Makeup kit
-
నవ లావణ్యం
అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం. ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా.. ఆహార్యం లావణ్యంగా కనిపించేందుకు యువతులు సహా మహిళలూ ఎంతగానో తపిస్తుంటారు. అందాలకు మెరుగులు అద్దేందుకు సరికొత్త ఉపకరణాలను ఆశ్రయిస్తుంటారు. మారుతున్న కాలానికనుగుణంగా బ్రాండెడ్ మెకప్ వైపు అడుగులు వేస్తుంటారు. ఇదిగో అటువంటి యువతులు అపురూపవతులుగా మారేందుకు ‘సెఫోరా, బెల్లావోస్టే, మన్నా కదర్, వంటి 82 అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మేకప్ కిట్‌ను కేవలం రూ.299కే అందిస్తోంది నగరానికి చెందిన యువతి లావణ్య సుంకరి. ఆ వివరాలేమిటో మీరే చదవండి. – హిమాయత్‌నగర్ సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలికి చెందిన లావణ్య సుంకరి ఎంబీఏ పూర్తి చేసింది. పేరుగాంచిన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కొన్నేళ్ల పాటు మార్కెటింగ్ విభాగంలో సౌతిండియాకు జనరల్ మేనేజర్‌గా పనిచేసింది. చిన్నప్పటి నుంచి అందంగా ఉండే లావణ్యకు మేకప్ అంటే అమితమైన ఇష్టం. ఇదే సమయంలో తను వాడుతున్న మేకప్‌కిట్ లాంటిది యువతులకు అందించాలనే ఆలోచన తట్టింది. అందుకు అనుగుణంగా వ్యాపారం వైపు అడుగులు వేసింది. ఆరు నెలల పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని అంతర్జాతీయ మేకప్ బ్రాండ్ల ప్రతినిధులను కలిసింది. తన మనసులోని మాటను వివరించింది. ఆయా బ్రాండ్లన్నీ ఒప్పుకోవడంతో 2016లో ‘టీ–హబ్’లో ‘గ్లామ్‌ఈగో’ అనే పేరుతో కంపెనీని ప్రారంభించింది. ఇలా లాగిన్ కావాలి.. మేకప్ కిట్‌లో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ‘మేకప్, స్కిన్‌కేర్, బాడీకేర్, హెయిర్ కేర్’ ఉత్పత్తులు ఉంటాయి. ఇది కావాల్సివారు ముందుగా ‘గ్లాబ్ఈగో’లో లాగిన్ అవ్వాలి. స్కిన్‌కు సంబంధించిన ఎనిమిది ప్రశ్నలు ఇమేజ్ రూపంలో ప్రత్యక్షమవుతాయి. మన స్కిన్ ఎటువంటింది, మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ను ఎంచుకోవాలి. లాగిన్ అయ్యి, సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే మేకప్ కిట్ ఇంటికి చేరుతుంది. ఒకవేళ మీ స్కిన్‌కి నచ్చిన విధంగా మీరు ఎంచుకోకపోయినా వెబ్సైట్ మీ స్కిన్‌కు ఆధారంగా ఏ బ్రాండ్ అయితే సెట్ అవుతుందో అదే బ్రాండ్‌ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంటుంది. ‘స్టార్ట్స్ట్రక్ బై సన్నీ లియోన్, పారాచూట్, కీరోస్, ట్జోరీ, క్రోనోకరే, పీసేఫ్, ఎలెన్బ్ల్యూ, గ్లోబల్ బ్యూటీ సీక్రెట్స్, లాక్మె’ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌ని మేకప్కిట్లో అందించడం విశేషం. ఒక్కో విభాగం నుంచి 60కిపైగా.. మేకప్ కిట్, స్కిన్ కేర్, బాడీకేర్, హెయిర్ కేర్’లకు సంబంధించిన మేకప్ కిట్‌లో ఒక్కో విభాగం నుంచి సుమారు 50కిపైగా ప్రొడక్ట్స్ అందిస్తున్నారు. మేకప్ కిట్‌లో 62కిపైగా ప్రొడక్ట్స్, స్కిన్ కేర్‌లో 42 నుంచి 50, బాడీ కేర్‌లో 30, హెయిర్ కేర్‌లో 50 నుంచి 80 రకాల ఉత్పత్తులు ప్రతి నెలా కొన్ని కొన్ని చొప్పున అందిస్తారు. మొదట్లో 18 బ్రాండ్లతో ప్రారంభించిన ప్రయాణం ఇప్పటికి 82 బ్రాండ్లకు చేరిందని లావణ్య తెలిపారు. ప్రతి నెలా సుమారు ఐదు కొత్త బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్‌ని ఈ మేకప్ కిట్‌లో చేర్చుతున్నట్లు ఆమె వివరించారు. ప్రముఖ బ్రాండ్లు రూ.299కే.. ఒక్కో నెలకు రూ.399, మూడు నెలలకు రూ.389, ఆరు నెలలకు రూ.369, ఏడాదికి రూ.299. ఇది ఎంచుకుని అడ్రస్‌ను పూర్తి చేస్తే.. ప్రతి నెలా మొదటి వారంలో మేకప్ కిట్ ఇంటికి చేరుతుంది. సిటీలో ఇప్పటికే 10వేలకుపైగా సబ్స్క్రైబర్స్ ఉండగా.. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో మొత్తం కలిపి 40వేల మందికిపైగా సబ్స్క్రైబర్స్ ఉండటం విశేషం. త్వరలో దేశవ్యాప్తంగా.. మొదట్లో హైదరాబాద్‌లో మొదలెట్టా. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల నుంచి ఇన్‌స్ట్రాగామ్, వెబ్సైట్ ద్వారా సబ్‌స్క్రైబ్ వచ్చాయి. ఆయా నగరాల్లో ఇప్పటి వరకు 50వేల మందికిపైగా మా మేకప్ కిట్లు వినియోగిస్తున్నారు. త్వరలో దేశంలోని అన్ని మెట్రో సిటీల్లో విస్తరించాలనేది నా ఆలోచన. – లావణ్య సుంకరి -
ఆహార్యం ఆదర్శం
వికారాబాద్‌లో శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శనకు ఎంతో ఆసక్తిగా సిద్ధమై వెళ్లారు తిరువుల శేషాచార్యులు. అరుుతే, నాటక ప్రదర్శన క్యాన్సిల్ అరుుంది. ఆయున చాలా బాధపడ్డారు. కారణమేంటని కనుక్కుంటే, భారీ వర్షం వల్ల గుంటూరు నుంచి నాటకానికి అవసరమైన వస్త్రాలు, ఇతర మేకప్ కిట్లు రాలేదని తెలిసింది. శేషాచార్యులు ఈ సవుస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. వెంటనే వుద్రాసు వెళ్లి కొన్ని రకాల నాటకాలకు అవసరవుయ్యే వస్త్రాలను, అలంకరణ సావుగ్రిని కొన్నారు. కాచిగూడలో అప్పటికే స్థాపించిన ‘ఆదర్శ నాట్యకళా పరిషత్’లో ‘ఆదర్శ డ్రెస్ ప్యాలెస్’ను ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ నాటకాలు వేసినా, వస్త్రాల కోసం ఇక్కడికే వచ్చేవారు. ప్యాలెస్ స్థాపించి అరవయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా శేషాచార్యులు తనయుుడు శ్రీనివాస్ చెప్పిన విశేషాలు... నిజాం హయూంలో తెలుగు నాటకాలకు ప్రోత్సాహం ఉండేది కాదు. లెక్చరర్ అరుున వూ నాన్న శేషాచార్యులకు నాటకాలంటే ప్రాణం. ఎక్కడ తెలుగు నాటకాలు ప్రదర్శించినా, వెళ్లి పాల్గొనేవారు. నాటక వస్త్రాల ఇబ్బంది దృష్టికి రావడంతో వెంటనే 1954లో కాచిగూడలో ‘ఆదర్శ డ్రెస్ ప్యాలెస్’ స్థాపించారు. మొదట్లో వుహాభారతానికి సంబంధించిన నాటకాలకు కావలసిన వస్త్రాలు, ఆభరణాలు, మేకప్ కిట్లు పెట్టారు. ఆపై దేశంలోని అన్ని శాస్త్రీయు నృత్యాలకు వస్త్ర, అలంకరణ సావుగ్రినీ అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఇక్కడ నాటకాలు వేయూలంటే వస్త్రాల కోసం గుంటూరు కానీ, తమిళనాడు కానీ వెళ్లాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో నాన్న తన జీతం డబ్బులతో.. నాటకాలపై ప్రేమను చాటుకోవడానికే దీనిని స్థాపించారు. ఆయున 2005లో కన్నువుూసే వరకు సెంటిమెంట్‌తో దీన్ని నడిపించారు. ఆన్లైన్లో ఆర్డర్... ప్రస్తుతం ఆదర్శ డ్రస్ ప్యాలెస్‌కి వచ్చే ఆర్డర్లలో చాలావరకూ విదేశాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఇరవై ఏళ్ల కిందట శేషాచార్యుల హయాంలో ఈ ప్యాలెస్‌కి కాంతారావు, మంజుభార్గవి వంటి స్టార్లు వచ్చి స్వయంగా వస్త్రాలను, మేకప్ సామాన్లు ఎంపిక చేసుకునేవారు. ‘యాభైఏళ్లకిందట నాన్నగారు హైదరాబాద్‌లోని జన్రుద్ థియేటర్లో ఒక నాటకం వేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖనటి భానుమతి గారిని నాన్నగారు ఆహ్వానించారు. ఒకపక్క కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేస్తూనే నాటకపరిషత్ అభివృద్ధి కోసం నాన్న ఊరూరా తిరగడాన్ని భానుమతిగారు ప్రత్యేకంగా ప్రశంసించారు. కేవలం అభిమానంతో అయితే ఎంత పేరున్న సంస్థలనైనా కొన్నాళ్లు నడపొచ్చు. కొంత వ్యాపారదృష్టి, వూర్కెటింగ్ నైపుణ్యాలు లేకుంటే ఎంతటి సంస్థలయినా మూతపడాల్సిందే. అందుకే నేను ఆన్‌లైన్‌ని నమ్ముకున్నాను. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆదర్శడ్రెస్ ప్యాలెస్డాట్కామ్ పేరుతో వెబ్‌సైట్‌ని తయారుచేసి, అందులో మా ప్యాలెస్ సమాచారం మొత్తం పెట్టాను. దాంతో మాకు ఆన్లైన్ ఆర్డర్ల సంఖ్య పెరిగింది’’ అని చెప్పారు శ్రీనివాస్. కొరియర్... మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి రకరకాల నృత్యాలకు సంబంధించిన కిట్లు కావాలంటూ ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు వస్తుంటాయి. చాలావరకూ కొరియర్ ద్వారా డ్రెస్, జ్యువెలరీ, మేకప్ కిట్లను పంపించేస్తున్నారు. ఇవి కాకుండా మన సినిమావాళ్లు కూడా ఇక్కడికి వచ్చి, వారి కోసం ప్రత్యేకంగా డ్రెస్‌లు డిజైన్ చేయించుకుంటున్నారు. -
మేకప్ కిట్
ముఖారవిందానికి బ్రష్‌లు... మేకప్ కిట్‌లో ఉండాల్సిన వాటిలో ముఖ్యమైనవి మేకప్ బ్రష్‌లు. సరైన బ్రష్‌లను ఉపయోగిస్తే చిన్న స్ట్రోక్స్‌తోనే మెరుగైన మేకప్‌ని పూర్తిచేసుకోవచ్చు. చాలామంది చేతినిండా పట్టేటంత బ్రష్ తీసుకొని మేకప్ వేసుకుంటుంటారు. దీని వల్ల అత్యంత సాధారణ లోటుపాట్లను కూడా సరిచేసుకోలేరు. అందుకే కొనుగోలు చేయడానికి ముందు ఎలాంటి మేకప్ బ్రష్‌లు అవసరమో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సౌందర్యసాధనాలలో బ్రష్‌ల పాత్ర కీలకమైనది. పౌడర్ బ్రష్: ఇది సాధారణంగా అందరు వాడే బ్రష్. కాంపాక్ట్ వాడేటప్పుడు ఈ బ్రష్‌ని ఉపయోగిస్తే పౌడర్ ప్యాచ్‌లుగా ముఖానికి పట్టదు. బ్లషర్ బ్రష్: బుగ్గల మీద అద్దే కాంపాక్ట్ కోసం చాలామంది పౌడర్ బ్రష్‌నే బ్లషర్గా వాడతారు. పౌడర్ బ్రష్ కన్నా బ్లషర్ పెద్దగా ఉంటుంది. బ్లషర్‌ని ఉపయోగించడం వల్ల ఒకటి రెండు స్ట్రోక్స్‌తోనే చక్కని మార్పు తీసుకురావచ్చు. ఐ షాడో బ్రష్: ఈ బ్రష్‌లు సాధారణంగా ఫ్లాట్‌గా ఉంటాయి. వీటితో కంటి చుట్టు భాగాన్ని అందంగా తీర్చిదిద్దవచ్చు. ఐ లైనర్ బ్రష్: ఐ లైనర్ బ్రష్‌ను పెన్సిల్ గీతలా ఉపయోగించవచ్చు. ఐ లైనర్ స్మడ్జర్: దీనిని పూర్తి బ్రష్‌గా చెప్పలేం. కుచ్చుల స్థానంలో పలచని స్పాంజ్ ఉంటుంది. పర్యావరణ అనుకూల బ్రష్‌లు: బయోడీగ్రేడబుల్ మెటీరియల్‌తో రూపొందించిన బ్రష్‌ల వల్ల హానికరమైన టాక్సిన్ల నుంచి, హానికరమైన రసాయనాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకోవచ్చు. మేకప్ బ్రష్‌ల ఎంపికకు మీ సౌందర్య నిపుణల సలహా తీసుకోవచ్చు.