నేను మరోసారి అమ్మను కోల్పోయాను.. | I lost my mom again today, says Pakistani actor Sajal Ali | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 26 2018 10:08 AM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

I lost my mom again today, says Pakistani actor Sajal Ali - Sakshi

ఇది పాకిస్థానీ నటి సజల్‌ అలీ వ్యక్తం చేసిన ఆవేదన. శ్రీదేవి మృతి పట్ల ఆమె తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘నేను మరోసారి అమ్మను కోల్పోయాను’ అంటూ నివాళులర్పించారు. శ్రీదేవి తాజాగా వెండితెరపై కనిపించిన సినిమా ‘మామ్‌’. ఈ సినిమాలో శ్రీదేవి కూతురిగా సజల్‌ అలీ నటించారు. దురదృష్టవశాత్తు, సజల్‌ అలీ ‘మామ్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో తన తల్లిని కోల్పోయింది. ఆ సమయంలో సజల్‌ను దగ్గరకు తీసుకొని ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఆ విషాదసమయంలో తనను అక్కున చేర్చుకుంది.

‘సజల్‌ తన తల్లిని ఎంతగానో ప్రేమించేది. ఆమె దూరమవ్వడంతో ఆ అమ్మాయి గుండెపగిలింది. ఆ సమయంలో సజల్‌ను దగ్గరకు తీసుకొని.. ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఈ విషాదం తర్వాత ఓసారి సజల్‌ పాక్‌లోని తన స్వస్థలం నుంచి శ్రీదేవికి ఫోన్‌ చేసి మాట్లాడింది. తన విషాదాన్ని ఆమెతో పంచుకుంది. శ్రీదేవి ఎంతో ఓపికతో తనను ఓదార్చింది. మామూలుగా శ్రీదేవి సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉంటారు. సహ సిబ్బందితో అంతగా కలిసిపోరు. కానీ సజల్‌ విషయంలో మాత్రం శ్రీదేవి భిన్నంగా స్పందించారు’ అని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.

సినిమా విడుదల సమయంలో శ్రీదేవి సజల్‌ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘సజల్‌ కూడా నా బిడ్డనే. తనను ఎంతో ప్రేమిస్తున్నా. తన గురించి ఎందుకింత భావోద్వేగానికి లోనవుతున్నానో నాకు తెలియదు. తనను మిస్‌ అవుతున్నాను. తను సినిమాలో అద్భుతంగా నటించింది. తను లేకుంటే ఈ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయేది. ఇది మాకు స్పెషల్‌ మూమొంట్‌’ అంటూ శ్రీదేవి పేర్కొన్నారు. మహిరా ఖాన్‌తోపాటు పలువురు పాకిస్థానీ నటులు శ్రీదేవి మృతిపట్ల ట్విట్టర్‌లో నివాళులు అర్పించారు.

Lost my mom again...

A post shared by Sajal Ali Firdous (@sajalaly) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement