చర్మ సౌందర్యం కోసం 'ఆదిపురుష్‌' హీరోయిన్‌ ఏం చేస్తుందో తెలుసా? | Heroine Kriti Sanon Shares Wintercare Routine | Sakshi
Sakshi News home page

Kriti Sanon: తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టిన 'ఆదిపురుష్‌' హీరోయిన్‌

Published Fri, Dec 29 2023 3:11 PM | Last Updated on Fri, Dec 29 2023 3:53 PM

Heroine Kriti Sanon Shares Wintercare Routine - Sakshi

'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్‌. ఆ తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమాలు సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయిన కృతి అక్కడ వరుస హిట్స్‌తో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఇటీవలె ప్రభాస్ సరసన ఆదిపురుష్‌ సినిమాలో సీతగా అలరించింది. సినిమా అంతగా ఆడకపోయినా సీతగా కృతికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇదిలా ఉంటే కృతి సినిమాల్లోలాగే బయట కూడా చాలా అందంగా మెరిసిపోతుంటుంది. తన స్కిన్‌కేర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ ‍బ్యూటీ తాజాగా ఈమె తన చర్మ సౌందర్యం కోస​ం ఏం చేస్తుందో రివీల్‌ చేసేసింది. అంతేకాకుండా తాను స్కిన్‌కేర్‌లో ఎటువంటి ప్రొడక్ట్స్‌ వాడుతుందో కూడా బయటపెట్టేసింది. ఇందులో కొన్ని చాలా తక్కువ ధరకే ఉండటం విశేషం.

సాధారణంగా హీరోయిన్లు చాలా బ్రాండెడ్‌ వస్తువులను, ఖరీధైన మేకప్‌, స్కిన్‌కేర్‌ను ఫాలో అవుతుంటారని అనుకుంటాం. కానీ కృతి రివీల్‌ చేసిన రొటీన్‌ చాలా సాధాసీదాగా ఉండటం నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం 7 స్టెప్స్‌ను ఎంచుకున్న కృతి తొలుత డబుల్‌ క్లెన్సింగ్‌తో మొదలుపెట్టి లిప్‌బామ్‌తో ముగించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement