
Rare Blue Moon Tonight Timings: నేడు రాత్రి ఆకాశంలో అద్బుతం చోటుచేసుకొనుంది. మన సమీప ఉపగ్రహమైన చంద్రుడు నేడు రాత్రి నీలి వర్ణంలో కనువిందు చేయనున్నాడు. నేడు ఆకాశం స్పష్టంగా ఉంటే నీలిరంగు చంద్రుడిని చూడవచ్చునని అమెరికన్ ఆస్ట్రోనామికల్ సోసైటి వెల్లడించింది. స్కై అండ్ టెలిస్కోప్ మ్యాగజైన్ ప్రకారం ప్రతి 2.7 సంవత్సరాలకు ఒకసారి నీలిరంగులో చంద్రుడు కన్సించనున్నాడు. భారత్‌లో ఈ ఖగోళ అద్భుతాన్ని రాత్రి సుమారు 12.00 గంటల ప్రాంతంలో చూడవచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
చదవండి: Google: ఆ స్మార్ట్‌ఫోన్లు ఇకపై కనిపించవు...!
మరల ఈ బ్లూమూన్ చూడాలంటే 2024 ఆగస్టు వరకు వేచి చూడాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా బ్లూమూన్ తొలిసారిగా 1528 సంవత్సరం నుంచి గమనించడం మొదలు పెట్టింది. సాధారణంగా ఒక సీజన్‌లో మూడు పౌర్ణములు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నాలుగు పౌర్ణములు కూడా ఉంటాయి.. ఈ నాలుగు పౌర్ణములు ఉన్న సమయంలో వచ్చే మూడో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం.. రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా, మరొకటి సీజనల్‌గా వచ్చే బ్లూమూన్.ఒక నెలలో రెండు పౌర్ణములు వస్తే అందులో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు.
నీలిరంగు వర్ణంలో చంద్రుడు ఎప్పుడు కన్పిస్తాడంటే...
ఈ రోజు ఆకాశంలో చంద్రుడు మనకు సాధారణంగా రోజు వారి లాగే కన్పిస్తాడు. కాగా నీలివర్ణంలో చంద్రుడు కన్పించాలంటే దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి. అగ్ని పర్వతాలు పేలినప్పుడు, దట్టమైన కార్చిచ్చు నుంచి వచ్చే దుమ్ము, దూళి పొగలతో చంద్రుడు నీలిరంగు వర్ణంలో కన్పిస్తాడు.
(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!)