ఆహార్యం ఆదర్శం
వికారాబాద్‌లో శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శనకు ఎంతో ఆసక్తిగా సిద్ధమై వెళ్లారు తిరువుల శేషాచార్యులు. అరుుతే, నాటక ప్రదర్శన క్యాన్సిల్ అరుుంది. ఆయున చాలా బాధపడ్డారు. కారణమేంటని కనుక్కుంటే, భారీ వర్షం వల్ల గుంటూరు నుంచి నాటకానికి అవసరమైన వస్త్రాలు, ఇతర మేకప్ కిట్‌లు రాలేదని తెలిసింది. శేషాచార్యులు ఈ సవుస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. వెంటనే వుద్రాసు వెళ్లి కొన్ని రకాల నాటకాలకు అవసరవుయ్యే వస్త్రాలను, అలంకరణ సావుగ్రిని కొన్నారు.
కాచిగూడలో అప్పటికే స్థాపించిన ‘ఆదర్శ నాట్యకళా పరిషత్’లో ‘ఆదర్శ డ్రెస్ ప్యాలెస్’ను ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ నాటకాలు వేసినా, వస్త్రాల కోసం ఇక్కడికే వచ్చేవారు. ప్యాలెస్ స్థాపించి అరవయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా శేషాచార్యులు తనయుుడు శ్రీనివాస్ చెప్పిన విశేషాలు...
నిజాం హయూంలో తెలుగు నాటకాలకు ప్రోత్సాహం ఉండేది కాదు. లెక్చరర్ అరుున వూ నాన్న శేషాచార్యులకు నాటకాలంటే ప్రాణం. ఎక్కడ తెలుగు నాటకాలు ప్రదర్శించినా, వెళ్లి పాల్గొనేవారు. నాటక వస్త్రాల ఇబ్బంది దృష్టికి రావడంతో వెంటనే 1954లో కాచిగూడలో ‘ఆదర్శ డ్రెస్ ప్యాలెస్’ స్థాపించారు. మొదట్లో వుహాభారతానికి సంబంధించిన నాటకాలకు కావలసిన వస్త్రాలు, ఆభరణాలు, మేకప్ కిట్‌లు పెట్టారు.
ఆపై దేశంలోని అన్ని శాస్త్రీయు నృత్యాలకు వస్త్ర, అలంకరణ సావుగ్రినీ అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఇక్కడ నాటకాలు వేయూలంటే వస్త్రాల కోసం గుంటూరు కానీ, తమిళనాడు కానీ వెళ్లాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో నాన్న తన జీతం డబ్బులతో.. నాటకాలపై ప్రేమను చాటుకోవడానికే దీనిని స్థాపించారు. ఆయున 2005లో కన్నువుూసే వరకు సెంటిమెంట్‌తో దీన్ని నడిపించారు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్...
ప్రస్తుతం ఆదర్శ డ్రస్ ప్యాలెస్‌కి వచ్చే ఆర్డర్లలో చాలావరకూ విదేశాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఇరవై ఏళ్ల కిందట శేషాచార్యుల హయాంలో ఈ ప్యాలెస్‌కి కాంతారావు, మంజుభార్గవి వంటి స్టార్లు వచ్చి స్వయంగా వస్త్రాలను, మేకప్ సామాన్లు ఎంపిక చేసుకునేవారు. ‘యాభైఏళ్లకిందట నాన్నగారు హైదరాబాద్‌లోని జన్‌రుద్ థియేటర్‌లో ఒక నాటకం వేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖనటి భానుమతి గారిని నాన్నగారు ఆహ్వానించారు.
ఒకపక్క కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేస్తూనే నాటకపరిషత్ అభివృద్ధి కోసం నాన్న ఊరూరా తిరగడాన్ని భానుమతిగారు ప్రత్యేకంగా ప్రశంసించారు. కేవలం అభిమానంతో అయితే ఎంత పేరున్న సంస్థలనైనా కొన్నాళ్లు నడపొచ్చు. కొంత వ్యాపారదృష్టి, వూర్కెటింగ్ నైపుణ్యాలు లేకుంటే ఎంతటి సంస్థలయినా మూతపడాల్సిందే. అందుకే నేను ఆన్‌లైన్‌ని నమ్ముకున్నాను. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆదర్శడ్రెస్ ప్యాలెస్‌డాట్‌కామ్ పేరుతో వెబ్‌సైట్‌ని తయారుచేసి, అందులో మా ప్యాలెస్ సమాచారం మొత్తం పెట్టాను. దాంతో మాకు ఆన్‌లైన్ ఆర్డర్ల సంఖ్య పెరిగింది’’ అని చెప్పారు శ్రీనివాస్.
కొరియర్...
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి రకరకాల నృత్యాలకు సంబంధించిన కిట్‌లు కావాలంటూ ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు వస్తుంటాయి. చాలావరకూ కొరియర్ ద్వారా డ్రెస్, జ్యువెలరీ, మేకప్ కిట్‌లను పంపించేస్తున్నారు. ఇవి కాకుండా మన సినిమావాళ్లు కూడా ఇక్కడికి వచ్చి, వారి కోసం ప్రత్యేకంగా డ్రెస్‌లు డిజైన్ చేయించుకుంటున్నారు.