
వాషింగ్టన్: ఇప్పటిదాకా చంద్రుడిపైకే వెళ్లలేదు. మరి మార్స్‌పై నడవడమేంటి? అదీ సింపుల్‌గా ‘మార్స్‌పై నడుస్తారా? సరే రండి..’ అంటూ సింపుల్‌గా ఆహ్వానించడమేంటి? అయినా ఎవరుపడితే వారు మార్స్‌పై ఎలా నడుస్తారు? ఎంతో శిక్షణ పొందిన వ్యోమగాములే ఇలా నడవడం సాధ్యం కదా? ... పై శీర్షిక చూసిన తర్వాత ఇలాంటి ఎన్నో డౌట్లు వస్తున్నాయి కదూ..! నిజమే, అయితే మార్స్‌పై నడిచేందుకు మీరు అక్కడిదాకా వెళ్లనక్కర్లేదు. మీ లివింగ్ రూమ్‌లో ఉంటూనే మార్స్‌పై క్యాట్ వాక్ చేయొచ్చు. ఎలాగంటారా? ఈ సదుపాయాన్ని గూగుల్ మీకు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం మీ దగ్గర ఉండాల్సిందల్లా ఓ వర్చువల్ రియాల్టీ గ్యాడ్జెట్ మాత్రమే.
నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ చిత్రీకరించిన దృశ్యాలను గూగుల్ వీఆర్ టెక్నాలజీ సాయంతో మీ గదికి తీసుకొస్తోంది. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఎటువంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్.. బ్రౌజింగ్ చేస్తే చాలు. వీఆర్ గ్యాడ్జెట్‌ను కళ్లకు తగిలించుకొని, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, బ్రౌజింగ్ చేస్తే... ఏకంగా మార్స్‌పై నడుస్తున్న ఫీలింగ్ కలగడం ఖాయమని చెబుతున్నారు గూగుల్ క్రియేటివ్ ల్యాబ్ నిర్వాహకులు. మరింకెందుకు ఆలస్యం.. నడిచేద్దామా?
Comments
Please login to add a commentAdd a comment