Expired Chocolates And Protein Products Found On Nellore Road - Sakshi
Sakshi News home page

రోడ్డుపై గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు..

Aug 1 2021 2:13 PM | Updated on Aug 2 2021 9:06 AM

Expired Chocolates And Protein Products on Nellore Road - Sakshi

రోడ్డుపై కుప్పలుగా పడిఉన్న చాక్లెట్లు..

నెల్లూరు: మనలో చాలా మందికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్‌ను ఇష్టంతో తింటుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి స్నేహితులు.. ప్రేమికుల మధ్య ఏదైన చిరుకోపాలు వచ్చినప్పుడు చాక్లెట్‌లు ఇచ్చి వారి మనస్సును కూల్‌ చేసేస్తారు. అందుకే, ప్రేమికుల దినోత్సవానికి ముందు లవర్స్‌ చాక్లెట్‌డేను కూడా జరుపుకుంటారు. అయితే, ఇలాంటి చాక్లెట్‌లు రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పడికనిపించాయి.

వివరాలు.. నెల్లూరులోని ఏసీ నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు.. రోడ్డు పక్కన చాక్లెట్‌లు, ప్రోటిన్‌ పౌడర్‌లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు.  ఈ క్రమంలో వారు ఇంటికి వెళ్లి చూడగా.. ఆ చాక్లెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. అయితే, ఈ సంఘటనతో షాక్‌కు గురైన స్థానికులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పారిశుద్ధ్య  అధికారులు చాక్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement