అంగారకుడి మీదకు.. మరో రెండురోజులే!
మార్స్ ఆర్బిటర్ ప్రయోగంలో కీలక దశ విజయవంతమైంది. శాస్త్రవేత్తలు ఆర్బిటర్ లోని లిక్విడ్ ఇంజన్ను మండించారు. అది విజయవంతంగా పనిచేస్తోందని వారు వెల్లడించారు. బుధవారానికల్లా అంగారక కక్ష్యలోకి 'మామ్' ప్రవేశిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మామ్ వేగాన్ని సెకనుకు 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్లకు ఇస్రో తగ్గించింది. 2013 నవంబర్ 5వ తేదీన మంగళ్యాన్ను ప్రయోగించారు.
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశిస్తే.. ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారతదేశం రికార్డు సాధించినట్లు అవుతుంది. ఇప్పటివరకు కేవలం అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అంగారకుడి మీదకు తమ వాహనాలను పంపాయి. ఈ ఘనత సాధించిన నాలుగో దేశం భారతదేశం అవుతుంది. ఇందుకు కేవలం మరి రెండురోజుల సమయం మాత్రమే ఉండటంతో శాస్త్రవేత్తలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.