అన్ని భాషల్లోనూ 'మామ్' ఓన్ డబ్బింగ్ | Sridevi to dub herself in 4 language For MOM | Sakshi
Sakshi News home page

అన్ని భాషల్లోనూ 'మామ్' ఓన్ డబ్బింగ్

Published Fri, May 26 2017 11:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

అన్ని భాషల్లోనూ 'మామ్' ఓన్ డబ్బింగ్

అన్ని భాషల్లోనూ 'మామ్' ఓన్ డబ్బింగ్

రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న అతిలోకసుందరి శ్రీదేవి, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంగ్లీష్ వింగ్లీష్తో పరవాలేదనిపించిన ఈ బ్యూటి, తరువాత సౌత్ సినిమా పులితో నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మామ్ మూవీతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి వడయార్ దర్శకుడు.

శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్లోనూ శ్రీదేవికి భారీ ఫాలోయింగ్ ఉండటంతో తెలుగు, తమిళ్తో పాటు మలయాళంలోనూ మామ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.  అంతేకాదు తెలుగుతో పాటు నాలుగు భాషల్లోనూ శ్రీదేవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెపుతుండటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మొత్తం నాలుగు భాషల్లో ఒకేసారి జూలై 7న సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. శ్రీదేవి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement