నైట్‌ పార్టీలో కృతిసనన్‌ వేసుకున్న డ్రెస్‌ అన్ని లక్షలా?  | Kriti Sanon Maroon Jersey Dress Price Will Shock You | Sakshi
Sakshi News home page

Kriti Sanon: నైట్‌ పార్టీలో కృతిసనన్‌ వేసుకున్న డ్రెస్‌ అన్ని లక్షలా? 

Dec 21 2023 3:04 PM | Updated on Dec 21 2023 7:18 PM

Kriti Sanon Maroon Jersey Dress Price Will Shock You - Sakshi

బాలీవుడ్‌ భామ కృతిసనన్‌.. బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు సరసన నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ ఏడాది తెలుగులో ఆదిపురుష్‌ సినిమాతో మరోసారి తన  అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇదిలా ఉంటే, తొలుత మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన కృతిసనన్‌ ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో మంచి ఫ్యాషన్‌ సెన్స్‌ను కనబరుస్తూ ట్రెండీ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. తాజాగా ఓ నైట్‌ పార్టీలో కృతి వేసుకున్న డ్రెస్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్న ఈ మినీ డ్రెస్‌ ధర అక్షరాలా రూ. 1.7 లక్షలు. అలాయా బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్‌కు క్యూట్‌ బెల్ట్‌ మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇక ఎప్పటిలాగా సింపుల్‌ అండ్‌ న్యూడ్‌ మేకప్‌ లుక్‌లో తళుక్కున మెరిసింది మన మిమీ. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement