skin care products
-
వయసును దాచేస్తుంది
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్‌కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్. ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్‌లా, బ్రష్‌లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు. -
Kruthika Kumaran: సహజమైన గెలుపు
చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను చూసి బాధ పడింది కృతిక కుమారన్. ఈ నేపథ్యంలోనే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్‌ల గురించి ఆలోచించింది. నేచురల్ కాస్మటాలజీలో డిప్లమా చేసిన తరువాత ప్రయోగాలు ప్రారంభించి విజయం సాధించింది. కోయంబత్తూరుకు చెందిన కృతిక కుమారన్ ఆర్గానిక్ స్కిన్‌కేర్ స్టార్టప్ ‘విల్వా’ సూపర్ సక్సెస్ అయింది...తమిళనాడులోని గోబిచెట్టిపాళయం అనే ఉళ్లో పుట్టి పెరిగింది కృతి. తండ్రి లాయర్. తల్లి గృహిణి. ఉన్నత విద్య కోసం కోయంబత్తూరుకు వెళ్లిన కృతిక ‘కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేసింది. ఆ తరువాత తమిళ్ కుమారన్ అనే వస్త్ర వ్యాపారితో కృతికకు వివాహం జరిగింది.కుమార్తెకు చర్మసమస్యలు వచ్చినప్పుడు మార్కెట్లోని కొన్ని సబ్బులు, షాంపులను ప్రయత్నించిందిగానీ అవేమీ ఫలితం ఇవ్వలేదు. దీంతో సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి సబ్బులు తయారు చేయాలని నిర్ణయించుకుంది. ‘కాస్మటాలజీలో డి΄÷్లమా చేయడం నుంచి యూ ట్యూబ్‌లో వీడియోలు చూడడం వరకు ఎన్నో అంశాలు నా ప్రయోగాలలో ఉపయోగపడ్డాయి’ అంటుంది కృతిక.ముందుగా వంటగదిలో మేకపాలతో ప్రయోగాలు మొదలుపెట్టింది. కుటుంబసభ్యులు కూడా ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. ‘అనేక ప్రయోగాల తరువాత విజయం సాధించాం. మొదట్లో రెండు మేకలు ఉండేవి. ఇప్పుడు మేకల మందలు ఉన్నాయి. వాటి తాజా పాలతో మా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. హానికరమైన రసాయనాలకు దూరంగా ఉన్నాం’ అంటుంది కృతిక.జుట్టు, చర్మసంరక్షణ ఇతర సౌందర్య ఉత్పత్తులతోపాటు లెమన్ గ్రాస్‌తో దోమల నివారణ మందును కూడా తయారు చేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోర్‌తో తొలి అడుగు వేశారు. రెండు సంవత్సరాల తరువాత వెబ్‌సైట్‌ను మొదలు పెట్టడంతో పాటు డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్‌లోకి వచ్చారు. అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లతో కలిసి పని చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆఫ్‌లైన్ స్టోర్లకు కూడా శ్రీకారం చుట్టారు.‘ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసినప్పుడు కోయంబత్తూరుతో పాటు చుట్టుపక్కల ్రపాంతాల నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు వచ్చేవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా లాంటి ఈ–కామర్స్ ΄్లాట్ఫామ్స్ మా ఉత్పత్తులను లిస్టింగ్ చేయడంతో వ్యాపారపరిధి విస్తరించింది’ అంటుంది కృతిక.‘లాభాల దృష్టితో కాకుండా మా కంపెనీ ద్వారా రైతులు, చేతివృత్తుల కార్మికులకు ఏదో రకంగా ఉపయోగపడాలనుకుంటున్నాం. పర్యావరణ అనుకూల ΄్యాకేజింగ్లను ఉపయోగిస్తున్నాం’ అంటుంది కృతిక.సంగీత, నృత్యాలలో ప్రవేశం ఉన్న కృతికకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి. ఆ జిజ్ఞాస ఆమెను వ్యాపార దారిలోకి తీసుకువచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తిరుగులేని విజయం సాధించేలా చేసింది. ఇద్దరితో ్రపారంభమైన ‘విల్వా’లో ఇప్పుడు వందమందికి పైగా పనిచేస్తున్నారు. పదివేల రూపాయలతో మొదలైన కంపెనీ సంవత్సరం తిరిగేసరికల్లా కోటి రూపాయల టర్నోవర్‌కు చేరింది. ఇప్పుడు కంపెనీ టర్నోవర్ 29 కోట్లు. -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్‌కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్‌ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్‌షాప్‌లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్‌షాప్‌లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్‌లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్‌ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్‌కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్‌గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్‌లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
చర్మ సౌందర్యం కోసం 'ఆదిపురుష్' హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆ తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయిన కృతి అక్కడ వరుస హిట్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలె ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించింది. సినిమా అంతగా ఆడకపోయినా సీతగా కృతికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే కృతి సినిమాల్లోలాగే బయట కూడా చాలా అందంగా మెరిసిపోతుంటుంది. తన స్కిన్‌కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ బ్యూటీ తాజాగా ఈమె తన చర్మ సౌందర్యం కోసం ఏం చేస్తుందో రివీల్ చేసేసింది. అంతేకాకుండా తాను స్కిన్‌కేర్‌లో ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతుందో కూడా బయటపెట్టేసింది. ఇందులో కొన్ని చాలా తక్కువ ధరకే ఉండటం విశేషం. సాధారణంగా హీరోయిన్లు చాలా బ్రాండెడ్ వస్తువులను, ఖరీధైన మేకప్, స్కిన్‌కేర్‌ను ఫాలో అవుతుంటారని అనుకుంటాం. కానీ కృతి రివీల్ చేసిన రొటీన్ చాలా సాధాసీదాగా ఉండటం నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం 7 స్టెప్స్‌ను ఎంచుకున్న కృతి తొలుత డబుల్ క్లెన్సింగ్‌తో మొదలుపెట్టి లిప్‌బామ్‌తో ముగించింది. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) -
బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!
బాలీవుడ్ భామ, ఆదిపురుష్ హీరోయిన్ బర్త్‌డే గాళ్ కృతి సనన్ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన సొంత స్కిన్‌కేర్ బ్రాండ్‌ను గురువారం లాంచ్ చేసింది. ప్రముఖ బ్రాండ్ mCaffeine మాతృ సంస్థ PEP టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్తో బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే న సొంత ప్రొడక్షన్ హౌస్, బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్‌ను ప్రారంభించిన కృతి సనన్ ఇక బిజినెస్ ఉమన్‌గా రాణించాలనుకుంటోంది. ఈ వెంచర్ ద్వారా బ్యూటీ వ్యాపార ప్రపంచంలో ఇతర సెలబ్రిటీల సరసన చేసింది. (హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!) జూలై 27 తన బర్త్ డే సందర్భంగా కృతి సనన్ పీఈపీ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యంతో హైఫెన్ అనే ప్రీమియమ్ స్కిన్‌కేర్ లైన్‌ను పరిచయం చేసింది. హైఫెన్ బ్రాండ్ ద్వారా వినియోగదారులకు అధిక-నాణ్యత చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యం అని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్యూటీ బ్రాండ్ లాంచ్ వీడియోలో కృతి అద్భుతంగా కనిపించింది. చర్మ సంరక్షణపై తనకున్న అభిరుచిని పాషన్‌గా మార్చుకోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నానో తెలిపింది. హైఫన్లో PEP టెక్నాలజీస్ 30 కోట్లతో మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. కృతి సనన్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా ఉండనుంది. (ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా? ) హైఫన్ మూడు ముఖ్యమైన రోజువారీ ఉత్పత్తులైన బారియర్ కేర్ క్రీమ్, గోల్డెన్ అవర్ గ్లో సీరమ్ , ఆల్ ఐ నీడ్ సన్‌స్క్రీన్ SPF 50 PA++++ని విడుదల చేసింది. అయితే ఈ బ్రాండ్ కొంతమంది బ్యూటీ లవర్స్‌ను ఆకట్టుకోగా, మరికొంతమంది నెటిజన్లు రియాక్షన్ భిన్నంగా ఉంది. దీపికా పడుకోన్ బ్రాండ్‌ను కాపీ చేసిందనికొందరు వ్యాఖ్యానించగా, టాక్స్ ఎగ్గొట్టడానికి ఇదో కొత్త ఎత్తుగడని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) కృతి సనన్ వర్క్ ఫ్రంట్ ఇక కరియర్ పరంగా నిర్మాతగా కృతి సనన్ తన తొలి చిత్రం "తీన్ పట్టి" తో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైగర్ ష్రాఫ్‌తో కలిసి మోస్ట్ ఎవైటెడ్ మూవీ "గణపత్"లో కూడా కనిపించనుంది. దీంతోపాటు షాహిద్ కపూర్ సరసన మరోప్రాజెక్ట్కు పనిచేస్తోంది. -
రంగు కాదు.. ప్రతిభ ముఖ్యం
‘‘సమాజంలో మనల్ని మన అందం చూసి కాదు.. మన ప్రతిభను చూసి గుర్తించాలి, గౌరవించాలి. అదే నేను నమ్ముతాను. అందుకే చర్మ సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఇష్టపడను’’ అన్నారు అదితీ రావ్ హైదరీ. ఇలా అనడమే కాదు గతంలో కొన్నిసార్లు అలాంటి ఆఫర్స్‌ను తిరస్కరించారట కూడా. ఓ సంఘటన గురించి అదితీ రావ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ ప్రారంభంలో ఓ సౌందర్య ఉత్పత్తిని ప్రమోట్ చేసే అవకాశమొచ్చింది. నేను తిరస్కరించాను. నిజానికి ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు ఆ యాడ్ కెరీర్‌కి ఉపయోగపడుతుంది. అయినా అందం ప్రాధాన్యం అని చెబుతూ నటించడం నాకిష్టం లేదు. కానీ ఆ ఉత్పత్తిదారులు నన్ను ఒప్పించాలని చాలా ప్రయత్నించారు. ఏం చేయాలో తెలీక ఇలాంటివి చేస్తే మా అమ్మమ్మకు నచ్చదని చెప్పాను. రంగు, కులం, మతం వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చి, మనుషులను అంచనా వేయడం అలవాటు లేని కుటుంబం నుంచి వచ్చినదాన్ని నేను. ఇక తెల్లగా మారాలనుకుంటున్నారా? అనే యాడ్‌లో ఎందుకు నటిస్తాను? కేవలం తెల్లగా ఉన్నవాళ్లనే ఈ సమాజం గౌరవిస్తుంది, బాగా చూస్తుందనే ఆలోచనతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. తెల్లగా మారడానికి ఏం చేయాలా? అని ఆలోచిస్తారు. అలాంటివాళ్లకు నేను చెప్పేదేంటంటే.. రంగు ముఖ్యం కాదు.. టాలెంట్ ముఖ్యం. అందం కొలమానం కాకూడదు. అది కేవలం జీన్స్ మాత్రమే’’ అన్నారు. -
నవ లావణ్యం
అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం. ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా.. ఆహార్యం లావణ్యంగా కనిపించేందుకు యువతులు సహా మహిళలూ ఎంతగానో తపిస్తుంటారు. అందాలకు మెరుగులు అద్దేందుకు సరికొత్త ఉపకరణాలను ఆశ్రయిస్తుంటారు. మారుతున్న కాలానికనుగుణంగా బ్రాండెడ్ మెకప్ వైపు అడుగులు వేస్తుంటారు. ఇదిగో అటువంటి యువతులు అపురూపవతులుగా మారేందుకు ‘సెఫోరా, బెల్లావోస్టే, మన్నా కదర్, వంటి 82 అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మేకప్ కిట్‌ను కేవలం రూ.299కే అందిస్తోంది నగరానికి చెందిన యువతి లావణ్య సుంకరి. ఆ వివరాలేమిటో మీరే చదవండి. – హిమాయత్‌నగర్ సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలికి చెందిన లావణ్య సుంకరి ఎంబీఏ పూర్తి చేసింది. పేరుగాంచిన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కొన్నేళ్ల పాటు మార్కెటింగ్ విభాగంలో సౌతిండియాకు జనరల్ మేనేజర్‌గా పనిచేసింది. చిన్నప్పటి నుంచి అందంగా ఉండే లావణ్యకు మేకప్ అంటే అమితమైన ఇష్టం. ఇదే సమయంలో తను వాడుతున్న మేకప్‌కిట్ లాంటిది యువతులకు అందించాలనే ఆలోచన తట్టింది. అందుకు అనుగుణంగా వ్యాపారం వైపు అడుగులు వేసింది. ఆరు నెలల పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని అంతర్జాతీయ మేకప్ బ్రాండ్ల ప్రతినిధులను కలిసింది. తన మనసులోని మాటను వివరించింది. ఆయా బ్రాండ్లన్నీ ఒప్పుకోవడంతో 2016లో ‘టీ–హబ్’లో ‘గ్లామ్‌ఈగో’ అనే పేరుతో కంపెనీని ప్రారంభించింది. ఇలా లాగిన్ కావాలి.. మేకప్ కిట్‌లో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ‘మేకప్, స్కిన్‌కేర్, బాడీకేర్, హెయిర్ కేర్’ ఉత్పత్తులు ఉంటాయి. ఇది కావాల్సివారు ముందుగా ‘గ్లాబ్ఈగో’లో లాగిన్ అవ్వాలి. స్కిన్‌కు సంబంధించిన ఎనిమిది ప్రశ్నలు ఇమేజ్ రూపంలో ప్రత్యక్షమవుతాయి. మన స్కిన్ ఎటువంటింది, మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ను ఎంచుకోవాలి. లాగిన్ అయ్యి, సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే మేకప్ కిట్ ఇంటికి చేరుతుంది. ఒకవేళ మీ స్కిన్‌కి నచ్చిన విధంగా మీరు ఎంచుకోకపోయినా వెబ్సైట్ మీ స్కిన్‌కు ఆధారంగా ఏ బ్రాండ్ అయితే సెట్ అవుతుందో అదే బ్రాండ్‌ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంటుంది. ‘స్టార్ట్స్ట్రక్ బై సన్నీ లియోన్, పారాచూట్, కీరోస్, ట్జోరీ, క్రోనోకరే, పీసేఫ్, ఎలెన్బ్ల్యూ, గ్లోబల్ బ్యూటీ సీక్రెట్స్, లాక్మె’ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌ని మేకప్కిట్లో అందించడం విశేషం. ఒక్కో విభాగం నుంచి 60కిపైగా.. మేకప్ కిట్, స్కిన్ కేర్, బాడీకేర్, హెయిర్ కేర్’లకు సంబంధించిన మేకప్ కిట్‌లో ఒక్కో విభాగం నుంచి సుమారు 50కిపైగా ప్రొడక్ట్స్ అందిస్తున్నారు. మేకప్ కిట్‌లో 62కిపైగా ప్రొడక్ట్స్, స్కిన్ కేర్‌లో 42 నుంచి 50, బాడీ కేర్‌లో 30, హెయిర్ కేర్‌లో 50 నుంచి 80 రకాల ఉత్పత్తులు ప్రతి నెలా కొన్ని కొన్ని చొప్పున అందిస్తారు. మొదట్లో 18 బ్రాండ్లతో ప్రారంభించిన ప్రయాణం ఇప్పటికి 82 బ్రాండ్లకు చేరిందని లావణ్య తెలిపారు. ప్రతి నెలా సుమారు ఐదు కొత్త బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్‌ని ఈ మేకప్ కిట్‌లో చేర్చుతున్నట్లు ఆమె వివరించారు. ప్రముఖ బ్రాండ్లు రూ.299కే.. ఒక్కో నెలకు రూ.399, మూడు నెలలకు రూ.389, ఆరు నెలలకు రూ.369, ఏడాదికి రూ.299. ఇది ఎంచుకుని అడ్రస్‌ను పూర్తి చేస్తే.. ప్రతి నెలా మొదటి వారంలో మేకప్ కిట్ ఇంటికి చేరుతుంది. సిటీలో ఇప్పటికే 10వేలకుపైగా సబ్స్క్రైబర్స్ ఉండగా.. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో మొత్తం కలిపి 40వేల మందికిపైగా సబ్స్క్రైబర్స్ ఉండటం విశేషం. త్వరలో దేశవ్యాప్తంగా.. మొదట్లో హైదరాబాద్‌లో మొదలెట్టా. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల నుంచి ఇన్‌స్ట్రాగామ్, వెబ్సైట్ ద్వారా సబ్‌స్క్రైబ్ వచ్చాయి. ఆయా నగరాల్లో ఇప్పటి వరకు 50వేల మందికిపైగా మా మేకప్ కిట్లు వినియోగిస్తున్నారు. త్వరలో దేశంలోని అన్ని మెట్రో సిటీల్లో విస్తరించాలనేది నా ఆలోచన. – లావణ్య సుంకరి -
ఆన్లైన్లో పర్సనల్ కేర్ జోరు..
2020 నాటికి 5 బిలియన్ డాలర్లకు అమ్మకాలు - హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్ - ఎఫ్ఎంసీజీ విక్రయాల్లో మూడో వంతు ఈ-కామర్స్ సైట్ల నుంచే నాలుగైదేళ్ల క్రితం దాకా భారత్‌లో ఈ-కామర్స్ ఒక మోస్తరు స్థాయిలోనే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా విస్తరించింది. అంతకంతకూ పెరుగుతోంది. ముందుగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం అవుతుందని పరిశ్రమ వర్గాలు భావించినప్పటికీ.. ఎప్పటికప్పుడు కొంగొత్త ఉత్పత్తులు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ ఉత్పత్తుల సంస్థలు ఆన్లైన్ మాధ్యమం వైపు మరింతగా దృష్టి సారిస్తున్నాయి. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2020 నాటికి ఆన్లైన్లో సౌందర్య సంరక్షణ, శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి అమ్మకాలు 5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 30,000 కోట్లు) ఉంటాయని అంచనా. అప్పటికి ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాలు 100 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 6 లక్షల కోట్లు) చేరనున్నాయి. ఇందులో ఆన్లైన్ అమ్మకాల వాటా స్వల్పంగా అయిదు శాతం స్థాయే అయినప్పటికీ.. ఈ మాధ్యమం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి చూడలేమని కంపెనీలు భావిస్తున్నాయి. రాబోయే అయిదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాల్లో సుమారు 10 శాతం వాటా ఈ-కామర్స్ ద్వారానే రాబోతోందని పరిశ్రమవర్గాల మరో అంచనా. అందుకే .. ఈ మాధ్యమంపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరింతగా దృష్టి సారిస్తున్నాయి. సౌందర్య సాధనాల సంస్థ లోరియల్‌కి సంబంధించి ప్రధాన బ్రాండ్స్ లోరియల్ ప్యారిస్, గార్నియర్ విక్రయాల్లో 1 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాలదే ఉంటోంది కంపెనీకి చెందిన. మేబెలీన్ బ్రాండ్ మేకప్ శ్రేణి టర్నోవరులో 3 శాతం వాటా ఆన్‌లైన్‌దే ఉంది. దీంతో జార్జియో అర్మానీ, ఈవ్స్సెయింట్లారెంట్, ల్యాంకోమ్ వంటి లగ్జరీ సౌందర్య సాధనాలు, లా రోష్-పొసే, విషీ వంటి కాస్మెటిక్స్‌ను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తేనున్నట్లు లోరియల్ వర్గాలు తెలిపాయి. కొత్తగా ప్రవేశించిన జపాన్ కాస్మెటిక్స్ కంపెనీ షీసీడో చాలా వేగంగా ఆన్లైన్ వైపు మళ్లింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులో మాత్రమే స్టోర్స్ ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మాధ్యమం ద్వారా మరింత మంది కొనుగోలుదార్ల వద్దకు చేరవచ్చన్న ఉద్దేశంతో ఉంది. షీసీడో తాజాగా జెడ్ఏ బ్రాండ్ కింద కొత్తగా మేకప్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. కారణాలివీ.. ఎఫ్ఎంసీజీ సంస్థలు ఆన్లైన్ వైపు చూడటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొబైల్ ఫోన్లలో కూడా ఇంటర్నెట్ లావాదేవీలు పెరుగుతుండటం ఒకటి కాగా డిజిటల్ మాధ్యమం ద్వారా మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశం ఉండటం మరొక కారణం. ఇతరత్రా మాధ్యమాలతో పోలిస్తే ఆన్లైన్లో విక్రయానికి ఉంచే ఉత్పత్తులను చూసి, కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. లగ్జరీకి డిమాండ్.. సాధారణంగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దొరకని ప్రత్యేక, లగ్జరీ ఉత్పత్తులకు ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంటోంది. హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి అమ్మకాలు ఆఫ్‌లైన్‌లో కంటే ఆన్లైన్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా కొనుగోలుదారులకు సౌకర్యం కోణంలో ఆన్లైన్లో కొన్ని రకాల ఉత్పత్తులకు డిమాండ్ ఉంటోంది. పురుషుల సౌందర్య సాధనాలు, శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలైనవి ఇందులో ఉంటున్నాయి. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో సుమారు పాతిక శాతం వాటా వీటిదే ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో మొత్తం ఎఫ్ఎంసీజీ మార్కెట్ విక్రయాల్లో మూడో వంతు.. డిజిటల్ మాధ్యమం నుంచే రాబోతోందని విశ్లేషకులు తెలిపారు. దీన్ని గుర్తించే మారికో, గోద్రెజ్ కన్జూమర్ వంటి సంస్థలు తమ ఈ-కామర్స్ వెబ్సైట్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ మొబైల్స్ ద్వారా లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో అమ్మకాలు మరింత మెరుగుపడగలవని మారికో అంటోంది. గోద్రెజ్ వంటి సంస్థలు సొంత పోర్టల్స్ ఏర్పాటుకంటే ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లతో జట్టు కట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. -
చర్మవ్యాధులు నయం చేసే బ్లూలాగూన్