దివంగత శ్రీదేవి చిన్నకూతురు చేసిన పనికి నెటిజన్స్‌ ఫిదా | Khushi Kapoor Wears Mother Sridevi Dress For The Archies Premiere | Sakshi

Khushi Kapoor: సరిగ్గా పదేళ్ల క్రితం.. అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు ఖుషీ కపూర్‌

Dec 6 2023 2:30 PM | Updated on Dec 6 2023 3:09 PM

Khushi Kapoor Wears Mother Sridevi Dress For The Archies Premiere - Sakshi

దివంగత నటి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. బాలీవుడ్‌తో పాటు తాజాగా టాలీవుడ్‌లోనూ జాన్వీ గ్రాండ్‌గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ ‘ద ఆర్చీస్’ మూవీతో బీటౌన్‌లో గ్రాండ్‌ ఎంట్రీకి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఖుషీ ధరించిన డ్రెస్‌ అండ్‌ జ్యువెలరీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.

ఇప్పటి వరకు సినిమాలు చేయకపోయినా శ్రీదేవి కూతురిగా, ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఖుషీ కపూర్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. తాజాగా తన తొలి డెబ్యూ సందర్భంగా ఖుషీ అరుదైన డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె కాస్ట్యూమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లికి నివాళులు అర్పిస్తూ శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది ఖుషీ.

గతంలో ఇదే డ్రెస్‌ను  దివంగత శ్రీదేవి 2013 ఐఫా అవార్డు ప్రధానోత్సవంలో ధరించింది. ఇప్పుడు ఖుషీ సైతం అదే డ్రెస్‌ను రిపీట్‌ చేసింది. దీంతో పాటు తల్లి ధరించిన డైమండ్‌ చోకర్‌నే వేసుకొని దేవకన్యలా మెరిసిపోయింది. కాగా ఆర్చీస్‌లో ఖుషి కపూర్‌తో పాటు సుహానా ఖాన్‌, వేదాంగ్‌ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండాలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు స్టార్‌ కిడ్స్‌ ఉండటంతో ది ఆర్చీస్‌పై ఇప్పటికే హైప్‌ నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement