ప్రాణం నీవే పయనం నీవే
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
అమృతం కంటే కమ్మనైనది.. అనంతమైన ప్రేమ.. హద్దులు లేని వాత్సల్యం.. భూదేవికున్న ఓపిక ఎవరికుంటాయి..! ఒక్క అమ్మకు తప్ప.
అందుకే దేవుడే ఆ ప్రేమ కోసం పరితపించాడు. బిడ్డ కడుపున పడ్డాక..
నెలలు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న బరువును ఓపికగా మోస్తుంది. చీకటి గర్భంలోని కదలికలను చేతితో తడుముకుంటూ రంగుల కలను కంటుంది. నేలపై పడ్డ బుజ్జి పాపాయికి లోకాన్ని పరిచయం చేస్తుంది. అందుకే అమ్మ దేవుడికన్నా మిన్న.