అజయ్(ఫైల్)
సాక్షి, కేసముద్రం(వరంగల్): పాము కాటేసినప్పటికీ కోడి పొడిచిందని అపోహపడిన ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముదిగిరి రమేష్, శ్రీలత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్దవాడైన కుమారుడు ముదిగిరి అజయ్(10) బుధవారం తమ స్నేహితులతో కలిసి ఇంటిపక్కనే ఉన్న పాతభవనంలో ఆడుకునేందుకు వెళ్లాడు.
ఆ ఇంట్లో సెల్ఫ్‌పై అప్పటికే ఓ కోడి పొదిగి ఉంది. అక్కడే ఓపాముకూడా చొరబడి ఉంది. అదేమీ గమనించని అజయ్, తన మిత్రులు సెల్ఫ్‌న్ ఆందుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాము అజయ్ చేతిపై కాటు వేసింది. కానీ, తనను కోడి పొడిచిందని భావించిన బాలుడు ఇంటికి వెళ్లి పాము కాటేసిన చోట పసుపు వేసుకుని, తిరిగి స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ ఉండిపోయాడు.
ఇంతలో పరిస్థితి విషమించడంతో కిందపడిపోగా, హుటాహుటిన మానుకోట ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పాము కరిచినట్లు గుర్తించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అజయ్ బుధవారం రాత్రి మృతి చెందాడు. కొడుకు మృతి తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గురువారం అంత్యక్రియలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment