expired
-
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్‌ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
వాటర్ బాటిల్లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?
నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే క్లోజ్డ్ బాటిల్లోని నీటికి గడువు తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్ బాటిల్‌పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్ బాటిల్లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్ గడువు తేదీ అని దాని అర్థం. వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు. కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్‌ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి, ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. -
నేటితో ‘వరంగల్’ పదవీకాలం ముగింపు! తదుపరి మరెవరికీ?
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం నేటి (శుక్రవా రం)తో ముగియనుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యమకారులకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ రావడంతో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చైర్మన్ పదవికి రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఐదేళ్ల వరకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ డ్రా పద్ధతిలో చైర్మన్ల పదవీ కాలాన్ని నిర్ణయించారు. రిజర్వేషన్ ఇలా.. మొదటిసారి జనరల్, రెండోసారి బీసీ, మూడోసారి ఎస్సీ మహిళ, నాలుగో సారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్‌కు చెందిన మంద వినోద్‌కుమార్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 02–09–2013లో చైర్మన్‌గా నియమితులై 28.02.2015 వరకు కొనసాగారు. రిజర్వేషన్ అమల్లోకి రావడంతో తొలి శాసనసభ స్పీకర్‌గా ఉన్న మధుసూదనాచారి అనుయాయుడు పరకాల నియోజకవర్గానికి చెందిన కొంపెల్లి ధర్మరాజుకు వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన 15–10–2016 నుంచి 06–10–2018 వరకు పూర్తిగా రెండేళ్ల పాటు చైర్మన్‌గా పని చేశారు. మరోసారి పదవి పొడిగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారుడి కోటాలో అదే నియోజకవర్గానికి చెందిన చింతం సదానందం చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఆయన 21 డిసెంబర్ 2019లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ మరో ఆరు నెలల పాటు పొడిగింపు పొందడంతో 19–06–2021వరకు ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగారు. మరో ఆరునెలలు పొడిగింపునకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పదవి దిడ్డి కుమారస్వామికి దక్కకపోవడంతో మార్కెట్ పదవి కావాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పట్టుబట్టి దిడ్డి కుమారస్వామి సతీమణి భాగ్యలక్ష్మిని చైర్‌పర్సన్‌గా చేశారు. కాగా.. కాజీపేట, పరకాలకు చెందిన నాయకులకు చైర్మన్ పదవీ ఇవ్వాలని ఇతర పెద్ద నాయకులు ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ రాజకీయాల వల్ల ఉద్యమకారులకు ద క్కకుండా పోయింది. దిడ్డి భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌గా 19–08–2021నుంచి 18–07–2022 వరకు కొనసాగారు. మరో ఏడాది పాటు కమిటీ గడువు పెంచాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసినా పొడిగించలేదు. ఈసమయంలోనే పరకాల నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి ఈ పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించడం వల్ల ఉన్న కమిటీ పొడిగింపులో జాప్యం జరిగింది. కొత్త చైర్మన్ నియామకానికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో చివరికి ఇదే కమిటీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో దిడ్డి భాగ్యలక్ష్మి 18–08–2023 వరకు చైర్‌పర్సన్‌గా రెండేళ్ల పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈసారైనా దక్కేనా? వరంగల్ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆప్రాంతానికి చెందిన వారికి చైర్మన్ పదవి దక్కలేదు. గతంలో చైర్మన్ పదవి తన నియోజకవర్గానికే ఇవ్వాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పట్టుబట్టినప్పటికీ వచ్చేసారి రిజర్వేషన్ అమలు అవుతున్నందున తప్పకుండా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన మిన్నకుండిపోయారు. అందువల్ల ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వారికే పదవి అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు నూతన కమిటీ ఏర్పాటు చేసి తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలన్న ఆలోచన సైతం నాయకులు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారంతో మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవుతున్నందున కొత్త కమిటీని నియమిస్తారా? ఎన్నికలు ముగిసే వరకు స్పెషల్ ఆఫీసర్‌తో పూర్తి చేస్తారా? అనేది వేచి చూడాలి. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృ వియోగం
పాలమూరు: ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాతృ మూర్తి శాంతమ్మ (70) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం ఆమె పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్‌లోని మంత్రి నివాసానికి తరలించారు. సాయంత్రం పాలకొండ సమీపంలోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతి నిధులు శాంతమ్మకు నివాళి అర్పించి.. శ్రీనివాస్‌గౌడ్‌ను పరా మర్శించారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తండ్రి నారాయణగౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరణించారు. శాంతమ్మ మృతితో మంత్రి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తికి గవర్నర్, సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. -
చనిపోయిన ప్రియుడికి కోపం తెప్పించిన ప్రియురాలు.. దెయ్యమై..
లండన్: సాధారణంగా తీరని కోరికలతో చనిపోయిన వారి మనసుకు ప్రశాంతత ఉండదని భావిస్తారు. అలాంటి వారు ఆత్మలుగా మారి.. తమకు నచ్చిన వారి చుట్టు తిరుగుతుంటారని భయపడుతుంటారు చాలా మంది. ఇలాంటి అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఇదే తరహా ఘటన ఒకటి ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. 38 ఏళ్ల బ్రోకార్డ్ ఆక్స్ఫర్డ్ షైర్‌కు గాయనిగా పనిచేస్తుంది. బ్రోకార్డ్, ఎడ్వర్డో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత.. ప్రియుడు ఎడ్వర్డ్ చనిపోయాడు. ఈ క్రమంలో బ్రోకార్డ్ .. తన ప్రియుడు చనిపోయిన కూడా అతనితో ఉన్న గడిపిన క్షణాలను ప్రతి క్షణం గుర్తుచేసుకుంటు ఉండేది. అతను తన చుట్టు ఉన్నట్లు భావించేది. ఒక రోజు బ్రోకార్డ్ తన ప్రియుడు ఎడ్వర్డోతో ఉన్న సంబంధాన్ని మీడియా సమావేశంలో పంచుకుంది. ప్రియుడితో గడిపిన ప్రత్యేక క్షణాలు, ప్రేమను పబ్లిగ్గా పంచుకుంది. ఆతర్వాత నుంచి బ్రోకార్డ్.. తన ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఎడ్వర్డ్ కోపంగా ఉన్నాడని నాకు అనిపిస్తోందని తెలిపింది. ఇంట్లో ఏదో రకమైన అలజడి నాకు వినిపిస్తుంది. అతను..నాపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకార్డ్ బాధపడింది. మా రొమాన్స్ గురించి పబ్లిగ్గా పంచుకున్నందుకు చనిపోయిన నా ప్రియుడు కోపంగా ఉన్నాడని తెలిపింది. అయితే.. ఇంగ్లండ్‌లో హలోవిన్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. చనిపోయిన ఆత్మలు.. హలోవిన్ను వాలెంటైన్స్గా భావిస్తారని అక్కడి వారు నమ్ముతారని తెలిపింది. తన ప్రియుడికి కెండిల్స్ను వెలిగించి .. నచ్చిన పదార్థాలను వండి నా ప్రియుడి ముందు ఉంచుతానని తెలిపింది. అదే విధంగా.. ప్రతి ఒక్కరికి వ్యక్తి గత విషయాలు ఉంటాయి. అవి బహిరంగంగా పంచుకుంటే బాధ, కోపం వస్తుంది. ఈ విషయంలో.. నా ప్రియుడికి కూడా అలాగే కోపం వచ్చుంటుందని బ్రోకార్డ్ బాధపడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని మహిళ మృతి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి ఆందోళనకరంగా విస్తరిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ తీసుకొని మహిళ మరణించిన ఘటన ఆందోళన రేపింది. పైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గుండె సంబంధిత సమస్యలతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో ఫైజర్ టీకా కారణంగా దేశంలో తొలి మరణమని న్యూజిలాండ్ ఆరోగ్య అధికారులు ప్రకటించారు. టీకా కారణంగా ఉత్పన్నమైన మయోకార్డిటిస్ సమస్యతో ఆమె చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. టీకా స్వీకరించిన తర్వాత అనారోగ్యంతో మహిళ మరణించిందని కోవిడ్ భద్రతా పర్యవేక్షణ బోర్డు సమీక్ష అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బాధిత మహిళ వయస్సును ప్రకటించ లేదు. ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి అరుదైన సైడ్ఎఫెక్ట్ మయోకార్డిటిస్ కారణంగా మహిళ మరణం సంభవించిందని ఈ ప్రకటన పేర్కొంది. అయితే ఈ పరిణామంపై ఫైజర్ ఇంకా స్పందించాల్సి ఉంది. మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల వాపు. ఇది రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. హృదయ స్పందనల తీరులో మార్పులకు కారణమవుతుంది. కాగా కరోనాను పూర్తిగా కట్టడి చేసిన దాదాపు ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్‌లో డెల్టా వేరియంట్ భారీగా వ్యాప్తిస్తోంది. సోమవారం 53 కొత్త కేసులను నివేదించింది, ప్రస్తుత వ్యాప్తితో మొత్తం సంఖ్య 562 కి చేరుకుంది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. కాగా దేశంలో ఫైజర్/బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా టీకాలను న్యూజిలాండ్ అధికారులు తాత్కాలికంగా ఆమోదించారు. -
ఆడుకుంటానని వెళ్లిన బాలుడు.. అంతలోనే
సాక్షి, రుద్రంగి(కరీంనగర్): ఆడుకుంటానని చెప్పి వెళ్లిన బాలుడు ట్రాక్టర్ ఢీకొనడంతో మృత్యువాత పడిన ఘటన గురువారం చందుర్తి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వేములవాడ మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన రాచర్ల కవిత, నర్సయ్యల కుమారుడు రిషి(5). చందుర్తిలోని అమ్మమ్మ ఇంటికి శుభకార్యానికి వచ్చారు. ఆడుకుంటానని చెప్పి వెళ్లి ఇంటిముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని బాలుని మృతికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్ గామా మహేష్‌ను అదుపులోకి తీసుకొని, బాలుని తండ్రి రాచర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ గామా మహేష్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై సునీల్ తెలిపారు. మృతదేహంతో ధర్నా.. బాలుడి మృతికి కారణమైన ట్రాక్టర్ యజమాని షేక్ సల్మాన్ ఇంటి ముందు బాలుడి మృతదేహాన్ని ఉంచి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాచేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకొని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): కోర్టు తీర్పును టైప్ చేస్తూ గుండెపోటుతో స్టెనోగ్రాఫర్ మృతిచెందారు. ఈ ఘటన తిరువళ్లూరు ఉమ్మడి కోర్టు ఆవరణలో మంగళవారం జరిగింది. చెన్నై కోడంబాక్కం ఆండవర్‌నగర్‌కు చెందిన బాలాజీ భార్య సరస్వతి (52) జిల్లా ప్రధాన కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం జిల్లా న్యాయమూర్తి ఒక కేసులో ఇచ్చిన తీర్పును టైప్‌చేస్తూ హఠాత్తుగా కిందపడిపోయారు. ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిరువళ్లూరు నగర పోలీసులు కేసు నమోదు చేశారు. -
పొలం తగాదా.. చనిపోయిన వ్యక్తిపై కేసు..
సాక్షి, వనపర్తి (మహబూబ్‌నగర్): పొలం తగాదా విషయంలో ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే వనపర్తి పురపాలిక పరిధిలోని నాగవరానికి చెందిన లక్ష్మి, ఆమె కుమారుడు ఆంజనేయులు ఓ పొలం తగాదాకు సంబంధించి చిమనగుంటపల్లికి చెందిన జబ్బు చిన్ననారాయణ, జబ్బు పెద్ద నారాయణ, రవి, పవన్‌పై వేర్వేరుగా వనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. తీరా విచారణలో చిన్ననారాయణ 2015లో చనిపోయినట్లు తేలింది. అలాగే పెద్ద నారాయణ అనారోగ్యంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. దీనిపై ఎస్ఐ షేక్షఫీను వివరణ కోరగా.. లక్ష్మి ఫిర్యాదు మేరకు నలుగురిపై ఎఫ్ఐఆర్ చేశామన్నారు. తమ విచారణలో జబ్బు చిన్న నారాయణ గతంలోనే చనిపోయాడని గుర్తించాం. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనేది తదుపరి దర్యాప్తులో తేలుతుందన్నారు. -
గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి(77) కన్నుమూశారు. అనారోగ్యంతో ఈరోజు(బుధవారం) ఉదయం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పరమపదించారు. దీంతో గవర్నర్ తమిళిసై కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. సందర్శకుల కోసం.. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివ దేహన్ని రాజ్‌భవన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియల కోసం చెన్నై తరలించనున్నారు. మంత్రి కే. తారక రామరావు ఉదయం 9-15 లకు గవర్నర్ తమిళిసైని కలిసి ఆమె మాతృమూర్తికి నివాళి అర్పించనున్నారు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మాతృశ్రీ కృష్ణ కుమారి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఏపీ గవర్నర్ సంతాపం.. తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మాతృశ్రీ కృష్ణ కుమారి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, గవర్నర్ తమిళిసై మాతృమూర్తి మృతిపట్ల ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. -
Nalgonda: మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నుమూత
సాక్షి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మద్ది విద్యాసాగర్‌రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1981లో కౌన్సిలర్‌గా, 1987 నుంచి 1992వరకు నల్లగొండ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాడు. సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మద్ది రెండు సార్లు శ్రీ సీతారామచంద్ర ఆలయం చైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా కొంత కాలం పని చేశారు. పలువురు నాయకుల నివాళి.. అనారోగ్యంతో మృతి చెందిన మున్సిపల్ చైర్మన్ మద్ది విద్యాసాగర్‌రెడ్డి పార్థివదేహానికి శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఆయా పార్టీల నాయకులు నివాళులర్పించారు. -
ప్రముఖ గాయని జగ్జీత్ కౌర్ కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని జగ్జీత్ కౌర్ (93) అనారోగ్యం కారణంగా ఈరోజు (ఆదివారం) ముంబైలో మృతిచెందింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జగ్జీత్ కౌర్ ఈరోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ముంబైలోని ఎస్విరోడ్లోని వైల్పర్లేలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జగ్జీత్ కౌర్, బజార్ సినిమాలో దేఖ్లో ఆజ్ కా హుమ్కో, షోలా అవుల్ శబ్నం సినిమాలోని ఆఖేమిలనా.. పాటలకు స్వరం అందించారు. కౌర్భర్త.. మహమ్మద్ ఖయ్యం ప్రముఖ మ్యూజిక్ కంపొసర్. ఆయన 1954లో జగ్జీత్ను వివాహం చేసుకున్నారు. ఖయ్యం.. త్రిషుల్,నూరీ, శోలా అవుల్ శబ్నంలకు కంపోసింగ్ చేశారు. ఆయన ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వలన 2019లోనే ముంబైలో మరణించారు. 17 ఏళ్ల వయసులో సంగీత రంగంలో ఖయ్యం అడుగుపెట్టారు. కాగా, సంగీత రంగంలో ఆయన చేసిన సేవలకు గాను.. సంగీత నాటక అకాడమి నుంచి పద్మభూషణ్, నేషనల్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. -
ఎక్సర్సైజ్ చేయడానికి టెర్రాస్ మీదకు వెళ్లి .. మాటల్లో పడి..
తిరువనంతపురం: ఉదయంపూట తన సోదరుడితో కలిసి అపార్ట్‌మెంట్‌పై వ్యాయామం చేస్తున్న యువతి.. అనుకోకుండా అదుపుతప్పి కిందపడింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొచ్చిలోని చిత్తోర్‌రోడ్డులో ఉన్న ఒక అపార్ట్మెంట్లో 18 ఏళ్ల ఐరిస్‌రాయ్, ఆమె సోదరుడు అలస్‌తో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరు కూడా తమ అపార్ట్మెంట్లోని భవనం పైకి వెళ్లి ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తుంటారు. కాగా, ప్రతిరోజు మాదిరిగానే.. ఐరిస్‌రాయ్, తన సోదరుడితో కలిసి ఈ రోజు (గురువారం) ఉదయం వ్యాయామం చేయడానికి టెర్రాస్ పైకి వెళ్లింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి అక్కడ కొంచెం బురదగా ఉంది. ఆ టెర్రాస్‌కు పక్కన సెఫ్టీ వాల్స్‌కూడా లేదు. ఈ క్రమంలో.. ఆమె వ్యాయామం చేసి అలసిపోయి.. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. సోదరుడితో కలిసి మాటల్లో పడి .. ఎత్తైన ప్రదేశంలో ఉన్న విషయాన్ని మర్చిపోయింది. దీంతో ఒక్కసారిగా.. 9వ అంతస్తు నుంచి ఐరిన్ రాయ్ కిందకు జారిపడింది. ఈ సంఘటనతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె అరుచుకుంటూ.. కిందపడింది. ఆమె ముక్కు,నోటిలో నుంచి రక్తం బయటకు వచ్చింది. దీంతో, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని కొచ్చి పోలీసు అధికారి విజయ్ శంకర్ తెలిపారు. -
కూల్ డ్రింక్ తాగిన మైనర్ బాలిక.. కాసేపటికే నీలిరంగులోకి..
చెన్నై: కూల్‌డ్రింక్ తాగిన ఒక మైనర్ బాలిక.. కాసేపటికే కిందపడిపోయి అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బసంత్‌నగర్ ప్రాంతంలో జరిగింది. కాగా, తరణి, అశ్విని ఇద్దరు అక్కచెల్లెలు. వీరిద్దరు తమ కుటుంబంతో కలిసి బసంత్‌నగర్‌లోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో, 13 ఏళ్ల తరణి గడిచిన మంగళవారం(ఆగస్టు3)న మధ్యాహ్నం తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాప్‌కు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకుంది. కాసేపటి తర్వాత.. తరణి కూల్ డ్రింక్ తాగింది. అప్పటి వరకు బాగానే ఉన్న తరణి ఒక్కసారిగా కిందపడిపోయింది. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఎంత కదిలించిన ఉలుకు.. పలుకులేదు. ఈ అనుకొని ఘటనతో అశ్విని షాక్‌కు గురయ్యింది. కాగా, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు, హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. తరణిని పరీక్షీంచిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. యువతి శరీరం కూడా.. నీలిరంగులోకి మారింది. తరణి మృత దేహన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, యువతి ఊపిరితిత్తులలో కూల్ డ్రింక్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ పానీయంలో.. ఏదైన ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా.. అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణంపై దాడిచేసి.. షాపును సీజ్ చేశారు. అక్కడ ఉన్న 540 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం లాబ్‌కు తరలించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దుకాణంలో 17 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను అమ్మినట్లు గుర్తించారు. ఆ షాపును అధికారులు సీజ్ చేశారు. కాగా, ధరణి గతంలో అస్తమాతో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తల్లి కన్నుమూత
సాక్షి, బోధన్,(నిజామాబాద్): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాతృమూర్తి రుక్మవ్వ (95) ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మంత్రి సోదరుడు సురేందర్‌రెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి పీఎస్ఆర్ మాతృమూర్తి మృతి పట్ల ఆ పార్టీ నియోజక వర్గం, మండల నాయకులు పాషామోహినోద్దీన్, అబ్బగోని గంగాధర్ గౌడ్, దామోదర్ రెడ్డి పలువురు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. నిరుపేద స్నేహితుడి కుమార్తె పేరిట రూ.20 వేల డిపాజిట్ భిక్కనూరు: స్నేహితుల దినోత్సవం రోజు వారు తమ మిత్రుడికి అండగా నిలిచారు. భిక్కనూరుకు చెందిన అక్కల సంతోష్ ఇల్లు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సంతోష్ సరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్నాడు. ఆయన ఇల్లు కాలిపోయిన విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం చేయూత అందించారు. సంతోష్ కుమార్తె పేరిట రూ.20 వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ బాండును అందజేశారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు దుస్తులు అందజేశారు. అలాగే కుమార్తె పెళ్లి కోసం బెంగ పెట్టుకోవద్దని సంపూర్ణంగా ఆదుకుంటామని తమ బాల్య మిత్రుడు సంతోష్‌కు భరోసా ఇచ్చారు. -
రోడ్డుపై గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు..
నెల్లూరు: మనలో చాలా మందికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్‌ను ఇష్టంతో తింటుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి స్నేహితులు.. ప్రేమికుల మధ్య ఏదైన చిరుకోపాలు వచ్చినప్పుడు చాక్లెట్లు ఇచ్చి వారి మనస్సును కూల్ చేసేస్తారు. అందుకే, ప్రేమికుల దినోత్సవానికి ముందు లవర్స్ చాక్లెట్డేను కూడా జరుపుకుంటారు. అయితే, ఇలాంటి చాక్లెట్లు రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పడికనిపించాయి. వివరాలు.. నెల్లూరులోని ఏసీ నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు.. రోడ్డు పక్కన చాక్లెట్లు, ప్రోటిన్ పౌడర్లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. ఈ క్రమంలో వారు ఇంటికి వెళ్లి చూడగా.. ఆ చాక్లెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. అయితే, ఈ సంఘటనతో షాక్‌కు గురైన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పారిశుద్ధ్య అధికారులు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
దళిత హక్కుల నేత.. డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ కన్నుమూత..
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏజెన్సీ దళితుల హక్కుల కోసం పోరాడిన దళిత నేత ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్(65) హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన ఆయన బుధవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాందేవ్ మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 2గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు చేరుకుని తన సొంత వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాందేవ్ మృతిచెందారు. ఆయన స్వగ్రామం గుంజాలలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వయంకృషితో ఎదిగారు.. నాందేవ్ వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య సత్యభామ, ఐదుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. నాందేవ్ 1990లో విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేస్తూనే ఏ1కాంట్రాక్టర్‌గా ఎదిగారు. 1989లో పీఏసీఎస్ తాడిహత్నూర్‌కు చైర్మన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 1994–95లో జరిగిన ఎన్నికల్లో నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు చైర్మన్‌గా ఎన్నిక కావడంతోపాటు ఆరు సార్లు డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1997లో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా దళితుల సమస్యలపై పోరాటం చేశారు. 1/70 చట్టంతో ఏజెన్సీ ప్రాంత దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దళితుల సాగు భూములకు పట్టాలు, పహాణి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దళితులకు పహాణి పత్రాలు ఇప్పించారు. డీసీసీబీ చైర్మన్‌గా ఉంటూనే ఏజెన్సీ దళితులకు రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయాలని తీవ్ర ప్రయత్నం చేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2020–21ఫిబ్రవరిలో జరిగిన పీఏసీఎస్ ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి ఐకే రెడ్డి సంతాపం నిర్మల్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ హఠాన్మరణంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాందేవ్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పాము కాటేస్తే.. కోడి పొడిచిందనుకున్నాడు..
సాక్షి, కేసముద్రం(వరంగల్): పాము కాటేసినప్పటికీ కోడి పొడిచిందని అపోహపడిన ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముదిగిరి రమేష్, శ్రీలత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్దవాడైన కుమారుడు ముదిగిరి అజయ్(10) బుధవారం తమ స్నేహితులతో కలిసి ఇంటిపక్కనే ఉన్న పాతభవనంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఆ ఇంట్లో సెల్ఫ్‌పై అప్పటికే ఓ కోడి పొదిగి ఉంది. అక్కడే ఓపాముకూడా చొరబడి ఉంది. అదేమీ గమనించని అజయ్, తన మిత్రులు సెల్ఫ్‌న్ ఆందుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాము అజయ్ చేతిపై కాటు వేసింది. కానీ, తనను కోడి పొడిచిందని భావించిన బాలుడు ఇంటికి వెళ్లి పాము కాటేసిన చోట పసుపు వేసుకుని, తిరిగి స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో పరిస్థితి విషమించడంతో కిందపడిపోగా, హుటాహుటిన మానుకోట ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పాము కరిచినట్లు గుర్తించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అజయ్ బుధవారం రాత్రి మృతి చెందాడు. కొడుకు మృతి తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గురువారం అంత్యక్రియలను నిర్వహించారు. -
కరోనాతో మృతి చెందిన యువ వైద్యురాలు
-
మెడిసిన్‌లో ఫస్ట్‌క్లాస్ విద్యార్థిని.. కరోనా కాటుకు బలి..
ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి): మెడిసిన్ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయ్యింది. కరోనా రోగులకు వైద్యసేవలందిస్తూ.. ఆ వైరస్ బారినపడి అసువులుబాసింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన కందికట్ల రోజీ ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆశ్రంలోనే శిక్షణ పొందుతోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏలూరు ఆశ్రం కోవిడ్ హాస్పిటల్లో కరోనా రోగులకు సేవలందించింది. రోగులకు చికిత్స చేసే క్రమంలో అనారోగ్యానికి గురవడంతో స్వగ్రామం మోరి చేరుకుంది. సోమవారం మోరి గ్రామంలోని సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్లో వైద్య చికిత్స కోసం చేరింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందింది. ఆమె మృతితో తల్లితండ్రులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. చదవండి: కోవిడ్ బెడ్‌పై నుంచే శశి థరూర్ సందేశం: వీడియో వైరల్ -
కరోనా విషాదం: కేవలం గంట వ్యవధిలోనే ఆ దంపతులు..
వైరా(ఖమ్మం): కరోనా కాటుతో కొన్ని గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు బలైన సంఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో వజనేపల్లి నాగరత్నమ్మ (87) చనిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు ఆమె భర్త నాగేంద్రం (93) కరోనాతో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. వారి కుమారుడు రవి చికిత్స పొందుతున్నాడు. నాలుగు రోజుల కిందట నాగేంద్రం, నాగరత్నమ్మ దంపతులతో పాటు, కుమారుడు రవి కూడా కరోనా బారిన పడ్డారు. ముగ్గురు హోంఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వృద్ధ దంపతుల ఆరోగ్యం విషమించి ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఇలా చనిపోయారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో విషాదం నిండుకుంది. చదవండి: Coronavirus: కొడుకా.. వెళ్లిపోయావా..! -
ఒకే కుటుంబంలో 7గురి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
రాయ్‌పూర్: బిలాస్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈ విషాదఘటన సిర్గిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో జరిగింది. పోలీసుల ప్రకారం, బాధితులందరు కూడా హోమియోపతి మందులను వాడిన తర్వాత చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరు ద్రోసేరా30 అనే మందు వాడినట్టు తెలిసింది. బాధితుల్లోనలుగురు మంగళ వారం అర్థరాత్రి మరణించారు. మరో ముగ్గురు బుధవారం మరణించారు. చనిపోయిన వారిలో కమరలేష్ ధూరి(32), అక్షి ధురి(21), రాజేష్ ధూరి (21), సమ్రూ ధూరి (25), ఖేమ్‌చంద్ ధూరి (40), కైలాష్ ధూరి (50), దీపక్ ధూరి (30) ఉన్నారు. కాగా, వీరికి కరోనా సొకిందనే అనుమానంతో కుటుంబ సభ్యులు వీరి అంత్యక్రియలు పూర్తిచేశారు. వీరి మరణాలతో అప్రమత్తమైన పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లి సంఘటనపై ఆరాతీస్తున్నారు. మరికొందరిని బిలాస్‌పూర్‌లోని సిమ్స్‌కు (ఛత్తీస్‌ఘడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్ బిలాస్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. వీరందరు హోమియోపతి ప్రాక్టిస్‌చేసే వ్యక్తి నుంచి ఈ సిరప్ తీసుకున్నట్లు దర్యాప్తులో తెలింది. అయితే సంఘటన తర్వాత వైద్యుడు గ్రామం నుంచి పారిపోయాడు. కేసును నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. -
అనారోగ్యంతో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
డిస్పుర్: అస్సాం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్ బర్మన్(91) గువహతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈరోజు(ఆదివారం) అనారోగ్యంతో మరణించారు. ఈయన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. రెండు సార్లు అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.1931లో జన్మించిన బర్మన్ తొలిసారి 1996లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండోసారి 2010లో తరుణ్ గొగొయ్ శస్త్రచికిత్సకోసం ముంబై వెళ్లినప్పుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. కాగా, ఈయన హితేశ్వర్ సైకియా, తరుణ్ గొగొయ్ ప్రభుత్వాలలో ఆరోగ్య, విద్య, రెవెన్యూ శాఖలలో సేవలందించారు. 1967లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, ఏడుసార్లు శాసన సభకు ఎన్నికై ప్రజలకు సేవలందించారు. కాగా, ఆయన నల్బరీ జిల్లా బొర్ఖేట్రీకి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. వృత్తిరిత్యా వైద్యుడైన బర్మన్ అస్సాం మెడికల్ కాలేజ్ నుంచి మెడికల్ పట్టా పోందారు. -
‘బజార్’ ను చూపినవాడు..
హైదరాబాద్ నేపథ్యంలో గల్ఫ్‌కు ఆడపిల్లలను అమ్మే కథాంశంతో అద్భుతమైన కళాఖండం ‘బజార్’ తీసిన దర్శకుడు సాగర్ సర్హదీ సోమవారం (మార్చి 22)న కన్నుమూశారు. గొప్ప కథకునిగా, స్క్రీన్‌ప్లే రచయితగా సాగర్ సర్హదీని బాలీవుడ్ గౌరవిస్తుంది. ఆయన స్వయంగా సాహితీకారుడు. ఉర్దూ కథలు అనేకం రాసి యాడ్ ఫీల్డ్‌లో పని చేసి సినిమాలకు వచ్చాడాయన. మరణించేనాటికి వయసు 87 సంవత్సరాలు. ‘సర్హదీ’ అంటే సరిహద్దువాడు అని అర్థం. సాగర్ సర్హదీ అసలు పేరు గంగాసాగర్ తల్వార్. కాని ఆయన సరిహద్దుకు ఆవలివైపు ‘బఫా’ అనే గ్రామంలో జన్మించాడు. కాని దేశ విభజన తర్వాత కుటుంబంతో ఢిల్లీ చేరుకుని కాందిశీకులుగా బతకాల్సి వచ్చింది. ఆ సమయం లోనే ఆయన తన పేరును ‘సాగర్ సర్హదీ’ గా మార్చుకున్నాడు. సొంత ప్రాంతాన్ని కోల్పోయానన్న ఆవేదన, వెలితి ఆయనను సాహిత్యం వైపు మళ్లించింది. ఢిల్లీ తర్వాత ముంబై చేరుకుని నాటకాలు రాయడం మొదలెట్టాడు. ఆ సమయంలోనే దర్శకుడు యశ్ చోప్రా దృష్టి ఆయన పై పడింది. యశ్ చోప్రా దాదాపు తన సినిమాలకు ఆయన చేత పని చేయించుకున్నాడు. ‘కభీ కభీ’, ‘నూరి’, ‘చాందినీ’, ‘సిల్సిలా’ ఈ సినిమాలకు స్క్రీన్‌ప్లే, కథ, డైలాగ్ విభాగాలలో సాగర్ సర్హదీ పని చేశాడు. ఆ తర్వాత తనే సొంతగా దర్శకునిగా మారి ‘బజార్’ సినిమా తీశాడు. ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. నసీరుద్దీన్ షా, స్మితాపాటిల్ నటించిన ఈ సినిమాలో ‘కరోగే యాద్‌తో హర్బాత్ యాద్ ఆతీహై’ పాట నేటికీ హిట్‌గా నిలిచింది.సాగర్ సర్హదీ ప్రగతిశీల సాహితీ ఉద్యమంలో పని చేశాడు. ముంబైలోని ఆయన నివాసంలో అతి పెద్ద లైబ్రరీ ఉంది. మరణించే వరకూ కూడా తన సొంత ప్రాంతాన్ని తిరిగి చూడలేకపోయిన బాధను అనుభవించాడాయన. మరో సినిమా దర్శకుడు రమేశ్ తల్వార్ ఈయన మేనల్లుడు. సాగర్ సర్హదీకి జావేద్ అఖ్తర్ వంటి సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. -
కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కాలం చెల్లిన బీర్లను వైన్స్ యజమాన్యం ఒక్కో బీరు ఎంఆర్పీ ధర కంటే రూ.10తో అధిక ధరలకు బెల్ట్ షాపుల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. సదరు బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో బీరును మరో రూ.20 కలిపి అధిక ధరకు మద్యం ప్రియులకు అంటకడుతున్నారు. కాగా మండంలలోని పెద్దమాడ్గుల, నర్సాయిపల్లి, మాడ్గులకు చెందిన వారు మంగళవారం స్థానికంగా ఉన్న బెల్టు షాపుల వద్ద బీర్లు కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసిన బీర్లు కాలం చెల్లిపోవడంతో వినియోగదారులు బెల్టుషాపు నిర్వాహకులను ప్రశ్నించగా వైన్స్‌లో ఇచ్చిందే తెచ్చామని సమాధానం ఇచ్చారు. కొనుగోలుదారులు సరాసరి మాడ్గులలోని ఓ వైన్స్‌కు వచ్చి బీర్లు కొనుగోలు చేశారు. ఆ బీర్లు గతేడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ ఏడాది జూన్ 24వరకు వినియోగించాల్సి ఉంది. ఈ విషయమై సదరు కొనుగోలుదారులు వైన్స్‌షాపు యజమానిని నిలదీయగా వేరేది ఇస్తాం.. అంటూ కొనుగోలుదారులతో వాగ్వాదానికి దిగారు. బీర్ల కాలపరిమితి దాటి సుమారు 2 నెలలు కావస్తున్నా వైన్స్‌షాపు యజమాన్యం ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కొనుగోలుదారులు ఫోన్లో ఎౖMð్సజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలంచెల్లిన మద్యం సీజ్ చేశాం...... వినియోగదారుల నుంచి అందిన సమాచారం మేరకు మంగళవారం వైన్స్‌ను తనిఖీ చేశాం. కాలం చెల్లిన బీర్లను సీజ్ చేశాం. విషయం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. కాలం చెల్లిన బీర్లను ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత సదరు వైన్స్‌షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ శాఖ సీఐ వేణుకుమార్ తెలిపారు.