న అవమానంతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సదరు విద్యార్థి డిగ్రి మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె సెప్టెంబర్ 29న తన చెల్లెలుతో కలసి ఒక షాపింగ్ మాల్కి వెళ్లింది. ఆ సమయంలో సదరు విద్యార్థిని కొన్ని చాక్లెట్లను దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఐతే ఆ తర్వాత ఆమె సదరు షాపు యజమానికి క్షమాపణలు చెప్పి బిల్ పే చేసి వచ్చేసింది. కానీ ఆ ఘటనను సదరు షాపు వాళ్లు వీడియో తీసి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. దీంతో తన కూతురు ఈ అవమానాన్ని భరించలేకా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు బాధితురాలి తండ్రి ఆవేదనగా చెబుతున్నారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని సదరు షాపు వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. అంతేగాదు ఆ వీడియోని ఆన్లైన్ పోస్ట్ చేసి ఆమె మృతికి కారణమైన వాళ్లని గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడమే గాక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ఉరి సీన్ రిహార్సల్లో విషాదం.. పిలగాడు మృతి) -
మార్కెట్లోకి ఐటీసీ కొత్త చాక్లెట్.. ప్రత్యేక టెక్నాలజీతో తయారీ!
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో భాగమైన దేశీ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్ ఫాబెల్ కొత్తగా ఫైనెస్ పేరిట మరో కొత్త చాక్లెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రచారం కోసం ప్రముఖ ఆస్ట్రేలియన్ షెఫ్ ఎడ్రియానో జుంబోతో ఫాబెల్ చేతులు కలిపింది. ది కోకో ఫైనెసర్ అనే ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ చాక్లెట్ కన్నా మృదువైనది తయారు చేసిన వారికి రూ.1 కోటి బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా ఐటీసీ తరఫున ఫాబెల్ సవాలు కూడా విసిరారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
చాక్లెట్ ఎంత పని చేసింది.. తల్లిదండ్రుల కళ్ల ముందే బాలిక మృతి
యశవంతపుర(బెంగళూరు): ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ జరగాల్సిన ఘటనలను మనం మార్చలేము. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటుంటారు. అయినా ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాల బారిన పిల్లలు పడుతుంటారు. తాజాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ ఓ బాలిక మృత్యు ఒడిలోకి చేర్చింది. ఈ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బైందూరు తాలూకా బవళాడిలో సమన్వి (6) అనే బాలికను చాక్లెట్ కవర్ ప్రాణం తీసింది. సమన్వి ఆంగ్ల పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం పాఠశాల బస్ ఎక్కడానికి నోట్లో చాక్లెట్ పెట్టుకుని పరుగులు తీసింది. ఆ తొందరలో కవర్ తీయకుండానే చాక్లెట్ మింగడంతో గొంతుకు అడ్డం పడింది. ఊపిరి ఆడక బస్‌లో స్పృహ తప్పిపడిపోయింది. బాలిక తల్లిదండ్రులు, బస్ డ్రైవర్ బైందూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పాప చనిపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు కళ్ల ముందే తమ కూతురు మరణించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్‌పై నుంచి ఎగిరిపడి బస్సు వెనుక టైర్ కింద.. -
సాల్మొనెల్లా: ఉత్పత్తి నిలిపివేసిన అతిపెద్ద చాక్లెట్ ఫాక్టరీ
న్యూఢిల్లీ: సాల్మెనెల్లా బాక్టీరియానుప్రపంచంలోనే అతిపెద్దది చాక్లెట్ ప్లాంట్‌లో కనుగొన్నారు. బెల్జియం పట్టణంలోని వైజ్‌లోని బెల్గో-స్విస్ దిగ్గజం బెర్రీ కాల్‌బాట్ నిర్వహిస్తున్న చాక్లెట్ ప్లాంట్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియాను గుర్తించామని సంస్థ గురువారం తెలిపింది. దీంతో లిక్విడ్ చాక్లెట్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. దీనిపై బెల్జియం ఆహార భద్రత ఏజెన్సీ కి సమాచారం అందించినట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే చాలా ఉత్పత్తులు ఇప్పటికీ సైట్లో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం కలుషితమైన ఉత్పత్తులను స్వీకరించిన వినియోగదారులందరికి సమాచారమిచ్చామని, తదుపరి నోటీసుల వరకు వైజ్‌లో చాక్లెట్ ఉత్పత్తి నిలిపివేసినట్టు ప్రకటించింది. జూన్ 25 నుండి తమ చాక్లెట్‌తో తయారు చేసిన ఉత్పత్తులను పంపిణీ చేయొద్దని కోరింది. ఆహార పరిశ్రమలోని అనేక కంపెనీలకు కోకో, చాక్లెట్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ముఖ్యంగా హెర్షే, మోండెలెజ్, నెస్లే లేదా యూనీలీవర్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇందులో ఉన్నాయి. 2020-2021 ఆర్థికసంవత్సరంలో కంపెనీవార్షిక అమ్మకాలు 2.2 మిలియన్ టన్నులు. ఈ కంపెనీ గ్రూపులో13 వేలకు పైగా ఉద్యోగులుండగా, ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. కాగా గత ఏడాదిలో అమెరికాలో సాల్మొనెల్లా వ్యాధి విస్తరణ వణికించిన సంగతి తెలిసిందే. ఈ బాక్టీరియాతో జ్వరం, వాంతులు, డయేరియా, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది ప్రాణంతక వ్యాధి కాదు. -
ఈ జిరాఫీని తినొచ్చు
మీరు చదివింది నిజమే. ఈ జిరాఫీని తినేయొచ్చు. అడవుల్లో ఆకు లు, అలములు తిని బతికే జిరాఫీని మనం తినడం ఏంటి అని తిట్టుకుంటున్నారా? అపార్థం వద్దు.. ఎందుకంటే ఇది చాక్లెట్ జిరాఫీ. ఈవారం ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఈ జిరాఫీని జూమార్ఫిక్ కలినరీ ఆర్ట్స్‌లో నిపుణుడైన అమౌరీ గుయ్‌చాన్ రూపొందించాడు. 8.3 అడుగుల పొడవైన ఈ జిరాఫీని పూర్తిగా వందశాతం చాక్లెట్‌తోనే తయారు చేశారు. దూరం నుంచి చూస్తే నిజమైన జిరాఫీని తలపిస్తున్న దీన్ని దగ్గరికి వెళ్తేగానీ శిల్పమని గుర్తించలేం. చాక్లెట్‌తో ఇప్పటికే సింహం, పులిలాంటి జంతువులను, మరెన్నో సముద్ర జీవులను, టెలిస్కోప్, క్లాక్ వంటి క్లాసిక్ వస్తువులను, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని సైతం రూపొందించిన అమౌరీ... ఇంత పెద్ద జంతువును తయారు చేయడం ఇదే మొదటిసారి. 72.5కిలోల బరువున్న ఈ జిరాఫీని రూపొందించడానికి ఏడురోజుల సమయం పట్టిందట. చాక్లెట్‌తో మరెన్నో తయారు చేయొచ్చని చెబుతూ... అమౌరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తయారీ వీడియోను 8కోట్ల మంది చూశారు. -
118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా?
సాక్షి, సెంట్రల్ డెస్క్: ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? అంటే.. రోజూ వ్యాయామం చేయాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవాలి.. ఇలా రకరకాలుగా చెబుతూనే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా (118 ఏళ్లు) ఇటీవలే గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ నన్ సిస్టర్ ఆండ్రే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? ఆమె రోజు తీసుకునే చాక్లెట్, ఓ గ్లాస్ వైన్. ఆండ్రే నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్న డేవిడ్ టవెల్లా ఇదే చెబుతున్నారు. ‘ఆండ్రూ రోజూ తీసుకునే గ్లాస్ వైన్ వల్లే తాను జీవిత కాలం పెరగడానికి కారణమేమో. నేను మాత్రం వైన్ తాగమని ఎవరికీ సలహా ఇవ్వను’ అని డేవిడ్ అంటున్నారు. గతంలో ఎక్కువ వయసున్న వ్యక్తి రికార్డు జపాన్‌కు చెందిన కేన్ టనక పేరిట ఉండేది. తాను ఈ ఏడాది ఏప్రిల్ 19న మరణించారు. దీంతో ఈ రికార్డు ఆండ్రే సొంతమైంది. కరోనా బారిన పడి కోలుకున్న పెద్ద వయస్కురాలిగా కూడా ఆండ్రే రికార్డుకెక్కారు. -
సులువులైన చిట్కాలతో చాక్లెట్ సమోసా-అంజీర్ హల్వా
చాక్లెట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 1 కప్పు, పంచదార పొడి – 5 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, డార్క్ చాక్లెట్ పౌడర్ – 1 కప్పు, పిస్తా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ పంచదార పాకం – అభిరుచిని బట్టి (అప్పటికప్పుడు కావాల్సినంత పంచదార, నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్లో మైదాపిండి, నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, నీళ్లు పోసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని ఓ పావు గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో చాక్లెట్ పౌడర్, పంచదార పౌడర్, పిస్తా ముక్కలు వేసుకుని అటు ఇటుగా కలిపి.. పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఫ్రిజ్‌లోంచి మైదా ముద్దను తీసి.. చిన్న చిన్న పూరీల్లా చేసుకుని.. ప్రతి పూరీలో కొంత చాక్లెట్ మిశ్రమం పెట్టుకుని సమోసాలా చుట్టుకోవాలి. అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని.. ఒకవైపు నూనె కళాయి, మరోవైపు పంచదార పాకం ఉన్న కళాయి పెట్టుకుని సమోసాలను నూనెలో దోరగా వేయించి.. వెంటనే పాకంలో వేసి తీసుకోవాలి. ఒకవేళ పాకంలో వేసుకోవడం ఇష్టం లేకుంటే చాక్లెట్ సాస్ని పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంజీర్ హల్వా కావలసినవి: డ్రై అంజీర్ – 400 గ్రా.(నానబెట్టి, ముక్కలు చేసుకోవాలి) బియ్యప్పిండి/మొక్కజొన్న పిండి – 5 టేబుల్ స్పూన్లు(5 టేబుల్ స్పూన్ల నీళ్లనూ జతచేసి బాగా కలుపుకోవాలి), నెయ్యి – 9 టేబుల్ స్పూన్లు లేదా అంతకు మించి, పచ్చిపాలు – అర కప్పు, పంచదార – అభిరుచిని బట్టి, ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్ కలర్), యాలకుల పొడి – కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి కాగానే.. అందులో బియ్యప్పిండి/మొక్కజొన్నపిండి మిశ్రమం వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు పోసుకుని చిన్న మంటపైన గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో అంజీర్ ముక్కలు, ఫుడ్ కలర్ వేసుకుని మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొద్దిగా పంచదార వేసుకుని, మిగిలిన నెయ్యి కూడా వేసుకుని గరిటెతో కలుపుతూ దగ్గర పడే సమయంలో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవచ్చు లేదా.. నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్‌తో కలిసి తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా. -
సక్సెస్‌స్టోరీ..:ఎకో–ఫ్రెండ్లీ ఫ్రెండ్స్
‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది’ అనే మాటను వింటూనే ఉన్నాం. ఈ ముగ్గురు కుర్రాళ్ల జీవితాన్ని మార్చేసి, అంకుర దిగ్గజాలుగా మార్చింది మాత్రం ఒక చాక్లెట్ రేపర్. అదేలా అంటే... ‘విజయానికి దారి ఏమిటి?’ అని మల్లగుల్లాలు పడుతుంటాంగానీ కొన్నిసార్లు పరిస్థితులే విజయానికి దారి చూపుతాయి. ముగ్గురు మిత్రులు, మూడు సంవత్సరాల క్రితం... అక్షయ్ వర్మ, ఆదిత్య రువా, అంజు రువా ఆరోజు చెమటలు కక్కుతూ ముంబైలో బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ ఎండలో వారికి తళతళ మెరుస్తూ ఒక ఒక చాక్లెట్ బ్రాండ్ ప్లాస్టిక్ రేపర్ కనిపించింది. ఆ బ్రాండ్ తన ఉత్పత్తులను 1990లోనే ఆపేసింది. రేపర్ మాత్రం ‘నిను వీడని నీడను నేను’ అన్నట్లుగా చూస్తోంది. కాలాలకు అతీతంగా పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్‌పై ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి చర్చ, ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘బెకో’ అనే స్టార్టప్. వెదురు, ప్లాంట్ బేస్డ్ ఇన్‌గ్రేడియంట్స్‌తో పర్యావరణహితమైన వస్తువులు, ఫ్లోర్ క్లీనర్స్, డిష్‌వాషింగ్ లిక్విడ్లాంటి కెమికల్ ఫ్రీ డిటర్జెంట్స్, గార్బేజ్ సంచులు, రీయూజబుల్ కిచెన్ టవల్స్, టూత్‌బ్రష్‌లు... మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది బెకో. దీనికి ముందు... పెట్ యాజమానుల కోసం ‘పెట్ ఇట్ అప్’ అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు అక్షయ్ వర్మ. కో–ఫౌండర్ జారుకోవడంతో ఒక సంవత్సరం తరువాత అది మూతపడింది. ఇక ఆదిత్య కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్–ఆర్గనైజేషన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ వెంచర్‌ను అమ్మేశాడు. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. ఈ ముగ్గురు కలిసి ప్రారంభించిన ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ మొదట్లో తడబడినా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఊపందుకుంది. ఆన్లైన్ మార్కెట్ప్లేసులతో పాటు, ముంబై, బెంగళూర్లలో దీనికి ఆఫ్‌లైన్ స్టోర్లు ఉన్నాయి. ‘బెకో’లో క్లైమెట్ ఎంజెల్స్ ఫండ్, టైటాన్ క్యాపిటల్, రుకమ్ క్యాపిటల్...మొదలైన సంస్థలు పెట్టుబడి పెట్టాయి. ‘లాభాల కోసం ఆశించి ప్రారంభించిన వ్యాపారం కాదు. ఒక లక్ష్యం కోసం ప్రారంభించింది. వీరి తపన చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరనే నమ్మకం కలుగుతుంది’ అంటున్నారు ‘రుకమ్ క్యాపిటల్’ ఫౌండర్ అర్చన జాహగిర్దార్. పర్యావరణ ప్రేమికురాలు, ప్రసిద్ధ నటి దియా మీర్జా ఈ ముగ్గురి భుజం తట్టడమే కాదు, కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు. ముగ్గురు మిత్రులు అక్షయ్ (26), ఆద్యిత (26), అంజు (27) ముక్తకంఠంతో ఇలా అంటున్నారు... ‘భూగోళాన్ని పరిరక్షించుకుందాం అనేది పర్యావరణ దినోత్సవానికి పరిమితమైన నినాదం కాదు. పర్యావరణ స్పృహ అనేది మన జీవనశైలిలో భాగం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకో–సెన్సిటివ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారుల్లో 85 శాతం యువతరమే. పర్యావరణహిత వస్తువులను ఆదరించే ధోరణి పెరిగింది’ పర్యావరణహిత ఉత్పత్తుల మార్కెట్ రంగంలో ‘బెకో’ లీడింగ్ ప్లేయర్ పాత్ర పోషించనుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో ‘బెకో’ను 500 కోట్ల రూపాయల బ్రాండ్‌గా చేయాలనేది ముగ్గురు మిత్రుల ఆశయం. అది ఫలించాలని ఆశిద్దాం. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. -
Chocolate Day 2022: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
-
వాలెంటైన్స్ డే వీక్: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
ఏడు రోజుల వాలంటైన్స్ డే వీక్ జోరుగా..హుషారుగా సాగుతోంది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన వాలంటైన్స్ డే క్రమంగా విశ్వవ్యాపితమైంది. ఎక్కడ చూసినా... వాలెంటైన్స్ సందడి. ప్రేమ కోసం, ప్రేమ కొరకు ,ప్రేమతో అంటూ లవ్‌బర్డ్స్ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తారు.. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? ‘ప్రేమ’ అటే మ్యాజిక్.. అదో మాయ. మాటల్లో వర్ణించలేని తీయని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ డే వీక్‌లో చాకోలెట్ డే చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 9న అత్యంత మధురంగా జరుపుకునేదే చాకొలెట్ డే. అలాంటి స్వీటెస్ట్ డే కోసం ప్రేమజంటలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడితే.. పెళ్లి తరవాత తన జీవిత భాగస్వామితో ఈ చాక్లెట్ డే ఎంజాయ్ చేయవచ్చు. ప్రేమ భావన తరువాత మన మనసును ఆహ్లాదంగా, తీపి చేసేవి చాకోలెట్లే! మరి అలాంటి చాకొలెట్స్ను ప్రేమించిన వ్యక్తికి షేర్ చేయకుండా ఎలా ఉంటారు. నో. వే ..కదా.. రకరకాల ప్రేమ చాక్లెట్లు, డార్క్ చాకోలెట్లు.. అబ్బో.. చాలానే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిలో మీ టేస్ట్‌కు తగ్గట్టుఎంచుకుని మీ వాలెంటైన్ స్వీట్ మూడ్‌లోకి తీసుకెళ్లండి. చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతే కాదు ప్రేమికులు ఎక్కువగా ఇచ్చుకునే గిప్ట్ కూడా చాక్లెట్ అనే చెప్పుకోవాలి. అసలు చాక్లెట్ చూడగానే మనసు తేలికపడుతుంది. చాక్లెట్ తింటే డిప్రెషన్ హుష్ కాకి అవుతుంది. మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా మారిపోయి మెదడు పనితీరునీ మెరుగు పరుస్తుందట. సో.. అలిగి కోపంతో రగిలిపోతున్న ప్రేయసినీ లేదా ప్రియుడిని చాకొలెట్ ఇచ్చి కూల్ చేసేయండి.. బీపీని కంట్రోల్ చేయడానికి చాక్లెట్ దివ్య ఔషధమని చాలా స్టడీస్ చెప్పాయి. ఖరీదైన గిప్ట్స్ ఇవ్వలేని ఆనందాన్ని ఒక చిన్న చాక్లెట్‌తో పొందవచ్చు. హ్యాపీ చాక్లెట్ డే.. ఫిబ్రవరి 14న వచ్చే వాలంటైన్స్ డే రోజు ప్రేమజంటలు ఫుల్బీజీ. అసలు 7 రోజుల వాలంటైన్స్ వీక్ సందడి షురూ అవుతుంది. రోజ్ డేతో మొదలైన వాలెంటైన్స్ వీక్ కిస్ డే తో ముగుస్తుంది. చివరిగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే గాసెలబ్రేట్గా చేసుకుంటారు. -
అందరినీ ఆకట్టుకుంటున్న చాక్లెట్ బొకేలు
-
Diwali: ఈ టపాసులు తినెయ్యొచ్చు
మండపేట: చిచ్చుబుడ్లు.. వెన్నముద్దలు.. లక్ష్మీ ఔట్లు.. భూచక్రాలు.. రాకెట్లు.. ప్రమిదలు.. ఇవన్నీ నిజమైన దీపావళి బాణ సంచా అనుకుంటే పొరబాటే. బాణ సంచాను తలపించే మధురమైన చాక్లెట్లు. వినూత్న రీతిలో బోకేల తయారీ ద్వారా శుభాకాంక్షలు తెలపడంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు మండపేటకు చెందిన రోటరీక్లబ్ సభ్యురాలు మల్లిడి విజయలక్ష్మి. (చదవండి: దీపావళి రోజున ఇలా చేయండి) ఇంటి వద్దనే ప్లెయిన్, ఎనర్జీటిక్ బార్స్, లాలీపప్స్ తదితర చాక్లెట్లతో అందమైన ఆకృతుల్లో బొకేలు తయారుచేస్తూ పలువురికి ఉపాధి చూపిస్తున్నారు. పూలబొకేలు రెండు మూడు రోజుల్లో వాడిపోతే ఈ చాక్లెట్ బొకేలు రెండుమూడు వారాలు నిల్వ ఉండటంతో పాటు ఆత్మీయులకు మాధుర్యాన్ని అందిస్తూ వారి ఆదరణ చూర గొంటున్నాయి. భర్త శ్రీనివాసరెడ్డి రోటరీ గవర్నర్ కాగా వీటిపై వచ్చే ఆదాయంతో ఆయనతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు విజయలక్ష్మి. (చదవండి: తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్) -
చాక్లెట్ డ్రెస్సుల్లో అందాల ముద్దుగుమ్మలు
-
చాక్లెట్ గణేశ్.. పిల్లలకు పలహారం..
పంజాబ్: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ప్రారంభమైనాయి. పర్యావరణ ప్రేమికులు విభిన్న రకాల కాలుష్యరహిత విగ్రహలను రూపొందించి తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ కుక్రెజా మాత్రం ఇంకొంచెం వెరైటీగా ఆలోచించాడు. చాక్లెట్ గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి, పాలల్లో నిమజ్జనం చేసి, ఈ పాలను పేదపిల్లలకు పంచి పెట్టే వినూత్న కార్యక్రమాన్ని 6 యేళ్ల క్రితమే చేపట్టాడు. వృధాని అరికట్టి, పర్యావరణానికి హితం చేకూరేలా ఉన్న ఇతని ఆలోచనను అందరూ ప్రశంశిస్తున్నారు. కాగా ఈ యేడాది కూడా 2 వందల కిలోల బెల్జియం డార్క్ చాక్లెట్లతో గణేశ్ విగ్రహాన్నితయారు చేసినట్టు గురువారం మీడియాకు వెల్లడించారు. ప్రతి వినాయక చవితికి చాక్లెట్‌తో ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాన్ని తయారు చేస్తున్నామని, ఈ విధంగా 2016 నుంచి చేస్తున్నామని అన్నారు. అయితే ఈ యేడాది విగ్రహాన్ని మాత్రం ప్రొఫెషనల్ షెఫ్ టీమ్ పది రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. ఇది అంత తేలికైన విషయం కాదని, తయారు చేసే సమయంలో ఏ కొంచెం లోపం తలెత్తినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించేవారని తెలియజేశారు. కానీ దేనిమీదైనా అత్యంత అభిమానం ఉన్నట్లయితే, కష్టం కూడా సరదాగానే ఉంటుందని అన్నారు. చాక్లెట్‌తో తయారు చేసిన ఈ గణేశ్ విగ్రహాన్ని మూడో రోజు 45 లీటర్ల పాలల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. అనంతరం ఆ పాలను పేద పిల్లలకు పంచిపెడతామని అన్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతీ యేట దాదాపుగా 5 వందలకుపైగా పిల్లలకు ఒక్కొక్కరికి గ్లాసెడు చాక్లెట్ మిల్క్ పంచుతున్నామని తమ అనుభవాలను పంచుకున్నారు. -
200 కిలోల బెల్జియం చాక్లెట్ తో గణపతి
-
రోడ్డుపై గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు..
నెల్లూరు: మనలో చాలా మందికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్‌ను ఇష్టంతో తింటుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి స్నేహితులు.. ప్రేమికుల మధ్య ఏదైన చిరుకోపాలు వచ్చినప్పుడు చాక్లెట్లు ఇచ్చి వారి మనస్సును కూల్ చేసేస్తారు. అందుకే, ప్రేమికుల దినోత్సవానికి ముందు లవర్స్ చాక్లెట్డేను కూడా జరుపుకుంటారు. అయితే, ఇలాంటి చాక్లెట్లు రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పడికనిపించాయి. వివరాలు.. నెల్లూరులోని ఏసీ నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు.. రోడ్డు పక్కన చాక్లెట్లు, ప్రోటిన్ పౌడర్లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. ఈ క్రమంలో వారు ఇంటికి వెళ్లి చూడగా.. ఆ చాక్లెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. అయితే, ఈ సంఘటనతో షాక్‌కు గురైన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పారిశుద్ధ్య అధికారులు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఈ చాక్లెట్లో షుగర్ ఉందా, 200 మంది డాక్టర్లతో చర్చలు చివరికి ఇలా
స్వీట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్ బ్రేక్ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్ డయాబెటిస్ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పార్టీలకు... చెక్.. స్వీట్లకు... కట్ పార్టీలకు... చెక్..స్వీట్లకు.... కట్... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్లో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్ పేస్ట్ యాడ్ లా.. ఈ చాక్లెట్ లో షుగర్ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ మార్కెట్టులో ‘షుగర్–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్ ఫ్రెండ్లీ చాక్లెట్’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్–ఫ్రీ చాక్లెట్ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్లు, ఫుడ్సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు. ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ టాప్ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్’ చెఫ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి టాక్ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్ 30–ఫోర్బ్స్ ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ కెడియ పేద డయాబెటిక్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా హర్ష్ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్లో మంచి టాక్ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్ కేడియ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు. -
ఛీ..ఛీ మీకిదేం పాడు బుద్ది
ఇస్లామాబాద్: దౌత్యవేత్త అంటే ఎంతో బాధ్యతగా మెలగాలి. ఓ దేశ పరువు ప్రతిష్టలు వారి భుజాల మీద ఉన్నట్లు అర్థం. అందుకే వారు తమ మాటలు, చేతలు విషయంలో చాగా జాగ్రత్తగా ఉండాలి. స్వదేశంలో ఎలా ఉన్నా ఏం కాదు.. కానీ విదేశాలకు వెళ్లినప్పడు ఏ చిన్న తప్పు చేసినా.. దేశ ప్రతిష్టకు భంగం కలగకమానదు. అలాంటిది పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఇద్దరు విదేశీ పర్యటనలో తన చేతివాటం చూపారు. చాక్లెట్స్, టోపీ దొంగిలించి అడ్డంగా బుక్కయ్యారు. దక్షిణ కొరియా పర్యటనలో సదరు అధికారులు ఈ పని చేశారు. కొరియా టైమ్స్ రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పాక్ దౌత్యవేత్తలు ఈ ఏడాది జనవరి 10న, ఫిబ్రవరి 23న దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత కొరియా వెళ్లిన అధికారి సుమారు 750 రూపాయలు విలువ చేసే టోపి దొంగతనం చేయగా.. మరొకరు సుమారు వంద రూపాయలు విలువ చేసే చాక్లెట్స్ దొంగిలించినట్లు కొరియా అధికారులు తెలిపారు. ఇక అధికారుల చేతి వాటానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీకెమరాల్లో రికార్డయ్యాయి. ఇక దొంగతనం జరిగిన షాపు యమజానులు దీని గురించి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారుల చేతి వాటం బయటపడింది. దర్యాప్తు తరువాత, దౌత్యపరమైన ప్రోటోకాల్ కారణంగా అధికారులు సదరు నిందితులపై కేసు బుక్ చేయకుండా వదిలేశారు. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ ప్రకారం, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు తమ ఆతిథ్య దేశంలో అరెస్టు, నిర్బంధం, నేరారోపణల నుంచి మినాహాయింపు పొందవచ్చు. చదవండి: పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా? -
‘చాక్లెట్’ పంట.. ఏపీ వెంట
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంటగా పిలిచే ‘కోకో’ సాగును రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాలతో పాటు పానీయాలు, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ‘కోకో’కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కోకో సాగుతో పాటు ఉత్పాదకతలోనూ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గడచిన రెండేళ్లలో కొత్తగా 8 వేల హెక్టార్లలో విస్తరించిన ఈ సాగును రానున్న మూడేళ్లలో కనీసం 15 వేల హెక్టార్లలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 1990లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా ప్రారంభించిన కోకోను ఆ తర్వాత ఆయిల్‌పామ్ తోటల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న ఈ పంట తాజాగా కోస్తా, రాయలసీమ జిల్లాలకూ విస్తరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,199 హెక్టార్లలో ఇది సాగవుతుండగా.. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 22,015 హెక్టార్లలో విస్తరించింది. బహుళ ప్రయోజన పంటగా.. నాటిన మూడో ఏడాది నుంచి మొదలయ్యే కోకో దిగుబడి కనీసం 40 ఏళ్లపాటు కొనసాగుతుంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేసే కోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి రెండు టన్నుల ఆకులు రాలి నేలలో కలిసిపోతాయి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమిపై ఏర్పడే ఆకుల పొర వల్ల కలుపు శాశ్వతంగా నిర్మూలించబడుతుంది. ఇదే సందర్భంలో తోటల్లోని భూమిలో తేమ శాతం నిలిచి ఉండి ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. పైగా కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో పిందె రాలిపోవడాన్ని నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగు చేయడం వల్ల ప్రధాన పంటల్లో 20 శాతం దిగుబడి పెరుగుతుందని సీటీఆర్ఐ స్పష్టం చేసింది. ఏలూరులో కోకోవా, వెనీలా ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు సాగు ఖర్చుల కింద మూడేళ్ల పాటు హెక్టారుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. సూక్ష్మ సేద్య పరికరాలపై చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఇదిలావుండగా.. ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. మూడెకరాల్లో కోకో వేశా ప్రభుత్వం ప్రోత్సాహంతో అంతర్ పంటగా గతేడాది 3 ఎకరాల్లో కోకో మొక్కలు నాటాను. ఉద్యాన శాఖ అధికారులు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. – కె.గంగాధర్, రామన్నగూడెం, ప.గోదావరి రైతుల ఇంటి వద్దే కొనుగోలు కోకో సాగు విస్తరణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. రైతులకు అన్నివిధాలుగా సాంకేతిక సహకారం అందిస్తున్నాం. రైతుల ఇంటి వద్దకే వెళ్లి కోకో కాయలను కొనుగోలు చేస్తున్నాం. – ఎ.రవీంద్రరావు, అసిస్టెంట్ మేనేజర్, క్యాడ్బరీ ప్రభుత్వం ప్రోత్సాహం కోకో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పూర్తి స్థాయిలో కోకోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. – పావులూరి హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
ధోనీ పేరుతో కొత్త రకం చాక్లెట్
ముంబై: మార్కెట్లో ఫేమ్, నేమ్ ఉంటే చాలు బిజినెస్ చేయడానికి చాలా మార్గాలే ఉన్నాయి. దీన్నే ఇప్పడు ‘7 ఇంక్‌బ్రూస్’ అనే చాక్లెట్ కంపెనీ పాటిస్తోంది. అది ఎలా అంటారా..టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరుతో ఈ కంపెనీ చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ధోనీకి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను ఇలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తన క్రేజ్ కూడా. ఇక ధోనీ ఆట అంటే ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది అతని వైవిధ్యమైన హెలికాప్టర్ షాట్. దీనికే ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. కనుకే ముంబైకి చెందిన ‘7 ఇంక్‌బ్రూస్’ అనే పుడ్ అండ్ బెవరేజస్ స్టార్టప్ కంపెనీ, తయారు చేస్తున్న చాక్లెట్లకు ‘కాప్టర్ 7’ అని పేరు పెట్టింది. ఇక వాటి ప్యాకేజింగ్, లేబులింగ్ వంటివి ఈ చాక్లెట్‌కు అదనపు అందాన్ని జోడించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇది ధోని విభిన్న జెర్సీలు వాటి రంగులతో వీటి లేబుల్‌ను తయారు చేస్తున్నారు. వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ భగ్చందని మాట్లాడుతూ ధోనీ లక్షణమైన “అన్డైయింగ్ ‘కాన్ట్ స్టాప్, వోన్ట్ స్టాప్’ స్పిరిట్ ’ క్యాప్షన్ ను బ్రాండ్‌గా వాడాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇవి ముంబై, గోవా, బెంగుళూరులో అందుబాటులలోకి రాగా, త్వరలో జార్ఘండ్, యూపీ, హర్యానా, పంజాబ్ లోనూ దొరకనున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలో ధోనీ కూడా భాగస్వామ్యం కావడం విశేషం. 7 ఇంక్ బ్రూస్ వంటి సంస్థకు వాటాదారునిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం నాకు నిజంగా సంతోషంగా ఉందంటూ ” పత్రికా ప్రకటనలో ధోని పేర్కొన్నారు. ( చదవండి: IPL2021: చెన్నై జట్టుకు క్షమాపణలు చెప్పిన స్కాట్ స్టైరిస్ ) -
రాణిగారి ‘తీపి’ బహుమతికి 121 ఏళ్లు..
ఎప్పుడో ఒకసారి మనకు బుద్ధి పుట్టినప్పుడు అటకెక్కి చూస్తే అబ్బురపరిచే అలనాటి వస్తువులు గత జ్ఞాపకాలెన్నింటినో తట్టి లేపుతాయి. తాజాగా బ్రిటన్‌లో 121 ఏళ్ల నాటి చాక్లెట్ బార్ ఒకటి దొరికింది. వందేళ్ల తరువాత దొరికిన ఈ చాక్లెట్ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. తూర్పు ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్లో ఓ ఇంట్లో అటకపై ఉన్న హెల్మెట్‌లో చాక్లెట్బార్ కనిపించింది. ఈ చాక్లెట్ ‘సర్ హెన్రీ ఎడ్వర్డ్ పాస్టన్ బేడింగ్ ఫీల్డ్’ అనే సైనికుడిదని యునైటెడ్ కింగ్డమ్ ద నేషనల్ ట్రస్టు ధ్రువీకరించింది. 1899, 1902 లలో రెండో బోయర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరాడుతున్న బ్రిటిష్ దళాలను ప్రోత్సహించేందుకు. క్వీన్ విక్టోరియా ఒక చిన్న బాక్స్‌లో చాక్లెట్ పెట్టి..‘సౌత్ ఆఫ్రికా 1900! ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్’ అని విక్టోరియా స్వదస్తూరిని రేపర్ మీద ముద్రించి బ్రిటిష్ దళాలకు పంపింది. ఈ చాక్లెట్ బరువు 226 గ్రాములు. అయితే గతేడాది సర్ హెన్రీ (100) మరణించడంతో ఆయన కుమార్తె హెన్రీకి సంబంధించిన వస్తువులను పరిశీలించగా ఈ చాక్లెట్ బయటపడింది. ఇప్పుడు ఈ చాక్లెట్‌ను ఇంగ్లాండ్ వారసత్వ సంపదగా భద్రపరుస్తున్నట్లు నేషనల్ ట్రస్టు ప్రకటించింది. బ్రిటిష్ సైనికులకు చాక్లెట్లు సరఫరా చేసేందుకు క్వీన్ విక్టోరియా మూడు చాక్లెట్ కంపెనీలను సంప్రదించారు. దీనికి ఆ కంపెనీలు ఎటువంటి రుసుమును తీసుకోకుండా చాక్లెట్‌ను తయారు చేసి ఇస్తామని చెప్పి అలానే ఇచ్చాయి. అంతేగాకుండా తమ కంపెనీ బ్రాండ్ నేమ్‌ను ఎక్కడా కనిపించనియ్యలేదు. పేరులేని బాక్సుల్లో చాక్లెట్‌ను పెట్టి సైనికులకు ఇచ్చారు. అయితే దక్షిణాఫ్రికాపై నియంత్రణ సాధించడానికి గ్రేట్ బ్రిటన్.. రెండు స్వతంత్ర బోయర్ రాష్ట్రాలపై యుద్ధాలు చేసింది. రెండవ బోయర్ యుద్ధం 1899–1902 మధ్య కాలంలో జరిగింది. 1902 మేనెలలో బోయర్ పక్షం బ్రిటిష్ నిబంధనలను అంగీకరించి, వెరెనిగింగ్ ఒప్పందంపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. -
ప్రేమకు ఓకే చెప్పట్లేదా? వెంటనే ఈ పని చేయండి
ప్రేమికులన్నాక అలకలు, కోపాలు కామన్.. వారిని కూల్ చేయడంలో చాక్లెట్ కీ రోల్ ప్లే చేస్తోందట.. అందుకే దానికి వాలంటైన్స్ వీక్‌లో ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. ఈ రోజు(ఫిబ్రవరి 9)ను లవర్స్ చాక్లెట్ డేగా జరుపుకుంటారు. వీరప్రేమికుల్లా ఊరికే రంగంలోకి దిగితే సరిపోదు. స్వచ్ఛమైన ప్రేమను కనబరస్తూ చాకెట్లు ఇస్తే ఫలితం ఉంటుంది. అమ్మాయిలు కరిగిపోతారు. అదెలా సాధ్యమంటారా? అయితే ఇది చదివేయండి. అమ్మాయిలకు, చాక్లెట్లకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారు మన ఎదుట ఉంటే కళ్ళలో మెరుపు, మనసుకు ఆనందం ఎలా పుట్టుకొస్తాయో... అలాంటి ఫీలింగే చాక్లెట్‌తో కూడా కల్గుతుందట. మరీ ముఖ్యంగా డార్క్ చాక్లెట్ మనసును ఉల్లాసంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. పైగా దీన్ని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టంగా తింటారు. ప్రేమికులైతే ఒకరిపై మరొకరు అలిగినా, చిన్నపాటి కోపాలతో ముఖం మాడ్చుకున్నా చాక్లెట్ ఇచ్చి ఎదుటివారిని ఈజీగా కూల్ చేస్తుంటారు. ప్రేమికుల రోజు మొదలు, పుట్టినరోజు, పెళ్ళిరోజు.. ఇలా ప్రతి వేడుకలో చాక్లెట్ తప్పకుండా ఉండాల్సిందే. పశ్చిమ దేశాలలో చాక్లెట్‌ను దేవాతాహరంగా చెబుతారు. అందుకే మీరు ఆరాధించే అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే ఇట్టే బుట్టలో పడిపోతారు. విభిన్న చాక్లెట్లు ► చాక్లెట్లు తెలుపు, డార్క్ విభిన్న రంగులలో లభిస్తున్నాయి. ► వీటిని కోకో చెట్ల నుంచి లభించే కాయల నుంచి తయారు చేస్తారు. ► విభిన్న ఆకారాలలో, అనేక ఫ్లేవర్స్‌లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. ► చాక్లెట్లను కాఫీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీంలు వంటి వాటిల్లోనూ ఉపయోగిస్తారు. ► చాకలెట్లను సింపుల్ టెక్నిక్‌తో ఇంటిదగ్గర కూడా తయారు చేయవచ్చు. చాక్లెట్ ఉపయోగాలు: ► చర్మం కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది. ► అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోయేలా చేస్తోంది. ► శారీరక బరువును తగ్గించడంతోపాటు, మానసికం ఉల్లాసానికి కారణమవుతుంది. ► ఒక చాక్లెట్ తిన్నాక మెదడు 2 నుంచి 3గంటలు ఆక్టివ్‌గా పనిచేస్తోందట. ► డార్క్ చాక్లెట్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలూ, అమ్మాయిలూ.. వెంటనే ఆలస్యం చేయకుండా ఓ చాక్లెట్ కొనేయండి. ప్రియుడి/ ప్రేమికురాలి నోరు తీపి చేసేయండి. వారి మనసు దోచేయండి. ఆల్ ద బెస్ట్!! చదవండి: ప్రపోజ్ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే! -
గాన గంధర్వుడికి అపూర్వనివాళి
పుదుచ్చేరి: 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సంగీతాభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసిన వార్త గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం. కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన సెప్టెంబర్ 25న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా పుదుచ్చేరిలోని ఒక బేకరి సంస్థ బాలుకి విభిన్నంగా నివాళులర్పిస్తోంది. చాక్లెట్‌తో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేసే సాంప్రదాయాన్ని పాటిస్తున సంస్థ తాజాగా ఎస్పీబీకి నివాళిగా ఏకంగా 339 కిలోలతో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న చాక్లెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఒక శకం ముగిసింది!) పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకోవడం ఏర్పాటు చేయడం జునిక బేకరీకి అలవాటు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రాహాన్ని కూడా పూర్తిగా చాక్లెట్‌తో మాత్రమే రూపొందించి ప్రదర్శనకు ఉంచింది. ఇది జనవరి 3వరకు ప్రదర్శనలో ఉంటుందని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసిన చెఫ్ రాజేంద్రన్ చెప్పారు. 339 కిలోల బరువున్నఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటలు పట్టిందని తెలిపారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో బేకరీ యజమాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కోయంబత్తూరులో సిరితుళి అనే స్వచ్ఛంద సంస్థ ఎస్పీబీ వనం పేరుతో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పనస, మామిడి, ఎర్ర చందనం, సాండర్స్, టేకు, రోజ్‌వుడ్, వెదురు, మహోగనితోపాటు ఇతర చెట్లను పెంచనున్నారు. కాగా ఇంతకుముందు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలం చాకొలెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 600 కిలోలసూపర్ స్టార్ రజనీకాంత్ చాకొలేట్ విగ్రహాన్ని తయారుచేసిన కబాలీ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. అలాగే కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ విగ్రహాలను కూడా రూపొందించింది. -
పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే
కొంతమంది ఏదైనా కొత్తగా చేయాలని భావించి అనవసర ప్రయోగాలకు పోయి చేతులు కాల్చకుంటారు. ముఖ్యంగా తిండి విషయంలో అలాంటివి చేసి తమ కడుపులు కూడా మార్చుకుంటారు. తాజాగా ఒక కొరియన్ చేసిన పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. ఈ వీడియోలో కొరియన్ వ్యక్తి ఏం తయారు చేద్దామనుకున్నాడనేది తెలియదు. తన ముందు ఒక ఫౌంటేన్ జార్‌ను తీసుకొని అందులో చాక్లెట్ ఫ్లేవర్‌ను ఉంచాడు. ఆ తర్వాత కరిగి ఉన్న చీజ్(వెన్నముద్దను) తీసుకొని ఆ ఫౌంటేన్‌పై పెట్టాడు. (చదవండి : ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ) ఫౌంటేన్ మిషన్ ఆన్ చేయగానే మొదట మాములూగానే చాక్లెట్ ఫ్లేవర్, చీజ్ కలిపి ఏదో వస్తున్నట్లు కనిపించింది. కానీ ఒక్కసారిగా మిషన్ వేగం అందుకోవడంతో చీజ్ గిరాగిరా తిరుగుతూ అతని ముఖంపై చిట్లింది. దీంతో తాను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యిందని బాధపడ్డాడు. ఇక చేసేదేంలేక కిందపడిన చీజ్‌ను తీసుకొని పక్కనే ఉన్న రోల్స్‌లో నుంచుకొని తినాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పిచ్చి ప్రయోగాలు చేస్తే ఇలాంటివే జరుగుతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. -
చాక్లెట్లో పురుగులు
మంథని: ఈమధ్య పిజ్జాలు, బర్గర్లలో పురుగుల వస్తుండటం సర్వసాధారణమైపోయింది. ఇక ఐస్క్రీములో చచ్చిన ఎలుక రావడం కూడా మీకు గుర్తుంటే ఉంటుంది. తాజాగా చాక్లెట్లో పురుగుల వచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లి కిరాణం దుకాణంలో మంగళవారం ఇద్దరు చిన్నారులు చాక్లెట్ కొనుగోలు చేసి తినేందుకు ప్రయత్నించగా అందులోంచి పురుగులు బయటకు రావడంతో భయంతో కింద పడవేశారు. అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బోయిని నారాయణ కోరారు. -
ప్రాణం మీదకు తెచ్చిన ‘చాక్లెట్ గొడవ’
హస్తినాపురం: నోరూరించే చాక్లెట్ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు పోవడానికి కారణమైంది. డీమార్ట్‌లో చాక్లెట్ తీసుకొని డబ్బులు చెల్లించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడగడంతో ఆదివారం సాయంత్రం షాపింగ్ వచ్చిన సతీష్ (18) భయంతో కుప్పకూలాడని ఆ సంస్థ చెబుతోంది. సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు మృతి చెందాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్‌నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యా?.. లేక ఆకస్మిక మరణమా అనేది తేలనుంది. డీమార్ట్‌లో షాపింగ్ చేసి బయటకు వచ్చేంత వరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకాగా, బయటకొచ్చాక అతడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డీమార్ట్ ఎంట్రెన్స్‌కు 40 మీటర్ల దూరంలో పడిపోయిన సతీష్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్ధారించారు. ఘటనాస్థలిని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ సందర్శించారు. అసలేం జరిగిందంటే..: సూర్యాపేట జిల్లా జగ్గు తండాకు చెందిన లౌడ్య బాలాజీకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్(18) హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. 10 మంది విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఔటింగ్‌కు వెళ్లారు. సతీష్ తన ఇద్దరు స్నేహితులతో కలసి రాత్రి 8.10కి వనస్థలిపురం డీమార్ట్‌లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో సతీష్ డైరీ మిల్క్ చాక్లెట్ జేబులో వేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. అప్పటికే ఎగ్జిట్ గేట్ దాటి బయటకు వచ్చిన సతీష్‌ను సెక్యూరిటీ సిబ్బం ది పిలవడంతో చాక్లెట్‌ను జేబులో నుంచి కిందపడేశాడు. అప్పటికే చెమటలు పట్టిన సతీష్ ఒక్కసారిగా కుప్పకూలడంతో మిగతా ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి పారి పోయారు. మరణవార్త తెలుసుకొని వచ్చిన సతీష్ తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యజమాన్యం నిర్లక్ష్యం, డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వి ద్యార్థి సతీష్‌ను బంధువుల అనుమతితోనే ఔటింగ్‌కు పం పామని కళాశాల ప్రిన్సిపల్ స్నేహలత తెలిపారు. ఇంటర్ విద్యార్థిని దొంగతనం నెపంతో కొట్టి హతమార్చిన డీమా ర్ట్ యాజమాన్యంపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేయాలని లంబాడ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆ సంస్థ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించా రు. డీమార్ట్‌ను మూసివేసి వారిపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. -
విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
-
చాక్లెట్ చోరీ.. విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎల్. సతీష్(17) వనస్థలిపురంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వనస్థలిపురంలోని డీమార్ట్‌లో షాపింగ్ చేయడానికి ఆదివారం తన స్నేహితులతో వెళ్లిన సతీష్‌కు సెక్యూరిటీతో గొడవ ఏర్పడింది. డీమార్టులో చాక్లెట్ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు. కాసేపటికి సతీష్ మృత్యువాత పడ్డాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సతీష్ ఇంటర్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్‌ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
చాక్లెట్@:రూ.4.3 లక్షలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ ‘ట్రినిటీ – ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ పేరిట చాక్లెట్‌ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేనందున గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా.. సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు తెలిపింది. ఈ విధంగా ఒక కిలో రేటును నిర్ణయించినట్లు తెలిపింది. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటీసీ ఫుడ్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ రుస్తాగి అన్నారు. -
ఇంటింటా చాక్లెట్..
పిల్లలూ పెద్దలూ బాగా ఇష్టపడే పదార్థాల్లో చాక్లెట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చాక్లెట్ మిఠాయిలు, ఐస్‌క్రీములు, కేకులకు, పానీయాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరంగా పెరుగుతున్న పరిశ్రమల్లో చాక్లెట్ పరిశ్రమ ఒకటి. చాక్లెట్ పరిశ్రమ వార్షిక టర్నోవర్ 5 వేల కోట్ల డాలర్లకు (రూ.3.45 లక్షల కోట్లు) పైమాటే! కొకోవా గింజల నుంచి తయారయ్యే చాక్లెట్ మన దేశంలోకి ఆలస్యంగా అడుగుపెట్టింది. బ్రిటిష్ హయాం కాలంలో మాత్రమే భారతీయులు చాక్లెట్‌ను రుచి చూడగలిగారు. అజ్టెక్, మాయా నాగరికతల ప్రజలకు క్రీస్తుపూర్వం 1200 సంవత్సరాల నాటికే చాక్లెట్ తెలుసు. కొకోవా గింజతో తయారు చేసే పానీయాన్ని వారు మత వేడుకల్లో సేవించేవారు. కొకోవా సాగు మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే మొదలైంది. క్యాడ్బరీ కంపెనీ ప్రోద్బలంతో 1965 నుంచి కేరళలో కొకోవా సాగు ప్రారంభమైంది. నేడు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా చాక్లెట్ గురించి కొన్ని ముచ్చట్లు, కొన్ని తేలికపాటి చాక్లెట్ రెసిపీలు మీకోసం... ఐస్‌బాక్స్ కేక్ కావలసినవి: మీగడ – రెండు కప్పులు, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు, చాక్లెట్ వేఫర్స్ – ఒక ప్యాకెట్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీస్పూన్, చాక్లెట్ తురుము – (కావాలనుకుంటే) తయారీ: ఒక వెడల్పాటి బౌల్లో మీగడ వేసుకుని మెత్తగా అయ్యేలా గిలకొట్టుకోవాలి. మీగడ మెత్తగా అయిన తర్వాత పంచదార, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని మళ్లీ గిలకొట్టుకోవాలి. చాక్లెట్ వేఫర్స్‌ను చితగ్గొట్టి ఈ మూడొంతుల మీగడ మిశ్రమంలో వేసి, బాగా కలుపుకోవాలి. మరో వెడల్పాటి చతురస్రాకారపు పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి, పాత్ర నిండా సమంగా వచ్చేలా పరచాలి. మిశ్రమంపైన మిగిలిన మీగడను సమంగా పరచాలి. కావాలనుకున్న వారు పైన చాక్లెట్ తురుమును అలంకరించుకోవచ్చు. దీనిని ఫ్రిజ్‌లో ఆరు గంటలు ఉంచిన తర్వాత బయటకు తీసి, కావలసిన సైజులో ముక్కలుగా కోసుకుని తినవచ్చు. చాక్లెట్ కుకీస్ కావలసినవి: ఓట్స్– మూడు కప్పులు, పీనట్ బటర్ – అర కప్పు, వెన్న– అర కప్పు, కొకోవా పౌడర్ – పావు కప్పు, పాలు – అర కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీస్పూన్, ఉప్పు – పావు టీస్పూన్ తయారీ: మందపాటి మూకుడులో పంచదార, కొకోవా పౌడర్ వేసి రెండూ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. తర్వాత పాలు, వెన్న వేసి బాగా కలిపి, సన్నని మంట మీద ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. వెంటనే ఈ మిశ్రమంలో ఓట్స్, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు, పీనట్ బటర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని టేబుల్ స్పూన్‌తో వ్యాక్స్ పేపర్ మీద వేసుకుని, నచ్చిన ఆకారంలో కుకీస్‌ను మలచుకోవాలి. పావుగంట సేపు వాటిని అలాగే విడిచిపెడితే, అవి గట్టిబడి కరకరలాడే చాక్లెట్ కుకీస్ రెడీ అవుతాయి. చాక్లెట్ పుడ్డింగ్ కావలసినవి: డార్క్ చాక్లెట్ తురుము – ఒక కప్పు, మీగడ – ఒకటిన్నర కప్పులు, వెన్న – పావు కప్పు, కొకోవా పౌడర్ – రెండు టేబుల్ స్పూన్లు, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీస్పూన్, ఉప్పు – పావు టీస్పూన్, జీడిపప్పు ముక్కలు – అర టీస్పూన్ తయారీ: మందపాటి మూకుడులో మీగడను వేసుకుని, స్టవ్ మీద సన్నని మంటపై ఉడికించుకోవాలి. మీగడ ఉడికిన తర్వాత మూకుడును దించేసుకుని, అందులో కొకోవా పౌడర్ వేసుకుని బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో చాక్లెట్ తురుము, వెన్న, పంచదార, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు వేసుకుని మిశ్రమం అంతా మెత్తగా అయ్యే వరకు మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కప్పులలో ముప్పావు వంతు వరకు నింపుకోవాలి. పైన జీడిపప్పు ముక్కలను చల్లుకుని, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో ఆరుగంటలు ఉంచిన తర్వాత చల్లచల్లని తీయతీయని నోరూరించే చాక్లెట్ పుడ్డింగ్ సిద్ధమవుతుంది. చాక్లెట్ ఓట్మీల్ బార్స్ కావలసినవి: ఓట్స్ – రెండు కప్పులు, కొకోవా పౌడర్ – పావు కప్పు, తేనె – పావు కప్పు, పీనట్ బటర్ – పావు కప్పు, వెన్న - పావు కప్పు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీస్పూన్, ఉప్పు – పావు టీస్పూన్, బాదం తురుము – ఒక టీస్పూన్, కిస్మిస్ – ఒక టీస్పూన్, చాక్లెట్ చిప్స్ – ఒక టీస్పూన్ తయారీ: దాదాపు ఎనిమిది అంగుళాల చతురస్రాకారపు పాత్రను తీసుకోని, పాత్ర అడుగు భాగాన వ్యాక్స్ పేపర్‌ను పరుచుకోవాలి. ఒక బౌల్లో పీనట్ బటర్, వెన్న, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‌పై సన్నని మంట మీద వేడి చేసుకోవాలి. పీనట్ బటర్, వెన్న కరుగుతుండగా వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా మెత్తగా తయారయ్యాక ఓట్స్, కొకోవా పౌడర్ వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వ్యాక్స్పేపర్ వేసి ఉంచిన చతురస్రాకారపు పాత్రలోకి వేసుకుని, సమంగా పరుచుకునేలా స్పూన్‌తో వీలైనంత గట్టిగా అదుముకోవాలి. తర్వాత ఈ మిశ్రమంపై బాదం తురుము, కిస్మిస్, చాక్లెట్ చిప్స్ చల్లుకుని, మళ్లీ గట్టిగా అదుముకోవాలి. మిశ్రమం చల్లారాక, చతురస్రాకారపు పాత్రను డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత బయటకు తీసి, కోరుకున్న సైజులో బార్స్ కట్ చేసుకోవాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ బార్స్ చాలా రుచిగా ఉంటాయి. చాక్లెట్ బ్రౌనీస్ కావలసినవి: ఖర్జూరాల తురుము – రెండు కప్పులు, వాల్నట్స్ – రెండు కప్పులు, కొకోవా పౌడర్ – ముప్పావు కప్పు, చాక్లెట్ తురుము – వంద గ్రాములు, పీనట్ బటర్ – అర కప్పు, అటుకులు లేదా కార్న్‌ఫ్లేక్స్ – ఒక కప్పు, వెన్న – ఒక టేబుల్‌స్పూన్ తయారీ: గింజలు తొలగించి, తురుముకున్న ఖర్జూరాన్ని పదినిమిషాల సేపు నీట్లో నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని పూర్తిగా వంపేయాలి. నానిన ఖర్జూరాలను, వాల్‌నట్స్‌ను మిక్సీలో వేసుకుని మెత్తగా నలిగే వరకు తిప్పుకోవాలి. మిక్సీలో ఈ మిశ్రమం తయారవగానే, అందులోనే కొకోవా పౌడర్, ఉప్పు వేసి, మళ్లీ మిక్సీని ఆన్ చేయాలి. అవసరమైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ నీళ్లు కలుపుకోవచ్చు. మిశ్రమం మరీ జారుగా కాకుండా, ఉండలా కట్టుకునేందుకు వీలుగా ఉండేలా చూసుకోవాలి. మిశ్రమం బాగా చిక్కగా, మెత్తగా తయారైన తర్వాత అడుగు భాగాన వాక్స్పేపర్ పరిచిన చతురస్రాకారపు పాత్రలోనికి వేసుకోవాలి. దీనిపై వెన్న, అటుకులు లేదా కార్న్‌ఫ్లేక్స్ వేసుకుని, మిశ్రమం పాత్ర అంతటా సమంగా పరుచుకునేలా గట్టిగా అద్దుకోవాలి. తర్వాత వెంటనే డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలి. అరగంట తర్వాత బయటకు తీసుకుని, కోరుకున్న సైజుల్లో ముక్కలుగా కోసుకుంటే చాలు, నోరూరించే చాక్లెట్ బ్రౌనీస్ రెడీ. జీబ్రాకేక్ కావలసినవి: చాక్లెట్ వేఫర్స్ – ఒక పెద్ద ప్యాకెట్, మీగడ – రెండు కప్పులు, పంచదార – ఒక టేబుల్‌స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీస్పూన్ తయారీ: ఒక పాత్రలో మీగడ, పంచదార, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని బాగా మెత్తగా అయ్యేలా గిలకొట్టుకోవాలి. శాండ్విచ్ మధ్య జామ్ పట్టించినట్లుగా ఈ మిశ్రమాన్ని చాక్లెట్ వేఫర్స్ మధ్య బాగా పట్టించాలి. వేఫర్స్ మీగడ వరుసగా దగ్గరగా కోరుకున్న ఆకారంలో పేర్చుకుంటూ పోవాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక మిగిలిన మీగడ మిశ్రమాన్ని వేఫర్స్ ఉపరితలానికి కూడా బాగా పట్టించాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి, పన్నెండు గంటల తర్వాత బయటకు తీస్తే, టేస్టీ జీబ్రా కేక్ తినడానికి సిద్ధంగా తయారవుతుంది. చాక్లెట్ పాయసం కావలసినవి: డార్క్ చాక్లెట్ తురుము – అరకప్పు, బియ్యం – అరకప్పు, పాలు – నాలుగు కప్పులు, కోవా – పావుకప్పు, పంచదార – ఒక కప్పు, చాక్లెట్ చిప్స్ (కావాలనుకుంటే) – ఒక టేబుల్ స్పూన్ తయారీ: బియ్యాన్ని ముందుగా గంటసేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. నీళ్లను వంచేసి మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రబ్బుకోవాలి. మందపాటి పాత్రలో పాలను మరిగించుకోవాలి. పాలు మరుగుతుండగా రుబ్బుకున్న బియ్యం ముద్దను అందులో వేసుకోవాలి. పాలు దాదాపు సగానికి సగం ఇగిరిపోయాక, కోవా, చాక్లెట్ తురుము, పంచదార వేసి కలుపుకుని, స్టవ్‌పై నుంచి దించేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కావాలనుకున్న వారు పైన చాక్లెట్ చిప్స్‌ను అలంకరించుకోవచ్చు. చాక్లెట్ కోకోనట్ బార్స్ కావలసినవి: చాక్లెట్ చిప్స్ – ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు, పంచదార – మూడు టేబుల్‌స్పూన్లు, కొబ్బరినూనె – ఆరున్నర టేబుల్‌స్పూన్లు తయారీ: మందపాటి మూకుడులో పంచదార, కొబ్బరి నూనె వేసుకుని, స్టవ్‌మీద సన్నని మంటపై వేడి చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, పంచదార కరిగిన కొబ్బరినూనెలో కొబ్బరి తురుము వేసి, బాగా కలుపుకోవాలి. చతురస్రాకారపు పాత్ర అడుగున వ్యాక్స్ పేపర్ పరిచి, అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. చాక్లెట్ చిప్స్‌ను వేరే మూకుడులో వేసుకుని, సన్నని మంటపై అవి పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసుకోవాలి. కరిగిన చాక్లెట్ మిశ్రమాన్ని కొబ్బరి మిశ్రమం ఉన్న పాత్రలోకి వంపుకోవాలి. పాత్ర అన్ని వైపులా ఈ మిశ్రమం బాగా పట్టేలా స్పూన్‌తో సర్దుకోవాలి. తర్వాత దీనిని చల్లారనిచ్చి, డీప్‌ఫ్రిజ్‌లో ఇరవై నిమిషాలు ఉంచి బయటకు తీసి, కావలసిన సైజులో కట్‌చేసుకుంటే చాలు. చాక్లెట్ మిల్క్‌షేక్ కావలసినవి: కొకోవా పౌడర్ – మూడు టేబుల్‌స్పూన్లు, గోరువెచ్చని నీరు – పావు కప్పు, చల్లని పాలు – రెండున్నర కప్పులు ఐస్‌క్యూబ్స్ – ఆరు, చాక్లెట్ సాస్ – రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార – పావు కప్పు ఐస్‌క్రీమ్ (కావాలనుకుంటే) – రెండు స్కూప్స్ తయారీ: ఒక బౌల్లో గోరువెచ్చని నీరు తీసుకుని, ఆ నీట్లో కొకోవా పౌడర్ వేసి, బాగా కరిగేలా కలుపుకోవాలి. ఇందులోనే చక్కెర వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్లో వేసుకుని, అందులో ఐస్‌క్యూబ్స్, పాలు కూడా వేసుకుని బ్లెండ్ చేయాలి. బాగా బ్లెండ్ అయిన మిల్క్‌షేక్‌ని గ్లాసుల్లో పోసుకుని, దానిపై చాక్లెట్ సాస్ వేసుకుంటే చాలు, చల్లచల్లని చాక్లెట్ మిల్క్‌షేక్ రెడీ. కావాలనుకున్న వారు ఐస్‌క్రీమ్‌ని కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ దోశ కావలసినవి: మైదాపిండి – అరకప్పు, పాలు – పావుకప్పు, డార్క్‌చాక్లెట్ తురుము – పావుకప్పు, నీరు– రెండు టేబుల్ స్పూన్లు, వెన్న– రెండు టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా – చిటికెడు తయారీ: వెడల్పాటి పాత్రలో మైదాపిండి, పాలు, డార్క్‌చాక్లెట్ తురుము, వెన్న, నీరు వేసుకుని జారుగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు సోడా వేసి మళ్లీ కలుపుకోవాలి. పావుగంట సేపు ఈ మిశ్రమాన్ని అలాగే వదిలేయాలి. తర్వాత ఈ మిశ్రమంతో పెనం మీద దోశలు పోసుకోవాలి. వేడి వేడి చాక్లెట్ దోశలు రెడీ. చాక్లెట్ సాస్‌లో ముంచుకుని తింటే ఇవి భలే రుచిగా ఉంటాయి. -
గంజాయి చాక్లెట్
సాక్షి సిటీబ్యూరో/బాలానగర్ : గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు.నేరుగా సరఫరా చేస్తే దొరికిపోతామనే భయంతో కొత్త పుంతలు తొక్కి దందాను కొనసాగిస్తున్నారు. నగరంతో పాటు, శివార్లలోని యువత, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా కొత్త పంథాలో సాగుతున్న గంజాయి దందాకు బాలానగర్ ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ అధికారులు చెక్ పెట్టారు. చాక్లెట్ల రూపంలో తయారుచేసి పాన్ షాపులలో అమ్ముతున్న వ్యక్తితో పాటు, అతడికి సరఫరా చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ ప్రోహిబిషన్ పొలీసులకు ఫతేనగర్‌లోని పైప్‌లైన్ రోడ్డులో ఉన్న పాన్‌షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో నిఘా ఏర్పాటు చేశారు. శనివారం పాన్‌షాపుపై దాడి చేయడంతో 80 గంజాయి చాక్లెట్లు దొరికాయి. అమ్ముతున్న పాన్‌షాపు నిర్వాహకుడు మిహిర్‌ను పొలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అదే ప్రాంతంలో బాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అనిల్ అగర్వాల్ సరఫరా చేశాడని తెలిపాడు. అతడి దుకాణంపై దాడి చేయగా 35 ప్యాకెట్లలలో ప్యాక్ చేసి ఉన్న 1400 గంజాయి చాక్లెట్లు లభించాయి. 8 కేజీల 400 గ్రాముల గంజాయి చాక్లెట్లను సీఐ జీవన్‌కిరణ్, ఎస్ఐ మహేందర్ ఇతర సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వీరికి మంగళ్‌హట్‌కు చెందిన ఒక వ్యక్తి సరఫరా చేశాడని ప్రాధమికంగా సమాచారం ఇవ్వడంతో సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకై.. స్మగ్లర్లు గంజాయి ఆకులను ముద్దలాగా చేసి చాక్లెట్లలా తయారుచేశారు. ఆకర్షణీయంగా ఉండే ప్యాకింగ్ కూడా వేయడంతో సాధారణంగా రవాణా చేసే సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించినా పెద్దగా ప్రమాదం ఉండదు. దీంతో ఇదే సులువైన మార్గం అని ఎంచుకున్నారు. నడి రోడ్డుపైన ఉన్న పాన్ షాప్‌లో ఉంచి యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు సరఫరా చేశారా.... హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో ఉండే యువత, ఐటీ ఉద్యోగులు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని ఇలా కొత్త పంథాలో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పక్కాగా ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారి పని అని పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలానగర్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ పొలీసులకు 6 నెలల క్రితం కూడా సుమారు 300 గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. గతంలో రాజేంద్రనగర్ ఎక్సైజ్ పొలీసులకు కూడా గంజాయి చాక్లెట్లు సరఫరా చేసే ముఠా పట్టుబడింది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థులు కుత్బుల్లాపూర్: చెడు వ్యసనాలకు బానిసలైన ఇద్దరు విద్యార్థులు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ సహదేవ్ తెలిపిన మేరకు.. కామారెడ్డిజిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జి.మహేశ్‌కుమార్ (22), రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలానికి చెందిన అన్వేష్‌రెడ్డి (22) స్నిహితులు. వీరిద్దరు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారి గణేశ్ గౌడ్ ఆదేశాలతో శనివారం సూరారం చౌరస్తాలో మహేశ్‌కుమార్, సుచిత్రలోని లయోలా కళాశాల గేటు వద్ద అన్వేష్ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రెండు కిలోల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐ సహదేవ్, వెంకటేశ్వరరావు, సత్తార్, శ్రీనివాస్, సంజయ్, చెన్నయ్య, జ్యోతిలు ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు -
చాక్లెట్ బ్యూటీస్
-
పనస విత్తనాల పొడితో చాక్లెట్ వాసనలు
మనం పనస తొనలు తింటాం. పిక్కలు పారబోస్తాం! చిత్రమైన విషయమేమిటంటే.. ఈ పనస పిక్కలు చాలా బలవర్ధకమైనవి. బ్రెజిల్ శాస్త్రవేత్తలు తాజాగా ఏం చెబుతున్నారంటే... పనస పిక్కల పొడితో చాక్లెట్ రంగానికి ఎంతో మేలు జరుగుతుందీ అని! అదెలా అని ఆశ్చర్యపోవద్దు. చాక్లెట్ తయారీకి కోకా కాయల అవసరముంటుందని మీకు తెలుసు కదా.. డిమాండ్ పెరిగిపోతున్న కొద్దీ ఈ కోకా గింజల ధరలు పెరిగిపోతున్నాయని ఫెర్నాండా పాపా స్పాడ అనే శాస్త్రవేత్త తెలిపారు. 50 నుంచి 75 శాతం పనస గింజల పొడి.. పాలు, కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ వాసన, రుచిలో మామూలు కాఫీకి ఏమాత్రం తీసిపోదని ఆయన చెప్పారు. సాధారణంగా ఈ రకమైన కాఫీకి కోకా గింజలను వాడుతూంటారు. అంతర్జాతీయ కోకా సంస్థ లెక్కల ప్రకారం గత ఏడాది దాదాపు 456 కోట్ల టన్నుల కోకా గింజలను వాడుకున్నారు. డిమాండ్ కూడా ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కోకా గింజలకు ప్రత్యామ్నాయాలను గుర్తించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా పనస గింజలను వేయించి పొడి చేస్తే అది కోకా గింజల మాదిరిగానే పనిచేస్తాయని గుర్తించడం విశేషం. -
డెయిరీ మిల్క్ చాకొలెట్లో పురుగులు
-
క్యాడ్బరి చాకొలెట్లో పురుగులు
సాక్షి, హైదరాబాద్ : మోర్ సూపర్మార్కెట్లో చాకొలెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్ సూపర్మార్కెట్లో మూడు రోజుల క్రితం క్యాడ్బరి డెయిరీ మిల్క్ చాకొలెట్ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్ తిందామని కవర్ ఓపెన్ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి. సుబ్బారావు మోర్ సిబ్బందిని వివరణ కోరగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాకొలెట్లో పురుగులతో తమకు సంబంధం లేదని మోర్ సిబ్బంది తేల్చిచెప్పడంతో.. ఆయన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. -
ఒబీస్
‘ఈ ఒక్క ముక్కతోనే ఒళ్ళు పెరిగిపోతుందా ఏం? ‘వొద్దనుకుంటూనే కళ్ళు మరల్చలేకపోతున్నాను. మరోవైపు చూస్తే, నేహ ఇంత లావు పేస్ట్రీముక్క ప్లేట్లో పెట్టుకుని సుతారంగా దానిమీద ఐసింగ్ నాకుతూ కన్నుగీటిందిఒక ప్లాస్టిక్ నవ్వు పడేసి చూపులు ముందుకు తిప్పాను.లేత క్రీమ్ రంగూ, తెలుపూ కలిసిన పొరలతో దట్టమైన తెల్లని ఐసింగ్‌తో మాక్రోషాట్లో తీసిన ఫొటోలాగా స్పష్టంగా కళ్ళెదురుగా ..పైనాపిల్ పేస్ట్రీ.... చెమ్మ తాలూకు అతిపల్చని పొర... నోట్లో అప్రయత్నంగా నీళ్ళు ఊరిస్తూ.. ఫోన్ మోగింది.‘ఎక్కడున్నావ్?’‘ఆఫీసులో’‘మరి పక్కన ఆ కేకలూ హడావుడీ ఏంటి? ఆఫీసేనా?’‘అవును, ఇవాళ రాహుల్ బర్త్‌డే. కెఫెటేరియాలో కేక్ కట్ చేశాడిప్పుడే’‘రాహులెవడు?’‘ఎవడేంటి ఎవడు? మొన్న మాల్లో కనిపిస్తే పరిచయం చేశాగా? అతనే’‘చేరి నెలైనా కాలేదు, అప్పుడే బర్త్‌డే ఇంత హంగామాగా చేస్తున్నారా?’‘ఫ్రెండ్స్ ఉండరా ఏంటి? సరదాగా’‘మరే, సరదా! ఇందాక ఫోన్ చేశాను, ఏం చేస్తున్నావ్? తీయవేంటి‘కట్ చేశాను విసుగ్గా. మళ్ళీ రింగ్ అవుతోంది. తీయబుద్ధి కాలేదు . ప్చ్... అసలు మనుషులు ఎందుకిలాగ ఉంటారో!ఇందాక పేస్ట్రీ వైపు సాగుతూ టేబుల్ మీద ఆగిపోయిన చేయి ముందుకు నిస్సంకోచంగా కదిలి ప్లేటు అందుకుంది. స్పూను పక్కన పడేసి చేత్తో అందుకునిమొత్తం ముక్కని నోట్లో పెట్టుకున్నాను. హాయిగా తీయగా చల్లగా కమ్మని క్రీమ్ రుచితో.. వేడెక్కిన మెదడుని మనసుని చల్లబరుస్తూ... మెత్తగా పళ్ళ కింద నలుగుతూ కమ్మగా గొంతులోకి జారుతోంది.హెవెన్... దేవుడా! ఎన్నెన్ని రుచులు సృష్టించావయ్యా స్వామీ... నీ దుంపతెగా!జతిన్ మరో ప్లేట్లో చాక్లెట్ కేకు ముక్కలుపెట్టుకుని వస్తూ ‘కావాలా?’ అన్నాడు.‘అర్జెంట్‌గా..’ దాదాపు లాక్కున్నంత పనిచేసి చాక్లెట్ కేకుని మళ్ళీ మాక్రోషాట్ లెవెల్లో మొహానికి దగ్గరగా పెట్టుకుని చూశాను. అందంగా కనపడింది నాలాగే!బాగా బొద్దుగా ఉంది, నాలాగే! బొద్దుగా..... ఒక్కక్షణం ఆగాను.ఉహూ. గబగబా చాక్లెట్ రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నానులేచి ఫస్ట్ఫ్లోర్కేసి నడుస్తుంటే వెనక నుంచి వినపడింది‘నార్త్ పిల్లలు అంత సన్నగా ఎలా ఉంటార్రా‘‘మనలాగా పప్పూ నెయ్యీ పోసుకొని తినరువాళ్ళు.. ’ ఇంకెవడో జవాబు చెప్పాడు.‘వాళ్ళూ తింటారు. కాస్త ఒళ్ళొంచి వర్కౌట్లు చేస్తారు. మనోళ్ళు పెళ్ళయితేటేకిట్ ఫర్ గ్రాంటెడ్ రకాలు. చేసుకున్నాక చస్తాడా ఏంటి భరించక‘‘అలా ఏంలేదురా! వాళ్ళూ అంతే! పంజాబీలు చూడు, మెక్సికన్ గాల్స్ టైపు. పెళ్ళి కాకముందు మెరుపుతీగలే! పెళ్ళయ్యాక ఆలూబస్తాలే‘ ఓహో వీడు ఆన్‌సైట్‌కి వెళ్ళొచ్చాడన్నమాట. అక్కడికేదో మెక్సిక¯Œ ఆడపిల్లలని బాగా చదివేసినట్టే.. సొల్లుకబుర్లు. వీడి నాలెడ్జ్ అంతా పంచాలి మనకి!వాళ్ళు మాట్లాడుకుంటున్నది నా గురించి కాదేమో గాని నాకు మాత్రం నన్నుద్దేశించే అనిపిస్తుంది ప్రతిసారీ. ఏడిశార్లే, ఐడోంట్ కేర్ !‘లవీ... అమ్మా, మెరుపుతీగా ఆగు’ మోహిత్‘ప్రొడక్ట్ రిలీజ్ ఎప్పుడు?’‘ట్వెల్త్‘ పాలిష్ చేసిన గోళ్ళకేసి చూసుకున్నా. నిండు ఆరెంజ్ రంగు, ఎంత బావుందో! షాపర్స్ స్టాప్‌లో వచ్చేస్తున్నపుడు చివర్లో దొరికింది.‘మీ టీమ్‌లో ఎవరో గుర్గావ్ నుంచి వచ్చిందట వడోదరా అమ్మాయి, పరిచయం చెయ్యొచ్చుగా కొంచెం.అంత కుళ్ళుండగూడదు‘ఇదీ వీడిక్కావలసింది. ప్రొడక్ట్ రిలీజ్ కాదు. ఇద్దరు పిల్లల తండ్రి, బెల్టుకి ససేమిరా లొంగనని తోసుకొస్తున్న పొట్ట, ఎంత ముందుకు దువ్వినా, మొదలైపోయిన బట్టతల.అయినా సరే కొత్త పిల్లలు ఎవరైనా రాగానే పరిచయం చేసేస్కోవాలని తాపత్రయం. ఆ పిల్లలకు తను తన నాలెడ్జ్ నచ్చేస్తాయని బోల్డు కాన్ఫిడెన్స్. కాంపిటీషన్ ఉంటుందని భయమైనా లేదు. ముందు నుంచి ఒక ఆడపిల్ల పోతుందంటే చాలు ఏదో ఒక పాయింట్ మీద కామెంట్ చేయకుండా ఉండడు. లావనో, పొట్టనో, నలుపనో, డంబ్ అనో, ఈజీ ఫాలింగ్ అనో..!‘నీకు ఒకళ్ళు పరిచయం చేసేదేముంది’ అటుగా వెళ్తున్న ఎవరి ప్లేట్లోంచో పేస్ట్రీ ముక్క తీసుకున్నాను. ఇవాళ చాలా క్రేవింగ్‌గా ఉంది. వారం నుంచి నోరు కట్టేసుకునే ఉన్నాను. రోజూ ఆ రుచీ పచీలేని పుల్కాలతో సరిపెట్టుకుంటున్నాను. అంతకంటే నీచమైన ఆ బీరకాయ, సొరకాయ కూరలతో! ప్రపంచమంతా నిస్సారంగా కనిపిస్తున్నా సరేకె ఫెటేరియాలో రకరకాల ఐటెంలు .కార్పొరేట్ లంచ్. అటుగా వెళ్తే ఏదో ఒకటి తినేస్తానని భయం.ఇవాళ తప్పింది కాదు. నా బాక్స్‌లో పుల్కాలు నీరసంగా నిద్రపోతున్నాయేమో! అందరితో కలిసి నూడుల్స్, పూరీకూర తినేశాను. ఎంత హాయిగా ఉందో! కడుపునిండా ఎంత తిన్నా ఒళ్ళు రాకుండా లావు కాకుండా ఉండే వరమేదైనా దేవుడివ్వాలంటే ఎన్నేళ్ళు తపస్సు చేయాలో! ఆ చేసినన్నాళ్ళూ నిరాహారంగా చేయాలా? ఇహ అప్పుడు ఆశలన్నీ చచ్చాక ఇక స్లిమ్ ఉండి ఏంలాభం? ఇష్టమైంది కడుపునిండా తినేశాక వచ్చే నిద్ర ఎంతందం? నెమ్మదిగా రెప్పల మీదికి బరువుగా తోసుకొస్తూ, సోఫా, కుర్చీ, మంచంలాంటì æతేడాలేవీ లేకుండా పక్కన కూచున్న మనిషి ఎవరైనా సరే, వాళ్ల భుజం మీద వాలి, హాయిగా !అసలు మధ్యాహ్నం నిద్రల్ని ఆఫీసుల్లో కంపల్సరీ చేయాలి. కనీసం గంట! అప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మరో పది నిమిషాల్లో నాకు మీటింగ్ లేకపోయుంటే ఎంత హాయిగా డెస్క్ మీద తలవాల్చి నిద్రపోదును? మధ్యాహ్నాలు నిద్రపోతే ఒళ్ళొస్తుందని ఎవరోచెప్పారు. అయినాసరే తెగించి శనాదివారాలు ఒక్క గంటైనా పడుకుందామనుకుంటే ఏదో ఒక పని పని పని!అసలందుకే కడుపునిండా తినకూడదు. గాలి పీల్చినా వెధవది ఒళ్ళొచ్చేలా ఉందే దీన.... ‘ఆ అమ్మాయిపేరు రిచా అటగా, మొన్న దూరం నుంచి చూశాం! ఏం తింటారబ్బా గుజ్జూలు, ఎంత స్లిమ్‌గా ఉందో!‘వీడి నోరుపడ, అనేశాడు మళ్ళీ!‘మరి అంత స్లిమ్‌గా ఉన్న పిల్లతో నీకెందుకు చెప్పు పరిచయం? గణపతి బప్పాలా ఆ బొజ్జ చూసుకో ముందు!’అయినా ఆ పిల్లకు పెళ్ళి కుదిరింది‘ వాడి మొహం ఎలా ఉందో చూడకుండా ముందుకు నడిచాను. సీట్లో కూలబడ్డాను. మీటింగ్ క్యాన్సిల్. ఖాళీతెరెసా వస్తోంది గునగునా! తెరెసానో, చంద్రకళనో చూసినపుడు కాస్త హుషారు వస్తుంది. నాకంటే లావు కాబట్టి ఫీలింగ్ బెటర్ అనిపిస్తుందివస్తూనే బాక్స్తీసి,‘అత్తమ్మ పంపింది పొద్దున! ‘ అని బొబ్బట్టు తీసి పేపర్ ప్లేట్లో పెట్టింది.‘ఓయ్! ఇప్పుడే కేకు తిని వస్తున్నా. ఇంక చాలివాల్టికి‘ అన్నానుగొల్లున నవ్వింది. ‘చల్తీ! ఎంత చేసినా ఇంతేలే మనం. ఒక్కదానికేంగాదు. తినాలె‘ అని ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ‘‘మనం’’అట.. నన్ను కూడా కలుపుకుంది బండది.‘తెరెసా, ప్లీజ్ ’అంటున్నా వినిపించుకోలేదు. నిజానికి మొదటి ముక్క తిన్నందుకే పశ్చాత్తాపంగా ఉంది. దానిపైన ఇంకో రెండు పట్టించాను. ఇప్పుడీ బొబ్బట్టు.నో, వద్దు! జాగ్రత్తగా పేపర్లో చుట్టి డస్ట్‌బిన్‌లో అడుగున పడేశాను.‘ఒక గ్రీన్ టీ తీసుకురా, తేనె వెయ్యొద్దని చెప్పు రామూకి. లతా మేడంకంటే ఎలా చేయాలో తెలుస్తుంది’ లక్ష్మణ్‌కి చెప్పాను?పేస్ట్రీలు, కేకులు తిన్నందుకు పశ్చాత్తాపం మొదలై క్షణక్షణానికి ఇంతింతై మర్రిచెట్టులా ఊడలు దిగుతూ పెరగడం ప్రారంభమైంది.‘ఛ, ఎలాటి ఫ్రస్ట్రేషన్ వచ్చినపుడల్లా దాన్ని అణచడానికి స్వీట్లు తినడం ఎలా అలవాటైంది నాకు? హాస్టల్లో ఉండి చదివేటపుడు ఎగ్జామ్ టెన్షనూ, చదువు టెన్షనూ చాక్లెట్లు తింటే తగ్గుతుందని ఒక పిచ్చినమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి పనికిమాలిన సలహాలు భలే ఆకట్టుకుంటాయి అందులో నిజముందాలేదా అనే సంగతి తర్వాత. ముందు చాక్లెట్ తినాలి. అలాగే పట్టుకుని ఉంటుంది వెధవ అలవాటునాలుగవుతుండగానే లేచి బయటపడ్డాను. లక్ష్మణ్‌ని పిలిచి, సాయంత్రం బండి ఇంటికి తీసుకు రమ్మన్నాను. నడిచివెళ్తా ఇవాళ. ఇందాక తిన్నది కొంతైనా కరిగించాలి.మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నడిచి వెళ్ళాను. శరీరానికి కాస్త కష్టమైనా మనసు తేలిగ్గా అనిపించింది.పిండికలిపి, నాకోసం కీరాలూ, టమాటాలు కట్‌చేసి పెట్టుకున్నాను.‘పుల్కాలా మళ్ళీ? నీడైటింగ్తో మా ప్రాణాలు తీస్తున్నావ్. ఆ సొరకాయ కూర కాకుండా ఇంకేదైనా చెయ్యి. ఆలూకూర ‡చెయ్యి ఇవాళ. కొంచెం రైస్ కూడా ఒండు! అసలు నీ డైటింగ్ వంటలు నువ్వు చేసుకో. మాకెందుకు ఈ బలాత్కారం? ‘ఒక్కొక్కరికీ ఒక్కోరకం వండాలంటే ఎంతశ్రమో కనీసం ఊహలోనైనా తెలీదేమో!చపాతీలు చేసి నూనెవేసి కాల్చాను స్నానం, వంట అయ్యాక ఏవిటో కేకుకి ప్రాయశ్చిత్తం చేసుకున్న ఫీలింగ్ వచ్చి, బరువు తగ్గినంత ఆనందం వచ్చిపడింది.నాలుగు కీరా ముక్కలూ, ఒకకప్పు టమాటా జ్యూసూ తాగి పడుకున్నాను. అర్ధరాత్రయ్యే సరికి ఆకలితో నిద్రపట్టలేదు. చాలాసేపు దొర్లానుగాని నిద్రలేకపోతే రేపు ఆఫీసులో పని చేయలేననిపించిందిలేచిచూస్తే డబ్బానిండా చాక్లెట్లూ, టేబుల్ మీద అరటిపళ్ళూ!వంటింట్లో హాట్ ప్యాక్‌లో చపాతీలూ, ఆలూకూర.అమ్మో ఆలూ ఒద్దు. దానికంటే æచాక్లెట్లు నయం. కానీ కడుపునిండదు.పెరుగన్నం తిని, బౌల్ సింక్‌లో పడేసి వస్తూవస్తూ నాలుగుచాక్లెట్లు నోట్లో పడేసుకున్నాక, హాయిగా నిద్రపట్టింది. ప్రాణం ఎటుపోయిందో తెలీదు రాత్రి అనుకున్న ప్రకారం పొద్దున్నే ఐదున్నరకి లేచి అన్నం కుక్కర్లో పడేసి, జిమ్‌కి పరిగెత్తాను. నేను వెళ్ళేసరికే మూడు ట్రెడ్మిల్స్ మీదా ముగ్గురమ్మలు కనిపించారుగుంజన్, గీత, మన్‌ప్రీత్ రాజహంసల్లాగా రెండుస్పీడులో నడుస్తూ కబుర్లుచెప్పుకుంటున్నారు‘రారా, చాలా రోజులైంది కనపడి జిమ్‌లో?‘ ‘సాయంత్రాలు వస్తున్నాను‘ అబద్ధం అలవోగ్గా ఆడాను.‘సాయంత్రం నేనూ వస్తున్నానే? ‘గుంజన్ . నేను రావట్లేదని ప్రూవ్ చెయ్యాలి. అదీ దీని పట్టుదల.‘ఇంట్లో పనీ అదీ అయ్యేసరికి ఎనిమిదవుతుంది అప్పుడు వస్తున్నాను‘ తగ్గదల్చుకోలేదు‘కాస్త వెయిట్ పెరిగినట్టు అనిపించట్లా లావణ్య? ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకో, ఎందుకైనా మంచిది. దాని సింప్టమ్స్ మిగతావి ఎలా ఉన్నా ముందు వెయిట్ పెరిగి తీరతాం‘ మరికొంచెం లావయ్యాన నీ మనసులో అనుమానం ఉన్నా, వెయింగ్ మెషీన్ జోలికి వెళ్ళకుండా తగ్గే ప్రయత్నాలు చేస్తూ సమాధాన పడుతున్నాను. చాలా నీరసం వచ్చింది మన్‌ప్రీత్ మాటలతో!అయినా వీళ్ళుమాత్రం తక్కువున్నారా ఏంటి? ఇంకోళ్ళని నువ్వు లావయ్యావని అంటేతప్ప కడుపునిండదేమో!సైక్లింగ్ చేయాలనుకున్నాగాని ఆ మాటలతో గొప్ప నిరాశ వచ్చిపడింది.గుంజన్ అంటోంది ‘నైరే! గార్లిక్ బటర్ పొటాటోస్కా రెసిపీ హై మేరే పాస్. హోలీకే దిన్ బనాయా, స్వీట్కే సాథ్. బటర్ జ్యాదా లగ్తా హై లేకిన్, టేస్ట్‌కీ బాత్ కరో! హెవన్ యార్, మెరా సిగ్నేచర్ రెసిపీ!’ఇంట్లో బటర్ పొటాటోస్ కానిచ్చి ఇక్కడికొచ్చి ఒక అరగంట కబుర్లు నంజుకుంటూటైమ్ పాస్ చేయడమే కానీ అసలు సీరియస్నెస్సేదీ? ‘నువ్వో‘ ఎవరో అడిగారు నా లోపల్నుంచి. ‘నేనేంకాదు‘ మొహంపగిలేలా జవాబుచెప్పి పెడలింగ్చేయడం మొదలుపెట్టాను. ‘వెయిట్ పుటాన్ చేసినట్టులేదూ లావణ్య? ‘పదేపదే గుంజన్ మాటలు వినపడుతున్నాయిపదినిమిషాలు చేసేసరికి ఉత్సాహం పూర్తిగా చచ్చింది. అయినా ఇవాళ ఆఫీసుకు పెందలాడే వెళ్ళకపోతే కష్టం. లక్ష్మణ్ బండి తీసుకు రాలేదు రాత్రి.ఆమాట గుర్తొచ్చేసరికి గుండెగుభేలుమంది. నడిచెళ్లాలా? అమ్మో నావల్లకాదు. గబగబా సైకిల్ దిగాను.‘నైరే! జలేబీమే జిత్నా భీ రెహెనేదో! కెలొరీస్? ఆనేదో? వెయిట్‌లాస్ కేలియే జాయేంగే ఫైనల్లీ‘ మన్‌ప్రీత్ మాటలు వినపడుతున్నాయి.హాయిగా అనిపించింది. అంతే! కెలొరీలు వస్తేరానీ! కడుపు మాడ్చుకుని ఏమిసాధిస్తాం? నేను ఏమీ తినకుండానే బరువు పెరిగిపోతున్నా, ప్చ్నిజంగానే థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకుంటే? జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటారేమో?వెయిట్‌లాస్ ట్రీట్మెంట్కి బరువు గ్యారంటీగా తగ్గుతారంటే ఈ కష్టాలుపడలేక అదీ ట్రైచేశానాయెఏవిటో వేడివేడి హాట్ ప్యాచ్లుఒళ్ళంతా చుట్టి పడుకోబెడతారు ఒకగంట. అదొక్కటీ ఐతే బానేఉండును. రోజుకు గంట బ్రిస్క్‌వాక్ చేయాలి, నిమ్మకాయనీళ్ళు తాగాలి, మధ్యాహ్నం అరకప్పు అన్నమే తినాలి. రాత్రి ఒకపుల్కా మాత్రమే తినాలి‘ అని చెప్పి 30 వేలు కట్టమన్నారు.అవన్నీ చేస్తే ఎలాగూ తగ్గుతాను, బోడి ..వీళ్ళు తగ్గించేదేంటి ? టీవీలో గంటలతరబడి సెలబ్రిటీస్ చేత చెప్పిస్తారు ‘అక్కడికెళ్ళి స్లిమ్‌గా తయారైపోయాను. నా లైఫ్ మారిపోయింది’ అని గబగబా తయారైపోయాను. బాక్స్‌లో రెండు పుల్కాలు, మరో బాక్స్‌లో ఆకుకూర, బుల్లి బుల్లి టప్పర్‌వేర్ డబ్బాలో కీరాముక్కలు. నడవాలంటే నావల్ల అయ్యేలాలేదు. మూడ్ కూడా లేదు.కారు డ్రైవ్ చేసే సహనం ఈ ట్రాఫిక్‌లో నాకు లేదు. నిరుత్సాహంగా ఆటో పిలిచానుప్రతిరోజూ ఇలాగే గడిచిపోతోంది .ఉదయాన్నే గ్రీన్‌టీతో మొదలుపెట్టాలని, బ్రిస్క్వాక్కో, జిమ్కో వెళ్లాలని, బ్రౌన్ బ్రెడ్డూ లేదా ఓట్స్ తినాలని, వారానికి రెండుసార్లయినా యోగా క్లాసుకో, జుంబాకో వెళ్లాలని . జుంబాకి డబ్బుకట్టి కూడా మానేశాను రెండుసార్లు .ఉదయం టైముండదు, సాయంత్రం ఓపికుండదు. అందరూ ఎలా వెళ్తారో మరి. వాళ్లంతా ఇంటిపట్టునుండే గృహిణులా ? గృహిణులైతే మాత్రం పన్లుండవా?పేపర్, ఫేస్బుక్ చూస్తేనే చాలు బోల్డు ఈవెంట్స్ కనిపిస్తాయి. 3కే రన్, 5కే రన్, నెక్లెస్ రోడ్లో నడక, ఎక్కడెక్కడో సినిమా క్లబ్స్, ఫొటో వాక్స్ .. వాటికి వెళ్లేవాళ్లంతా ఔన్సు కూడా కొవ్వు లేకుండా స్లిమ్గాకనిపిస్తుంటారు. బోల్డు డబ్బుండి, పనేమీ ఉండి ఉండదా వాళ్ళకి? ఇదిగో ఇలాటి తొక్కలో తీర్పులే మానెయ్యాలి. ఉత్సాహం ఉండాలిగాని ప్రతి ఈవెంట్‌కీ వెళ్లొచ్చు.మరే, ఉత్సాహం నీకొక్కదానికే ఉంటే చాలా? నువ్వు తిరిగొచ్చే సరికి ఎవరి కాఫీ వాళ్ళు కలుపుకుని తాగేవాళ్లున్నారా కొంపలో? అలాటి ఈవెంట్స్‌కి పోయి తిరిగొచ్చాక, ‘ఎలాజరిగింది ? నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? కాస్త ఏదైనా తిని రెస్ట్ తీసుకో ఇవాళ్టికి. అన్నీ రెడీగా ఉన్నాయి. స్నానం చేసొచ్చి తింటూ ఈవెంట్ కబుర్లు చెప్పు‘ అనేమాట ఎప్పటికైనా వినపడుతుందా? పనిమనిషి ఉన్నాసరే, బోల్డు పని! టిఫిన్లు, లంచ్‌బాక్సులు సర్దటం నుంచి సాయంత్రం కావలసినవి రెడీగా పెట్టుకోడం వరకూ! సరుకులు, కూరగాయలు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే.. ఆఫీసు పని , ట్రాఫిక్‌లో పడి ఇల్లు చేరేలోపు ప్లాన్లు అన్నీ అట్టర్‌ఫ్లాప్ అయిపోతాయి. సెల్ఫ్‌పిటీలో భలేహాయి ఉంది. కళ్ళెమ్మట నీళ్ళొచ్చేలా ఉంటుంది. ‘నేనెంత కష్టపడుతున్నానో‘ అనుకోడంలో ఒక త్యాగం ఉందసలు.టీవీ యాడ్స్‌లో భలే చూపిస్తారు. ఆవిడ ఇంటికెళ్ళాక కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వండి, మావగారికి మందులిచ్చి, అత్తగారికి కాళ్ళునొక్కి... అబ్బా ఆ దేవతా స్త్రీలు ఎక్కడుంటారో? ఆఫీసుకు వెళ్తూనేతెరెసా కనపడింది. దుశ్శకునం! ఇదేమి స్వీట్లూ ఫ్యాట్లూ తెచ్చిందో తినడానికి... లంచ్‌లో టప్పర్‌వేర్ డబ్బా తీసి టేబుల్ మీద పెట్టింది. ‘సున్నుండలు చేసిందమ్మ. నీకిష్టమని తెచ్చా’ అంది.దీనికెవరు చెప్పారో నాకిష్టమని. ప్రతిదీ నాకిష్టమని తెచ్చేస్తుంది. నామీద ఇష్టానికి సంతోషించాలో, కొంచెం కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వనందుకు విసుక్కోవాలో తెలీదు.నా బాక్స్‌లో పుల్కాలు, సొరకాయ కూర తింటూ నీరసంగా సున్నుండల వైపు చూశాను.‘ఒద్దులేవే, ఏమనుకోకు. బరువు తగ్గాలి. బీఎంఐ 32 ఉంది. కనీసం 26కి దిగాలి. వెయిట్ తగ్గాలి. కాస్త సీరియస్‌నెస్ మెయింటైన్ చెయ్యాలి. చూడు నడుం దగ్గర ఎలా ఫ్యాట్ వచ్చేసిందో?అసలు రుజుతాదివేకర్ ‘అదేప్రాబ్లెమ్ మీతో...’ వెనక నుంచి వినిపించింది.ఉలిక్కిపడి వెనక్కుచూశాం. నిహాల్ !‘మీకింకా నడుం దగ్గర టైర్లు రాలేదు. చీర కట్టుకున్నా పర్ఫెక్ట్గానే ఉంది. మొన్న చూశాగా, అంత ఫ్యాట్ ఏమీ లేదులే.’ మండిపోయింది .‘సిగ్గుందా? ఏం వాగుతున్నావ్ ?’ అన్నాను.నిహాల్ స్పూన్‌తో స్ప్రౌట్స్ తింటూ ‘సరిగ్గనే వాగుతున్న! ఎంతసేపూ రుజుతాదివేకర్ నెయ్యి తినమంది, ఫ్రూట్స్ తినమంది, ఫ్యాట్స్ తినమంది అనేదే చూస్తారుగాని ఆవిడ ఎట్ల తినమందో చూడరు. అసలు మీ లేడీస్‌కి హెల్త్ కాన్షస్నెస్ కంటే బ్యూటీ కాన్షస్నెస్ ఎక్కువుంటది. ముప్ఫైఅయిదు దాటినంక కూడా ఇరవైల్లో ఉన్నట్టు ఉంటరా? ఎట్లయితది? ఐడియా మంచిదే! కానీ అందుకు సిచుయేషన్ మీకు కోపరేట్ చేస్తదా లేదా చూసుకోరేంది? పెళ్లి, డెలివరీలు, ఫ్యామిలీ, చాకిరీ ఇవన్నీ మీ బాడీని పెళ్లికి ముందులాగే ఉంచుతయా? ఉంచవు. అందుకే హెల్త్ చూసుకోవాలి. అయినా ముప్పయి దాటాక మరీ సన్నగుంటే బాగోదు. కొంచెం బొద్దుగుంటేనే మంచిగుంటది. ఎక్కణ్ణో ఏదో ఏ మాల్యాగాడి కాలెండరో జూస్తరు. ఆ లెక్కనే ఉండాలంటరు. ఏదైనా డ్రెస్జూస్తే, అది మనకు నప్పుతదా లేదా..అహా ఏంలేదు. పొయ్యి కొనుడు ఏసుకునుడు. ఆమెవరో కొన్నది గాబట్టి మనమూ కొనాలె, అంతే! ఎప్పుడూ ఎవరి లెక్కనో ఉండాలె.అయినా ఎవరికో మీరు నచ్చేదేంది? మీకు మీరు ఎలా ఉన్నా నచ్చాలి. లవ్ యువర్ మిర్రర్ అనే కాన్సెప్ట్ తెలుసా? అద్దంలో మీరెలా ఉన్నా, మీకు మీరు నచ్చాలంట తెల్సా? అరె, ఎప్పుడు చూడు, వాడికి నచ్చాలి, ఈమె లెక్కుండాలి, పార్టీలో మెరిసిపోవాలి, ఎవరి పెళ్లిలోనో మనం సెంటరాఫ్ అట్రాక్షన్ కావాలి. ఏందిది? ఎంతసేపూ ఇదేగోలా? హెల్దీగా తినండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటే బ్యూటీ ఉంటది తెలుసా మొహంలో?’‘అయిందా నీ బోడి ఉపన్యాసం? ఏదో గీత బోధించినట్టు ఫీలవుతున్నావుగానీ ఇక దయచెయ్యి! చంపుతాను ఇంకొక్క మాటమాట్లాడినా‘ అన్నాను కోపంగా... కిక్కిక్కీ అని నవ్వాడు. ‘నాకుతెలుసులే, నేను చెప్పినవన్నీ నిజాలని మీకు తెలుసనీ! నేను మాట్లాడితే మీకు ఇయ్యన్నీ గిల్లినట్టు ఉంటై‘ ‘పోతావా పోవా నువ్వు?‘ ప్లాస్టిక్ గ్లాసు విసిరేశాను.‘సరేసరే, పోతున్నలే’ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.ఇద్దరం నవ్వుకున్నాం హాయిగా.‘అంటే అన్నాడులే కానీ కరెక్ట్‌గానే అన్నాడు’ అంది తెరెసా సున్నుండ తీస్తూ! ఇదసలు స్వీట్ల దగ్గర కాంప్రమైజ్ అవ్వనే అవ్వదు.పుల్కాలు తినడం అయిపోవడంతో, చేయిచాచి సున్నుండ తీసుకున్నా!కమ్మని నెయ్యి వాసనతో ...అమ్మ గుర్తొచ్చేస్తోందినిహాల్గాడు అన్న మాటలన్నీ మాకు తెలీనివా?అమ్మ అనదూ?‘ముప్ఫయి నిండగానే ఈ కడుపు మాడ్చుకోడాలేమిటో? హాయిగా తినకుండా అలా నీరసం మొహాలేసుకుని శవాల్లాగా తయారైతే ఏం అందమనో మరీ చచ్చిపోతున్నారు! పిల్లలు పుట్టాక కూడా మెరుపుతీగలల్లే ఉండాలని అంత తాపత్రయం ఉంటే ఎలాగ? ఉజ్జోగంతో పాటు బోల్డు పన్లుంటాయి కదా; సరిగా తినకపోతే ఎలా? హెల్దీగా ఉంటే చాలదూ? ఎవరికో అందంగా కనపడాలా? ఎంతమందిని మెప్పిద్దావనో?’ బస్సుదిగి నడుస్తున్నా! మా ఆఫీసు ముందే స్టార్టింగ్ పాయింట్ కావడంతో సీటు దొరికేసింది. హాయిగా కూచున్నా.ఇంటికెళ్లి కమ్మగా అన్నం తినేయాలి. పొద్దున్న చేసిన పప్పూ, వంకాయకూర, నిన్న చేసిన గోంగూరపచ్చడి! ఉల్లిపాయలు చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి వెళ్ళగానే. మంచినెయ్యి పంపమని అమ్మకి ఫోన్ చేయాలి.ఇంటికెళ్ళగానే పిండి కలపక్కర్లేదని తలచుకుంటేనే బోల్డు హాయిగా ఉంది.అబ్బా, ఈ నార్త్ వాళ్ళు రోజూ చేతులు విరిగేలా పిండి కలపడం, రొట్టెలు ఒత్తడం ఎలా చేస్తారో పాపం! ఇంటి వీధిలోకి తిరగ్గానే ముందు వెళ్తున్న అమ్మాయిలెవరో పెద్దగానే మాట్లాడుకుంటున్నారు‘నీకు ఎంత చెప్పినా బుర్రకి ఎక్కడం లేదు. అన్నం మానేయాలి. అన్నంలో ఎంత షుగర్ ఉంటుందో తెలుసా? రాత్రిపూట రోజూ పప్పు తింటావు. పప్పు ప్రోటీన్, రాత్రి తినకూడదు. పుల్కాలు కాదు, అసలు రాత్రిళ్లు సలాడ్స్ తినాలి. నాల్రోజులు నిద్రపట్టదు. కానీ ఆ తర్వాత అలవాటైపోతుంది తెలుసా? ఎన్నేళ్లు నీకిప్పుడు?’ ‘ముప్ఫైనాలుగు, అయినా అన్నం ఒక్కపూటయినా తినకపోతే ఎలాగే?’‘అదేమరి! ఈ వయసులో ఫ్యాట్ కూడబెట్టుకుంటే ఇంకా ముందుకు పోయాక అది కరుగుతుందా? ఇప్పుడే జాగ్రత్తపడాలి. ఒక పనిచెయ్యి. కాస్త కష్టపడి కీటో డైట్ ఫాలో అవు. ఈ ఏజ్‌లో బాడీ మెయింటైన్ చెయ్యకపోతే ముందుముందు ఎంతకష్టం! చీరకట్టుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా చక్కగా ఉండాలి. మొన్న కిట్టీపార్టీలో చూశావుగా, అసలు ఒక్కొక్కరు ఎలా ఉన్నారని? కాస్త నోరుకట్టేసుకుంటే ఏమీ చావంలే! లేదంటే నలభై రాకముందే అమ్మమ్మల్లా తయారైపోతాం. ఇప్పటికే ప్రతి అడ్డమైన వెధవా అడ్వాంటేజ్ తీసుకుని ఆంటీ అనేస్తున్నాడు. పొద్దున్నే యాపిల్ సైడర్ వెనిగర్ కాస్త నీళ్ళలో కలుపుకు తాగు.బ్యాగులో బాదంపప్పు పడేసుకుని ఉంచు. గ్రీన్‌టీలో తేనె తగ్గించు. ఏమీ చేయనంటే ఎలా?’ఆటోమేటిగ్గా నా నడక స్లో అయిపోయింది. అడుగులు పడనని మొరాయిస్తున్నాయి. మెదడులో ఆలోచనలు గబగబా చిక్కుముళ్ళు పడిపోతున్నాయి.ఇంటికెళ్లి గబగబా పిండి కలపాలి. కీరాలు ఉన్నాయా ఫ్రిజ్‌లో? పోనీ ఇవాళ్టి సలాడ్ తినేస్తేనో?\రేపు బద్ధకించకుండా గుంజన్ వాళ్ళు రాకముందే లేచి జిమ్‌కి వెళ్లిపోవాలి.రైస్ మానేయాలి. అవును మానేయాలి ... గ్రీన్ టీ అయిపోయింది, తెచ్చుకోవాలి. తేనె? ఒద్దు ఒద్దు తేనెవద్దు. ఒట్టి గ్రీన్ టీయే తాగేస్తాను. సుజాత వేల్పూరి -
గంజాయి చాక్లెట్ల పట్టివేత
కుత్బుల్లాపూర్: గంజాయి విక్రయదారులు రూటు మార్చారు.. గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో వారి కళ్లుగప్పేందుకు చాక్లెట్ల రూపంలో అమ్మకాలు చేపట్టారు.. దీనిపై సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సీఐ సహదేవ్, సిబ్బంది మాటు వేసి విక్రయదారుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి ప్రధాన రహదారిలో పాన్‌షాప్ నిర్వహిస్తున్న దేవేంద్రకుమార్ దాస్ చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడు దాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 400 గ్రాముల గంజాయి, 260 గంజాయి చాక్లెట్లు, సెల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్ సీఐ సహదేవ్, సిబ్బందిని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ గణేష్‌గౌడ్ అభినందించారు. -
చాక్లెట్ సిటీ
నగరం నోరు తీపి చేసుకుంటోంది. చాక్లెట్ రుచికి దాసోహమంటోంది. పుట్టిన రోజైనా,ప్రేమికుల దినమైనా, పరీక్షల్లో పాసైనా, ఆనందించే ఊసేదైనా... ‘చాక్లెట్ పార్టీ’ తప్పనిసరి అంటోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న చాకొలెట్ క్రేజ్‌లో సిటీ గణనీయమైన వాటాపంచుకుంటోంది. ఈ అంశంపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోనే టాప్ సిటీల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. సాక్షి, సిటీబ్యూరో : ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్లెట్ సంబంధ ఉత్పత్తులను కొనుగోలు చేయడంపై దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో చాక్లెట్ల విక్రయాల్లో బెంగుళూర్ తొలి స్థానంలో ఉండగా.. హైదరాబాద్, ముంబై, చెన్నై తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రూపాలెన్నో... రుచి ఒకటే.. ఒకప్పుడు అంటే రాపర్లలో చుట్టిన చిన్న చిన్న చాక్లెట్లు, ఆ తర్వాత డైరీ మిల్క్ లాంటివి... అలా కొన్నే ఉండేవి. ఇప్పుడు విభిన్న మార్గాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. విభిన్న రకాల ఫ్లేవర్లు, ముడి దినుసులలో సులువుగా కలిసిపోయే సుగుణం చాక్లెట్‌ను మరింతగా ప్రేమించేలా చేస్తోంది. ఐస్‌క్రీమ్స్, మిల్క్‌షేక్స్.. ఇలా ప్రతి దానిలో చాక్లెట్స్ ఒదిగిపోతున్నాయి. ఆఖరికి షో పీస్‌గా కూడా ఇవి అమరిపోతున్నాయి. పండ్ల దగ్గర్నుంచి లిక్కర్ దాకా ప్రతిదానికీ జత కడుతున్నాయి. సిరప్‌లతో సహా విభిన్న రూపాల్లో చాక్లెట్లు వినియోగించడం సిటీలో బాగా పెరిగింది. దీంతో చిన్నాపెద్దా తేడా లేకుండా చాకో క్రేజ్‌లో మునిగితేలుతున్నారు. సీ సాల్ట్, స్పైస్, మింట్, కార్డమామ్ వంటి విభిన్న రకాల వెరైటీలు అందుబాటులోకి వస్తుండడం క్రేజ్‌కి మరింత ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా చాక్లెట్స్ విక్రయాల కోసమే చాక్లెట్ హట్, చాకో హబ్ వంటి పేర్లతో రెస్టారెంట్స్ నగరంలో వెలుస్తున్నాయి. ఆన్లైన్ ఆర్డర్స్‌లో ముంబై టాప్.. చాక్లెట్స్ కోసం ఆర్డర్స్ అందిస్తున్న వారిలో 18–24 ఏళ్ల వారే ఎక్కువ. ఆన్లైన్లో చాక్లెట్స్‌ను ఆర్డర్ ఇస్తున్న వారిలో పురుషుల కన్నా 25శాతం మంది మహిళలు ఎక్కువ ఉన్నారు. ఆన్లైన్ ఆర్డర్స్‌కు సంబంధించి ముంబై ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, బెంగళూర్, హైదరాబాద్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే విక్రయాల పరంగా బెంగళూరు ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా హైదరాబాద్, ముంబై తర్వాతి స్థానాల్లో ఉండడం విశేషం. సిటీలో యాప్ ద్వారా అందుకునే డిసర్ట్స్ (స్వీట్స్) ఆర్డర్లకు సంబంధించి 60శాతం వరకు చాక్లెట్ సంబంధ ఉత్పత్తులే. గత రెండేళ్లలో ఏడాదికి 13శాతం వరకు చాక్లెట్ల విక్రయాల్లో పెరుగుదల కనిపిస్తోంది. డెత్ బై చాక్లెట్, హాట్ చాక్లెట్ ఫడ్జ్, చాక్లెట్ మిల్క్‌షేక్, చాక్లెట్ బ్రౌనీ, చాక్లెట్ ట్రఫుల్ పేస్ట్రీ... వంటివి అత్యధికంగావిక్రయమవుతున్నాయి. ఈట్.. చాక్లెట్ ఏదైనా ఫుడ్ కాస్త హెవీగా తీసుకున్న తర్వాత చాకొలెట్‌ను ఎంజాయ్ చేయడం బాగా పెరిగింది. డిన్నర్, స్నాక్స్ పూర్తి చేసిన తర్వాత కూడా సిటీజనులు లెట్స్ చాక్లెట్ అంటున్నారు. విశేషమేమిటంటే... నగరంలో చాక్లెట్లను అర్ధరాత్రి సమయంలోనే ఎక్కువగా ఆర్డర్ ఇస్తున్నారట. అలాగే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తర్వాత కూడా వీటి వినియోగం బాగా ఉంటోంది. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ట్రెండ్ మరింతగా కనిపిస్తోంది. చాక్లెట్ మోమో, చాక్లెట్ పిజ్జా, శాండ్విచ్, చాక్లెట్ గ్రిల్డ్ శాండ్విచ్, చాక్లెట్ టోస్ట్ వంటివి ఆన్లైన్ ద్వారా బాగా ఆర్డర్లు అందుకుంటున్న వాటిలో ఉన్నాయి. చాక్లెట్ కుకీ, చాక్లెట్ పేస్ట్రీస్ ఉదయం ఆర్డర్లలో బాగా ఉంటున్నాయి. అభి‘రుచి’... ప్రతి సంతోషకర సందర్భంలో చాక్లెట్ భాగమవుతోంది. వలంటైన్ డే రోజున విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. సగటున రోజువారీ విక్రయాలతో పోలిస్తే... ఆ రోజున 50శాతం అధికంగా ఉంటున్నాయి. అలాగే మదర్స్ డే, ఫాదర్స్ డే రోజున కూడా విక్రయాల్లో భారీ తేడా నమోదవుతోంది. ఇది ఇష్టం కన్నా ఒక బలహీనతలా మారింది. న్యూటెల్లా లేదా బ్యాకాన్... ఏదైనా సరే చాక్లెట్‌తో కలిపి తీసుకుంటే ఆ టేస్టే వేరు – విధి, ఫుడీ వర్కవుట్‌కి ముందు... సరైన సమయంలో సరైన పరిమాణంలో చాక్లెట్‌ను తీసుకుంటే అది చాలా ఉపకరిస్తుంది. వెయిట్‌లాస్‌కి కూడా పనికొస్తుంది. ప్రీ వర్కవుట్ స్నాక్‌గా నేను చాక్లెట్‌ను తీసుకుంటాను. ఇది నాకు మంచి శక్తిని, చర్మానికి మెరుపును అందిస్తుంది.– స్వీటీ, మోడల్ -
అయ్యో! పిల్లలకిక చాక్లెట్లు ఉండవా?
ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలం అందరూ ఇష్టంగా తినే చాక్లెట్లు కొన్నాళ్లకు ఇక కనిపించకపోవచ్చు. మరో మూడు దశాబ్దాల తర్వాత చాక్లెట్లు పూర్తిగా అంతరించిపోవచ్చని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్ల తయారీకి కకావో వాడతారు. ప్రపంచంలోని కకావో మొక్కల్లో సగానికి పైగా మొక్కలు పశ్చిమాఫ్రికాలోని రెండు దేశాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారానే చాక్లెట్ తయారీ కంపెనీలకు భారీ పరిమాణంలో ముడి సరుకు సరఫరా అవుతోంది. అయితే, పర్యావరణ మార్పులు ఇదే తీరులో కొనసాగితే, 2050 నాటికి సగటు ఉష్ణోగ్రతల్లో 2.1 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ పరిస్థితుల్లో మనుగడ సాగించలేక కకావో మొక్కలు పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కకావో ఎక్కువగా పండే ఆఫ్రికా దేశాల్లో కకావో సాగు పద్ధతులు శతాబ్దాలుగా ఒకే తీరులో కొనసాగుతున్నాయని, సాగు పద్ధతులు ఆధునికతను సంతరించుకోకపోవడం వల్ల కూడా కకావో మొక్కలు ముప్పు అంచులకు చేరుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రముఖ చాక్లెట్ తయారీ సంస్థ ‘మార్స్’ ఆర్థిక సహకారంతో బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు కకావో మొక్కలు అంతరించిపోకుండా కాపాడేందుకు పరిశోధనలు ప్రారంభించారు. -
చాక్లెట్ కనుమరుగు?
సాక్షి, వెబ్‌డెస్క్ : పిల్లలు మారం చేసినప్పుడు పెద్దలు చెప్పే మాట.. అల్లరి చేయకు నీకు చాక్లెట్ కొనిపెడతా అని. భవిష్యత్‌లో ఈ మాటను మనం వినలేకపోవచ్చు. అందుకు కారణం చాక్లెట్‌ను ఉత్పత్తి చేసే కకోవా చెట్లు వేడి వాతావరణంలో బతకడానికి ఇబ్బంది పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో 40 సంవత్సరాల్లో చాక్లెట్ చరిత్రపుటల్లో కలిసిపోతుందని హెచ్చరించారు. చాక్లెట్‌ను ఉత్పత్తి చేసే కకోవా చెట్లు భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెరుగుతాయి. కకోవా చెట్లు వేగంగా ఎదగడానికి తేమ, అధిక వర్షపాతం అవసరం. అయితే, వచ్చే 30 ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 2.1 డిగ్రీలు పెరుగనుందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పాలన సంస్థ పేర్కొంది. దీని వల్ల చాక్లెట్ పరిశ్రమకు కోలుకోలేని నష్టం కలుగుతుందని చెప్పింది. 2050 వరకూ అయినా కకోవా చెట్లను బ్రతికించుకోవాలంటే వాటిని కొండ ప్రాంతాల్లో పెంచాల్సివుంటుందని తెలిపింది. కకోవా చెట్లపై వాతావరణ మార్పు ప్రభావం చూపడం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో మథనం ప్రారంభమవుతుందని పేర్కొంది. ప్రపంచంలో సగం చాక్లెట్‌ను ఉత్పత్తి చేస్తున్న ఐవరీ కోస్ట్, ఘనా దేశాలు ఈ సంక్షోభానికి తలకిందులవుతాయని చెప్పింది. చాక్లెట్ ఉత్పత్తిని ఆపాలా? లేక చనిపోతున్న కకోవాలను కాపాడుకోవాలా అన్న డైలమా ఆ దేశాలను అతలాకుతలం చేస్తుందని వెల్లడించింది. -
చాక్లెట్‌తో షుగర్‌కు చెక్!
మధుమేహం ఉన్నవారు తీయని పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. ఒకవేళ చాక్లెటో, స్వీటో తింటే వారిలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. కానీ రోజూ ఓ చాక్లెట్ తింటే షుగర్ వ్యాధి రాదని చెబుతున్నారు పరిశోధకులు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా శాస్త్రీయంగా దీనిని నిరూపించారు కూడా. రోజూ ఓ చాక్లెట్ తీసుకుంటే టైప్ టూ డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చని, చాక్లెట్లో ఉండే కొకోవా అనే పదార్థం శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా విడుదల చేసేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుదలకు దీటుగా స్పందిస్తుందని బ్రిగ్హామ్ యంగ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడే బీటా కణాలు మెరుగ్గా పనిచేసేందుకు ప్రేరేపించే పదార్థాలు కొకోవాలో పుష్కలంగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురితమైన ఓ అధ్యయనం కూడా వెల్లడించింది. ఒత్తిడిని నియంత్రించి కణాలకు పునరుత్తేజం కల్పించే గుణం కూడా చాక్లెట్లలో ఉందని, కొకోవాపై దశాబ్దకాలంగా ఎన్నో పరిశోధనలు జరిగినా దీని ఉపయోగంపై నిర్దిష్ట ప్రయోజనాలను విశ్లేషిస్తూ సాగిన అధ్యయనం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. -
ఫ్లేవరేట్.. చాక్లెట్
నగరంలో నయామాల్ రకరకాల ఆకృతుల్లో తయారీ ∙ ఫేస్బుక్, ఫోన్ ద్వాకా బుకింగ్.. కొరియర్ ద్వారా విదేశాలకు ఎగుమతి నగరంలో సరికొత్త ట్రెండ్ చాక్లెట్ల తయారీలో రాణిస్తున్న వరంగల్ వాసి సుప్రియ చిన్నపిల్లలు మారాం చేస్తే చాక్లెట్.. సంతోషంలో అదే పిల్లలకు ఇవ్వాలన్నా చాక్లెట్.. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇలా చెప్పుకుంటూ పోతూ వేడుక ఏదైనా అప్పటికప్పుడు నోరు తీపి చేయాలంటే గుర్తుకొచ్చేది చాక్లెట్టే! కొన్నేళ్ల క్రితం ఆశ, న్యూ్రట్రిన్.. ఆపై కాడ్బరీస్.. కొన్నాళ్లకు మరికొన్ని కంపెనీల చాక్లెట్లు మార్కెట్‌కు వచ్చాయి. కానీ అవి కంపెనీ నుంచి వచ్చిన రూపంలోనే ఉంటాయి. మనకు కావాల్సినట్లు కావాలంటే సాధ్యం కాని పరిస్థితి. అయితే, యువతీయువకులే కాదు అన్ని వర్గాల ప్రజలు చాక్లెట్లు కూడా తమకు నచ్చిన రీతిలో, రూపంలో ఉండాలని ఆశిస్తున్నారు. ఇలాంటి వారి ఆశల మేరకు వరంగల్‌కు చెందిన కుక్కడపు సుప్రియ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఏ రూపంలో కావాలి, ఎంత బరువులో ఉండాలనే విషయాన్ని కొద్దిరోజుల ముందు చెబితే చాక్లెట్ తయారుచేసి ఇస్తారు. అంతేనా.. అనుకోకండి! ఫోన్లో లేదా ఫేస్ బుక్ పేజీలో ఆర్డర్ ఇస్తే చాలు చాక్లెట్ రెడీ అవుతోంది. ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆర్డర్ ఇస్తే కొరియర్ ద్వారా చాక్లెట్లు పంపిస్తున్న సుప్రియ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. – వరంగల్ వరంగల్‌లోని దుర్గేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉండే కుక్కడపు సుప్రియ నగరవాసులకు కొత్త మోడల్ చాక్లెట్లను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఇంటీరియల్ డిజైనిం గ్ కోర్సుతో పాటు బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ఆమె చాక్లెట్ల తయారీపై ఆసక్తితో ముంబైలో చాక్లెట్ మేకింగ్ శిక్షణ పొందారు. ఆ తర్వాత సొంత ప్రతిభతో మెళకువలు నేర్చుకుని ఆమె ఎంతో ఆసక్తిగా చాక్లెట్లు తయారు చేస్తున్నారు. మిల్క్ మేడ్, బిస్కోటీస్, హనిఫిల్స్, ఫెరెరో, చాక్లెట్ బొకే వంటి వివిధ రకాల చాక్లెట్లను తయారు చేస్తూ నగరవాసుల మన్ననలు పొందుతున్నారు. వివిధ ఆకారాల్లోని చాక్లెట్లపై బర్త్‌డే గ్రీటింగ్స్, పేర్లు పొందుపరుస్తుం డడంతో సుప్రియ తయారుచేసే చాక్లెట్లు చూడగానే నోరూరేలా ఉంటాయి. చాక్లెట్లను తయారు చేయడమే కాకుండా ప్యాకింగ్ సైతం అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహుమతులుగా చాక్లెట్లు ఇచ్చేందుకు వీలుగా వెరైటీ బాక్స్‌ల్లో అం దంగా ప్యాక్ చేసి వినియోగదారులకు ఇస్తున్నారు. వినియోగదారులకు కావాల్సిన మోడల్లో తయారు చేసి తెలిపిన అడ్రస్‌కు కొరియర్ ద్వారా చాక్లెట్లను పంపిస్తున్నారు. నేనే పరిచయం చేశా నగరవాసులకు కొత్త రకం చాక్లెట్లను నేనే పరిచయం చేశా. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలన్న భావనతో వెరైటీ ఫ్లేవర్లు, ఆకారాల్లో చాక్లెట్లు తయారుచేస్తుండడంతో ఆర్డర్లు బాగా వస్తున్నాయి. మొదట్లో చాలా తక్కువగా వచ్చేవి. ఫేస్బుక్లో పేజీ ప్రారంభించాక ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు బాగా వచ్చాయి. ఇప్పుడు నగరవాసులు సైతం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. – కుక్కడపు సుప్రియ ఫోన్ : 8008018686 అద్భుతమైన ప్యాకింగ్ చాక్లెట్ తయారు చేయడమే కాకుండా ప్యాకింగ్ సైతం ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు సుప్రియ. ప్యాకింగ్‌కు ఉపయోగించిన బాక్స్‌ను బయట పడేకుండా ఇంట్లో షోకేస్‌లో పెట్టుకునేలా ఉండడం వీటి ప్రత్యేకత. చిన్న పిల్లలకు ఇష్టమైన కార్టున్ బొమ్మల మాదిరిగా, సైకిళ్లు, బొకేల రూపంలో తయారు చేసి అందజేస్తుండడంతో వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇతర దేశాల నుంచి సైతం మన జిల్లా నుంచే కాదు ఇతర దేశాల నుంచి సైతం చాక్లెట్లు కావాలని సుప్రియకు ఆర్డర్లు వస్తున్నాయి. డిజైన్లు, ధర ఇత్యాది వివరాలు పొందుపరుస్తూ ఆమె ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేశారు. దీంతో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన నగర వాసులు.. వారి స్నేహితుల ద్వారా చాక్లెట్లు ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రాజస్థాన్, అసోం, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఆమె చాక్లెట్లు పంపించారు. -
బాత్‌టబ్‌లో.. సెన్సేషన్ వీడియో!
-
బాత్‌టబ్‌లో.. సెన్సేషన్ వీడియో!
చాక్లెట్లు అంటే చాలామంది పడిచస్తారు. కొందరు అస్తమానం చాక్లెట్లు నమలడానికి ఇష్టపడితే.. మరికొందరు బాటిళ్లకొద్దీ చాక్లెట్ రసాన్ని తాగే వీరాభిమానుల ఉంటారు. కానీ బ్రిటన్ చెందిన ఓ వ్యక్తి మాత్రం చాక్లెట్ల రసమైన న్యెటెల్లాపై తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. సిమ్రే కాండర్ అనే ఈ యువకుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం గతంలో అతను ఏకంగా 1250 బాటిళ్ల కారం సాస్‌ను తాగాడు. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈసారి మరి వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చాడు. విల్లీవాంక్లోని చాక్లెట్ సరస్సు, చాక్లెట్ ఫ్యాక్టరీలు మనకు తెలుసు. కానీ ఇతను ఏకంగా చాక్లెట్ బాత్‌టబ్ సృష్టించాడు. చాక్లెట్ రసం న్యుటెల్లాతో సాన్నపుకుండీని నింపి.. అందులో మునకవేశాడు. 'వావ్.. వావ్' అంటూ ఒంటినిండా చాక్లెట్ రసాన్ని పూసుకొని.. అందులో జలకాలాడాడు. కొంతసేపటికే ఆ రసం గట్టిగా, జిగటుగా మారిపోవడంతో మనోడికి కదలడమే కష్టమైంది. అయినా అతికష్టం మీద చాక్లెట్ బాత్‌టబ్‌లో మునిగితేలుతూ చిత్రవిచిత్రమైన స్టెప్టులు కూడా వేశాడు. దీంతో రాత్రికి రాత్రే సిమ్రే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో పెట్టిన అతని వీడియోను 30లక్షలమందికి పైగా వీక్షించారు. -
చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి
సి.బెలగల్ (కర్నూలు) : చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం కొండాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రయ్య శెట్టి కుమారుడు వేణు(8) ఆదివారం చాక్లెట్ తింటున్న క్రమంలో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలిపాడు. వారు చాక్లెట్ తీయడానికి తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ముక్కులో నుంచి రక్తం వస్తుండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
చాకోబార్... తింటే హూషార్..
సెప్టెంబర్ 13 ఇంటర్నేషనల్ చాక్లెట్ డే సందర్భంగా చిన్నారులు మారాం చేస్తున్నారా..? చక్కగా చాక్లెట్ తినిపించండి. మీకే మూడ్ బాగాలేదా..? మరేం ఫర్వాలేదు... శుభ్రంగా చాక్లెట్ తినండి. జోష్ తగ్గినా, జోరు తగ్గినా... బేఫికర్‌గా చాక్లెట్ తినండి... హుషారు గ్యారంటీ! చాక్లెట్లు అల్ట్రామోడర్న్గా కనిపిస్తాయే గాని, వాటి వెనుక మూడువేల సంవత్సరాల నేపథ్యం ఉంది. క్రీస్తుకు 1400 సంవత్సరాల పూర్వమే అజ్టెక్లు కోకో వాడుకను కనుగొన్నారు. మాయన్ నాగరికత కాలంలోనూ కోకో వినియోగంలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో వాళ్లు కోకో గింజలతో పానీయం తయారు చేసుకునేవారు. అప్పటి అజ్టెక్ సామ్రాజ్యం మెసోఅమెరికన్ ప్రాంతంలో... అంటే ఇప్పటి మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరగ్వా తదితర దేశాల వరకు విస్తరించి ఉండేంది. అక్కడి అడవుల్లో కోకో చెట్లు విరివిగా ఉండేవి. అజ్టెక్లు కోకో గింజలను ముద్దలా నూరుకుని నీటిలో కలిపి, ఆ పానీయాన్ని కాస్త పులియబెట్టిన తర్వాత తాగేవారు. దీనిని వారు దేవతా పానీయంగా భావించేవారు. కోకో గింజలకు ఔషధ గుణాలు ఉండేవని నమ్మేవారు. వారి నమ్మకంలో నిజం లేకపోలేదని ఆధునిక పరిశోధకులు కూడా గుర్తించారు. అజ్టెక్లు, మాయన్లు కోకో గింజలను కరెన్సీగా కూడా ఉపయోగించేవారు. కోకో గింజల మహత్తు చాలాకాలం వరకు బయటి ప్రపంచానికి తెలియకుండానే ఉండిపోయింది. కోకో... కొలంబస్... కొలంబస్ అనే మగానుభావుడి పుణ్యాన అమెరికా ఉనికి మాత్రమే కాదు, కోకో గింజల మహత్తు కూడా బయటి ప్రపంచానికి తెలిసింది. క్రీస్తుశకం 1502లో కొలంబస్ అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మొదటిసారిగా కోకోతో తయారు చేసే చాక్లెట్ పానీయాన్ని రుచి చూశాడు. కోకో గింజల గురించి, అక్కడి కోకో చెట్ల గురించి తెలుసుకున్నాడు. అనతి కాలంలోనే స్పానిష్ వలస పాలకుల కారణంగా చాక్లెట్ పానీయం స్పెయిన్‌కు, ఆ తర్వాత మిగిలిన యూరోపియన్ ప్రాంతాలకు పరిచయమైంది. ఘనీభవనమే కీలక పరిణామం దాదాపు పంతొమ్మిదో శతాబ్ది వరకు కోకో గింజలతో చాక్లెట్ పానీయమే వాడుకలో ఉండేది. కాఫీ, టీ మాదిరిగానే చాక్లెట్ పానీయాన్ని తాగేవారు. అయితే, స్విస్ కంపెనీ ‘లింట్ అండ్ స్ప్రంగ్లి ఏజీ’ తొలిసారిగా 1845లో చాక్లెట్‌ను ఘనరూపంలో తయారు చేయడం ప్రారంభించింది. చాక్లెట్ బార్లు ఎక్కువకాలం నిల్వ ఉండటం, వాటికి అదనంగా తీపి రుచి చేర్చడంతో త్వరలోనే ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. చాక్లెట్ పానీయంగా కంటే చాక్లెట్ బార్లే విపరీతంగా జనాదరణ పొందాయి. పారిశ్రామిక విప్లవంతో రకరకాల ఆకారాల్లో, రకరకాల పరిమాణాల్లో చాక్లెట్ల తయారీ పుంజుకుంది. చాక్లెట్‌తో కళాకృతులు తయారుచేసి సంబరపడే కళాపోషకులూ పెరిగారు. అజ్టెక్ల హయాంలో మెసోఅమెరికన్ ప్రాంతాలు కోకో పంటకు ఆలవాలంగా ఉంటూ వచ్చినా, ఇప్పుడు మాత్రం కోకో ఉత్పత్తిలో పశ్చిమాఫ్రికా దేశాలదే ఆధిపత్యం. చాక్లెట్టా... మజాకా! చాక్లెట్‌లోని రసాయనాలు నేరుగా భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. దిగులు, స్తబ్దత వంటి ప్రతికూల భావోద్వేగాలను పారదోలి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కోకో గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే రసాయనం మెదడుపై చూపే ప్రభావం వల్ల చాక్లెట్ తీసుకుంటే సంతోషంగా అనిపిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. కోకో గింజల్లోని ‘ఫినైల్ ఈథైలమిన్’ అనే రసాయనం వల్ల చాక్లెట్ తిన్న వెంటనే అలజడి, ఆందోళన సద్దుమణిగి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సానుకూల భావోద్వేగాలు పెరుగుతాయి. చాక్లెట్లు తినొద్దంటూ చాలామంది పెద్దలు పిల్లలను వారిస్తూ ఉంటారు. ఎందుకొద్దని ప్రశ్నిస్తే, పిప్పిపళ్లు వస్తాయని చెబుతుంటారు. అయితే, అదంతా అపోహ మాత్రమే. నిజానికి చాక్లెట్లు దంతక్షయాన్ని నిరోధిస్తాయని, కోకో గింజల్లోని రసాయనాలు నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను అరికడతాయని కూడా పరిశోధనల్లో తేలింది. రోజూ 12 గ్రాముల బరువుండే చాక్లెట్బార్ తింటూ ఉంటే, క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. చాక్లెట్లలో పుష్కలంగా లభించే మెగ్నీషియం ప్రభావం వల్ల టైప్-2 డయాబెటిస్, గుండెజబ్బుల ముప్పు కూడా గణనీయంగా తగ్గుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. చాక్లెట్లలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి చాక్లెట్ చక్కని ఔషధంలా పనిచేస్తుంది. చాక్లెట్లలో ఉండే రాగి వల్ల పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విస్తీర్ణంలో అతిపెద్ద చాక్లెట్బార్ ప్రపంచంలోనే అత్యంత సువిశాలమైన చాక్లెట్ బార్ ఇది. స్లోవేనియాలోని రాడోవ్జికా నగరంలో కోకోలాడ్నికా కక్రెక్ సంస్థ దీనిని రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనిని ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి స్లోవేనియా ప్రధాని కూడా హాజరయ్యారు. దీని విస్తీర్ణం దాదాపు రెండు సాదాసీదా అపార్ట్మెంట్ ఫ్లాట్లంత ఉండటంతో దీనిని తిలకించిన జనాలు నోళ్లెళ్లబెట్టారు. దీని విస్తీర్ణం ఎంతంటారా..? కేవలం 1531.9 చదరపు మీటర్లు మాత్రమే. విస్తీర్ణంలో అత్యంత పెద్ద చాక్లెట్బార్గా ఇది గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. అత్యంత బరువైన చాక్లెట్బార్ ప్రపంచంలోనే అత్యంత బరువైన చాక్లెట్ బార్ ఇది. దీనిని తరలించాలంటే మనుషుల వల్ల కాదు. క్రేన్ల సాయం తీసుకోవాల్సిందే! బ్రిటన్‌లోని డెర్బీషైర్‌కు చెందిన థార్న్టన్స్ సంస్థ దీనిని తయారు చేసింది. నాలుగు మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పు, 0.35 మీటర్ల మందం గల ఈ భారీ చాక్లెట్ బార్‌ను 2011 అక్టోబర్ 7న ప్రదర్శనకు ఉంచింది. దీని బరువు 5,792.5 కిలోలు. అత్యంత బరువైన చాక్లెట్‌గా ఇది గిన్నెస్ రికార్డు సాధించింది. -
చాక్లెట్ తింటే మధుమేహం దూరం!
లండన్ః రోజూ వంద గ్రాముల చాక్లెట్ తిని మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చంటున్నారు తాజా అధ్యయనకారులు. త్వరలో డాక్టర్లు కూడ ఇదో వైద్యంగా సలహా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా ముధుమేహాన్ని నియంత్రించ వచ్చని లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. చాక్లెట్ లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ లెవెల్స్ ను నియంత్రిస్తాయని తద్వారా గుండె జబ్బులు కూడ వచ్చే అవకాశం తగ్గుతుందని చెప్తున్నారు. వార్విక్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు 18 నుంచి 69 ఏళ్ళ మధ్య వయసుగల 1153 మందిపై నిర్వహించిన పరిశోధనల్లో తాజా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చక్కెర వ్యాధి గ్రస్థులు ప్రతిరోజూ వంద గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణకు సహకరించడంతోపాటు ఇతర హృద్రోగ సమస్యలు కూడ చాలావరకూ తగ్గే అవకాశం ఉందని లక్సెంబర్గ్ పరిశోధనల్లో తెలుసుకున్నారు. డార్క్ చాక్లెట్ తయారీకి వినియోగించే కోకోలో మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రతిరోజూ 100 గ్రాముల చాక్లెట్ ను తీసుకోవడం వల్ల లివర్ లోని ఎంజైములు అభివృద్ధి చెంది, ఇన్సులిన్ ను నియంత్రించేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఈ చాక్లెట్ ను ప్రతిరోజూ తీసుకునేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, రోజుకు 28.8 గ్రాముల చొప్పున ప్రతిరోజూ తీసుకునే వారిలో చురుకుదనం పెరిగి ఉత్సాహంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలినట్లు చెప్తున్నారు. అంతేకాక కోకో ఉన్న ఉత్పత్తులను తరచుగా తీసుకోవడం వల్ల కూడ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని, ఇది గుండె మెటబాలిక్ కండిషన్ ను మెరుగు పరుస్తుందని వార్విక్ మెడికల్ స్కూల్ పరిశోధకుల సెవేరియో స్టేంజెస్ తెలిపారు. పరిశోధనా వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు. -
చాక్లెట్ లవర్స్ కి స్వీట్ న్యూస్!
వాషింగ్టన్: మీరు తరచూ చాక్లెట్లు తింటారా? అయితే మీకో స్వీట్ న్యూస్..! తరచుగా చాక్లెట్స్ తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందట. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. చాక్లెట్లలో ఉపయోగించే కోకో చెట్టు గింజల రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది ప్రాచీనకాలం నుంచి తెలిసిన విషయమే. చాక్లెట్లు తినడం వల్ల గుండెకు కూడా మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. అయితే చాక్లెట్ల తినడం వల్ల మనిషి మెదడుపై, ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పటివరకు పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో 23 నుంచి 98 ఏళ్ల వయస్సు గల 968 మంది వ్యక్తులపై దక్షిణ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, అమెరికాలోని మైనీ యూనివర్సిటీ, లక్సంబర్గ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన జరిపారు. వీరిపై పలు పరీక్షలు నిర్వహించడం ద్వారా తరచూ చాక్లెట్ల తినే వ్యక్తుల్లో మెదడు పనితీరు కొంత మెరుగ్గా ఉందని, ముఖ్యంగా కంటిచూపు, జ్ఞాపక శక్తి, వర్కింగ్ మెమరీ వంటి సామర్థ్యాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. -
నోబెల్ చాక్లెట్!
హ్యూమర్ ప్లస్ ‘నాన్నా... చాక్లెట్ కనిపెట్టిన వారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారా?’’ అని అడిగాడు మా బుజ్జిగాడు. ‘‘లేదనుకుంటారా’’ అన్నాను. వాడి ముఖంలో కాస్త అసంతృప్తి కనిపించింది. ‘‘నువ్వు నోబెల్ ప్రైజ్ వాళ్లకు వెంటనే మెయిల్ పెట్టు. దాన్ని కనిపెట్టిన వాళ్లకు అర్జెంటుగా ఇవ్వమని చెప్పు’’ అంటూనే ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ చేతితో తల తాటించుకున్నాడు. ‘‘ఆ... గుర్తొచ్చింది. అన్నట్టు... ‘వెన్నతో పెట్టిన విద్య’ అని మొన్న నువ్వు సామెత చెప్పావు కదా. దానికి బదులు చాక్లెట్‌తో పెట్టిన విద్య అని చెప్పాల్సింది. కొంతమంది పిల్లలకు వెన్న అంతగా నచ్చదు. అదే చాక్లెట్ అనుకో... అందరికీ టేస్టీగా అనిపిస్తుంది’’ అంటూ హడావుడిగా ఆడుకోడానికి వెళ్తున్న టైమ్‌లోనే మా రాంబాబు గాడు జోక్యం చేసుకున్నాడు. వాడు ఇంటర్ఫియర్ ్ఞఅయ్యాడంటేనే నాకు ఫియర్. ‘‘బుజ్జిగాడు చెబుతున్న మాటలు సత్యం రా. అన్నట్టు పిల్లలకు చదువు చాలా స్వీట్ అండ్ టేస్టీగా రావాలనీ చాక్పీసులోని ఫస్ట్ హాఫ్‌కు ఆ పేరు పెట్టారంటావా?’’ అడిగాడు. ‘‘అరేయ్... అది చాక్. సీహెచ్ఏఎల్కే చాక్. ఎల్ సెలైంటు. స్పెల్లింగ్ నేర్చుకో. చాక్ అంటే సున్నం. చాక్లెట్కూ దానికీ సంబంధం లేదు. ఇది వేరే ’’ వాడిని సరిదిద్దడానికి ప్రయత్నించా. ‘‘పిల్లలకు ఎక్కువ పదాలు నేర్చుకోవడం కష్టమవుతుందనీ, ఈజీగా ఉండాలని అలా స్పెల్లింగు మార్చారేమో?’’ సందేహం వెలిబుచ్చాడు. ‘‘ఒరేయ్... నీకు చాక్లెట్ల మీద మోజు మరీ పెరిగి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావ్. అయినా నీ ఇష్టమొచ్చినట్టు చాక్లెట్లు తినడానికి నీది మన బుజ్జిగాడి ఏజ్ కూడా కాదు. వయసు పెరుగుతోంది. హెల్త్ కోసమైనా చాక్లెట్లు కాస్త తగ్గించు’’ వాడి వాదనకు కోపం వచ్చి నేను వాడిని కోప్పడ్డాను. ‘‘పిచ్చివాడా... డార్క్ చాక్లెట్స్ గుండెకు మంచిది. నీకో విషయం తెలుసా. తినకుండా మనసు అదుపులో పెట్టుకుంటూ, షుగర్ ఉన్నవాళ్లు కూడా ఎప్పుడూ కొన్ని చాక్లెట్స్ స్పేర్‌లో పెట్టుకోవాలి. అది వాళ్లకు ఫస్ట్ ఎయిడ్... తెలుసా?’’ అన్నాడు కూల్‌గా. ‘‘చాక్లెట్ ఫస్టెయిడా?’’ ఆశ్చర్య పడ్డాను. ‘‘అవును. షుగర్ ఉన్నవాళ్లలో ఒక్కోసారి అనుకోకుండా షుగర్ లెవల్స్ పడిపోతుంటాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ చాక్లెట్ దగ్గర పెట్టుకోవాలి. బాగా నీరసంగా అనిపిస్తే, గుటుక్కున చాక్లెట్ నమిలాకే, నింపాదిగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. అన్నట్లు నీకో సెన్సార్డ్ సంగతి తెలుసా?’’ అన్నాడు వాడు. ‘‘ఏమిట్రా?’’ అని అడిగా. ‘‘ప్రేమికుల మధ్యన ముద్దుల తర్వాత ఎక్కువగా ఎక్స్ఛేంజ్ అయ్యేది కేవలం చాక్లెట్లే. పైగా కిస్సుతో ఒంట్లో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో చాక్లెట్స్‌తోనూ అలాంటి అనుభూతులే వస్తాయట. ఒక్క ప్రేమికులనే ఏమిటిలే... హోదాల్లో పెద్ద పెద్ద వాళ్లు... తమకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి వచ్చిన తమ సబార్డినేట్లకూ, సహచరులకూ గిఫ్టుగా ఇచ్చేది చాక్లెట్లే. ఎందుకంటే చాక్లెట్లు ప్రేమను బాగా పెంచుతాయట. అంతెందుకు మన దగ్గర శుభకార్యాల్లో నోరు తీపి చేయడం అనే సంప్రదాయం ఉంది. ఆ పని చేసిన పుణ్యమే ఒకాయనను రక్షించింది తెలుసా?’’ అన్నాడు. ‘‘తీపి తినిపించిన పుణ్యం ప్రాణాలు కాపాడిందా?’’ ‘‘అవున్రా. మిల్టన్ హెర్షీ అనే ఆయన చాక్లెట్ల కంపెనీ పెట్టి కోట్ల మంది నోరు తీపి చేశాట్ట. ఆ పుణ్యం వల్లే... లాస్ట్ మినిట్‌లో టైటానిక్ షిప్ మిస్సయ్యాడట’’ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాల్రా’’ అన్నాను నేను. ‘‘సారీ... నాకు కావాల్సింది చాక్ ట్రీట్మెంట్. అయినా... ముందుగా బుజ్జిగాడు చెప్పినట్టు చాక్లెట్ కనిపెట్టిన వాడికి నోబుల్ ప్రైజు ఇవ్వమని డిమాండు చేస్తూ ఒక లెటర్ రాయి. ఎస్సెమ్మెస్‌లు పంపు. ఇవీ సరిపోవు కాబట్టి ఫేస్బుక్లో ఒక ఉద్యమం నడుపు. అన్నట్టు... చాక్లెట్ కనిపెట్టిన వాడికి ఇంకా నోబెల్ ప్రైజు రాలేదేమోగానీ... చాక్లెట్లు తెగ తినే దేశాలకు చెందిన సైంటిస్టులకే ఎక్కువ నోబెల్ ప్రైజులు దక్కాయి. చాకొలేట్ అనే పదంలోని సెకండాఫ్‌లో లేట్ అని ఉన్నా... దాన్ని తినడంలో మాత్రం ఎంతమాత్రమూ లేట్ చేయకూడదు’’ అంటూ చాక్లెటు రేపర్ విప్పి, గబుక్కున నోట్లో పెట్టుకొని కసుక్కున్న కొరికాడు మా రాంబాబు గాడు. - యాసీన్ -
చాక్లెట్ చరితం
ఫ్లాష్ బ్యాక్ పిల్లల అభిమాన తాయిలం చాక్లెట్. పెద్దలకూ ఇది ప్రీతిపాత్రమే. ప్రతి ఆహార పదార్థానికీ చాక్లెట్ ఫ్లేవర్‌ను తగిలించేంతగా మనకు దగ్గరైపోయిందది. అయితే పాశ్చాత్యుల ప్రభావంతో చాక్లెట్ మన దేశానికి కాస్త ఆలస్యంగానే పరిచయ మైంది గానీ, దీని వెనుక దాదాపు నాలుగువేల ఏళ్ల చరిత్ర ఉంది. మాయన్లు, అజ్టెక్లు చాక్లెట్‌ను పానీయంగా తీసుకునేవారు. ఇప్పుడైతే చాక్లెట్‌ను తీపిగా తప్ప మరో రుచిలో ఊహించలేం గానీ, వాళ్లంతా చేదుగానే చాక్లెట్‌ను ఆస్వాదించేవారు. కోకో గింజలకు తేనె, వెనిల్లా, నీరు చేర్చి ఒకలాంటి పానీయాన్ని తయారు చేసుకునేవారు. కోకో గింజలను అజ్టెక్లు దేవతల ఆహారంగా భావించే వారు. ఆ గింజలనే కరెన్సీగా ఉపయోగించేవారు. మెక్సికన్ల నుంచి కోకో గింజలు పదహారో శతాబ్దంలో స్పెయిన్‌కు పరిచయ మయ్యాయి. శతాబ్దం తర్వాత స్పెయిన్ రాచ కుటుంబానికి, ఫ్రెంచి రాచ కుటుంబానికి వియ్యం ఏర్పడటంతో అచిరకాలంలోనే చాక్లెట్ రుచి యూరోప్ అంతటా విస్తరించింది. డచ్ కెమిస్ట్ కోవెన్రాడ్ జొహాన్నెస్ వాన్ హూటెన్ 1828లో కోకో ప్రెస్ యంత్రాన్ని రూపొం దించడంతో, తీపి తీపి మోడర్న్ చాక్లెట్ తయారీకి మార్గం ఏర్పడింది. బ్రిటిష్ కంపెనీ జె.ఎస్.ఫ్రై అండ్ సన్స్ తొలిసారిగా 1847లో చాక్లెట్ బార్‌ను మార్కెట్లోకి తెచ్చింది. -
తొలి మెడిసిన్ చాక్లెట్!
వాషింగ్టన్: చాక్లెట్ ప్రియులకు ‘తీపి’కబురు. చాక్లెట్ తింటే కొలెస్ట్రాల్, కొవ్వు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా మంది నోరు కట్టేసుకుంటారు. అయితే ఈ చాక్లెట్ తింటే అలాంటి ముప్పేమీ ఉండదు. అమెరికాకు చెందిన కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా రక్తపోటును తక్కువగా ఉంచే, మంచి కొలెస్ట్రాల్‌ను శరీరంలో ఉంచే సరికొత్త మెడిసిన్ చాక్లెట్‌ను రూపొందించింది. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉండే చాక్లెట్, కకోలను దీని తయారీలో వాడారు. సాధారణంగా చాక్లెట్ బార్లో కనీసం 70 శాతం కొవ్వు, షుగర్ ఉంటాయి. అయితే కుకా జోకో రూపొందించిన నమూనా చాక్లెట్లో కేవలం 35 శాతమే కొవ్వు, షుగర్ ఉంటాయని ‘మెట్రో’ పత్రిక పేర్కొంది. కోకో మొక్క సారంతో కకోలో ఉండే చేదును తొలగించవచ్చని కంపెనీ ప్రతినిధి అహరొనియన్ చెప్పారు. ఇది చాక్లెట్‌లోని కొవ్వును తొలగిస్తుందని, దీంతో కకో నుంచి లభించే వైద్య ప్రయోజనాలను పొందవచ్చన్నారు. సాధారణ చాక్లెట్లో ఉండే కొవ్వును ఇప్పటికి సగానికి తగ్గించామని, అయితే 10 శాతం కొవ్వు, షుగర్ ఉండే చాక్లెట్‌ను తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు. -
స్వీట్‌గా.. క్యూట్‌గా...
చిన్నతనం నుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లను చూస్తే ఆమెకు నోరూరిపోతుంది. అవన్నీ లాగించేసి బొద్దుగా తయారైంది. ఆమె భారీ సైజ్‌ను చూసి అబ్బాయిలు కూడా ‘బాబోయ్’ అంటూ పారిపోతారు కూడా. అయినా ఆ అమ్మాయి బాధపడలేదు. కానీ తన మనసుకు నచ్చినవాడి కోసం జీరో సైజ్‌లోకి మారిపోదామని డిసైడయ్యింది. మరి.. ఈ అమ్మాయి బరువు తగ్గడానికి ఏమేం చేసింది? తాను అనుకున్నట్లు సన్నబడగలిగిందా? అనే కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైజ్ జీరో’. అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, పోస్టర్స్‌లో అనుష్క లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం, నిరవ్ షా ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. అందరినీ న వ్వించే స్వీట్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
చాక్లెట్...తినడానికే కాదు..!
► చాక్లెట్ తినడానికే కాదు... ముఖారవిందానికి కూడా బాగా పనికొస్తాయి. అదెలాగో చూడండి! ► చాక్లెట్ పొడిలో తగినన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే ఈ మిశ్రమం తో స్క్రబ్ చేసుకుంటే ముఖం, మెడ, చేతులు, పాదాలు కాంతివంతంగా తయారవుతాయి. ఉప్పు మృతకణాలను తొలగిస్తుంది. మిగతా పదార్థాలు ముఖాన్ని అందంగా మారుస్తాయి. ► మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలతో బాధపడేవారు టీ ట్రీ ఆయిల్‌తో మంచి ఫలితం పొందవచ్చు. రోజు విడిచి రోజు ముఖానికి ఆ ఆయిల్ రాసుకొని రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోండి. ఇది వాడేటప్పుడు వేరే క్రీములు వాడకపోవడం మంచిది. ఇలా చేస్తే మచ్చలను దూరం చేయడంతో పాటు మొటిమలు రావడాన్నే అరికడుతుంది. -
గీతా టీచర్ చాక్లెట్లను మరువలేను
మా మంచి మాస్టారు నేను మూడో తరగతి చదువుతుండగా గీతా టీచర్ రోజూ చాక్లెట్లు ఇచ్చేవారు. కల్టెకర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆమె పనిచేస్తున్న పాఠశాలకు వెళితే అప్పుడు కూడా చాక్లెట్లు ఇచ్చి ప్రేమను పంచారు. ఈ తీపి గుర్తులను ఎప్పటికీ మరువలేను. కాకినాడ గాంధీ సెయింట్ థెరిస్సా పాఠశాలలో చదువుతుండగా తెలుగు మాస్టార్లు భాస్కర రామ్మూర్తి, చింతామణి చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తున్నారుు. సైన్స్ మేడమ్ సావిత్రి, ఇంగ్లిష్ టీచర్ సత్యనారాయణ పాఠాలను ఎన్నటికీ మరువలేను. ఇంటర్ చదువుతుండగా లెక్చరర్ రాఘవరావు చదువులో ఎంతో ప్రోత్సహించారు. నేను కలెక్టర్ కావడానికి వీరందరూ కారకులు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. ఉపాధ్యాయులతో విద్యార్థి అనుబంధం జీవితాంతం ఉంటుంది. జీవితంలో చిరస్థాయిగా ముద్ర వేసేది గురువు ఒక్కరే. గతంలో ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. ప్రస్తుతం సర్వశిక్షా అభియూన్ కారణంగా పాఠశాలలకు వసతులు, సదుపాయూలు కల్పిస్తున్నారు. వీటిని ఉపయోగించుకుని ప్రభుత్వ బడుల్లో చక్కగా చదువుకోవచ్చు. ఉపాధ్యాయులూ వసతులను అందిపుచ్చుకుని నాణ్యమైన విద్యను అందిస్తే ఎందరో కలెక్టర్లు, ఎస్పీలు సర్కారీ బడుల్లో నుంచే వస్తారు. - కలెక్టర్ కె.భాస్కర్ సిస్టర్ జఫ్రిన్ నాకు ఆదర్శం చదువంటే అక్షరాస్యతే. జ్ఞానమే అసలైన చదువు. నేడు గురువులను విద్యార్థులు చులకనగా చూస్తున్నారు. ఇది మారాలి. గురువును దైవంగా భావించాలి. నేను విజయవాడ అటికిన్స్ బాలికల పాఠశాలలో చదువుతున్నప్పుడు సిస్టర్ జఫ్రిన్ ఆదర్శంగా ఉండేవారు. ఆమె పిల్లలపై చూపించే ప్రేమ, కరుణ నన్నెంతో ఆకట్టుకున్నారుు. చిన్నప్పుడే నాలో నాయకత్వ లక్షణాలు గుర్తించి గురువులు ప్రోత్సహించారు. కళాశాల స్థాయిలో సిస్టర్ స్టెల్లా, డిగ్రీ కళాశాలలో సిస్టర్ డాక్టర్ బీనీ, లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీబీ కుమార్, కాంపిటేషన్ పరీక్ష శిక్షణలో కరీం సార్ నా ఉన్నతికి భాగస్వాములయ్యూరు. నా తల్లిదండ్రులే నా మొదటి గురువులు. - కేజీవీ సరిత, ఏలూరు డీఎస్పీ విక్టర్ సార్ ఇంటికొచ్చి మరీ తీసుకువెళ్లేవారు నేను ఎలిమెంటరీ స్కూల్‌కు వెళ్లే రోజుల్లో పొలాల వెంట తిరుగుతుంటే మా మాస్టారు జార్జి విక్టర్ వెంటాడి మరీ నన్ను పట్టుకుని బడికి తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి స్కూల్‌కి వెళ్లకపోతే ఇంటికి వచ్చి మరీ తీసుకువెళ్లేవారు. చదువులో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిచ్చేవారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడ ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసే జార్టి విక్టర్ మాస్టారులాంటి ఉపాధ్యాయులు ఇప్పుడూ కావాలి. హైస్కూల్ స్థాయిలో తెలుగు మాస్టారు వాసుదేవశాస్త్రి అభినయంతో బోధించే విధానం బాగుండేది. బ్రహ్మచారిగా మిగిలిన ఆయన తన ఇంటి వద్దే పిల్లలను ఉంచి చదివించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధ్యాయులు మేల్కొనాలి, సర్కారీ విద్యను కాపాడుకోవాలి. గురువులు స్ఫూర్తినిస్తూ విద్యార్థులకు నైతికతతో కూడిన విద్యను అందించాలి. - డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి బయోలజీ మేడమ్ స్ఫూర్తితోనే.. విజయనగరం జిల్లాలో నేను డిగ్రీ చదువుతుండగా మైక్రో బయోలజీ చెప్పడానికి షర్మిలాబేగం అనే లెక్చరర్ వచ్చేవారు. కేవలం ఆమె పాఠాలు చెప్పి ఊరుకునేవారు కాదు. ఉన్నత లక్ష్యాలను ఎలా ఏర్పరుచుకోవాలి, వాటిని చేరుకోవడానికి ఎలా పరిశ్రమించాలి అనే విషయూలు చెప్పేవారు. ఆమే నాకు స్ఫూర్తి. నేను గ్రూప్స్‌కు సెలెక్ట్కాక ముందు విశాఖలో మూడేళ్లు ఉపాధ్యాయురాలిగా పనిచేశా. నేను ఈ రోజు డీఎస్పీ కావడానికి షర్మిల మేడమ్ కారణం. -పి.సౌమ్యలత, డీఎస్పీ, నరసాపురం గురువుల దయతోనే ఈ స్థాయికి గురువుల దయతోనే జిల్లా ఎస్పీ స్థారుుకి ఎదిగాను. నన్ను ప్రభావితం చేసిన వారిలో మొదటి స్థానం అమ్మ మంజు మల్లిక్, నాన్న లక్ష్మీకాంత మల్లిక్‌కు దక్కుతుంది. పాఠశాల స్థాయిలో ఉండగా కన్నబిడ్డలా భావించి రాంచీలోని పాఠశాలలో అక్షరాలు దిద్దించిన మెనెన్ మేడం, హైస్కూల్లో మ్యాథ్స్ నేర్పించిన సుకుమార్ సార్, రామకృష్ణమఠంలో స్వామి శ్రద్ధానందజీ మహరాజ్, ఐఐటీలో పాల్ సార్, మిశ్రా సార్, దామోదర్ సార్‌ను ఎన్నటికీ మరిచిపోలేను. నన్ను వారెంతగానో ప్రభావితం చేశారు. అడుగడుగునా ప్రోత్సహిస్తూ మార్గదర్శకులుగా నిలిచారు. వృత్తిపరంగా రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ రాముడు, ఏలూరు డీఐజీ హరికుమార్, అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు, సీఐడీ ఏడీజీ ద్వారకాతిరుమలరావును గురువులుగా భావిస్తున్నా. గురు పూజోత్సవం సందర్భంగా వీరందరినీ స్మరించుకోవడం ఆనందంగా ఉంది. - భాస్కర భూషణ్, జిల్లా ఎస్పీ గురువే మార్గనిర్దేశకుడు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర కీలకంగా ఉంటుంది. గురువులే మన మార్గనిర్దేశకులు. తల్లితండ్రుల తర్వాత ఆ స్థానాన్ని గురువుకు ఇచ్చాం. నిజానికి పిల్లల విషయంలో తల్లితండ్రులతో సమానమైన బాధ్యతను గురువు నిర్వర్తింటారు. నా చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. నేను ఈ స్థితికి రావడానికి చాలామంది ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంది. ప్రతి ఒక్కరూ గురువును పూజించాలి. గురువు సూచించిన మార్గంలో నడవాలి. - డి.పుష్పమణి, ఆర్డీవో, నరసాపురం -
చాక్లెట్‌తో గుండెజబ్బులు దూరం...
కొత్త పరిశోధన చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ చాక్లెట్‌ను ఇష్టపడతారు. అయితే, బరువు పెరుగుతామనే భయంతో పెద్దవాళ్లలో చాలామంది చాక్లెట్ జోలికి పోవాలంటే వెనుకాడుతారు. చాక్లెట్ తినడానికి భయపడాల్సిందేమీ లేదని, పైగా రోజూ చాక్లెట్ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కాట్లాండ్లోని అబెర్డీన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 21 వేల మందిపై గడచిన పన్నెండేళ్లలో నిర్వహించిన పరిశోధనలు చాక్లెట్‌లోని సుగుణాలను నిగ్గు తేల్చాయి. చాక్లెట్ రుచి చూడని వారితో పోలిస్తే అడపా తడపా చాక్లెట్‌ను ఆస్వాదించే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 11 శాతం వరకు తక్కువగా ఉంటాయని, క్రమం తప్పకుండా రోజూ చాక్లెట్ తినే వారికి గుండెజబ్బుల ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందని, అలాగే మరణానికి దారితీసే జబ్బులు వచ్చే అవకాశాలు 45 శాతం మేరకు తగ్గుతాయని ఈ పరిశోధనల్లో తేలింది. -
చాక్లెట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సిద్ధూ
-
కెమిస్ట్రీ అదిరింది!
జై ఆకాశ్, తమన్, ఆర్చన నాయకా నాయికలుగా రావుట్ల లింగం నిర్మిస్తున్న చిత్రం ‘చాక్లెట్’. రామకృష్ణ వీర్నాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఉపశీర్షిక ‘ఎ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్’. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ ఆదర్శంతో ఈ చిత్రం చేశాం. ఇందులో జై ఆకాశ్, అర్చన మధ్య కెమిస్ట్రీ గురించి అందరూ చెప్పుకుంటారు. పాటల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇందులో రెండో హీరోగా నటిస్తున్న తమన్‌కి మంచి బ్రేక్ వస్తుంది. త్వరలో రెండో షెడ్యూల్ ఆరంభించనున్నాం’’ అని చెప్పారు. -
ఐస్‌క్రీమ్ ప్రేరణతో...
జై ఆకాశ్, అర్చన, కోమల్ శర్మ, సోనాల్ ఝాన్సీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్ హారర్ థ్రిల్లర్ ‘చాక్లెట్’. రామకృష్ణ వీర్నల దర్శకుడు. రావుట్ల లింగం నిర్మాత. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలు తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని జై ఆకాశ్ చెప్పారు. చాక్లెట్‌ని అందరూ ఎలా ఇష్టపడతారో... ఈ సినిమాను కూడా అలాగే అందరూ ఇష్టపడతారని అర్చన అన్నారు. వచ్చేనెలలో రెండో షెడ్యూల్ మొదలుపెడతామనీ, రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ టైటిలే తమ ‘చాక్లెట్’ టైటిల్‌కి ప్రేరణ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రామరాజు, సంగీతం: ప్రేమ్. -
‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో...
జై ఆకాశ్, తమన్ హీరోలుగా, అర్చన కథానాయికగా రూపొందనున్న చిత్రం ‘చాక్లెట్’. ‘ఎ స్వీట్ లవ్‌స్టోరి’ అనేది ఉపశీర్షిక. రామకృష్ణ వీర్నాల దర్శకుడు. రావుట్ల లింగం నిర్మాత. త్వరలోనే సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో హాస్యం కలగలిపిన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని తెలిపారు. ‘సత్యం’రాజేశ్, ‘చిత్రం’శ్రీను, ‘ఛత్రపతి’ శేఖర్, పొట్టి విజయ్, ఆర్కేవి, సౌజన్య, అలీభాయ్, వాసు తదితరులు ఇతర పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి కెమెరా: రామరాజు, సంగీతం: ఎల్.ఎం.ప్రేమ్. -
చాక్లెట్ ఫ్రీ..
చాక్లెట్ తలచుకుంటేనే చవులూరిస్తుంది. చాక్లెట్ ప్రియులకు ఇది మరింత నోరూరించే విషయం. నోట్లో వేసుకుంటే కరిగిపోయే టాప్‌క్లాస్ చాకోస్.. ఫ్రీగా వస్తున్నాయంటే అంతకన్నా కావాల్సిందేముంది? బెంగళూరుకు చెందిన జస్ట్‌బేక్ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న తమ 90 అవుట్‌లెట్స్‌లో నిర్వహిస్తున్న ‘చాకో సునామి’లో భాగంగా కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. ‘హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మా జస్ట్‌బేక్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. వీటిని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు. వారికి ఈ రకంగా మేం థాంక్యూ చెబుతున్నాం’ అంటూ తమ ఫ్రీ శాంప్లింగ్ ఆఫర్ గురించి వివరించారు సైబరాబాద్‌లోని జస్ట్‌బేక్ నిర్వాహకులు రామిరెడ్డి. బెస్ట్ యూరోపియన్ చాక్లెట్స్‌ను ఉచితంగా టేస్ట్ చేయమని ఆహ్వానిస్తున్న మొదలైన ఈ ఆఫర్ వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తుల్లో చాకొలెట్ బార్స్, సెంటర్ ఫిల్డ్ చాకొలెట్స్, మౌస్సి, శాబుల్స్.. ఉన్నాయి. జస్ట్‌బేక్ అవుట్లెట్ సందర్శించిన సింగర్ హేమచంద్ర చాక్లెట్ రుచులను ఆస్వాదించారు. ఏం చేయాలి? ‘కస్టమర్స్ మా వెబ్సైట్www.justbake.in లో విజిట్ చేసి కూపన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 56677కు JB choco అని ఎస్సెమ్మెస్ పంపితే చాలు.. ఈ వారం రోజులూ చాకొలెట్ ట్రీట్ ఫ్రీగా అందిస్తాం’ అని తెలిపారు నిర్వాహకులు. -
ఇ-వ్యాపారానికి ఫేస్బుక్ వేదిక!
ఒకవైపు దేశంలో ఇ-కామర్స్ విస్తృతి పెరుగుతోంది. ఆన్లైన్ లో రిటైయిల్ మార్కెటింగ్‌కు అవకాశం ఇచ్చే వెబ్సైట్లు కోట్లలో సొమ్ము చేసుకొంటున్నాయి. ఇలాంటి సైట్ల సంఖ్య వందల్లో ఉంది. వాటి మధ్యనే తీవ్రమైన పోటీ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఔత్సాహికులు ఎవరైనా ఒక వెబ్సైట్ స్థాపించి, దాన్ని పాపులర్ చేసి, ఇ-కామర్స్ రంగంలో దూసుకుపోవడమంటే మాటలు కాదు. మరి ఇలాంటి ఆలోచ నతో ఒక ప్రత్యామ్నాయమార్గాన్ని సృష్టించుకొన్నారు ‘గిఫ్టింగ్హ్యాపినెస్’ నిర్వాహకులు. ఒక ఫేస్బుక్ పేజ్ ద్వారా ఇ-మార్కెటింగ్ నిర్వహించడమే వీరు చేస్తున్న పని. ప్రత్యేకంగా వెబ్సైట్ అవసరం ఏమీ లేకుండా... ఫేస్బుక్ పేజ్ నుంచే నేరుగా వీరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. గిఫ్టింగ్హ్యాపీనెస్ అనే ఫేస్బుక్ పేజ్‌లోకి వెళ్లి అక్కడ ఉంచిన రకరకాల వస్తువులను చూసి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు లేదా సైట్ వాళ్ల దగ్గర నుంచి స్నేహితుల ఇంటికి పార్శిల్ చేసి పంపవచ్చు. వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి, దాన్ని పాపులర్ చేసి... వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా ప్రశాంత్ జైన్ అనే వ్యక్తి ఫేస్బుక్ పేజ్‌కి రూపకల్పన చేశాడు. మరి ఫేస్బుక్ ద్వారా నగదు బదిలీ ఎలా.. ఫేస్బుక్ పేజ్‌ను నమ్మేదెలా? అనే సందేహాలు సహజంగానే వస్తాయి. అయితే ఒక్కసారి ఈ పేజ్‌లోకి ఎంటర్ అయితే సందేహాలు, అనుమానాలు దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ప్రస్తుతం ఈ పేజ్ ద్వారా దాదాపు 240 నగరాలకు వస్తువులను డెలివరీ చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సైట్లో కనీసం పది రూపాయల ధర నుంచి వస్తువులు అందుబాటులో ఉంటాయి. చాక్లెట్లు, కేక్‌లు, పూలు, స్వీట్ల దగ్గర నుంచి బహుమతులుగా ఇవ్వదగిన దాదాపు 1500 వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న వ్యాపారం కాబట్టి దీన్ని ఎఫ్-కామర్స్‌గా పిలుచుకోవచ్చని నిర్వాహకులే అంటున్నారు. ఆలోచన ఉండాలి కానీ.. ఆన్‌లైన్‌ను అనుసంధానం చేసుకొని అనేక మార్గాల ద్వారా వ్యాపారం చేయవచ్చనే సందేశాన్ని, ఫేస్బుక్ ను చూస్తూ చూస్తూనే చిన్న చిన్న గిఫ్ట్స్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఇస్తుంది ఈ పేజ్!