hen
-
‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’
Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది. -
కరీంనగర్ పందెం కోడి వేలంలో ట్విస్ట్..
సాక్షి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. మూడు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని వేలం ముందు ట్విట్ నెలకొంది. కోడి వేలం పాటను ఆపాలంటూ ఓ వ్యక్తి.. ఆర్టీసీ డిపో అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఆ పందెం కోడి తనదేనని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మహేష్ అనే వ్యక్తి తెలిపాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అతడు సిరిసిల్లలోని రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి వెళ్తూ ఉండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ చేరుకోగానే నిద్రమత్తులో బస్సు దిగి పోయానని తెలిపాడు. తన వెంట కోడి లేదన్న విషయాన్ని గ్రహించి వెంటనే బస్సు వద్దకు వెళ్లగా.. అప్పటికే బస్సు వెళ్లిపోయిందని బాధితుడు చెప్పాడు. ఆర్టీసీ అధికారులు పందెం కోడిని వేలం పాట వేస్తున్నారని తెలవడంతో ఆ కోడి తనదేనంటూ చెప్పాడు. అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్‌కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు ఈ లోపు కోడి తనదేనంటూ ఓ వ్యక్తి రావడంతో మరి దానిని అతనికి అందిస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది. -
బస్సులో కోడిపుంజు మర్చిపోయిన ప్రయాణికుడు.. అధికారులు ఏం చేశారంటే!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్‌లో మర్చిపోయిన కోడిపుంజును డిపో అధికారులు జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అయితే మూడు రోజులుగా కోడింపుజును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోడంతో తాజాగా అధికారులు దానిని వేలంపాట వేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం కోడిపుంజును వేలం వేయనున్నట్లు, ఆసక్తిగలవారు పాల్గొనాలని కరీంనగర్-2 డిపో మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. జనవరి 9న వరంగల్ నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వేములవాడ వెళ్లింది. అక్కడ ప్రయాణికులను దించేసి తిరిగి కరీంనగర్ డిపోకు చేరుకోగా బస్సులో కోడిపుంజు ఉండటాన్ని డ్రైవర్, కండక్టర్ గుర్తించాడు. ఓ ప్రయాణికుడు సంచిలో ఉన్న కోడిపుంజును మరిచిపోయినట్లు తెలుసుకొని దానిని కంట్రోలర్‌కు అప్పగించారు. కోడిపుంజును డిపోలోని 2డిపో భద్రత విభాగం ఆర్టీసీ అధికారులు ఓ జాలిలో బంధించారు. మూడు రోజుల నుంచి బస్టాండ్ డిపోలోనే కోడిపుంజు బంధీగా ఉంటుంది. అయితే పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో దానిని వేలం వేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు కరీనంగర్-2 డిపో మేనేజర్ పేరిటా పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 12న మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజుకు సంబంధించి కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు, ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని తెలిపారు. చదవండి: పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం? -
సమ్మక్క– సారలమ్మకు జాతరకు వెళ్తూ కోడిపుంజు ఇలా..
ప్రస్తుతం సమ్మక్క– సారలమ్మ జాతర సీజన్ సందర్భంగా వరంగల్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులు కూడా కిక్కిరిసి పోతున్నాయి. వరంగల్ నుంచి వేములవాడ వెళ్లిన ఓ బస్సు అక్కడ ప్రయాణికులను దింపి కరీంనగర్ బస్టాండుకు వచ్చింది. అందులో ఓ కోడిపుంజును డ్రైవర్ గుర్తించాడు. బస్సులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోగా.. ఒక సంచిలో ఈ కోడి పుంజు కనిపించింది. దీంతో తప్పిపోయిన ఆ కోడిని డ్రైవర్ కంట్రోలర్‌కు అప్పగించాడు. ఆయన ఇలా ఓ జాలీలో బంధించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్‌లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
దేశీ కోళ్ల పెంపకంతో మంచి లాభాయుతం పొందుతున్న రైతు..!
-
పుంజు అందం అదరహో.. జాతీయ స్థాయిలో రాజుపాలెం కోడికి మూడో స్థానం
కొమరోలు: ప్రకాశం జిల్లా పుంజు అంటే మజాకా.. అన్నట్టుగా మరోసారి నిరూపితమయింది. కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషాకు చెందిన కోడిపుంజు అందాల పోటీల్లో జాతీయ స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరులో జరిగిన జాతీయస్థాయి చిలకముక్కు కోళ్ల అందాల పోటీల్లో ఈ పుంజు 3వ స్థానం దక్కించుకోగా పుంజు యజమాని సయ్యద్ బాషాను బహుమతులు వరించాయి. నిర్వాహకులు ప్రశంస పత్రం, షీల్డ్‌ను అందజేశారు. రాజుపాలెం కోళ్లు అందానికి మారుపేరు. బలమైన కాళ్లు, అంతకు మించిన శక్తితో రెక్కలు, సూటిగా ఉండే చిలక ముక్కు వీటికి ప్రత్యేక ఆకర్షణ. అందుకే ఎన్ని కోళ్లు ఉన్నా ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి, విశేషంగా ఆకర్షిస్తాయి. వీటి యజమానులు కూడా ఈ కోళ్లు అందంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని బ్యూటీ టిప్స్ కూడా పాటిస్తారు. వేళకు భోజనం, కొన్ని ఎక్సర్ సైజ్ లు , ప్రత్యేకంగా స్నానాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోడిపై పెట్టే శ్రద్ధ.. అంతా ఇంతా కాదు. అందుకే 5 రాష్ట్రాలకు చెందిన కోళ్లతో పోటీ పడి మరీ రాజుపాలెం కోడిపుంజు విజేతగా నిలిచింది. -
కోళ్లు ఇస్తే.. కరెంట్ ఇస్తా.. విద్యుత్ సిబ్బంది నిర్వాకం
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగ్‌పల్లి పంచాయతీ పరిధి 6 గ్రామాలకు గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా లేదు. తుఫాను గాలుల ధాటికి కెసల్‌గూఢ, గుముకగూఢ, ఏంతాగూఢ, పూజారిగూఢ, తంగగూఢ, ఒరెల్‌గూఢ గ్రామాల్లోని విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీనిపై పలుమార్లు కలిమెల విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు అంగీకరించిన కొందరు సిబ్బంది.. లంచంగా కోళ్లు, వాహనం పెట్రోల్ ఖర్చులు ఇస్తేనే బాగు చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గ్రామాస్తులంతా కలిసి కలిమెల విద్యుత్‌శాఖ అధికారి పీకే నాయక్‌ను శుక్రవారం కలిసి, ఫిర్యాదు చేశారు. గత 2 నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నామని, కరెంట్ లేకపోయినా రసీదు ఇచ్చి బిల్లు చెల్లించమంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన అధికారి.. ఘటనపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
‘చిక్కుడు’ గుడ్లు
యశవంతపుర: కోడిగుడ్డు ఆకారం అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలో దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా లాయ్ల గ్రామంలో ఒక కోడి విచిత్రమైన అకారంలో గుడ్లు పెట్టింది. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉండి చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లోని నాటు కోడి ఈ ప్రత్యేక గుడ్లను వారం రోజులుగా పెడుతోంది. ప్రశాంత్ అందరికీ చెప్పడంతో విషయం బయటపడింది. అందరూ ఆయన ఇంటికెళ్లి గుడ్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా?
చిల్లకూరు (తిరుపతి): జీవాలు మేపుకునేందుకు వెళ్తున్న గిరిజన బాలుడు తన తోటలో ఉన్న కోడిని దొంగిలించాడన్న అనుమానంతో తోట యజమాని ఆ బాలుడిని నిర్బంధించి, విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం, కడివేడు పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లవరపుకండ్రిగకు చెందిన బుర్రి రామకృష్ణ అనే వ్యక్తికి పంచాయతీ పరిధిలోని రాజగోపాల్‌రెడ్డి గిరిజన కాలనీ సమీపంలో నిమ్మ తోట ఉంది. అదే కాలనీకి చెందిన తల్లిదండ్రులు లేని మైనర్ బాలుడు తన అన్న వెంకటేశ్వర్లుతో కలిసి మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మేకలు మేపేందుకు వెళ్తున్న సమయంలో సమీపంలోని నిమ్మ తోట యజమాని బాలుడిని పట్టుకుని తన తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా? అంటూ విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు. దెబ్బలకు తాళ లేక కేకలు వేయడంతో కాలనీలోని వారు గుర్తించి అక్కడికి వచ్చి యజమానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గ్రామానికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని నచ్చజెప్పి బాలుడిని విడిపించాడు. దీంతో బాలుడి సమీప బంధువులతో కలసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని.. ఇప్పుడే పెళ్లి వద్దని..) -
అసలు నేనేనా అది!
సాక్షి, కురబలకోట( చిత్తూరు): ఎవరది.. ఏమా రాజసం.. పందెం కోడి పుంజులా ఎంత పొగరెక్కి ఉందో. ఇదేందిది.. నేను ఎటు కదిలితే అటు కదులుతోంది. ఓహ్.. అది నేనేనా! చిత్తూరు జిల్లా కురబలకోట మండలం పోరెడ్డివారిపల్లెలో ఓ కోడి పుంజు బైక్ పైకెక్కి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆశ్చర్యపోసాగింది. తన కదలికలను బట్టి ఆ ప్రతిబింబం తనదేనని గ్రహించిందో ఏమోగానీ.. మరికొంత సేపు చూసుకుని మురిసిపోయి ఆ తర్వాత బైక్ దిగి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూపరులకు ముచ్చటగొలిపింది. -
సాక్షి కార్టూన్ 10-02-2022
చికెన్ బిర్యానీ తినొచ్చావా..! అయితే డబుల్ టికెట్ తీసుకో! -
అనుమానాస్పదంగా తిరుగుతోందని కస్టడీలోకి కోడి.. ఎక్కడో తెలుసా?
వాషింగ్టన్: సాధారణంగా ఎవరైనా వ్యక్తులు అనుమానితులుగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తారు. వారికి నేరంతో ఏ సంబంధం లేదని తేల్చాక విడిచిపెడతారు. ఈ ప్రక్రియ దాదాపు అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెంటగాన్ సెక్యూరిటీ ప్రాంతంలో ఓ కోడి అనుమానితంగా తిరుగుతోందని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక జంతు సంక్షేమ సంస్థ వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో కోడి తిరుగుతూ కనిపించిందని వర్జీనియాలోని ఆర్లింగ్టన్కు చెందిన జంతు సంక్షేమ సంఘం సోషల్ మీడియాలో తెలిపింది. చదవండి: Viral Video: మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి భద్రతా తనిఖీ కేంద్ర వద్ద కోడి అనుమానంగా తిరుగుతుండటంతో, దానిని తీసుకెళ్లేందుకు తమ అధికారులను పిలిచారని జంతు సంరక్షణ సంఘంలోని ఓ ఉద్యోగి తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. గోధుమ రంగు ఈకలు కలిగిన ఈ కోడి పేరు హెన్నీ పెన్నీ. ఆ కోడి ఎక్కడ నుంచి వచ్చింది, పెంటగాన్‌కి ఎలా వచ్చిందనే విషయాలను సంబంధిత అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ కోడిని పశ్చిమ వర్జీనియాలో చిన్న పొలం ఉండి కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. Our officers have chosen the name Henny Penny for our #pentagonchicken, and she will be going to live at a local animal sanctuary very soon! https://t.co/qQ7kfYkocM pic.twitter.com/31gugYE4tR — AWLArlington, VA (@AWLAArlington) February 1, 2022 -
గాల్లో పక్షిలా చక్కర్లు కొడుతున్న కోడి.. వైరల్ వీడియో
కోడి అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కోడి పందేలు. లేదా మంచిగా మసాలా దట్టించి చికెన్ వండుకొని లాగించేయడమే. అయితే తాజాగా ఓ కోడికి వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సాధారణంగా కోడి నేల మీద తిరుగుతూ ఉంటుందని అందరికి తెలిసిందే. వాటికి రెక్కలు ఉన్నా తక్కువ ఎత్తులో తక్కువ సమయం వరకు ఎగురుతాయి. రెక్కలతో ఎక్కువసేపు ఎగరలేవు. కానీ ఇప్పుడు చెప్పబోయే కోడి నేల మీదే కాకుండా గాల్లో పక్షిలా తెగ చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ‘కోడి ఇంత దూరం విహరిస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ మంచు ప్రాంతంలో కోడి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడం కనిపిస్తోంది. చదవండి: భయానకం: మత్స్యకారుడిని వెంటాడిన వింత జీవి.. వీడియో వైరల్ దాదాపు 40 సెకన్లపాటు వందల మీటర్ల వరకూ గాల్లోనే ఎగురుతూ తిరుగుతోంది. చివరికి ఓ చోట ల్యాండ్ అయ్యింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైక్స్ వచ్చి చేరుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు అసులు ఇది నిజంగా కోడేనా, లేక కోడిలా కనిపిస్తోన్న వేరే జాతి పక్షా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. Never knew a chicken could fly that far.. pic.twitter.com/JU9IwfWxu6 — Buitengebieden (@buitengebieden_) January 29, 2022 -
తల్లి కోడి ప్రేమ..
అనగనగా ఒక కొలను.. ఒడ్డు మీద ఒక చింతచెట్టు. ఆ చింతచెట్టు మీద ఒక గద్ద నివసించేది. అది రోజుకో కోడిపిల్లనో, బాతు పిల్లనో ఎత్తుకొచ్చి చెట్టు తొర్రలో దాచేది. అవి చనిపోయి కుళ్ళినాక వాటిని తినేది. కొలనుకు అవతలి ఒడ్డున ఒక కోడి ఉండేది. దానికి అందమైన మూడు బుజ్జి బుజ్జి పిల్లలున్నాయి. ఆకోడి వాటిని కంటికి రెప్పలా కాపాడుకునేది. ఒకరోజు తన బుజ్జి పిల్లలను వెంటేసుకుని ఇవతలి ఒడ్డుకు బయలుదేరింది. నడుచుకుంటూ పోతూండగా దారిలో ఓ చిట్టి బాతు ఏడుస్తూ కనిపించింది. కోడి చిట్టి బాతుతో ‘ఎందుకు ఏడుస్తున్నావూ?’అని అడిగింది. ‘నేనూ, మా అక్కా.. అమ్మ నుండి విడిపోయి దారితప్పి ఇటు వచ్చాం’ అంది. ‘మరి మీ అక్క ఎక్కడుంది?’ అడిగింది కోడి. ‘అక్కను గద్ద ఎత్తుకుపోయింది. ఆ చింత చెట్టు తొర్రలో దాచింది’ అంది చిట్టి బాతు. ‘భయపడకు.. నిన్ను మీ అమ్మ దగ్గరకు నేను తీసుకుపోతాను’ అంది కోడి. ఇంతలో ఆకాశం నుండి వేగంగా గద్దరావటం గమనించింది కోడి. తన రెక్కలచాటున తన బుజ్జి పిల్లలతో పాటు చిట్టి బాతుని దాచింది కోడి. గద్ద వచ్చి కోడి ముందు వాలింది. చిట్టి బాతు కోసం నలుదిక్కులా చూసింది. ‘ఏయ్ కోడీ! నీ పిల్లన్ని చూపించూ?’ అడిగింది గద్ద. కోడి కోపంగా గద్దను చూసి ‘వెళ్ళు ఇక్కడి నుండి’ అంది. ‘ నీ పిల్లల్ని చూసి వెళతాను. వాటికి ఏ హానీ తలపెట్టనని హామీ యిస్తున్నాను’ అంది గద్ద. కోడి రెక్కలు విప్పింది. అందులోంచి అందమైన బుల్లి కోడి పిల్లలతో పాటు చిట్టి బాతు బయటకు వచ్చాయి. బాతు పిల్లని తనకు వదిలేయమంది గద్ద. కానీ కోడి అందుకు అంగీకరించలేదు. ‘చూడూ.. నీ జాతి వేరు, బాతు జాతి వేరు! బాతు పిల్లను నాకు వదిలేయ్’ అంది గద్ద. అయినా కోడి.. చిట్టి బాతుని వదల లేదు. ‘మా జాతి వేరైనా బాతులు పెట్టే గుడ్లను పొదిగేది మేమే’ అంది కోడి. గద్ద.. కొద్దిసేపు ఆలోచించి చింత చెట్టు మీదకు ఎగిరింది. తొర్రలోంచి బాతు పిల్లని ముక్కుతో పట్టుకుని నెమ్మదిగా కోడి ముందు వదిలింది. ‘నీలోని తల్లి ప్రేమ నన్ను మార్చింది. ఈ బాతు పిల్లని కూడా తన తల్లి వద్దకు చేర్చు. ఇకపై కేవలం పురుగులు, కుళ్ళిన కళేబరాలనే తింటూ కడుపు నింపుకుంటాను’ అని ఆకాశంలోకి ఎగిరింది గద్ద. కోడి రెండు బాతు పిల్లల్నీ వాటి తల్లి వద్దకు చేర్చటానికి వెనుదిరిగింది. చదవండి: టీ గారూ.. తమరు సూపరు! -
పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని బోనకల్ మండలం కలకోట గ్రామంలో పాము కాటు గురైన వారు నాటు కోడి వైద్యం చేయించుకోవడం తాజాగా వైరల్‌గా మారింది. కలకోట గ్రామానికి చెందిన తోటపల్లి సురేష్ పదేళ్ల నుంచి నాటుకోడి వైద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాము కాటు గురైన 300 మందికి నాటు కోడి వైద్యం చేశాడు. అయితే పాముకాటుకి కోడి వైద్యం చేయడం వల్ల ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆయన చెబుతున్నారు. పాము కాటు గురైన వారు గంటన్నరలోపు వస్తేనే లాభం ఉంటుందని అంటున్నారు. కాగా పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని కోడి చనిపోతుంది. అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే వరకు గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే కోడి చనిపోవడం ఆగిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగిపోయినట్లు లెక్కిస్తారు. కాటు వేసిన పాము తీవ్రతను బట్టి 5 నుంచి 15 కోళ్ల వరకు విషం తీయడానికి ఉపయోగిస్తుంటారు. చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో పాము కాటు గురైన వారు నాటుకోడి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. చదవండి: నార్సింగిలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి వైద్యుల హెచ్చరిక మరోవైపు వైద్యులు మాత్రం నాటు వైద్యాన్ని విశ్వసించరాదని సూచిస్తున్నారు. నాటు కోడి వైద్యంతో సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాలమీదకు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాము కాటుకి గురైతే బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని చెప్తున్నారు. చదవండి: కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఏజెన్సీ మోసం.. రెండు నెలలుగా.. -
‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు
లక్నో: తన కోడిని ఎవరో హత్య చేశారు.. వారిని కనిపెట్టండంటూ ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కోడికి పోస్టుమార్టం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ కేసును విన్న పోలీసులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీ మహారాజ్‌గంజ్ జిల్లా పిప్రకల్యాణ్ గ్రామానికి చెందిన దుఖీ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే. ఆయన కుమారుడు రాజ్‌కుమార్ భారతి. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి రాజ్‌కుమార్ పక్షుల ప్రేమికుడు. అతడు ఎన్నో పక్షులను పెంచి పోషిస్తున్నాడు. వాటిలో భాగంగా ఓ కోడిని కూడా పెంచుకుంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ కోడి అకస్మాత్తుగా మృతి చెందింది. కోడి మృతిపై అతడు అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని సింధూరియన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. కేసు పెట్టి దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కోడికి పోస్టుమార్టం చేయాలని విజ్ఞప్తి చేశాడు. వెంటనే కోడిని చంపిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. కేసు దాఖలు చేసిన అనంతరం రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడాడు. తాను పక్షుల ప్రేమికుడినని.. తన దగ్గర చిలుకలు, పావురాలు, కోళ్లు ఎన్నో ఉన్నాయని, వాటిని ప్రేమగా పెంచిపోషిస్తున్నట్లు తెలిపాడు. తనను గిట్టని వారు ఉద్దేశపూర్వకంగా కోడికి విషయం పెట్టి చంపేశారు అని ఆరోపించాడు. చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో? -
వెరైటీ కోడి
-
కోడిపుంజు గుడ్డు పెట్టింది.. ఇది నిజం!
తొట్టంబేడు: కోడిపెట్ట గుడ్లు పెట్టడం సృష్టి ధర్మం. ఇక్కడ విచిత్రంగా కోడిపుంజు గుడ్లు పెట్టి, పిల్లలు పొదిగింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలోని సుబ్రమణ్యంరెడ్డి ఇంట్లో 4 కోళ్లతో పాటు ఒక పుంజు ఉంది. ఈ కోడి పుంజు ఐదు గుడ్లు పెట్టింది. ఇదేంటి గుడ్లు పెడుతోందని యజమాని ఆశ్చర్యపోయాడు. అయితే ఏం చేస్తుందో చూడాలని, ఆ గుడ్లు తీసుకెళ్లి పుంజు కిందపెట్టడంతో అది 5 పిల్లలను పొదిగింది. ప్రస్తుతం ఆ పుంజు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోడిపుంజును, పిల్లలను చూసి వెళ్తున్నారు. అయితే పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. -
ఈ ఎంబీఏ కోడిపుంజు రూ.3 లక్షలు
సాక్షి, అమరావతి: ఎంబీఏ చేశాడు... కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. నెలకు రూ.లక్ష జీతం.. వారానికి ఐదు రోజులే ఉద్యోగం.. ఇంతకు మించి ఎవరైనా ఈ రోజుల్లో కోరుకునేది ఏముంటుంది?. కానీ, అతను అలా అనుకోలేదు. వీకెండ్లో నాటుకోళ్ల వ్యాపారం షురూ చేశాడు. తర్వాత ఏకంగా ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం పైనే దృష్టి పెట్టాడు. అది ఇప్పుడు రూ.2 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదగడమే కాదు.. పలువురికి ఉపాధి కల్పిస్తోంది. నాటుకోళ్ల పెంపకంలో గుర్తింపు పొందిన ఈ యువకుడి పేరు ప్రదీప్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నున్న గ్రామవాసి. ఎంబీఏ చేసిన ప్రదీప్.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేసేవాడు. వీకెండ్లో కోళ్ల పెంపకంలో గడిపేవాడు. ఆసక్తి పెరగడంతో ఉద్యోగాన్ని వదిలి గుంటకోడూరులో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మార్కెటింగ్ ఇబ్బందులతో మొదట ఆదాయం తక్కువగా ఉండేది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు. వ్యాపారం పెరగడంతో నున్నలో ప్రదీప్ ఫామ్స్ అండ్ హేచరీస్‌తో పాటు చికెన్ వరల్డ్ కంపెనీని ప్రారంభించాడు. నాటుకోళ్లు, కడక్‌నాథ్ కోళ్లు, సిల్కీ, బీవీ 380, ఆర్ఐఆర్ జాతులతో పాటు టర్కీ, గిన్నికోళ్లు బాతుల పెంపకాన్ని షురూ చేశాడు. ప్రస్తుతం ఈ ఫామ్‌లో వేయికి పైగా కడక్‌నాథ్ కోళ్లు, 2వేలకు పైగా ఇతర జాతులున్నాయి. కోళ్ల పెంపకం చేస్తున్న ప్రదీప్ కొత్తగా పందెం కోళ్ల ఫ్యాక్టరీ... తాజాగా ప్రదీప్ పందెం కోళ్ల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఫిలిప్పీన్స్ పెరువియన్ జాతి కోళ్లను దిగుమతి చేసుకోవడమే కాదు.. దేశీయ పందెం కోళ్లతో క్రాసింగ్ చేయించి పెరు కోళ్లను అభివృద్ధి చేస్తున్నాడు. వీటికి బలం, వాయువేగం ఎక్కువ. వీటి గుడ్డును రూ.3 వేలకు విక్రయిస్తుండగా, రసంగి, గేరువా, సీతువా, వైట్నాట్, బ్లాక్‌నైట్ వంటి పెరువియన్ జాతి కోడిపుంజుల ధర అయితే రూ.3 లక్షల పైమాటే. ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 వేలకు పైగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే పందెం కోళ్లున్నాయి. కోళ్ల పెంపకానికి ముందుకొచ్చే యువతకు 30 శాతం సబ్సిడీతో కోళ్లను ఇవ్వనున్నట్లు చెప్పాడు. విదేశాలకు రవాణా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలకు డెలివరీ చేస్తున్నారు. ఇటీవలే పాకిస్తాన్, నేపాల్ దేశాలకూ 500 కడక్‌నాథ్ కోడి పిల్లలను ఎగుమతి చేశారు. కోళ్లతో పాటు అంతరించిపోతున్న దేశీయ కుక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జర్మన్ షిపర్డ్, లేబర్, ముథోల్, డాబర్‌మెన్ వంటి జాతులతో పాటు అంతరించిపోతున్న జాతులకు చెందిన రాజపాలయం, జోనంగి జాతి కుక్కలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా 50 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ప్రదీప్ ఫామ్స్ పరోక్షంగా మరో వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారి కోసం ప్రతీ మంగళవారం అవగాహన కల్పిస్తున్నారు. ప్రదీప్‌కు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చింది. -
పాము కాటేస్తే.. కోడి పొడిచిందనుకున్నాడు..
సాక్షి, కేసముద్రం(వరంగల్): పాము కాటేసినప్పటికీ కోడి పొడిచిందని అపోహపడిన ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముదిగిరి రమేష్, శ్రీలత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్దవాడైన కుమారుడు ముదిగిరి అజయ్(10) బుధవారం తమ స్నేహితులతో కలిసి ఇంటిపక్కనే ఉన్న పాతభవనంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఆ ఇంట్లో సెల్ఫ్‌పై అప్పటికే ఓ కోడి పొదిగి ఉంది. అక్కడే ఓపాముకూడా చొరబడి ఉంది. అదేమీ గమనించని అజయ్, తన మిత్రులు సెల్ఫ్‌న్ ఆందుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాము అజయ్ చేతిపై కాటు వేసింది. కానీ, తనను కోడి పొడిచిందని భావించిన బాలుడు ఇంటికి వెళ్లి పాము కాటేసిన చోట పసుపు వేసుకుని, తిరిగి స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో పరిస్థితి విషమించడంతో కిందపడిపోగా, హుటాహుటిన మానుకోట ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పాము కరిచినట్లు గుర్తించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అజయ్ బుధవారం రాత్రి మృతి చెందాడు. కొడుకు మృతి తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గురువారం అంత్యక్రియలను నిర్వహించారు. -
Lockdown: వార్నీ.. కోడికి కూడా ఆ సమస్య ఉంటుందా?
బెంగళూరు: కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికి జనాలు పెద్దగా మారడం లేదు. చాలా చిన్న చిన్న, సిల్లీ కారణాలు చెప్పి రోడ్డుకు మీదకు వస్తున్నారు. కుక్కకు బాలేదని కొందరు.. ఉప్పు పప్పులు అయిపోయాయని చెప్పి మరికొందరు రోడ్ల మీద తిరుగుతున్నారు. తాజాగా లాక్డౌన్ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు చెప్పిన సమాధానం నెట్టింట తెగ వైరలవుతోంది. వార్నీ కోడికి కూడా ఆ సమస్య ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ట్విట్టర్ యూజర్ అమిత్ ఉపాధ్యే పోస్ట్ చేసిన ఈ వీడియోలోని సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. లాక్డౌన్ అమల్లో ఉండగా ఓ వ్యక్తి చేతిలో సంచితో రోడ్డు మీదకు వచ్చాడు. పోలీసులు అతడిని ఆపి ఎందుకు బయటకు వచ్చావని ప్రశ్నించారు. అప్పుడు ఆ వ్యక్తి సంచిలో ఉన్న కోడిని బయటకు తీసి.. ‘‘ఇది మలబద్దకంతో బాధపడుతుంది సార్. దీన్ని పశువుల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. అందుకే బయటకు వచ్చాను’’ అన్నాడు అతడి సమాధానానికి పోలీసులు పక్కున నవ్వారు. కోడికి కూడా ఇలాంటి సమస్య ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అతడిని ఇంటికి తిరిగి పంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అతడి సృజానత్మకతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు. The police in #Gadag had a hearty laugh after a man claimed be was taking the hen to a vet as it had constipation issues. Police however sent him back home @santwana99 @ramupatil_TNIE @XpressBengaluru @KannadaPrabha @raghukoppar @karnatakacom @NammaBengaluroo @DgpKarnataka pic.twitter.com/BEdxton5ce — Amit Upadhye (@Amitsen_TNIE) May 29, 2021 -
‘మాకంటే మీరే నయం’: పొడిచి పొడిచి తరిమేశాయి
కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అనే సామెతలు మన దగ్గర చాలా ప్రసిద్ధి. ఒంటరిగా సాధించలేని కార్యాన్ని, లక్ష్యాన్ని ఐకమత్యంతో సాధించవచ్చని చెప్పే కథలు కోకొల్లలు. చిన్నప్పుడు మనం చదవుకున్న ఎద్దు, సింహం కూడా ఈ కథ కూడా ఈ కోవలోకే వస్తుంది. తాజాగా ఐకమత్యం గొప్పతనాన్ని చాటే సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తమ మిత్రుడిపై దాడి చేయడానికి వచ్చిన పిల్లిని కోడిపెట్టలు పొడిచి పొడిచి మరి తరిమాయి. వీటి ఐకమత్యాన్ని చూసిన నెటిజనలు తెగ సంబరపడుతున్నారు. మా కంటే మీరే నయం అంటూ ప్రశంసిస్తున్నారు. రెండు నెలల క్రితం నాటి ఈ వీడియో తాజాగా మరోసారి వైరలవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. ఇక వీడియోలో పొలంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ కోడిపెట్టను పిల్లి గమనిస్తుంది. ఒంటరిగా బలే చిక్కింది.. ఈ రోజు నాకు పండగే అని సంబరపడుతూ కోడి మీద దాడి చేయడానికి వస్తుంది. అయితే మిత్రుడికి వచ్చిన ఆపద చూసి మిగతా కోడి పెట్టలు అలర్ట్ అవుతాయి. పోలోమంటూ వచ్చి.. పిల్లిపై దాడి చేస్తాయి. ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయిన పిల్లి నెమ్మదిగా అ్కడ నుంచి జారుకుంటుంది. చదవండి: ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు -
కోళ్ల నుంచి మనుషులకు కొత్త వైరస్!
మాస్కో: కరోనా వైరస్‌తో ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు బ్రిటన్ను కరోనా స్ట్రెయిన్ గజగజలాడిస్తోంది. తాజాగా రష్యాలో బయటపడిన ఓ కొత్త రకం వైరస్ ఆందోళన కలిగిస్తోంది. రష్యాలోని ఓ పౌల్ట్రీ కోళ్లలో కొత్త రకం H5N8 స్ట్రెయిన్ వైరస్ బయటపడింది. పౌల్ట్రీలో పనిచేసే ఏడుగురిలో ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. కోళ్ల నుంచి మనుషులకు వైరస్ సోకిన తొలి కేసుగా ఈ ఘటన నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి అన్నాపొపొవా వెల్లడించారు. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించామని తెలిపారు. కోళ్లను ప్రత్యక్షంగా తాకడం ద్వారా, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు. ఇది పక్షులకు కూడా సోకే ప్రమాదం ఉందని, వలస పక్షుల కారణంగా వేగంగా వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే H5N8 వైరస్ మనుషుల్లో అంత ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) పరిశోధకుడు ఫ్రాంకోయిస్ రెనాడన్ మాట్లాడుతూ.. ఈ కొత్త స్ట్రెయిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే దీనిపై తాము ప్రయోగాలు మొదలుపెట్టామని తెలిపారు. కరోనా ప్రపంచానికి వేగంగా స్పందించడం నేర్పిందని, కొత్త వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరోవైపు రష్యాకు చెందిన వెక్టర్ స్టేట్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ సెంటర్ కరోనా వైరస్‌కు టీకా అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‌కు తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెక్టర్ చీఫ్ రినాట్ మక్యుటోప్ తెలిపారు. చదవండి: ముసలి వేషంతో కరోనా టీకా, కానీ.. -
వింత: కోడి ఆకారంలో మేక..
పీసీపల్లి: కోడిని పోలిన ఓ మేక జన్మనిచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరికి చెందిన మేక గురువారం ఒకే ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. 3 కిలోలు, 1.5 కిలోల బరువు ఉన్న అవి ఆరోగ్యంగా తల్లిని పోలినట్టు ఉన్నా యి. శనివారం ఉదయం అదే మేక మరో పిల్లకు జన్మనిచ్చింది. అయితే అది గురువారం నాటి పిల్లల మాదిరిగా కాకుండా కోడి ఆకారంలో ముక్కు కలిగి ఉంది. శరీరంపై వెంట్రుకలు కూడా లేవు. కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉన్న ఆ పిల్ల పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. వింతగా ఉన్న దీనిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) -
నాటు కోడి.. భలే క్రేజీ
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లతో ఆదరణ తగ్గిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం సైతం చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేయడంతో క్రమక్రమంగా చికెన్‌కు డిమాండ్ పెరిగింది. పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు అటవీ గ్రామాలకుసైతం విస్తరించింది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలంతా మాంసాహారం వినియోగంపై దృష్టి సారించారు. సాధారణంగా చికెన్ సెంటర్లో లభించే బాయిలర్‌ను మాత్రమే ఎక్కువ సంఖ్యలో వినియోగించేవారు. కొవ్వుకు చెక్.. రుచికి బెటర్ బాయిలర్ చికెన్ కంటే నాటు కోడి తింటే మరింత మంచిదన్న ప్రచారంతో ఇటీవల కాలంలో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. బాయిలర్ కోడి మాంసం రుచి ఉండదు. ఇక మేక మాంసం తింటే కొవ్వు పెరుగుతుంది. ప్రస్తుతం చేపలు దొరకడం కష్టమే. మరి ఏమి తింటే మంచిదనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో తింటే నాటుకోడి కూరనే తినాలని ఆసక్తి పెరుగుతోంది. మిగతా మాంసాలతో పోలిస్తే నాటుకోడి కూర రుచిగా ఉండడం ఓ కారణం. ఒకప్పుడు ఇంటింటికీ కోళ్లు ఉండేవి. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా నాటుకోడి కూర వండేవారు. రానురాను పల్లెల్లో కోళ్ల పెంపకం తగ్గిపోయింది. కోళ్ల వల్ల పెంట, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లె జనం సైతం కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇదే క్రమంలో బాయిలర్ కోళ్లు రావడం ప్రతీ ఊరిలో చికెన్ సెంటర్లు వెలియడంతో జనం ఆ చికెన్ వైపే మొగ్గు చూపారు. పైగా బాయిలర్ చికెన్ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరకడంతో జనం నాటుకోడి ఊసెత్తడం మానేశారు. మళ్లీ ఇప్పుడు.. ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై జాగ్రత్త పెరుగుతోంది. అతిగా మందులు వాడి పెంచే ఆహారం జోలికి పోవద్దన్న ఆలోచన ఎక్కువైంది. ఈ క్రమంలోనే బాయిలర్ చికెన్ తినద్దన్న ప్రచారం మొదలైంది. తింటే మటన్ తినండి తేదంటే నాటుకోడి కూర తినండి అని పలువురు ఆహార నిపుణులు సూచించడం, చేపలు మంచివే కాని అవి టైంకు దొరకకపోవడం కొందరికి నచ్చకపోవడంతో నాటు కోడి కూరవైపు మొగ్గు చూపడం ఆరంభమైంది. అయితే, బాయిలర్ కోడి సాధారణంగా కిలో రూ.100 నుంచి రూ.150 ఉంటుంది. నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంటుంది. పండుగల సమయంలో ఈ ధర మరింత ఎక్కువవుతుంది. అయినా నాటుకోళ్లపై క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. ప్రత్యేక విందులు జరిగే ప్రాంతాల్లో నాటుకోళ్లను తీసుకెళ్తున్నారు. చికెన్ సెంటర్లలోనూ అమ్మకం.. ఒకప్పుడు నాటుకోడి మాంసం దొరకడం గగనంగా ఉండేది. ఆ కోళ్లను తెలిసిన వారి ఇళ్ల నుంచి కొనుగోలు చేసేవారు., దీనిని డ్రెసింగ్ చేయడం కష్టంగా భావించే వారు. పైగా దానిని కాల్చితేనే బాగుంటుందన్న అభిప్రాయం. ఇంత కష్టం ఎందుకని జనం దాని జోలికి పోవడం మానేశారు. కానీ ఇప్పుడు చికెన్ సెంటర్లలోనే దానిని కోసి డ్రెసింగ్ చేసి కాల్చి ఇస్తున్నారు. మటన్‌తో పోలిస్తే ధర తక్కువ పైగా రుచి, పోషకాలు కూడా ఎక్కువే. అందుకని ఈజీగా దొరుకుతున్న నాటుకోడి మాంసంపై జనం మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా నాటుకోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతోంది. పైగా మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప కీడు చేయదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు నాటుకోళ్లను దళారులు పల్లెల నుంచి పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రతీ రోజు దళారులు అటవీ గ్రామాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ నాటుకోళ్లు కొంటాం అంటూ.. కేజీ రూ.180కి కొనుగోలు చేసి వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ తదితర పట్టణప్రాంతాలకు తరలించి రూ.350 నుంచి రూ.500 వరకు చికెన్ సెంటర్ యజమానులకు విక్రయిస్తున్నారు. దీంతో పండుగల సమయంలో గ్రామాల్లో నాటుకోళ్లకు కొరత ఏర్పడుతోంది. తింటే నాటుకోడే తినాలి.. సాధారణ చికెన్‌తో పోలిస్తే నాటుకోడి కూరే రుచిగా ఉంటుంది. ఇప్పటికి మా ఇంటికి బంధువులు వస్తే నాటుకోడి కూర వండాల్సిందే. ఇది మన తెలంగాణ సంప్రదాయం కూడా. వచ్చిన బంధువులకు నాటుకోడి కూర వండి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.– ఓలపు శంకర్‌పటేల్, కిష్టాపూర్ -
కోడిని కోయడం ఓ కళ
బజార్లూ, గడ్డివాములూ, పెంటగడ్డలూ తిరిగీ తిరిగీ, పుంజులూ పెట్టలూ కోడిపిల్లలూ సాయంత్రం ఇంటికిజేరేవి. కొ కొ కొ కొ అని పిలుసుకుంటూ మా అమ్మ వాటికి నూకలు జల్లేది. వాటికి జొన్నలు, నూకలు జల్లడం అంటే నాగ్గూడా ఆనందంగా ఉండేది. అవి కె కె కె కె అనుకుంటూ మా అమ్మ చుట్టూ తిరిగేవి. లీడర్ లాగా కనబడే కోడిపుంజు తన రంగురంగుల కిరీటాన్ని ఊపుతూ, తల బాగా పైకి లేపి కె కె కె కె అనుకుంటూ కోళ్లను అన్నింటినీ పరికించి సూసేది. పిల్లలకోడి మాత్రం పిల్లల మధ్యలో ఉండి, తినీ తిననట్టు తింటూ పిల్లలకు నూకలు అందుతున్నయా లేదా అని చూస్తూండేది. పిల్లల మధ్యకు ఇంకో కోడి వస్తే దాని ఎంటబడి గెదిమేది. మా నాయన, నేను, మా అక్కలు వాటి పక్కనే నులక మంచం మీదగూసోని చూస్తుండేది. అప్పుడు మాకు ఏ కందులో, పెసలో, ఉలవలో ఏంచినయిబెట్టేది మా అమ్మ. నూకలన్నీ తిన్న తరువాత కోళ్ళన్నీ ఒక్కటొక్కటిగా ఆ గూట్లొకి జేరేవి. కొన్ని కిలాడి కోళ్లు మాత్రం అందులోకి చేరేవి కావు. వాటికోసం మల్ల కొన్ని నూకలని కోళ్ల గూట్లొకి జల్లేది మా అమ్మ. దాంతో అవిగూడా గూట్లొకి వెళ్ళేవి. అప్పుడు ఒక గిన్నెలో నీళ్లుబోసి గూటిలోపలబెట్టి బండతో మూసేసి, బండ కిందబడకుండా ఒక కర్రని అడ్డు బెట్టేది. కొన్నిసార్లు ఒకటి రెండు కోళ్లు బెదిరి పోయి గూట్లొకి వచ్చేవి కావు. వాటిని పట్టుకుందామని ప్రయత్నిస్తే అవి ఇంకా బెదిరి గుమ్మి మీదికో గోడ మీదికో ఎగిరేయి. కొన్నిసార్లు రాత్రంతా అక్కడే ఉండేయి. మల్ల పొద్దున్నే గూట్లో నుండి వదిలిన కోళ్లతో పాటు కలిసి వాటి పనిలో అవి ఉండేవి. తెల్లవారుజామున కోళ్లు కూయంగనే మా నాయనా లేసి ఎడ్లనితోలుకొని మోటగట్టడానికి బొయ్యేటోడు. గుడ్లకొచ్చిన కోడి నెమ్మదిగా, బరువుగా కె కె కె అనుకుంటూ మధ్యాహ్నం పూట ఇంట్లోకొస్తుండేది. ఎవరూ జూడట్లేదని నిర్ధారించుకొని దానికి కేటాయించిన గంపలోకి బోయేది. గుడ్డుబెట్టి చాలా తేలిగ్గా ఎల్లిపోయేది. కొన్ని కోళ్లు గడ్డివాముల్లోనే గుడ్లు బెట్టేయి. వాట్ని సాయంత్రం ఎతికి తెచ్చుకునేది. అప్పుడప్పుడు ఈ గుడ్లకాడ అమ్మలక్కలకు వాదనలు అయ్యేది. ఇట్ల ఇరవై ముప్పై గుడ్లు బెట్టినంక కోడి పొదుగుడుకొచ్చేది. కోడి పొదిగితే గుడ్లన్నీ పిల్లలయ్యేది. రంగురంగుల ఆ ముప్పై పిల్లలు ఇంట్లెదిరుగుతుంటె ఇంద్రధనుస్సు తిరుగుతున్నట్టే ఉండేది. కోళ్ళకి మనుషులతోనే గాక, శానా ప్రమాదాలు వచ్చేవి. ఉన్నట్టుండి అర్దరాత్రి గూట్లోని కోళ్ళన్నీ క్కెక్కెక్కెక్కెక్కెక్కే అని మొత్తుకునేయి. ఇంగ కోళ్ల గూట్లెకి పాము బోయిందని ఇంటిల్లిపాదీ లేసి, లాంతరు ముట్టిచ్చి, బారెడు పొడుగు కర్రలుదీసుకొని గూడుకాడికి బోయేది. బండ మూతదీసి, కిరసనాయిలు లాంతరు వొత్తి పెద్దగజేసి దగ్గరికి బెట్టి సూస్తే కోళ్ళన్నీ లోపల ఒక మూలకు నక్కి బెదిరిపోయి ఉండేయి. గూడు మూతదీస్తే కోళ్లు బయటకు రావాలెగదా, కానీ, అవి రావు. ఆ లాంతరు ఎలుతురులో భయం భయంగా జూసి పామును కనిపెట్టేది. అది సుట్టలు సుట్టలు జుట్టుకొని ఉండేది. కర్రతో ఒడుపుగా పాము నడుముని ఒత్తిపెట్టి ఇంకో కర్రతోని గొట్టేది. ఒత్తిపట్టకుంటే అది అమాంతం మీదికే వస్తది. ఇంగ దాన్ని జంపి ఊరి బయట బొందలో ఏసొచ్చేది. ఈ గోలకి సుట్టుపక్కల మూడిండ్లోళ్లులేసేవాళ్ళు. పిల్లులు, పాములు, కుక్కలు తినంగ, కూరపాట్ల రోగం దగిలి సావంగ ఆ కోళ్ళల్లో సగమే మిగిలేయి. ఇంగ ఆ కోళ్ళనిగొనడానికి బేరగాళ్ళు సైకిలు మీద పెద్ద బుట్ట గట్టుకొని, దాని సుట్టూ వలగట్టుకొని, సాయంత్రం కోళ్ళన్నీ గూళ్లల్ల జేరినంక వచ్చేది. కోల్లగూట్లెకి తలబెట్టి, సెయ్యిజాపి ఒక్కోకోడి కాళ్ళుబట్టి బయటకు లాగేటోన్ని. ఒక్కోసారి రెండు, మూడు, పది కోళ్ళమటుకు అమ్మేది. వాట్ని అమ్మితే వచ్చే డబ్బులు ఇంటి అవసరాలకు అక్కరకొచ్చేవి. ఒక్కోసారి సుట్టాల్ల కోసం పట్టపగలు కోన్ని పట్టుకోవాల్సి వచ్చేది. అది ఏ గడ్డివాములో, ఏ పెండగడ్డమీద మేస్తుందో సూసి మెల్లగా ఇంట్లోకి తోలుకొని వచ్చేది. కానీ, ఈ శకలు ఎందుకుబడుతుండ్రో కొన్ని సదువుకున్న కోళ్లు గ్రహించి క్కెక్కెక్కెక్కె అని భీకరంగా అరుస్తూ, రెక్కలన్నీ ఊడిపోతున్నా లెక్కజేయకుండా ఎగిరిపోయ్యేయి. ఒక్కోసారి అకస్మాత్తుగా మీదికే ఎగిరేయి. వాటికాళ్ల గోర్లు కత్తుల్లావుండి మొకం మీన్నో, సేతులమీన్నో గీసుకొనేవి. ఉరుకుతున్న కోడికి సూటిజూసి కర్ర ఇసిరేది. అది తగిలి కొన్నిసార్లు కోడి కిందబడేది. ఇంగ ఉరికి దాన్నిపట్టుకునేది. కొన్ని సదువుకున్న తెలివైన కోళ్లు కర్రదలక్కుండా తప్పిచ్చుకొని పోయేటివి. ఇగ దాన్ని ఒదిలి ఇంకో అమాయకపు కోన్నిజూసి మెల్లగ పనమటింట్లెకి దోలి తలుపుబెట్టేది. అది విషయాన్ని గ్రహించి, గుడ్లెర్రజేసి అమాంతం మీదికి వస్తున్నా లెక్కజేయకుండా రొండు సేతులతో దొరకబట్టి, దాని రొండు కాళ్ళని జతజేసి ఒక సెయ్యితోని, ముక్కుతో పొడవకుండా మెడకాయని ఇంకోసెయ్యితోని కదలకుండా పట్టుకొనేది. ఇంగ కోణ్ణిగొయ్యడం అనేది ఒక కళ. అది అందరికీ రాదు. ఇంగ దాని బూరుబీకి, కట్టెలపొయ్యిమీద కాపి, పసుపు, ఉప్పు దాని ఒంటికిబూసి కడిగేది. ఇగ సేదు, పొట్టపేగులు తీసి ముక్కలుగోసేది. ఇంగ ఈపని నడుస్తుండంగనే నేను బడి నుంచి వచ్చి పుస్తకాల సంచి కొయ్యకుదలిగిచ్చి, కాసేపు కోన్ని గోస్తున్న అమ్మ పక్కన గూసునేది. అప్పటికే సుట్టాన్ని దీసుకొని గుమ్మి సారకోసం మా నాయన పొయ్యుంటడు. ఇంగ నేను గాల్లో తేలుకుంటూ దోస్తులకాడికి బోయి, కాసేపు ఆడుకోని ఇంటికి వొచ్చేటోన్ని. ఇంట్లె కోణ్ణి గోసిన సంగతి మాత్రం దోస్తులకు సెప్పెటోణ్ణిగాదు. ఎందుకంటే మొత్తం పుల్లెగాండ్ల కొడుకులే, వాసనదగిల్తే సాలు వచ్చి గుమ్మికాడ నిలబడతరు. అందుకని నేను సచ్చినా సెప్పకపొయ్యేటోన్ని. గుమ్మి ఇంటికి మధ్యలో ఉండేది. దాంట్లె ఎప్పుడూ ఒక పుట్టెడన్నాఒడ్లు ఉండేయి. దాని పక్కనే ఒక పెద్ద రోలు ఉండేది జొన్నలుదొక్కడానికి. ఇంతలో మా నాయన, సుట్టం మాంచి బిర్రుగా వచ్చేటోళ్లు. వాళ్లకి గుమ్మి పక్కన నున్నగ ఊకి, నులకమంచం ఏసేది. దానిమీద ఊళ్లల్లకొచ్చి వాయిదాలమీద అమ్మేవాళ్ళకాడ కొన్న దుప్పటి ఏసేది. ఇంగ దానిమీద కూసోని మా నాయన, కిర్రు సెప్పుల సుట్టం చర్చలు జేస్తుండే వాళ్ళు. ఆయన సెప్పులు మంచం పక్కనే ఉండేవి. వాటికి గులాబీ పూలమాదిరి ఎర్రటి పూలు ఉండేవి. వాటిని తొడుక్కొని నడుస్తుంటే కిర్రు కిర్రు అనే సప్పుడు శాలా దూరం ఇనపడేది. ఆయన ఏ కాలంలో అయినా గొడుగు పట్టుకొనే వచ్చేవాడు. తలకు పేద్ద రుమాలు జుట్టేవాడు. వడిదిరిగిన మీసకట్టుతో గంభీరంగా ఉండేవాడు. ఆయన శానా పంచాదిలకు పెద్దమనిషి. వాళ్ళు సుట్టుపక్కల ఊర్లల్ల జరిగిన పంచాయితీలు, పెద్దమడుసులు ఇచ్చిన తీర్పులు, అందులో మంచి చెడ్డలు, కుటుంబ ఆర్ధిక పరిస్థితి, సేయబోయే పిల్లల పెండ్లిళ్ల గురించి మాట్లాడుకునేటోళ్లు. దాంట్లో వంశ గౌరవం ఎక్కువగా ఇనపడుతుండేది. ఆ చర్చలల్లో నాకు, అక్కలకీ, అమ్మకీ పెద్దగా పాత్ర ఉండేది గాదు. అయ్యి మాకు తెలియవని, అసలు మాకు వాటి అవసరం లేదనీ వాళ్ళ ఉద్దేశ్యం. ఇంగ ముచ్చట్లు అయ్యేలోపుల ముక్కుపుటాలదిరే వాసనతోని కోడి కూర రడీ అయ్యేది. వంటింట్లో రెండు పీటలు యేసి, వాళ్ళని బువ్వకు పిలిసేది. వాళ్ళు గాబుకాడికి పోయి కాళ్ళూ సేతులూ కడుక్కొని వచ్చి పీటలమీద కూసునేది. ఇంగ కటకటమని బొక్కలు గొరుక్కుంట, జుర్రుకుంట వాళ్ళు తింటుండేది. ఇంగ నా ఆత్రం ఆగట్లేదని ఒక పళ్లెంలో అన్నంబెట్టి, కూర ఏసి నాకు ఇచ్చేది మా అమ్మ. గిప్పుడు కుర్రకారు ఏసే షార్ట్స్ నేను అప్పుడే ఏసేది. కాకుంటే గప్పుడు వాట్ని లాగులు అనేటోళ్లు. ఇంగ మంచం మీద గూసోని, నల్లగా మాసిన లాగున్న రెండు తొడలమీద బెట్టుకొని, ఊరిచ్చుకుంట ఊరిచ్చుకుంటా తినేటోన్ని. రోజుటి కంటే నాలుగుముద్దలు ఎక్కువదినేది. కోడిపులుసు ఘాటుకు ముక్కు నుండి గారే సీమిడిని కుడి భుజానికి రుద్దేది. అక్కడ అట్టగట్టేది. సెయ్యిని, పళ్ళాన్ని నాక్కుంట నాక్కుంట గాబుకాడికెల్లి, పళ్లెం అక్కడబడేసి, సెయ్యిమీద నీళ్లుజల్లుకొని, లాగుకు తుడుసుకుంట, కోళ్లగూడు పక్కనుండి బజార్లబడేటోన్ని. అప్పుడు సెయ్యి వాసన జూసుకుంటే కోడికూర వాసన గుబాళిస్తుండేది. ఆ వాసన తెల్లారి బడికిబొయ్యేదాకా ఉండేది. దోస్తుగాళ్లు ఎవరన్నా కోడికూరదిన్ననంటే నమ్మకుంటే, ఈ సెయ్యి వాని ముక్కుదగ్గరబెట్టేది. అంతే, సచ్చినట్టు నమ్మేది! - యేదుల గోపిరెడ్డి, హైదరాబాద్ మాతో పంచుకోండి! ఈ పేజీ మీకోసమే! మీ జీవితంలో మీకెదురైన, మీ అనుభవంలోకి వచ్చిన సరదా సంఘటనలను, అనుభూతులను మాతో పంచుకోండి! ఇక్కడ ఈ పేజీలో వాటిని ప్రచురిస్తాం. మీతో పాటు సాక్షి పాఠకులందరినీ ఆ సంఘటనను తెలుసుకొని (మీరైతే తలచుకొని) ముఖంపై నవ్వులు పూసుకునేలా చేస్తాం!! మీ అనుభవాలు పోస్ట్ ద్వారా కానీ, మెయిల్ (funday.kathalu@gmail.com) ద్వారా కానీ ఫన్‌డేకు పంపించండి! -
నాటు కోడికి పెరుగుతున్న క్రేజ్
ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది గానీ.. నాలుక మీద పడగానే ఆ రుచి అదిరిపోతుంది. పంటితో కొరికాక చూడాలి ఆ ముక్క మజాని.. కొన్ని క్షణాలు కళ్లు తెరిస్తే ఒట్టు. ఆ నాటు ఘాటును అలా హాయిగా ఆస్వాదించేస్తాం మరి. ఇగురైనా.. పులుసైనా.. చివరకు ఫ్రై అయినా.. ఆ టేస్టే వేరు. అందుకే తిన్నాక అంటాం.. తింటే నాటు కోడినే తినాలని. అందుకే ఇప్పటివరకూ కొంచెం దూరమైన ఆ రుచిని మాంసం ప్రియులు మళ్లీ కోరుకుంటున్నారు. బ్రాయిలర్‌కు బదులు ‘నాటు’కే ఓటేస్తున్నారు. సాక్షి, నెట్వర్క్: నాటు కోడి గుడ్డు.. మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. కానీ.. నాటు కోడి మాంసం గట్టిగా.. తినడానికి ఇబ్బందిగా ఉంటోందని వినియోగాన్ని తగ్గించేశారు. పల్లెల్లో సైతం మారిన జీవనశైలికి నాటుకోళ్ల పెంపకం భారం కావడంతో దాదాపు మానుకున్నారు. పల్లెల్లో సైతం బ్రాయిలర్ కోడి మాంసం అందుబాటులోకొచ్చింది. అందుకే ఇంతకాలం నాటుకోళ్లకు ప్రత్యామ్నాయంగా మాంసం ప్రియులు బ్రాయిలర్ కోడి మాంసానికి అలవాటుపడ్డారు. మెత్తగా.. తినడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దీనినే ఎక్కువగా వినియోగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల మాంసం ప్రియుల ఆహార అలవాట్లలో మార్పులొచ్చాయి. బరువు పెరగడానికి బ్రాయిలర్ కోళ్లకు ఇంజెక్షన్లు చేస్తున్నారనే అనుమానం పెరిగింది. హార్మోన్ ఇంజెక్షన్లతో నెల రోజుల కోడి పిల్లను రెండు, మూడు కేజీలకు పెంచుతున్న వైనాలూ వెలుగు చూస్తున్నాయి. మరోవైపు వాటి రుచి తగ్గిపోవడం వంటి కారణాలతో బ్రాయిలర్ మాంసం వినియోగాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు. వారాంతంలో విధిగా నాటు కోడి మాంసం కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటికొచి్చన బంధువులకు, వివాహ విందులు, ఇతర కార్యక్రమాల్లో నాటు కోడి కూర వండి వడ్డిస్తున్నారు. కిలో రూ.400 నుంచి 500పైనే.. పల్లెటూళ్లలో పెంచుతున్న నాటుకోళ్లను పట్టణాలు, నగరాలకు తీసుకొచ్చి వారాంతంలో విక్రయిస్తున్నారు. పెంపకందార్లు నాటు కోడిని రూ.300 వరకు విక్రయిస్తుంటే.. మార్కెట్లో కిలో కోడిని రూ.400 నుంచి రూ.500కు పైగా అమ్ముతున్నారు. మార్కెట్లో మటన్, నాటు కోడి మాంసం ధరలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. నాటు కోడికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఇటీవల కాలంలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలు మాదిరిగా నాటు కోళ్ల ఫారాలు పెరిగాయి. నాటు కోడి పులుసు రెడీ పట్టణాల్లో ఓ మోస్తరు హోటళ్లు మొదలుకుని.. విజయవాడ,విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి తదితర నగరాల్లోని రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో నాటు కోడి ఇగురు, పులుసును మెనూలో ప్రత్యేకంగా చూపుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో అన్ని రెస్టారెంట్లు, దాబాలు.. నాటు కోడి పులుసు, రాగి సంగటితో స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల వెంట దాబాల్లో నాటు కోడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కోళ్ల పెంపకంపై ఆసక్తితో.. సుదీర్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా, ఓబులవారిపల్లి మండలం, తల్లెంవారి పల్లె గ్రామ నివాసి. గతంలో ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. నాటు కోళ్ల పెంపకంపై ఆసక్తితో ఇటీవలే అక్కడ ఉద్యోగం మానేసి సొంతంగా రూ. 10 లక్షలతో ఫారం ఏర్పాటు చేశాడు. ఎలాంటి కృత్తిమ మందులు వాడకుండా పూర్తిగా సంప్రదాయ దాణాలతో దాదాపు 3,000 కోళ్లను పెంచుతున్నారు. ఆయన్ని పలకరించగా.. నాటు కోడి గుడ్లకు, మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉందని, ప్రతి రోజూ ఫారం దగ్గరికే వచ్చి మాంస ప్రియులు నాటు కోళ్లను, గుడ్లను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. వారాంతాలు, పండుగల్లో దూర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వస్తుంటారని వివరించాడు. ఒకసారి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత నెలకు రూ. లక్ష వరకు లాభాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. నాణ్యతకు పెద్దపీట మా నాటు కోళ్ల ఫారం కర్నూలు సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ప్రతి ఆదివారం కనీసం 50 మంది ఇక్కడికే వచ్చి నాటు కోళ్లు కొనుక్కెళ్తున్నారు. వినియోగదారులు డబ్బుకు వెనకాడటం లేదు. రుచి, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. – వెంకటేశ్వర్లు, కర్నూలు సబ్సిడీపై కోళ్ల పిల్లలు గతంలో రైతులు పెరట్లో నాటు కోళ్లు విరివిగా పెంచేవారు. కాలక్రమేణా ఈ పెంపకం తగ్గింది. ఇటీవల కాలంలో రైతులు మళ్లీ నాటుకోళ్లు పెంపకంపై ఆసక్తి చూప్తున్నారు. ప్రతి జిల్లాలో చిన్న చిన్న ఫామ్‌లు వెలుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకూ సబ్సిడీపై 45 నాటుకోళ్ల పిల్లలను పంపిణీ చేస్తుంది. – ఎన్.టి.శ్రీనివాస్, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ పోషక విలువలు అధికం నాటు కోళ్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మాంసకృత్తులు లభిస్తాయి. నాటు కోడి గుడ్లు ఎక్కువ బలమైన ఆహారం. కోళ్లకు తరుచూ సీజనల్ వ్యాధులకు వ్యాకిన్స్లు వేయించుకోవాలి. – డా‘‘ వి.అనురాధ, పశుసంవర్ధకశాఖ (వీబీఆర్ఐ) జెడీ, సామర్లకోట. మాజీ సైనికుని ఇంట సిరుల పంట ఎర్రావారిపాళెం (చిత్తూరు జిల్లా): ఎర్రావారి మండలం కూరపర్తివారిపల్లిలో మాజీ సైనికుడు శ్రీనాథ్‌రెడ్డి కడక్‌నాథ్ రకంతోపాటు నాటు కోళ్లు పెంచుతున్నారు. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ బాగుండటంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నట్టు శ్రీనాథ్‌రెడ్డి చెప్పారు. కోళ్లతోపాటు కోడిగుడ్లు, పిల్లల్ని కూడా అమ్ముతున్నట్టు వివరించారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో జీవాల గణాంకాలివీ.. (సుమారుగా..) లేయర్ కోళ్లు- 11,01,10,315 బ్రాయిలర్ కోళ్లు- 8,05,83,000 నాటు కోళ్లు- 35,18,950 మేకలు- 44,12,500 గొర్రెలు- 1,35,04,350 -
బంగారు కమ్మలు మింగిన కోడి
టీ.నగర్(చెన్నై): బంగారు కమ్మలను మింగిన కోడి చనిపోయిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై పురసైవాక్కం నెల్‌వాయల్‌లో నివశించే శివకుమార్‌కు సంతానం లేకపోవడంతో ఏడాది క్రితం ఒక కోడి పిల్లను కొనుక్కుని పూంజి అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. శుక్రవారం శివకుమార్ అక్క కుమార్తె దీప తలదువ్వుకుంటూ బంగారు కమ్మలను తీసి కింద పెట్టింది. అక్కడే తిరుగుతున్న కోడి ఆ కమ్మలను మింగేసింది. శివకుమార్ వెంటనే కోడిని తీసుకుని అన్నానగర్‌లోని ఒక వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టర్ కోడికి ఎక్స్‌రే తీసి కమ్మలు కోడి ఉదరంలో ఉన్నట్లు గుర్తించాడు. కోడికి ఆపరేషన్ చేసి కమ్మలను వెలికి తీశాడు. అయితే కమ్మలలోని సూది మొన లాంటి భాగం కోడి ఉదరాన్ని గాయపరచడంతో కొద్ది సేపటికే అది చనిపోయింది. ప్రాణప్రదంగా పెంచుకున్న కోడి చనిపోవడంతో శివకుమార్, దీప భోరున విలపించారు. వారు కన్నీరు కార్చడం అక్కడి వారిని కదిలించింది. -
కోడిపెట్ట.. రెండు గుడ్లెట్టా?
సాక్షి, ఇటిక్యాల (అలంపూర్) : ఎక్కడైనా ఒక కోడిపెట్ట గుడ్డు పెట్టిన తర్వాత 24 గంటలకు మరో గుడ్డు పెడుతుంది. కానీ మండల కేంద్రంలోని హుస్సేన్‌కు చెందిన ఓ కోడిపెట్ట శనివారం ఒకే సమయంలో రెండు గుడ్లు పెట్టింది. ఒకటి సాధారణ సైజులో ఉండగా.. మరొకటి చిన్నసైజులో ఉంది. ఒకే సమయంలో కోడి రెండు గుడ్లను, అది ఒకటి చిన్నదిగా, మరొకటి సాధారణ సైజులో పెట్టడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై పశువైద్యాధికారి రమేష్‌ను సంప్రదించగా.. ఇది అరుదైన సంఘటన అని, జన్యులోపంతో ఇలాంటివి జరుగుతాయన్నారు. -
ఒక కోడి.. 150 గుడ్లు
ఓ నాటుకోడి 6 నెలల్లో 150 గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగర్‌కర్నూల్ జిల్లా దేవల్తిర్మలాపూర్కి చెందిన రామకృష్ణమాచారి రెండేళ్ల కోడిపెట్ట గత 6 నెలలుగా 150 గుడ్లు పెట్టింది. నేటికీ పెడుతూనే ఉంది. ఈ విషయాన్ని రామకృష్ణమాచారి గ్రామస్తులకు తెలియజేయడంతో ఆసక్తిగా వచ్చి ఆ కోడిపెట్టను చూశారు. కొందరు గుడ్లను తీసుకెళ్లి తమ కోళ్లకు పొదుగేసుకున్నారు. ఈ విషయమై పశువైద్యాధికారిని అడగగా.. జన్యులోపం వల్ల లక్షల్లో ఒక కోడి ఇలా గుడ్లు పెడుతుందని తెలిపారు. – పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్) -
కోళ్లకు టికెట్ లేదా.. అయితే ఫైన్ కట్టు !
బొమ్మనహళ్లి : కోళ్లకు టికెట్ తీసుకోలేదని జరిమానా విధించిన ఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని కోడు నుంచి మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. నిజాయితీగా టికెట్ తీసుకున్నాడు. ఇంతలో కొంత దూరం ప్రయాణం అనంతరం తనిఖీ బృందం వచ్చి టికెట్లు తనిఖీ చేస్తుండగా కోళ్లకు టికెట్ తీసుకోలేదని గుర్తించి సదరు ప్రయాణికుడికి రూ. 500 జరిమానా విధించారు. కేఎస్ఆర్టీసీలో ప్రాణులు, ఇతర పక్షులను తీసుకువెళ్లే సమయంలో తప్పకుండా అర టికెట్ తీసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో విషయం తెలియని వ్యక్తి జరిమానా కట్టి కోళను వెంట తెచ్చుకున్నాడు. -
కోడి గడియారం
ఒక ఊళ్లో ఒక కోడి, దాని పిల్లలు ఉండేవి. అవి రోజూ పగలు, రాత్రి ‘క్కొ.. క్కొ.. క్కొ..’ అని, ‘ట్వియ్ ట్వియ్’ అరుచుకుంటూ ఊరంతా తిరుగుతుండేవి. రానురాను వీటి అరుపులతో ఊరి ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. దాంతో అందరూ ఆగ్రహించి.. కోడిని, కోడి పిల్లలను ఊళ్లో నుంచి తరిమేశారు. కోడి తన పిల్లలను తీసుకుని పొరుగూరికి వెళ్లింది. కొత్త వాతావరణం చూసి కోడిపిల్లలు మరింత ఆనందంతో ఇంకా గట్టిగా ‘క్కొ.. క్కొ.. క్కొ.. క్కొ..’ అని అరవడం ప్రారంభించాయి. అవి అలా ఊరంతా తిరుగుతూ ఎడతెరపి లేకుండా అరుస్తుండడంతో ఊరివాళ్లు చికాకుపడి కోడిని, దాని పిల్లలను ఆ ఊరి నుంచి కూడా తరిమేశారు. కోడి మళ్లీ తన పిల్లలను తీసుకుని ఇంకొక ఊరికి వెళ్లింది. అక్కడకూడా వీటి అరుపులు భరించలేక అందరూ తరిమేశారు. ఇలా అన్ని ఊళ్లూ తిరగలేక కోడికి విసుగు వచ్చింది. అడవిలోకి వెళ్లిపోయి, తన పిల్లలతో కలిసి అక్కడే ఉండటం ప్రారంభించింది. ఇక్కడ కోడి, కోడిపిల్లల కూతలు లేకపోవడంతో జనాలకు తెల్లవారుజామునే లేవడం ఆలస్యం అవుతోంది. దాంతో పనులన్నీ ఆలస్యమైపోతున్నాయి. చివరకు అన్ని ఊళ్లలోని జనం కోడిని, దాని పిల్లలను వెతుక్కుంటూ వచ్చి దయచేసి తమ ఊరికి రమ్మంటూ బతిమాలారు. అప్పుడు కోడి ఒక్కొక్క ఊరివారికి ఒక్కొక్క కోడిపిల్లను ఇచ్చి ‘‘దీనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి’’ అని చెప్పింది. కోడిపిల్లలు పెద్దవై కొక్కొరొక్కో అని కూయడంతో ఆయా గ్రామాల ప్రజలు తెల్లవారినట్లు తెలుసుకుని నిద్రలేచి తమ దైనందిన చర్యలలో పడటం అలవాటుగా మార్చుకున్నారు. మంచి చెప్పేవారికి, పదిమందికీ మేలు చేసేవారికి కూడా ఒక్కోసారి కోడికి ఎదురైన అనుభవం ఎదురు కావచ్చు. అంతమాత్రాన నిరాశ పడి ఊరుకోకూడదు. తమ ప్రబోధాలను, తాము చేసే మంచిని కొనసాగిస్తుండాలి. – డి.వి.ఆర్ -
ఆ పెట్టది రోజుకో రకం ‘ఎగ్’స్ట్రా..
తూర్పుగోదావరి, గొల్లప్రోలు (పిఠాపురం): మండలంలోని చినజగ్గంపేటలో శీరం సత్తిబాబు పెంచుతున్న ఓ నాటు కోడిపెట్ట పెడుతున్న గుడ్లను చూస్తుంటే..శుక్లపక్షంలో చందమామ దినదిన ప్రవర్ధమానమైన చందంగా ఉంది. గత అయిదురోజులుగా ఆ పెట్ట పెట్టే గుడ్ల సైజు రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మొదటి రోజు చిన్న గుడ్డును పెట్టిన ఆ పెట్ట మర్నాడు దాని కన్నా కొంచెం పెద్దదిగా ఉన్న గుడ్డును పెట్టింది. తర్వాత మూడురోజులు పెట్టిన గుడ్ల సైజు కూడా కొంచెం కొంచెం పెద్దదవుతూ వచ్చింది. ఈ గుడ్లు ఊరివారికి ఆసక్తి కలిగిస్తున్నాయి. జన్యుపరమైన లోపం వల్లే కోడిపెట్టలు వివిధ సైజులలో గుడ్లు పెడుతుంటాయని పశువైద్యాధికారి హిమజ తెలిపారు. -
నల్లకోడి మాంసంతో ఆరోగ్యం..
గుంటూరు, చిలకలూరిపేటరూరల్: కోడి రంగుతో పాటు మాంసం కూడా నలుపురంగు లోనే ఉంటుంది. కోడి పెట్టే గుడ్డు మినహా శరీరంలోని అవయవాలన్నీ నలుపురంగులోనే ఉండటం ప్రత్యేకం. ఈ కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. వైద్య శాస్త్రవేత్తల సూచనలతో ఒక విద్యావంతుడు ఈ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. వీటి గురించి పశువైద్యాధికారి డాక్టర్ మల్లయ్య తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కఢక్‌నాథ్ నల్ల కోళ్లు చిలకలూరిపేట రూరల్ మండలంలోని గంగన్నపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన గోరంట్ల పిచ్చయ్య ఎంబీఎ(హెచ్ఆర్), ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఈడీ ఉన్నత విద్యను అభ్యసించి ఒక సంస్థలో సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీ పనుల నిమిత్తం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కఢక్‌నా«థ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే నల్లరంగులో ఉన్న కోడిపెట్టలు, పుంజులను పరిశీలించారు. కోళ్లను పెంచుతున్న రైతులతో మాట్లాడితే మరొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వీటి మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, క్షీణించిన ఆరోగ్యం కూడా మెరుగవుతుందని తెలియచేశారు. అక్కడ నుంచి తిరిగి వచ్చాక పిచ్చయ్య ఈ కోళ్ల గురించి పసుమర్రు పశువైద్యాధికారి డాక్టర్ మల్లయ్యను సంప్రదించారు. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో ఉన్న కోళ్లను, పశు సంవవర్థక శాఖకు చెందిన శాస్త్రవేత్తలు, వైద్యులను సంప్రదించారు. కఢక్‌నా«థ్ ప్రాంతంలోని కోళ్ల పెంపకందారులు తెలిపినవి వాస్తవమేనని గుర్తించారు. వెంటనే పిచ్చయ్య తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కోళ్లఫారం ఏర్పాటు చేశారు. చిరు ప్రయత్నం ప్రారంభం ... గ్రామంలో తనకు చెందిన కొద్దిపాటి స్థలంలో చిన్న షెడ్డును ఏర్పాటు చేసి కఢక్‌నా«థ్ నుంచి ఒక్కో గుడ్డును రూ.50 చొప్పున, కేజీ బరువు ఉన్న కోడిని రూ.1,000 చొప్పున మొత్తం 50 కోళ్లు, 10 గుడ్లు, రెండు పుంజులను కొనుగోలు చేసి తీసుకువచ్చారు. అక్కడి కోళ్లు స్థానిక వాతావరణానికి అనుగుణంగా అలవాటయ్యేందుకు వాటితో పాటు స్థానిక కోళ్లను కొన్నింటిని కొనుగోలు చేశారు. రెండింటినీ కలిపి ఒక షెడ్డు ఏర్పాటు చేసి వాటిలో పెంపంకం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. నల్లకోడి మాంసంతో ఆరోగ్యం కఢక్నాథ్కు చెందిన నల్ల కోడి మాంసం ఆహారంగా స్వీకరిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పక్షవాతం, గుండెనొప్పి, రక్త ప్రసరణ, ఆరోగ్యం క్షీణించిన వారికి ప్రత్యేక ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు చెబుతుండటంతో ప్రజలు ఈ కోడిమాంసం ఆహారంగా స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కోడి గుడ్డును తీసుకుంటే పౌష్టికాహారంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక్క కోడి 80 గుడ్లు ...ఆరున్నర సంవత్సరాలు సాధారణంగా స్థానికంగా ఉండే కోళ్లు 25 నుంచి 35 గుడ్లు మాత్రమే పెట్టి వాటినే పొదిగి పిల్లలను పెంపొందింప చేస్తాయి. ఇందుకు భిన్నంగా కఢక్‌నాథ్ నల్లకోళ్లు మాత్రం 75 నుంచి 80 గుడ్లను పెడతాయి. స్థానిక కోళ్ల జీవితకాలం కేవలం నాలుగున్నర ఏళ్లు మాత్రమే. కఢక్‌నా«థ్ కోళ్లు ఆరున్నర ఏళ్లు జీవిస్తాయి. పిచ్చయ్య తీసుకువచ్చిన కోళ్లు ఆరు సంవత్సరాలు గడిచినా నేటికీ ఆరోగ్యంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. స్వయం పర్యవేక్షణ... మారుతున్న వాతావరణానికి అనుగుణంగా కఢక్‌నా«థ్ కోళ్లను నిత్యం పర్యవేక్షిస్తూ షెడ్లో వాటికి అవసరమైన ఆహారం, నీరు, వ్యాధి నిరోధక జాగ్రత్తలు తీసుకుంటే పెంపకందారులకు ఆదాయం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో కోడి మాంసం ధర కిలో రూ.1,000 ఉంటే ఒక్కో గుడ్డు ధర రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. నల్ల కోడి మాంసంతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కఢక్‌నాథ్ ప్రాంతానికి చెందిన నల్లకోళ్ల గురించి తెలిసి, స్వయంగా వెళ్లి పరిశీలించాం. వీటిపై అనేకమంది పశుసంవర్థక శాస్త్రవేత్తలు, వైద్య విభాగంలోని ప్రొఫెసర్లను సంప్రదించాం. నల్లకోడి మాంసం ఆహారంగా స్వీకరిస్తే మానవుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. పక్షవాతం, గుండెజబ్బులు ఉన్న వారికి ఈ మాంసం ఆహారంగా తీసుకుంటే బాగుంటుంది. పెంపకందారులకు ఆదాయం కూడా బాగుంటుంది.–డాక్టర్ సీహెచ్ మల్లయ్య, పశు వైద్యాధికారి, పసుమర్రు -
నాటు కోళ్ల పెంపకం పథకానికి శ్రీకారం
నాటు కోళ్ల పెంపకం పథకానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 77 వేల మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. తలా 50 కోళ్లను అందజేయనుంది. సాక్షి, చెన్నై : రాష్ట్ర పశు సంవర్థక శాఖ నేతృత్వంలో ఆవులు, మేకల పెంపకం, అభివృద్ధి పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పథకానికి ప్రత్యేకంగా నిధుల్ని కేటాయిస్తూ గ్రామీణ రైతులు, మహిళా లబ్ధిదారులకు ఆవుల్ని, మేకల్ని ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, రైతులకు నాటు కోళ్ల పెంపకం నిమిత్తం ప్రత్యేక ప్రోత్సహాన్ని అందిస్తోంది. తాజాగా నాటు కోళ్ల పెంపకం, ›గ్రామాల్లోని పేద మహిళల ఆర్థికాభివృద్ధి మెరుగు లక్ష్యంగా గత ఏడాది అసెంబ్లీ వేదికగా కొత్త పథకాన్ని సీఎం పళనిస్వామి ప్రకటించారు. తొలుత ఈ పథకం నిమిత్తం రూ.25 కోట్లు కేటాయించారు. అయితే, పథకం అమల్లో జాప్యం తప్పలేదు. ఈ దృష్ట్యా, అదనంగా మరో 25 కోట్లను అప్పగించారు. దీంతో 50 కోట్లతో తొలి విడతగా ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగింది. ఒక్కో పేద మహిళా లబ్ధిదారుకు 50 నాటు కోళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించారు. శ్రీకారం సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో సీఎం పళనిస్వామి నాటు కోళ్ల పెంపకం, పేద మహిళల ఆర్థికాభివృద్ధిని కాంక్షించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. పది మంది లబ్ధిదారులకు తలా యాభై చొప్పున నాటు కోళ్లను అందజేశారు. వీటి ద్వారా తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని వారికి సీఎం పిలుపునిచ్చారు. తొలి విడతగా 77 వేల మంది మహిళా లబ్ధిదారులకు ఈ నాటు కోళ్ల పంపిణీ సాగనున్నది. మరికొన్ని కార్యక్రమాలు పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖలకు రాష్ట్రంలోని తేని, అరియలూరు, కోయంబత్తూరు, రామనాథ పురం, కడలూరుల్లో రూ.89 కోట్లతో నిర్మించిన క్వార్టర్సులు, పోలీసు స్టేషన్లు ఇలా అనేక నిర్మాణాలను సీఎం పళనిస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. చెన్నై ఎంఆర్సీ నగర్లో రూ.73 కోట్లతో నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల కోసం నిర్మించిన పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. ఇక, నాబర్డ్ నేతృత్వంలో జరిగిన సదస్సులో రైతుల ఆదాయ మార్గం పెంపునకు తగ్గ కార్యాచరణ, ప్రభుత్వ సహకారం గురించి సీఎం పళనిస్వామి ప్రసంగించారు. ఈకార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. -
కోడిగుడ్డుకు తోక..
తూర్పుగోదావరి :కరప మండలం పేపకాయలపాలెంలో రాయుడు సుబ్రహ్మణ్యం ఇంట్లో ఓ కోడి ఆదివారం పెట్టిన గుడ్డుకు తోక ఏర్పడింది. విచిత్రంగా ఉండటంతో దీనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. -
‘పుంజు’ తెచ్చిన అవార్డు
గుంటూరు, నరసరావుపేట ఈస్ట్: విశాఖజిల్లా చౌడవరం చిత్ర కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్స్ కాంపిటేషన్‌లో పట్టణానికి చెందిన చిత్రకారుడు జి.దేవదానానికి అవార్డు లభించింది. దేవదానం కుంచె నుంచి జాలువారిన కోడిపుంజు సజీవ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. అక్టోబర్ 7వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి చిత్రకారుల సమ్మెళనంలో అవార్డును తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని ప్రగతి ఆర్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు దేవదానాన్ని అభినందించారు. -
తాగిన మత్తులో బతికున్న కోడిని..
-
పీకలదాకా తాగి బతికున్న కోడిని పీక్కుతిన్నాడు
సాక్షి, హైదరాబాద్ : మద్యం తాగిన మత్తులో కొంతమంది దారుణాలకు తెగబడుతుంటారు. ఇంకొంతమంది జుగుప్సాకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కేసముద్రంలో ఓ యువకుడు మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు పీకలదాకా మద్యం తాగారు. పక్కనే చికెన్ షాపులో ఓ కోడిని కొనుక్కుని ఇంటికి బయల్దేరారు. మద్యం అతిగా సేవించడంతో సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్న ఇద్దరు యువకులు ఆర్వోబీ రోడ్డు సమీపంలో పడిపోయారు. ఓ యువకుడు పూర్తిగా స్రృహ కోల్పోయాడు. మరో యువకుడు మాత్రం చేతిలో ఉన్న కోడి మెడ కొరికేసి, బతికున్న దాన్నే కొరుక్కుతిన్నాడు. ఈ తతంగాన్నంతా రోడ్డున వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో చూపిన వారంతా వీడెంత తాగాడురా.. బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సదరు యువకుల వివరాలు తెలియరాలేదు. -
కొక్కిరి బిక్కిరి
తూర్పుగోదావరి ,మండపేట: జిల్లాలోని పౌల్ట్రీల్లో వివిధ దశల్లో సుమారు 2.4 కోట్ల కోళ్లు ఉండగా వీటిలో గుడ్లు పెట్టేవి 1.30 కోట్లు ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.1 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. రోజుకు 25 నుంచి 28 వేల వరకూ కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. ఐదు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో కోళ్ల మరణాలు ముందెన్నడూ లేనంతగా పెరిగాయని రైతులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 1.5 లక్షల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు అంచనా. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున రూ.100 వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు ఆరు రోజులుగా రూ. తొమ్మిది కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎండలు మరింత ముదిరితే మరణాల సంఖ్య పెరిగిపోతుందన్న ఆందోళనలో కోళ్ల రైతులు ఉన్నారు. మరోపక్క నాలుగు రోజులుగా గుడ్లు ఉత్పత్తి 15 శాతం మేర పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు కోటి 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఎండల తీవ్రతతో సుమారు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకు 16.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.3.4 పైసలు ఉండగా రోజుకు రూ.దాదాపు రూ.56 లక్షలు చొప్పున ఆరు రోజుల్లో రూ.3.36 కోట్ల మేర పౌల్ట్రీకి నష్టం వాటిల్లింది. ఆయా రూపాల్లో ఆరు రోజుల్లోను పౌల్ట్రీ పరిశ్రమకు రూ.12.36 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, ఒడిశాలలో వినియోగం తగ్గడంతో గుడ్డు ధర పతనం బాట పట్టనుందని కోళ్ల రైతులు అంటున్నారు. నిర్వహణ భారం తడిసి మోపెడు అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా ఫారాలు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇటీవల ఈదురుగాలుల ప్రభావం పరిశ్రమకు అపారనష్టాన్ని కలుగజేసింది. అర్తమూరు, ద్వారపూడి, అనపర్తి ఏరియాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో షెడ్ల రేకులు ఎగిరిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. గోదాముల్లోని కోడిమేతలు తడిసిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, జనరేటర్లు సరిగా పనిచేయకపోవడం తదితర కారణాలతో విద్యుత్ సమస్యలు తోడవుతున్నాయి. ఈ తరుణంలో కోళ్ల మరణాలు, ఉత్పత్తి పడిపోవడం, గుడ్డు ధర తగ్గడం పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుముందు ఎండలు మరింత ముదరనుండటంతో పరిశ్రమ మరింత నష్టాల్లో కూరుకుపోతుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలి ఎండల తీవ్రతతో కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల మరణాలు, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి కుదేలైపోయిన కోళ్ల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఈ రంగాన్నే నమ్ముకున్న వేలాది మంది బతుకులు రోడ్డున పడే ప్రమాదముంది. పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జిల్లా చైర్మన్,పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెక్ జాతీయ కమిటీ సభ్యుడు, అర్తమూరు -
కోడిలాంటి గద్ద
‘నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను’ అని ఒక గురువు దగ్గర చెప్పుకున్నాడు యువకుడు. అప్పుడు ఆ యువకుడిలో లోపించిన ఆత్మవిశ్వాసానికి కారణాలు తెలుసుకున్నాడు గురువు. వాటన్నింటినీ అధిగమిస్తేనే పైకి ఎదగగలవని సూచించాడు. మనిషిని పరిస్థితులు ఎలా నియంత్రిస్తాయో, వాటికనుగుణంగా ఆలోచన ఎలా కురచబారుతుందో తెలియజేసేందుకు ఈ కథ చెప్పాడు. పొరపాటున ఒక గద్ద గుడ్డు, కోళ్లుండే చోట పడింది. అది ఏమిటని కోళ్లు ముందు ఆశ్చర్యంగా చూశాయి. చివరకు ఒక కోడి ఆ గుడ్డును పొదిగింది. కొన్ని రోజుల తర్వాత గద్ద పిల్ల అందులోంచి బయటికి వచ్చింది. కోళ్లన్నీ దాన్ని కోడిపిల్లలాగే పెంచాయి. అది ఎంతో ఎత్తుకు ఎగరాలనుకునేది. దాని రెక్కలకు ఆ నేల చాలేది కాదు. కానీ దాని తోటి కోడిపిల్లలన్నీ కిందే బతికేవి. వాటితోపాటు గద్దపిల్ల కూడా నేలన తిరిగేది. అప్పుడప్పుడూ పైన గద్దలు ఎగురుతూ పోవడం అది చూసేది. అప్పుడు దాని రెక్కల్లోకి ఏదో కొత్త ఉత్సాహం వచ్చేది. ఎగరడానికి ప్రయత్నించేది. కానీ, ‘నువ్వు కోడిపిల్లవు, గద్దల్లాగా అంత పైకి ఎగరలేవు’ అని నూరిపోసేది తల్లికోడి. అది నిజమేనని నమ్మింది గద్దపిల్ల. ఇక శాశ్వతంగా నేలమీదే ఉండిపోయింది. చాలా ఏళ్లు కోడిలాగే బతికి, కోడిలాగే చచ్చిపోయింది. -
పెట్టా.. ఇదెట్టా..
పెట్ట పని ఏంటి.. గుడ్లు పెట్టడం.. ఒలివియా కూడా అదే పని చేసింది..కొన్ని నెలల క్రితం వరకూ.. మరిప్పుడో.. గుడ్లు పెట్టడం మానేసి.. పుంజులతో గొడవలకు పోతోంది.. తెల్లారకముందే.. కొక్కొరోకో అంటూ చుట్టపక్కలోళ్ల నిద్ర చెడగొడుతోంది.. ఎందుకలా.. ఎందుకంటే.. ఆ పెట్ట కాస్తా ఇప్పుడు పుంజుగా మారింది! ఇదెట్టా?? ఆస్ట్రేలియాలోని కామ్డెన్లో ఉండే ఒలివియా అకస్మాత్తుగా గుడ్లు పెట్టడం మానేయడం.. నెమ్మదిగా పుంజులాగతురాయి పెరగడం చూసి.. దాని యజమానులు డంగైపోయారు.. సంబంధిత వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే.. ఇదో అరుదైన సిండ్రోమ్ అని.. ప్రతి పది వేల పెట్టల్లో ఒకదానికి ఇలా జరుగుతుందని చెప్పారు. దీని అండాశయంలోని కుడివైపు భాగం సరిగా అభివృద్ధి చెందలేదని.. దీనికితోడు టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రభావమూ ఉందని తెలిపారు. మళ్లీ పెట్టగా మార్చాలంటే.. హార్మోన్ల చికిత్స ఒక్కటే మార్గమని తేల్చారు. ప్రస్తుతం ఆ చికిత్స కొనసాగుతోంది.. కొంచెం కొంచెంగా పుంజు కాస్తా పెట్టగా మారుతోందట.. దాని యజమానులు మాత్రం ఇది పూర్తిగా పెట్టగా ఎప్పుడు మారుతుందో.. మళ్లీ గుడ్లెప్పుడు పెడుతుందో అని గుడ్లేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. -
మన లాభాల కోడి
కంకిపాడు (పెనమలూరు): మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రూపొందించిన పథకమే ‘మనకోడి’. ఈ పథకం కింద లబ్ధిదారులకు రెయిన్బో రోస్టర్స్ జాతికి చెందిన కోడి పిల్లలను పంపిణీ చేస్తారు. మేలైన యాజమాన్య చర్యలు పాటించి వాటిని సంరక్షిస్తే కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందంటున్నారు కంకిపాడు మండల పశువైద్యాధికారి డాక్టర్ కర్నాటి మాధవరావు. మన కోడి పథకం వివరాలు ఆయన మాటల్లోనే... అమలు ఇలా.. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మనకోడి పథకం అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాకు 10 వేల యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో లబ్ధిదారుకి 45 కోడి పిల్లలు పంపిణీ చేస్తారు. రెయిన్బో రోస్టర్స్ జాతికి చెందిన కోడి పిల్లలను పంపిణీచేస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు మొదటి విడత 25 కోడిపిల్లలు, రెండో విడత మరో 20 పిల్లలుచొప్పున ఇస్తారు. జిల్లాకు మంజూరైన యూనిట్లలో 95 శాతం యూనిట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. మిగిలిన 5 శాతం యూనిట్లు ఇతరులకు కేటాయిస్తారు. ఒక్కో యూనిట్ విలువ రూ.4560. లబ్ధిదారులు చెల్లించాల్సి వాటా రూ.810. ఈ మొత్తాన్ని అర్జీదారు గ్రామీణ పశువైద్య కేంద్రాల్లో చెల్లించాలి. లేదా పశుసంవర్ధకశాఖ జేడీ పేరున డీడీ తీసి దరఖాస్తు చేసుకోవాలి. ఆర్థికంగా చేయూత మనకోడి పథకం కింద నెల రోజులు వయస్సు ఉన్న కోడి పిల్లలను లబ్ధిదారులకు పంపిణీచేస్తారు. పిల్లల పెంపకంలో తీసుకునే శ్రద్ధను బట్టి కోడి బరువు 4 నుంచి 5 కిలోలు వరకూ పెరుగుతాయి. మాంసంగా మార్కెట్లో విక్రయించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆడవి అయితే ఏడాదికి 180 వరకూ గుడ్లు పెడతాయి. మాంసం, కోడిగుడ్ల అమ్మకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూత లభిస్తుం దనటంలో ఎలాంటి సందేహం లేదు. లబ్ధిదారుడికి కోడి పిల్లలతో పాటుగా మేత పెట్టుకునేందుకు, నీరు పెట్టేందుకు గిన్నెలు, వాటి సంరక్షణకు మెస్‌లు కూడా అందిస్తారు. నిబంధనలు ఇవీ.. ♦ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ♦ దరఖాస్తుదారులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారై ఉండాలి. ♦ డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులై ఉండాలి. ♦ వ్యక్తిగత ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులు అందించాలి. ♦ పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 31వ తేదీ లోపు సమీప పశువైద్య కేంద్రాల్లో అందించాలి. జాగ్రత్తలు తప్పనిసరి కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఎప్పటికప్పుడు తెగుళ్లు సోకకుండా, వ్యాధుల బారిన పడకుండా వాటిని సంరక్షించుకోవాలి. ఎక్కువగా ఒకదాన్ని ఒకటి పొడుచుకుని ఎక్కువగా గాయపడి చని పోయే అవకాశం ఉంది. కుక్కల బారిన పడకుండా చూడాలి. జాగ్రత్తలు పాటిస్తే మన కోడి లాభదాయకంగా ఉంటుంది. – డాక్టర్ కర్నాటి మాధవరావు, పశువైద్యాధికారి, కంకిపాడు -
నాటు కోడి కోసం వెళ్లి..
నెల్లూరు(వేదాయపాళెం): వారు ముగ్గురు ప్రాణ స్నేహితులు.. వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. భోగి రోజున నాటు కోడి తిందామనుకున్నారు. కొనుగోలు చేసేందుకు వెళ్లగా అక్కడ ధరలు అధికంగా ఉండటంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరే లోపే వారిలో ఇద్దరిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని జాకీర్‌హుస్సేన్‌నగర్ న్యూ కాలనీకి చెందిన పార్వతి వెంకటేశ్వర్లు (25) డెకరేషన్ కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మేకల సుబ్రహ్మణ్యం (37), పల్లిపాటి సుబ్రహ్మణ్యం పెయింట్ పనులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు నాటు కోడి కోసం మూడోమైలు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలు చేయకుండా తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దీన్‌దయాళ్ నగర్ క్రాస్‌రోడ్డు వద్ద విజయవాడ వైపు నుంచి గూడూరు వైపు వెళుతున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ట్రావెల్ బస్సు పొగమంచు దట్టంగా అలుముకుని ఉండటంతో ముందు వెళుతున్న మోటర్‌బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో పార్వతి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతువాత పడ్డాడు. మేకల సుబ్రహ్మణ్యంను నారాయణ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పల్లిపాటి సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలపాలై నారాయణలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సును స్థానికులు ఆగ్రహంతో ప్రయాణికులను కిందకు దించి నిప్పంటించారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై శేఖర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడి మీద లైంగిక దాడి..!
లాహోర్: పాకిస్థాన్‌లో ఓ బాలుడు అత్యంత వికృతమైన చర్యకు ఒడిగట్టాడు. ఎవరూ ఊహించలేని రీతిలో కోడి మీద అత్యాచారం జరిపాడు. ఈ ఘటనలో 14 ఏళ్ల అన్సర్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని హఫీజ్బాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని జలాపూర్ గ్రామస్తుడైన అన్సర్‌పై పొరుగింటికి చెందిన మన్సబ్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 11న అలీ తన కోడిని కిడ్నాప్ చేసి.. దానిపై లైంగిక దాడి జరిపాడని తెలిపాడు. అతను అత్యాచారం జరుపుతుండగా కోడి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నాడు. నస్రుల్లా, తుఫైల్ అనే వ్యక్తులు.. అలీ కోడి మీద అఘాయిత్యానికి పాల్పడుతుండగా ప్రత్యక్షంగా చూశారని ఫిర్యాదుదారు పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోడి మీద అఘాయిత్యం జరిగిందని మెడికల్ రిపోర్ట్స్ ధ్రువీకరించడంతో నిందితుడిని అరెస్టు చేశామని, పోలీసుల విచారణలో తాను లైంగిక దాడికి పాల్పడినట్టు అతను అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కామోద్రేకంతో ఈ చర్యకు పాల్పడినట్టు నిందితుడు పేర్కొన్నాడని, అతనిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. -
కోళ్లను చంపుతున్న పాము హతం
కొత్తూరు: తమ కాలనీలోని కోళ్లను రాత్రివేళల్లో చంపేస్తున్న నాగుపామును మండలంలోని ఎన్ఎన్కాలనీ వాసులు సోమవారం హతమార్చారు. వారం రోజుల నుంచి రాత్రివేళల్లో నాగుపాము కోడిగూళ్లోకి చొరబడి రోజుకు రెండు నుంచి మూడు కోళ్లను పొట్టనపెట్టుకుంటోంది. ఆదివారం రాత్రి కాలనీలోని పి. రమణ ఇంటికి ఆనుకొని ఉన్న కోళ్లగూడిలోకి పాము చొరబడింది. కోళ్లు అరవడంతో అప్రమత్తమైన ఆయనతో పాటు పరిసర ప్రజలు నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాగుపాము బుసలు కొట్టడం చూసి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎట్టకేలకు నాగుపామును పట్టుకుని హతమార్చారు. అయితే అప్పటికే అది రెండు కోళ్లను చంపేసింది. -
రాక్షస కోడి...
రాక్షస బల్లుల సిరీస్‌లో ఇది కొత్తది. చూడ్డానికి 10 అడుగుల పొడవున్న టర్కీ కోడిలా కనిపిస్తున్న దీని పేరు కారీథొరాప్టర్ జాకొబ్సీ.. ఆ మధ్య దీని తాలూకు అస్థిపంజరం దక్షిణ చైనాలో దొరికింది. అస్థిపంజరాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది 10 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉండేదని తేల్చారు. మాంసాహారే.. బరువు 230 కిలోలు. నెత్తి మీద చిన్నసైజు పింఛం దీనికి అదనపు ఆకర్షణట. కోపం వస్తే.. తన కాళ్లతో కరాటే కిక్లాంటిది ఒకటిచ్చుకుంటుందట. -
కొక్కొరొకో.. మ్యూజిక్ వీడియో వైరల్!
కొక్కొరొకో అంటూ... తన కూతతో ఉదయాన్నే మనల్ని నిద్రలేపే కోడి... అద్భుతమైన మ్యూజిక్ కూడా వాయిస్తోంది. చూడచక్కగా... వినసొంపుగా పియానాతో రాగాలు పలికిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ..? అమెరికాలో జరిగిన ఓ రియాలిటీ టాలెంట్ షోలో ఒక కోడి తన సంగీత ప్రతిభను చాటి ప్రేక్షకుల మది దోచుకుంది. ముక్కుతో పియానో బటన్స్ నొక్కుతూ మ్యూజిక్‌తో రంజింప చేసింది. కోడి పలికించిన స్వరాగాలు విన్న అక్కడి ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులు చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. -
క్యాష్ పోయి కోళ్లు వచ్చె..
హైదరాబాద్ : ఈ ఏటీఎంలో క్యాష్కు కరువుందేమో గానీ.. కోళ్లకు లేదు.. అందుకే ఏటీఎంలా కాకుండా కోళ్ల ఫారంలా కనిపిస్తూ.. అందరినీ ఆకర్షిస్తోంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ మాణిక్యనగర్లోని ఈ ఏటీఎం నగదు లేక కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉంది. దీంతో పక్కనే ఉన్న ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు దీన్నిలా ఉపయోగించుకుంటున్నాడు. -
కోడి పందేల అదుపునకు ఉమ్మడి ప్రణాళిక
సంయుక్త తనిఖీ బృందాలతో నిరంతర పర్యవేక్షణ మండల స్థాయి బృందాల్లో తహసీల్దార్, ఎస్సై, జంతు సంరక్షణ సభ్యులు కలెక్టర్ మార్గదర్శకాలతో అత్యవసర ఆదేశాలు అమలాపురం టౌన్ : సంక్రాంతి పండుగలకు కోడి పందేలు నిర్వహించవద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటంతో పాటు కొన్ని మార్గదర్శకాలు కూడా సూచించింది. వాటి అమలుకు జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రంగంలోకి దిగారు. హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేసే దిశగా జిల్లాలోని అన్ని మండలాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉమ్మడి ప్రణాళిక అమలుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. తక్షణమే మండల స్థాయిల్లో కోడి పందేలను పూర్తిగా నిరోధించేందుకు తçహసీల్దార్, పోలీసు ఎస్సై, జంతు సంరక్షణ కోసం పాటు పడే స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఓ ప్రతినిధితో కూడిన తనిఖీ బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. కలెక్టర్ అత్యవసర ఆదేశాలతో జిల్లాలోని అన్ని మండలాల్లో బృందాల ఏర్పాటుకు బుధవారం నుంచి మండల స్థాయి రెవెన్యూ, పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ బృందాలు ఈనెల 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ మండలంలోని అన్ని గ్రామాల్లో నిరంతం పర్యటించి పందేల అదుపునకు చర్యలు చేపడుతూనే ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆర్డీవోలకు తద్వారా కలెక్టరేట్‌కు నివేదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బృందాల విధులు ఇవీ.. l ఈ బృందాలు తొలుత ఆయా మండలాల్లో ఎక్కడెక్కడ కోడి పందేలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయో ఆ స్థలాలను గుర్తించాలి. l గుర్తించిన స్థలాల్లో ఆంక్షలు ఉన్నా పందేలు నిర్వహించేందుకు పందెగాళ్లు కాలు దువ్వుతుంటే అలాంటి స్థలాల్లో 144 సెక్ష¯ŒS అమలు చేయాలి. l మండలంలోని ప్రతి గ్రామంలో కోడి పందేల నిరోధంపై బృందం ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన, వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. l మండలంలో అనుమానిత కోడి పందేల స్థలాల వద్దకు బృందం వెళ్తున్నప్పుడు కొందరు కానిస్టేబుళ్లు, ఫొటో, వీడియో గ్రాఫర్లను విధిగా వెంట పెట్టుకుని వెళ్లాలి. l పండుగలకు ముందు నుంచి అంటే ఏడో తేదీ నుంచి పండుగల తర్వాత ఈనెల 24వ తేదీ వరకూ ఈ బృందాలు పందేలపై నిఘా కొనసాగించాలి. l పందేలకు సన్నాహాలు జరుగుతున్నా... పందేలు నిర్వహిస్తున్నా పోలీసు బందోబస్తుతో బృందం దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నారు. -
కోళ్లఫారంలో పేకాట.. 21.77 లక్షలు స్వాధీనం
పోలీసుల దాడి.. 32 మంది అరెస్టు టి.నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా బండివారిగూడెంలో ఓ రైతుకు చెందిన కోళ్లఫారంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి టి.నరసాపురం పోలీసులు దాడి చేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ముగ్గురు, ఆంధ్రాలోని కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, తాడేపల్లిగూడేలకు చెందిన 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.21,77,095 స్వాధీనం చేసుకున్నారు. టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారి సూచనల మేరకు చింతలపూడి ఎస్ఐ సైదానాయక్, జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్ఐ ఎ.ఆనందరెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. టి.నరసాపురం పోలీసులకు సహకరించారు. పెద్దఎత్తున జరుగుతున్న పేకాట శిబిరం గుట్టురట్టు చేసినందుకు టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్‌ను, సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌భూషణ్ అభినందించారు. ఈ జూదరులంతా జిల్లాలో రోజుకొక ప్రదేశాన్ని ఎంచుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆదివారం టి.నరసాపురం మండలం బండివారిగూడెంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసినట్టు ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!!
హ్యూమర్ ‘‘కోడి దాని రెక్కల కింద అలా తన తలను దాచుకుందేం నాన్నా’’ అడిగాడు ఏడేళ్ల మా బుజ్జిగాడు. ‘‘అంటే... దానికి జ్వరమొచ్చిందన్నమాట. జ్వరం తగ్గే వరకూ అది అలా తన తలను రెక్కల చాటున దాచుకుంటుందన్నమాట’’ వివరించాను. ‘‘అరె... అసలే దాని ఒళ్లు వెచ్చగా ఉంటుంది. మొన్న కోడిని కాసేపు పట్టుకుంటే తెలిసింది... దాని ఒళ్లు ఎంత వేడిగా ఉంటుందో! ఇప్పుడు దానికి జరం వచ్చిందని నువ్వు అంటున్నావు. అలాంటప్పుడు దాని తల మరింత వేడెక్కి పోతుంది కదా. ఒళ్లు అలా కాలిపోతున్నప్పుడు మళ్లీ తల అలా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా’’ అన్నాడు వాడు. అది తల ఎలా పెట్టుకుందో తెలియదు గానీ... నాకు మాత్రం తలపట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. మా బుజ్జిగాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ కోళ్ల పెంపకం కార్యక్రమం పెట్టుకున్న దగ్గర్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. అవి ముఖ్యంగా మా బుజ్జిగాడి సందేహాల రూపంలో ఆ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వాడి డౌట్ల కారణంగా నేను అడుగేసినప్పుడల్లా కోడి రెట్టలో కాలేస్తున్నట్లు ఉంది నా పరిస్థితి. ఏదో నేను మరచిపోయినా మావాడు వాటికింత మేత వేస్తాడు కదా అని లేనిపోని ఈ పెంపక కేంద్రం మొదలుపెట్టాను. నేను వాటిని పెంచుతున్నానా... మావాడి డౌట్సును పెంచుతున్నానా అన్నది అర్థం కాకుండా పోయింది. వాడు మళ్లీ తన డౌట్ గుర్తు చేస్తూ... ‘‘జరం వచ్చినప్పుడు అలా తలపెట్టుకోవద్దు అని కోడికి చెప్పు నాన్నా’’ అన్నాడు వాడు. కోడికి మన లాంగ్వేజీ అర్థం కాదన్నా వినేట్టు లేడు. ఒకవేళ మన భాష అర్థం కాదని అంటే... ‘బో... బో...బో అంటే తిండి తినమని కదా. ఇష్షు ఇష్షు అంటే దూరం పొమ్మని కదా’ అని... ‘కోడి భాష... అనువాదం... కొన్ని మెళకువలు’ అని నాకు కొత్తగా కొన్ని కోడిపదాలు నేర్పేట్టు ఉన్నాడు అనుకున్నాను. వాడి సందేహం తీర్చడం కోసం అప్పటికప్పుడు ఒక ఐడియా ఫ్రేం చేసుకున్నాను. దాన్ని అమల్లో పెట్టాను. ‘‘ఒరేయ్... మొన్న నాకు జలుబు చేసినప్పుడు వేణ్ణీళ్లలో విక్స్ వేసుకొని ఆవిరి పట్టుకున్నాను గుర్తుందా. అప్పుడు వద్దంటున్నా నా దుప్పట్లోకి నువ్వు దూరావు. అప్పుడు నాకులాగే ఇప్పుడు మన ఈ కోడికీ జలుబు చేసిందన్నమాట. పాపం... అది ఆవిరి పట్టుకోడానికి వేణ్ణీళ్లు పెట్టుకోలేదు కదా. అందుకే రెక్కల చాటున ఉన్న వేడిని తన ముక్కు రంధ్రాల్లోకి పంపించుకుంటుదన్నమాట. అలా అది తనకు తాను ఆవిరిపెట్టుకుంటోంది’’ అని వివరించాను. ‘‘ఓహో... పాపం... దాని ముక్కు తుడుచుకోవడం ఎంత కష్టం నాన్నా. అందుకే చిరాకుగా అది ఒక్కోసారి తన గోళ్లతో ముక్కును గీరుకుంటోంది. పాపం... దానికి దురద పెట్టి గీరుకుంటుందేమో అనుకున్నా. ఆహా... ఇప్పుడు అర్థమైంది. నిజానికి అది ముక్కు తుడుచుకుంటుందన్నమాట అన్నాడు వాడు. వాడితో ఎందుకొచ్చిన గొడవ అంటూ ‘ఆ... అవునవును’ అన్నాను. రెండ్రోజుల క్రితం కొన్ని డబ్బులు బ్యాంకులో వేయడానికి బయల్దేరాను. ఇంట్లో తన పనుల్లో కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నాడని వాణ్ణి నాకు అప్పగించింది మా ఆవిడ. ‘‘డిపాజిట్ ఫామ్ నింపాక ఏదో క్యూలో నించోవడమే కదా. బుజ్జిగాణ్ణి వెంట తీసుకెళ్లండి. ఇక్కడుంటే ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు’’ అంది. ‘‘అవున్నాన్నా.. అచ్చం మన కోడిలాగే. అదీ ఎప్పుడూ ఒకటి కెలుకుతూ ఉంటుంది కదా’’ అన్నాడు వాడు. పైగా పొదిగి పిల్లలు పెట్టాక మా కోడి అంతటిది పిల్లలను వెంటేసుకొని పెరట్లో తిరుగుతూ ఉంది. మనిషినయ్యాక బిడ్డను బయట తిప్పకపోతే ఎలా అనుకొని వాణ్ణి వెంటతీసుకొని బ్యాంకుకు వెళ్లా. అక్కడికి వెళ్లాక కౌంటర్లో డిపాజిట్ డబ్బులు ఇవ్వడం కోసం క్యూలో వెయిట్ చేస్తున్నాను. ‘‘అవునూ... మొన్న ఆ అంకుల్ ఎవరో వచ్చి అడిగితే డబ్బులు లేవన్నావు. ఇప్పుడు మళ్లీ బీరువాలోంచి తీసి బ్యాంకులో వేస్తున్నావు ఎందుకు?’’ అని అడిగాడు వాడు. అలా బ్యాంకు వాళ్ల ముందు... అక్కడున్న వాళ్ల ముందు నా పరువు తీశాడు వాడు. అసలే నాది చిన్న మెదడు. పైగా అది ఫారం కోడి మెదడులా అయిపోయింది. ఏదో మొన్నంటే జలుబూ-జ్వరం అని ఒక కథ అల్లాను గానీ కాస్త క్యాషూ కామర్సూ వ్యవహారాలంటే నాకు కంగారు. అందుకే నాకు ఏం చేప్పాలో తోచలేదు. ఇంటికెళ్లాక మీ అమ్మ చెబుతుందని తప్పించుకున్నాను. కానీ ఇంట్లోకి వెళ్లాక మళ్లీ అదే ప్రశ్న వేశాడు వాడు. ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటే మా ఆవిడ కల్పించుకుంది. ‘‘ఒరేయ్... పొదగడం అంటే మొన్న అడిగితే మీ నాన్న చెప్పలేకపోయారు కదా. చెబుతా విను. ఇప్పుడూ... కోడి గుడ్డు పెట్టగానే ఆమ్లెట్ వేసుకొని తిన్నామనుకో. అది ఏటీఎమ్ నుంచి డెరైక్ట్‌గా డబ్బులు తీసుకున్నట్లు అన్నమాట. కానీ అవే గుడ్లను కోడి కింద పెట్టేశామనుకో. మొన్న ఆ కోడి పొదగడం చూశావు కదా... అలా బ్యాంకువాళ్లు ఆ డబ్బును తమ వద్ద దాచుకుని, డబ్బు తాలూకు పిల్లలు చేసి మనకు అప్పగిస్తారన్నమాట. అచ్చం మన కోడి పిల్లల్లాగే! ఇప్పుడు నీకు అర్థమైందా పొదగడం అంటే ఏమిటో?’’ అని వివరించింది మా ఆవిడ. మా ఆవిడ తాలూకు కోచింగులోని టీచింగ్ మెలకువలు చూసి కోడి కెలికిన పెంటకుప్పలా అయిపోయింది నా మైండు. కానీ ఆమె చెప్పిన పాఠం మాత్రం బురదలో కోడి కాలి గుర్తులా నా మెదడులో అలా నిలిచిపోయింది. - యాసీన్ -
పెట్ట కొంచెం.. ప్రేమ ఘనం
‘అమ్మంటే అంతులేని సొమ్మురా..అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా..అమ్మ మనసు అమతమే చూడరా..అమ్మ ఒడిలోనేస్వర్గమే ఉందిరా’ అని ఓ సినీ కవి తల్లిప్రేమను వర్ణించాడు. నిజమే ఈ చిత్రం చూస్తే అలానే అనిపిస్తుంది. దేవుడు ప్రతి చోటా ఉండలేడు కాబట్టే తల్లిని సృష్టించాడంటారు. మానవులతో పాటు,సకాల జీవరాసులకు అమ్మ ఒడిలోనే స్వర్గం చూస్తాయి. గాలివానకు కించుమండ గ్రామంలో ఓ కోడి తన గారాలబిడ్డలను ఇలా రెక్కలచాటున అక్కున చేర్చుకుంది. వాటి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డని చెప్పకనే చెప్పింది. –హుకుంపేట -
కొండచిలువ.. కోడిపెట్టలు..
ఇబ్రహీంపట్నం: ఓ కొండచిలువ ఇంట్లోకి దూరి రెండు కోడిపెట్టలను మింగేసింది. ఎటూ కదల్లేక దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పొన్నాల జగదీశ్ తల్లితో కలసి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం ఉంటుంది. కొండచిలువ ఇంట్లోని ఒక గదిలోకి ప్రవేశించింది. అక్కడున్న రెండు కోడిపెట్టలను మింగింది. ఉదయం కోడి కనిపించకపోవడంతో జగదీశ్ తమ్ముడు రాజు వెతకసాగాడు. ఇంట్లోని ఓ మూలన కొండచిలువ ముడుచుకొని ఉండడాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. వారొచ్చి తొమ్మిది అడుగుల పొడవున్న కొండచిలువను చంపి, అది మింగిన కోడిని బయటకు తీశారు. -
పోషకాల ‘కటక్’నాథ్
అత్యంత విలువైన జాతి కోడి పెరటి కోళ్ళతో సమానం నాటుకోడికి తీసిపోదు.. పెరటి కోళ్ల పెంపకం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధానంగా మారుతోంది. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఈ కోళ్ల పెంపకం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం నాటుకోడి మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ నాటుకోడికి ప్రత్యామ్నాయంగా కటక్నాథ్ కోడి అందుబాటులోకి వచ్చింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పెంచే ఈ జాతి కోళ్లకు జిల్లా వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎన్నో పోషక విలువలుండి..వేసవిలో సుమారు వంద గుడ్ల వరకు పెట్టే ఈ జాతి కోడితో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం... వైరా: వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెరటికోళ్ల పెంపకం అత్యంత లాభదాయకంగా తయారవుతోంది. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలు పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు గడిస్తున్నారు. సమతుల్యమైన ఆహారంతో పాటు ఆదాయం పొందుతున్నారు. గుడ్లు, మాంసం అమ్మకాలతో మంచి రాబడిని పొందవచ్చని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సౌమ్యప్రణీత పేర్కొన్నారు. ప్రాచుర్యం పొందుతోంది.. అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ జాతి కోళ్లలో కటక్నాథ్ ఒకటి. ఈ కోడి అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లోని గిరిజనుల ఇళ్లలో దీన్ని పెంచుతారు. అంతరించి పోతున్న నాటు కోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్ళను పెంచవచ్చని, జిల్లా వాతావరణం ఈ కోళ్ల పెంపకానికి అనువుగా ఉంటుంది. మాంసంలో పోషక విలువలు అధికం కటక్నాథ్ కోడి మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉంది. ముదురు నీలం రంగుతో ఉండే ఈకలు, చర్మం, మాంసంతో పాటు ఈ కోళ్ళ రక్తం నలుపు రంగులో ఉంటుంది. అత్యంత అరుదైన సూక్ష్మ పోషకాలు రక్తంలోనూ, మాంసంలోనూ ఉన్నాయి. మెలనిన్ అనే పదార్థం ఈ జాతి కోళ్ళలో అధికంగా ఉంటుంది. ఈ మాంసం తినడం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రవం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ కోడి మాంసంలో బీ1, బీ2, బీ6, బీ12తో పాటు సీ, ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి. పాస్ఫరస్, ఇనుము వంటి ధాతువులు మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి. 8 అమైనో ఆమ్లాలతో పాటు, 18 అమైనో ఆమ్లాలు వీటి మాంసంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు బీ2 అధికంగా ఉండటం వలన నిమ్మోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది. కీళ్లు, ఎముకల సమస్యలకూ ఔషధంగానూ ఉపయోగపడుతుంది. సాధారణ కోడి మాంసంతో పోలిస్తే ఈ జాతి కోడి మాంసంలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. కొవ్వు శాతం తక్కువ. శరీరానికి అవసరమైన ఓమోగా ఆమ్లాల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోతెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ, ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. ప్రస్తుతం ఈ కోళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం ప్రదర్శన క్షేత్రంలో అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతంలో వీటి పెంపకం కూడా ప్రారంభమైంది. -
లాకప్‌లో పుంజు!
ఖమ్మం అర్బన్ : ఓ పందెంకోడి కటకటాల పాలైంది! పందెంరాయుళ్లు పారిపోవడంతో అక్కడ దొరికిన ఓ పందెం కోడిని పోలీసులు సెల్ లో వేశారు. ఖమ్మం నగరంలోని మమత వైద్యశాల రోడ్డులో ఆదివా రం కోడిపందేలు జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఓ కోడిపుంజును వదిలి పందెంరాయుళ్లు పరారయ్యూరు. దీంతో పోలీసులు కోడిని తీసుకొచ్చి సెల్లో పెట్టారు. విషయం మీడియూకు తెలియడం తో దానిని బయట కట్టి వేశారు. -
జాతీయాలు
నక్షత్రకుడు! ‘నక్షత్రకుడిలా నా వెంటబడి చావగొట్టకు’ ‘అబ్బో... అతని గురించి చెప్పాలంటే నక్షత్రకుడిని మించి ఇబ్బందులు పెడతాడు’ అంటుంటారు. నక్షత్రకుడు విశ్వామిత్రుడి శిష్యుడు. విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును రాబట్టడానికి... హరిశ్చంద్రుడితో పాటు నీడలా వెళతాడు. హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలతో నడుస్తుంటే ‘నేను నడవలేను’ అని కూర్చునేవాడు. సరే అని కూర్చుంటే నిలబడేవాడు. ‘‘నేను నడవలేక పోతున్నాను నన్ను ఎత్తుకో’’ అనేవాడు. నీళ్లు దొరకని చోటు చూసి నీళ్లు కావాలి అని అడిగేవాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. రకరకాల సమస్యలతో బాధ పడే వారికి ఎవరైనా సరికొత్త సమస్యగా తయారైతే అలాంటి వ్యక్తిని నక్షత్రకుడితో పోల్చుతారు. గజ్జెలు కట్టిన కోడి! తమ సహజ అవలక్షణాలను మార్చుకోని వారి విషయంలో వాడే మాట ‘గజ్జెలు కట్టిన కోడి’. ‘కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించకుండా ఉంటుందా?’ అని అంటుంటారు. వెనకటికి ఒకాయన దగ్గర ఒక కోడి ఉండేది. ఆ కోడి తన సహజశైలిలో పెంటకుప్పల వెంట తిరిగేది. తన ముద్దుల కోడి ఇలా అసహ్యంగా పెంటకుప్పల మీద తిరగడం ఆ ఆసామికి నచ్చలేదు. దీంతో ఆ కోడిని బాగా అలంకరించి కాలికి గజ్జె కట్టాడు. ఈ అలంకారాలతో కోడి ప్రవర్తనలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్మాడు. ఎంతగా అలంకరించినా కోడి మాత్రం తన సహజశైలిలో చెత్తకుప్పలు కుళ్లగించడం మానలేదు! శశ విషాణం అసాధ్యమైన పనులు లేదా వృథాప్రయత్నాల విషయంలో వాడే జాతీయం ‘శశ విషాణం’. ‘నువ్వు చెబుతున్న పని శశ విషాణం సాధించడంలాంటిది’. ‘శశ విషాణం కోసం ప్రయత్నించి విలువైన సమయాన్ని వృథా చేయకు’ ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. శశం అంటే కుందేలు. విషాణం అంటే కొమ్ము. కుందేలుకు పెద్ద చెవులే గానీ కొమ్ములు ఉండవు కదా! ఇలా లేని దాని కోసం ప్రయత్నించడం, అసాధ్యమైన వాటి గురించి ఆలోచించే విషయంలో ఉపయోగించే ప్రయోగమే శశ విషాణం. చగరుడాయ లెస్సా అంటే... శేషాయ లెస్సా అన్నట్లు! ఇద్దరూ సమ ఉజ్జీలైనప్పుడు పలకరింపుల్లో గానీ, పట్టుదల విషయంలో గానీ ఎవరికి వారు ‘నేనే గొప్ప’ అనుకుంటారు. ఈ ఇద్దరిలో ఒకరు చొరవ తీసుకొని మొదట పలకరిస్తే... రెండో వ్యక్తి అతిగా స్పందించడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ‘బాగున్నారా?’ అని మొదటి వ్యక్తి పలకరిస్తే- ‘బాగున్నాను. మీరు బాగున్నారా?’... అని రెండో వ్యక్తి సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతాడు. ఇంతకు మించి సంభాషణ ముందుకు సాగదు. గరుడుడు, శేషుడు... వీరిలో గొప్ప ఎవరు అంటే ఏమి చెప్పగలం? ఎవరికి వారే గొప్ప! ‘ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, పలకరించుకోవాలి కాబట్టి పలకరించుకున్నారు...’ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ‘‘వారి మాటల్లో పెద్ద విశేషాలేమీ లేవు. ఏదో... గరుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు పలకరించుకున్నారు’’ అంటుంటారు. -
బంగారు కోడిపెట్ట !
బాంగారు కోడిపెట్ట! నారాయణఖేడ్: బంగారు బాతు నిత్యం బంగారు గ్రుడ్లు పెట్టిన కథను మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ వార్తలోని కోడిపెట్ట కూడా అలాంటిదే! బంగారు గ్రుడ్లు కాదుగానీ నిజం గుడ్లనే నిత్యం పెడుతూ యజమానులకు కాసులు కురిపిస్తోంది. వివరాల్లోకి వెడితే.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం మన్సుర్‌పూర్ గ్రామానికి చెందిన అంతారం రాజు గత ఏడు నెలల క్రితం నారాయణఖేడ్‌లోని మంగళవారం సంతలో హన్మంత్‌రావుపేట గ్రామానికి చెందిన ఓ వద్దురాలివద్ద రెండు కోడిపెట్టలను కొనుగోలు చేశాడు. రెండు కోడిపెట్టలకు కలిసి రూ.610లు చెల్లించాడు. ఈ కోడిపెట్టలను ఇంటికి తీసుకొచ్చి పెంచుకోసాగాడు. కాగా ఇందులోని ఓ కోడిపెట్ట 40 రోజులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను తీసింది. జతగా ఉన్న మరో కోడిపెట్ట మాత్రం 211 రోజులుగా కోడిగ్రుడ్లు పెడుతూనే ఉంది! కోళ్ళు సహజంగా నెల రోజులు 40 రోజులపాటు గ్రుడ్లు పెట్టి పొదుగుతాయి. పిల్లలు పెరిగి కాస్త పెద్దయ్యాక మళ్ళీ గ్రడ్లు పెట్టడం, పొదగడం జరుగుతుంది. కానీ ఈ కోడి మాత్రం ప్రకతికి బిన్నంగా రోజూ గ్రుడ్లు పెడుతుందని యజమాని రాజు సంతోషంగా చెప్పాడు. -
కోడి తెచ్చిన తంటా
అచ్చంపేట రూరల్(మహబూబ్‌నగర్): కోడిని దొంగిలించాడన్న కేసులో ఓ యువకుడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. పోలీసుల దెబ్బలకు అతడి పరిస్థితి విషమంగా మారింది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ఆదర్శనగర్ కాలనీ వాసి వినోద్‌కుమార్ .. హైదరాబాద్‌లో టీటీసీ సెకండియర్ చదువుతున్నాడు. కోడిని దొంగిలించాడని మంగళవారం కానిస్టేబుళ్లు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. సృ్పహ కోల్పోయిన యువకుడిని పోలీసులే స్థానిక ఓ ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు పోలీసులను నిలదీశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని హైదరాబాద్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. -
పుంజు పహిల్వాన్
♦ తిక్క లెక్క యజమాని చేతిలో రాజసం ఒలికిస్తున్న ఈ కోడిపుంజు అలాంటిలాంటిది కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద పుంజుగా రికార్డును సొంతం చేసుకుంది. ఎంత మేలిజాతి కోడిపుంజులైనా ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ పుంజు మాత్రం ఏకంగా రెండడుగుల రెండంగుళాల ఎత్తు పెరిగింది. దీని బరువు పదికిలోల పైచిలుకే! ఈ పుంజుగారి పేరు లిటిల్ జాన్ దీని యజమాని పేరు జెర్మీ గోల్డ్‌స్మిత్. ఈ ఆసామికి ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ ప్రాంతంలో మౌంట్ఫిషెట్లో పది ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉంది. అందులో కోళ్లు పెంచుకుంటూ ఉంటాడు. మిగిలిన కోళ్లకు దాదాపు రెట్టింపు సైజులో కనిపించే లిటిల్ జాన్ అంటే గోల్డ్‌స్మిత్‌కు భలే ముద్దు. అతడి వ్యవసాయ క్షేత్రంలో లిటిల్ జాన్ యథేచ్ఛగా స్వైరవిహారం సాగిస్తూ ఉంటుంది. దగ్గరకొచ్చే చిన్నపిల్లలను భయపెడుతుంది కూడా. ఇంతకీ దీని దాణా ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కేవలం పాప్‌కార్న్ మాత్రమే దీని ఆహారం. పాప్‌కార్న్ తింటూనే ఇది ఇంత ఏపుగా ఎదిగిపోయింది. -
పందెం కోడి రె’ఢీ’
సంక్రాంతి కోడిపందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో సంక్రాంతి రానుండటంతో ఇప్పటినుంచే పందెపురాయుళ్లు పాత సరంజామను సిద్ధం చేసుకుంటున్నారు. బరిలో దిగే పుంజులకు రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ఏడాది భారీ బరులు ఏర్పాటు చేయాలనే తలంపుతో రాజకీయ నాయకుల అనుచరులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అభయంతో పందేలు ఈ ఏడాది కోట్లకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైకలూరు : కోడిపందేల సమరం ఆరంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఇటు పందెపురాయుళ్లు, అటూ వీక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే ప్రాంతాల్లో లాడ్జీలు బుక్ అయిపోయాయి. ఏడాది పాటు కంటికి రెప్పలా పెంచిన కోళ్లను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఐ-భీమవరం, నరసాపురం, ఉండి, సీసలి, గండిగుంట, ఎంట్రప్రగడ, రుద్రపాక, బైరపట్నం, చింతపాడు, ఇంగిలిపాకలంక, భుజబలపట్నం గ్రామాల్లో భారీ కోడిపందేలకు రంగం సిద్ధమైంది. మెనూ మస్ట్.. పందెం బరిలో దిగే కోడిపుంజులు రాజ వైభవాన్ని అనుభవిస్తున్నాయి. వ్యాయామం కోసం ఉదయం 7 గంటలకు చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. కిస్మిస్, జీడిపప్పు, బాదంను పెస్ట్గా చేసి రోజుకు మూడు ఉండల చొప్పున తినిపిస్తున్నారు. వారానికి రెండు రోజులు తాటిబెల్లం, నల్లనూనె తాగిస్తున్నారు. సొన తీసేసిన కోడిగుడ్డును ఆహారంగా ఇస్తున్నారు. పిక్కలు బలంగా అవ డానికి వారానికి రెండు రివిటల్ మాత్రలు వేస్తున్నారు. పందెం ఒక్కరోజు ముందు వేప, ఎదురు, అవిశ జామ ఆకులను బాగా మరగబెట్టి అందులో పసుపు పోసి స్నానం చేయిస్తారు. పందెంలో పాల్గొనే ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 ఖర్చు చేస్తున్నారు. రంగును బట్టి డిమాండ్ కోడిపుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను విభజించి ధరలు నిర్ణయిస్తారు. సాధారణంగా పచ్చకాకి, నెమలి, డేగ, కాకి, పూల, పర్ల, సేతువ, రసింగి, నెమలి, గేరువా, కాకి నెమలి, మైలా, కాకిడేగ, తీతువా, నల్లబొట్ల తీతువా, అబ్రాస్లకు డిమాండ్ ఉంది. పచ్చకాకి ధర రూ.25వేల నుంచి రూ.లక్షా 50 వేలు పలుకుతోంది. నెమలి, డేగ, కాకి, నల్లబొట్ల తీతువాలకు రూ.20వేల నుంచి రూ.70వేల వరకూ డిమాండ్ ఉంది. ముసుగుపందెం, చూపుడు పందెం, జోడీలు, గుంపు పందెం వంటి నాలుగు పద్ధతుల్లో పోటీలు జరుగుతాయి. ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.10లక్షలు, ఒక్కోసారి రూ.50లక్షల వరకు జరుగుతాయి. నున్నలో జోరుగా విక్రయాలు నున్న గ్రామంలో సంక్రాంతి పండుగకు కోడిపుంజులు సిద్ధంగా ఉన్నాయి. ఎంతో బలిష్టంగా పెంచిన పుంజులను అమ్మకానికి సన్నద్ధం చేశారు. జాతి పుంజులు రూ.10వేల నుంచి 70వేల ఖరీదు చేస్తున్నారు. సంవత్సరం వయస్సు పైబడి ఉన్న కోడిపుంజులకు బాదంపిస్తా, కిస్మిస్, నువ్వులు, రాగులు, సజ్జలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పెట్టి పెంచుతున్నారు. వ్యాయామం కోసం చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. ఏటా సంక్రాంతి పండుగకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నున్న గ్రామానికి వచ్చి పుంజులను కొంటుంటారు. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని పెంపకందారులు చెబుతున్నారు. - నున్న (విజయవాడ రూరల్) పల్నాడులోనూ జోరు సాక్షి, గుంటూరు : పల్నాడులో కోడిపందేల జోరు పెరుగుతోంది. జిల్లాలోని అటవీ, సముద్ర తీర ప్రాంతాలు అధికంగా ఉన్న మండలాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటుచేసి పోలీసులు రాకుండా జాగ్రత్తపడుతూ ఈ పందేలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చిన పందెపురాయుళ్లు ఈ పందేల్లో పాల్గొంటున్నారు. పోలీసులకు భారీ మామూళ్లు కోడిపందేలవైపు రాకుండా ఉండేందుకు ఎస్సై, సీఐ స్థాయి అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెబుతున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమ మాట వినకపోతే అధికార పార్టీ నేతల ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. పల్నాడులోని ఓ మండలంలో సీఐ బందోబస్తు విధుల్లో ఉన్న సమయం చూసి కోడి పందేలు నిర్వహించిన టీడీపీ నేతలు పందెం రాయళ్లు, విలేకరులకు మాత్రం తాము సీఐ అనుమతితోనే నిర్వహిస్తున్నామంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తీవ్ర ఆగ్రహంతో ఆ నేతలను హెచ్చరించారు. అధికార పార్టీ అండతో.. జిల్లాలో అధికార పార్టీ నేతల అండదండలతో కోడి పందేలు జరుగుతున్నాయి. గత సంక్రాంతి రోజు రేపల్లెలో కోడిపందేల నిర్వహణకు సమాయత్తం కాగా, పోలీసులు అడ్డుకున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చర్నకోళా పట్టుకుని బరిలో నిలబడి పోటీలు నిర్వహించారు. పోలీసులు ఆవైపు రాకుండా హైదరాబాద్ స్థాయి ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లోని మండలాలతోపాటు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అటవీ ప్రాంతాలు ఉన్న మండలాల్లో కోడి పందేలు యథేచ్ఛగా జరగడానికి టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. -
చికెన్ ధరలు తగ్గెన్
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ చుక్కలు చూపించిన చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో పోలిస్తే చికెన్ ధరల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. గడిచిన పన్నెండు రోజుల్లోనే కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.40 మేర తగ్గింది. గత నెల 20న స్కిన్ లెస్ చికెన్ దర కిలో రూ.192 ఉండగా, 25వ తేదీ నాటికి రూ.174 చేరింది. 27వ తేదీన రూ.166 ఉండగా, నెలాఖరు నాటికి మరో 6 రూపాయలు తగ్గి రూ.160కి చేరింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ రూ.152కి అందుబాటులోకి వచ్చింది. -
ఆహా ఏమి రుచి... తినరా మైమరచి..
అవునండీ... నిజమే. మీరు చూస్తున్నది కోడే. అయితే దీనికి ఇంత లావు కాళ్లేమిటనేదేగా మీ సందేహం. దీని తీరే ఇంత. చూడడానికి ఇలా కొంచెం ఎబ్బెట్టుగా కనిపించినా ఒక్కసారి దీని కూర రుచి చూశారో ఎవరైనా మైమరచిపోవాల్సిందే. దీనిపేరు డోంగ్తావ్. వియత్నాం రెస్టారెంట్లలో అత్యధికంగా అమ్ముడయ్యేది ఈ కోడి కూరే. అందుకే వీటి పెంపకందార్ల ఆనందానికి అంతే లేదు. ఇది మూడు నుంచి ఆరు కిలోల బరువు ఉంటుంది. ఈ కోడి కూరకి వియత్నాంలో చెప్పలేనంత గిరాకీ. మామూలు రోజుల్లో దీని ఖరీదు మన కరెన్సీలో సుమారు రూ. 1,350. అది కూడా కోడి రకాన్ని బట్టి ఉంటుంది. ఇక కొత్త సంవత్సరం ఆరంభంలో అయితే ఏకంగా దాదాపు రూ. 18 వేలు పలుకుతుంది. -
లక్ష కోళ్లకు బర్డ్‌ఫ్లూ
హయత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో ఉన్న ఓ కోళ్ల పారంలోని లక్ష కోళ్లకు బర్డ్‌ప్లూ సోకినట్లు సమాచారం. బర్డ్‌ప్లూ సోకిన కోళ్లలో ఇప్పటికే 20 వేల కోళ్లు మృతి చెందాయి. కాగా, తొర్రూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో ఈ సంఘటన జరిగింది. అయితే, ఫారంలో మిగిలిన కోళ్లను చంపివేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, చనిపోయిన కోళ్లను కుప్పలుగా వేయడంతో వర్షం రావడంతో కొట్టుకుపోతున్నాయి. దీంతో కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు . -
బర్డ్‌ఫ్లూ.. భయం..భయం
-
బర్డ్‌ఫ్లూ.. భయం..భయం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని శివార్లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్(బర్డ్ ఫ్లూ)భయట పడింది. హయత్ నగర్ లోని ఓ కోళ్లఫాంలో కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు పూణే ల్యాబ్ నిర్ధారించింది. కోళ్ల ఫారంలోని 80 వేల కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వ్యాధి సోకిన కోళ్లని ఈ రోజు అధికారులు చంపేయనున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు . -
కోడి ఒకటే గుడ్డు సైజులు రెండు!
అట్లూరు: ఎక్కడైనా కోడి ఒకే సైజులో గుడ్లను పెట్టడం మామూలే. అయితే వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం వేమలూరు ఎస్సీ కాలనీకి చెందిన పొగడతోటి మునెయ్యకు చెందిన ఒక కోడి శనివారం మామూలు సైజులోనే గుడ్డుపెట్టింది. ఆదివారం మాత్రం ఐదు గ్రాముల బరువు సైజులో అతిచిన్నగుడ్డు పెట్టింది. శనివారం పెట్టిన గుడ్డును, ఆదివారం పెట్టిన గుడ్డును మునెయ్య కాలనీ వాసులకు చూపించడంతో వారంతా ఆసక్తిగా తిలకించారు. ఒకే కోడి ఒకరోజు రెండు పరిమాణాల్లో గుడ్లు పెట్టడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
ముద్దొస్తున్నానా..!
పెదకాకాని: కుక్కపిల్ల, కోడిపెట్ట ముద్దులాడుకుంటున్నట్టు ఉంది కదూ ఈ ఫొటో. ఇది నిజమేనండీ.. పెదకాకాని భ్రమరాంబ కాలనీలోని పొద్దుటూరి మేరి ఇంటి ముంగిట బుధవారం ఈ దృశ్యం కనిపించింది. సాధారణంగా కోడిపిల్ల కనిపిస్తే కుక్క గుటుక్కుమనిపించేద్దామనుకుంటుంది. అలాగే తన పిల్లలను ఎక్కడ తింటుందోనని భయంతో కుక్కను కోడిపెట్ట వెంటబడి మరీ తన్ని తరిమేస్తుంది. అయితే ఒకే ఇంట్లో పెరిగేవైతే మాత్రం అవి ఇలాగే కలిసిమెలిసి జీవిస్తాయి మరి. ఈ రెండూ నిత్యం ఇలా సరదాగా పోట్లాడుకుంటూ, ముద్దులాడుకుంటూ స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.