నవ లావణ్యం | Entrepreneur Lavanya Sunkari Special Story | Sakshi
Sakshi News home page

నవ లావణ్యం

Published Wed, Jul 31 2019 12:25 PM | Last Updated on Wed, Jul 31 2019 12:26 PM

Entrepreneur Lavanya Sunkari Special Story - Sakshi

తన ప్రాడక్ట్‌ ‘గ్లామ్‌ఈగో’తో లావణ్య సుంకరి

అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం. ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా.. ఆహార్యం లావణ్యంగా కనిపించేందుకు యువతులు సహా మహిళలూ ఎంతగానో తపిస్తుంటారు. అందాలకు మెరుగులు అద్దేందుకు సరికొత్త ఉపకరణాలను ఆశ్రయిస్తుంటారు. మారుతున్న కాలానికనుగుణంగా బ్రాండెడ్‌ మెకప్‌ వైపు అడుగులు వేస్తుంటారు. ఇదిగో అటువంటి యువతులు అపురూపవతులుగా మారేందుకు ‘సెఫోరా, బెల్లావోస్టే, మన్నా కదర్, వంటి 82 అంతర్జాతీయ బ్రాండ్‌లకు చెందిన మేకప్‌ కిట్‌ను కేవలం రూ.299కే అందిస్తోంది నగరానికి చెందిన యువతి లావణ్య సుంకరి. ఆ వివరాలేమిటో మీరే చదవండి.  
– హిమాయత్‌నగర్‌  

సాక్షి, హైదరాబాద్‌ : గచ్చిబౌలికి చెందిన లావణ్య సుంకరి ఎంబీఏ పూర్తి చేసింది. పేరుగాంచిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో కొన్నేళ్ల పాటు మార్కెటింగ్‌ విభాగంలో సౌతిండియాకు జనరల్‌ మేనేజర్‌గా పనిచేసింది. చిన్నప్పటి నుంచి అందంగా ఉండే లావణ్యకు మేకప్‌ అంటే అమితమైన ఇష్టం. ఇదే సమయంలో తను వాడుతున్న మేకప్‌కిట్‌ లాంటిది యువతులకు అందించాలనే ఆలోచన తట్టింది. అందుకు అనుగుణంగా వ్యాపారం వైపు అడుగులు వేసింది. ఆరు నెలల పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని అంతర్జాతీయ మేకప్‌ బ్రాండ్‌ల ప్రతినిధులను కలిసింది. తన మనసులోని మాటను వివరించింది. ఆయా బ్రాండ్‌లన్నీ ఒప్పుకోవడంతో 2016లో ‘టీ–హబ్‌’లో ‘గ్లామ్‌ఈగో’ అనే పేరుతో కంపెనీని ప్రారంభించింది. 

ఇలా లాగిన్‌ కావాలి..
మేకప్‌ కిట్‌లో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లకు చెందిన ‘మేకప్, స్కిన్‌కేర్, బాడీకేర్, హెయిర్‌ కేర్‌’ ఉత్పత్తులు ఉంటాయి. ఇది కావాల్సివారు ముందుగా ‘గ్లాబ్‌ఈగో’లో లాగిన్‌ అవ్వాలి. స్కిన్‌కు సంబంధించిన ఎనిమిది ప్రశ్నలు ఇమేజ్‌ రూపంలో ప్రత్యక్షమవుతాయి. మన స్కిన్‌ ఎటువంటింది, మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ను ఎంచుకోవాలి. లాగిన్‌ అయ్యి, సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటేనే మేకప్‌ కిట్‌ ఇంటికి చేరుతుంది. ఒకవేళ మీ స్కిన్‌కి నచ్చిన విధంగా మీరు ఎంచుకోకపోయినా వెబ్‌సైట్‌ మీ స్కిన్‌కు ఆధారంగా ఏ బ్రాండ్‌ అయితే సెట్‌ అవుతుందో అదే బ్రాండ్‌ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంటుంది. ‘స్టార్ట్‌స్ట్రక్‌ బై సన్నీ లియోన్, పారాచూట్, కీరోస్, ట్జోరీ, క్రోనోకరే, పీసేఫ్, ఎలెన్‌బ్ల్యూ, గ్లోబల్‌ బ్యూటీ సీక్రెట్స్, లాక్మె’ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌ని మేకప్‌కిట్‌లో అందించడం విశేషం. 

ఒక్కో విభాగం నుంచి 60కిపైగా..
మేకప్‌ కిట్, స్కిన్‌ కేర్, బాడీకేర్, హెయిర్‌ కేర్‌’లకు సంబంధించిన మేకప్‌ కిట్‌లో ఒక్కో విభాగం నుంచి సుమారు 50కిపైగా ప్రొడక్ట్స్‌ అందిస్తున్నారు. మేకప్‌ కిట్‌లో 62కిపైగా ప్రొడక్ట్స్, స్కిన్‌ కేర్‌లో 42 నుంచి 50, బాడీ కేర్‌లో 30, హెయిర్‌ కేర్‌లో 50 నుంచి 80 రకాల ఉత్పత్తులు ప్రతి నెలా కొన్ని కొన్ని చొప్పున అందిస్తారు. మొదట్లో 18 బ్రాండ్‌లతో ప్రారంభించిన ప్రయాణం ఇప్పటికి 82 బ్రాండ్‌లకు చేరిందని లావణ్య తెలిపారు. ప్రతి నెలా సుమారు ఐదు కొత్త బ్రాండ్‌లకు చెందిన ప్రొడక్ట్స్‌ని ఈ మేకప్‌ కిట్‌లో చేర్చుతున్నట్లు ఆమె వివరించారు.  

ప్రముఖ బ్రాండ్లు రూ.299కే..
ఒక్కో నెలకు రూ.399, మూడు నెలలకు రూ.389, ఆరు నెలలకు రూ.369, ఏడాదికి రూ.299. ఇది ఎంచుకుని అడ్రస్‌ను పూర్తి చేస్తే.. ప్రతి నెలా మొదటి వారంలో మేకప్‌ కిట్‌ ఇంటికి చేరుతుంది. సిటీలో ఇప్పటికే 10వేలకుపైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉండగా.. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో మొత్తం కలిపి 40వేల మందికిపైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉండటం విశేషం.   

త్వరలో దేశవ్యాప్తంగా..
మొదట్లో హైదరాబాద్‌లో మొదలెట్టా. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల నుంచి ఇన్‌స్ట్రాగామ్, వెబ్‌సైట్‌ ద్వారా సబ్‌స్క్రైబ్‌ వచ్చాయి. ఆయా నగరాల్లో ఇప్పటి వరకు 50వేల మందికిపైగా మా మేకప్‌ కిట్‌లు వినియోగిస్తున్నారు. త్వరలో దేశంలోని అన్ని మెట్రో సిటీల్లో విస్తరించాలనేది నా ఆలోచన.     
 – లావణ్య సుంకరి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement