Photo Feature: గోళీ అంత గుడ్డు! | Photo Feature in Telugu: Very Small Egg, Full Moon in Vijayawada | Sakshi
Sakshi News home page

Photo Feature: గోళీ అంత గుడ్డు!

Published Wed, Jun 15 2022 4:25 PM | Last Updated on Wed, Jun 15 2022 4:38 PM

Photo Feature in Telugu: Very Small Egg, Full Moon in Vijayawada - Sakshi

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దేవినేనివారి గూడెంలో షేక్‌ ఇస్మాయిల్‌కు చెందిన ఒక నాటు కోడిపెట్ట మంగళవారం గోళీ అంత సైజులో గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు బరువు కేవలం 5 గ్రాములే ఉందని, తన కోడి అంత చిన్న గుడ్డు పెట్టడం ఇదే తొలిసారని ఇస్మాయిల్‌ తెలిపాడు. స్థానికులు ఆ గుడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు.
– ద్వారకా తిరుమల 


వావ్‌.. మూన్‌ 

చందమామ వెలుగులు విరజిమ్మాడు. మునుపటి కంటే పెద్దగా.. తేజోవంతంగా దర్శనమిచ్చాడు. ఏరువాక పౌర్ణమి రోజున మంగళవారం చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి రావడంతో అతి పెద్దగా కనువిందు చేశాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో కనిపించిన దృశ్యాలను చిత్రంలో చూడొచ్చు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 

 
ఏరువాక సంబరం

ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం రైతులు కర్నూలు జిల్లా హొళగుందలో ఎద్దుల పరుగు పందేలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావారణం నెలకొంది.            
– హొళగుంద

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement