సైలెంట్‌గా సినిమా పూర్తి చేశారు! | Nawazuddin Siddiqui and Sridevi to work together in 'Mom' | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా సినిమా పూర్తి చేశారు!

Published Sun, Jul 3 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

సైలెంట్‌గా సినిమా పూర్తి చేశారు!

సైలెంట్‌గా సినిమా పూర్తి చేశారు!

ఎప్పుడు ప్రారంభమైందో... ఎక్కడ షూటింగ్ చేశారో... ఉలుకూ లేదు, ఓ పలుకూ లేదు. చడీచప్పుడు లేకుండా చిత్రీకరణ పూర్తి చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రధారిగా ఆమె భర్త బోనీ కపూర్ ఓ చిత్రం నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘మామ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు బాలీవుడ్ టాక్.
 
వాస్తవానికి శ్రీదేవి ‘మామ్’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చింది కానీ, ఎప్పుడు ప్రారంభమైందనే విషయం బయటకు రాలేదు. ఈలోపు చిత్రీకరణ పూర్తయిందనే వార్త వచ్చింది. పబ్లిసిటీకి దూరంగా ఈ సినిమా చేయాలని శ్రీదేవి భావించారట. సతీమణి కోరుకుంటే భర్త కాదంటారా? అందుకే ఈ చిత్రం గురించిన వార్తలు బయటకు రానివ్వకుండా షూటింగ్ పూర్తి చేసేశారు బోనీ కపూర్. విడుదలకు దగ్గరయ్యే సమయానికి పబ్లిసిటీ మొదలుపెడతారట.
 
కమ్‌బ్యాక్ మూవీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లో తల్లిగా, భార్యగా.. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మహిళగా అద్వితీయ నటన కనబరిచిన శ్రీదేవి, ‘మామ్’లో మరోసారి తల్లిగా కనిపించనున్నారట. ఇది కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ.. స్టోరీ, జోనర్ డిఫరెంట్‌గా ఉంటాయట. ఈ చిత్రంతో రవి ఉద్యావర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement