full moon
-
Photo Feature: గోళీ అంత గుడ్డు!
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దేవినేనివారి గూడెంలో షేక్ ఇస్మాయిల్‌కు చెందిన ఒక నాటు కోడిపెట్ట మంగళవారం గోళీ అంత సైజులో గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు బరువు కేవలం 5 గ్రాములే ఉందని, తన కోడి అంత చిన్న గుడ్డు పెట్టడం ఇదే తొలిసారని ఇస్మాయిల్ తెలిపాడు. స్థానికులు ఆ గుడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. – ద్వారకా తిరుమల వావ్.. మూన్ చందమామ వెలుగులు విరజిమ్మాడు. మునుపటి కంటే పెద్దగా.. తేజోవంతంగా దర్శనమిచ్చాడు. ఏరువాక పౌర్ణమి రోజున మంగళవారం చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి రావడంతో అతి పెద్దగా కనువిందు చేశాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో కనిపించిన దృశ్యాలను చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఏరువాక సంబరం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం రైతులు కర్నూలు జిల్లా హొళగుందలో ఎద్దుల పరుగు పందేలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావారణం నెలకొంది. – హొళగుంద -
Vijayawada: చందమామ నీలి వర్ణంలో కనువిందు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనువిందు చేశాడు. ప్రతి పౌర్ణమికి కనిపించే చంద్రుడు కంటే ఈసారి పెద్దగా, మరింత దగ్గరగా రావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో చంద్రుడు నీలి వర్ణంలో కనిపించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం -
నేడు ఆకాశంలో అద్బుతం..! ఇప్పుడు మిస్సయ్యారో మళ్లీ అప్పుడే..
Rare Blue Moon Tonight Timings: నేడు రాత్రి ఆకాశంలో అద్బుతం చోటుచేసుకొనుంది. మన సమీప ఉపగ్రహమైన చంద్రుడు నేడు రాత్రి నీలి వర్ణంలో కనువిందు చేయనున్నాడు. నేడు ఆకాశం స్పష్టంగా ఉంటే నీలిరంగు చంద్రుడిని చూడవచ్చునని అమెరికన్ ఆస్ట్రోనామికల్ సోసైటి వెల్లడించింది. స్కై అండ్ టెలిస్కోప్ మ్యాగజైన్ ప్రకారం ప్రతి 2.7 సంవత్సరాలకు ఒకసారి నీలిరంగులో చంద్రుడు కన్సించనున్నాడు. భారత్‌లో ఈ ఖగోళ అద్భుతాన్ని రాత్రి సుమారు 12.00 గంటల ప్రాంతంలో చూడవచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చదవండి: Google: ఆ స్మార్ట్ఫోన్లు ఇకపై కనిపించవు...! మరల ఈ బ్లూమూన్ చూడాలంటే 2024 ఆగస్టు వరకు వేచి చూడాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా బ్లూమూన్ తొలిసారిగా 1528 సంవత్సరం నుంచి గమనించడం మొదలు పెట్టింది. సాధారణంగా ఒక సీజన్లో మూడు పౌర్ణములు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నాలుగు పౌర్ణములు కూడా ఉంటాయి.. ఈ నాలుగు పౌర్ణములు ఉన్న సమయంలో వచ్చే మూడో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం.. రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా, మరొకటి సీజనల్‌గా వచ్చే బ్లూమూన్.ఒక నెలలో రెండు పౌర్ణములు వస్తే అందులో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నీలిరంగు వర్ణంలో చంద్రుడు ఎప్పుడు కన్పిస్తాడంటే... ఈ రోజు ఆకాశంలో చంద్రుడు మనకు సాధారణంగా రోజు వారి లాగే కన్పిస్తాడు. కాగా నీలివర్ణంలో చంద్రుడు కన్పించాలంటే దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి. అగ్ని పర్వతాలు పేలినప్పుడు, దట్టమైన కార్చిచ్చు నుంచి వచ్చే దుమ్ము, దూళి పొగలతో చంద్రుడు నీలిరంగు వర్ణంలో కన్పిస్తాడు. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
ఆకాశంలో 8:15 గంటలకు సర్ప్రైజ్..
న్యూఢిల్లీ: బాల్యంలో ఆరుబయట వెన్నెల్లో పడుకుని.. చందమామను చూస్తూ.. చుక్కల్ని లెక్కపెడుతూ.. అలా అలా ఎప్పుడు నిద్రలోకి జారుకునే వాళ్లమో తెలిసేది కారు. కానీ ఇప్పటి పిల్లలకు ఇవేం తెలియవు. స్మార్ట్‌ఫోన్‌తోనే శుభోధయం.. దానితోనే నిద్ర. ఇక చందమామ, నక్షత్రాలు లెక్కించడం వంటి సరదాలు కల్లే. ఇక పట్టణాల్లో ఉండే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. రోజు ఎలా ఉన్నా కానీ ఈ రోజు మాత్రం కాస్త తీరిక చేసుకుని ఓ సారి ఆకాశం వైపు చూడండి.. మీరో తేడాని గమనిస్తారు. ఏంటి అనుకుంటున్నారా అక్టోబర్ 31 రాత్రి ‘బ్లూ మూన్’ దర్శనమియనుంది. అంటే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడా ఏంటి అనే డౌట్ వద్దు. రోజు చూసే వర్ణంలోనే ఉంటాడు. కాకపోతే ఈ రోజు మరి కాస్త పెద్దగా.. ఎక్కువ ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. చంద్రుడు ఇలా భారీ సైజులో ఏడాదికి 12 సార్లు కనిపిస్తాడు. బ్లూ మూన్ పేరేలా వచ్చింది.. చంద్రుడు ఏడాదికి 12 సార్లు పెద్దగా దర్శనమిస్తాడని చెప్పుకున్నాం కదా.. అలా ప్రతి పూర్ణ చంద్రుడుకి ఒక పేరు పెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ సీజన్లో మూడవ పౌర్ణమికి ‘బ్లూ మూన్’ అనే పేరు వచ్చింది. నెలలో వచ్చే రెండో పౌర్ణమికి ఇలా ప్రత్యేకమైన పేరు ఉందనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం సీజనల్ బ్లూ మూన్, నెలవారీ ‘బ్లూ మూన్’ ఉన్నాయి. ఈ రోజు దర్శనమిచ్చే బ్లూ మూన్ నెలవారీది. (చదవండి: చందమామ నీటి కుండ.. జాబిల్లిపై నీరుందట!) బ్లూమూన్ వెనక మరో కథ.. ఈ పేరు వెనక మరో కథ ఉంది. ఒకానోక ‘బ్లూ మూన్’ అనే పదబంధం నుంచి ఇది పుట్టిందని సమాచారం. నాసా ప్రకారం 1883 ఇండోనేషియాలోని క్రాకాటోవా అనే అగ్ని పర్వతం పేలి భారీ ఎత్తును వెలువడిన బూడిద ఆకాశంలోకి చేరింది. ఈ బూడిద మేఘాలలోని కణాలు చంద్రునిలోని ఎరుపు రంగును చెదరగొట్టాయి. దాంతో చందమామ నీలం రంగులో దర్శనమిచ్చింది. దీన్ని నాసా అరుదైన ఘటనగా పేర్కొంది. అప్పటి నుంచి ‘బ్లూ మూన్’ పదం వాడుకలో ఉందని సమాచారం. సాధారణంగా సంవత్సరంలో 12 పూర్తి చంద్రులను చూస్తాము. ప్రతి నాలుగు సీజన్లలో మూడు. ఏదేమైనా, ప్రతి పౌర్ణమికి 29.5 రోజులు గడువు ఉంటుంది. దీని అర్థం చంద్రుడు 12 పౌర్ణములను పూర్తి చేయడానికి 354 రోజులు పడుతుంది. సంవత్సరంలో మిగిలిపోయిన రోజులన్నింటిని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కలుపుతారు. ఫలితంగా ఒక ఏడాదిలో 13 పూర్తి చంద్రులు కనిపిస్తారు. ఈ 'అదనపు' పౌర్ణమి అరుదైన సంఘటన కాబట్టి దీనిని కూడా ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. ఇక ఈ రోజు చంద్రుడు నీలంగా కనిపించడు. రోజుకంటే పెద్దగా, ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. అయితే ‘బ్లూ మూన్’ కూడా కనిపించే అవకాశం ఉంది. ఇది జరగడానికి కాంతి కిరణాలను సరైన పద్ధతిలో వక్రీభవించే కొన్ని వాతావరణ పరిస్థితులు అవసరం. ఇక అక్టోబర్ 31 బ్లూ మూన్ రాత్రి 8:15 గంటల తర్వాత పూర్తి ప్రకాశవంతంగా ఉంటుంది. అలానే చంద్రుడి ప్రక్కన ప్రకాశవంతమైన ఎరుపు 'స్టార్రి' వస్తువును గమనిస్తారు. ఇది నక్షత్రం కాదు, మన పొరుగున ఉన్న మార్స్. (చదవండి: చందమామ అందివచ్చిన రోజు) ఇతర పూర్తి చంద్రులు ఏమిటి? మేము ఇంతకు ముందు వివరించినట్లుగా.. చంద్రుడికి ఇలా ప్రత్యేకంగా పేర్లు పెట్టడంపై ఎలాంటి సమావేశం లేదు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, ఇవి ప్రస్తుతం జనాదరణ పొందిన పౌర్ణమి పేర్లు: జనవరి: వోల్ఫ్ మూన్ ఫిబ్రవరి: స్నో మూన్ మార్చి: వార్మ్ మూన్ ఏప్రిల్: పింక్ మూన్ మే: ఫ్లో మూన్ జూన్: స్ట్రాబెర్రీ మూన్ జూలై: బక్ మూన్ ఆగస్టు: స్టర్జన్ మూన్ సెప్టెంబర్: హార్వెస్ట్ మూన్ అక్టోబర్: హంటర్స్ మూన్ నవంబర్: బీవర్ మూన్ డిసెంబర్: కోల్డ్ మూన్ -
పింక్ సూపర్ మూన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఆకాశవీధిలో ఓ అందాల దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 7న చంద్రుడిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 7 రాత్రి 8.30 గంటలకు చంద్రుడు భూమి కక్ష్యలోకి మరింత దగ్గరగా వచ్చి, భారీ సైజులో కాంతులీనుతూ కనువిందు చేయనున్నాడు. దీనినే పింక్ సూపర్ మూన్ అని పిలుస్తారు. 2020 సంవత్సరంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపించే రోజు ఇదే. భారత్‌లో 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఈ దృశ్యాన్ని చూడవచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్ మూన్ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్‌లో ఉదయం సమయం కాబట్టి సూపర్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏమిటీ పింక్ సూపర్ మూన్ పున్నమి రోజుల్లో కనిపించే చంద్రుడు కంటే అత్యంత ప్రకాశవంతంగా, ఇంకా పెద్దగా ఆకాశ వీధిలో అందాల జాబిలి కనువిందు చేయడాన్నే సూపర్ మూన్ అంటారు. భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు. ఈ పెరోజీలోకి వచ్చినప్పడు చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా సూపర్ పింక్ మూన్ దర్శనమిస్తాడు. 20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్ మూన్‌లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది నెలకో సూపర్ మూన్ వస్తూనే ఉంది. -
ప్రతిరాత్రి.. వసంత రాత్రి!
‘నిండు పున్నమిరాత్రి... ఆకాశం నిర్మలంగా ఉంది.. ఇంటిపైకప్పుపై నక్షత్రాలు లెక్కబెట్టుకుంటూ..’ ఇలాంటి వర్ణన విన్నా.. చదివినా వెంటనే పౌర్ణమి ఎప్పుడొస్తుందా... వెంటనే రూఫ్‌టాప్‌పైకి వెళ్లిపోయి కాసేపైనా ఆ ఆనందాన్ని అనుభవిద్దాం అనిపిస్తుంది కదా! ఇంకొన్నేళ్లు ఆగండి.. ఎంచక్కా ప్రతిరోజూ పున్నమిలా మారిపోతుంది! ఎందుకంటారా? ఓ బుల్లి ఉపగ్రహం రాత్రిపూట తెల్లటి కాంతితో నింపేయనుంది. మన పొరుగుదేశం చైనా ఈ దిశగా తొలి అడుగు వేసింది కూడా. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించడాన్ని మనం వెన్నెల కాంతులంటాం. జాబిల్లి స్థానంలో ఓ పెద్ద అద్దం ఉందనుకోండి. అది కూడా చందమామ మాదిరిగానే భూమ్మీదకు కాంతులను ప్రసారం చేస్తుంది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది చైనాలోని సియాచున్ ప్రాంత రాజధాని చెంగ్డూ. కాకపోతే భారీ సైజు అద్దం కాకుండా ఓ బుల్లి ఉపగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు. దీనికున్న రెక్కలనే అద్దాలుగా వాడుకోనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2020 నాటికల్లా ఈ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెడతామని, సూర్యకాంతి నేరుగా చెంగ్డూ నగరంపై పడేలా చేస్తామని చెంగ్డూ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ వూ ఛున్‌ఫెంగ్ అంటున్నారు. ఒక్కో ఉపగ్రహం 10 నుంచి 80 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని కాంతివంతం చేస్తుందని అంచనా. అంతేకాదు.. అవసరమైతే కొన్ని మీటర్లు తగ్గించుకునేందుకు లేదా పెంచుకునేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. బోలెడంత ఆదా... ప్రతిరోజూ పున్నమి వెన్నెల ఉంటే లాభం ఏమిటన్న డౌట్ వస్తోందా? చాలానే ఉంది. ఈ ఆలోచన ఆచరణలోకి వస్తే చెంగ్డూ నగరం మొత్తమ్మీద వీధిదీపాలనేవి ఉండవు. ఫలితంగా విద్యుత్తు బిల్లుల రూపంలో భారీ మొత్తం ఆదా అవుతుందని స్థానిక ప్రభుత్వం అంటోంది. పైగా ఇలాంటి హైటెక్ ఏర్పాటును చూసేందుకు వచ్చేవారితో చెంగ్డూ ప్రాంత పర్యాటకానికి ఊతం లభిస్తుందని అంచనా. జాబిల్లి కంటే 8 రెట్లు ఎక్కువ వెలుతురును ప్రసరింప చేస్తున్నా దీంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని వూ ఛున్‌ఫెంగ్ తెలిపారు. ఈ కృత్రిమ చంద్రుడికి సంబంధించిన పరిశోధన కొన్నేళ్ల క్రితమే చేపట్టామని.. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు సిద్ధంగా ఉందని అన్నారు. నార్వేలోనూ ఇలాంటి ప్రయత్నం... కొన్నేళ్ల క్రితం ఫ్రెంచ్ కళాకారుడు ఒకరు ఇలాంటి ప్రతిపాదనే ఒకటి చేశారు. ఆకాశంలో భారీసైజు అద్దాల నెక్లెస్‌ను అమర్చడం ద్వారా ప్యారిస్ నగర వీధులు రాత్రి కూడా వెలుగులతో నింపవచ్చన్న ఆ ఆలోచన ఆచరణలోకి రాలేదు. 2013లో నార్వేలోనూ ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అయితే అద్దాలు ఆకాశంలో కాకుండా రజుకాన్ పట్టణ శివార్లలో ఉన్న కొండపై ఏర్పాటు చేశారు. సూర్యుడి కదలికలను గమనిస్తూ కాంతిని రజుకాన్ సెంటర్‌పైకి ప్రసరింపజేయాలన్నది లక్ష్యం. ఉత్తర ధ్రువానికి కొంచెం దగ్గరగా ఉండే రజుకాన్లో 6 నెలలపాటు చీకటిగానే ఉంటుంది. అద్దాలు అమర్చిన తరువాత చీకటి సమస్య తీరిపోయిందని ప్రజలు అంటున్నారు. 1990 ప్రాంతంలో రష్యా వ్యోమగాములు కొందరు ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించి సూర్యకాంతిని ప్రతిఫలింప చేయడంలో విజయం సాధించారు కూడా. 1999లో మరింత భారీ స్థాయిలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టాలని అనుకున్నారు. కానీ... ప్రయోగ సమయంలో ప్రమాదం జరగడం.. ఆ తరువాత నిధుల సమస్యతో ‘‘జన్మయా–2.5’’పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్కడితో ఆగిపోయింది. -
ఐశ్వర్యప్రద వ్రతం
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాని, ఆ మాసంలోని రెండవ శుక్రవారం కాని ఈ వ్రతం ఆచరిస్తారు. కుదరని వారు తర్వాత వచ్చే శుక్రవారంనాడైనా సరే, ఈ వ్రతం జరుపుకోవచ్చు. పసుపు, కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగా తయారు చేసి ఉంచుకోవాలి. ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి నూలు దారం, కొబ్బరికాయలు, దీపపు కుందులు, పంచహారతి, దీపారాధనకు ఆవు నెయ్యి, కర్పూరం, అగరు వత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పూజావిధానం: ఉదయాన్నే లేచి తలంటిస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిముంగిట కళ్లాపు చల్లి, ముగ్గుపెట్టి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరించాలి. ఇంట్లో ఇల్లాలు శుచిగా, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం విఘ్న నివారణకై పసుపు గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని పూజకు మాత్రమే ఉపయోగించే ఒక పంచపాత్రనుగాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి కలశపూజ చేసుకోవాలి. అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచార పూజలతో పూజించాలి. తెల్లని నూలు దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు పూయాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా ఐదు లేదా తొమ్మిది పోగులతో తయారు చేసిన తోరాలను పీఠం మీద ఉంచి పూజించాలి. కథానంతరం తోరాలు కట్టుకోవాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యంతో సహా విందారగించి రాత్రి భోజనాన్ని త్యజించాలి. -
ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం... శివరాత్రి
కాలగమనంలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఎలా ఉన్నాయో, పూర్తి చీకటి– అమావాస్య వైపుకు తిరిగిన కాలంలో ఇంద్రియ నిగ్రహం, ఆత్మ సంయమనం అనే మార్గాల ద్వారా ఈశ్వర తత్వానికి దగ్గరగా వెళ్లగలిగే సోపానాలే, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఇవి మాసానికి ఒకమారు, సంవత్సరానికి ఒకమారు మనకు లభిస్తాయి. ఇది ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం. అందుచేతనే ఆ రాత్రి ఆటవికుడు ఒకడు బిల్వవృక్షం మీద కూర్చొని క్రూరమృగం నోటికి దొరక కుండా, రాత్రంతా ఒక్కో దళం తుంచుతూ, తెలియకుండానే కింద ఉన్న శివలింగం మీద పడేస్తూ జాగారం ఉండడం చేత అనుకోకుండానే సాధన పూర్తి చేసి మోక్షం పొంది తరించాడని మనకు మహా శివరాత్రి కథ చెబుతోంది. ఉపవాసం, జాగరణ అనేవి ఇంద్రియ నిగ్రహం, సమత్వం ద్వారా మనలోని చీకటిని తొలగించుకుని ఈశ్వర తత్వాన్ని తెలుసుకునేందుకు మనకు ఇచ్చిన సాధనాలు. అలా అని నీరసంతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసాలు చేసి మరింత అనారోగ్యాన్ని తెచ్చుకోమని కాదు. అదేవిధంగా నాలుగు చలన చిత్రాల సందర్శనం చేసి మర్నాడు రోజంతా నిద్ర పొమ్మని కూడా కానే కాదు. మహాశివరాత్రి రోజున జరిగే రుద్రాధ్యాయ పారాయణ నమక చమకంతో జరిపే అభిషేకాలు ఎంతో లాభదాయకాలు. సమస్త పాపక్షయానికి, అనావృష్టి నివారణకు, గోరక్షకు, అకాల మృత్యువు దోష నివారణకు, అభయానికి, నాయకత్వం పొందటానికి, వ్యాధి నివారణకు, సంతాన ప్రాప్తికి, కుటుంబ సంక్షేమం, తదితరాలకు మొదటి అనువాకం, ధనప్రాప్తికి, శత్రుక్షయానికి, విజ్ఞతప్రాప్తికి రెండవ అనువాకం, ఆరోగ్యానికి మూడవ అనువాకం, క్షయవ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్యానికి నాల్గవ అనువాకం, మోక్షప్రాప్తికి అయిదవ అనువాకం, శివునితో సమానమైన పుత్రప్రాప్తికి అయిదు, ఆరు అనువాకాలు, ఆయువుకు ఏడవ అనువాకం, రాజ్యప్రాప్తికి ఎనిమిదవ అనువాకం, ధనకనక వస్తువాహనాలు, వివాహం జరగడానికి తొమ్మిదవ అనువాకం, సమస్త భయ నాశనానికి పదవ అనువాకం, తీర్థయాత్రలకు, జ్ఞానార్జనకు పదకొండవ అనువాకం, ఇలా సకల కార్యసిద్ధికోసం మహాశివరాత్రి అనువాకాలను ఉచ్చరిస్తూ అభిషేకం చేయడం ఆచారం. దీని తర్వాత శివునితో మమేకమవుతూ చమకంతో అభిషేకం జరుపుతారు. ఆత్మసాక్షాత్కారానికి తొలిమెట్టు ఇంద్రియ నిగ్రహం. శాస్త్రాలు నిర్దేశించిన సమయాలు శక్తిమంతమైనవి. ఆయా సమయాలలో చేపట్టే అభ్యాసం చాలా మంచిది. శివుని నర్తనం, శివ శక్తుల సమ్మేళనం సృష్టిలోని అన్ని ప్రక్రియలకు, అస్తిత్వాలకూ మూలమని తెలుస్తోంది. తొలుత ఈ ప్రక్రియ మహాశివరాత్రి రోజున మహర్షులకు విదితమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆనంద నర్తనానికి తార్కాణం చిదంబరంలోని ఆకాశలింగం. ఇక్కడ ఉన్న చిత్ సభ, మానవుని శరీరంలోని నాడులు, వాటి నిర్మాణం, సకల విశ్వంలోని శక్తులు, వాటినుండి ప్రసారమయ్యే శక్తి, శబ్దబ్రహ్మం లయ విన్యాసం ఇత్యాదులను అనుసరించి నిర్మించటం జరిగింది. శివునికి రెండు స్వరూపాలు– చంద్రస్వరూపం, అగ్ని స్వరూపం. సామాన్యంగా మనం పూజించే శివుడిది చంద్రస్వరూపం. కాలాన్ని శాసించే శివుడు, కాలాన్ని సూచించే చంద్రుడు కలిసిన స్వరూపం చంద్రశేఖర స్వరూపం. గ్రహదోషాలు, గ్రహదశలలో గల సమస్యలు, వాటి నివారణకు మహాశివరాత్రి రోజున జరిపే అభిషేకం ఎంతో ప్రధానమైనది. ఈరోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేదా పంచభూత లింగాలలో ఏ క్షేత్రమైనా గానీ లేదా ఇంటికి దగ్గరలో ఉన్న ఏ శివాలయాన్నైనా సందర్శించి మనసారా ఒక్కసారైనా పంచాక్షరి ఉచ్చరించిన వారికి ఎంతో ఫలితం ఉండగలదు. ఈశావాస్యోపనిషత్తు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్... ’ అని చెబుతుంది. పరమేశ్వర తత్వమొక్కటే పరిపూర్ణమైనది. ఒక వృత్తం తన ఆకారంలో చాలా గొప్పది. అది అనంతమైన మోతాదులో పెరుగుకుంటూ వెళ్లినా దాని కేంద్రం ఒక్కటే. పరిపూర్ణ తత్త్వమనేది ఒక గోళానికి చెందింది. పరిపూర్ణమైన దానిలోని భాగాలన్నీ, అణువులన్నీ పరిపూర్ణాలే అని తెలుసుకోవడమే సాధన! సృష్టి యావత్తూ శివలింగమే– ఈ భూమిని కూడా ఒక లింగమేనని ధ్యానించాలి. సృష్టిలో ఒక చిన్న పరిపూర్ణత్వం ఈ ధరణి. అన్ని స్పందనలూ, చేతనలూ ఆయనలోనే, ఆయన వలనే! అటు అనంతం ఇటు అనంతం, పైన అనంతం, కింద అనంతం చుట్టూ తిరిగి చూస్తే సర్వం లింగాకారమే.. సర్వం శివమయం జగత్! – వేదాంతం శ్రీపతి శర్మ -
సూపర్ మూన్ అద్భుత దృశ్యం!
-
వెలుగులీనిన నిండు చంద్రుడు
ప్రతి పౌర్ణమీ ఓ అద్భుత సృష్టే ! ఇంతటి అద్భుతానికి కేంద్రబిందువైన చంద్రుడు.. మనకు అత్యంత సమీపంలో ఉన్నట్లుగా కనిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ! ఇలాంటి అద్భుతం సోమవారం వినీలాకాశంలో ఆవిష్కృతమైంది. 1948 తర్వాత చంద్రుడు అతిపెద్దగా, మనుపటి కంటే ఎక్కువ వెలుగులు ప్రసరిస్తూ కార్తీక పౌర్ణమి నాడు దర్శనమిచ్చాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
సూపర్ మూన్ అద్భుత దృశ్యం!
న్యూయార్క్: ఆకాశంలో సోమవారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఈ సారి చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భూమికి దగ్గరగా వచ్చాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ అలా కనిపించాడని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించాడు. మళ్లీ ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ 2034లో కనిపించనుంది. సూపర్ మూన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో చంద్రుడిని చూసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
రేపు ఆకాశంలో అద్భుతం!
-
రేపు ఆకాశంలో అద్భుతం!
న్యూయార్క్: ఆకాశంలో ఈ నెల 14న (సోమవారం) ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఆరోజు చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత సోమవారం అలా కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని, అందుకే కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తోందని నాసా పేర్కొంది. .అరుుతే సోమవారం సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ మళ్లీ 2034లో కనిపించనుంది. సోమవారం సూర్యాస్తమయం అద్భుతంగా ఉండనుందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నాసాకు చెందిన శాస్త్రవేత్త నోహ్ పెట్రో తెలిపారు. కానీ మేఘాలు సహకరించకపోతే మాత్రం తర్వాతి అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు. -
అంగరంగ వైభవంగా శ్రీవారి పున్నమి గరుడ సేవ
తిరుమల: తిరుమలలో సోమవారం పున్నమి గరుడ వాహన సేవ వైభవంగా సాగింది. సంప్రదాయబద్దంగా పౌర్ణమి సందర్భంగా ఆలయ పురవీధుల్లో మలయప్ప గరుడవాహనంపై దర్శనమివ్వడం ఆనవాయితీ. సాయం సంధ్యా సమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపానికి వేంచేశారు. సహస్రదీపాలంకరణసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై ఆశీనులైన మలయప్పస్వామిని అర్చకులు ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. రాత్రి 7గంటలకు భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ వాహన సేవ ఊరేగింపు ప్రారంభించారు. ఆలయ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ద్రవిడ వేద నాలాయర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని సుమారు 200 మంది పారాయణదారులు దివ్యప్రబంధ పాశురాలు పారాయణం చేశారు. ఈ కార్యక్రమాన్ని తొలిసారి ఏర్పాటుచేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి నెలా పౌర్ణమికి ఇలాంటి వైదిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
అర్చకులు లేని ఆలయం
♦ యాగభూమిలో రాజరాజేశ్వరీమాత ♦ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా దేవీపురం ♦ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన శ్రీచక్రాలయం ♦ భక్తుల చేతే అభిషేకాలు అమ్మవారు బిందుస్థానంలో సృష్టికార్యంలో ఉన్న భంగిమలో ఉంటారు. గర్భాలయంలో మాత్రం నిండైన వస్త్రధారణతో దర్శనమిస్తారు. పౌర్ణమి, అమావాస్య రోజులలో మాత్రమే అమ్మవారికి పంచామృతా భిషేకాలు. ♦ నేరుగా భక్తులే అభిషేకాలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. జలం, పాలు, పెరుగు, తేనే, పళ్ళరసాలతో అభిషేకాలు జరుపుతారు. ♦ ప్రతి నెలా పౌర్ణమికి ముందు శ్రీవిద్యసాధన తరగతులు నిర్వహిస్తారు. ఇతర ఆధ్యాత్మిక సేవలపైనా శిక్షణ ఇస్తారు. ♦ అమావాస్య తరువాత శ్రీ విద్యసాధన రెండో దశ ఉంటుంది. ♦ అమ్మవారి రథం, అమృతానందస్వామి విగ్రహా ప్రతిష్టాపన చెప్పుకోదగినవి. ♦ తొమ్మిది కొండల నడుమన మనోహర దృశ్యం. ♦ దాపున అల్లుకుపోయిన ప్రకృతి పరవశం. ♦ దారంతటా ఆకుపచ్చని తోటలు.. చుట్టూ జీడిమామిడి తోటల సోయగం. ఎటు చూసినా పచ్చదనంతో విలసిల్లుతున్న దేవీపురంలో ‘సహస్రాక్షి’ నామంతో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు భక్తుల కొంగుబంగారమై అలరారుతోంది. శ్రీచక్ర మహాయంత్ర ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. ప్రపంచంలో శ్రీచక్ర యంత్రం ప్రమాణాలతో నిర్మించిన ఆలయం ఇదొక్కటే అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు అతి చేరువలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నిత్యం వేలాది భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటోంది. దేవీ సంకల్పమే! ఇక్కడ ఆలయ నిర్మాణం దైవ సంకల్పంతో జరిగిందనడానికి కథనాలు ఉన్నాయి.. ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌లో శాస్త్రవేత్తగా ఉన్న నిష్టల ప్రహ్లాదశాస్త్రి(అమృతానంద సరస్వతిస్వామీ)కి ధ్యానంలో అమ్మవారు కనిపించారని, అనువైన చోట తనకు నచ్చిన రీతిలో ఆలయం నిర్మించమని ఆదేశించారని కథనం. ఎన్నో ప్రాంతాలను సందర్శించిన ప్రహ్లాదశాస్త్రి ఓసారి విశాఖలోని ప్రహ్లాద కల్యాణ మండపంలో జరిగిన దేవీయాగానికి హాజరయ్యారు. అక్కడ అమ్మ శక్తి ఉందని ఎన్నో సంఘటనల ద్వారా శాస్త్రిగారికి తేటతెల్లమైంది. దీంతో వేదుల, పుట్రేవు (దేవీపురం ఆలయ భూములు వీరివే) సోదరులను కలిశారు. దేవీ సన్నిధిలోనే శ్రీ చక్రాలయం నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. ప్రహ్లాదశాస్త్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో ఆలయ నిర్మాణంలో నిమగ్నమైపోయారు. 1983లో అమ్మవారిని ప్రతిష్టించగా 1985 నాటికి ఆలయం పూర్తయ్యింది. ఇక్కడ ఇగ్లూ నివాసాలను తలపించేలా నిర్మించిన డోమ్ ఇళ్ళు ప్రత్యేకార్షణ. పీఠంలో శివలింగాల సమూహం, దక్షవాటిలో ద్విసహస్ర లింగాల ఏర్పాటును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! 108 దేవతా మూర్తులు శ్రీరాజరాజేశ్వరీ ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో 108 దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఐదు అంతస్తుల్లో ఉన్న శ్రీచక్రాలయంలో అణిమాసిద్దులు, బ్రహ్మాది శక్తులు, రుద్రాది శక్తులైన 28 మంది దేవతల విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. శ్రీచక్ర ఆలయం ప్రాంగణంలోని దేవతా విగ్రహాలను శృంగారభరిత భంగిమల్లో నిర్మించినా నగ్నత్వంలోనే దైవత్వం ఉందన్నది ఆధ్యాత్మిక వేత్తల విశ్లేషణ. ఖండాంతర ఖ్యాతి శ్రీ విద్యసాధన వల్ల, ఆలయ ప్రత్యేకత వల్ల దేవీపురం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రాష్ట్రంలోని భక్తులతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. శ్రీచక్ర ఉపాసన విద్యలు నేర్చుకునేవారి సంఖ్య ఇక్కడ అధికం. చుట్టూ జీడిమామిడి, మామిడి తోటలతో పాటు పచ్చటి పొలాలు, కొండలు ప్రకృతికి ప్రతిరూపంగా ఉంటుంది ఈ ప్రాంతం. దీంతో ఉత్తరాంధ్రలోనే పెద్ద పిక్నిక్‌స్పాట్‌గా దేవీపురం పేరుగాంచింది. - సమ్మంగి భాస్కర్, సాక్షి,పెందుర్తి, విశాఖపట్నం ఇలా చేరుకోవచ్చు ♦ ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖపట్నంలోని ద్వారకా బస్‌స్టేషన్‌కు దేవీపురం సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది సబ్బవరం నుంచి 6 కిలోమీటర్ల దూరం. సబ్బవరం-అనకాపల్లి సరిహద్దులో దేవీపురం ఉంది విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు 28 కిలోమీటర్ల దూరం ♦ అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి 18 కిలోమీటర్లు. ♦ విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు సుమారు 20 కిలోమీటర్లు దేవీపురానికి నర్సీపట్నం-ఆనందపురం జాతీయరహదారి (బైపాస్) రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. మతాలకు అతీతంగా! కులమత భేదాలు, ఆర్థిక తారతమ్యాలు, వయసుతో ఇక్కడ పనిలేదు. కేవలం అమ్మవారి పట్ల భక్తి ఉంటే చాలు. - కందర్బ ప్రభాకర్, ఆలయ నిర్వాహకులు సేవలో తరిస్తాను ఇక్కడ అమ్మవారి దివ్యరూపం చూడడం మాటల్లో చెప్పలేని అనుభూతి. నమ్మిన భక్తులకు ఏం కావాలో అమ్మకు తెలుసు. అమ్మ మీద ఉన్న భక్తితో ఆమెను కొలవడానికి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తాను. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటాను. ఇక్కడకు రావడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. - మహేశ్వరీ (సుందరమ్మ), ముంబై ఎదురుచూస్తుంటాను ఇక్కడ ప్రత్యేకంగా అర్చకులు ఉండరు. నెలలో రెండుసార్లు మాత్రమే జరిగే అభిషేకాలను భక్తులతోనే చేయిస్తారు. భక్తులే సేవకులు. ఇక్కడ వాతావరణం, ఆధ్యాత్మిక సేవలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ప్రతి యేటా ఇక్కడకు రావడం కోసం ఎదురు చూస్తుంటాను. ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాను. నేను నేర్చుకున్న విద్యను మరికొంత మందికి పరిచయం చేస్తుంటాను. ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రశాంతత దొరికే అతికొద్ది ప్రదేశాల్లో దేవీపురం ఒకటి. - షీల, అమెరికా నా అదృష్టం అమృతానందస్వామి శిష్యుడిగా అమ్మ సేవలో తరిస్తున్నాను. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిత్యం పాలుపంచుకుంటున్నాను. అమ్మవారి మీద ఉన్న అమితమైన భక్తి కారణంగా దేవీరథాన్ని సమకూర్చాను. అమ్మ సేవ చేసుకోవడం నా అదృష్టం. - విజయ్హరన్,యూకె -
మహాశివరాత్రి - ఓ మహత్తరమైన రాత్రి!
సద్గురు జగ్గీ వాసుదేవ్ మహాశివరాత్రి అనేక ఆధ్యాత్మిక అవకాశాలను అందించే రాత్రి. మాఘ మాసంలో (ఫిబ్రవరి- మార్చి) పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజున వచ్చే శివరాత్రి ఇది. ఈ రాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాధనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఎందుకంటే అది అన్ని శివరాత్రులలో కెల్లా మహత్తరమైనది, శక్తివంతమైనది. మనలోని శక్తులు ఉప్పొంగే రాత్రి మహాశివరాత్రి! ఈ రోజు ప్రకృతి నుంచి సహజంగానే ఎంతో సహాయం లభిస్తుంది. సాధకుడు తనలోని ఆధ్యాత్మికతను మేలుకొలపడానికి, శక్తులను ఉత్తేజపరచడానికి ఆరోజు గ్రహస్థానాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాత్రి తెల్లవార్లు మేల్గొని వెన్నెముక నిటారుగా నిలపటం మీలోని సహజ శక్తులు ఉప్పొంగటానికి ఎంతో దోహదపడుతుంది. ఈ దేశంలో సనాతనంగా ఋషులు, మునులు ఈ శక్తులు ఉప్పొంగడానికి ఈ రాత్రి కల్పించే ఆసరాతో తమ సర్వోత్తమస్థితికి చేరుకున్నారు. కేవలం ఒక జీవిగా ఉండే స్థితి నుంచి అధ్యాత్మిక స్థితికి చేరుకోవాలంటే శక్తులు ఊర్ధ్వఃముఖంగా పయనించాలి. మనం మన శరీరానికి మాత్రమే పరిమితమైపోతే మనం పిల్లల్ని కనడానికే పరిమితమైపోతాము. భౌతిక జీవనానికి అంతకంటే మించిన ప్రయోజనం లేదు. ఈ భూమి మీద ఏ ప్రాణిని చూసినా తమ జాతి కొనసాగడానికి అవి కూడా సంతానం కంటూనే ఉన్నాయి. కాని ఒకసారి మానవ జన్మ ఎత్తాక, అంటే వెన్నెముక నిటారైన తరువాత, జీవితం కేవలం అలా కొనసాగడంతో సరిపోదు. జీవశాస్త్రవేత్తలు జీవపరిణామ క్రమంలో సమాంతరంగా ఉండే వెన్నెముక నిటారుగా కావడాన్ని ఎంతో పెద్ద పరిణామంగా పేర్కొంటున్నారు. ఇలా వెన్నెముక నిటారయ్యాకే మీ తెలివి వికసించింది. మహాశివరాత్రి నాటి ఉత్సవంలో రాత్రంతా ఇలా శక్తులు ఉత్తేజమవడాన్ని ఉపయోగించుకొని, సైరైనమంత్రోచ్ఛారణ, ధ్యానాలూ చేస్తూ మనం దివ్యత్వానికి చేరువ కావచ్చు. ఏ సాధన లేకపోయినా ఈ శక్తులు ఉత్తేజమవడం జరుగుతుంది. కాని ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఇలా శరీరాన్ని నిటారుగా ఉంచుకోవడం, తెల్లవార్లూ మేలుకొని ఉండడం చాలా ముఖ్యం. శివుడే ఆదియోగి, ఆదిగురువు కూడా! ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి, సంసార జీవనం సాగించేవారికి, అభ్యుదయం కోరుకునే వారికి కూడా మహాశివరాత్రి ఎంతో మహత్తరమైనది. సంసారిక జీవనం సాగించేవారు ఈ దినాన్ని శివుడు కళ్యాణమాడిన దినంగా జరుపుకుంటారు. అభ్యుదయం కోరుకునే వారు శివుడు శత్రువులను జయించిన విజయదినంగా జరుపుకుంటారు. యోగా సంప్రదాయంలో శివుడిని దేవునిగా కాక ఆది యోగి, ఆది గురువుగా పరిగణిస్తారు. యోగ విధానాన్ని ఆరంభించింది ఆయనే. ఆయన ముందు ఏడుగురు శిష్యులను ఎంచుకున్నారు. వారినే ఈనాటికి కూడా మనం సప్తర్షులుగా ఆరాధిస్తాము, వారితోనే యోగా శాస్త్ర బోధన మొదలయింది. ఇది కేదార్నాథ్ దగ్గర ఉన్న కాంతి సరోవర తీరంలో జరిగింది. అంటే ఇక్కడే ప్రపంచంలో మొదటి యోగ కార్యక్రమం జరిగిందన్నమాట. యోగా అంటే శరీరాన్ని వంచడం, ఊపిరి బిగబట్టడం అని మీరు అనుకోకండి. యోగా అంటే మేము అసలు జీవనరీతి గురించి మాట్లాడుతున్నట్టు. తన శరీరాన్ని, జీవన గమనాన్ని పూర్తిగా తిరగరాసుకో గలిగేవాడే యోగి. శివ అన్నప్పుడు మనం కోరికలు తీర్చే ఒక దేవుడో, లింగమో అనుకోకూడదు. శివ అంటే లేనిది అని అర్థం. ప్రస్తుతం శాస్త్రవిజ్ఞానం కూడా అన్నీ శూన్యంలో నుంచే పుట్టి శూన్యంలోనే లీనమవుతున్నాయి అని చెబుతున్నది, తార్కికంగా కూడా అదే యధార్థం. ఆ శూన్యమే శివ అంటే. అన్నీ కలిగినది, ఏమీ కానిది, అదే శివ అంటే. మీలో మీరు కాక, ఆ శివుడే ఉండేటట్లు మిమ్మల్ని మీరు మలుచుకోగలిగితే, మీకో కొత్త దృష్టికోణం ఏర్పడుతుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఎంతో స్పష్టంగా చూసే అవకాశం వస్తుంది. శివుడు త్రయంబకుడు లేక మూడుకళ్ళు కలవాడు అని అంటారు. ఈ మూడవ కన్నే అసలై దృష్టి ఇస్తుంది. భౌతికమైన కళ్ళు రెండూ కేవలం జ్ఞానేంద్రియాలు మాత్రమే, మీరు చూసే అవాస్తవాలనే అవి మనసుకు చేరవేస్తాయి. మీరు ఏదో ఒక మనిషిని చూసి అతని గురించి ఏదో ఆలోచిస్తున్నారు, కాని అతనిలోని శివుని చూడలేకపోతున్నారు. ఈ రెండు కళ్ళూ యధార్ధాన్ని చూడలేవు. నిశితంగా చూడగలిగే ఇంకో కన్ను తెరచుకోవాలి. ఈ దేశంలో, ఈ సంస్కృతిలో, తెలుసుకోవడం అంటే పుస్తకంలో ఏదో చదవడం, ఎవరో చెప్పింది వినడం, ఏదో సంగ్రహించడం కాదు. తెలుసుకోవడం అంటే మరో దృష్టికోణాన్ని ఏర్పరచుకోవడం. మహాశివరాత్రి నాడు ప్రకృతి ఈ అవకాశాన్ని మనకు కలిగిస్తున్నది. ఈ అవకాశం ప్రతిరోజూ ఉంటుంది, ఈ ప్రత్యేక దినం కోసం వేచి ఉండనవసరం లేదు, కాని ఈరోజు మాత్రం ప్రకృతి ఆ అవకాశాన్ని మీకు సులభంగా చేకూరుస్తుంది. కేవలం జాగరణ రాత్రే కాకూడదు మనం శివుడు అనేది పరమోత్తమ జ్ఞానమూర్తినే కానీ, వేరొకరిని కాదు. అందువల్లే ఈశా యోగా కేంద్రంలో మహా శివరాత్రిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. అసలు సంవత్సరమంతా ఈశా యోగా కేంద్రం మహాశివరాత్రి కోసం ఎదురుచూస్తుంది. ఇది అందరు తమ ఎరుక(్చఠ్చీట్ఛ్ఛటట)ను ఎంతో కొంతైనా ముందుకు తీసుకువెళ్ళే మహత్తర అవకాశం. ఇది జీవితం గురించిన ఆలోచనలూ, అభిప్రాయాలూ, భావావేశాలకు దూరంగా ఉండే అవకాశం. శివ అన్నా, యోగా అన్నా అదే - ఆలోచనలూ, అభిప్రాయాలూ, భావావేశాలకూ దూరంగా ఉండే ఎరుక (్చఠ్చీట్ఛ్ఛటట)! ఈ మహాశివరాత్రి కేవలం జాగరణ రాత్రి కాకుండా, మిమ్మల్ని సచేతనత్వం, ఎరుకలతో నింపేది కావాలని, ప్రకృతి ఈరోజు మనకు ఇచ్చే ఈ మహత్తర అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తాను. మీరందరూ ఉప్పొంగే ఈ శక్తితరంగం ఆలంబనగా శివ అన్న శబ్దంలోని పారవశ్యాన్నీ, రమణీయతనూ తెలుసుకుంటారని ఆశిస్తాను. సాక్షి పాఠకులకు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు, ఆయా సందర్భాలలో కలిగే వివిధ సందేహాలకు సద్గురు జగ్గీవాసుదేవ్ సమాధానాలిస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సందేహాలను స్పష్టంగా కవర్ లేదా పోస్ట్‌కార్డ్ మీద రాసి పంపడమే! చిరునామా: సద్గురు సమాధానాలకోసం సన్నిధి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34 ఈ మెయిల్: sadgurusakshi@gmail.com -
బుధవారం నుంచి మినీ మేడారం జాతర
వరంగల్: మాఘశుద్ధ పౌర్ణమిరోజున గిరిజనలు సాంప్రదాయబద్దంగా జరిపే మినీ మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ జాతర కోసం గిరిజన పూజారులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి జంపన్న చెట్టును పూజిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. గిరిజనుల ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవార్లకు మేకలు, కోళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మామూలుగా గిరిజన పూజారులు పాల్గొనే ఈ జాతరలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం విశేషం. -
సూపర్ మూన్ అదిరింది..
పూర్ణ చంద్రుడు.. ముందు కన్య మరియ విగ్రహం.. ఫొటో అదిరిపోయింది కదూ.. సోమవారం రాత్రి అమెరికాలోని సౌత్ బెండ్లో ఉన్న నోట్రె డామ్ వర్సిటీ భవనంపై ఉన్న కన్య మరియ విగ్రహం వెనక సూపర్ మూన్ కనిపించి అందరినీ అలరించింది. -
వెన్నెల్లో వెంకన్న
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమల: తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడ సేవ భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు ప్రత్యేకంగా గరుడసేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలో సాయంత్రం నిత్య కైంకర్యాలు ముగించుకున్న మలయప్పస్వామిని వాహన మండపంలో వేంచేపు చేశారు. పుష్పమాలలు, బంగారు, వజ్రవైఢూర్య మరకత మాణిక్యాదులతో కూడిన ఆభరణాలను ఉత్సవమూర్తికి విశేషంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, పండితుల వేద ఘోష, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వాహన ఊరేగింపును రాత్రి 7 గంటలకు ఆరంభించారు. సంగీత ధ్వనుల్లో, చల్లటి గాలుల నడుమ గరుడుడిపై ఊరేగుతూ మలయప్ప స్వామివారు భక్తకోటికి దర్శన భాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి గరుడసేవను వీక్షించలేని భక్తులు శనివారం జరిగిన పౌర్ణమి గరుడ వాహనాన్ని కనులారా వీక్షించి సర్వాలంకార భూషితుడైన స్వామిసేవలో తరించారు. శనివారం గురుపౌర్ణమి కావడంతో ఉత్సవానికి విశిష్టత మరింత పెరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, విజిలెన్స్ అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఇతర అధికారులతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.