MOM
-
ఏఐ సాంకేతికతో అలా స్వాంతన పొందడం మంచిదేనా..?
ఏఐ సామర్థ్యం ఊహకందని విధంగా పలు రంగాల్లో తన హవా చాటుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మనకెంతో ఇష్టమైన వారు ప్రమాదవశాత్తు దూరమయ్యితే ఆ బాధను దిగమింగడం అంత ఈజీ కాదు. అలాంటి వాటిలో చక్కటి ఉపశమనం కలిగిస్తోంది ఏఐ సాంకేతికత. అలాంటి వాటికి సంబంధించిన ఇటీవల్ల కొన్ని భావోద్వేగ కథలను విన్నాం. అయితే ఇలా సాంకేతికతో స్వాంతన, ఉపశమనం పొందడం ఎంతవరు సరైనది. ఎన్నటికీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గదా..!. దీని కారణంగా వాస్తవికతకు దూరమయ్యే పరిస్థితి ఎదురవ్వుతుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..జస్టిన్ హారిసన్ అనే టెక్ వ్యవస్థాపకుడు తన తల్లి ఇంకొద్ది రోజుల్లో దూరమైపోతుందని తెలిసి తల్లిడిల్లిపోతాడు. దీంతో ఆమె గుర్తులు, జ్ఞాపకాలు తనను వీడిపోకుండా ఉండేలా ఏఐ సాంకేతికతో అమ్మ వాయిస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అతడు ఆమె బతికున్న రోజుల్లోనే ఈ పనికి ఉపక్రమించాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే జస్టిన్ మాత్రం తన ఏఐ సామర్థ్యంతో రూపొందించిన తన తల్లి వాయిస్‌తో స్వాంతన పొందుతుంటాడు. తనతోనే తల్లి ఉందన్న భరోసాతో జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యాపకం వచ్చినప్పుడల్లా ఆమె వాయిస్ రికార్డుతో కూడిన ఏఐ సాంకేతికతో తల్లితో మాట్లాడిన అనుభూతిని పొందుతుంటాడు. అంతేగాదు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కూడా. ఇది నిజంగా ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఓ వరం అంటూ ఆ సాంకేతికతపై పొగడ్తల వర్షం కురిపించాడు. అయితే మానసిక నిపుణుడు రుచి రుహ్ మాత్రం ప్రారంభ దశలో ఈ సాంకేతికత ఉపశమనంగా అనిపించినా రాను రాను వాస్తవికతలో ఉండేందుకు మెదడు అంగీకరించకపోవచ్చు లేదా ఇష్టపడకపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి దుఃఖం మనిషిని బలవంతుడిగా మారిస్తే..ఈ సాంకేతికతో లభించిన భరోసా..వాస్తవికతకు దూరం చేస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సాంకేతిక డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వాళ్లను మాములు మనుషులు చేసేందుకు వినియోగించి ఓ వ్యక్తి జీవితాన్ని మెరుగ్గా ఉండేలా చెయ్యొచ్చు. కానీ దీనిమీదే ఆధారపడిపోయేలా మాత్రం తయారు కాకూడదని చెబుతున్నారు. చెప్పాలంటే.. ఇష్టమైన వారిని కోల్పోయిన బాధ కొన్నాళ్లకి తగ్గి సాధారణ మనుషులుగా సహజసిద్దంగానే మారిపోవాలి. ఇది ప్రకృతి ధర్మం.ఏనాటికైనా అందరూ చనిపోవాల్సిన వాళ్లే అనే సత్యాన్నికి కట్టుబడి ఉండేలా సహజసిద్ధంగా మనసు సిద్ధమవుతుంది. అందువల్లే పూర్వం వాళ్లు ముక్కుపచ్చలారని పసివాళ్లు దూరమైనా..బాధను దిగమింగి మరీ ధైర్యంగా బతుకును సాగించేవారు. సాంకేతికత పుణ్యమా అని ప్రాణాలు అల్పమైపోయాయి. చిన్న బాధను కూడా తట్టుకోలేని సున్నిత మనస్కులుగా, అల్పమైన జీవులుగా మారిపోతున్నాం. సెన్సిటివిటీ కంటే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా మనిషి మారితేనా అన్ని విధాల శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
స్టార్ హోటల్ బాల్కనీలో ఎండకు బట్టలు : అయితే ఏంటట? వీడియో వైరల్
నగరాల్లోని అపార్టమెంట్లలో ఉండేవాళ్లు బట్టలు బాల్కనీలోనే ఆరేసుకోవాలి తప్పదు. కానీ స్టార్ హోటల్ అయినా, లగ్జరీ హోటల్ అయినా హోటల్‌కి వెళ్లినపుడు, తడి బట్టలు ఎక్కడ ఆరేయాలి. ఇది టూర్లలో, ప్రతీ తల్లికి ఉండే ఇబ్బందే. (ఎందుకంటే బట్టలు ఆరేయడం గురించి మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు కాబట్టి) అయినా తప్పదు ఆరేయ్యాలి కదా.. తడి బట్టలు అలాగే పట్టుకెళ్లలేం. ముక్కి, వాసన వస్తాయి అందుకేనేమో దుబాయ్ వెళ్లిన ఒక తల్లి బట్టలు ఆరేయడం ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోరీ ఏంటంటే..ఇండియాకు చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అత్యంత ప్రసిద్దమైన, విలాసవంతమైన ‘అట్లాంటిస్, ది పామ్’ హోటల్లో దిగారు. అక్కడ పొద్దున్నే బాల్కనీలో మహిళ దుస్తులు ఆరేసింది. తన తల్లి బట్టలు ఆరేసిన వీడియోను పల్లవి వెంకటేశ్ అనే యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పొద్దున్నే అమ్మ పని ఇది’ అంటూ ఫన్నీగానే వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎక్కడైనా అమ్మ.. అమ్మే..తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అని కొందరు కామెంట్ చేశారు. హాటల్లో అలా చేయడం మర్యాద కాదని కొందరు, ఈ అమ్మలు ఇంతే మారరు అని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pallavi Venkatesh (@iam.pallavivenkatesh) అయితే హోటల్ యాజమాన్యం స్పందన విశేషంగా నిలిచింది. తల్లి బాధ్యతలు అని కామెంట్ చేసింది. అలాగే దుస్తులు ఆరేసుకునేందుకు ప్రతి బాత్రూంలో డ్రైయింగ్ త్రాడును చేర్చుతాం తద్వారా అక్కడే దుస్తులను ఆరబెట్టుకోచ్చు అనే కూడా వివరణ ఇచ్చారు. ఏడు రోజుల కిందట పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 12 మిలియన్ల వ్యూస్‌ను, లక్షకు పైగా లైక్స్‌ను దక్కించు కోవడం విశేషం. -
60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్‌కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్‌కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్‌గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్‌గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్మెంట్, జిమ్ వంటి వర్కౌట్లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్‌ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. (చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!) -
నిండు గర్భంతో అమలా పాల్, లెవల్ క్రాస్‌లో స్వయంగా ఓ పాట : వైరల్
మైనా చిత్రంలోపాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. నిండు గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు భర్తతో మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్‌ను కూడా పోస్ట్చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ లవ్ హార్ట్ ఈమోజీలను పోస్ట్ చేస్తూ అమలా, జగత్ దేశాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమలాపాల్ తన నెక్ట్స్ మూవీ `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను పాడిన పాటను పోస్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్‌ను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Think Music Malayalam (@thinkmusicmalayalam) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
సూపర్ మామ్స్! రికార్డులు సృష్టించిన తల్లులు
తల్లిగా మారిన ప్రతి స్త్రీ పిల్లల పనిని ఇష్టంగానూ అదే సమయంలో కష్టంగానూ భావిస్తుంటుంది. తన బాగు గురించి తాను చూసుకోవడం మరచిపోతుంటుంది. తల్లిగా మారిన తర్వాత కూడా తమ జీవితాన్ని అర్థవంతంగా ఎలా మార్చుకోవాలో క్రీడాస్ఫూర్తితో నిరూపిస్తున్నారు కొందరు తల్లులు. ఇటీవల అమెరికా వాసి కైట్లిన్ డోనర్ స్ట్రోలర్‌తో రన్నర్ మామ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ముంబై వాసి అయిన వినీత్ సింగ్ గర్భవతిగా ఉన్నప్పటి నుంచే రన్నింగ్‌తో తన ప్రపంచాన్ని ఎంత ఆరోగ్యంగా మార్చుకుందో రుజువు చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న ఇద్దరు పిల్లల తల్లి అయిన 34 ఏళ్ల కైట్లిన్ డోనర్ ఇటీవల చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. తన 20 నెలల కొడుకును స్ట్రోలర్ (లాగుడు బండి)లో కూర్చోబెట్టుకొని, ఆ స్ట్రోలర్‌ను నెడుతూ మైలు దూరాన్ని కేవలం ఐదు నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక గుర్తింపు పొదింది. తల్లుల్లో ఉన్న శక్తిని ఎలా పెంచుకోవచ్చో తన సాధన ద్వారా నిరూపిస్తోంది.సాధనమున సమకూరు.. రెండవ గర్భధారణ సమయంలో ప్రసవానంతరం తన లక్ష్యాన్ని ప్రపంచానికి చాటాలనుకుంది. రన్నింగ్ గోల్‌ని ఏర్పరుచుకునే క్రమంలో ఆమెకు రన్నర్ స్నేహితులు ఉత్సాహం కలిగించారు. ఇది ఆమెను మరింత ముందుకు వెళ్లేలా చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ్రపాసెస్లో భాగంగా సెప్టెంబర్ 2022లో తన బిడ్డకు కేవలం నెల వయసు ఉన్నప్పుడే క్లైటిన్ దరఖాస్తు చేసింది. కానీ, అది తిరస్కరణకు గురైంది. కిందటేడాది మళ్లీ దరఖాస్తు చేసింది. ఒలింపిక్ మారథాన్ ట్రయల్స్‌లోనూ వెనకబాటుకు లోనైంది. అయినా నిరుత్సాహపడకుండా మరింతగా కఠినమైన శిక్షణా విధానాన్ని పాటించింది. లెగ్ టర్నోవర్‌ని పెంచడానికి కొన్ని స్పీడ్ వర్కవుట్లను నిర్వహించింది. సాధనలో 1600 మీటర్ల వర్కౌట్‌ను స్ట్రోలర్‌తో సాధన చేసింది. ఈ ఎక్స్‌పీరియెన్స్ ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కిందటి నెలలో బాబ్ గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్‌తో ట్రాక్‌లోకి ప్రవేశించింది. దీనికి ఆమె కుటుంబం, సన్నిహితులు అందించిన మద్దతు తనకీ విజయం సాధించడానికి తోడ్పడింది అని తెలియజేస్తుంది. కఠినమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి.. ట్రాక్‌పై పరిగెత్తుతున్నప్పుడు ప్రతి అడుగుతోనూ ఆమె ఈ లక్ష్యాన్ని అధిగమించడంతో చుట్టూ ఉన్న వారి చప్పట్ల హోరు కన్నా తన లక్ష్యానికి ఆమె ఇచ్చి ప్రాముఖ్యానికి అందరూ కొనియాడారు. మైలు దూరాన్ని 5 నిమిషాల 11.13 సెకన్ల సమయంలో ముగించి, మునుపటి 5 నిమిషాల 13 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి విజేతగా నిలిచింది. ఆమె ట్రాక్‌పై పరిగెత్తుతున్నప్పుడు అందరి దృష్టి ఆమెపై అలాగే బాబ్గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్లోని బిడ్డపై కూడా ఉంది. ‘సులువైన వాటిని కాదు భయానకమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఎందుకు సాధించలేం? అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోండి. ఆశించిన ఫలితం వస్తుందో రాదో చెప్పలేం. కానీ, ప్రయత్నించినందుకు ఏ మాత్రం చింతించరు’ అని బోసినవ్వుల కొడుకును ఎత్తుకుంటూ చెబుతుంది డోనర్. మన వినీత్ సింగ్ ముంబై వాసి వినీత్ సింగ్‌కి తల్లిగానే కాదు విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా... ఫిట్నెస్ ఔత్సాహికురాలుగా కూడా ఎంతో పేరుంది. ఆరు నెలల గర్భవతిగా ఉండీ వైద్యుల అనుమతితో ఈ ఏడాది జనవరిలో జరిగిన 30 కి లోమీటర్ల మారథాన్‌లో పాల్గొంది. ‘నా ప్రపంచం ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ మార థాన్ నాకు పరిచయం చేసింది’ అని ఈ సందర్భంగా తెలియజేసింది. వినీత్ సింగ్ కుటుంబం క్రీడలు, ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టపడుతుంది.అప్పటికే వినీత్‌కి అల్ట్రా మారథాన్, హాఫ్ మారథాన్ వంటి వాటిల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 3.8 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42 కిలోమీటర్ల మారథాన్లలోనూ పాల్గొంది. మోస్ట్ పవర్ఫుల్ ఉమన్‌గా అవార్డులూ గెలుచుకుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవానంతరమూ తల్లులు తమ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపాలో, తమ ప్రపంచాన్ని ఎంత ఉత్సాహకరంగా మార్చుకోవాలో ఈ తల్లులు తమ జీవనశైలితో నిరూపిస్తున్నారు.(చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!) -
Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్ఫ్లూయెన్సర్లు పవర్ఫుల్ ఫోర్స్‌గా మారారు. ఇన్స్పిరేషనల్ వైరల్ కంటెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్లు, పబ్లికేషన్‌లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్‌కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్‌గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్ఫ్లూయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్‌ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్‌హుడ్‌ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్‌తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్ఫ్లుయెన్సర్లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్స్పిరేషన్లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్‌కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్‌ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. -
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్‌గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
Priyanka Singh: బటర్‌ఫ్లై మామ్
ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్ బటర్‌ఫ్లై మామ్ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు. ప్రియాంక సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది. బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి. అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్ ఇండియన్ జాస్మిన్... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్ బటర్‌ఫ్లై, కామన్ జాయ్, లైమ్ స్వాలోటెయిల్ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి. ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్‌ను బటర్ ఫ్లై మామ్ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి. -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
ఇంట్లోనే పది రోజులు ఒంటరిగా 16 నెలల చిన్నారి..పాపం! చివరికి..
కర్కశమో లేక కసాయితనమో గానీ కొందరూ తల్లుల చేసే కృత్యాలు అత్యంత ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా కొందరూ తల్లల ప్రవర్తన అర్థంకాని రీతిలో ఉంటుంది. అది ఒక మానసిక రుగ్మత మరైదైన గానీ..వారి నైజానికి అభం శుభం తెలియని చిన్నారుల బలవుతున్నారు. అచ్చం అలానే యూఎస్‌లోని ఓ తల్లి క్షమించరాని ఘాతుకానికి పాల్పడింది. యూఎస్‌లోని 31 ఏళ్ల క్రిస్టెల్ కాండెలారియో 16 నెలల పసికందుని ఇంట్లోనే పది రోజులుగా 16 నెలల చిన్నారి జైలిన్ని ఒంటరిగా వదిలేసింది. అది కూడా సెలవులపై బయటకు వెళ్లడం కోసం.. ఆ చిన్నారి బాగోగులను గాలికి వదిలేసి.. డెట్రాయిట్లో గడిపొచ్చింది. చివరికి ఆ మహా తల్లి హాయిగా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చూడగా ఆ చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. డీ హైడ్రెషన్కి గురయ్యి ఉంది. ఆ తర్వాత తాపీగా సాయం కోసం హెల్ప్‌లైన్‌కి కాల్ చేసింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని నిశితంగా గమనించారు. ఆ చిన్నారి ఒంటిపై ఒక్క గాయం కూడా లేదని గుర్తించారు. ఐతే ఆ చిన్నారి ఉన్న పరుపు మూత్రం, మలంతో కలుషితమై ఉన్నట్లు గమనించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కాండెలారియో ఇలా చిన్నారిని ఒంటరిగా వదిలేయడం మొదటిసారి కాదని తేలింది. కాండెలారియో ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆమె ఇలా చాలాసార్లు చేసిందని, అలాగే ఇలా చేయొద్దని చెప్పామని వారు చెబుతున్నారు. చిన్నారి జైలిన్ చనిపోవడానికి తల్లి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!) -
నిన్ను చూడాలని, నీ చేతిముద్ద తినాలనుంది: బుల్లితెర నటి ఎమోషనల్
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతవారం తమిళ బుల్లితెర నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి ఏడు రోజుల క్రితం కన్నుమూశారు. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ నటి పవిత్ర లక్ష్మి తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా బన్నీ) ఇన్‌స్టాలో పవిత్ర రాస్తూ.. 'నువ్వు మమ్మల్ని విడిచివెళ్లి అప్పుడే ఏడు రోజులైంది. ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నా. నువ్వు ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు అక్కడ ఉండవని భావిస్తున్నా. నువ్వు ఒక సూపర్ మామ్. సింగిల్ పేరెంట్‌గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? స్పందించిన హీరోయిన్) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) -
పిల్లలను చంపేసి చనిపోవాలనుకుంది ఓ తల్లి..కానీ 16 ఏళ్ల తర్వాత..
ఓ తల్లి తన ఐదుగురు పిల్లలను చంపేసి తాను చనిపోవాలనుకుంది. కానీ అనుకోకుండా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఆమె స్వంత అభ్యర్థన మేరకు 16 ఏళ్ల తర్వాత అనాయాస మరణం పొందింది. ఈ విషాద ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..బెల్జియంలో 2007లో దేశాన్ని కుదిపేసిన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 27, 2007న నివెల్లెస్ పట్టణంలోని జెనీవ్‌వ్ లెర్మిట్టే అనే మహిళ 14 సంవత్సరాల కుమారుడు, నలుగురు కూతుళ్లను గొంతుకోసి చంపేసింది. ఆ చిన్నారుల తండ్రి తన తల్లిదండ్రులను చూసేందుకు మొరాకోకి వెళ్లినప్పుడూ ఆ తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది. అనుహ్యంగా ఆమె ప్రయత్నం విఫలమై ప్రాణాలతో బయటపడింది. ఐతే కోర్టు ఈ దారుణానికి ఒడిగట్టినందుకు 2008లో ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఐతే ఆమె విచారణలో చెప్పిన విషయాలు అధికారులనే కంటతడి పెట్టించాయి. "తాను ఈ దారుణానికి ఒడిగట్టినరోజు ఓ సూపర్ మార్కెట్ నుంచి రెండు కత్తులను దొంగలించినట్లు తెలిపింది. ఆ రోజు తన పిల్లలు భోజనం చేశాక తలుపులు లాక్ చేసి మరీ చంపేశానని చెప్పుకుచ్చింది. క్షణికమైన నిర్ణయం వల్లే నా పిల్లలందర్నీ పొగొట్టుకున్నాను. ఇది నాకు భరించలేని ఆవేదన. నా చివరి రోజుల వరకు దీన్ని అనుభవిస్తాను, ఇదే నాకు సరైన శిక్ష అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె తన భర్తకు విడాకులు సైతం ఇచ్చింది. ఈ విషాద ఘటన జరిగి నేటికి సుమారు 16 ఏళ్లు. అదీగాక బెల్జియం చట్టాల ప్రకారం భరించలేని నయం చేయలేని మానసిక బాధతో భాదపడుతున్నట్లు భావించినట్లయితే అనాయాస మరణానికి అనుమతిస్తుంది. ఆ తల్లి లెర్మిట్టే ఈ విషయాన్నే కోర్టుకి నివేదించింది. వాస్తవానికి 2019లో ఆమెను మానసిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు కూడా. అయినా ఆమె ఆ తీవ్ర మనోవేదనను మర్చిపోలేకపోతుందని, అది నయం కానిదని వైద్యులు సైతం ధృవీకరించడంతో కోర్టు ఆమెకు అనాయాస మరణానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మానసిక వైద్యుల మాట్లాడుతూ..ఆమె పిల్లను చంపేసి చనిపోవాలనుకుంది, అలా జరగకుండా ఆమె బతికి బయటపడటం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. ఆ క్షణికమైన నిర్ణయం కారణంగానే పిల్లలను పోగొట్టుకున్నాని అంటూ కుంగిపోయింది. ఆమె చనిపోవాలనే బలంగా అనుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె అనాయాస మరణం పోందినట్లు బెల్జియం స్థానిక మీడియా పేర్కొంది. బుధవారమే ఆమె అంత్యక్రియలు కూడా జరిగినట్లు పేర్కొన్నారు. (చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్) -
మా అమ్మను అరెస్టు చేయండి.. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన బుడ్డోడు
భోపాల్: మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆ బుడతడు మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగడలబడి నవ్వారు. కానీ మనోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని కంప్లెయింట్‌గా తీసుకున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. నాన్నను వెంటపెట్టుకుని మరీ ఈ చిన్నారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది తన సొంతతల్లిపై ఫిర్యాదు చేయడానికే. వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. బుడ్డోడు ఎంతో క్యూట్‌గా ఈ విషయాలు చెప్పడం అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. మహిళా పోలీస్ కూడా అతడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాసింది. చిన్నారికి కాటుక పెట్టే సమయంలో అతడు చాక్లేట్లు తింటూ అటూ ఇటూ కదిలాడని, దీంతో వాళ్లమ్మకు కోపమొచ్చి చెంపపై మెల్లగా కొట్టిందని తండ్రి చెప్పాడు. వెంటనే తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని మారాం చేశాడని వివరించాడు. దీంతో తప్పక తన కూమరుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇంత చిన్న వయసులో పిల్లాడు స్టేషన్‌కు వెళ్లి సొంతతల్లిపైన ఫిర్యాదు చేసిన అతని అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బర్హాన్‌పూర్ జిల్లా డేడ్తలాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.. मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंच गया। उसने पुलिस से कहा कि मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेतीं हैं। उनको जेल में डाल दो। बच्चे की मासूमियत देखकर सभी की हंसी छूट गई।#MadhyaPradesh #Video pic.twitter.com/iGdHVOZEF6 — Hindustan (@Live_Hindustan) October 17, 2022 చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా చేప..
కశ్మీర్: మనకు క్రికెట్లో చాలా రకాలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు తెలుసు. మరి చేపను ఎక్కడైనా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇవ్వడం చూశారా. ఒక క్రికెట్ మ్యాచ్‌లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా పెట్టుకోవడం ఆసక్తిని కల్గిస్తోంది. ఇది కశ్మీర్‌లోని తెకిపూరా కుప్వారా క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన క్రికెటర్‌కు 2.5 కేజీల చేపను అందించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీన్ని జర్నలిస్టు ఫిర్దోస్ హసన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనికి ఫిదా అవుతున్న అభిమానులు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లీగ్‌ను ఫేమస్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారని ఫిర్దోస్ పేర్కొన్నాడు. అంతేకాకుండా పిచ్ పేలవంగా ఉన్న పరిస్థితిని ఎత్తిచూపడానికి ఇలా చేసి ఉండవచ్చని కూడా ఫిర్దోస్ తెలిపాడు. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి, ఆటగాళ్లు తమ జేబులోనుంచే డబ్బులు తీయాల్సిన పరిస్థితితో ఇలా చేపన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మనకు తెలిసినంత వరకు ఒక క్రికెట్ లీగ్‌లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇవ్వడం తొలిసారే కావొచ్చు.(చదవండి:రైనా విలవిల.. నాకే ఎందుకిలా?) Recently, in a cricket match at Tekipora Kupwara, a 2.5 Kg fish was given as Man of the Match award. #CricketDhamaka#ESPN #IPL2020 #kashmircricket pic.twitter.com/fQ7VAJ7Gvb — Firdous Hassan (@FirdousHassan) September 21, 2020 -
ఇస్రో ట్వీట్: ఇదేంటో తెలుసా!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరేళ్ల క్రితం అంగారక గ్రహంపైకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇప్పటికీ విజయవంతం పనిచేస్తోంది. అంతరిక్షంలో అరుదైన చిత్రాన్ని తాజాగా ‘మామ్’ తన కెమెరాలో బంధించింది. అంగారక గ్రహం రహస్య చంద్రుడిగా వ్యవహరించే ‘ఫోబోస్’ అరుదైన ఫొటోను మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) సంగ్రహించింది. అంగారక గ్రహం నుంచి 7,200 కి.మీ. ఫోబోస్ నుంచి 4,200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు ఎంసీసీ ఈ ఫొటో తీసిందని ఇస్రో వెల్లడించింది. ‘ఈ ఫోటో ప్రాదేశిక రిజల్యూషన్ 210 ఎం. ఇది 6 ఎంసీసీ ఫ్రేమ్‌ల నుంచి ఉత్పత్తి చేయబడిన మిశ్రమ చిత్రం. రంగు సరిదిద్దబడింద’ని ఇస్రో తెలిపింది. అంగార గ్రహానికి అతి సన్నిహితంగా, పెద్దగా ఉన్న చంద్రుడిగా పిలవబడే ఫోబోస్.. కార్బోనేషియస్ కొండ్రైట్లతో నిండివుంటుందని వెల్లడించింది. 2014 సెప్టెంబర్ 24న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. (టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు) -
చైనాలో బాలీవుడ్ హవా!
ఇండియాలో చైనా వస్తువుల హవా కొనసాగుతుంటే.. చైనా మార్కెట్లో మాత్రం ఇండియన్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. చైనాలో రిలీజ్ అయిన పలు బాలీవుడ్ చిత్రాలు ఇండియాలో కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వసూళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది చైనాలో విడుదలైన అంధాదున్, మామ్ చిత్రాలు అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే అంధాదున్ 350కోట్లకు పైగా కలెక్ట్ చేయగా.. మామ్ సైతం వసూళ్లలో దూసుకుపోతోంది. గతవారం రిలీజ్ అయిన శ్రీదేవి ‘మామ్’ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మూవీ వందకోట్లను కలెక్ట్ చేసినట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఆమీర్ ఖాన్ పీకే చిత్రం బాలీవుడ్ మార్కెట్‌కు దారులు తెరవగా.. దంగల్ చిత్రంతో ఇండియన్ మూవీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయిజాన్, హిచ్కీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వెళ్లిన అంధాదున్, మామ్ చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. -
అమ్మానాన్నకు చెబితేనే పరిష్కారం దొరుకుతుంది
మీటూతో ప్రపంచం ప్రకంపిస్తోంది ఇప్పుడు. విద్యావంతులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సినిమా రంగంలో ప్రముఖులు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా మగవాళ్లందరినీ బిక్కుబిక్కుమని భయపెడుతున్న ఉద్యమం ఇది. అంత పెద్దవాళ్లే నిలువు గుడ్లేసుకుని ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన ఏ మాట ఎలా బాణంలా వచ్చి దిగుతుందో తెలియక సతమతమవుతుంటే పుణెలోని ఓ స్కూలు ప్యూన్ ఇవేవీ పట్టకుండా తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. ఉద్యోగం పోయి పోలీసుల ఎదుట దోషిలా నిలబడ్డాడు. రఘునాథ్ చౌదరికి 47 ఏళ్లు, పుణెలోని కొత్రుద్లో ఓ స్కూల్లో ప్యూను. అతడి కన్ను హైస్కూల్ అమ్మాయిల మీద పడింది. ముగ్గురమ్మాయిలతో అవసరానికి మించిన చనువు తీసుకోవడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్లు దూరంగా ఉంటే వీడియోలు చూపిస్తానంటూ తన స్మార్ట్ ఫోన్లో పోర్నోగ్రఫీ (అశ్లీల చిత్రాలు) చూపించి మీరూ నేర్చుకోవాలని వాళ్లను ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్లంతా పదమూడు– పద్నాలుగేళ్ల వాళ్లే. ఈ బెడద నుంచి ఎలా బయటపడాలో తెలియక మూడు వారాలపాటు సతమతమయ్యారు. ఒకమ్మాయి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో అతడి దురాగతం బయటపడింది. టీచర్ల విచారణలో మిగిలిన ఇద్దరమ్మాయిలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసి, రఘునాథ్ చౌదరిని ఉద్యోగం నుంచి తొలగించింది. బాధితులంతా మైనర్లు కావడంలో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్, 2012) చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. – మంజీర -
మిసెస్ మామ్
-
తల్లి చీరలో జాన్వీ కపూర్
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నవారిలో దివంగత నటి శ్రీదేవి కుటుంబం ఉంది. ‘మామ్’ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె కూమార్తెలు జాన్వీ అండ్ ఖుషీ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ‘‘ఇది మేం గర్వపడాల్సిన సమయం. ఈ మంచి క్షణాల్లో శ్రీదేవి బతికి ఉంటే చాలా సంతోషపడేవారు. సినిమాలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది’’ అన్నారు బోనీ కపూర్. జాన్వీ పట్టు చీర కట్టుకుని వెళ్లారు. తాను కట్టుకున్న చీర తల్లిదేనని ఆమె పేర్కొన్నారు. -
వెక్కివెక్కి ఏడ్చిన బోనీ కపూర్
దుబాయ్ : అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవీ మృతిపై యావత్తు ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. సినీలోకం శోకసంద్రంలో నిండిపోయింది. దుబాయ్ లో బోనీ కపూర్ మేనల్లుడు వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవీ, అక్కడే మృతి చెందినట్టు తెలిసింది. అయితే మొదట ఆమె గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించినా... ఫోరెన్సిక్ రిపోర్టు అనంతరం ఆమె మరణానికి గల కారణాలను వెల్లడించింది. ఆమె గుండెపోటుతో కాదని, ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోవడం వల్ల చనిపోయినట్టు పేర్కొంది. అయితే అపస్మారక స్థితిలో బాత్‌టబ్‌లో పడిపోయి ఉన్న శ్రీదేవీని, భర్త బోనీ కపూర్‌తో పాటు, మరో ముగ్గురు సన్నిహితులు దగ్గరిలోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే శ్రీదేవీ చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని వారికి చెప్పారు. శ్రీదేవీ మరణ వార్తని బోనీ కపూర్ అసలు తట్టుకోలేక పోయారని పాకిస్తాన్ నటుడు అద్నాన్ సిద్దికి తెలిపారు. ఆ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్‌కి గురైన బోనీ కపూర్, వెక్కి వెక్చి ఏడ్చారని పేర్కొన్నారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న తాను బోనీ సాబ్‌ను కలిసినట్టు అద్నాన్ తెలిపారు. అద్నాన్ శ్రీదేవీ నటించిన 'మామ్' సినిమాలో ఆమెకు కో-స్టార్‌గా చేశారు. పాకిస్తాన్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీదేవీ అభిమానులంతా ఆమె లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. తనకు సంతాప సందేశాలు పంపుతున్నారన్నారు. చివరి సారిగా శ్రీదేవీతో ఆ వివాహ వేడుకల్లోనే మాట్లాడినట్టు అద్నాన్ చెప్పారు. ''వివాహ వేడుక రోజు, రాత్రి 12 గంటలకు నా విమానం అక్కడికి చేరుకుంది. అప్పటికే చాలా ఆలస్యమైందని అనుకున్నా. బోనీ సాబ్‌కి కాల్ చేశా. పెళ్లికి రావాలని ఆయన పట్టుబట్టారు. మామ్ సినిమా తర్వాత నేను శ్రీదేవీని మళ్లీ కలువలేదు. నాకోసం వేచిచూస్తున్నారు. చాలా ఆప్యాయంగా నన్ను పలకరించారు. అనంతరం నన్ను ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. మీరు చాలా ఆలస్యం అని నవ్వుతూ అన్నారు. ఆ మాటలు ఇంకా నా చెవిలో మారుమోగుతున్నాయి. అవే ఆమె చివరగా నాకు చెప్పిన గుడ్‌బై ఏమో'' అని ఆవేదన వ్యక్తంచేశారు. -
నేను మరోసారి అమ్మను కోల్పోయాను..
ఇది పాకిస్థానీ నటి సజల్ అలీ వ్యక్తం చేసిన ఆవేదన. శ్రీదేవి మృతి పట్ల ఆమె తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘నేను మరోసారి అమ్మను కోల్పోయాను’ అంటూ నివాళులర్పించారు. శ్రీదేవి తాజాగా వెండితెరపై కనిపించిన సినిమా ‘మామ్’. ఈ సినిమాలో శ్రీదేవి కూతురిగా సజల్ అలీ నటించారు. దురదృష్టవశాత్తు, సజల్ అలీ ‘మామ్’ చిత్రం షూటింగ్ సమయంలో తన తల్లిని కోల్పోయింది. ఆ సమయంలో సజల్‌ను దగ్గరకు తీసుకొని ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఆ విషాదసమయంలో తనను అక్కున చేర్చుకుంది. ‘సజల్ తన తల్లిని ఎంతగానో ప్రేమించేది. ఆమె దూరమవ్వడంతో ఆ అమ్మాయి గుండెపగిలింది. ఆ సమయంలో సజల్‌ను దగ్గరకు తీసుకొని.. ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఈ విషాదం తర్వాత ఓసారి సజల్ పాక్‌లోని తన స్వస్థలం నుంచి శ్రీదేవికి ఫోన్ చేసి మాట్లాడింది. తన విషాదాన్ని ఆమెతో పంచుకుంది. శ్రీదేవి ఎంతో ఓపికతో తనను ఓదార్చింది. మామూలుగా శ్రీదేవి సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉంటారు. సహ సిబ్బందితో అంతగా కలిసిపోరు. కానీ సజల్ విషయంలో మాత్రం శ్రీదేవి భిన్నంగా స్పందించారు’ అని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. సినిమా విడుదల సమయంలో శ్రీదేవి సజల్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘సజల్ కూడా నా బిడ్డనే. తనను ఎంతో ప్రేమిస్తున్నా. తన గురించి ఎందుకింత భావోద్వేగానికి లోనవుతున్నానో నాకు తెలియదు. తనను మిస్ అవుతున్నాను. తను సినిమాలో అద్భుతంగా నటించింది. తను లేకుంటే ఈ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయేది. ఇది మాకు స్పెషల్ మూమొంట్’ అంటూ శ్రీదేవి పేర్కొన్నారు. మహిరా ఖాన్‌తోపాటు పలువురు పాకిస్థానీ నటులు శ్రీదేవి మృతిపట్ల ట్విట్టర్లో నివాళులు అర్పించారు. Lost my mom again... A post shared by Sajal Ali Firdous (@sajalaly) on Feb 24, 2018 at 11:51pm PST This was actually a surprise to me yesterday. I felt like she was there throughout. I couldn't hold back myself from crying. I am out of words. #iloveyoushrimama ❤💋 @sridevi.kapoor A post shared by Sajal Ali Firdous (@sajalaly) on Jul 7, 2017 at 12:23pm PDT -
పదేళ్ల తర్వాత తల్లి చెంతకు..
గద్వాల అర్బన్ : పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన ఆ కుటుంబానికి అప్పట్లో విషాదం ఎదురైంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త చనిపోయిన కొన్నాళ్లకే కూతురు కూడా కనిపించకుండా పోయింది. అలా పదేళ్లుగా ఆ తల్లి కూతురి కోసం దుఖిస్తుండగా ఇప్పుడు బిడ్డ ఆచూకీ తెలిసిన వైనమిది. గద్వాలలోని వడ్డెగేరికి చెందిన పద్మ, రాముడు భార్యాభర్తలు. భర్త మరణం తర్వాత పొత్తిళ్లలో ఉన్న కుమారుడు, ఆరేళ్ల కుమార్తెతో కలిసి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో అడ్డా కూలీగా మారింది. ఇదే క్రమంలో పద్మ తల్లి చనిపోయిందని సమాచారం రాగానే కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఆమె వచ్చింది. అక్కడ రద్దీ ఉండడంతో ఆరు నెలల కుమారుడిని కుమార్తె హైమావతి చేతిలో పెట్టి టికెట్ తెచ్చేందుకు వెళ్లి వచ్చే సరికి కుమారుడు మాత్రమే ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి కుమార్తె కోసం వెతుకుతున్నా ఫలితం కనిపించలేదు. కాగా, అప్పట్లో హైమావతిని చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది సికింద్రాబాద్‌లోని నవజీవన హోంకు, ఆతర్వాత నింబోలి అడ్డాలోని ప్రత్యేక చిల్డ్రన్ హోం(బాలికల), రాజేంద్రనగర్‌లోని కేజీబీవీ పాఠశాలకు తరలించారు. 6, 8వ తరగతి వరకు చదవిన హైమావతి తన తల్లి గద్వాలలో ఉన్నారని నిర్వాహకులకు చెప్పగా వారు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాములుకు మహబూబ్‌నగర్ అధికారులు ఫొటోతో పాటు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారంతో వడ్డేగేరి అంగన్వాడీ కార్యకర్త ఫొటోలో ఉన్న బాలికను గుర్తు పట్టి ఆమె తల్లి పద్మకు చూయించింది. తన కుమార్తెను ఆమె గుర్తించగా.. మహబూబ్‌నగర్ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలిక హైమావతిని తల్లి పద్మకు గురువారం అప్పగించారు. -
బాలీవుడ్ రౌండప్ 2017
2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కథ బాగా ఉన్న దాదాపు పదిహేను చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. కమర్షియల్ సినిమాలు మూడు నాలుగే ఈ సంవత్సరం తల ఎత్తుకొని తిరిగాయి. యాభై ఏళ్లు పైబడిన ఒక వితంతువు తన కంటే వయసులో చిన్నవాడైన ఒక అబ్బాయితో ఫోన్లో చాటింగ్ చేస్తూ సంతృప్తి పడుతుంటుంది– ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునేంతలో ఆ అబ్బాయి తనకు అంగ స్తంభన సమస్య ఉన్నట్టుగా తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ‘శుభ మంగల్ సావధాన్’ సినిమాలో. చదువు పెద్దగా లేని ఒక గృహిణి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది ‘తుమ్హారి సులూ’లో విద్యాబాలన్ రూపంలో. భర్తను కోల్పోయిన ఒక యువ వయస్కురాలు ఒంటరితనం భరించలేక డేటింగ్ సైట్లో ఒక పురుషుని తోడు వెతుక్కుంటుంది ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ప్రయాణంలో. దేశంలో ఎంత భ్రష్టత్వం ఉన్నా ఆ భ్రష్టత్వంతో తాను భాగం కాకుండా తన డ్యూటీ తాను కచ్చితంగా చేసుకోవడంలో ఎంతో సంతృప్తి పడతాడు ఒక కథానాయకుడు ‘న్యూటన్’లో. కాశీలో కొన ఊపిరి వదలాలని ఉందని ఒక ముసలి తండ్రి తన కుమారుణ్ణి కోరితే ఆయనతో కలిసి కాశీకి వెళ్లి తనను తాను ఏం తెలసుకున్నాడో ఆ కొడుకు అని చెప్పే కథ ‘ముక్తి భవన్’. పర్యావరణ విధ్వంసం చేసి ప్రకృతిని అంధురాలిగా చేస్తున్న మనిషి అత్యాసను ఒక అంధుడు ఎత్తి చూపే కథ ‘కడ్వీ హవా’. ముప్పై అంతస్తుల భవనంలో ఒక కుర్రవాడు తన ఫ్లాట్‌లో బందీ అయ్యి రోజుల తరబడి తిండీ తిప్పలు లేకుండా మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశాడో చెప్పే కథ ‘ట్రాప్డ్’. బిహార్‌లో బూతు పాటలు పాడుతూ వేదికల మీద అశ్లీల నృత్యాలు చేసే ఒక కళాకారిణి జీవన వేదన ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ సినిమా. బాలీవుడ్ మారిపోయింది. బాలీవుడ్ చాలా మారిపోయింది అనడానికి 2017 ఒక ఉదాహరణ. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, మసాలా పాటలు, విదేశాల లొకేషన్స్... ఇవన్నీ ఒకవైపు ఉన్నా కంటెంట్‌ను నమ్ముకుని ఈ సంవత్సరం అక్కడి దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీశారు. వాటిని విజయవంతం చేసి ప్రేక్షకులు తమకు టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు. నిజంగా 2017 సంవత్సరం బాలీవుడ్ భిన్నత్వాన్ని ఉలిక్కిపడేలా నిరూపించిన సంవత్సరం. కొత్త కథలు, గుర్తుండిపోయేలా చేసే పాత్ర పోషణలు. ఆలోచన రేకెత్తించే క్లయిమాక్స్‌లు ఇవన్నీ ఈ సంవత్సరంలోని సినిమాలు చూపించాయి. పెద్ద సినిమాల పై పైచేయి సాధించిన చిన్న సినిమాలు ఇవి. 2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చితే జయపజయాలు ఎలా ఉన్నా మొత్తం ఆదాయాన్ని చూస్తే 5 నుంచి 10 శాతం తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ తగ్గుదల 2 నుంచి 3 శాతమే ఉంటుంది. ఈ సంవత్సరం ముగ్గురు ఖాన్లు మరీ గొప్పగా మెరిసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. షారుక్ ఖాన్ ‘రయీస్’ పెద్ద కలెక్షన్లు రాబట్టింది కానీ సినిమాగా పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. షారూఖ్ నటించిన మరో సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సీజెల్’ విదేశాల్లో కలెక్షన్లు సాధించినా భారతదేశంలో ప్రేక్షకులను పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. అతని మరో భారీ సినిమా ‘టైగర్ జిందాహై’ సంవత్సరాంతానికి విడుదలయ్యి తన భవిష్యత్తును తేల్చుకోవాల్సి ఉంది. ‘దంగల్’ హిట్‌తో రిలాక్స్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో ఒక చిన్నపాత్రతో సరిపెట్టుకున్నాడు. మరి హిట్స్ ఎవరు తమ బ్యాగ్‌లో వేసుకున్నట్టు? దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ రెండు మంచి హిట్స్ కొట్టాడు. ఒకటి ‘బదరీనాథ్ కి దుల్హనియా’. రెండు ‘జుడ్వా 2’. ఈ ‘జుడ్వా’ సిరీస్‌కు మూలం మన ‘హలో బ్రదర్’ సినిమా అన్నది విదితమే. అక్షయ్ కుమార్ కూడా రెండు హిట్లు కొట్టాడు. ఒకటి ‘జాలీ ఎల్ఎల్బి 2’, రెండు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’. దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక భర్త తన కొత్త పెళ్లికూతురికి ఇంట్లో టాయిలెట్ కట్టి ఇవ్వడానికి ఊరితో, వ్యవస్థతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పే ఈ కథను ప్రేక్షకులు ముక్కు మూసుకోకుండా యాక్సెప్ట్ చేసి కలెక్షన్ల చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా టైమ్ బాగాలేని హృతిక్ రోషన్‌కి ఈ సంవత్సరం ‘కాబిల్’ సినిమా వచ్చి ప్రాణం లేచి వచ్చింది. అంధుడుగా నటించిన హృతిక్ తన భార్యను చంపిన విలన్స్‌పై తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడో ఈ సినిమా ఆసక్తికరంగా చెప్పడమే కారణం. ఇక ఊహించని హిట్ అంటే ‘గోల్మాల్ అగైన్’ అనే చెప్పుకోవాలి. షారుక్‌తో ‘దిల్వాలే’ తీసి కొంచెం వెనుకంజ వేసిన రోహిత్ షెట్టి తన పాత టీమ్‌తో పాత ఫార్ములాతో ‘గోల్మాల్ ఎగైన్’ తీసి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. తెలుగులో దుమ్ము రేపుతున్న హారర్ ఫార్ములాను మొదటిసారి అతడు ఈ సిరీస్‌లో ఉపయోగించి సక్సెస్ కొట్టాడు. ఈ హిట్ అజేయ్ దేవగన్ అకౌంట్లో పడింది. ప్యారలల్ హీరోలుగా పెద్ద హీరోలతో సమానంగా సినిమాలు ఇస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరోలుగా చెరి రెండు సినిమాలు చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హరామ్ ఖోర్’, ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ చేస్తే రెండూ యావరేజ్‌గా నడిచాయి. కానీ ఇర్ఫాన్ ఖాన్ చేసిన రెండు సినిమాలు ‘హిందీ మీడియమ్’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’ మంచి కలెక్షన్లు తెచ్చి హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇర్ఫాన్ కంటే నవాజుద్దీన్ ఎక్కువ రోల్స్ చేస్తున్నాడని చెప్పాలి. 2017లో స్త్రీ ప్రధాన సినిమాలు కూడా చాలా వచ్చాయి. వీటిలో తాప్సీ ‘నామ్ షబానా’, విద్యా బాలన్ ‘బేగం జాన్’, ‘తుమ్హారీ సులూ’, శ్రీదేవి ‘మామ్’, శ్రద్ధా కపూర్ ‘హసీనా పార్కర్’, కంగనా రనౌత్ ‘సిమ్రన్’లు ఉన్నాయి. వీటిలో ‘మామ్’, ‘తుమ్హారీ సులూ’ మంచి కలెక్షన్లు సంపాదించాయి. హిమాలయాలను చిన్న వయసులో అధిరోహించిన మన తెలుగమ్మాయి పూర్ణ జీవితం ఆధారంగా ‘పూర్ణ’ రాహుల్ బోస్ దర్శకత్వంలో వచ్చింది. అంచనాలు పెంచి నిరాశ పరిచిన సినిమాలు కూడా 2017లో ఉన్నాయి. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’, రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్ 3’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘రాబ్తా’, రణ్‌బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ ముఖ్యమైనవి. సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ తమ ఆంతరంగిక వ్యవహారం వల్ల కోర్టు కేసుల దాకా వెళ్లారు. సోను నిగమ్ అజాన్ విషయంలో కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ‘ఇందు సర్కార్’ విడుదల ఏకంగా సెన్సార్ బోర్డ్ చైర్మన్ పెహ్లాజ్ నిహలానీ సీటుకే ఎసరు తెచ్చింది. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ రోజుల మీద వచ్చిన ఆ సినిమాను యధాతథంగా విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తే దానికి కట్స్ ఇవ్వడం వల్ల పెహ్లాజ్ ప్రభు ద్రోహిగా మారి పదవి పోగొట్టుకున్నాడని కథనం. ఏమైనా బాలీవుడ్లో ‘బాహుబలి 2’ కలెక్షన్లకు మించి వేరే పెద్ద సినిమాల న్యూస్ లేదు. ఉన్న న్యూస్ అంతా కంటెంట్ ఆధారంగా వచ్చిన చిన్న సినిమాలదే. రాబోయే సంవత్సరం పెద్ద సినిమాలు, భిన్నమైన చిన్న సినిమాలు హిందీలో మనల్ని అలరిస్తాయని భావిద్దాం. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ‘బాహుబలి 2’ హిందీ డబ్బింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఈ సంవత్సరం చూసిన మరో విశేషం. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. -
అమ్మా.. నీకెంత కష్టం!
♦ దుర్గి మండలం ఆత్మకూరులో ♦ కన్నతల్లిని బయటకు గెంటేసిన కుమారుడు ♦ వీధుల్లో యాచిస్తూ కడుపు నింపుకుంటున్న దైన్యం.. పున్నామ నరకాల నుంచి తప్పించేవారు పుత్రులంటారు పెద్దలు.. కాన్నీ బతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులకు నరకం చూపించే ప్రబుద్ధులూ కొందరుంటారు.. కాటికి కాలు చాపిన వయస్సులో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఆస్తులు తీసుకుని మరీ అమ్మను బయటకు గెంటేశాడో కొడుకు. దిక్కుమొక్కులేని ఆ అవ్వ కడుపు చేతిన పట్టుకుని వీధి వీధిన భిక్షమెత్తుకుని కడుపునింపుకుంటోంది. ముద్ద దొరికినప్పుడు తిని, దొరకనప్పుడు కన్నీళ్లు దిగ మింగి బతుకీడుస్తోంది. చలి వేస్తే వణికిపోతూ.. వానొస్తే తడుస్తూ అల్లాడిపోతోంది. ఈ దుస్థితి దుర్గి మండలానికి ఓ అవ్వకు నిత్యకృత్యమైంది. దుర్గి : మండలంలోని ఆత్మకూరుకు చెందిన మూటైన పార్వతమ్మకు ముగ్గురు కుమారులు. ఇప్పుడామె వృద్ధురాలు. ఆమె జీవితం భర్త జీవిం చి ఉన్నప్పుడు కూటికి గూటికి లోటు లేకపోయింది. భర్త మరణించిన తర్వాత ముగ్గురు కుమారులు ఆస్తిని పంచుకున్నారు. ఆమె సాధకబాధకాలు చూడటానికి 1.5 ఎకరాల భూమి, ఒక మట్టి మిద్దె ఇచ్చి చిన్నకుమారుడు పుల్లయ్యకు బాధ్యతలు అప్పగించారు. కుమారుడు దయాదాక్షిణ్యాలు మరచి భూమిని అనుభవిస్తూ తల్లిని వదిలేశాడు. పింఛను కూడా రాకపోవడంతో దిక్కులేని పక్షి అయింది. గత్యంతరం లేని వృద్ధురాలు ఆత్మకూరు అనాథ శరణాలయాన్ని ఆశ్రయించింది.అక్కడ కూడా ఉండనీయకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో దుర్గిలో భిక్షాటన మొదలుపెట్టింది. రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ దుకాణాల ఎదుట ఉన్న ఖాళీ స్థలాల్లో నిద్రిస్తోంది. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తోంది. స్పందించిన ఎస్సై.. దుర్గి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమె దైన్యాన్ని గమనించి ఆమె ఫొటోలు తీసి వాట్సప్‌లో పలు సందేశాలు పంపిం చారు. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై సుబ్బనాయుడు వెంటనే స్పం దంచి మంగళవారం ఉదయం ఆమె ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొడుకును పిలిపించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో అజ్మి రా దేవిక స్పందించి పింఛను ఇప్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదైతేనేం మలి దశలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉండగా కన్నపేగే ఇలా బయటకు వదిలేయడం చూసిన వారి హృదయాలను కలచివేసింది.