న్యూఢిల్లీ: బాల్యంలో ఆరుబయట వెన్నెల్లో పడుకుని.. చందమామను చూస్తూ.. చుక్కల్ని లెక్కపెడుతూ.. అలా అలా ఎప్పుడు నిద్రలోకి జారుకునే వాళ్లమో తెలిసేది కారు. కానీ ఇప్పటి పిల్లలకు ఇవేం తెలియవు. స్మార్ట్‌ఫోన్‌తోనే శుభోధయం.. దానితోనే నిద్ర. ఇక చందమామ, నక్షత్రాలు లెక్కించడం వంటి సరదాలు కల్లే. ఇక పట్టణాల్లో ఉండే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. రోజు ఎలా ఉన్నా కానీ ఈ రోజు మాత్రం కాస్త తీరిక చేసుకుని ఓ సారి ఆకాశం వైపు చూడండి.. మీరో తేడాని గమనిస్తారు. ఏంటి అనుకుంటున్నారా అక్టోబర్ 31 రాత్రి ‘బ్లూ మూన్’ దర్శనమియనుంది. అంటే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడా ఏంటి అనే డౌట్ వద్దు. రోజు చూసే వర్ణంలోనే ఉంటాడు. కాకపోతే ఈ రోజు మరి కాస్త పెద్దగా.. ఎక్కువ ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. చంద్రుడు ఇలా భారీ సైజులో ఏడాదికి 12 సార్లు కనిపిస్తాడు.
బ్లూ మూన్ పేరేలా వచ్చింది..
చంద్రుడు ఏడాదికి 12 సార్లు పెద్దగా దర్శనమిస్తాడని చెప్పుకున్నాం కదా.. అలా ప్రతి పూర్ణ చంద్రుడుకి ఒక పేరు పెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో మూడవ పౌర్ణమికి ‘బ్లూ మూన్’ అనే పేరు వచ్చింది. నెలలో వచ్చే రెండో పౌర్ణమికి ఇలా ప్రత్యేకమైన పేరు ఉందనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం సీజనల్ బ్లూ మూన్, నెలవారీ ‘బ్లూ మూన్’ ఉన్నాయి. ఈ రోజు దర్శనమిచ్చే బ్లూ మూన్ నెలవారీది. (చదవండి: చందమామ నీటి కుండ.. జాబిల్లిపై నీరుందట!)
బ్లూమూన్ వెనక మరో కథ..
ఈ పేరు వెనక మరో కథ ఉంది. ఒకానోక ‘బ్లూ మూన్’ అనే పదబంధం నుంచి ఇది పుట్టిందని సమాచారం. నాసా ప్రకారం 1883 ఇండోనేషియాలోని క్రాకాటోవా అనే అగ్ని పర్వతం పేలి భారీ ఎత్తును వెలువడిన బూడిద ఆకాశంలోకి చేరింది. ఈ బూడిద మేఘాలలోని కణాలు చంద్రునిలోని ఎరుపు రంగును చెదరగొట్టాయి. దాంతో చందమామ నీలం రంగులో దర్శనమిచ్చింది. దీన్ని నాసా అరుదైన ఘటనగా పేర్కొంది. అప్పటి నుంచి ‘బ్లూ మూన్’ పదం వాడుకలో ఉందని సమాచారం.
సాధారణంగా సంవత్సరంలో 12 పూర్తి చంద్రులను చూస్తాము. ప్రతి నాలుగు సీజన్లలో మూడు. ఏదేమైనా, ప్రతి పౌర్ణమికి 29.5 రోజులు గడువు ఉంటుంది. దీని అర్థం చంద్రుడు 12 పౌర్ణములను పూర్తి చేయడానికి 354 రోజులు పడుతుంది. సంవత్సరంలో మిగిలిపోయిన రోజులన్నింటిని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కలుపుతారు. ఫలితంగా ఒక ఏడాదిలో 13 పూర్తి చంద్రులు కనిపిస్తారు. ఈ 'అదనపు' పౌర్ణమి అరుదైన సంఘటన కాబట్టి దీనిని కూడా ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. ఇక ఈ రోజు చంద్రుడు నీలంగా కనిపించడు. రోజుకంటే పెద్దగా, ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. అయితే ‘బ్లూ మూన్’ కూడా కనిపించే అవకాశం ఉంది. ఇది జరగడానికి కాంతి కిరణాలను సరైన పద్ధతిలో వక్రీభవించే కొన్ని వాతావరణ పరిస్థితులు అవసరం. ఇక అక్టోబర్ 31 బ్లూ మూన్ రాత్రి 8:15 గంటల తర్వాత పూర్తి ప్రకాశవంతంగా ఉంటుంది. అలానే చంద్రుడి ప్రక్కన ప్రకాశవంతమైన ఎరుపు 'స్టార్రి' వస్తువును గమనిస్తారు. ఇది నక్షత్రం కాదు, మన పొరుగున ఉన్న మార్స్. (చదవండి: చందమామ అందివచ్చిన రోజు)
ఇతర పూర్తి చంద్రులు ఏమిటి?
మేము ఇంతకు ముందు వివరించినట్లుగా.. చంద్రుడికి ఇలా ప్రత్యేకంగా పేర్లు పెట్టడంపై ఎలాంటి సమావేశం లేదు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, ఇవి ప్రస్తుతం జనాదరణ పొందిన పౌర్ణమి పేర్లు:
జనవరి: వోల్ఫ్ మూన్
ఫిబ్రవరి: స్నో మూన్
మార్చి: వార్మ్ మూన్
ఏప్రిల్: పింక్ మూన్
మే: ఫ్లో మూన్
జూన్: స్ట్రాబెర్రీ మూన్
జూలై: బక్ మూన్
ఆగస్టు: స్టర్జన్ మూన్
సెప్టెంబర్: హార్వెస్ట్ మూన్
అక్టోబర్: హంటర్స్ మూన్
నవంబర్: బీవర్ మూన్
డిసెంబర్: కోల్డ్ మూన్
Comments
Please login to add a commentAdd a comment