
కోడి ఒకటే గుడ్డు సైజులు రెండు!
అట్లూరు: ఎక్కడైనా కోడి ఒకే సైజులో గుడ్లను పెట్టడం మామూలే. అయితే వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం వేమలూరు ఎస్సీ కాలనీకి చెందిన పొగడతోటి మునెయ్యకు చెందిన ఒక కోడి శనివారం మామూలు సైజులోనే గుడ్డుపెట్టింది. ఆదివారం మాత్రం ఐదు గ్రాముల బరువు సైజులో అతిచిన్నగుడ్డు పెట్టింది.
శనివారం పెట్టిన గుడ్డును, ఆదివారం పెట్టిన గుడ్డును మునెయ్య కాలనీ వాసులకు చూపించడంతో వారంతా ఆసక్తిగా తిలకించారు. ఒకే కోడి ఒకరోజు రెండు పరిమాణాల్లో గుడ్లు పెట్టడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.