mars
-
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nasa: మార్స్‌పై హెలికాప్టర్ క్రాష్
కాలిఫోర్నియా: అంగారకుని(మార్స్)పై అమెరికా అంతరిక్ష పరిశోపధన సంస్థ నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ మూడేళ్ల ప్రస్థానం ముగిసింది. అంగారకునిపై ఈ నెల 18న చివరిసారిగా ఎగిరి ల్యాండ్ అయ్యే సమయంలో రోటర్ చెడిపోయి మినీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ మినీ హెలికాప్టర్ ప్రయాణం ముగిసిందని నాసా అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్‌లో మార్స్‌పై ల్యాండ్ అయినప్పుడు తొలుత హెలికాప్టర్ 30 రోజులు పనిచేస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అది 3 సంవత్సరాల పాటు పనిచేసి మార్స్‌పై 14 సార్లు ఎగరగలిగింది. సౌరవ్యవస్థలో సరికొత్త ఏవియేషన్ ప్రయోగాలకు ఇన్‌జెన్యూటీ నాంది పలికింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను ప్రిజర్వెన్స్ రోవర్ ఆపరేట్ చేసింది. ఇదీచదవండి.. మూన్ ష్నైపర్ శీర్షాసనం -
‘మార్స్ ’ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిలో మొదటిది దాని ఉపరితలం నిర్మాణంతో ముడిపడి ఉంది. కాగా ఐరన్ ఆక్సైడ్ ఉనికిని రస్ట్ అని అంటారు. ఆక్సిజన్‌తో పాటు తేమకు చేరువైనప్పుడు భూమిపై ఉన్న ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. ఇదేవిధంగా మార్స్‌పై ఇనుము ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అంగారక గ్రహం నేల, రాళ్ళకు విలక్షణమైన ఎరుపు రంగు సంతరించుకుంటుంది. భూమితో పోలిస్తే మార్స్ బలహీనమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్కడి వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కూడి ఉంటుంది. ఈ బలహీన వాతావరణంలో సూర్యరశ్మి భిన్నంగా వెలువడుతుంది. సూర్యరశ్మి అంగారకుని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వలన కాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఆకుపచ్చ వంటివి) ఎక్కువ వెదజల్లుతాయి. ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరుపు, నారింజ వంటివి) ప్రబలంగా మారతాయి. ఇదే అక్కడి ఎరుపు రంగుకు కారణం. మార్స్ చరిత్రలో గణనీయమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగాయి. ఈ విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు కూడా గ్రహం రంగుకు దోహదం చేస్తాయి. అంగారక గ్రహంపై ఉన్న కొన్ని అగ్నిపర్వత పదార్థాలు, వాతావరణం మారినప్పుడు ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. అంగారక గ్రహంపై భారీగా దుమ్ము తుఫానులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మ ధూళి కణాలతో నిండిన ఈ తుఫానులు, సూర్యరశ్మి వెదజల్లినప్పుడు మార్స్కున్న ఎరుపు రూపాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ఈ రంగు ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అక్కడి ఎరుపురంగు దోహదపడుతుంది. ఇది కూడా చదవండి: దోమలను ఎవరు ఇష్టంగా తింటారు? -
రాష్ట్రంలో మార్స్ గ్రూప్ పెట్టుబడి మరో రూ.800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో పేరొందిన ‘మార్స్ గ్రూప్’తెలంగాణలో మరో రూ.800 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో శుక్రవారం మార్స్ చీఫ్ డేటా, అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. సిద్దిపేటలో ఇప్పటికే తమ పెంపుడు జంతువుల (పెట్స్) ఫుడ్ తయారీ ప్లాంట్ ద్వారా కార్యకలా పాలు నిర్వహిస్తున్నట్లు ఆ బృందం వెల్లడించింది. మొదట కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి, ఆ తర్వాత మరో రూ.500 కోట్లతో విస్తరించామని పేర్కొంది. తాజాగా మరో రూ.800 కోట్లతో విస్తరణ ప్రణాళికను చేపడతామని మార్స్ గ్రూప్ ప్రతినిధి బృందం వెల్లడించింది. పెట్ కేర్, పెట్ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కేవలం తయారీకే కాకుండా పరిశోధన, అభివృద్ధి తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను ఈ బృందం వివరించింది. కొత్త పెట్టుబడులు, విస్తరణలకు ప్రాధాన్యత కొత్త పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించిన మార్స్ గ్రూప్ పెట్టుబడులు విడతల వారీగా రూ.1500 కోట్లకు చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..
అంగారక గ్రహంపై మానవుని ఆవాసానికి యోగ్యమైనదా? కాదా అనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నీటి జాడలు ఉన్నాయా లేదా ఒక వేళ ఉండాల్సి వచ్చినా అనువుగా ఉంటుందా లేదా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనులు చేశారు. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు తాజగా ఆ గ్రహంపై ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ వెల్లడించారు. జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మార్స్‌పై కాలనీని 22 మంది వ్యోమగాములతో నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేలా ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ కూడా చెప్పారు. తాము ఎన్నో యేళ్లుగా చేస్తున్న అధ్యయనాల్లో.. మానవ స్థావరాన్ని నిర్మించడం చాలా క్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్య అని తేలిందన్నారు. వనరులు పరిమితంగా ఉన్నందునన ఈ గ్రహంపై ఆవాసం నిర్మించడం అనేది సవాలుతో కూడినది. అయితే అక్కడ ఎంతమంది వ్యోమోగాములు ఆవాసాలను నిర్మించగలరు, ఎంతమంది ఉండొచ్చు అనేదానిపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనాల్లో దాదాపు 22 మంది వ్యోమగాములతో కాలనీ నిర్మించొచ్చని, అలాగే సుమారు 100 నుంచి 500 మంది దాక ఉండొచ్చని గుర్తించారు. దీనివల్ల భవిష్యత్తులో వలసవాద సమస్య గానీ, మానవ వికృతి ప్రవర్తనకు సంబంధించిన సవాళ్లు గానీ ఎదరయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గట్టిగా హెచ్చరించారు. అంగారక గ్రహంపై ఏ ప్రాంతంలో కాలనీలు నిర్మించాలనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రహంపై మానవ మనుగడను అంచనా వేసేందుకు ఏజెంట్-బేస్డ్ మోడలింగ్ అనే కంప్యూటర్ అనుకరణను ఉపయోగించారు. అక్కడ ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని తట్టుకుని జీవించగలిగే మానవుల మనసతత్వాలను గూర్చి కూడా ఈ కంప్యూటర్ వెల్లడించింది. "న్యూరోటిక్" మనస్తత్వం కలవారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, "పరిస్థితులను అంగీకరించదగిన" వ్యక్తిత్వ గల వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తమ పరిశోధనల్లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! వీడియో వైరల్) -
కుజునిపై జీవముండేదా?
కుజ గ్రహం మీద పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ తాజాగా కీలకమైన విశేషాలను సేకరించింది. కుజుని ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది. ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఆ పగుళ్లను ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపింది. వాటిని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పోయే తడి, పొడి ఆవర్తనాలకు సూచికలైన ఈ తరహా పగుళ్లు జీవం పుట్టుకకు అత్యంత అనుకూలమని చెబుతారు. ..ఎండా, వానా కాలాలు కుజ గ్రహంపై అత్యంత పురాతన కాలం నాటి బురదమయమైన పగుళ్లను క్యూరియాసిటీ రోవర్ కనిపెట్టింది. షట్కోణాకృతిలోని ఆ పగుళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. వీటిని తొలినాటి కుజునిపై తడి, పొడి ఆవర్తనాల తాలూకు ఆనవాళ్లుగా భావిస్తున్నారు. జీవం పుట్టుకకు ఇవి అత్యంత కీలకమే గాక ఎంతో అనుకూలం కూడా. భూమిపై మాదిరిగా కుజునిపై క్రమానుగతంగా తడి, పొడి ఋతువులు, మరోలా చెప్పాలంటే వేసవి, వానాకాలాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ పోతూ ఉండేవనేందుకు ఈ ఆవర్తనాలు నిదర్శనమని పరిశోధనకు సారథ్యం వహించిన విలియం రేపిన్ అభిప్రాయపడ్డారు. మట్టి పొర, లవణ ఖనిజాలతో సమృద్ధమైన వాటి పై పొరల మధ్య జోన్లో ఈ చక్రాలను కనిపెట్టారు. బురద ఎండిపోయినకొద్దీ కుంచించుకుపోయి, పగుళ్లిచ్చి టీ ఆకారపు జంక్షన్ మాదిరిగా ఏర్పడ్డాయి. పదేపదే నీరు పారిన మీదట వై ఆకృతిలోకి, అంతిమంగా షట్కోకోణాకృతిలోకి మారి గట్టిపడ్డాయి. భూమ్మీద మాదిరిగానే ఎండా, వానా కాలాలు క్రమం తప్పకుండా వచ్చేవని కచ్చితంగా చెప్పవచ్చని రేపిన్ చెప్పారు. ‘పైగా భూమి మాదిరిగా కుజునిపై టెక్టానిక్ ఫలకాలు లేవు. కనుక ఆ గ్రహం తాలూకు పురాతన చరిత్ర సురక్షితంగా ఉంది’అని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. జీవం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ ఇంత సురక్షితంగా ఉన్న కుజుని వంటి గ్రహం భూమికి ఇంత సమీపంగా ఉండటం ఒక రకంగా మన అదృష్టం. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో ఇదో పెద్ద ముందడుగు కాగలదు’ – విలియం రేపిన్, పరిశోధన సారథి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలానూ... ఇలా అయినవేంది!!
ఏఐ ఆర్టిస్ట్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సదరు నౌఫాల్ ఆనే ఏఐ ఆర్టిస్ట్ తన ఆర్ట్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను అమెరికా నుంచి ముంబైకి తీసుకువచ్చి ఛాయ్‌వాలాగా మార్చాడు. ఈ ‘చాయివాలా–ఎలాన్ మస్క్’ ఇమేజ్ అంతర్జాల లోకంలో తెగ వైరల్ అయింది. ట్విట్టర్లో వేగంగా రెండు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతర్జాల లోకవాసులు ఒకరిని మించి ఒకరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎలాన్... ఏమైనా చేయగలడు!’, ‘ఏఐ టెక్నాలజీతో గరం ఛాయ్ తయారుచేస్తున్నాడు!’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. మరో ఏఐ ఆర్టిస్ట్ ఎలాన్‌ను ఏకంగా బేబీగా మార్చేశాడు. ‘బ్రేకింగ్న్యూస్: ఎలాన్ మస్క్ యాంటీ ఏజీంగ్ ఫార్ములాపై పనిచేస్తున్నాడు. దాని ఫలితమే ఈ ఫొటో’ అనే కాప్షన్ ఆకట్టుకుంటోంది. ‘మార్స్ పైకి వెళ్లడానికి మస్క్‌కు ఇప్పుడు బోలెడు సమయం దొరికింది’... అని ఒకరు కామెంట్ పెట్టారు. -
‘అంగారకుడి’పై ఏడాది పాటు జీవనం.. ఎవరామె?
అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఈలోపు అలాంటి వాతావరణమే భూమ్మీద సృష్టించి.. మనుషుల మీద ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఓ మహిళా సైంటిస్ట్ ఏడాదిపాటు అంగారకుడి వాతావరణంలో గడపనుంది. కెనడియన్ జీవ శాస్త్రవేత్త 52 ఏళ్ల కెల్లీ హాస్టన్కి మార్స్(అంగారకుడు)పై జీవించడం అనేది ఆమె చిన్ననాటి కల అట. అది ఇప్పుడూ ఆనుకోని విధంగా నెరవేరనుంది. ప్రస్తుతం హాస్టన్ అందుకోసం సన్నద్ధమవుతోంది. అంగారక గ్రహంపై వాతావరణాన్ని తట్టుకునేలా కసరత్తులు శిక్షణ తీసుకుంటోంది. జూన్ చివరి వారంలో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో మార్టిన్ నివాస స్థలంలోకి(అంగారకుడిపై మాదిరి పరిస్థితులే ఉంటాయక్కడ) అడుగుపెట్టనున్నారు. అయితే.. ఆమె అక్కడికి ఒంటరిగానే వెళ్లడం లేదు. కూడా నలుగురు వాలంటీర్లు ఉంటారు. భవిష్యత్తులో వివిధ వైవిధ్య పరిమిత వాతావరణంలో మానువుడి ఎదుర్కొనగల సామార్థ్యాన్ని అంచనా వేసేందుకు, అంతరిక్షంలో మానవుడి జీవనం గురిచి అధ్యయనం చేసేందుకు ఈ మిషన్ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు నాసా పేర్కొంది. ఇందులో గడిపే వారు అనేక రకాల సవాళ్ల తోపాటు, నీటి పరిమితులు ఎదుర్కొనక తప్పదని స్పేస్ ఏజెన్సీ హెచ్చరించింది. అలాగే బయట ప్రపంచం కమ్యూనికేషన్ ఉండదు. భూమి, అంగారకం గ్రహం మధ్య జీవన వ్యత్యాసం తెలియడమే గాక పరిస్థితులను తట్టకుని జీవింగలమా లేదన్నది అవగతమవుతుందని నాసా వెల్లడించింది. ఈ మార్స్(అంగారక గ్రహం)పై ఉండేందుకు మార్స్ డ్యూన్ అల్ఫాగా పిలిచే ఒక నివాస స్థలం ఉంటుంది. మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలచే త్రీడీ ప్రింటెడ్ 1700 చదరపు అడుగుల నివాస స్థలం, బెడ్రూమ్లు, వ్యాయామశాల తదితర సౌకర్యాలు ఉంటాయి. హాస్టన్కి నాసా నుంచి ఈ అవకాశం వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవడం తదితరాలు వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు ఈ మిషన్‌లో ఆమె తోపాటు నలుగురు సభ్యులు ఆహారాన్ని పండించుకునేలా పొలం అన్ని ఉంటాయి. ఎయిర్ లాక్ చేయబడిన గదిలో అంతరిక్షంపై నడిచే విధానాన్ని ప్రాక్టీస్ చేయడమే గాక, సూట్‌ని ధరించగలిగి ఉండేలా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. మార్స్‌లోకి ప్రయాణించే వారిలో తాను ఉన్నట్లు నిర్థారించగానే ఆమె ఆనందానికి వదలి లేకుండా పోయింది,. తనతోపాటు అక్కడ ఒక ఇంజనీర్, ఎమర్జెన్సీ డాక్టర్, నర్సు ఉంటారు. నాసా ఎంపిక చేసిన ఆయా వ్యక్తులు ఒకరికొకరూ పరిచయమే లేదు. అయితే మార్స్ కోసం హ్యూస్టన్ నివాస స్థలంలో ఉండనున్న హౌస్మేట్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం అనేది అత్యంత కీలకం. అలాగే అక్కడ గ్రహంపై గడిపే వారు తమ వ్యక్తిగత సమస్యలను పక్కనబెట్టి మరీ మిగతా హౌస్‌మేట్స్‌తో బ్యాలెన్స్ చేసుకుంటూ గడపాల్సి ఉంది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా అన్ని రోజులు ఉండగలమా? అనేది అత్యంత ఆందోళన కలిగించే అంశం. కేవలం ఈమెయిల్‌తోనే తన కుటుంబసభ్యులతో టచ్‌లో ఉండాల్సిందే. ఈ ప్రయోగాత్మక మిషన్ చాపే(క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్) పేరుతో నాసా ప్లాన్ చేసింది. ఇదిలా ఉండగా, అంగారక గ్రహంపై ఏడాది పాటు జీవించగలిగే మిషన్‌ని 2015-2016లో హవాయిలోని నివాస స్థలంలో ప్రారంభం కానుంది. అమెరికా 2030 చివరినాటి కల్లా అంగారక గ్రహంపై యాత్రకు సిద్ధం చేసే ప్రయోగంలో భాగంగా సుదీర్ఘకాలం అక్కడ ఎలా జీవించగలం అనే దానిపై మిషన్ ప్రయోగాలు నిర్వహిస్తోంది. అంతేగాదు మానవులను చంద్రునిపైకి పంపే యోచన కూడా చేస్తున్నట్లు నాసా పేర్కొంది. కాగా, అంగారకుడి గ్రహంపై జీవించనున్న కెల్లీ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, నిజంగా అంగారకుడి వద్దకు వెళ్తున్నానా అని ఎగ్జైట్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్ క్లినిక్‌పై క్షిపణి దాడి..) -
ఆ గ్రహంపై బంగాళ దుంప పిండి, ఉప్పుతో ఇళ్లు కట్టుకోవచ్చు.. అసలు మ్యాటర్ ఇదే!
భూమిపై రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడి వనరులు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇతర గ్రహాలపై మానవ నివాసం కోసం అన్వేషణ సాగుతోంది. అయితే భూమి కాకుండా మానవులు నివసించడానికి అనువుగా ఉండే మరో గ్రహం ఏదైనా ఉందా అంటే.. వెంటనే వచ్చే సమాధానం అంగారకుడు (Mars). మరి ఒకవేళ మార్స్‌పై నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలి? ఇలా అనేక అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఇందుకోసం వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని ఇందుకోసం వాడుకోవచ్చని సైంటిస్ట్‌ల పరిశోధనల్లో తేలింది. వ్యోమగాములందరూ రక్తాన్ని ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే అదే అంతరిక్ష నిర్మాణాలకు ఉపయోగపడే దృఢమైన ఇటుకలను ఇటీవల మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటి తయారీకి వారు వాడిన పదార్థాలను తెలుసుకుంటే, ఎవరైనా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణ కాంక్రీట్ దారుఢ్యం గరిష్ఠంగా 70 ఎంపీఏ వరకు ఉంటే, మాంచెస్టర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఇటుకల దారుఢ్యం 72 ఎంపీఏ వరకు ఉండటం విశేషం. అంతరిక్ష ధూళి, బంగాళ దుంపలు, ఉప్పు సహా వివిధ పదార్థాల సమ్మేళనంతో తయారు చేసిన కాంక్రీట్ తరహా పదార్థాన్ని ఉపయోగించి ఈ ఇటుకలను తయారు చేశారు. ఇటుకల తయారీకి ఉపయోగించిన ఈ పదార్థానికి వారు ‘స్టార్‌క్రీట్’గా నామకరణం చేశారు. దీనిని ‘కాస్మిక్ కాంక్రీట్’గా కూడా అభివర్ణిస్తున్నారు. అత్యంత దృఢమైన కాంక్రీట్ తయారీలో భాగంగా వీరు చంద్రుడి ధూళిని ఉపయోగించి తయారు చేసిన ఇటుకల దారుఢ్యమైతే ఏకంగా 91 ఎంపీఏ పైగానే ఉంది. తమ ప్రయోగాలు విజయవంతమైతే, ప్రపంచంలోనే అత్యంత దృఢమైన కాంక్రీట్‌ను రూపొందించగలమని మాంచెస్టర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
‘స్పేస్’లో ఇళ్లకు రిహార్సల్‌గా భూమిపై త్రీడీ ప్రింటింగ్ హోటల్
ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్‌గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో విశాలమైన హోటల్‌ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? భవిష్యత్తుకు బాటలు వేసేలా.. మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్‌లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఏమిటీ హోటల్ ప్రత్యేకతలు? ► ఈ హోటల్లో త్రీడీ విధానంలో ప్రింట్ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్ పూల్, స్పా, ఆరుబయట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. ► దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్లు, బాత్రూమ్లతో ఆ ఇళ్లు ఉంటాయి. ► గుండ్రటి నిర్మాణాలు, డోమ్‌లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్లు, టేబుల్స్ వంటి కొంత ఫర్నిచర్‌ను కూడా త్రీడీ విధానంలోనే ప్రింట్ చేయనున్నారు. ► చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపోయేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. ► ఎడారిలో క్యాంపింగ్ సైట్‌గా ఉన్న ప్రాంతంలో ప్రింట్ చేస్తున్న ఈ హోటల్‌కు ‘ఎల్ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్ హోటల్ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. ► ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ ‘బిగ్ (బ్జర్కే ఇంగెల్స్ గ్రూప్)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్ సంస్థ త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మాణాలు చేపట్టనుంది. ఇక్కడ చేసి.. చూపించి.. ‘‘చంద్రుడు, మార్స్‌పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్‌గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ – ‘ఐకాన్’ సహ వ్యవస్థాపకుడు జేసన్ బల్లార్డ్, హోటల్ యజమాని లిజ్ లాంబర్ట్ –సాక్షి సెంట్రల్ డెస్క్ -
నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమి తులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్ టు మార్స్’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఆయన కామన్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ డివిజన్ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు. -
అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్ తయారీ
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై.. ► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు. ► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది. ► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. ► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది. ► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు. ► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిమిస్ ప్రయోగం ► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది. ► ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. ► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ► చంద్రుడి నీటి మ్యాప్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్’సైన్స్ టీమ్ సభ్యుడు కాసీ హానీబాల్ చెప్పారు. అరుణ గ్రహంపై జల సవ్వడి! అంగారక గ్రహం (మార్స్)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు. ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంగారకుడిపై సూర్యకిరణాలు.. ఇదే తొలిసారి!
వాషింగ్టన్: ఫొటోలో కనిపిస్తున్నవేమిటో తెలుసా? అంగారకునిపై కనువిందు చేస్తున్న సూర్య కిరణాలు. కుజ గ్రహంపై సూర్య కిరణాలు మన కంటపడటం ఇదే తొలిసారి! మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది. దిగంతాల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్న క్రమంలో మేఘాలన్నింటినీ ప్రకాశవంతం చేస్తున్న తీరును ఫొటోలో గమనించవచ్చు. కుజునిపై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు, మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా. కుజ గ్రహాన్ని వాసయోగ్యం చేసుకుని అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేంద్రంగా మార్చుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడి వాతావరణం, దాని కూర్పు, ఇతర స్థితిగతులను తెలుసుకోవడానికి దాని మేఘాలను విశ్లేషించడం కీలకం. -
‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి..
మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల్లో వ్యోమనౌకలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ‘లోఫ్టిడ్ (లోఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్)’ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాలోని కాలిఫోరి్నయా నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘అట్లాస్ వి’ రాకెట్ ద్వారా గురువారం తెల్లవారుజామున 4.49 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు) ఓ వాతావరణ ఉపగ్రహంతో కలిపి లోఫ్టిడ్ను ప్రయోగించారు. Photo credit: NASA గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి. అట్లాస్ వి రాకెట్ మొదట వాతావరణ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. కాసేపటికి ‘లోఫ్టిడ్’ను భూమివైపు వదిలేసింది. వెంటనే ‘లోఫ్టిడ్’ తిరగేసిన గొడుగులా విచ్చుకుని.. గంటకు 20 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమివైపు ప్రయాణం మొదలుపెట్టింది. వాతావరణ ఘర్షణతో దాని వేగం తగ్గుతూ వచ్చింది. భూఉపరితలానికి కొద్దివేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అందు లోని పారాచూట్ విచ్చుకుని.. హవాయి లోని హొనొలులు దీవులకు తూర్పున పసి ఫిక్ మహా సముద్రంలో ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం.. గురు వారం సాయంత్రం 5.04 గంటలకు భూమివైపు ప్రయాణం ప్రారంభించిన హీట్ షీల్డ్.. 5.38 గంటలకు ల్యాండ్ అయింది. ఆ స్థలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్’ను రికవరీ చేసేందుకు కహనా–2 అనే నౌకను పంపారు. ఈ నౌక ‘లోఫ్టిడ్’ను తీసుకుని తిరిగి కాలిఫోరి్నయా తీరానికి చేరేందుకు రెండు రోజులు పడుతుందని అంచనా. తర్వాత శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్’లోని సెన్సర్లు రికార్డు చేసిన డేటాను అధ్యయనం చేసి.. ఎంత వేగంతో దిగింది? ఎంత ఉష్ణోగ్రత పుట్టింది? వాతావరణ పరిస్థితులను ఎంతమేర తట్టుకోగలిగిందన్న వివరాలను పరిశీలించనున్నారు. అంగారక వాతావరణానికి తగినట్టుగా మార్చేందుకు.. భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం పలుచగా ఉంటుంది. అందువల్ల అక్కడి వాతావరణం ఘర్షణ కూడా తక్కువ. అందువల్ల వ్యోమనౌకలను ఏ వేగంతో, ఎలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ చేయాలి, వేగం తగ్గించేందుకు ఏం చేయాలి, ‘లోఫ్టిడ్’లో అందుకు తగినట్టుగా ఎలాంటి మార్పు చేర్పులు అవసరమన్నది శాస్త్రవేత్తలు నిర్ధారించనున్నారు. ఈ మొత్తం డేటా ఆధారంగా ఇన్‌ఫ్లాటబుల్ హీట్ షీల్డ్‌కు తుదిరూపు ఇచ్చి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించనున్నారు. -
ఫ్లయింగ్ సాసర్లా కనిపించే.. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్.. ప్రయోజనాలు ఇవే
అంతరిక్ష ప్రయోగాలు అంటేనే ఎంతో క్లిష్టమైనవి. అందులోనూ మనుషులు స్పేస్‌లోకి వెళ్లే ప్రయోగాలు మరింత రిస్క్. పెద్ద ఎత్తున రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఏ చిన్న లోపమున్నా భారీ ప్రమాదం తప్పదు. పైగా మార్స్‌పైకి మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో స్పేస్ షిప్‌లు.. మార్స్‌పై దిగేప్పుడు పుట్టే వేడిని తట్టుకోవడానికి, మెల్లగా ల్యాండ్ కావడానికి వీలయ్యే రక్షణ ఏర్పాట్లు కావాలి. ఈ క్రమంలోనే నాసా ఫ్లయింగ్ సాసర్లా కనిపించే ఓ ప్రత్యేక ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను రూపొందించింది. బుధవారం దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ హీట్ షీల్డ్ ఏంటి, దాని ప్రాధాన్యత, భవిష్యత్తులో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వాతావరణం ఘర్షణ నుంచి.. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు, వ్యోమనౌకలు గంటకు 25 వేల కి.మీ.కిపైగా వేగంతో ప్రయాణిస్తుంటాయి. తిరిగి భూవాతావరణంలోకి వచ్చేప్పుడూ అంతే వేగంతో ప్రవేశిస్తాయి. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల వాటి ఉపరితలంపై వేల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పుడుతుంది. దీనిని తట్టుకునేందుకు రాకెట్లు, స్పేస్ షిప్‌ల ఉపరితలంపై హీట్ షీల్డ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిరామిక్ టైల్స్ వాడతారు. మార్స్‌పైకి వెళ్లాలంటే.. భూమితోపాటు అంగారకుడు (మార్స్), శుక్రుడు (వీనస్) వంటి గ్రహాలపైనా వాతావరణం ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యోమనౌకలు మార్స్‌పై దిగాలంటే దాని వాతావరణం ఘర్షణను ఎదుర్కోవాలి. అదే సమయంలో సున్నితంగా ల్యాండింగ్ కావడం కోసం వేగాన్ని త్వరగా తగ్గించుకోవాలి. ఇప్పటివరకు చంద్రుడు, మార్స్‌పైకి రోవర్లను పంపినప్పుడు ల్యాండింగ్ కోసం ప్యారాచూట్లను వాడారు. చిన్నవైన రోవర్లకు అవి సరిపోయాయి. కానీ మానవసహిత ప్రయోగాలకు వాడే వ్యోమనౌకలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో వేడిని ఎదుర్కోవడం, వేగాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారంగా నాసా శాస్త్రవేత్తలు ‘లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్ (లోఫ్టిడ్)’ ప్రయోగాన్ని చేపట్టారు. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్ అంటే.. మొదట చిన్నగా ఉండి, కావాలనుకున్నప్పుడు గాలితో ఉబ్బి, పెద్దగా విస్తరించే ఉష్ణ రక్షక కవచం అని చెప్పుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? వ్యోమనౌకకు ముందు భాగాన ఈ ప్రత్యేక పరికరాన్ని అమర్చుతారు. మార్స్పైగానీ, భూవాతావరణంలోకిగానీ వ్యోమనౌక ప్రవేశించినప్పుడు ఇది విచ్చుకుంటుంది. వ్యోమనౌక ముందు గొడుగులా ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణం నేరుగా వ్యోమనౌకను తాకకుండా ఈ హీట్‌షీల్డ్ అడ్డుకుంటుంది. ఇది సుమారు 20 అడుగుల వెడల్పుతో ఉండటంతో వాతావరణం ఒత్తిడికి వ్యోమనౌక వేగం కూడా తగ్గుతుంది. వేగం బాగా తగ్గాక చివరన ప్యారాచూట్‌ను వినియోగిస్తారు. దీనితో సున్నితంగా ల్యాండింగ్ అవుతుంది. ప్రయోగాత్మకంగా.. సోమవారం అమెరికాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అట్లాస్–వి రాకెట్ ద్వారా మరో ఉపగ్రహంతోపాటు ‘లోఫ్టిడ్’ను ప్రయోగించనున్నారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక దీనిని భూమివైపు వదిలేస్తుంది. సుమారు గంటకు 35వేల కిలోమీటర్ల వేగంతో అది భూమివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. తర్వాత ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ఒత్తిడి ఎంత పడుతోంది? ఎంతమేర ఉష్ణోగ్రత పుడుతోందన్న వివరాలను పరిశీలించేందుకు ఇందులో ప్రత్యేకమైన సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ డేటా ఆధారంగా ‘లోఫ్టిడ్’కు తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేవలం హీట్‌షీల్డ్‌ను మాత్రమే ప్రయోగిస్తున్నారు. విజయవంతమైతే వ్యోమనౌకలకు అమర్చి పంపుతారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి చేసే అన్ని రకాల ప్రయోగాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొలంబియా ప్రమాదమే ఉదాహరణ 2003లో నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ అంతర్జాతీయ అంతరిక్షం (ఐఎస్ఎస్) నుంచి తిరిగి వస్తూ పేలిపోయింది. అందులో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు మృతిచెందారు. ఈ ప్రమాదానికి కారణం స్పేస్ షటిల్ ఎడమవైపు రెక్కపై ఉన్న హీట్ షీల్డ్ కొంతమేర దెబ్బతినడమే. అంతకుముందు స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్తున్న సమయంలోనే.. దానికి అనుబంధంగా ఉన్న రాకెట్ ట్యాంక్ ఇన్సులేటింగ్ ఫోమ్ చిన్న ముక్క విడిపోయి స్పేస్ షటిల్ రెక్కపై ఉన్న హీట్ షీల్డ్‌కు తగిలింది. హీట్ షీల్డ్‌గా అమర్చిన టైల్స్‌లో పగులు వచ్చింది. చిన్న పగులుతో.. పెద్ద ప్రమాదం కొలంబియా షటిల్ భూమికి తిరిగివచ్చేప్పుడు ధ్వని వేగానికి 20 రెట్లకుపైగా వేగంతో.. అంటే సుమారు గంటకు 25 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో 1,500 సెంటీగ్రేడ్లకుపైగా వేడి పుట్టింది. కానీ షీట్ షీల్డ్ టైల్స్‌లో పగులు కారణంగా ఆ వేడి లోపలి భాగానికి చేరి.. రెక్కలోని భాగాలు దెబ్బతినడం మొదలైంది. కాసేపటికే స్పేస్ షటిల్ పేలి ముక్కలైపోయింది. హీట్ షీల్డ్‌లో చిన్న పగులు ఉన్నా ఇంత ఘోరమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే నాసా శాస్త్రవేత్తలు.. ఇతర గ్రహాలపై దిగేప్పుడు స్పేస్ షిప్‌లకు హీట్ షీల్డ్‌గా ఉండేందుకు, అదే సమయంలో వేగాన్ని తగ్గించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడే ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను అభివృద్ధి చేస్తున్నారు. -
LOFTID: నవంబర్ 1న నాసా ‘లోఫ్టిడ్’ ప్రయోగం
వాషింగ్టన్: అంగారక గ్రహంపై(మార్స్) క్షేమంగా దిగడానికి వీలు కల్పించే ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శ్రీకారం చుడుతోంది. ఫ్లైయింగ్ సాసర్ వంటి భారీ హీట్ షీల్డ్‌ను వచ్చే నెల 1న అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికి లో–ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యన్ ఇన్‌ఫ్లాటబుల్ డిసీలరేటర్(లోఫ్టిడ్)గా నామకరణం చేసింది. అట్లాస్ వి–రాకెట్ ద్వారా లో–ఎర్త్ ఆర్బిట్‌లోకి హీట్ షీల్డ్‌ను పంపించనుంది. భవిష్యత్తులో మార్స్‌పైకి పంపించే అంతరిక్షనౌక వేగాన్ని తగ్గించి, ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఈ హీట్ షీల్డ్ తోడ్పడనుంది. -
సౌర వలయాలు
ఫొటోల్లో కన్పిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కన్పించిన సన్ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్ రోవర్ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్ 15న వాటిని నాసాకు పంపింది. సన్ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్ లేమన్ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే. ఏమిటీ సన్ హాలో...? మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కన్పించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్ రోవర్ అందించిన ఫొటోలు నిజంగా సన్ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్ హాలోయేనని తేల్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ,పేలిన స్పేస్ ఎక్స్ రాకెట్!
ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టెక్సాస్‌లో స్పేస్ ఎక్స్‌కు చెందిన సూపర్ హెవీ బూస్టర్ పేలింది. ఈ పరిణామం మస్క్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం..మార్స్పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా ఎలన్ మస్క్ పనిచేస్తున్నాడు. ఇందుకోసం సులభంగా అతి తక్కువ ఖర్చుతో మార్స్, చంద్రమండలంపై మానువుడు అడుగుపెట్టేలా రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నాడు. వాటిని ప్రయోగిస్తున్నాడు. Holy moly. Well, that was unexpected!https://t.co/dUUqw7ojRv pic.twitter.com/7IGztPuE12 — Chris Bergin - NSF (@NASASpaceflight) July 11, 2022 ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చివరి నాటికి భూకక్ష్యలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసిన 394 అడుగుల (120 మీటర్లు) సూపర్ హెవీ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ 7 ప్రోటో టైప్‌ను టెక్సాస్‌లో స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాలు జరిపే బోకా చికా ప్రాంతంలో టెస్ట్ నిర్వహించింది. ఈ ప్రయోగం జరిపే సమయంలో స్పేస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ ఒక్కసారిగా పేలి తునాతునకలైంది. Yeah, actually not good. Team is assessing damage. — Elon Musk (@elonmusk) July 11, 2022 పేలుతున్న ఆ దృశ్యాల్ని నాసా అఫిషియల్ వెబ్ సైట్ లైవ్ టెలికాస్ట్ చేయగా..పేలిన 33 రాప్టార్ ఇంజిన్లతో తయారు చేసిన రాకెట్ ఎందుకు పేలిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎలన్ మస్క్ సైతం రాకెట్ పేలుడిపై స్పందించాడు. యా. ఇది మంచిది కాదు. రాకెట్ పేలుడు నష్టాన్ని స్పేస్ ఎక్స్ టీం అంచనా వేస్తుందని ట్వీట్ చేశాడు. -
మట్టితోనే గట్టి పునాది!
భూమిని దాటేసి అంతరిక్షంలో పాగా వేయాలని.. చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. సంకల్పం బాగానే ఉన్నా.. అక్కడ ఇల్లు కట్టుకునేదెలా? భూమ్మీది నుంచి సిమెంటు, ఇటుకలు, ఉక్కు, గాజు వంటివి పట్టుకెళ్లలేం. పోనీ గట్టి ప్లాస్టిక్‌నూ తీసుకెళదామనుకున్నా అదీ కొంతే. మరి ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని గుర్తించారు. నిర్జీవమైన మట్టే.. ధూళి రూపంలో ఉండే చంద్రుడి మట్టిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. అందులోని రసాయనాలు భూమిపై ఉండే మట్టికి భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇక అంగారకుడిపైకి పంపిన రోవర్లు అక్కడి మట్టి, రాళ్లపై పరిశోధనలు చేసి..రసాయనాల శాతాన్ని పరిశీలించాయి. వీటన్నింటిపై పరిశోధన చేసిన అమెరికాకు చెందిన సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు..ఆ మట్టితో గట్టి నిర్మాణ పదార్థాన్ని రూపొందించవచ్చని తేల్చారు. బాగా వేడి అవసరం చంద్రుడు, అంగారకుడిపై మట్టికి ఉప్పు నీళ్లు కలిపి ఇటుకలు, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రణజే ఘోష్ తెలిపారు. చంద్రుడి రాళ్ల నుంచి సేకరించిన ధూళి (రిగోలిత్)ను ఉపయోగించి చేసిన ప్రయోగంలో తాము ఈ విషయాన్ని గుర్తించామని వెల్లడించారు. అయితే ఆ మట్టిని, ఉప్పు నీళ్లకు కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుందని.. దీనికి సంబంధించిన ఆ వేడిని ఉత్పత్తి చేయడం (హీట్ సోర్స్) ఎలాగనేది తేల్చాల్సి ఉందని వివరించారు. దీనికి సంబంధించి త్వరలోనే మరింత మెరుగైన పరిష్కారాన్ని కనుగొనగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
Mars Doorway: అంగారకుడి మీద ‘తలుపు’ మిస్టరీ వీడింది
అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. మార్స్ రోవర్ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయికి ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఏలియన్లు నిర్మించిందేంటూ ప్రచారం మొదలైంది. మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొందరు. ఈ తరుణంలో డోర్‌వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు. చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్ దానిని ప్రత్యేకమైన యాంగిల్లో ఫొటో తీయడం వల్లే.. అదంతా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్‌పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించింది. ఇక డోర్ తరహా బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా స్పష్టం చేస్తోంది. చదవండి: చంద్రుడిపై పచ్చదనం.. మొలకెత్తిన విత్తనాలు -
అంతరిక్షంలో ఆధిపత్య పోరు
భూమిపై దేశాల మధ్య రాజకీయాలు నింగికి పాకుతున్నాయి. పలు అంశాల్లో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా తాజాగా అంతరిక్షంలో ఆధిపత్య పోరుకు తెర తీసింది. దీంతో ఒకప్పుడు సోవియట్ యూనియన్– అమెరికా మధ్య ఉన్న పోటీ మరోమారు చైనా– యూఎస్ రూపంలో అంతరిక్షంలో కనిపించనుంది. అగ్రరాజ్య హోదా కోసం తహతహలాడుతున్న చైనా తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు అన్ని రంగాల్లో విపరీతంగా శ్రమిస్తోంది. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రాబల్యమున్న వివిధ అంశాల్లో కాలు మోపి ఉనికి చాటుకోవాలని యత్నిస్తోంది. తాజాగా అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. యూఎస్ఎస్ఆర్ (సోవియట్ రిపబ్లిక్) కుప్పకూలక ముందువరకు అమెరికాతో ఇదే తరహా పోటీ చూపేది. అయితే సోవియట్ పతనానంతరం ప్రపంచం ఏక ధ్రువ ప్రపంచంగా మారిపోయింది. సోవియట్ వదిలి వెళ్లిన ఖాళీని పూడ్చేందుకు చైనా రంగంపైకి వచ్చింది. ఈ క్రమంలో 2021లో అంతరిక్ష ప్రయోగాల పరంగా చైనా అదరగొట్టింది. గత ఏడాది చైనా మొత్తం 55 అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టగా అమెరికా 51తో సరిపుచ్చుకుంది. 2030 నాటికి కుజుడు (మార్స్)పైకి ఉపగ్రహాన్ని పంపి శాంపిళ్లను తీసుకువస్తామని తాజాగా చైనా లూనార్ ప్రోగ్రామ్ డిజైనర్ వూ వైరెన్ ప్రకటించారు. అంతటితో తమ యత్నాలు ఆగవని, సౌర వ్యవస్థలో ఇప్పటివరకు వెళ్లని దూరాలను అన్వేషిస్తామని చెప్పారు. ఇప్పటికే చైనా చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపి అక్కడి నుంచి శాంపిళ్లను విజయవంతంగా తీసుకువచ్చింది. ఇదే తరహాలో మార్స్ మిషన్ పూర్తి చేస్తామని వూ చెప్పారు. చంద్ర మిషన్‌తో పోలిస్తే మార్స్ మిషన్ క్లిష్టమైనదని, ముందుగా శక్తివంతమైన లాంచ్ వాహనాన్ని రూపొందించాల్సి ఉందని చెప్పారు. మేమే ముందు.. మార్స్‌పైకి మనిషిని పంపే ప్రణాళికకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను గత ఏడాది చైనా విడుదల చేసింది. 2033– 2043 కాలంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లు ప్రకటించింది. 2020లోనే చైనా గ్రహాంతరయానానికి తొలిమెట్టు అయిన టియాన్వెన్ –1 ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ ప్రోబ్ 2021లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. మే నెలలో ఈ ప్రోబ్ నుంచి జురాంగ్ అనే రోవర్‌ను కుజుడి ఉపరితలంపైకి దించారు. ఈ రోవర్ నిర్ధేశిత పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో రష్యా, అమెరికా తర్వాత మార్స్‌పైకి రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఈ ధైర్యంతో రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో కుజుడి ఉపరితలం నుంచి శాంపిళ్లను తెచ్చేందుకు చైనా యత్నిస్తోంది. 2020లో అమెరికా తన సొంత మార్స్ మిషన్‌ను చేపట్టింది. 2021లోనే మార్స్ పైకి అమెరికా రోవర్ దిగింది. ఇప్పటివరకు ఈ రోవర్ ఏడు శాంపిళ్లను సేకరించింది. యూరోపియన్ యూనియన్ స్పేస్ కమిషన్‌తో కలిసి ఈ శాంపిళ్లను 2031 నాటికి భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చైనా 2030లో శాంపిళ్లను తెస్తామని ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా కన్నా ముందుగా కుజుడి శాంపిళ్లను తీసుకురావడం ద్వారా అంతరిక్ష ఆధిపత్య పోరులో ముందంజలో ఉండాలన్నది చైనా భావన. అంతరిక్ష దౌత్యం ప్రస్తుతం భూమిపైన ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తోంది. దీన్ని అంతరిక్షంలోకి తీసుకుపోవాలని చైనా భావిస్తోంది. రాబోయే రోజుల్లో అంతరిక్షంపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాకు భిన్నంగా అంతరిక్ష దౌత్య మార్గం ద్వారా ఆధిపత్యం సాధించాలని చైనా యోచిస్తోంది. ఇందులో భాగంగా తన స్పేస్ ప్రోగ్రామ్స్‌లో ఇతర దేశాలకు అవకాశాలు ఇస్తోంది. చైనా నిర్మించే స్పేస్ స్టేషన్ పూర్తయితే ఇతర దేశాల వ్యోమగాములకు అవకాశాలు కల్పించడం ద్వారా పటిష్టమైన అంతరిక్ష దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలన్నది చైనా భావనగా ఆ దేశానికి చెందిన చైనా డైలీన్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. ఇది చైనాకు మంచి ప్రజాసంబంధాల వారధి (పబ్లిక్ రిలేషన్స్–పీఆర్)గా పనిచేస్తుందని తెలిపింది. అంతరిక్ష దౌత్యంలో భాగంగా చిన్న దేశాలకు కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి ఇవ్వడం, తన దగ్గర ఉన్న ఉపగ్రహ డేటాను ఆయా దేశాలతో పంచుకోవడం వంటి చర్యలను చైనా చేపట్టింది. అయితే ఇలాంటి ఆధిపత్య పోరు కన్నా గతంలో సోవియట్, అమెరికా కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించినట్లు చైనా, అమెరికా సంయుక్తంగా పనిచేయడం ప్రపంచం అంతటికీ మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాదే పైచేయి 2021లో చైనా అంతరిక్ష ప్రదర్శనల్లో అదరగొట్టింది. కానీ ఇప్పటికీ అంతరిక్షంపై అమెరికా ఆధిపత్యమే నడుస్తోంది. ప్రస్తుతం భూమి చుట్టూ దాదాపు 4,500 కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతుంటే వాటిలో 2,700 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవే ఉన్నాయి. అటు చైనా ఉపగ్రహాల సంఖ్య దాదాపు 400 మాత్రమే. అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన రాకెట్లున్నాయి. ఇటీవల కాలంలో చైనా అంతరిక్షంపై పెట్టుబడులను పెంచుతూ వచ్చింది. 2020 నాటికి ఈ రంగానికి చైనా సుమారు 890 కోట్ల డాలర్ల నిధులు కేటాయించింది. కానీ అదే సమయంలో అమెరికా అంతరిక్ష ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు ఏకంగా 4,800 కోట్ల డాలర్లు కావడం విశేషం. అమెరికాలో స్పేస్ ఎక్స్‌లాంటి పలు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షరంగ సంస్థలు ప్రభుత్వానికి దీటుగా అంతరిక్ష ప్రాజెక్టులు చేపడుతున్నాయి. చైనాలో అంతటిస్థాయి ప్రైవేటు అంతరిక్ష కంపెనీలు ఏర్పడలేదు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మరో ఐదేళ్లకు మార్స్‌పై జెండా ఎగరేద్దాం
స్పేస్ టూరిజం.. ఇప్పుడు ఇది సర్వసాధారణంగా మారిపోయింది. భూమి నుంచి 100 కిలోమీటర్లు దాటితే వచ్చే.. ఖర్మాన్ లైన్‌ను అంతరిక్షంగా ఫీలైపోతున్నారు. ఈ విషయంలో పోటీ స్పేస్‌ఏజెన్సీలకు దీటైన సమాధానమిస్తూ సిసలైన స్పేస్ యాత్రను.. అదీ సాధారణ పౌరులకు రుచి చూపించి శెభాష్ అనిపించుకున్నాడు ఎలన్ మస్క్. ఈ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు ఆసక్తికర ప్రకటన చేశాడు. రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్ఎక్స్ ద్వారానే సాధ్యమవుతుందని ధీమాగా చెప్తున్నాడు. ‘రాబోయే ఐదేళ్లలోనే మార్స్ మీదకు మనిషిని తీసుకెళ్లడం మా బాధ్యత. ఒకవేళ వరెస్ట్ సినారియో ఎదురైతే మాత్రం.. మరో పదేళ్లు పట్టొచ్చు. కానీ, ఆ పదేళ్ల నడుమ మార్స్ యాత్ర జరిగి తీరుతుంది. అందుకు నాదీ హామీ’అని ప్రకటించాడు ఎలన్ మస్క్. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్. అయితే డెడ్లైన్లను మిస్ కావడం ఎలన్ మస్క్‌కి కొత్తేం కాదు. గతంలో టెస్లా, స్పేస్ఎక్స్ సహా చాలా ప్రయోగాల విషయంలో ఇదే జరిగింది. కానీ, మార్స్ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్ మస్క్ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగానికి బీజం వేయించింది. మరి అలాంటిదాన్ని తప్పే ప్రసక్తే లేదనుకోవచ్చు మరి. -
అంగారకుడిపై అతిపెద్ద జలరాశి
న్యూఢిల్లీ: అన్యగ్రహాలపై జీవాన్వేషణలో మరో అడుగు ముందుకు పడింది. అంగారకుడి ఉపరితలం కింద.. పైపొరల్లోనే అతిపెద్ద నీటి సముదాయం ఉన్నట్లు తాజాగా సైంటిస్టులు గుర్తించారు. ఈ రిజర్వాయిర్ దాదాపు హరియాణా రాష్ట్రమంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అంగారకుడి ధృవప్రాంతాల్లోనే నీటి జాడలు(ఐస్ రూపంలో) బయటపడ్డాయి. ప్రస్తుతం అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న టీజీఓ(ద ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్) సదరు గ్రహ మధ్య భాగంలో నూతన నీటి నిల్వలను కనుగొంది. తాజా పరిశోధనతో అంగారకుడి ఇతర ప్రాంతాల్లోనూ నీటి నిల్వలు ఉండే అవకాశాలున్నట్లు గుర్తించారు. విశేషాలు.. ►అంగారకుడిపైన ఉన్న వాలెస్ మెరైనెరిస్ ప్రాంతంలో ఉపరితలం కింద నీరు ఉన్నట్లు గుర్తించింది. ఈప్రాంతంలోని అంగారకుడి మట్టిలో హైడోజ్రన్ పాళ్లను బట్టి టీజీఏ నీటి నిల్వల నిర్ధారణ చేసింది. తాజా రిజర్వాయిర్ 45 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు తెలిసింది. ►నిజానికి అంగారకుడి మధ్య ప్రాంతంలో ఉండే అతి ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ నీరు, మంచు ఉండే అవకాశం లేదని భావిస్తూ వచ్చారు. అయితే, ఈ ప్రాంతం మట్టిలోని దుమ్ము కణాల్లో ఐస్ ఉన్నట్లు అనుమానించి ఉపరితాలనికి మీటరు లోతున టీజీఓ పరిశోధన జరిపిందని, దీంతో గత పరిశోధనల్లో బయటపడని నీటి నిల్వలు ఇక్కడ బయటపడ్డాయని స్పేస్ సైంటిస్టు ఐగర్ మిత్రోఫనావ్ చెప్పారు. ► టీజీఓలోని ఫ్రెండ్(ఫైన్ రిజల్యూషన్ ఎపిథర్మల్ న్యూట్రాన్ డిటెక్టర్) టెలిస్కోపు సాయంతో నీటి ఆచూకీ కనుగొన్నారు. కొత్తగా బయటపడ్డ జలరాశి దాదాపు నెదర్లాండ్స్ అంత విస్తీర్ణంలో వ్యాపించి ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ► 2018–21 మధ్య టీజీఓ పంపిన పరిశీలనలను సైంటిస్టులు అధ్యయనం చేసి నీటి నిల్వపై నిర్ధారణకు వచ్చారు. ► గెలాక్టిక్ కాస్మిక్ కిరణాలు అంగారకుడిని ఢీకొన్నప్పుడు న్యూట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, తడి నేల కన్నా పొడి నేల నుంచి ఎక్కువ న్యూ ట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, దీన్ని బట్టి ఉపరితలం కింద నీటి పరిమాణాన్ని లెక్కిస్తారని మరో సైంటిస్టు అలెక్సీ మలఖోవ్ తెలిపారు. ► ప్రస్తుతం బయటపడ్డ రిజర్వాయర్‌లో నీరు ద్రవ లేదా ఐస్ స్థితిలో ఉండొచ్చని అంచనా. ఉపరితలంలోని ఇతర మినరల్స్‌తో ఈ నీటి అణువులు రసాయన బంధంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ► త్వరలో అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపే యోచనలో ఉన్న మానవాళికి తాజా వార్త ఆశాజనకంగా ఉంటుందని సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. -
స్పేస్ ఎక్స్ దివాళా..! ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. స్పేస్ ఎక్స్ ప్రయోగానికి సంబంధించి ఎలన్ మస్క్ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. ఆ మెయిల్లో "ఇటీవల కాలంలో స్టార్‌షిప్ లాంచ్ వెహికల్‌కు ఉపయోగించే రాప్టార్ ఇంజిన్ తయారీలో చాలా వెనకబడి పోయాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్పేస్ఎక్స్ సంస్థకు దివాళా తీసే పరిస్థితి తలెత్తుతుంది" అంటూ పేర్కొన్నారు. ఎలన్ మస్క్ మార్స్పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భూమి మీద ఏదైనా ప్రమాదం జరిగి, భూమి మీద మనుగడ అంతరించి పోతే మానవుడు మార్స్ మీద జీవించడానికి తన తన సంపద ఉపయోగ పడాలని ఎలన్ మస్క్ కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యంతోనే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకు సాగుతుంది. తాను ఊహించినట్లు భవిష్యత్‌లో మార్స్, చంద్రమండలంపై మానువుని మనుగడ కోసం రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నారు. దీని కోసం ప్రస్తుతం ఉన్న అన్నీ ఎర్త్ రాకెట్ల కంటే 1000 రెట్లు ఎక్కువ ఉన్న స్టార్ షిప్ రాకెట్ ను మోయాల్సి ఉంటుంది. ఆ స్టార్ షిప్ రాకెట్‌ను మోసేందుకు స్పేస్ఎక్స్ రాఫ్టర్ ఇంజిన్లు ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ రాప్టర్ ఇంజిన్ తయారీలో స్పేస్ఎక్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆ సమస్యని అధిగమించేందుకు స్పేస్ ఎక్స్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ మెయిల్ పెట్టారు. ఉద్యోగులు వారాంతాల్లో పనిచేయాలని, స్పేస్ ఎక్స్ ప్రయోగం సంక్షోభంలో ఉందని, దానిని త్వరగా పరిష్కరించకపోతే స్పేస్ ఎక్స్ దివాలా తీసే ప్రమాదం ఉందని ఉద్యోగులకు చేసిన మెయిల్స్‌లో ఎలన్ మస్క్ హెచ్చరించినట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా! -
అంగారక గ్రహం నుంచి వచ్చిన పోస్ట్కార్డ్ను చూశారా..!
NASA Curiosity Rover Sends A Rare Postcard From Mars To Mark 10th Anniversary: భూగ్రహమే కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చుననే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ రోవర్లను ప్రయోగించింది. తాజాగా క్యూరియాసిటీ రోవర్‌ను లాంచ్ చేసి నవంబర్ 26తో పది వసంతాలు ముగిశాయి. 2011 నవంబర్ 26న క్యూరియాసిటీ రోవర్‌ను నాసా లాంచ్ చేసింది. మార్స్‌పైకి పది సంవత్సరాల క్రితం ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఇంకా పనిచేస్తోండడం గమనార్హం. అద్భుతమైన పోస్ట్‌కార్డ్..! క్యూరియాసిటీ రోవర్ పది వసంతాలను పూర్తి చేసుకోవడంతో మార్స్ నుంచి భూమికి అద్భుతమైన ఫోటోలను పంపింది. మార్టిన్ ల్యాండ్‌స్కేప్‌లో క్యూరియాసిటీ రోవర్ బంధించిన ఆసక్తికరమైన రెండు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను నాసా తన సోషల్‌మీడియా ఖాతాలో క్యూరియాసిటీ పంపిన పోస్ట్కార్డుగా వర్ణిస్తూ షేర్ చేసింది. ఫోటో కర్టసీ: నాసా క్యూరియాసిటీ పంపిన ఫోటోలను నాసా శాస్త్రవేత్తలు కాస్త ఎడిట్ చేస్తూ..‘విష్ యూ వర్ హియర్’ అనే ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియా నాసా పోస్ట్చేసింది. క్యూరియాసిటీ రోవర్ 360 డిగ్రీల కెమెరా సహయంతో ఈ ఫోటోలను తీసింది. క్యూరియాసిటీ రోవర్ నిర్వహణ బాధ్యతలను నాసా జెట్ ప్రొపెల్షన్ లాబోరేటరీ చూసుకుంటుంది. ఇప్పటివరకు మార్స్‌పై క్యూరియాసిటీ కనిపెట్టిన వాటిలో ముఖ్యమైనవి..! ⇒మార్టిన్ రేడియేషన్ వాతావరణాన్ని అంచనా వేసింది. ⇒అంగారక గ్రహాన్ని చేరిన ఏడు సంవత్సరాల తరువాత క్యూరియాసిటీ రోవర్ మార్స్‌పై ఉన్నపురాతన ప్రవాహాన్ని కనుగొంది. దీంతో మార్స్‌పై నీరు ఒకప్పుడు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ⇒మార్స్ నేలపై జరిపిన డ్రిల్లింగ్ సహాయంతో సల్ఫర్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ , కార్బన్‌తో జీవానికి సంబంధించిన కొన్ని కీలక రసాయన పదార్థాలను క్యూరియాసిటీ గుర్తించింది. ⇒పురాతన గేల్ క్రేటర్‌లో మిలియన్ల సంవత్సరాలుగా సరస్సులు ఉన్నాయని క్యూరియాసిటీ గుర్తించింది. View this post on Instagram A post shared by NASA (@nasa) చదవండి: ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో ఏదంటే..! -
అందుకోసమైనా భూమిని కాపాడుకుందాం.. బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jeff Bezos On Space Human Colonies: మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందా? మనిషి మనుగడ అక్కడే కొనసాగనుందా? అప్పుడప్పుడు చుట్టపు చూపుగా భూమ్మీదకు వచ్చి చూసిపోతుంటాడా?.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికైతే అతిశయోక్తి కావొచ్చు! కానీ, భవిష్యత్తులో ఇదే జరిగి తీరుతుందని అంచనా వేస్తున్నాడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్. ఇగ్నాటియస్ ఫోరమ్ 2021లో ‘స్పేస్ ట్రావెల్, భవిష్యత్తులో దాని సామర్థ్యం’ అంశం మీద బ్లూఆరిజన్ ఓనర్ హోదాలో జెఫ్ బెజోస్ ప్రసంగించాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాక.. మనిషి పుట్టేది అంతరిక్షంలోనే!. అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని మనిషి బతుకుతుంటాడు. అప్పటికి భూమి ఒక పరిరక్షక గ్రహంగా ఉంటుంది. దానిని చూసేందుకు మనిషి టూరిస్టుగా మారిపోతాడు. కాబట్టి, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. ‘‘భూమి ఎంతో విలువైన గ్రహం. కోట్లలో పెరుగుతున్న జనాభాతో భూమ్మీద ఒత్తిడి ఉంటోంది. ఈ కారణంతోనే రాబోయే రోజుల్లో వృక్ష, జంతు సంపద తగ్గిపోవడం ఖాయం. కాబట్టి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు నివాసయోగ్యమైన ప్రాంతం వెతుక్కోవడంలో తప్పేముంది?. అంగారకుడి లాంటి గ్రహాల మీద జీవనం ఏర్పరుచుకోవడం వల్ల భూమి భారాన్ని తగ్గించొచ్చు. విలువైన జీవన సంపదతో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా భూమిని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు బీజం వేసిది స్పేస్ టూరిజమే’’ అంటూ వ్యాఖ్యానించాడాయన. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసమే! -
‘నువ్వింక మారవా?’.. ఎలన్ మస్క్ రిప్లై ఇది
సంపాదించడంలోనే కాదు.. అందులోంచి దానాలు చేయడం ద్వారా కూడా ధనికులు కొందరు శెభాష్ అనిపించుకుంటున్నారు. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి అపర కుబేరులు సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు. కానీ, ఈ జాబితాలో టాప్ 2 పొజిషన్లో ఉన్నవాళ్లు మాత్రం.. చాలా వెనుకంజలో ఉన్నారు. పైగా వీళ్లిద్దరి వ్యవహార శైలిపై తోటి కుబేరులతో పాటు ప్రముఖులు సైతం మడిపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పేస్ టూరిజంలో పోటీతో అపర కుబేరులు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. భూమి మీద ఎన్నో సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అంతరిక్ష ప్రయోగాల పేరుతో వృధా ఖర్చు చేస్తున్నారనే విమర్శ ఈమధ్య బాగా వినిపిస్తోంది. బిల్‌గేట్స్‌తో పాటు ప్రిన్స్ విలియమ్ లాంటి ప్రముఖులు సైతం విమర్శించిన వాళ్లలో ఉన్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో స్పేస్ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ స్పందించాడు. ‘విమర్శల నేపథ్యంలో మార్పు ఆశించొచ్చా’ అని రేడియో జాకీ అడిగిన ప్రశ్నకు.. ‘ఆసక్తి-అవకాశం ఉన్నప్పుడు విమర్శలను ఎందుకు పట్టించుకోవడం’ అంటూ సింగిల్ లైన్లో విమర్శలకు తన బదులు ఇచ్చాడు. Hopefully enough to extend life to Mars — Elon Musk (@elonmusk) October 16, 2021 ఇక క్రిప్టో యూట్యూబర్ మ్యాట్ వాలేస్ ట్విటర్లో ఎలన్ మస్క్ సంపద గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఎలన్ మస్క్ ప్రస్తుత ఆస్తి 861 బిలియన్ డోజ్కాయిన్లకు సమానం. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ల ఆస్తి కలిస్తే ఎంతో.. అంత ఆస్తి ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక్కడికే ఉందన్నమాట అంటూ వాలేస్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌కు ఎలన్ మస్క్ ‘బహుశా.. అంగారకుడి మీద జీవనాన్ని విస్తరించడానికి ఇది సరిపోతుందేమో!’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే మాట్లాడితే మార్స్ పేరెత్తే ఎలన్ మస్క్.. చిన్నప్పటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నాడు . టెక్ మేధావిగా ఎదిగినప్పటికీ మార్స్ మీద మనిషి మనుగడ ధ్యేయంగా స్పేస్‌ఎక్స్‌ను నెలకొల్పి అందుకోసమే కోటాను కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో విమర్శలను తాను పట్టించుకోనని చెబుతున్నాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో వచ్చే మీమ్స్‌ను సైతం ఆస్వాదిస్తుంటాడు. చదవండి: మస్క్, బెజోస్.. భూమ్మీద ఏక్ నెంబర్ 'పిసినారులు' -
భూమ్మిదే మనుషులు సృష్టించిన మార్స్.. ఎక్కడంటే..
అవును.. భూమ్మీదే మార్స్.. మనుషులే దాన్ని సృష్టించేశారు.. ఎక్కడ అంటే.. ఇజ్రాయెల్‌లోని నెగేవ్ ఎడారిలో.. ఇంతకీ ఎందుకిలా చేశారు.. అక్కడ స్పేస్ సూట్స్ వేసుకుని వీళ్లంతా ఏం చేస్తున్నారు? వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే.. చలో ఇజ్రాయెల్... భవిష్యత్ సంక్షోభాల దృష్ట్యా ప్లానెట్ ‘బి’ సృష్టించడం కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అంగారకుడి మీద కొంత అనుకూల వాతావరణం కనిపిస్తున్నా... ఇప్పటి దాకా జీవం ఉన్న దాఖలాలు లేవు. రెడ్‌ప్లానెట్ మీద మానవులు జీవించడానికి ఏ మాత్రం అవకా శం ఉందనే పరిశోధనలకోసం నాసా 2030లో మార్స్ మీదకు వ్యోమగాములను పంపనుంది. ఆ ప్రయోగం కోసమే అంగారక గ్రహం భౌగోళిక స్థితులను పోలిన ఇజ్రాయిల్‌లోని ‘నెగేవ్’ ఎడారిలో రెడ్‌ప్లానెట్ నమూనాను తయారు చేసింది. ఇక్కడ ఆరుగురు వ్యోమగాములు, నాలుగు వారాలపాటు నివసించనున్నారు. ఏఎమ్ఏడి ఈఈ–20గా పిలుచుకునే ఈ బృందంలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఆ నమూనా ఎలా ఉంటుంది? మార్స్ బేస్ లోపలి వాతావరణాన్ని పోలిన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ఉండటం కోసం ఏర్పాటు చేసినట్లుగానే ఈ ఆవాసం ఉంటుంది. అంగార కుడి మీద ప్రయోగాలకోసం ఉన్న సానుకూలత లను, పరిమితులను కూడా అర్థం చేసుకునే విధంగా ఈ ఆవాసాన్ని తయారు చేశారు. బయటికి వచ్చినప్పుడు స్పేస్‌సూట్స్ అంతే కాదు... రోవర్లు, డ్రోన్లతోపాటు ఇతర పరిక రాలన్నింటినీ ఈ అంగారకుడిమీద పరీక్షించనున్నారు ఆస్ట్రోనాట్స్. జీవం ఉండేందుకు ఉన్న అవ కాశాలు, వ్యోమగాముల ఆరోగ్యపరిస్థితులు, వాళ్ల మానసిక స్థితిగతులు, మార్స్ మీద పరిస్థితులు, ఇంజనీరింగ్ విభాగాల్లో 20కిపైగా ప్రయోగాలను 4 వారాలపాటు నిర్వహించనున్నారు. మార్స్ మీద బయటకు వెళ్లినప్పుడు ధరించినట్టుగా నే ఇక్కడా ఆ ఆవాసం నుంచి బయటికి వచ్చిన ప్పు డు, రోవర్స్, డ్రోన్స్ నిర్వహించేప్పుడు వ్యోమ గా ములు తప్పనిసరిగా స్పేస్ సూట్స్‌ను ధరిస్తారు. తీసుకునే ఆహారం, పీల్చేగాలి... వ్యోమగాములు తీసుకునే ఆహారం, పీల్చేగాలి పూర్తిగా మార్స్పైన బేస్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి. వ్యర్థాల రీసైక్లింగ్, నీటిబుడగలకు అనువైన ఉన్నట్టుగానే అసాధారణ పరిస్థితులను సృష్టించి ఒంటరిగానూ, ఇద్దరు ముగ్గురు కలిసి సహకరించుకుంటూ ప్రయోగాలు చేస్తారు. ఇతర గ్రహాల మీద ఉన్న దుమ్ము, ధూళి వ్యోమగాములకు శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగించడమే కాదు... యంత్రాలను పనిచేయకుండా చేసే అవకాశం ఉంది. అందుకే దుమ్ము, ధూళిని శుభ్రం చేసే టెక్నాలజీని సైతం ఇక్కడ పరీక్షించనున్నారు. నాలుగువారాలపాటు ఐసోలేషన్... మార్స్ మిషన్ కోసం ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఔత్సాహికుల నెట్‌వర్క్‌తో ఏర్పాటైన ఆస్ట్రియన్ స్పేస్ ఫోరమ్ నిర్వహిస్తున్న 13వ అనలాగ్ ఆస్ట్రోనాట్ మిషన్ ఇది. ఇందుకు అవసరమైన క్రూ, పరికరాలు, సౌకర్యాలను ఇజ్రాయేల్ స్పేస్ ఏజెన్సీ సమకూర్చింది. సోమవారం ప్రారంభమైన ఈ ఐసోలేషన్ దశ అక్టోబర్ 31తో ముగియనుంది. అప్పటివరకు మిషన్ కంట్రోల్‌తో మాత్రమే వ్యోమగాములు మాట్లాడతారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ నిధులు అందిస్తున్న అతి పెద్ద ప్రయోగం ఇది. ఈ మిషన్‌లో 25 దేశాల నుంచి 200 మంది పరిశోధకులు పాలుపంచుకున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
భూమ్మీదే కాదు.. అక్కడా వరదలు ముంచెత్తాయి!
ఇప్పుడంటే అంగాకర గ్రహం ఎండిపోయి.. రాళ్లు, రప్పలు, మట్టిదిబ్బలతో కనిపిస్తోంది. మరి ఒకప్పుడు? అంటే.. ఓ 3.7 బిలియన్ల సంవత్సరాల కిందట. ఆ సమయంలో మార్స్.. ఎర్త్ తరహాలోనే ఉండేదని పరిశోధనలు ఒక్కొక్కటిగా చెబుతూ వస్తున్నాయి. ఇంతకీ ఈ అరుణ గ్రహం మానవ నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? అనేది తేల్చేక్రమంలో ఆసక్తికరమైన విషయాలెన్నో బయటపడుతున్నాయి. తాజాగా.. అంగారకుడిపై వరద ప్రవాహాల్ని సైతం గుర్తించింది నాసాకు చెందిన పర్సివరెన్స్ రోవర్. తాను దిగిన జీజెరో క్రాటర్ ప్రాంతంలోనే ఈ రోవర్, వరద జాడల్ని గుర్తించడం విశేషం. కుంభవృష్టి వరదలతో లోతైన గుంతలు ఏర్పడి ఉండొచ్చని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. ఇక కొత్త రోవర్‌తో అనుసంధానం కాసేపు ఆగిపోవడానికి ముందు.. పర్సివరెన్స్ కీ ఫొటోల్ని నాసా సెంటర్‌కు పంపింది. అంగారకుడి ఉపరితలంపై తీసిన ఈ చిత్రాలను పరిశీలించిన తర్వాత.. నాసా కొన్ని విషయాల్ని వెల్లడించింది. ► ఆ కాలంలో మార్స్ మీద వాతావరణం(పొరలు) దట్టంగా ఉండేది(మొదటి నుంచి ఇదే చెప్తున్నారు) ► జీజెరో క్రాటర్‌ను ఒక సరస్సుగా దాదాపు నిర్ధారణకు వచ్చేశారు ► నదులు, వాటి ప్రవాహం వల్ల మార్స్ మీద ఫ్యాన్ ఆకారంలో డెల్టా ప్రాంతాలు సైతం ఏర్పడ్డాయి ► సరస్సు(ఎండిపోయిన) చిన్నభూభాగాలు.. నది డెల్టా ప్రాంతానికి చెందినవే అయ్యి ఉంటాయి ► గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కుంభవృష్టి వరదలు ముంచెత్తాయి.. బహుశా ఆ ప్రాంతమంతా ఎండిపోయి ఉండొచ్చు ► వరదలతో సరస్సుల్లోకి కొట్టుకువచ్చిన రాళ్లురప్పల ఫొటోల్నే పర్సివరెన్స్ ఇప్పుడు నాసాకి పంపింది. చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...! -
దూసుకువస్తోన్న భారీ తోక చుక్క..! భూమిని ఢీకొట్టనుందా?
తోకచుక్క అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది హేలీ తోకచుక్కనే. ఈ తోక చుక్క 1682లో కన్పించిన తోకచుక్కగా ఖగోళ శాస్త్రవేత్త హేలీ పేర్కొన్నారు. ఇది ప్రతి 75-76 ఏళ్లకొక సారి కన్పిస్తుంది. ఈ తోకచుక్క 1986లో కన్పించగా..మరలా 2061లో కన్పించనుంది. హేలీ తోక చుక్క కంటే భారీ తోక చుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.మన సౌరవ్యవస్థకు దగ్గరగా వస్తోన్న భారీ తోకచుక్కగా (కామెట్) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెగాకామెట్ను మొదట పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు పెడ్రో బెర్నార్డినెల్లి , గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు ఈ భారీ తోకచుక్కకు C/2014 UN271 అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ తోకచుక్క పరిమాణంలో అత్యంత భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిమాణంలో మార్స్ మూన్ పోబోస్, డిమోస్ కంటే పెద్గగా ఈ కామెట్ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తలు గుర్తించిన తోకచుక్కల్లో అతిపెద్ద తోకచుక్కగా నిలిచింది. సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీలో కొనసాగుతున్న డార్క్ ఎనర్జీ సర్వే (DES) ద్వారా ఈ మెగా కామెట్ డేటాను పరీశిలిస్తున్నారు. తొలుత ఈ తోక చుక్కను ఒక ఆస్ట్రరాయిడ్గా గుర్తించగా..అబ్జర్వేటరీ అందించిన డేటా ప్రకారం అది తోకచుక్కఅని శాస్త్రవేత్తలు నిర్థారించారు.కామెట్ బెర్నార్డినెల్లి-బెర్న్‌స్టెయిన్ మెగా కామెట్ పరిమాణం తొలుత 200 కిలోమీటర్ల వెడల్పుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తోకచుక్క మనకు ఎప్పుడు దగ్గరగా వస్తుందంటే..? ఈ తోకచుక్క మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది.2031 సంవత్సరంలో మన సూర్యుడికి, భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమిని ఢీకొట్టనుందా? ఈ తోకచుక్క అత్యంత పెద్దదిగా పరిగణించినప్పటికీ.. శాస్త్రవేత్తలు ఈ తోకచుక్క గమనాన్ని ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, భూమికి ఈ తోకచుక్క నుంచి ఎటువంటి ముప్పు లేదని వెల్లడించారు. చదవండి: న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మరో నలుగురు! -
గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...!
భూగ్రహం కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చే అనే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ అనే రోవర్లను ప్రయోగించింది. ఈ రోవర్స్ సహాయంతో నాసా అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. చదవండి: Jeff Bezos: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! భారీ ప్రకంపనతో ఊగిపోయిన మార్స్....! తాజాగా అంగారక గ్రహంపై ఈ నెల 18 న సుమారు 90 నిమిషాల పాటు భారీ ప్రకంపనలు సంభవించాయని నాసా వెల్లడించింది. నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ అంగారక గ్రహంపై నమోదైన భారీ ప్రకంపనలను రికార్డు చేసింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు సంభవించడం ఇది మూడోసారి. 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల ప్రభావం ఐదు రెట్లు అధికమని నాసా పేర్కొంది. ఇన్సైట్ ల్యాండర్ ఇప్పటివరకు అంగారకపై సుమారు 700 ప్రకంపనలను గుర్తించింది. ఇన్సైట్ అందించిన సమాచారంతో నాసా శాస్త్రవేత్తలు భావించినా దాని కంటే అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉందని గుర్తించారు. భూగ్రహంతో పోలిస్తే అంగారకపై ప్రకంపనలు ఎక్కువ సమయం పాటు రావడానికి కారణం అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉండడమే కారణమని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ఇన్సైట్ ల్యాండర్ పగటి సమయంలో ప్రకంపనలను రికార్డు చేయడం ఇదే తొలిసారి. చదవండి: క్రిప్టో కరెన్సీ: ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్.. ‘సొల్లు’ రీజన్స్!! అనూహ్య ప్రకటన -
2020లో ఎలోన్ మస్క్ ఎంత జీతం తీసుకున్నారో తెలుసా?
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ 2020లో ఎలక్ట్రిక్-వేహికల్ కంపెనీ నుంచి ఎటువంటి జీతం పొందలేదు. మస్క్ 2020 వేతనం సున్నాకు పడిపోయింది. శుక్రవారం ఎస్ఈసీతో పంచుకున్న వివరాల ప్రకారం.. 2019లో అతని జీతం 23,760 డాలర్లు ఉంటే ఇది 2018లో 56,380 డాలర్లుగా ఉంది. "అయితే, అతను తన జీతాన్ని ఎన్నడూ తీసుకోలేదని" కంపెనీ తెలిపింది. ఎలోన్ మస్క్ అభ్యర్థన మేరకు 2019 మే నుంచి శాలరీ వివరాలను ప్రకటించట్లేదు అని కంపెనీ పేర్కొంది. 2018 నష్టపరిహార ఒప్పందం కింద మస్క్ మొత్తం శాలరీ ప్యాకేజీ స్టాక్ రూపంలో ఉంది. టెస్లా 16 మైలురాళ్లలో 12మైలురాళ్లను చేరుకుంటే, కంపెనీ మార్కెట్ క్యాప్ $650 బిలియన్లను తాకితే మస్క్ షేర్లు విలువ పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి టెస్లా ఆ మైలురాళ్లలో ఆరింటిని తాకినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 2020లో 650 బిలియన్ డాలర్లు దాటింది. శుక్రవారం ముగింపు నాటికి ఇది 704.81 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2018 ఒప్పందం ప్రకారం మస్క్ ధర ప్రతి షేరుకు 70.01 డాలర్లుగా ఉందని ఎస్ఈసీ ఫైలింగ్స్ తెలిపింది. టెస్లా స్టాక్ ప్రతి షేరుకు $716.70 వద్ద వారాన్ని ముగించింది. మానవులను అంగారక గ్రహం మీదకు తీసుకొనిపోవడానికి రూపొందిస్తున్న ప్రాజెక్టులో అధిక మొత్తంలో తన టెస్లా స్టాక్స్ కేటాయించినట్లు చెప్పారు. -
కృత్రిమ కుజుడిపై నివాసానికి సిద్ధమా?.. నాసా అప్లికేషన్లు
మానవ జ్ఞానం అవధుల్లేకుండా పెరుగుతున్న కొద్దీ అంతరిక్షానికి ఆవల ఏముందో చూడాలన్న ఆతృత పెరిగిపోతోంది. అంతరిక్ష యానం, ఇతర గ్రహాలపై నివాసం మనిషి మేథస్సుకు విసిరిన సవాళ్లు కాగా, క్రమంగా వీటిని జయిస్తూ వస్తున్నాడు మానవుడు. ఈ క్రమంలో చంద్రుడితో మొదలెట్టిన గ్రహాంతర యానాలు ఇతర గ్రహాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతానికి చంద్రుడిపైకి మాత్రమే మనిషి వెళ్లగలిగాడు. కానీ త్వరలో ఇతర గ్రహాలపై పాదం మోపే ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే కొన్ని తరాల అనంతరం మనిషి ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవడం ఖాయమన్నది సైంటిస్టుల అభిప్రాయం. గ్రహాంతర నివాసం కల సాకారం చేసుకునే క్రమంలో పలు దేశాలు పలు ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ తరహాలోనే అమెరికాకు చెందిన నాసా ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుండాలో లేదో అధ్యయనం చేసేందుకు భూమిపైనే కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో సంవత్సరం పాటు ఉండి ప్రయోగాలు చేసేందుకు ఉత్సాహం చూపే ఔత్సాహికుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో నాసా ఎంపిక చేసుకున్నవారు ఈ కృత్రిమ అంగారక వాతావరణంలో ఉంటూ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటికి ఎలా సిద్ధమవ్వాలో అధ్యయనం చేస్తారు. డ్యూన్ ఆల్ఫా మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలిచే 1700 చదరపు అడుగుల ఈ కృత్రిమ నివాస స్థలాన్ని అంగారకుడి వాతావరణాన్ని అనుసరించి 3డీ ప్రింటింగ్ ద్వారా సృష్టిస్తున్నారు. హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో ఈ కృత్రిమ కుజ నివాసం సిద్ధం చేస్తున్నారు. కుజుడిపై ఉండేలాగానే పరిమిత వనరులు, పరికరాలు ఫెయిల్‌కావడం, కమ్యూనికేషన్ తెగిపోవడం, ఇతర సహజసిద్ధ ప్రమాదాలు ఆల్ఫాలో ఉంటాయి. వీటన్నింటిని తట్టుకుంటూ అందులో ఉన్నవారు స్పేస్ వాక్ చేయడం, పరిశోధనలు చేయడం, వీఆర్ మరియు రోబోటిక్ కంట్రోల్స్ చేయడం వంటివి చేయాల్సిఉంటుంది. ఈ ప్రయోగంతో లభించే వివరాలు నిజమైన అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు ఉపకరిస్తాయని నాసా భావిస్తోంది. అయితే ఇందులో ఒక చిన్న తిరకాసు ఉందండోయ్! కేవలం అమెరికా పౌరులకు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. అది కూడా 30–55 సంవత్సరాల్లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ధూమపానం అలవాటు లేకపోవడం, ఆరోగ్యవంతంగా ఉండడం, ఇంగ్లీష్ బాగా తెలిసిఉండడం వంటి అదనపు నిబంధనలు కూడా ఉన్నాయి. స్టెమ్ ఫీల్డ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిఉండాలి. నాలుగేళ్లపాటు అనుభవం ఉంటే మంచిది. మనకు అవకాశం లేదని బాధపడాల్సిన పనిలేదు. త్వరలో మన ఇస్రో కూడా ఇటువైపుగా అడుగులు వేయవచ్చు. గతంలో రష్యా కూడా ఇలాంటి మార్స్ మిషన్ ఒకటి చేపట్టింది, కానీ సక్సెస్‌కాలేదు. మరి నాసా యత్నాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాల్సిందే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు ఆకాశంలో అద్భుతం..ఇలా చూసేయండి..!
బెంగళూరు: గతంలో గురు, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అరుదైన గ్రేట్ కంజక్షన్ భూమిపై ఎంతోమంది చూపరులను ఆకట్టుకుంది. కాగా ఈసారి ఆకాశంలో నేడు మరో అద్బుత దృశ్యం ఆవిష్కృతంకానుంది. అంగారక, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చంద్రుడితో కలిసి కనిపించనున్నాయి. భారత్‌లో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఖగోళ దృగ్విషయాన్ని చూడవచ్చును. ఖగోళ పరిశోధకుల ప్రకారం.. శుక్ర గ్రహం, మార్స్ దగ్గరగా రావడం మొదటిసారి. అంగారక గ్రహం (మార్స్), శుక్ర (వీనస్) గ్రహాలు ఫిబ్రవరి 12, 2022, మార్చి 12, 2022 న మరోసారి దగ్గరగా రానున్నాయి. జూలై 12 , 13 తేదీలలో అంగారక గ్రహం, శుక్రుడు భూమి నుంచి ఒకదానికొకటి కేవలం 0.5 డిగ్రీల తేడాతో కనిపిస్తారు. జూలై 12 న రెండు గ్రహాలతో 4 డిగ్రీల కోణంలో చంద్రుడు సమాంతరంగా రానున్నాడు. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం ఈ ఖగోళ ఈవెంట్‌ను నేరుగా కంటితో చూడవచ్చునని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సూర్యాస్తమయం తరువాత భారత్‌లో ఎక్కడైనా నేరుగా చూడవచ్చును. -
మార్స్ పై రోవర్ నిజంగానే సెల్ఫీ తీసుకుందా..!
మామూలుగా సెల్ఫీ తీసుకునేటప్పుడు మనలో చాలా మంది సెల్ఫీ స్టిక్ లేదా మనలో ఎవరైనా పొడుగ్గా ఉన్నవారిని ఉపయోగించి సెల్ఫీను తీసుకుంటాం. మనం సెల్ఫీ తీసుకున్నట్లుగా ఫోటోను చూసి ఇట్టే చెప్పవచ్చును ఆ ఫోటో సెల్ఫీ ...! లేదా ఎవరైనా తీశారా..! గత కొన్ని రోజుల క్రితం మార్స్ ఉపరితలంపై పర్సివర్సెన్స్ రోవర్ తీసుకున్న సెల్ఫీ ఫోటోను ఏప్రిల్ 6 నాసా విడుదల చేసింది. కాగా ఈ ఫోటోపై చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. ఫోటోను ఎవరో తీశారనే సందేహాలు వ్యక్త పరిచారు. కాగా తాజాగా పర్సివర్సెన్స్ తీసుకున్న సెల్ఫీ ఫోటోపై నాసా వివరణ ఇచ్చింది. నాసా వివరణ: అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి ‘పర్సవరెన్స్’రోవర్‌ను నాసా పంపిన విషయం తెలిసిందే. పర్సవరెన్స్ రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను కూడా పంపారు. మార్స్ఉపరితలంపై పర్సీవరెన్స్ రోవర్‌తో కలిసి హెలికాప్టర్ ఇన్‌జెన్యూటీని ఏప్రిల్ 6న సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీను తీసుకోవడానికి వాట్సాన్ అనే కెమెరానుపయోగించింది. పర్సివరెన్స్ రోవర్‌కు అమర్చిన రోబోటిక్ ఆర్మ్‌తో వాట్సాన్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీ తీసింది. కెమెరాతో తీసిన సుమారు 62 వ్యక్తిగత చిత్రాలను జోడించి పర్సివరెన్స్, ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ల పూర్తి సెల్ఫీ చిత్రాన్ని విడుదల చేసింది. కాగా చిత్రాల జోడింపునకు సంబంధించిన వీడియోను నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ విడుదల చేసింది. వ్యక్తిగతంగా తీసుకున్న చిత్రాలను కలిపి పూర్తి చిత్రాన్ని విడుదల చేశామని నాసా పేర్కొంది. చదవండి: నాసా సాధించిన మరో ఘన విజయం..మార్స్‌పై తొలిసారిగా.. -
SpaceBok: మార్స్ జీవం గుట్టు తేల్చే రోబో
మన భూమ్మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా? ఇంతకుముందైనా ఉండేదా..? చాలా కాలంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఈ ఆసక్తితోనే సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల వద్దకు శాటిలైట్లను పంపుతున్నారు. ముఖ్యంగా భూమిని పోలి ఉన్న అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడకు రోవర్లను పంపారు. తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఏమిటీ రోబో.. ఎందుకీ ప్రయోగం? ఇప్పటికే అంగారకుడిపైకి పలుమార్లు రోవర్లను పంపారు. చిన్న కారు పరిమాణంలో ఉండి చక్రాలతో కదులుతూ పరిశోధనలు చేసే ఈ రోవర్లకు చాలా పరిమితులు ఉన్నాయి. అవి కదిలే వేగం చాలా తక్కువ, రాళ్లురప్పలు, ఇసుక వంటివి ఉంటే ముందుకు ప్రయాణించలేవు. ఎత్తైన చోట్లకు వెళ్లడం కష్టం. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్‌జ్యూరిచ్, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ‘స్పేస్‌బాక్’పేరుతో నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేకమైన రోబోను రూపొందించింది. అంగారకుడిపై జీవం ఉనికిని గుర్తించేందుకు దీనిని త్వరలోనే పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి చంద్రుడిపై పరిశోధనల కోసం ఈ రోబోను రూపొందించారు. తర్వాత మార్స్‌పైకి పంపేందుకు వీలుగా మార్పులు చేశారు. భూమి అవతల ఇలా కాళ్లతో నడిచే రోబోను వినియోగించనుండటం ఇదే తొలిసారి కానుంది. రోవర్లకు సమస్యలు రావడంతో.. మార్స్ పైకి 2006లో పంపిన ఆపర్చునిటీ రోవర్ ఓసారి ఇసుకలో ఐదు వారాల పాటు చిక్కుకుపోయింది. చివరికి మెల్లగా బయటపడింది. ఇక 2009లో పంపిన స్పిరిట్రోవర్కూడా పెద్ద రాళ్లు ఉన్న ఇసుకలో చిక్కుకుపోయింది. అది బయటికి రాలేకపోవడంతో ఆ మిషన్నే ఆపేశారు. ఇలాంటి సమస్య లేకుండా పనిచేసేలా ‘స్పేస్‌బాక్’ను రూపొందించారు. ప్రస్తుతం మార్స్‌పై నాసాకు చెందిన క్యూరియాసిటీ, పర్సవరెన్స్‌రోవర్లు, చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ పరిశోధనలు చేస్తున్నాయి. ‘స్పేస్‌బాక్’.. ఈజీ గోయింగ్ రాళ్లురప్పలు, ఇసుకతో కూడిన ప్రాంతాల్లో అయినా, గుంతలుగా, ఎత్తుపల్లాలతో ఉన్న చోట, చిన్న చిన్న కొండలపైకి ఈ ‘స్పేస్‌బాక్’రోబో సులువుగా వెళ్లగలదు. ఇందుకోసం దీని కాళ్లను ప్రత్యేకంగా డిజైన్‌చేశారు. ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు పడిపోకుండా, ఎక్కువ శక్తి వృథా కాకుండా అటూ ఇటూ వంకరటింకరగా నడిచేలా సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేశారు. మార్స్‌పై ఉండే నేల వంటిదానిని ల్యాబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పరీక్షించగా.. ఈ రోబో సులువుగా నడవగలిగింది. అయితే ఈ రోబో రోవర్లకు ప్రత్యామ్నాయం కాదని.. రోవర్లకు వీలుకాని చోట్లకు వెళ్లి పరిశోధన చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: Fastskin 4.0: ఆక్వామ్యాన్ లాంటి సూట్.. ఎలా పని చేస్తుందంటే.. -
కేజీ మట్టి.. ఆరున్నర లక్షల కోట్లు!!
అవును.. కేజీ మట్టి కోసం అన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నమాట నిజమే. కాకపోతే అది భూమ్మీద మట్టి కోసం కాదు. అంతరిక్షంలో అదీ అంగారక గ్రహం మీద మట్టి కోసం. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది. మార్స్ మీద దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ ఇదివరకే పరిశోధనలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అత్యంత విలువైందిగా భావిస్తున్న అక్కడి మట్టిని భూమ్మీదకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది నాసా. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయబోతోంది. ఒకవేళ అంగారక గ్రహం మీద మట్టి భూమ్మీదకు చేరితే గనుక.. ఇప్పటిదాకా భూమ్మీది అపురూపమైన వస్తువులలో అదే అగ్రస్థానంలో ఉంటుంది. దాదాపు రెండు పౌండ్ల మట్టి(దాదాపు కేజీ)ని మట్టిని మార్స్ నుంచి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఈ శాంపిల్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఇక ఆ మట్టిని భూమ్మీదకు తేవడానికి మరో పదేళ్లకాలం పైనే పట్టొచ్చని అంచనా. కాగా, మార్స్ మట్టి కోసం ఇంత ఖర్చు చేయబోతున్న నాసా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. చదవండి: మార్స్‌పై ఆక్సిజన్ -
అంగారకుడిపై ‘జురోంగ్’ తొలి అడుగులు
బీజింగ్: అంగారక గ్రహం ఉపరితలంపై జీవం మనుగడకు గల పరిస్థితులను అన్వేషించేందుకు డ్రాగన్ దేశం చైనా తొలిసారిగా ప్రయోగించిన జురోంగ్ రోవర్ తన విధులు నిర్వర్తించేందుకు రంగం సిద్ధమయ్యింది. శనివారం ల్యాండర్ నుంచి జురోంగ్ విజయవంతంగా బయటకు అడుగుపెట్టింది. ఆరు చక్రాలున్న ఈ రోవర్ బరువు 240 కిలోలు. సౌర శక్తితో పని చేస్తుంది. ల్యాండర్ నుంచి నెమ్మదిగా కిందికి దిగి, మార్స్‌పై ఇసుక నేలలో పాదం మోపినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. అరుణ గ్రహంపై పరిశోధనల కోసం చైనా 2020 జూలై 23న టియాన్వెన్–1న మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ల్యాండర్ ఈ నెల 15న మార్స్‌పై దిగింది. జురోంగ్ రోవర్ మూడు నెలలపాటు పని చేయనుంది. -
అంగారకుడిపై అరుణ పతాకం
బీజింగ్: డ్రాగన్ దేశం ప్రయోగించిన జురోంగ్ రోవర్ అంగారక గ్రహంపై శనివారం విజయవంతంగా దిగింది. అరుణ గ్రహంపై రోవర్‌ను దింపిన రెండో దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. 9 నిమిషాల ఉత్కంఠ పరిస్థితుల తర్వాత తమ రోవర్ మార్స్‌పై దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చైనా పురాణాల్లోని అగ్నిదేవుడి పేరు జురోంగ్. 320 మిలియన్ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ముందే నిర్దేశించినట్లుగా మార్స్‌పై ఉటోపియా ప్లానిటియా దక్షిణ ప్రాంతంలో జురోంగ్ చైనా కాలమానం ప్రకారం ఉదయం 7.18 గంటలకు అడుగు మోపింది. రోవర్ మార్స్‌పై దిగాక తన సోలార్ ప్యానెళ్లను, యాంటెనాను విప్పుకొని, సిగ్నల్స్ పంపించగానే చైనా స్పేస్ సైంటిస్టులు హర్షాతిరేకాలు చేశారు. అంగారకుడిపై విజయవంతంగా ఎర్రజెండా పాతి, స్పేస్ ప్రాజెక్టుల్లో తాను ముందంజలో ఉన్నానన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు చైనా పంపించింది. ప్రాజెక్టును విజయవంతం చేసిన తమ స్పేస్ సైంటిస్టులకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. ఆరు చక్రాలున్న జురోంగ్ రోవర్ సౌర విద్యుత్‌తో పనిచేస్తుంది. తనకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ రోవర్ బరువు 240 కిలోలు. తన వెంట ఆరు శాస్త్ర సాంకేతిక పరికరాలను మార్స్‌పైకి మోసుకెళ్లింది. ల్యాండర్ నుంచి వేరుపడిన తర్వాత మూడు నెలల పాటు విధులు నిర్వర్తిస్తుంది. అరుణ గ్రహం ఉపరితలంపై జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలిస్తుంది. -
అరుదైన రికార్డ్: అమెరికా సరసన చేరిన చైనా
బీజింగ్: అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో చైనా దూసుకుపోతుంది. ఇప్పటికే ఛాంగీ–5 శోధక నౌక ద్వారా చంద్రుడి నమూనాలు భూమీ మీదకు తీసుకువచ్చిన డ్రాగన్ దేశం.. వచ్చే ఏడాదికల్లా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నించడమే కాక వచ్చే నెలలో ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో తాజాగా చైనా మరో అరుదైన రికార్డు సృష్టించి అగ్రరాజ్యం అమెరికా సరసన చేరింది. అంగారక గ్రహంపై చైనా రోవర్ ఝురొంగ్ విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఆ దేశ అదికారిక మీడియా ప్రకటించింది. అమెరికా తర్వాత... మార్స్‌పై రోవర్‌ని దించిన రెండో దేశంగా చైనా నిలిచింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా శనివారం ఉదయం (నేడు).. మార్స్ మీద ఉన్న సున్నితమైన వాతావరణంలో... ఓ విశాల మైదానంలో... రోవర్‌ను సురక్షితంగా దింపినట్లు వెల్లడించింది. ఇక నాసా లాగే... చైనా కూడా... మార్స్‌పై మట్టి ఎలా ఉంది, అందులో ఏ ఖనిజాలు ఉన్నాయి... అక్కడి కొండలు, గుట్టలు అన్నింటినీ అత్యంత దగ్గర నుంచి రోవర్ ద్వారా పరిశీలించగలదు. చైనా మార్స్ మిషన్ ఇది.. గత జులైలో చైనా... తియాన్వెన్-1మిషన్‌ను మార్స్ మీదకు పంపింది. అందులో ఓ ఆర్బిటర్, ఓ ల్యాండర్, ఓ రోవర్ ఉన్నాయి. ఫిబ్రవరి 10న ఈ మిషన్... మార్స్ వాతావరణంలోకి చేరింది. ఆ తర్వాత గుండ్రంగా తిరుగుతూ ల్యాండింగ్ క్షణాల కోసం ఎదురుచూసింది. రోవర్ పేరు ఝురోంగ్. చైనా జనపదాల్లో అగ్నిని ఝురోంగ్ అనేవారు. అదే పేరును దానికి పెట్టింది. ఈ ఝురోంగ్ రోవర్... 240 కేజీల బరువు ఉంది. ఇది సోలార్ పవర్ ఉపయోగించుకొని మార్స్‌పై తిరగగలదు. దీనికి కెమెరాలు, రాడార్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్, వెదర్ స్టేషన్ వంటివి ఉన్నాయి. 1976 నుంచి ఇప్పటి వరకు అమెరికా అంగారక గ్రహంపై తొమ్మిది సార్లు రోవర్లును విజయవంతంగా ల్యాండ్ చేసింది. 1971 లో సోవియట్ యూనియన్ అంగారక గ్రహం మీద అడుగుపెట్టింది. అయితే ల్యాండ్ అయిన తరువాత సమాచారం పంపడంలో విఫలమవడంతో ఈ మిషన్ ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్...! -
అంగారక గ్రహంపై ఆక్సిజన్...!
వాషింగ్టన్: మానవ మనుగడ కోసం భూమి కాకుండా మరో గ్రహాం కోసం నాసా అనేక పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం అంగారక గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తోంది. పరిశోధనల్లో భాగంగా అంగారక గ్రహంపైకి పెర్సివరెన్స్ రోవర్‌ను పంపగా, ఈ రోవర్ అంగారక గ్రహంపై పలు పరిశోధనలు చేస్తోంది. అంగారక గ్రహంపై తొలిసారిగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. మార్స్ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చడంలో నాసా ముందడుగు వేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి పర్సివరెన్స్ రోవర్లో ‘మోక్సీ ’అనే పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం మార్టిన్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి, ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను విచ్చినం చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా, తొలి ప్రయోగంలో మోక్సీ పరికరం 5గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగా, ఇది వ్యోమగామికి అందించే సుమారు 10 నిమిషాల విలువైన శ్వాసకు సమానం అని నాసా తెలిపింది. ఏడు నెలల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపైకి అడుగుపెట్టిన నాసా రోవర్ పర్సివరెన్స్తో పంపిన ఇన్జేన్యూటి, మోక్సీ తమ తొలి ప్రయోగంలో విజయవంతంగా ప్రయోగింపబడ్డాయి. ఆక్సిజన్ ఉత్పత్తి మానవ మనుగడకు కీలక మైలురాయి అని నాసా పేర్కొంది. దీంతో భవిష్యత్‌లో ఆక్సిజన్‌ను భూమి నుంచి తీసుకెళ్లే బాధతప్పింది. ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి బదులుగా మార్టిన్ వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఆక్సిజన్‌గా మార్చే యంత్రాన్ని తీసుకెళ్లడం చాలా సులువని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. అంగారక గ్రహంపై సుమారు 95 శాతం వరకు కార్బన్ డయాక్సైడ్ ఉంది. Another huge first: converting CO2 into oxygen on Mars. Working off the land with what’s already here, my MOXIE instrument has shown it can be done! Future explorers will need to generate oxygen for rocket fuel and for breathing on the Red Planet. https://t.co/9sjZT9KeOR — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) April 21, 2021 చదవండి: నాసా సాధించిన మరో ఘన విజయం..మార్స్‌పై తొలిసారిగా.. -
నాసా సాధించిన మరో ఘన విజయం..
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ఘన విజయాన్ని సాధించింది. మార్స్‌పై హెలికాప్టర్ ఇన్‌జెన్యూటీని నాసా తొలిసారిగా ఎగురవేసింది. తెల్లవారుజామున 3:34 గంటలకు,1.8 కిలోగ్రాముల బరువున్న ఇన్‌జెన్యూటీ మార్స్ ఉపరితలం పైన సుమారు 10 అడుగుల ఎత్తులో, 39.1 సెకన్ల పాటు ఎగిరినట్లు నాసా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియోలను పర్సవరెన్స్ రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను 270 మిలియన్ల కిలోమీటర్ల నుంచి ట్రాన్స్మిట్ చేయడం కోసం సుమారు మూడు గంటల సమయం పట్టిందని నాసా పేర్కొంది. తొలుత ఈ ప్రయోగాన్ని ఏప్రిల్ 11న చేపట్టాలని నిర్ణయించగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ టెస్ట్‌ను నిలిపివేశారు. ఏప్రిల్ 22 న మరోసారి రెండో టెస్ట్ ఫ్లైట్‌ను జరుపనున్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ఎగురవేయడానికి మార్స్‌పై అంతగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఈ మిషన్‌పై మొదట్లో అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం రోజున హెలికాప్టర్ ఇన్‌జెన్యూటీని తొలిసారిగా టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేశామని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను నాసా ట్విటర్లో పోస్ట్ చేసింది. నాసా ఈ పరీక్షను ‘రైట్ బ్రదర్స్ సోదరుల మూమెంట్’ గా అభివర్ణించింది. అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి ‘పర్సవరెన్స్’రోవర్‌ను నాసా పంపిన విషయం తెలిసిందే. పర్సవరెన్స్ రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను పంపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా.. మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను వినియోగించనుండటం ఇదే తొలిసారి. పర్సవరెన్స్ రోవర్‌తోపాటు ఇన్‌జెన్యుటీని పంపినా.. దీనిని పూర్తి ప్రత్యేక ప్రయోగంగానే నిర్వహిస్తున్నారు. అంగారకుడిపై పగటి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు పెరిగి.. రాత్రికి మైనస్ 90 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. "Wow!" The @NASAJPL team is all cheers as they receive video data from the @NASAPersevere rover of the Ingenuity #MarsHelicopter flight: pic.twitter.com/8eH4H6jGKs — NASA (@NASA) April 19, 2021 You wouldn’t believe what I just saw. More images and video to come...#MarsHelicopterhttps://t.co/PLapgbHeZU pic.twitter.com/mbiOGx4tJZ — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) April 19, 2021 చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? -
మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా?
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ అంగారకుడిపైకి చేపట్టిన ‘పర్సవరెన్స్’రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను పంపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా.. మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను వినియోగించనుండటం ఇదే తొలిసారి. పర్సవరెన్స్ రోవర్‌తోపాటు ఇన్‌జెన్యుటీని పంపినా.. దీనిని పూర్తి ప్రత్యేక ప్రయోగంగానే నిర్వహిస్తున్నారు. అంగారకుడిపై పగటి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు పెరిగి.. రాత్రికి మైనస్ 90 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. అక్కడి గాలి చాలా పలుచగా.. భూమితో పోలిస్తే ఒకశాతమే ఉంటుంది. ఈ పరిస్థితులను హెలికాప్టర్ తట్టుకోగలదా?, ఎంత కెపాసిటీతో ఎంత దూరం వరకు ఎగరగలదు?, భవిష్యత్తులో ఏమేం మార్పులు చేయాలన్న అంశాలను పరిశీలించనున్నారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో మార్స్‌పై గాల్లో ఎగురుతూ పరిశీలించే హెలికాప్టర్‌ను పంపుతామని నాసా ఇప్పటికే ప్రకటించింది. అది 1903వ సంవత్సరం.. డిసెంబర్ 17.. ప్రపంచ చరిత్ర మారిపోవడానికి కారణంగా నిలిచిన రోజు.. మనిషి తొలిసారిగా గాలిలో ఎగిరిన రోజు. రైట్ బ్రదర్స్ తాము తయారు చేసిన విమానంలో తొలిసారిగా ప్రయాణించిన రోజు.. ఎంత దూరం.. ఎంత సమయం? ► మార్స్ నుంచి భూమికి దూరం 27.7 కోట్ల కిలోమీటర్లు ► అక్కడి నుంచి ఇక్కడికి సమాచారం చేరడానికి పట్టే సమయం 16 నిమిషాలు ► మినీ హెలికాప్టర్ నుంచి డేటా పర్సవరెన్స్ రోవర్‌కు.. అక్కడి నుంచి మార్స్ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు.. దాని నుంచి భూమిపై ఉన్న నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి డేటా ఓపెన్ కావడానికి గంటకుపైగా పడుతుంది. ఇన్‌జెన్యూటీ ఏంటి.. ఏమున్నాయి? ► ఈ మినీ హెలికాప్టర్ బరువు 1.8 కిలోలు. బరువు తక్కువగా ఉండే అధునాతన మెటీరియల్స్‌తో తయారు చేశారు. ► రెండు రోటార్లు, వాటికి అమర్చిన రెండు జతల కార్బన్ ఫైబర్ బ్లేడ్లతో గాల్లోకి ఎగురుతుంది. ► హెలికాప్టర్ రోటార్లు నిమిషానికి 2,400 చుట్లు తిరుగుతాయి. ► పరిశీలన, పరిశోధనల కోసం మూడు ప్రత్యేకమైన కెమెరాలు, లేజర్, ఇతర పరికరాలు ఉన్నాయి. ► ఇన్‌జెన్యుటీ పొద్దంతా చార్జింగ్ చేసుకుంటుంది. రాత్రి అతిశీతల పరిస్థితిని తట్టుకునేందుకు.. లోపలి నుంచి వేడి చేసుకుంటూ ఉంటుంది. సుమారు 118 ఏళ్ల తర్వాత.. 2021, ఏప్రిల్ 11.. మానవ జాతి చరిత్రలో నిలిచిపోనున్న మరో అద్భుతమైన రోజు.. తొలిసారిగా భూమి అవతలమరో గ్రహమైన అంగారకుడిపై మినీ హెలికాప్టర్ గాల్లో ఎగరనున్న రోజు.. ఒక్కో చోట ఒక్కో టైం.. ఆదివారం ఉదయం 12.30 నిమిషాలకు ఇన్‌జెన్యుటీ మార్స్‌పై గాల్లోకి ఎగరనుంది. అది భూమ్మీది టైం కాదు అంగారకుడి మీది సమయం. అదే భూమ్మీద ఈస్టర్న్ స్టాండర్డ్ టైం (ఈఎస్టీ – అమెరికాలో వినియోగించే టైం) లెక్కన చూస్తే.. ఆదివారం రాత్రి 10.54 గంటలు అవుతుందని నాసా ప్రకటించింది. మన ఇండియాలో ఇది సోమవారం పొద్దున 8.24 గంటలు అవుతుంది. అయితే మార్స్‌పై డేటా రికార్డై పూర్తిగా భూమికి చేరే సరికి అమెరికా టైంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలు, ఇండియా టైంలో మధ్యాహ్నం రెండు గంటల సమయం అవుతుందని అంచనా. మొదట 90 సెకన్లే.. ► మార్స్ ఉపరితలంపై పది అడుగుల ఎత్తులో ఇన్‌జెన్యుటీ ప్రయాణిస్తుంది. ► ఒక్కో ప్రయాణంలో 90 సెకన్ల పాటు తిరుగుతూ ఫొటోలు తీస్తుంది. ► భూమి నుంచి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్‌పై హెలికాప్టర్‌ను రియల్ టైంలో కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అందుకే హెలికాప్టర్ దానికి నిర్దేశించిన సూచనల ఆధారంగా సొంతంగానే గాల్లో ఎగురుతూ.. పరిశీలిస్తుంది. పేరు పెట్టింది భారత సంతతి అమ్మాయే.. ‘ఇన్‌జెన్యూటీ’అంటే చాతుర్యం, బుద్ధి కుశలత అని అర్థం. శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి, తమ మేధస్సును వాడి ఈ మినీ హెలికాప్టర్‌ను తయారు చేశారన్న ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేశారు. మరి ఈ పేరును సూచించింది ఎవరో తెలుసా? అమెరికాలోని అలబామాలో ఉండే 17 ఏళ్ల భారత సంతతి అమ్మాయి వనీజా రూపానీ. నాసా నిర్వహించిన ‘నేమ్ ద రోవర్’పోటీకి వచ్చిన 28 వేల ఎంట్రీల నుంచి ఈ పేరును ఫైనల్ చేశారు. చదవండి: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’ -
Mars: మార్స్ మీద మంచు.. ఇసుక
ఇసుక తిన్నెల్లో మంచుతో ఫొటో బాగుంది కదూ.. ఎక్కడిదీ ఫొటో తెలుసా? ఆ.. ఏముందీ.. ఏదో ఓ ఎడారిలో తీసి ఉంటారు అనుకుంటున్నారా.. కాదు.. ఇది ఎడారిలోనో, ఆ చుట్టూ ఉన్న ఏదో ఓ దేశంలోనో తీసిన ఫొటో కాదు. అసలు భూమి మీద ఏ ప్రాంతం కూడా కాదు.. మనకు కోట్ల కిలోమీటర్ల దూ రంలో ఉన్న అంగారక గ్రహం (మార్స్) మీద తీసిన ఫొటో ఇది. అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ‘మార్స్ ఆర్బిటార్’ శాటిలైట్ తీసిన ఫొటో ఇది. మార్స్ మీద ఉన్న ఓ పేద్ద బిలంలో ఉన్న ఇసుక తిన్నెలను ‘మార్స్ ఆర్బిటార్’కు అమర్చిన హైరైజ్ కెమెరాతో చిత్రీకరించారు. సౌర కుటుంబంలో మన భూమి మాత్రమేనా.. మరో గ్రహం మీద మనిషి బతకగలడా.. అంతరిక్ష శాస్త్రవేత్తల్లో చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. శాస్త్రవేత్తలకే కాదు చాలా మంది సాధారణ జనానికీ ఇదే ఆసక్తి. అందుకే భూమితో పోలిస్తే దగ్గరి పోలికలు ఉండే అంగారకుడిపై శాస్త్రవేత్తలు ఏనాడో దృష్టి పెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా చాలా దేశాలు మార్స్ దగ్గరికి శాటిలైట్లను, ఆర్బిటర్లను పంపాయి. అలా నాసా పంపిన ‘మార్స్ ఆర్బిటర్’ అంగారకుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలను గుర్తించింది. ఈ క్రమంలోనే తాజాగా ఫొటోలు పంపింది. ఆ ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై మంచు ఏర్పడుతూ, అప్పుడప్పుడూ కరిగి ప్రవహిస్తోందని గుర్తించారు. అందుకే కాలువల్లాంటి నిర్మాణాలు ఏర్పడినట్టు తేల్చారు. ఇక్కడ చదవండి: మార్స్‌పై తొలి నగరం ఇలా ఉంటుందా..! మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...! -
మార్స్‌పై తొలి నగరం ఇలా ఉంటుందా..!
ఇంకో వందేళ్లకైనా సరే.. జనాభాతో కిక్కిరిసిపోయి.. వనరులు తగ్గిపోయిన భూమిని వదిలేసి ఇంకో గ్రహానికి వెళ్లకతప్పదని చాలాకాలంగా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అలాంటి ఆలోచనల ప్రతిరూపమే ఈ ‘నువా’! అంగారక గ్రహంపై ఎప్పుడైనా ఓ నగరాన్ని నిర్మిస్తే.. ఇలా కడితే బాగుంటుందని అబిబో అనే ఓ ఆర్కిటెక్చర్ సంస్థ సిద్ధం చేసిన ప్రణాళిక ఇది. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్ మస్క్ 2050 నాటికి అరుణగ్రహంపై మనుషులతో ఓ కాలనీ కట్టేస్తానని ప్రకటించిన నేపథ్యంలో.. అబిబో ప్రతిపాదిస్తున్న ఈ డిజైన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా దేవతల్లో ఒకరైన ‘నువా’పేరుతో సిద్ధం చేసిన ఈ అంగారక నగరం విశేషాలేమిటో చూద్దామా.. అంగారకుడిపై థార్సిస్ ప్రాంతంలో టెంపే మెన్సా శిఖరానికి ఒకవైపున గుహల్లాంటి నిర్మాణాలతో ఉండే నువాలో మొత్తం 2.5 లక్షల మంది వరకు నివసించొచ్చు. ఒక్కో ఇల్లు 25 నుంచి 35 చదరపు మీటర్ల (270–380 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ నగర పరిపాలన వ్యవస్థ చెప్పే పనులు చేస్తూండాలి. పనివేళల్లో 60– 80 శాతం సమయాన్ని ఇందుకు కేటాయించాల్సి ఉంటుంది. అరుణగ్రహంపై వెలువడే రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు నువాలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. టెంపే మెన్సా ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా ఇందుకే. శిఖరానికి ఒకవైపు తక్కువ రేడియో ధార్మికత ఉంటుంది. బతికేందుకు అవసరమైన ఆహారం, నీరు, గాలి వంటివన్నీ అక్కడికక్కడే తయారుచేసుకోవాల్సి ఉంటుంది. గులెం అంగ్లాడా అనే శాస్త్రవేత్త నేతృత్వంలో ఎస్ఓఎన్ నెట్వర్క్ నువాలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. శిఖరం దిగువ భాగంలో నువాలో నివసించే వారు ఒకరిని ఒకరు కలుసుకునేందుకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. పారదర్శకమైన పదార్థంతో తయారైన గోడల కారణంగా అంగారకుడి అందాలను నేరుగా వీక్షించొచ్చు. ఇళ్ల కోసం గుహలను తొలిచే క్రమంలో మిగిలే వ్యర్థాలను రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఉపయోగిస్తారు. ఆసుపత్రి, పాఠశాలలు, క్రీడా స్థలాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్‌కు తగిన ఏర్పాట్లు ఉంటాయి. భూమిపై నుంచి అరుణగ్రహానికి.. అక్కడి నుంచి మళ్లీ భూమికి వచ్చేందుకు అవసరమయ్యే స్పేస్ స్టేషన్, స్థానికంగా అటు ఇటూ వెళ్లేందుకు ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అంతా బాగుంది కానీ ఎప్పుడు కడతారు దీన్ని? అయితే ఈ ప్రశ్నకు ఇప్పటికైతే అబిబో స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేదు. కాకపోతే ఎలన్ మస్క్ లాంటి వారు అరుణగ్రహంపైకి మనుషులను పంపగానే నిర్మాణమూ మొదలు కావొచ్చని అంచనా. – సాక్షి, హైదరాబాద్ చదవండి: మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...! -
మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...!
వాషింగ్టన్: అంగారక గ్రహంపై నీటి జాడకోసం నాసా అనేక పరిశోధనలు జరపుతోంది.అందులో భాగంగా నాసా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. నాసా జరిపిన అధ్యయనం ప్రకారం మార్స్ అంతర్భాగంలో భారీగా నీటిజాడ నిక్షిప్తమై ఉండొచ్చునని తేలింది. ఈ అధ్యయనం ప్రకారం మార్స్‌పై లభించిన ఆధారాలతో , బిలియన్ల ఏళ్ల క్రితం మార్స్అంతటా సమృద్ధిగా కొలనులు , సరస్సులు ,లోతైన మహాసముద్రాలు ఉండేవని పేర్కొన్నారు.అంతా స్థాయిలో ఉన్న నీరు ఎక్కడికి వెళ్లిందనే విషయంపై నాసా పరిశోధనలు చేస్తోంది. నాసా నివేదిక ప్రకారం.. ఒక జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, మార్స్ పై ఉన్న నీరు 30 నుంచి 99 శాతం వరకు గ్రహం అంతర్భాగంలోని ఖనిజాలలో నిక్షిప్తమైనట్లు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) సంయుక్తంగా జరిపిన పరిశోధనల ప్రకారం.. సుమారు నాలుగు బిలియన్ ఏళ్ల క్రితం, అంగారక గ్రహంపై 100 నుంచి 1,500 మీటర్ల లోతులో సముద్రరూపంలో నీరు, గ్రహం మొత్తాన్ని నీటితో కప్పివేసిందనే విషయాన్ని కనుగొన్నారు. బిలియన్ ఏళ్ల తరువాత, మార్స్‌పై ప్రస్తుతం ఉన్న శుష్కనేలలతో పొడిగా ఉండే వాతావరణం ఏర్పడి ఉండోచ్చని తెలిపారు. మార్స్‌పై ప్రవహించిన నీరు అంగారక గ్రహానికి అతి తక్కు వ గురుత్వాకర్షణ శక్తి ఉండటంతో నీరు అంతరిక్షంలోకి వెళ్లి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ విశ్లేషణను మార్స్ రోవర్స్, ఆర్బిటర్స్ అందించిన డేటా సాయంతో కనుగొన్నారు. పరిశోధకుల అధ్యయనం ప్రకారం మార్స్ పొరల్లోని ఖనిజాలలో నీరు ఉండిపోవడం, వాతావరణంలోకి నీరు చేరడం వంటి విధానాలతో మార్స్ పై నీరు లేకుండా పోయిందని తేలింది. నీరు రాతితో కలిసినప్పుడు, రసాయన చర్య జరిగి మట్టి, ఇతర హైడ్రస్ ఖనిజాలు ఏర్ఫడతాయి. నీరు ఖనిజ నిర్మాణంలో భాగమై ఉందని వివరించారు. ఈ చర్య భూమిపైనే కాక అంగారక గ్రహంపై కూడా సంభవిస్తుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: రోవర్ ల్యాండింగ్ సైటు పేరెంటో తెలుసా..) -
రోవర్ ల్యాండింగ్ సైటు పేరెంటో తెలుసా..
లాస్ఎంజిల్స్: అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరన్స్ రోవర్ దిగిన స్థలానికి నాసా పేరుపెట్టింది. రోవర్ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సెవరన్స్ విధి. గతంలో మార్స్‌పై దిగిన క్యూరియాసిటి రోవర్ ల్యాండింగ్ స్థలానికి ‘రే బ్రాడ్బరీ’ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గత ఏడాది జూలై 30 న ఈ రోవర్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే . ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అంగారక గ్రహానికి చేరింది. (చదవండి:మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!) -
ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ సింగర్ గ్రైమ్స్ ఇటీవల ఒక కళా ఖండాన్ని వేలం వేశారు. సింగర్ గ్రైమ్స్ వేసిన పెయింటింగ్ మార్స్ ను ఓ బేబీ కాపాడుతున్నట్లు ఉంది. అయితే, తన డిజిటల్ ఆర్ట్ వర్క్ ను గ్రైమ్స్ వేలం వేయగా మిలియన్ల డాలర్లు ఆమె దక్కించుకున్నారు. అయితే ఆమె తన కళా ఖండాన్ని క్రిప్టో కరెన్సీలో అమ్మటం మరో విశేషం. ట్విట్టర్లో తమ ఆర్ట్ వర్క్ ను వేలానికి పెడుతున్నట్టు గ్రైమ్స్ ట్వీట్ చేసిన 20 నిమిషాల్లో 5.8మిలియన్ డాలర్ల(రూ.42 కోట్ల)కు అమ్ముడైపోయింది. ప్రస్తుత క్రిప్టో ఆర్ట్ మార్కెట్ విలువ వంద మిలియన్ డాలర్ల పైమాటే. అయితే, ఈ డిజిటల్ లోని బేబీ ఎలాన్ మస్క్, గ్రైమ్స్ కు కలిగిన సంతానాన్ని పోలి ఉండటంతో బాగా వైరల్ అయ్యింది. గ్రైమ్స్ గత కొంతకాలంగా ఎన్ఎఫ్టీ ప్లాట్ ఫారంలో ఆర్ట్ పీసులను సింగర్ అయిన తన సోదరుడితో కలిసి అమ్ముతున్నారు. తన ఆదాయంలో కొంత భాగాన్ని కార్బన్ 180కి విరాళంగా ఇవ్వనున్నట్లు గ్రైమ్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇది లాభాపేక్షలేని సంస్థ. కార్బన్ 180 కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తుంది. గ్రైమ్స్ భాగస్వామి ఎలోన్ మస్క్ కూడా ఇదివరకే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఇప్పటికే "డెత్ ఆఫ్ ద ఓల్డ్" అనే మరో ఆర్ట్ పీస్ ను గ్రైమ్స్ సుమారు 4,00,000 డాలర్లకు విక్రయించారు. ఎన్ఎఫ్టీ ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తున్న వారిలో ఈమె కూడా ఒకరు కావటం విశేషం. Dropping NFTs tomorrow at 2pm EST. enter the void pic.twitter.com/l9fNFUCheX — ☘︎𝔊𝔯𝔦𝔪𝔢𝔰 (@Grimezsz) February 28, 2021 చదవండి: ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!
లాస్ఏంజెల్స్: మార్స్‌పై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్‌డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కుజుడిపై పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసింది. ఇందుకు సుమారు 33 నిమిషాలు పట్టిందని నాసా వెల్లడించింది. రోవర్ పనితీరులో ఇది పెద్ద ముందడుగుగా అభివర్ణించింది. రోవర్‌లోని ప్రతి వ్యవస్థ పనితీరును చెక్ చేయడానికి ఈ టెస్ట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపింది. ఇతర గ్రహాలపై రోవర్ల టెస్ట్‌డ్రైవ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, పర్సెవరెన్స్ ఈ పనిని అద్భుతంగా నిర్వహించిందని, దీనివల్ల రాబోయే రెండేళ్ల పాటు రోవర్ పనితీరు బాగుంటుందని నమ్ముతున్నట్లు నాసా సైంటిస్టు అనైస్ జరిఫియన్ చెప్పారు. ఇకపై పరిశోధనల్లో భాగంగా రోవర్ 200 మీటర్ల దూరాలను కూడా కవర్ చేయాల్సిఉంటుందన్నారు. గతనెల 18న ఈరోవర్ మార్స్‌పై లాండ్ అయింది. కుజుడిపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, మనిషి లాండ్ అయ్యే అవకాశాలను పరిశీలించడం దీని విధులు. -
వర్క్ ఫ్రమ్ హోమ్: లండన్ టు అంగారకుడు
భూమి పైనుండి అంగారక పరిశోధనలు జరుపుతున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా.. బ్రిటన్ నుంచి అమెరికా మాత్రం ప్రయాణించలేకపోయారు! కారణం కరోనా నిబంధనలు. ప్రస్తుతం మార్స్ పైనున్న ‘పెర్సీ’ చేత రాళ్లు రప్పలూ, మట్టి ఎత్తించవలసింది ఆయనే. సంజీవ్ గుప్తా జియాలజిస్ట్. నాసా సైంటిస్ట్. ఎర్సీ టీమ్ మొత్తం కాలిఫోర్నియాలోని ‘జెట్ ప్రొపెల్షన్ లేబరేటరీ’ నుంచి పని చేస్తుంటే, ఆ టీమ్ సభ్యుడు అయిన సంజీవ్ ఒక్కరే సౌత్ లండన్ లోని ఒక అపార్ట్మెంట్ నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్నారు! తొమ్మిదేళ్ల తర్వాత పెర్సీ భూమి మీదకు తిరిగి వస్తుంది. అప్పటి వరకు ప్రొఫెసర్ సంజీవ్ (55) ఈ అపార్ట్మెంట్ లోనే 5 కంప్యూటర్ లు, 2 వీడియో కాన్ఫెరెన్సింగ్ స్క్రీన్ లతో 24 గంటలూ పనిచేస్తుంటారు. మార్స్ ది ఒక టైమ్ జోన్. కాలిఫోర్నియాది ఒక టైమ్ జోన్. సౌత్ లండన్‌ది ఒక టైమ్ జోన్. మూడు భిన్నమైన టైమ్ జోన్ల పర్మినెంట్ ‘జెట్ లాగ్’ నుంచి ఆయన్ని సేద తీర్చే మోనిటర్లు భార్యాపిల్లలే. ఇంతలా వర్క్‌ని, హోమ్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా ‘గ్రహస్తు జీవితం’ గురించి తెలుసుకోవలసిందే. దక్షిణ లండన్‌లోని ఒక అపార్ట్మెంట్లో దిగువ భాగాన ఉన్న హెయిర్ కటింగ్ సెలూన్‌కు సరిగ్గా పై పోర్షన్లో ఉంటారు ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా. అక్కడి నుంచి ఆయన తన ఆఫీస్ వర్క్ చేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటిలో నుంచి ఆఫీస్ పని చేస్తున్నా, ఆయన చేస్తున్నది భూమి పై ఉన్న ఆఫీస్ పని కాదు. మార్స్ పని! వాడుక పలుకుబడిలో చెప్పాలంటే.. ఈ నెల 18న అంగారకుడిపై దిగిన రోవర్ ‘పెర్సీ’ చేత మట్టి తట్టలు మోయించే పనిలో ఉన్నారు సంజీవ్ గుప్తా! కేవలం మట్టి మాత్రమే కాదు. రాళ్లూ రప్పలు కూడా. పెర్సీ వాటిని చిన్న చిన్న మూటలు కట్టి ఉంచుతుంది. తిరిగి భూమిపైకి వచ్చేటప్పుడు తనతో పాటు ఆ మూటల్ని తెస్తుంది. ఆ తర్వాత వాటిని స్టడీ చేసే బాధ్యత కూడా సంజీవ్ గుప్తాదే. ఆయన జియాలజిస్టు. భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి ఒక్కటే కాదు. గ్రహాల ఉపరితలాల నేలల్ని, సముద్రాల అట్టడుగుల్నీ అధ్యయనం చేయగల నిపుణులు. నాసా సైంటిస్ట్. పెర్సీని అంగారకుడికి పంపడంలోని నాసా ఉద్దేశం తెలిసిందే. మానవ నివాస యోగ్యమైన వాతావరణం అక్కడ ఉందా లేదా, ఉండి ఉండేదా అని తెలుసుకోవడం. నాసా కోసం ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా (55) ఉండవలసింది యూ.ఎస్‌లోనే అయినప్పటికీ బ్రిటన్ నుంచే పని చేస్తున్నారు. ఇండియా నుంచి వలస వెళ్లిన కుటుంబం వాళ్లది. గుప్తా లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్. యు.ఎస్. మార్స్ ‘పెర్సీ’ ప్రాజెక్ట్ బృందంలో ఆయన కీలక సభ్యుడు. భార్యా పిల్లలు లండన్‌లో ఉండటంతో వాళ్లతోపాటు సంజీవ్‌ను అక్కడే ఉండి ప్రాజెక్ట్ పని చేసేందుకు నాసా సమ్మతించింది. అందుకు అవసరమైన ఉపకరణాలను, టెక్నాలజీని ఆయన ఆపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసింది. ఐదు కంప్యూటర్లు, రెండు వీడియో కాన్ఫరెన్సింగ్ స్క్రీన్లు, మధ్య మధ్య భార్య అందించే టీ, టిఫిన్లు, భోజనం, కాఫీలతో ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది. నిద్రవేళల్ని కూడా మెల్లిగా ఆయన క్రమబద్ధం చేసుకోగలిగారు. అంగారకుడిపై ఉన్న రోవర్ కదలికల్ని అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మూడు వేర్వేరు ప్రాంతాల సమన్వయంతో నియంత్రిస్తూ ఉండవలసిన ఒక శాస్త్రవేత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందో ఊహించండి. పెర్సీ ఉన్నది మార్స్ మీద. పెర్సీ బృందం ఉన్నది కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో. ప్రొఫెసర్‌గారు ఉన్నది దక్షిణ లండన్‌లోని తన అపార్ట్మెంట్లో. మూడూ మూడు టైమ్ జోన్లు. ఒకసారి విమానయానం చేసొస్తేనే ‘జెట్ లాగ్’ అంటుంటారు. అలాంటి వివిధ టైమ్ జోన్లలో సంజీవ్ గుప్తా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆ శక్తిని ఇస్తున్నది చేస్తున్న పని ధ్యాస మాత్రమే కాదు. భూమిపై ఆయన్నొక పెర్సీలా కనిపెట్టుకుని ఉంటున్న అర్ధాంగి కూడా. జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో వందల మంది నాసా సైంటిస్టులు ల్యాప్‌టాప్‌లోకి కూరుకుపోయి గడియారాల్లా పని చేస్తుంటారు. వారందరితో ఏకకాలంలో గానీ, విడివిడి గానీ ప్రొఫెసర్ సంజీవ్ మాట్లాడవలసి ఉంటుంది. ఇది ఆయన కు పెద్దసంగతేమీ కాదు. ప్రస్తుతం ఆయన మానసికంగా 2030లో ఉన్నారు! భూమిపైకి పెర్సీ మణులు మాణిక్యాల్లాంటి మట్టి రాళ్లను తీసుకొచ్చే సంవత్సరం అది. 1,043 కిలోల బరువు గల ఆ రోవర్‌ను అంగారకుడిపై కదిలిస్తూ ఉండే శాస్త్రవేత్త ఒకరు. రీచార్జ్ చేస్తుండేవారొకరు. ప్రోగ్రామింగ్ చేస్తుండేవారు వేరొకరు. ఇలా పెర్సీ ప్రాజెక్ట్ టీమ్‌లో ప్రొఫెసర్ సంజీవ్ ఒకరు. ఏ రాయిని పడితే ఆ రాయిని, ఏ ధూళిని పడితే ఆ ధూళిని కాకుండా, జీవం కనుగొనేందుకు వీలైన వాటిని పెర్సీ చేతబట్టేలా చేయడం ఆయన ప్రధాన విధి. పెర్సీ దిగేందుకు ‘జెజెరో’ బిలాన్ని ఎంపిక చేసినవారిలో సంజీవ్ కూడా ఉన్నారు. సంజీవ్ గుప్తాకు 5 ఏళ్ల వయసులో ఆయన తల్లిదండ్రులు ఆగ్రా నుంచి బ్రిటన్ వలస వెళ్లారు. ఆయన తండ్రి కూడా రిసెర్చ్ సైంటిస్టే. అయితే తన కొడుకు మెడిసిన్ గానీ, మామూలు ఇంజినీరింగ్ గానీ చేయాలని ఆయన అనుకున్నారు. సంజీవ్ మాత్రం జియాలజీ వైపు ఆకర్షితులయ్యారు. ఆల్ప్ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయనే విషయమై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ‘సెయింట్ క్రాస్ కాలేజీలో’ సంజీవ్ పీహెచ్.డీ చేశారు. హిమాలయాలు, జర్మనీలోని ‘బ్లాక్ ఫారెస్ట్’ పర్వత శ్రేణులు, అట్లాంటిక్ సముద్ర గర్భంలోని అడుగు నేలలపైన కూడా సంజీవ్ గుప్తా అధ్యయనం జరిపారు. అంగారకుడిపై నీటి జాడలు ఉండేవని కానీ, ఉన్నట్లు లేవని ఈ ప్రపంచానికి నిర్థారణగా చెప్పగలవారు ప్రస్తుతానికైతే గుప్తా ఒక్కరే. అలాగని అందుకు తోడ్పడే పెర్సీ ‘మట్టిమూటల’ కోసం ఆయన మరో పదేళ్లు ఆగనక్కర్లేదు. ఈలోపే వేరొక మార్గంలో అంగారకుడి నుంచి భూమి పైకి ఆక్కడి మట్టి నమూనాలు చేరినా చాలు. వాటిని సంజీవ్ విశ్లేషిస్తారు. ‘వేరొక మార్గం’ అంటే.. ఇప్పుడు పెర్సీని అంగారకుడిపై వదిలి వచ్చిన వన్ టైమ్ రాకెట్ కాకుండా, భూమిపైకి తిరిగి వచ్చే రీ యూజబుల్ రాకెట్ అక్కడికి వెళ్లినప్పుడు పెర్సీ సేకరించిన నమూనాలను తీసుకురావడం. తెచ్చి సంజీవ్ చేతికివ్వడం. -
మార్స్‌పై మహిళా శక్తి
‘పెర్సీ’ రోవర్ మార్స్ పైన దిగి వారం అయింది. ఇప్పుడేం చేస్తూ ఉంటుంది? ఏం చేయడం లేదు. ఉన్న చోటే ఉండి భూమి పైకి ఫొటోలు పంపుతూ ఉంది. పెర్సీ ఒక్కటే లేదు అక్కడ. తల్లి ఒడిలో బిడ్డలా (కంగారూ తల్లీబిడ్డల్ని ఊహించండి) పెర్సీ పొదుగు కింద ‘ఇంజిన్యూటీ’ అనే హెలికాఫ్టర్ కూడా ఉంది. ఆ బిడ్డకు తల్లి పాలిస్తూ ఉంది. 30 పర్సెంట్ ఛార్జింగ్ అయింది ఇప్పటికి. పాలివ్వడం పూర్తవగానే బిడ్డకు రెక్కలొచ్చి మార్స్ పై ఎగురుకుంటూ తిరుగుతుంది. అదలా ఎగరగానే పెర్సీ కూడా మెల్లిగా కదలడం, ముందుకీ వెనక్కూ అడుగులు వేయడం మొదలు పెడుతుంది. మార్స్ పై నున్న తల్లీబిడ్డల్ని యాక్టివేట్ చేయించే పని.. కింద కన్సోల్ లో ఉన్న ‘నాసా’ టీమ్ ది. టీమ్ లో 12 మంది భారత సంతతి సైంటిస్టులుగా కాగా.. వారిలో 8 మంది మహిళలే! నాసా పంపిన ‘పెర్సీ’ రోవర్ ఈ నెల 18 న అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అక్కడే ఏడాది పాటు ఉండి మానవ నివాస యోగ్యమైన వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నదీ లేనిదీ పెర్సీ కనిపెట్టి చెబుతుంది. భూమికి, అంగారకుడికి మధ్య దూరం సుమారు 21 కోట్ల 80 లక్షల కిలోమీటర్లు. పెర్సీ అంతదూరం నిరంతరాయంగా ప్రయాణించి మార్స్ పైకి చేరడమే గొప్ప ‘భూవిశేషం’ అని చెప్పాలి! మానవ నిర్మితం కనుక. యూఎస్‌లోని ఫ్లోరిడా నుంచి ‘అట్లాస్’ అనే రాకెట్ ‘పెర్సీ’ రోవర్‌ని, పెర్సీకి తగిలించిన ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్ని భద్రంగా మోసుకెళ్లి పైన వదిలి పెట్టింది. ఇక తర్వాతిదంతా భూమి మీద ఫ్లారిడాలోని పెర్సీ ప్రాజెక్ట్ నాసా శాస్త్రవేత్తల పనే. పెర్సీని రాకెట్లో ఉంచి మార్స్ పైకి పంపిన ఈ బృందం చేతుల్లోనే.. పెర్సీ అక్కడ తన పని ప్రారంభించడానికి, కొనసాగించడానికి, పూర్తి చేయడానికి ఆదేశాలిచ్చే ముఖ్యమైన మీటలన్నీ ఉంటాయి. టీమ్ మొత్తంలో కనీసం 12 మంది భారత సంతతి శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో 8 మంది మహిళలే. నేడు భారత్ ‘నేషనల్ సైన్స్ డే’ కనుక.. ఈ సందర్భంగా పెర్సీ ‘కన్సోల్’ రూమ్‌లో కూర్చొని ఉన్న మన సైంటిస్టులు ఎవరెవరు ఏయే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో తెలుసుకుందాం. మొదట బాబ్ బలరామ్ గురించైతే తప్పక చెప్పుకోవాలి. ఈ క్షణాన అంగారక గ్రహంలో రోవర్ పొదుగున చార్జ్ అవుతున్న ‘ఇన్‌జెన్యూటీ’ అనే ఆ హెలికాప్టర్ని కనిపెట్టింది ఆయనే. బాబ్ 1990 లలోనే ఇలాంటి మార్స్ హెలికాప్టర్ ఆలోచన చేశారు. అయితే అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. ‘అసాధ్యం’ అన్నారంతా. బాబ్ మెడ్రాస్ ఐ.ఐ.టి విద్యార్థి. నాసాలో అధ్యయనం చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం మళ్లీ మార్స్ హెలికాప్టర్ టాపిక్ వచ్చింది. నాసా ‘జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ’ (జె.పి.ఎల్) డైరెక్టర్ తన ప్రసంగంలో.. మార్స్‌పై ఎగిరే హెలికాప్టర్‌ను తయారు చేయలేమా? అనే ప్రశ్న సంధించినప్పుడు సమావేశంలో ఉన్న కొందరు అప్పటికి దశాబ్దం క్రితమే జరిగిన బాబ్ బలరామ్ ప్రయత్నాల గురించి చెప్పారు. వెంటనే ఆ డైరెక్టర్ నుంచి బాబ్‌కు పిలుపు వెళ్లింది. బాబ్, ఆయన బృందం ఎనిమిది వారాలు కష్టించి మార్స్ హెలికాప్టర్‌ను కనిపెట్టేందుకు పట్టే సమయం, అయ్యే ఖర్చుపై అంచనాలు వేసి ఇచ్చారు. ఆ క్రమంలో ఏడేళ్ల నిర్విరామ కృషితో తయారైనదే ఇప్పుడు మార్స్ పైన ఛార్జింగ్ అవుతూ ఉన్న ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్. అంటే నాసా తొలి మార్స్ హెలికాప్టర్ ఆలోచన కర్త, సృష్టికర్త మన భారతీయుడే. అందుకే ఈ ఏడాది నేషనల్ డే మనకు ప్రత్యేకమైనది. ఈ ప్రతిష్టాత్మకమైన ‘మార్స్ 2020 మిషన్’ లో బాబ్ బలరామ్‌తో పాటు మహిళా సైంటిస్టులు స్వాతి మోహన్, వందనా వర్మ, నాగిన్ కాక్స్, యోగితా షా, ఉషా గూడూరి, కవితా కౌర్, ప్రియాంక శ్రీవాత్సవ, శివాలీ రెడ్డి; మిగతా సైంటిస్టులు విష్ణుశ్రీధర్, సౌమ్యోదత్తా, నీల్ పటేల్ పాలు పంచుకున్నారు. పెర్సీ ప్రాజెక్టులో ప్రతిదీ కీలకమైన ప్రాజెక్టే అయినప్పటికీ.. ప్రధానమైన బాధ్యతలన్నిటినీ స్వాతీ మోహన్ నిర్వర్తిస్తున్నారు. రోవర్‌కి గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ లీడ్ ఆమె విధులు. రోవర్‌ని కదిలించే బాధ్యత వందనా వర్మది. అంగారకుడిపై ఉన్న రోవర్ ప్రస్తుతం ‘వామింగ్ అప్’ మోడ్‌లో స్థిరంగా ఉంది. ఇకపై ఆమే రోవర్‌కి నడకలు నేర్పించాలి. నాగిన్ కాక్స్ డిప్యూటీ టీమ్ చీఫ్. ఆమె ఆధ్వర్యంలోనే పెర్సీ ఇంజినీరింగ్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. నాగిన్ బెంగళూరు అమ్మాయి. గతంలో యు.ఎస్. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆమె పెరిగిందంతా మలేషియా, అమెరికాలలో. నాగిన్కు నాసా, నాసా వారి జె.పి.ఎల్.లో స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ ఇంజినీర్ గా 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇక యోగితా షా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరు. కమ్యూనికేషన్, నేవిగేషన్లకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. ఆమెది మహారాష్ట్రలోని ఔరంగాబాద్. జె.పి.ఎల్.లో ఫ్లయిట్ సిస్టమ్స్ ఇంజినీరుగా శిక్షణ పొందారు. ఉషా గూడూరి సాఫ్ట్వేర్ ఇంజినీరు. యాక్టివిటీ ప్లానింగ్, సబ్‌సిస్టమ్ సీక్వెన్సింగ్లకు సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టడం ఆమె వంతు. బిట్స్ పిలానీలో చదివారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉషకు 18 ఏళ్ల అనుభవం ఉంది. ‘కాస్సినీ’ ప్రాజెక్టులోనూ కీలక పాత్ర పోషించారు. శనిగ్రహంపై పరిశోధనలకు నాసా రూపొందించిన నాలుగో ప్రాజెక్టే కాస్సినీ. అలాగే ‘డాన్’ అనే మరొక ఉపగ్రహ పరిశోధన ప్రాజక్టుకు కూడా. ఇక కవితా కౌర్ గ్రౌండ్ డేటా సిస్టమ్స్ నిపుణురాలు. ఆమెది చండీఘడ్. ప్రియాంక శ్రీవాత్సవ సిస్టమ్స్ ఇంజినీరు. లక్నో, పంజాబ్‌లలో చదువుకున్నారు. నాసా ఫ్లయిట్ మిషన్లలో పని చేశారు. ఇప్పుడీ మార్స్ మిషన్‌లో మోటార్ కంట్రోల్ అసెంబ్లీలో బాధ్యత ప్రియాంకదే. ఆమెకు సహాయంగా శివాలీ రెడ్డి ఉంటారు. వీరు కాక.. మిగిలిన ముగ్గురిలో విష్ణు శ్రీధర్ అంగారకుడిపై రాళ్లు, రప్పల్ని విశ్లేషిస్తారు. సౌమ్యోదత్తా రోవర్ కదలికల్ని స్టడీ చేస్తారు. నీల్ పటేల్ అంతరిక్ష పదార్థాలను సేకరించేందుకు రోవర్‌కి ఆటోమేటెడ్ సిస్టమ్‌ని అందజేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలు మహిళలవి కావు అన్నట్లు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మహిళలు లేకుండా సైన్స్ ముందుకు సాగలేని పరిస్థితి! ప్రతిభకు, నైపుణ్యానికీ స్త్రీ, పురుష భేదం ఉండదని అనేక మిషన్లు నిరూపించాయి. ఇప్పుడీ మార్స్ 2020 మిషన్ కూడా. నేటి ‘నేషనల్ సైన్స్ డే’ని భారత్ సగర్వంగా జరుపుకోడానికి కారణమైన మన ‘అంగారక’ సైంటిస్టులకు, ముఖ్యంగా మహిళా సైంటిస్టులకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే అభినందనలు. -
పెర్సి ల్యాండింగ్ : అద్భుతం, తొలి ఆడియో
వాషింగ్టన్: మార్స్‌పై జరుగుతున్న పరిశోధనల క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంగారక గ్రహంపై ‘పర్సవరన్స్’ రోవర్ ల్యాండ్ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. ‘‘రోవర్‌లోని మైక్రోఫోన్ మార్స్ నుండి వచ్చే శబ్దాలను ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి..ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు" అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ ఆనందంగా ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఈ ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు 7 కెమెరాలను ఆన్ చేశామని, రోవర్లో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ వెల్లడించారు. (పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా) పర్సవరన్స్ రోవర్ శుక్రవారం అరుణగ్రహంపై ల్యాండ్ అయినసంగతి తెలిసిందే. ఇది రెడ్ ప్లానెట్‌లో ప్రవేశించిన, డీసెంట్ అండ్ ల్యాండింగ్ (ఇడీఎల్) చివరి నిమిషాల్లో ప్రధాన మైలురాళ్లను రికార్డు చేసింది. రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను సాధించాం ఈ సందర్భంగా మార్స్ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్ అరుణగ్రహంపై దిగుతున్న సమయంలో లేచిన ధూళి మేఘం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం స్పష్టంగా కనిపించిందని నాసా ఇంజనీర్లు ప్రకటించారు. Your front-row seat to my Mars landing is here. Watch how we did it.#CountdownToMars pic.twitter.com/Avv13dSVmQ — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 Now that you’ve seen Mars, hear it. Grab some headphones and listen to the first sounds captured by one of my microphones. 🎧https://t.co/JswvAWC2IP#CountdownToMars — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 -
నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..?
కేప్ కెనవరెల్: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన తాజా ప్రయోగంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా ఉన్నారు. అంతరిక్షం పట్ల చిన్ననాటి నుంచే అమితాసక్తి కలిగిన స్వాతి మోహన్.. భారత్ నుంచి ఏడాది వయసులో తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు. స్టార్ ట్రెక్ స్ఫూర్తితో.. నార్తర్న్ వర్జినియా, వాషింగ్టన్ డీసీల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఎస్ చేశారు. ఎంఐటీ నుంచి ఏరోనాటిక్స్/ఆస్ట్రోనాటిక్స్లో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఉద్యోగ విధుల్లో భాగంగా నాసాలో పలు ప్రాజెక్టుల్లో పాలు పంచుకున్నారు. కేసిని (శనిగ్రహం పైకి), గ్రెయిల్ (చంద్రుడిపైకి) ప్రయోగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ ‘మార్స్ 2020’ ప్రయోగం 2013లో ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్ స్వాతి మోహన్ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలిసారి టీవీలో ‘స్టార్ ట్రెక్’సిరీస్ చూసిన 9 ఏళ్ల వయసు నుంచే స్వాతిలో అంతరిక్షం పట్ల ఆసక్తి ప్రారంభమైంది. చదవండి: అరుణ గ్రహంపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండైన ‘పెర్సి’ ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ? -
నాసా ముందడుగు.. ల్యాండైన ‘పెర్సి’
కేప్ కెనవరెల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ముందడుగు వేసింది. నాసా ‘పర్సవరన్స్’ రోవర్ ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అరుణ గ్రహంపై ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్‌కు సంబంధించిన సంకేతాలను కాలిఫోర్నియాలోని నాసాజెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి పంపించింది. ఇది అంగారక గ్రహంపై ఉన్న రాళ్లు, మట్టిని సేకరించనుంది. కాగా..మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్’నిలిచింది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్’నాసా పంపిన అతిపెద్ద, అత్యాధునిక రోవర్. రోవర్ ప్రత్యేకతలు.. ఇది ప్లుటోనియం ఇంధనాన్ని కలిగి ఉండి, కారు సైజులో ఉంటుంది. ఇది అరుణ గ్రహంపై నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో సంచరించనుంది. ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. కీలక బాధ్యతలు నిర్వహించిన భారత మహిళ.. ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహించారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహించారు. ‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరించారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్ అండ్ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే. -
మార్స్ పైకి ‘పెర్సీ’
కేప్ కెనవరెల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’పంపించిన ‘పర్సవరన్స్’ రోవర్ గురువారం(భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున) ఆ గ్రహంపై దిగనుంది. ‘మార్స్ 2020’ ప్రయోగంలో భాగంగా అక్కడ రాళ్లు, మట్టి తదితరాలను సేకరించనుంది. రోవర్ అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన తరువాత ఆ విషయాన్ని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి సంకేతాలను పంపిస్తుంది. ల్యాండింగ్ విజయవంతమైతే.. మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్’ నిలుస్తుంది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్’ నాసా పంపిస్తున్న అతిపెద్ద, అత్యాధునిక రోవర్. ఇది కార్ సైజ్‌లో ఉంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది. అంగారక గ్రహంపై ఉన్న పురాతన నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో ఈ రోవర్ దిగనుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది. స్వాతి మోహన్ కీలక పాత్ర ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్ అండ్ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే. -
ఐదేళ్లలో అంతరిక్ష నగరాలు!?
సౌర కుటుంబంలో కుజుడు (మార్స్), జూపిటర్ (గురు) మధ్య ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్‌లోని వేలాది గ్రహ శకలాలు పరిభ్రమిస్తుంటాయని తెలిసిన సంగతే! ఈ బెల్టులోని పెద్ద పెద్ద శకలాల చుట్టూ సమీప భవిష్యత్ లో మానవ ఆవాసాలు (హ్యూమన్ సెటిల్మెంట్స్) సాధ్యమేనని ఫిన్లాండ్ సైంటిస్టు డా. పెక్కా జాన్హ్యునన్ చెబుతున్నారు. అది కూడా ఎప్పుడో కాదని, వచ్చే నాలుగైదేళ్లలో 2026 నాటికి హ్యూమన్ కాలనీలు ఏర్పడతాయంటున్నారు. వచ్చే 15 సంవత్సరాల్లో లక్షలాది మంది ఈ మెగాసిటీలో నివాసం ఉండేందుకు తరలిపోతారంటున్నారు. ఈ మేరకు ఆయన ‘మెగా శాటిలైట్’ పేరిట ఒక రిసెర్చ్ పేపర్‌ను పబ్లిష్ చేశారు. ఈ బెల్టులోని అతిపెద్ద గ్రహ శకలం సీరిస్ చుట్టూ పరిభ్రమించేలా శాటిలైట్ నగరాలు నిర్మించవచ్చని చెప్పారు. సీరిస్ గ్రహం భూమి నుంచి 32.5కోట్ల మైళ్ల దూరంలో ఉంది. ఆర్టిఫిషియల్ గ్రావిటీతో ఈ శాటిలైట్ కాలనీలు ఏర్పాటు చేయవచ్చని జాన్ చెప్పారు. ఇప్పటివరకు అంతరిక్షంలో మానవ సెటిల్మెంట్ ఆలోచనలన్నీ చంద్రుడు, కుజుడు, టైటాన్ చుట్టూనే తిరిగాయి. తొలిసారి జాన్ విభిన్న సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నార ప్రతిపాదిత శాటిలైట్ సిటీ డిస్క్ ఆకారంలో ఉంటుందని, వేలాది స్థూపాకార నిర్మాణాలు ఇందులో ఉంటాయని, ఒక్కో నిర్మాణంలో 50 వేల మంది నివసించవచ్చని చెప్పారు. వీటిని శక్తిమంతమైన అయిస్కాంతాలకు లింక్ చేయడం వల్ల కృత్రిమ గ్రావిటీని సృష్టించి వీటిని స్థిరంగా ఉంచవచ్చన్నారు. 15 సంవత్సరాల తర్వాత ఈ కాలనీల్లో ప్రజలు సీరిస్‌పై వనరులు తవ్వడం ఆరంభించవచ్చని అంచనా వేశారు. సీరిస్ నుంచి శాటిలైట్ నగరానికి వచ్చేందుకు స్పేస్ ఎలివేటర్లు ఉంటాయన్నారు. సీరిస్‌పై వాతావరణంలో నైట్రోజన్ ఎక్కువని, అందువల్ల భూమి వాతావరణానికి దగ్గనడి ఉంటుందని చెప్పారు. ఇన్ని చెబుతూ, ఇలా ఏర్పరిచే కృత్రిమ నగరాలకు ఆస్ట్రాయిడ్స్ నుంచి, స్పేస్ రేడియేషన్ నుంచి ముప్పు పొంచి ఉంటుందని తేల్చేశారు. ఈ ముప్పులను తట్టుకునేందుకు శాటిలైట్ సిటీల చుట్టూ స్థూపాకార అద్దాలు ఏర్పరచాలని సూచించారు. ఇవన్నీ వింటుంటే సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదా! కానీ జాన్ ప్రతిపాదన మాత్రం అంతరిక్షంలో మానవ ఆవాసాల ఏర్పాటుపై కొత్త కోణాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
చంద్రుడి పైకి తొలి మహిళ!
ఆకాశంలో సగం అనే నానుడిని నిజం చేస్తూ మగువ అన్ని రంగాల్లో మగవాడికి దీటుగా దూసుకుపోతోంది. ఏరంగంలో పురుషులకు తీసిపోమంటూ అంతరిక్ష ప్రయాణం కూడా పూర్తి చేసుకున్న స్త్రీ శక్తి త్వరలో చంద్రుడిపై కాలు మోపేందుకు సిద్ధమవుతోంది. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రైన్లు తొలిసారి చంద్రోపరితలంపై కాలుపెట్టారు. వీరితో కలిసి ఇంతవరకు 12 మంది పురుషులు చంద్రుడిపైకి విజయవంతంగా వెళ్లి తిరిగి వచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క మహిళా వ్యోమగామికి ఈ అవకాశం రాలేదు. కానీ ఈ దఫా అమెరికా నాసా సంస్థ తమ ఆర్టిమిస్ మిషన్‌లో భాగంగా తొలిసారి చందమామపైకి మహిళా వ్యోమోగామిని పంపాలని యోచిస్తోంది. ఇందుకోసం బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన డా. జెస్సికా మెయిర్‌ను ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఆర్టిమిస్ మూన్ లాండింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే మరో 17మంది ఆస్ట్రోనాట్లతో కలిసి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చంద్రయానానికి అవకాశం వచ్చిన తొలి మహిళ కావడం తనకెంతో సంభ్రమాన్ని కలిగించిందని జెస్సికా చెబుతోంది. చంద్రుడి ఉపరితలంపై నడిచేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటోంది. మిషన్‌లో అంతిమంగా పాల్గొనే ఆస్ట్రోనాట్ల పేర్లు ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా, తప్పక తనను ఎంచుకుంటారని ఆమె ధీమాగా ఉంది. చివరి నిమిషంలో ఒకవేళ మూన్ జర్నీ అవకాశం తప్పిపోయినా బాధపడేది లేదని, తాను వెళ్లకపోయినా, తన కొలీగ్స్‌లో ఒకరు వెళ్తున్నారనే తృప్తి చాలని చెబుతూ పెద్దమనసు చాటుకుంది. రాబోయే ఆర్టిమిస్ మిషన్ కేవలం చంద్రుడిపైకి అలా వెళ్లి ఇలా రావడం కోసం కాదని, భవిష్యత్‌లో మార్స్ ప్రయాణాలకు ఇది మార్గదర్శకమవుతుందని వివరించింది. అలాగే చంద్రుడిపై ఒక శాశ్వత మానవ కాలనీ నిర్మాణానికి సంబంధించి ఈ మిషన్ తొలిమెట్టుగా మారవచ్చని నిపుణుల అంచనా. -
వాషింగ్టన్: స్టార్‌షిప్ నమూనా రాకెట్ క్రాష్
-
మరోసారి విఫలమైన ‘స్పేస్ఎక్స్’
వాషింగ్టన్: మార్స్ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘స్సేస్ ఎక్స్’ హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్‌షిప్ నమూనా ఒకటి ల్యాండ్ అవుతుండగా పేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. టెక్సాస్‌లో బుధవారం ఉదయం టెస్ట్ లాంచ్ సందర్భంగా ఈ పేలుడు చోటు చేసుకుంది. కానీ సంస్థ మాత్రం ఎంతో ‘అద్భుతమైన పరీక్ష.. స్టార్‌షిప్ టీమ్‌కు ధన్యవాదాలు’ అంటూ మెసేజ్ చేయడం గమనార్హం. టెస్ట్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్ట్‌ని ఉద్దేశించి ‘మార్స్.. మేం రాబోతున్నాం’ అంటు ట్వీట్ చేశారు. ల్యాండింగ్ స్పీడ్‌ను పెంచడం వల్లే ఈ పేలుడు సంభంవించినట్లు సమాచారం. స్టార్‌షిప్ క్రాష్ అయినప్పటికి.. ఈ పరీక్షలో విజయవంతమైన భాగాలను ఎలాన్ వివరించారు. టేకాఫ్, దాని (పేలుడు పూర్వ) ఖచ్చితమైన ల్యాండింగ్ పథం వంటి అంశాల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ‘స్టార్ షిప్ కూలిపోయినప్పటికి మాకు అవసరమైన మొత్తం డాటా లభించింది! అభినందనలు స్పేస్ఎక్స్ బృందం" అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.(చదవండి: ‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్టు) బుధవారం టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌షిప్ కక్ష్యలోకి అధిరోహించింది, ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి ఇంజన్లు బయటకు వచ్చాయి. నింగిలోకి దూసుకెళ్లిన 4 నిమిషాల 45 సెకన్ల వ్యవధి తర్వాత స్టార్‌షిప్ మూడవ ఇంజిన్ ఆరిపోయింది. దాన్ని నెమ్మదింపజేసే ప్రయత్నంలో అంతవరకు ఆపేసిన ఇంజన్లను పునః ప్రారంభించారు. కాని అది భూమిపైకి దూసుకెళ్లింది. క్రాష్ అయ్యింది. -
ఆకాశంలో 8:15 గంటలకు సర్ప్రైజ్..
న్యూఢిల్లీ: బాల్యంలో ఆరుబయట వెన్నెల్లో పడుకుని.. చందమామను చూస్తూ.. చుక్కల్ని లెక్కపెడుతూ.. అలా అలా ఎప్పుడు నిద్రలోకి జారుకునే వాళ్లమో తెలిసేది కారు. కానీ ఇప్పటి పిల్లలకు ఇవేం తెలియవు. స్మార్ట్‌ఫోన్‌తోనే శుభోధయం.. దానితోనే నిద్ర. ఇక చందమామ, నక్షత్రాలు లెక్కించడం వంటి సరదాలు కల్లే. ఇక పట్టణాల్లో ఉండే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. రోజు ఎలా ఉన్నా కానీ ఈ రోజు మాత్రం కాస్త తీరిక చేసుకుని ఓ సారి ఆకాశం వైపు చూడండి.. మీరో తేడాని గమనిస్తారు. ఏంటి అనుకుంటున్నారా అక్టోబర్ 31 రాత్రి ‘బ్లూ మూన్’ దర్శనమియనుంది. అంటే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడా ఏంటి అనే డౌట్ వద్దు. రోజు చూసే వర్ణంలోనే ఉంటాడు. కాకపోతే ఈ రోజు మరి కాస్త పెద్దగా.. ఎక్కువ ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. చంద్రుడు ఇలా భారీ సైజులో ఏడాదికి 12 సార్లు కనిపిస్తాడు. బ్లూ మూన్ పేరేలా వచ్చింది.. చంద్రుడు ఏడాదికి 12 సార్లు పెద్దగా దర్శనమిస్తాడని చెప్పుకున్నాం కదా.. అలా ప్రతి పూర్ణ చంద్రుడుకి ఒక పేరు పెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ సీజన్లో మూడవ పౌర్ణమికి ‘బ్లూ మూన్’ అనే పేరు వచ్చింది. నెలలో వచ్చే రెండో పౌర్ణమికి ఇలా ప్రత్యేకమైన పేరు ఉందనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం సీజనల్ బ్లూ మూన్, నెలవారీ ‘బ్లూ మూన్’ ఉన్నాయి. ఈ రోజు దర్శనమిచ్చే బ్లూ మూన్ నెలవారీది. (చదవండి: చందమామ నీటి కుండ.. జాబిల్లిపై నీరుందట!) బ్లూమూన్ వెనక మరో కథ.. ఈ పేరు వెనక మరో కథ ఉంది. ఒకానోక ‘బ్లూ మూన్’ అనే పదబంధం నుంచి ఇది పుట్టిందని సమాచారం. నాసా ప్రకారం 1883 ఇండోనేషియాలోని క్రాకాటోవా అనే అగ్ని పర్వతం పేలి భారీ ఎత్తును వెలువడిన బూడిద ఆకాశంలోకి చేరింది. ఈ బూడిద మేఘాలలోని కణాలు చంద్రునిలోని ఎరుపు రంగును చెదరగొట్టాయి. దాంతో చందమామ నీలం రంగులో దర్శనమిచ్చింది. దీన్ని నాసా అరుదైన ఘటనగా పేర్కొంది. అప్పటి నుంచి ‘బ్లూ మూన్’ పదం వాడుకలో ఉందని సమాచారం. సాధారణంగా సంవత్సరంలో 12 పూర్తి చంద్రులను చూస్తాము. ప్రతి నాలుగు సీజన్లలో మూడు. ఏదేమైనా, ప్రతి పౌర్ణమికి 29.5 రోజులు గడువు ఉంటుంది. దీని అర్థం చంద్రుడు 12 పౌర్ణములను పూర్తి చేయడానికి 354 రోజులు పడుతుంది. సంవత్సరంలో మిగిలిపోయిన రోజులన్నింటిని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కలుపుతారు. ఫలితంగా ఒక ఏడాదిలో 13 పూర్తి చంద్రులు కనిపిస్తారు. ఈ 'అదనపు' పౌర్ణమి అరుదైన సంఘటన కాబట్టి దీనిని కూడా ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. ఇక ఈ రోజు చంద్రుడు నీలంగా కనిపించడు. రోజుకంటే పెద్దగా, ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. అయితే ‘బ్లూ మూన్’ కూడా కనిపించే అవకాశం ఉంది. ఇది జరగడానికి కాంతి కిరణాలను సరైన పద్ధతిలో వక్రీభవించే కొన్ని వాతావరణ పరిస్థితులు అవసరం. ఇక అక్టోబర్ 31 బ్లూ మూన్ రాత్రి 8:15 గంటల తర్వాత పూర్తి ప్రకాశవంతంగా ఉంటుంది. అలానే చంద్రుడి ప్రక్కన ప్రకాశవంతమైన ఎరుపు 'స్టార్రి' వస్తువును గమనిస్తారు. ఇది నక్షత్రం కాదు, మన పొరుగున ఉన్న మార్స్. (చదవండి: చందమామ అందివచ్చిన రోజు) ఇతర పూర్తి చంద్రులు ఏమిటి? మేము ఇంతకు ముందు వివరించినట్లుగా.. చంద్రుడికి ఇలా ప్రత్యేకంగా పేర్లు పెట్టడంపై ఎలాంటి సమావేశం లేదు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, ఇవి ప్రస్తుతం జనాదరణ పొందిన పౌర్ణమి పేర్లు: జనవరి: వోల్ఫ్ మూన్ ఫిబ్రవరి: స్నో మూన్ మార్చి: వార్మ్ మూన్ ఏప్రిల్: పింక్ మూన్ మే: ఫ్లో మూన్ జూన్: స్ట్రాబెర్రీ మూన్ జూలై: బక్ మూన్ ఆగస్టు: స్టర్జన్ మూన్ సెప్టెంబర్: హార్వెస్ట్ మూన్ అక్టోబర్: హంటర్స్ మూన్ నవంబర్: బీవర్ మూన్ డిసెంబర్: కోల్డ్ మూన్ -
నింగిలోకి తొలి అరబ్ స్పేస్ మిషన్
టోక్యో : రెడ్ ప్లానెట్ గుట్టుమట్లను ఆవిష్కరించేందుకు అంగారక గ్రహానికి తొలి అరబ్ స్పేస్ మిషన్ హోప్‌ను జపాన్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అభివృద్ధి చేసిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను సోమవారం ఉదయం జపాన్ రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా మోసుకెళ్లిందని అధికారులు తెలిపారు. అరబిక్‌లో అల్-అమల్‌గా పేరొందిన ఈ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. ప్రయోగం జరిగిన గంటతర్వాత స్పేస్‌క్రాఫ్ట్ రాకెట్ నుంచి విడిపోయి నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని రాకెట్ తయారీ సంస్థ మిట్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ పేర్కొంది. తమ స్పేస్‌మిషన్ యూఏఈ సహా ఈ ప్రాంతానికి కీలక మైలురాయి వంటిదని మహ్మద్ బిన్ రషీద్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ హమద్ అషియబని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హోప్ అంగారక గ్రహంపై అడుగుపెడుతుందని భావిస్తున్నారు. అంగారక గ్రహంపైకి తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడంపై యూఏఈ ప్రభుత్వం ట్విటర్లో స్పందిస్తూ ఇది అరబ్ ప్రాంతానికి గర్వకారణంతో పాటు సరికొత్త ఆశలు చిగురింపచేసేదని వ్యాఖ్యానించింది. హోప్ మిషన్ ప్లానెట్‌పై ప్రత్యేక అంశాలను ఆవిష్కరిస్తుందని మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒమ్రన్ షరాఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2021 సెప్టెంబర్‌లో హోప్ మిషన్ భూమండలానికి సమాచారాన్ని చేరవేస్తుందని, ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు అథ్యయనం కోసం అందుబాటులో ఉండనుంది. చదవండి : అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ... -
ఇస్రో ట్వీట్: ఇదేంటో తెలుసా!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరేళ్ల క్రితం అంగారక గ్రహంపైకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇప్పటికీ విజయవంతం పనిచేస్తోంది. అంతరిక్షంలో అరుదైన చిత్రాన్ని తాజాగా ‘మామ్’ తన కెమెరాలో బంధించింది. అంగారక గ్రహం రహస్య చంద్రుడిగా వ్యవహరించే ‘ఫోబోస్’ అరుదైన ఫొటోను మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) సంగ్రహించింది. అంగారక గ్రహం నుంచి 7,200 కి.మీ. ఫోబోస్ నుంచి 4,200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు ఎంసీసీ ఈ ఫొటో తీసిందని ఇస్రో వెల్లడించింది. ‘ఈ ఫోటో ప్రాదేశిక రిజల్యూషన్ 210 ఎం. ఇది 6 ఎంసీసీ ఫ్రేమ్‌ల నుంచి ఉత్పత్తి చేయబడిన మిశ్రమ చిత్రం. రంగు సరిదిద్దబడింద’ని ఇస్రో తెలిపింది. అంగార గ్రహానికి అతి సన్నిహితంగా, పెద్దగా ఉన్న చంద్రుడిగా పిలవబడే ఫోబోస్.. కార్బోనేషియస్ కొండ్రైట్లతో నిండివుంటుందని వెల్లడించింది. 2014 సెప్టెంబర్ 24న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. (టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు) -
అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ...
న్యూయార్క్ : అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు స్ధిర నివాసం ఏర్పరచుకునే అనుకూల పర్యావరణ పరిస్ధితులు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆగస్టు 5న మార్టిన్ ఉపరితలంపై నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ 2012 కాలుమోపింది. రోవర్ 21.92 కిలోమీటర్లు ప్రయాణించి, రెడ్ ప్లానెట్‌లో మొత్తం 654,661 చిత్రాలను తీసింది. నాసా క్యూరియాసిటీ రోవర్ 2.43 .జీబీ ఫైలు పరిమాణాన్ని కలిగి ఉన్న మార్స్ యొక్క అత్యధిక-రిజల్యూషన్ కలిగిన అంగారక సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే 1000 ఫోటోలను విడుదల చేసింది. 360-డిగ్రీల అనుభూతిని ఆస్వాదించేలా ఉన్న ఈ చిత్రాలు , 2019 నవంబర్ 24 - డిసెంబర్ 1 మధ్య తీసినవి. ఈ రోవర్ వ్యక్తిగత షాట్లను తీసేందుకు నాలుగు రోజులలో ఆరున్నర గంటలకు పైగా అవసరం. "మా బృందంలో చాలామంది టర్కీ అందాలను ఆస్వాదిస్తుండగా, క్యూరియాసిటీ అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ ఈ అద్భుత చిత్రాలను అందించింద’ని క్యూరియాసిటీ రోవర్ మిషన్‌కు నాయకత్వం వహించిన సంబంధిత ప్రాజెక్ట్ శాస్త్రవేత్త అశ్విన్ వాస్వాడ అన్నారు. ఇక 2013లోనే రోవర్ మాస్ట్‌క్యామ్ కెమెరాలతో పాటు నావిగేషన్ కెమెరాలను ఉపయోగించి 1.3 బిలియన్-పిక్సెల్ పనోరమా చిత్రాన్ని రూపొందించింది. క్యూరియాసిటీ ప్రయాణం క్యూరియాసిటీ అంగారక గ్రహంపై ప్రయాణిస్తున్న క్రమంలో ఈ బిలం కొన్ని వందల సంవత్సరాల కిందట ఓ సరస్సుతో పాటు సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలమైన వాతావరణం కలిగి ఉందని కనుగొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నాసా రెడ్ప్లానెట్పై క్యూరియాసిటీ తీసిన సెల్ఫీని అలాగే అంగారక గ్రహంపై పురాతన ఒయాసిస్ చిత్రాన్ని వెల్లడించిన క్రమంలోనూ ఇవే అంచనాలు వెల్లడయ్యాయి. అంగారక గ్రహంపై సూక్ష్మజీవుల ఆనవాళ్లను అందించేలా క్యూరియాసిటీ కొత్త సాక్ష్యాలను కూడా కనుగొంది, ఉప్పగా, నిస్సారమైన చెరువులు గతంలో ఉండేవని, క్రమంగా ఇవి ఎండిపోయాయనే సంకేతాలను పసిగట్టింది. చదవండి : 'నాసా'మిరంగా! రెడ్ప్లానెట్లో మీథేన్ రహస్యాన్ని ఛేదించేలా అంగారక గ్రహంపై మీథేన్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని కూడా ఇది వెల్లడించింది. ప్రస్తుతానికి, క్యూరియాసిటీ నాసా యొక్క చురుకైన మార్స్ రోవర్. కాగా, మార్స్ 2020 రోవర్ సైతం రెడ్ప్లానెట్పైకి వెళ్లనుంది. రెండు రోవర్లు కవలల్లా కనిపించినా ఇవి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.. ఈ రెండు రోవర్లు అంగారక గ్రహం గుట్టుమట్లను మరింతగా జనబాహుళ్యానికి చేరవేయనున్నాయి. చదవండి : నింగిలోకి సోలార్ ఆర్బిటర్ -
ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలీదు..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో ఏమని ట్వీట్ చేస్తారో ఆయనకే తెలీదు. ఈసారి ఆయన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మీద పడ్డారు. ‘అంతరిక్ష పరిశోధనలకు కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం. అవన్నీ చంద్రుడిపై పరిశోధనలకే నాసా ఎందుకు ఖర్చు చేస్తోంది ? 50 ఏళ్ల క్రితమే మనం చంద్రుడిపై కాలు పెట్టాం కదా. రక్షణ, సైన్స్ రంగాల్లో ఇంకా అతి పెద్ద లక్ష్యాలను సాధించాలి. అంగారకుడిపై అధ్యయనం చేయాలి (చంద్రుడు కూడా అంగారకుడిలో భాగమే కదా)’ అని ట్వీట్ చేశారు. ఇంకేముంది సోషల్ మీడియా ఆయనపై ట్రోలింగ్ మొదలు పెట్టింది. ఈ ట్వీట్ ఒక వైరల్‌గా మారింది. జోకులు, మెమెలు, వెటకారాలు, వెక్కిరింపులు ఒకటేమిటి నెటిజన్లు ట్రంప్‌ని ఓ ఆటాడుకున్నారు. చంద్రుడు భూమికి ఉపగ్రహమని అయిదో క్లాసు చదివే పిల్లల్ని అడిగినా చెబుతారు. అలాంటిది భూమికి 3.39 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారకుడు చంద్రుడిలో భాగం ఎలా అవుతాడు ? అగ్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ వ్యంగ్యబాణాలు విసిరారు. ట్రంప్ అంత అజ్ఞానా అంటూ ఒకరు ఆశ్చర్యపోతే, మరొకరు ట్రంప్ తండ్రి ఆయనకి ఖగోళ శాస్త్రం గురించి ఎన్నడూ చెప్పలేదా? అని విస్తుపోయారు. అసలు అంతరిక్షమంటేనే ఓ రహస్యాల పుట్ట. అంగారకుడిలో చంద్రుడిని భాగం చేసి కొత్త రహస్యాన్ని ప్రపంచానికి ట్రంప్ బట్టబయలు చేశారు అంటూ మరొకరు వ్యంగ్య బాణాలు విసిరారు. అంతరిక్షానికి సంబంధించి అధ్యక్షుడి ట్రాక్ రికార్డు చూస్తే నాసా ట్రంప్ సహాయ సహకారాలు బాగా ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని సలహాలిచ్చారు. గతంలో గ్లోబల్ వార్మింగ్‌పై ట్రంప్ ట్వీట్‌కు మన అస్సామీ అమ్మాయి ఆస్తా శర్మ వెదర్‌కి, క్లైమేట్‌కి తేడా తెలుసుకోవాలంటూ చురకలంటించడం తెల్సిందే. మెక్సికోపై సుంకాల వడ్డింపు రద్దు మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 5శాతం సుంకం విధించాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. మధ్య అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాకను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మెక్సికో హామీ ఇవ్వడంతో ఆ దేశంపై సుంకం వడ్డించాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. గత వారం ప్రకటించిన ప్రకారం జూన్ 10 నుంచి మెక్సికో ఉత్పత్తులపై సుంకం విధింపు అమల్లోకి రావలసి ఉంది. -
ఇప్పుడు అదెందుకో; మీరు గ్రేట్ సార్!!
వాషింగ్టన్ : చంద్రుడిపైకి మరోసారి మనిషిని పంపేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) సమాయత్తమవుతోంది. 2024 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన స్పేస్ పాలసీ డైరెక్టివ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది సంతకం చేశారు కూడా. ఈ మేరకు.. తన హయాంలో మరోసారి చంద్రయాత్ర చేపట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. నాసాను ప్రశంసిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ‘ మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. అయితే నాసా ఇప్పుడు మాట్లాడాల్సింది చంద్రుడిపైకి వెళ్లే విషయం గురించి కాదు. ఇది 50 ఏళ్ల క్రితమే జరిగింది కదా. వారు దృష్టి పెట్టాల్సిన పెద్ద పెద్ద అంశాలెన్నో ఉన్నాయి. మార్స్(ఇందులో చంద్రుడు కూడా భాగం), రక్షణ వ్యవస్థ, సైన్స్ ఇందులో ముఖ్యమైనవి’ అని ట్రంప్ తన తాజా ట్వీట్లో నాసాను విమర్శించారు. ఈ క్రమంలో ట్రంప్ రెండు ట్వీట్లను పోల్చి చూస్తున్న నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా చంద్రుడు.. అంగారకుడిలో భాగమంటూ ట్రంప్ పేర్కొనడంపై జోకులు పేలుస్తున్నారు. ‘సార్ మీరు గ్రేట్. ఈరోజు నుంచి అందరూ గుర్తుపెట్టుకోండి. మూన్.. మార్స్‌లో భాగమట. ట్రంప్ చెప్పారు’ అంటూ వ్యంగోక్తులు విసురుతున్నారు. కాగా 1968లో ‘అపోలో-11’ ద్వారా వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకేల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను నాసా చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1969 జూలై 20న చంద్రుడి మీద మనిషి కాలు మోపాడు. అయితే తాజాగా మళ్లీ మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్కి ఆర్టెమిస్ అని గ్రీకు చంద్రదేవత పెట్టారు. ఈసారి చంద్రయాత్రలో మహిళా వ్యోమగాములకు కూడా అవకాశం కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం విశేషం. For all of the money we are spending, NASA should NOT be talking about going to the Moon - We did that 50 years ago. They should be focused on the much bigger things we are doing, including Mars (of which the Moon is a part), Defense and Science! — Donald J. Trump (@realDonaldTrump) June 7, 2019 -
మార్స్‌పై మన ఇళ్లు ఇలా ఉంటుంది!
వాషింగ్టన్ : భూమిపై రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడి వనరులు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇతర గ్రహాలపై మానవ నివాసం కోసం అన్వేషణ సాగుతోంది. అయితే భూమి కాకుండా మానవులు నివసించడానికి అనువుగా ఉండే మరో గ్రహం ఏదైనా ఉందా అంటే.. వెంటనే వచ్చే సమాధానం మార్స్. మరి ఒకవేళ మార్స్‌పై నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి? అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే ఓ పోటీని నిర్వహించింది. అదే... ‘మార్స్ 3ఈ–ప్రింటెడ్ హౌస్ ఛాలెంజ్’. మొత్తం 60 మంది పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో ఆర్కిటెక్చురల్ అండ్ టెక్నాలజీ డిజైన్ ఏజెన్సీ స్పేస్ ఫ్యాక్టరీ మొదటి బహుమతి (5లక్షల డాలర్లు) గెలుచుకుంది. అదే.. ‘మార్షా మార్స్ హౌస్’. చివరి పోటీ జరుగుతున్న సమయంలో తమ 3డీ ప్రింటెడ్ ప్రొటోటైప్‌ను 15 అడుగుల పొడువు ఉండేలా నిర్మించింది. ఈ తరహా నివాస స్థలాన్ని మార్స్‌లో ఏర్పాటు చేసుకోవాలంటే కావాల్సిన వస్తువులను అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, మార్స్‌పై సహజంగా దొరికే వస్తువులను రీసైకిలింగ్ చేయడం ద్వారా ఈ ఇంటిని నిర్మించుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మార్స్‌పైకి మనుషులు వెళ్తే అక్కడ వారి మొదటి ఇళ్లు బహుశా ఇలాగే ఉంటుందేమోనంటూ నాసా ఓ ట్వీట్ చేసింది. -
అంగారకుడిపై కంపనాలు
వాషింగ్టన్: అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి. మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్సైట్’ అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్‌సైట్‌లో అమర్చిన సిస్మిక్ ఎక్స్పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్ఈఐఎస్) పరికరం ఈ నెల 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. గతేడాది మేలో ఇన్‌సైట్‌ను ప్రయోగించగా డిసెంబర్లో సిసిమోమీటర్ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది. ఈ కంపనాల్ని మార్టియన్ సోలార్ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. ఇక అంగారకుడి అంతర్భాగం నుంచి మొట్టమొదటిసారి వచ్చిన కంపనాలు ఇవే కావడం గమనార్హం. ఇప్పటివరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్ 10, ఏప్రిల్ 11 తేదీల్లో అత్యంత చిన్న చిన్న కంపనాలను కూడా సిసిమోమీటర్ గుర్తించింది. అయితే సోలార్ 128 కంపనాలు ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్ మిషన్‌లో కనుగొన్న కంపనాలను పోలి ఉన్నాయి. దీంతో సోలార్ 128 కంపనాలపైనే శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కంపనాలు ఏర్పడటానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ కంపనాలు చాలా చిన్నవని, ఇటువంటి చిన్న చిన్న కంపనాలను గుర్తించడమే ఇన్సైట్ నౌక అసలు లక్షమని ఇన్సైట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బ్రూస్ బానెర్డ్ తెలిపారు. ఇన్సైట్ బృందానికి 128 కంపనాలు మైలురాయి లాంటిదని, ఇలాంటి సంకేతాల కోసం కొన్ని నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని శాస్త్రవేత్త ఫిల్ లాగ్నొన్నె తెలిపారు. -
ఫైనల్లీ.. మార్స్ మాతో మాట్లాడుతోంది!
అనంత విశ్వంలో మానవాళి మనుగడకు అనుకూలమైన ఏకైక గ్రహం భూమి మాత్రమేనని మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒకవేళ భూ గ్రహం అంతమయ్యే పరిస్థితులు తలెత్తితే.. మానవజాతి అంతం కావాల్సిందేనా? భూమి కాకుండా మనుషులు నివసించేందుకు మరే ఇతర గ్రహం అనుకూలం కాదా? అనే ప్రశ్నలకు బదులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు.. అంగారకుడి(మార్స్) మీద ప్రయోగాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా పరిశోధన సంస్థ నాసా ఇన్సైట్ ల్యాండర్ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను మార్స్‌పైకి పంపింది. అయితే ఇప్పటిదాకా అరుణగ్రహ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, గాలి శబ్దాలను మాత్రమే ఇన్సైట్ రికార్డు చేసింది. తాజాగా ఇన్‌సైట్‌లో రికార్డైన శబ్దాలు శాస్త్రవేత్తలకు అంతులేని ఆనందాన్ని ఇస్తున్నాయి. మార్స్ ఉపరితలం, అంతర్గత వాతావరణం, కంపనాలు(భూకంపం వంటిది), వాటి ద్వారా ఏర్పడే ధ్వనులను రికార్డు చేయడమే ప్రధాన లక్ష్యంగా అక్కడ దిగిన ఇన్సైట్ త్వరలోనే తన టార్గెట్ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్స్‌పై ఇన్నాళ్లు నిశ్చలంగా ఉన్న ఇన్సైట్ తొలిసారి కుదుపులకు లోనైందని, కంపనాలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసిందని జెట్ ప్రపల్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి విమానం ఎగురుతున్నపుడు వచ్చే శబ్దాలను పోలి ఉన్నాయని తెలిపారు. ఫైనల్లీ మార్స్ మాతో మాట్లాడుతోంది.. ఈ విషయం గురించి మార్స్ మిషన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బ్రూస్ బెనెర్డ్ మాట్లాడుతూ... ‘ మార్స్‌పై విజయవంతంగా ప్రయోగాలు చేయగలుతామా అనే సందేహాలు నేటితో కాస్త తీరాయి. అక్కడ కంపన తరంగాలు యాక్టివ్‌గా ఉన్నట్లు కనుగొన్నాం. అవును మార్స్ ఇప్పుడు మాతో మాట్లాడుతోంది. తొలిసారి కంపించింది. కంపన తీవ్రత 2 నుంచి 2.5 యూనిట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. భూమి కాకుండా తొలిసారి మరో గ్రహంపై సిస్మాలజీ గురించి అధ్యయనానికి ముందడుగు పడింది. అయితే ఇంకాస్త ఓపికగా ఎదురుచూడాలి. వాటిని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి కంపనాలు తరచుగా నమోదు అయినపుడే ఈ విషయంపై పూర్తి అవగాహన వస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 6న నాసా విడుదల చేసిన తాజా శబ్దాలు నిజంగా కంపనాలకు సంబంధించినవేనా అనే విషయంపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద చర్చే నడుస్తోంది. -
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది. ‘ఐఎస్ఎస్ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్ఎస్లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్ టేబుల్..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. అరుణ గ్రహంపై జీవం అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్‌హెచ్–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
మార్స్‌పైకి మనిషి..!
వాషింగ్టన్ : మార్స్ గ్రహంపై మనిషి జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందేమోనని చాలా ఏళ్లుగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రోవర్లను పంపి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తోంది. అయితే మొట్టమొదటిసారిగా మార్స్ మీదకు మనిషిని పంపే యోచనలో ఉన్నారు. అదీ కూడా ఓ మహిళ కావడం విశేషం. అన్నీ సవ్యంగా జరిగితే మార్స్ మీద తొలి అడుగు వేసేది మహిళేనని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ వెల్లడించారు. సైన్స్ ఫ్రైడే అనే ఒక రేడియో టాక్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఎవరిని మార్స్ మీదకు పంపించాలో నిర్ణయించలేదని, భవిష్యత్తులో నాసా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గోనే మహిళనే పంపించే అవకాశం ఉందన్నారు. మూన్ మీదకు కూడా మహిళను పంపిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ... ఆయన తప్పకుండా మూన్ మీదకు వెళ్లే రెండో వ్యక్తి మహిళే అవుతారన్నారు. మార్చి నెల జాతీయ ఉమెన్స్ నెలగా పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా మహిళా వ్యోమగాములు స్పేస్‌వాక్ చేయనున్నారని, ఈ నెలాఖరునాటికి మహిళల స్పేస్‌వాక్ పూర్తవుతుందని తెలిపారు. దీనిలో భాగంగా ఇద్దరు వ్యోమగాములు స్పేస్ చుట్టూ తిరుగుతారని జిమ్ పేర్కొన్నారు. -
మార్స్‌పై లక్ష మంది భారతీయులు!
ఆశ్చర్యంగా ఉందా? మనిషే అడుగు పెట్టని అంగారక గ్రహం (మార్స్)పైకి అప్పుడే లక్షమంది భారతీయులు ఎలా వెళ్లగలిగారు? అని ముక్కున వేలేసుకుంటున్నారా?.... కాస్త ఆగండి. నాసా ప్రయోగించిన ఇన్ సైట్ ప్రోబ్ అంగారక గ్రహంపైకి చేరింది కదా. దాంతోపాటే లక్షా 39 వేల 899 మంది భారతీయుల పేర్లు కూడా ఆ గ్రహంపైకి చేరాయి. అదీ సంగతి. ఎలక్ట్రాన్ బీమ్ సాయంతో పలుచటి సిలికాన్ పొరపై వీరందరి పేర్లు ముద్రించి, దానిని ఇన్సైట్ ల్యాండర్ పైభాగంలో బిగించారు. మనిషి వెంట్రుక మందంలో వేల వంతులు తక్కువ సైజున్న అక్షరాలతో ఈ పేర్లను ముద్రించడం విశేషం. నాసా పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24,29,807 మంది తమ పేర్లు పంపారు. అమెరికా నుంచి 6.76 లక్షలు, చైనా నుంచి 2.62 లక్షల మంది తమ పేర్లు పంపగా భారత్ మూడోస్థానంలో నిలిచింది. -
చనిపోతానని తెలిసినా అక్కడికి వెళతా..
న్యూయార్క్ : చంద్రమండలానికి పర్యాటకులను పంపే ఏర్పాట్లు చేస్తున్న స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూమి మీద జీవించడం తనకు బోర్ కొట్టిందని, అంగారక గ్రహంపై నివసించాలని కోరుకుంటున్నానన్నారు. అక్కడ తాను జీవించి ఉండే పరిస్థితి లేకున్నా తాను అంగారక యాత్రకు వెళ్లే అవకాశాలు 70 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు. అంతరిక్ష యానంలో అద్భుతాలు అనదగిన పలు వినూత్న అంశాలను తాము ఇటీవల కనుగొన్నామని, ఇవి తనను ఉత్కంఠకు లోనుచేస్తున్నాయని మస్క్ హెచ్‌బీఓకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు స్ధానిక మీడియా వెల్లడించింది. తాను అక్కడికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నానని ఆయన తన ఆసక్తిని వెల్లడించారు. తన ఆకాంక్ష సవాల్‌తో కూడినదేనని ఆయన అంగీకరించారు. భూమి కంటే ఎంతో ఎత్తులో ఉన్న అంగారక గ్రహంపై మరణించే అవకాశాలు అధికమని అన్నారు. అంగారక గ్రహానికి మనిషి చేరుకున్నా అక్కడి సంక్లిష్ట పరిస్ధితులను నెగ్గుకురాలేక మరణిస్తాడని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులున్నా తాను వెళ్లేందుకే మొగ్గుచూపుతానని మస్క్ తెలిపారు. పర్వతాలను అధిరోహించే ఆసక్తి కలిగిన వారెందరో ప్రపంచంలో ఉన్నారని, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతూ పలువురు ప్రాణాలు కోల్పోయినా ఆ సవాల్‌ను ప్రేమించే వారు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు. భూమి నుంచి చంద్రమండలానికి, అంగారకగ్రహానికి మనుషులను చేరవేసేందుకు మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అత్యాధునిక సౌకర్యాలతో బిగ్ ఫాల్కన్ రాకెట్ పేరుతో స్టార్‌షిప్‌ను రూపొందిస్తోంది. ఈ వాహనంలో జపాన్ ఫ్యాషన్ దిగ్గజం, బిలియనీర్ యుసకు మీజవ చంద్రమండలానికి పయనమయ్యేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. స్టార్‌షిప్ 2023లో ప్రైవేట్ పాసింజర్‌తో చంద్రమండలానికి చేరుకోనుంది. జపాన్‌లోని ప్రముఖ ఆన్లైన్ ష్యాషన్ రిటైలర్ జోజో సీఈవో వ్యవస్ధాపకుడు మిజవ ఈ సాహస యాత్రకు రెడీ అవుతున్నారు. -
రేపే బ్లడ్‌మూన్..!
ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం (వివిధ దశలు దాటే ప్రక్రియ మొత్తం ఆరుగంటలకు పైగానే) మరో రెండురోజుల్లోనే వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం మనదేశంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి (27న) 10.44 నిముషాలకు మొదలై శనివారం (28న) తెల్లవారుజామున 4.58 నిముషాలకు ముగియనుంది. శుక్రవారం అర్ధరాత్రి శనివారం (27,28 తేదీల మధ్యలో) మొత్తం 103 నిముషాలు అంటే తెల్లవారు జామున ఒంటిగంట 2 గంటల 43 నిముషాల మధ్యలో చంద్రగ్రహణం ఉచ్ఛదశకు చేరిన సందర్భంగా ముదురు ఎరుపులో కనిపిస్తుంది. దీనిని ’బ్లడ్ మూన్’గా అభివర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాల్లోని ప్రజలకు ఇది కనువిందు చేయనుంది. ఉత్తర అమెరికా (యూఎస్ఏ)ప్రజలకు (వారికి శుక్రవారం పగలు అయినందున) ఇది కనిపించే అవకాశాలు లేవు. ఆయా దేశాల కాలమానాలను బట్టి చందమామ ఎంత స్పష్టంగా కనపడుతుందనేది ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియా దేశాల్లో కొంత ఆలస్యంగా శనివారం తెల్లవారుజామున, మిగతా చోట్ల శుక్రవారం రాత్రి గ్రహణంలో జాబిల్లి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిగతా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అంటార్కిటికా అంతటా యావత్ గ్రహణదశలు వీక్షించవచ్చునని తెలుస్తోంది. సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తీసుకునే జాగ్రత్తలకు భిన్నంగా దీనిని వీక్షించేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు, అద్దాలు అవసరం లేదు. అయితే ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటేనే వీక్షికులకు ఈ గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. అదేరోజు రాత్రి అంగారక గ్రహం (మార్స్) కూడా చందమామకు అత్యంత చేరువగా కనిపించనుంది. ఈ గ్రహం కూడా మామూలుగానే మనుషులకు కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. జాబిల్లి, సూర్యుడు మధ్యలో సమాంతర కక్ష్యలోకి భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. భూమి నీడలో చందమామ మునిగిపోయినపుడు ఇది సాధ్యమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంలో సూర్యుడి ప్రత్యక్ష కిరణాలను భూమి అంచుల నుండి చంద్రుడిపై పడతాయి. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ మొత్తం చంద్రగ్రహణ దశనే బ్లడ్‌మూన్‌గా పిలుస్తున్నారు. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోవాలంటే మరో 105 ఏళ్లు అంటే 2123 జూన్ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి..! - సాక్షి, నాలెడ్జ్ సెంటర్ చదవండి: శుక్రవారం భూమి అంతం..!! -
శుక్రవారం భూమి అంతం..!!
వాషింగ్టన్ : 21వ శతాబ్దంలోనే దీర్ఘకాల చంద్రగ్రహణం ఈ నెల 27(శుక్రవారం) సంభవించనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపెక్కనున్నాడు(బ్లడ్ మూన్). సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరసలోకి రావడం వల్ల ఇది జరుగుతుంది. సూర్యుడి కిరణాలు భూమిపై ప్రసరించి అతికొద్ది మొత్తంలో చంద్రుడిని చేరడంతో చందమామ ఎరుపు రంగులోకి మారతాడు. ఇదే సమయంలో అంగారక గ్రహం మన కంట పడనుంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ప్రకాశవంతంగా అంగారక గ్రహం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ శతాబ్దపు ఖగోళ వింతను తిలకిద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మరికొందరు మాత్రం శుక్రవారమే మానవుని మనుగడకు ఆఖరి రోజని హడలెత్తిపోతున్నారు. బ్లడ్మూన్తో పాటుగా అంగారక గ్రహం కనిపిస్తే విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని పూర్వీకులు విశ్వసించేవారు. అయితే, అది నిజమేనని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు. శుక్రవారం ప్రళయం సంభవించడం ఖాయమని వారు అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. 2003లో చివరిసారిగా అంగారక గ్రహం ఆకాశంలో కనిపించిందని, అప్పుడేం జరగనిది ఇప్పుడు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు. 2003లో మార్స్ గ్రహం కనిపించినప్పుడు భూమికి, అంగారకుడికి మధ్య దూరం 56 మిలియన్ కిలోమీటర్లని చెప్పారు. శుక్రవారం గతంలో కంటే అత్యంత ప్రకాశవంతంగా మార్స్ ప్లానెట్ కనిపించనుందని వెల్లడించారు. -
మార్స్‌పై తొలి అడుగు ఈమెదే
వాషింగ్టన్: పెరిగి పెద్దయ్యాక అంతరిక్షయానం చేయాలని ఉందంటూ స్కూలు విద్యార్థులు చెబుతుండడం మనం వింటుంటాం. భవిష్యత్‌లో వారు ఏదో ఒక రంగంలో స్థిరపడి, చిన్నపుడు అనుకున్నది కలగానే మిగిలిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉంటుంటాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా అమెరికాలోని లూసియానాకు చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ మాత్రం అరుణ గ్రహం (మార్స్-అంగారకుడు)పై కాలుమోపబోయే తొలి మహిళగా (ఈ గ్రహంపై మొదట అడుగుపెట్టే వారిలో ఒకరిగా) రికార్డ్ సొంతం చేసుకోనుంది. అయితే అది ఇప్పుడప్పుడే కాదు ఆమె 32 ఏళ్ల వయసులో... 2033 సంవత్సరంలో.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగం కోసం కార్సన్ ఇప్పటికే నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వయివల్, తదితర కార్యక్రమాల్లో ప్రాథమిక శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారినే నాసా వ్యోమోగామి (ఆస్ట్రోనాట్) గా అధికారికంగా ప్రకటించే వీలుంటుంది కాబట్టి ఇప్పుడామే ’బ్లూ బెర్రీ’కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. మార్స్ గ్రహానికి వెళ్లేందుకు అవసరమైన ఆరియన్ అంతరిక్షనౌక, స్పేస్ లాంఛ్ సిస్టమ్ రాకెట్‌పై వెళ్లేందుకు ఆమెను ఈ శిక్షణ సిద్ధం చేస్తుంది. ప్రస్తుత సాంకేతికతను బట్టి చూస్తే మార్స్‌పైకి వెళ్లేందుకు ఆరుమాసాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఏడాది పాటు ఆ గ్రహంపైనే గడిపాక తిరుగుపయనమవుతారు. ఈ ట్రిప్ ముఖ్యోద్ధేశ్యం ఏమంటే..అక్కడ వనరుల అన్వేషణ, నీటి నమూనాల పరిశీలన, జీవజాతుల జాడలున్నాయా లేదా అన్నది పరిశీలించడంతో పాటు అక్కడ అవాసాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది చూస్తారు. నికోల్ ఒడియన్ ఛానల్ ’ద బాక్యార్డిజాన్స్’ కార్టూన్ మిషన్ టు మార్స్ ఎపిసోడ్లో ఓ మిత్రుల బృందం అంగారకగ్రహంపై సాహసయాత్రకు వెళ్లడం కార్సన్‌కు మూడేళ్ల వయసులోనే బలమైన ముద్రవేసింది. ఆస్ట్రోనాట్‌గా మారడమే ఆమె జీవితాశయంగా మారింది. చిన్నతనమంతా కూడా నాసాకు చెందిన అంతరిక్ష ప్రయోగకేంద్రాలు సందర్శించింది. ముందుగా వ్యోమోగామిగా అరుణగ్రహం నుంచి తిరుగొచ్చాక, ఓ అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిని కావాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. -
మార్స్‌పై రంగురాళ్లు.. అసలు రంగు ఇదే..
వాషింగ్టన్ : అరుణ గ్రహం ‘మార్స్’పై ఇటీవల విచిత్ర రాళ్ల ఆచూకీని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా నాసా శాస్త్రవేత్తలు మార్స్‌పై అతిపెద్ద నీలి రంగు రాయిని గుర్తించారు. నాసా స్పేస్‌క్రాఫ్ట్‌లో పంపిన అత్యంత సామర్థ్యం కలిగిన హిరైస్ కెమెరాలు నీలి రంగు రాళ్లను ఫొటోలు తీసి పంపించాయి. అయితే వాస్తవానికి ఆ రాయి నీలిరంగులో లేదని, బూడిద రంగులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణ కెమెరాల్లో అయితే కనీసం ఆ రాయి రంగు కూడా కనిపించేది కాదని, అయితే హిరైస్ పవర్ఫుల్ కెమెరా కావడంతో రాయిని ఫొటో తీసింది. కొన్ని గంటలపాటు శ్రమించి పరిశీలించిన అనంతరం మార్స్ మీద ఉన్న రాళ్ల అసలు రంగు గుర్తించగలుగుతున్నామని.. అందుకు అక్కడి వాతావరణం కారణమని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో గ్రహాలు ఫొటోలశాఖ డైరెక్టర్ అల్ఫ్రెడ్ మెక్ఎవెన్ చెబుతున్నారు. ఆకుపచ్చ, ఎరుపు, నీలరం రంగుల్లో కనిపించిన రాళ్లను ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో అడ్జస్ట్ చేయగా బూడిద రంగు పదార్థాలున్నట్లు వెల్లడించారు. నీలం రంగు రాళ్లు, వస్తువులను మాత్రమే కెమెరా ఎందుకు బంధిస్తుందో, ఆ దిశగా పరిశోధన చేయనున్నట్లు మెక్ఎవెన్ వివరించారు. -
మార్స్‌పై ‘మిస్టీరియస్’ రాళ్లకు కారణమేంటో తెలుసా.?
వాషింగ్టన్: మార్స్ మీద ఉన్న విచిత్ర రాళ్ల ఆచూకీ తెలిసిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మార్స్‌పై ఉన్న మెడ్యుసే ఫాసే రాళ్లు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు చిన్నచిన్న రేణువుల్లాంటి బూడిద, రాళ్లు, వివిధ రకాల వాయువులు విడుదలవుతాయి. వీటి నుంచే ఈ రాళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటిని 1960ల్లోనే నాసా మారినర్ స్పేస్‌క్రాఫ్ట్ గుర్తించినప్పటికీ అవి ఎలా ఏర్పడ్డాయో తెలియలేదు. తాజాగా ఇవి అగ్నిపర్వతాలు పేలడంతో ఏర్పడ్డాయని తేల్చారు. మార్స్ మధ్యరేఖ వద్ద వీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని జియోఫిజికల్ రీసెర్చ్ జర్నల్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఇవి 3 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వీటి విస్తీర్ణం అమెరికా విస్తీర్ణంలో 20 శాతం ఉంటుందని, భూమిమీద ఏర్పడిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల కంటే కూడా వంద రెట్లు పెద్దవని , సోలార్ వ్యవస్థలోనే ఇవి భారీ నిల్వలని జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీశాస్త్రవేత్త లుజాండ్రా ఓజా తెలిపారు. -
అంగారకుడిపైకి ‘ఇన్సైట్’
వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ (అమెరికా): అంగారకుడిపై దిగి గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శనివారం ‘ఇన్సైట్’ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.35 గంటలకు అట్లాస్ వీ రాకెట్ సహాయంతో ఇన్సైట్ ల్యాండర్ అరుణ గ్రహం దిశగా దూసుకెళ్లింది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి నాసా చేపట్టిన మొట్టమొదటి ఇంటర్‌ప్లానెటరీ ప్రయోగమిది. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది నవంబర్ 26 నాటికి గ్రహం ఉపరితలంపై ఇన్సైట్ దిగనుంది. ‘ఇన్సైట్’ పూర్తి పేరు ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్. ఈ ప్రాజెక్టు కోసం నాసా సుమారు రూ.6,635 కోట్లు(99.3 కోట్ల డాలర్లు) ఖర్చుచేసింది. సౌరవిద్యుత్, బ్యాటరీతో పనిచేసే ల్యాండర్ 26 నెలలపాటు గ్రహంపై అధ్యయనం కొనసాగించనుంది. అంతర్భాగంపై అధ్యయనం.. గ్రహంపై అడుగుపెట్టిన తర్వాత ఉపరితలాన్ని 10 నుంచి 16 అడుగుల లోతుకు తవ్వి అంతర్భాగ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అందించడంతోపాటు కొన్ని కోట్ల ఏళ్ల కిందట భూమి లాంటి రాతి గ్రహాలు ఏవిధంగా ఏర్పడ్డాయన్నది తెలుపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. భూకంపాల మాదిరిగానే అంగారకుడిపై ప్రకంపనలు, హిమపాతాలు, ఉల్కాపాతాలు చోటుచేసుకున్న విషయం తమకు తెలిసిందేనని.. అయితే ఇవి ఎలా జరుగుతాయన్న ముఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామని నాసా ముఖ్య శాస్త్రవేత్త జిమ్ గ్రీన్ చెప్పారు. ఇన్సైట్ అక్కడి ఉష్ణోగ్రతలను పరిశీలించనుంది. గ్రహం మధ్యధరా రేఖ ప్రాంతంలో వేసవి కాలంలో పగటి పూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా.. రాత్రి మైనస్ 73 డిగ్రీలకు పడిపోతుంది. -
నాసా ఫొటో.. మార్స్‌పై ఏలియన్స్..??
సాక్షి, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో గ్రహాంతరవాసుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇలాంటి తరుణంలో నాసా మార్స్ రోవర్ అంగారకుడిపై తీసిన ఫొటో సర్వత్రా చర్చకు దారి తీసింది. ఈజిప్టులోని మహిళా యోధురాలి విగ్రహం తల ఆకారంలో కనిపిస్తున్న ఓ రాయి చిత్రమది. దీంతో ఏలియన్స్ ఇప్పటికే భూమిపై సంచరించడం ప్రారంభించాయనే వాదన మొదలైంది. భూమిపై ఎన్నో ఆవిష్కరణలు జరగాల్సిన ప్రదేశాల్లో ఈజిప్టు ముఖ్యమైనది. అక్కడ ఉన్న పిరమిడ్ల వంటి చరిత్రక ఆధారాలతో ఏలియన్స్‌పై ఎన్నో చిత్రాలూ వచ్చాయి. ప్రస్తుతం నాసా పోస్టు చేసిన చిత్రం ఈ మేరకు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.