కష్టాల్లో శ్రీదేవి 'మామ్' | sridevi mom in trouble | Sakshi
Sakshi News home page

కష్టాల్లో శ్రీదేవి 'మామ్'

May 27 2017 4:03 PM | Updated on Mar 23 2019 8:33 PM

కష్టాల్లో శ్రీదేవి 'మామ్' - Sakshi

కష్టాల్లో శ్రీదేవి 'మామ్'

రీ ఎంట్రీ సత్తా చాటలేకపోతున్న అతిలోక సుందరి శ్రీదేవి, త్వరలో తన 300వ సినిమా మామ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు

రీ ఎంట్రీ సత్తా చాటలేకపోతున్న అతిలోక సుందరి శ్రీదేవి, త్వరలో తన 300వ సినిమా మామ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. బోనీకపూర్ స్వయంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా హిందీతో పాటు సౌత్ లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు సౌత్లో రిలీజ్ అవుతున్న అన్ని భాషలకు శ్రీదేవి స్వయంగా డబ్బింగ్ చెపుతుండటం విశేషం.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఇబ్బందుల్లో పడింది. ఇటీవల ఇండియన్ ఇండస్ట్రీ పాకిస్తానీ నటుల మీద నిషేదం విదించిన సంగతి తెలిసిందే. మామ్ సినిమాలో ఇద్దరు పాకిస్తానీ నటులు నటించారు. సాజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్పై అభ్యంతరాలు వ్యక్తమవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాని నటులను ప్రమోషన్లకు రానివ్వమని కొందరు హెచ్చరిస్తున్నారు. యూనిట్ సభ్యులు మాత్రం నిషేదానికి ముందే వారిని సెలెక్ట్ చేశామని, కాబట్టి తమ సినిమాకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement