
ముంబైలో జరిగిన హోమ్‌బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది తన రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ ప్రత్యేక షోలో ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్‌లో శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో అద్భుతమైన తన లుక్‌తో జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ నేవీ బ్లూ చీరకు బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్‌తో జత చేయగా, స్టేట్‌మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్‌తో లుక్‌ను పూర్తి చేసింది.
నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్‌బౌండ్ 2026 ఆస్కార్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది.