Small Egg
-
Photo Feature: గోళీ అంత గుడ్డు!
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దేవినేనివారి గూడెంలో షేక్ ఇస్మాయిల్‌కు చెందిన ఒక నాటు కోడిపెట్ట మంగళవారం గోళీ అంత సైజులో గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు బరువు కేవలం 5 గ్రాములే ఉందని, తన కోడి అంత చిన్న గుడ్డు పెట్టడం ఇదే తొలిసారని ఇస్మాయిల్ తెలిపాడు. స్థానికులు ఆ గుడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. – ద్వారకా తిరుమల వావ్.. మూన్ చందమామ వెలుగులు విరజిమ్మాడు. మునుపటి కంటే పెద్దగా.. తేజోవంతంగా దర్శనమిచ్చాడు. ఏరువాక పౌర్ణమి రోజున మంగళవారం చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి రావడంతో అతి పెద్దగా కనువిందు చేశాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో కనిపించిన దృశ్యాలను చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఏరువాక సంబరం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం రైతులు కర్నూలు జిల్లా హొళగుందలో ఎద్దుల పరుగు పందేలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావారణం నెలకొంది. – హొళగుంద -
భలే ‘గుడ్డు’
అనంతపురం,కనగానపల్లి: సాధారణంగా కోడిగుడ్డు చిన్న పిటికెడు సైజు అయినా ఉండాలి. అయితే మండల పరిధిలోని వేపకుంటలోని రైతు దివిటి సూర్యనారాయణ ఇంటిలోని ఒక కోడి గోలీ సైజులోనే గుడ్డు పెట్టింది. తొలిరోజు సాధారణ సైజులోనే గుడ్డు పెట్టినా రెండోరోజు మాత్రం ఇలా చిన్న గుడ్డు పెట్టిందని రైతు తెలిపాడు. -
ఈ గుడ్డు వెరీ స్మాల్ గురూ!
చిన్నారులు... బాలింతలు... గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు నెలకొల్పిన అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. వాటిని కేంద్రాలకు సరఫరా చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే సరఫరా అవుతున్న కోడిగుడ్లు మరీ చిన్నవిగా ఉండటంతో అంగన్వాడీ కార్యకర్తలు విస్తుపోతున్నారు. రకరకాల సైజుల్లో వస్తున్న కోడిగుడ్లువల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్బిణులకు ప్రతీ నెల 16 గుడ్లు ఇస్తారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో 8 ఉడికించిన గుడ్లు ఇస్తారు. 3నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు వారానికి నాలుగు రోజులు ఉడికించిన గుడ్లు పెడతారు. అయితే కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు చాలా చిన్నసైజులో ఉంటున్నాయి. వీటి సరఫరా పేరుతో నిధులు గోల్మాల్ అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ తనకు నచ్చిన రీతిలో వాటిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలకు 21 లక్షల వరకూ గుడ్లు సరఫరా జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 2987 అంగన్వాడీ, 742 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో మూడేళ్లలోపు పిల్లలు 85,331మంది, 3 నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 47,074మంది, గర్భిణులు 22,457మంది, బాలింతలు 21,638 మంది ఉన్నారు. మొత్తం 1,76,500 మంది లబ్ధిదారులకోసం నెలకు 21,41,352 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇందులో మూడేళ్ల లోపు పిల్లలకు 6,82,648 గుడ్లు, 3ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు వారికి 7,53,184, గర్బిణులు, బాలింతలకు 7,05,520 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం నెలకు రూ.1,07,06,760 వరకు ఖర్చు చేస్తున్నారు. 35 నుంచి 40 గ్రాములే... అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్లు చాలావరకూ చిన్నవిగానే ఉంటున్నాయి. సాధారణంగా గుడ్డు బరువు 50 నుంచి 55 గ్రాములుంటుంది. కానీ ఈ కేంద్రాలకు సరఫరా అవుతున్నవి మాత్రం 35 గ్రాముల నుంచి 40 గ్రాములకు మించట్లేదు. పిల్లలకు అందించే గుడ్లు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నాణ్యమైన గుడ్లను సరఫరా చేయడం లేదనే ఆరోపణలు వినిస్తున్నాయి. చిన్న గుడ్లు సరఫరా చేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది. ట్రే మొత్తం తూస్తే సరిపోతుంది గుడ్డు చిన్నసైజులా కనిపిస్తున్నా... ట్రేలో ఉన్న 30 గుడ్లు బరువు తూస్తే సరిపోతుంది. సైజు చిన్నదిగా కనిపిస్తే నేను రెండు, మూడు కేంద్రాలను పరిశీలించి బరువు తూశాను. అప్పుడు నాకు ఈ విషయం స్పష్టమైంది. – ఎం.శ్రీదేవి, సీడీపీఓ, విజయనగరం -
బుల్లి కోడిగుడ్డు.. భలే..
కొవ్వూరు రూరల్ : కొవ్వూరు మండలం నందమూరులో ఓ బుల్లి నాటుకోడి గుడ్డు జనాలను ఆకర్షిస్తోంది. సాధారణ గుడ్డుకన్నా అతి చిన్న పరిమాణంలో ఉన్న ఈ గుడ్డు వింతగొల్పుతోంది. పశివేదలకు చెందిన ఒకరి వద్ద కొన్ని గుడ్డులను కొనుగోలు చేయగా.. అందులో ఈ గుడ్డు ఉందని స్థానికుడు పుసులూరి శ్రీనివాసరావు తెలిపారు. నాటుకోళ్లు తొలిసారిగా గుడ్లు పెట్టే సమయంలో ఈ విధంగా చిన్న గుడ్లు పెట్టే అవకాశం ఉంటుందని పశువైద్యులు చెప్పారు. -
కోడి ఒకటే గుడ్డు సైజులు రెండు!
అట్లూరు: ఎక్కడైనా కోడి ఒకే సైజులో గుడ్లను పెట్టడం మామూలే. అయితే వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం వేమలూరు ఎస్సీ కాలనీకి చెందిన పొగడతోటి మునెయ్యకు చెందిన ఒక కోడి శనివారం మామూలు సైజులోనే గుడ్డుపెట్టింది. ఆదివారం మాత్రం ఐదు గ్రాముల బరువు సైజులో అతిచిన్నగుడ్డు పెట్టింది. శనివారం పెట్టిన గుడ్డును, ఆదివారం పెట్టిన గుడ్డును మునెయ్య కాలనీ వాసులకు చూపించడంతో వారంతా ఆసక్తిగా తిలకించారు. ఒకే కోడి ఒకరోజు రెండు పరిమాణాల్లో గుడ్లు పెట్టడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.