Hair care
-
జుట్టు వేగంగా పెరగాలంటే చివర్లు కట్ చేస్తే సరిపోతుందా?
జుట్టును సంరక్షించుకోవడం ఒక సమస్య. ఉన్న జుట్టును మరింత ఆరోగ్యంగా, వేగంగా పెంచుకోవడం మరో సమస్య. ఇందుకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం, చుండ్రులేకుండా జాగ్రత్త పడటంతోపాటు, జుట్టు చివర్ల (స్ప్లిట్ ఎండ్స్)ను కట్ చేయడం లాంటివి చేయడం చాలా మంది పాటించే పద్ధతి. అయితే ఇలా చేయడం వల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.నిజానికి జుట్టు చివర్లు కత్తిరించడం వల్ల అది వేగంగా పెరుగుతుందనే వాదనకు ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటు జుట్టు పెరుగుదల స్కాల్ప్ నుంచి మొదలవుతుంది. కుదుళ్లు బలంగా ఉంటే జుట్టు బలంగా ఉంటుంది. కాబట్టి చనిపోయిన చివర్లను కత్తిరించడం వల్ల అది వేగంగా పెరగదు. కానీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. స్ప్లిట్ చివర్లు , డ్యామేజ్ అయిన జుట్టును కత్తిరించడం వల్ల, క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు, ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపిస్తుంది.ఎన్ని రోజులకోసారి కట్ చేయాలి?సాధారణంగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి అంగుళం మేర కత్తిరించుకోవాలి. ఎంత మేర ట్రిమ్ చేయాలి. ఎన్నిరోజులకు ఒకసారి చేయాలి అనేది ఇది జుట్టు పొడవు, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్య బట్టి ఉంటుంది. చాలా మందికి రోజుకు 50-100 వెంట్రుకలు రాలిపోతాయి. అయితే ఈ వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊడిపోయిన వాటి స్థానంలో కొత్త జుట్టు రావాలంటే సరైన పోషణ అవసరం.జుట్టుకూ ఉండాలి పోషణఅందమైన మెరిసే జుట్టు కావాలంటే పోషణ అవసరం. వారానికి ఒకసారి అయినా కుదుళ్లకు తాకేలా నూనెతో మర్దనా ఉండాలి. తద్వారా హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. రసాయన రహిత షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉండాలి. బ్లో డ్రైయింగ్ చేయడం, స్ట్రెటియినింగ్ చేయడం, కర్లింగ్ చేయడం లాంటివి తరచుగా చేయకుండా ఉండాలి. ఇవి జుట్టు సహజ మెరుపును, అందాన్ని పాడుచేస్తాయి. నాణ్యమైన హెయిర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. జుట్టు ఆరోగ్యం కోసం ఆహారం ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ ఈ చాలా కీలకం. ఇది బొప్పాయి, బాదం, హాజెల్ నట్స్, అవకాడోస్, దోసకాయ బచ్చలికూర వంటి అనేక పండ్లు , కూరగాయలలో సహజంగా లభిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెలు, సాల్మన్ ట్యూనాతో సహా అనేక రకాల చేపలు విటమిన్ ఇ-రిచ్ ఫుడ్స్. ప్రొటీన్ తగ్గడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. జింక్, సెలేనియం, బయోటిన్ లభించే గుడ్లు తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ ,ఫోలేట్లు పుష్కలంగా ఉండే పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఐరన్ లోపం లేకుండా చేసుకోవాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం జిడ్డుగా ఉంటే జుట్టును తరచుగా శుభ్రం చేసుకోవాలి. క్లోరిన్ హానికరమైన ప్రభావాలకు దూరంగా ఉండాలి. ఈత కొట్టే స్యంలో జుట్టును కప్పుకోవాలి. ఇంటినుంచి బయటికి వెళ్లినపుడు కాలుష్యం యూవీ కిరణాలనుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కట్టుకోవడం, గొడుగు వాడటం ఉత్తమం. -
బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా!
బట్టతల పురుషులను ఇబ్బందిపెట్టే సమస్య. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. రకరకాల నూనెలు వాడుతుంటారు. అప్పటికీ ఫలితం లేకపోతే, చాలా ఖరీదైన, బాధాకరమైన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలకు కూడా సిద్ధపడుతుంటారు. బట్టతలకు విరుగుడుగా అమెరికన్ కంపెనీ ‘హయ్యర్డోస్’ తాజాగా ఈ టోపీని మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ టోపీని క్రమం తప్పకుండా ఆరునెలలు పెట్టుకుంటే, బట్టతల మటుమాయమవుతుందని తయారీదారులు చెబుతున్నారు. బయటి నుంచి చూడటానికి ఈ టోపీ మామూలుగానే ఉన్నా, దీని లోపలి భాగంలో ఇన్ఫ్రారెడ్ కిరణాలను ప్రసరించే చిన్న చిన్న బల్బులు ఉంటాయి. రీచార్జ్ బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. ఈ బల్బుల నుంచి వెలువడే ఎర్రని కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోని కణజాలంలో ఉండే మైటోకాండ్రియాను బలోపేతం చేస్తాయి.ఫలితంగా బట్టతలపై క్రమక్రమంగా వెంట్రుకలు మొలకలెత్తడం మొదలవుతుంది. దీని ఖరీదు 449 డాలర్లు (రూ.37,493). హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఈ టోపీ ధర తక్కువే!ఇవి చదవండి: నయనతార 'చిన్నారి కవల'లను చూశారా! -
జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఇలా చేయండి!
'ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు.' ఇలా చేయండి.. జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే... ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టును కడిగితే సిల్కీగా అవుతుంది. తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. ఇవి చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..? -
పప్పులతో ఫేస్‌ప్యాక్.. ముఖం బంగారంలా వెలిగిపోతుంది
బ్యూటీ టిప్స్ ►ఎర్ర పప్పు మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఎర్రపప్పులోని పోషకాలు,విటమిన్లు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి. ఈ ఎర్రపప్పుతో ఫేస్‌ప్యాక్ వల్ల మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. ►కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. ► మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. ► రెండుగంటలు నానిన నాలుగు టీస్పూన్ల పొట్టు పెసరపప్పుని పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్ పీల్ పొడి, టీస్పూను గంధం పొడి వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరవాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. హెయిర్ టిప్స్ ► టీస్పూను అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెవేసి అన్నిటినీ చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసి మర్దన చేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పలుచబడిన మాడు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతుంది. -
జుట్టు బాగా రాలుతుందా? ఉసిరి, క్యారెట్‌తో ఇలా చేస్తే..
ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఉసిరి ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధికమొత్తంలో విటమిన్ ఇ , విటమిన్ ఉ, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి.ఇందుకోసం ఏం చేయాలంటే..ఉసిరికాయను ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి. ముక్కలు ఆరిన తరువాత పొడిచేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి పొడి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దానిలో నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా చేసుకుని స్కాల్ప్‌పై అఫ్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుని రెండు గంటల పాటు ఉంచుకుని ఆ తరువాత షాంపు, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది. క్యారెట్ క్యారెట్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడమేగాక, వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. క్యారెట్ జ్యూస్ తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. అందువల్ల 100 మిల్లీ లీటర్ల క్యారెట్ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ కేశాలను ధృడంగా ఉంచడంలో సాయపడుతుంది. వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది. కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు పెరుగుతాయి. అంతేకాకుండా 15–20 నిమిషాలపాటు కొబ్బరినూనెతో స్కాల్ప్ మర్దన చేసి ఒక గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆతరువాత షాంపుతో వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన డైట్ పాటించడంతో పాటు యోగా, ధ్యానం, వర్కౌట్ చేయాలి. -
ఈ డివైజ్ ఉంటే.. ఒత్తయిన ఉంగరాల జుట్టు ఈజీగా మీ సొంతం!
ఒత్తయిన.. ఉంగరాల జుట్టు ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. దానికున్న క్రేజే వేరు! కానీ.. మేనేజ్ చేయడమే మహాకష్టం. అయితే చిత్రంలోని డివైస్ కర్లీ హెయిర్ సంరక్షణను మేడ్ ఈజీ చేస్తుంది. ఈ ఆటోమేటిక్ హెయిర్ కర్లర్.. 2 సెకన్ల పాటు పవర్ బటన్‌ను నొక్కిపడితే ఆన్ అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు.. ఫెళుసుబారిన జుట్టునూ మృదువుగా మార్చుతూ, అందమైన గిరజాలను సృష్టిస్తుంది. 8 నుంచి 11 సెకన్స్‌లో స్లైట్ కర్ల్స్ ఏర్పడతాయి.12 సెకన్లు దాటి 15 సెకన్స్ వరకూ ఉంచితే సాఫ్ట్ కర్ల్స్ ఏర్పడతాయి. 16 నుంచి 18 సెకన్ల వరకూ ఉంచితే.. టైట్ కర్ల్స్ (పూర్తిస్థాయిలో ఉంగరాలు) ఏర్పడతాయి. డివైస్‌కి ఒకవైపు సన్నని కర్లర్ చాంబర్ ఉంటుంది. దానిలో పాయలు పాయలుగా జుట్టును పెడితే.. అవి ఉంగరాలుగా చుట్టుకుని అందంగా మారుతాయి. ఇందులో మూడు వందల డిగ్రీల ఫారిన్ హీట్ నుంచి మూడువందల తొంభై డిగ్రీల ఫారిన్ హీట్ వరకు ఆరు స్థాయిల్లో ఉష్ణోగ్రతను పెంచుకునే వీలుంటుంది. డిస్ప్లేలో బ్యాటరీ ఇండికేటర్, టైమ్ అండ్ టెంపరేచర్ వివరాలతో పాటు.. కర్లర్ ఎటువైపు తిరుగుతున్నాయో కూడా వివరంగా చూసుకోవచ్చు. లెఫ్ట్, రైట్ అనే ఆప్షన్స్‌తో కర్లర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. దీని ధర సుమారుగా 1,249 రూపాయలు. (చదవండి: కరీనాకపూర్ మేకప్ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్ ఇదే..!) -
Side Effects Of Hair Dyeing: తెల్లబడిందని జుట్టుకు రంగు వేస్తున్నారా? క్యాన్సర్ రావొచ్చు!
ఇంతకుముందు వృద్దాప్యంలో తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం చూస్తున్నాం. దీంతో దాన్ని కవర్ చేసేందుకు ఎడాపెడా ఎయిర్ డైని వాడేస్తున్నారు. మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. మరి హెయిర్ డై ఎంత వరకు సురక్షితం?హెయిర్ డై తరచుగా వాడితే క్యాన్సర్ వస్తుందా అన్నది ఇప్పుడు చూద్దాం. హెయిర్‌డైలో ఉండే కెమికల్స్ మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దీనివల్ల అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్) వస్తుంటాయి. ఇలా జరిగితే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. కొంతమంది హెయిర్ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఆ తర్వాతే వేసుకోవాలి. అందుకోసం ముందుగానే చర్మంపై చిన్న మోతాదులో వేసుకొని పరీక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాల వల్ల కళ్లు మండటం, గొంతులో ఇబ్బంది, వరుసగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు రావొచ్చు. ఇది కొన్నిసార్లు ఆస్తమాకు దారితీయవచ్చు. రంగు వేసుకునే టైంలో తప్పనిసరిగా గ్లౌవ్స్ ధరించాలి. హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దీనివల్ల వెంట్రుకలు రఫ్‌గా అవుతాయి. కొందరు హెయిర్ డైని తలకు మాత్రమే కాకుండా కనుబొమ్మలకు కూడా వాడుతుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. తరచుగా ఈ హెయిర్ డై వాడే వారికి కాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అందుకే ఇంట్లోనే సహజసిద్దమైన పద్దతిలో డై వేసుకోవడం మంచిది. -
ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా? ఆ తప్పు అస్సలు చేయకండి
శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాలంలో చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యల చిక్కులు తప్పవు. ముఖ్యంగా చలికాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తదితర విషయాలు తెలుసుకుందాం... శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల శరీరంలోనే కాదు, శిరోజాల్లో కూడా తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతే కాదు, కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికం అవుతుంది కాబట్టి చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. తరచూ తలస్నానం శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా చేయకూడదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసార్లు చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. వేడినీటి స్నానం శీతాకాలంలో స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడి నీటి స్నానం వల్ల చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి కురులు పొడిగా... నిర్జీవంగా మారిపోతాయి. హెయిర్ డ్రయ్యర్స్ శీతాకాలంలో జుట్టుకు ఉపయోగించే డ్రయర్స్, కర్లర్స్స్ట్రెయిటనర్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. కండీషనింగ్ తలస్నానానికి ముందు జుట్టుకు కండీషనర్ తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. హెయిర్ ఆయిల్ చలికాలంలో శిరోజాలకు తరచు నూనె పెడితే మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి సన్న పళ్ల దువ్వెన కాకుండా పళ్లు కాస్త దూరంగా... వెడల్పుగా ఉన్న దువ్వెన వాడటం మంచిది. అట్ట కట్టినట్టు ఉంటే : చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా కాకుండా ఉండాలంటే రోజూ రాత్రిళ్లు విటమిన్ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కురులను కవర్ చేసేలా స్కార్ఫ్, టోపీ వంటివి ధరించాలి. కుదరని పక్షంలో బాడీలోషన్ కొద్దిగా తీసుకుని చేతులకు రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతులతో జుట్టును మెల్లగా దువ్వుతున్నట్లు సవరించుకోవాలి. ఇలా చేయడం వల్ల పెళుసుదనం పోయి, శిరోజాలు ప్రకాశవంతంగా మారుతాయి. ఈ జాగ్రత్తలతో ఈ కాలంలోనూ కురులు నిగనిగలాడతాయి. -
హెయిర్ కేర్: ఇలా చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది
తలస్నానం చేసిన మరుసటి రోజుకే జుట్టు నిర్జీవంగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ►అర టీ స్పూను అలోవెరా జెల్, ఒక టీ స్పూను నిమ్మరసం తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా ఉపయోగించే షాంపూలో కలపాలి. ఈ షాంపూ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి, పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే పట్టు కుచ్చుల్లా మెరుస్తుంది. ►శీకాకాయ, ఉసిరిపొడి, కరివేపాకు, మందార పువ్వులను సమపాళ్లల్లో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వీటన్నింటిని పేస్టు చేయాలి. ఈ పేస్టుని జుట్టుకి పట్టించి అరగంట తరువాత షాంపూతో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ► ఏదైనా ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. Simple Home Remedies To Make Ur Hair Smooth And Shine ► ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి ఆ నీటిని 15 నుంచి 20 నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి. ఆ నీళ్ళు చల్లారిన తర్వాత వడకట్టి, షాంపూలో వేసుకోవాలి.తలస్నానం చేసే ముందు ఈ షాంపూను కేశాల కుదుళ్ళ నుంచి, చివర్ల వరకూ అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ► గ్లాసు నీళ్ళల్లో టేబుల్ స్పూను వెనిగర్, కొద్దిగా ఉప్పు కలపాలి. ఈ మిశ్రమంలోంచి రెండు టేబుల్‌స్పూన్లు తీసుకుని మాడుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత నీటితో కేశాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టులో అధికంగా ఉండే ఆయిల్ తగ్గి జుట్టు స్మూత్‌గా మారుతుంది. -
జుట్టు సౌందర్యానికి మామిడి ఆకులు.. ఈ విషయాలు మీకు తెలుసా?
నోరూరించే మామిడి పళ్లు తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. అయితే మామిడి ఆకులు కోసుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అందుకే వివాహాది శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంతేనా? జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు కూడా మామిడి ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించిన వారికి జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు... తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్‌ను కట్టుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపకరిస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా ఉంచుతాయి. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , నిగారింపు వచ్చేలా చేయడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? ►తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని కాసిని నీళ్లు చేర్చి మిక్సీలో వేసుకుని లేదా రుబ్బుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్‌ను చివళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరేదాకా ఉంచి, ఆ తరవాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ►మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతో పాటు నల్లగా మారుతుంది. ►మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా కాచుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. -
జుట్టుకు హెన్నా పెడుతున్నారా?ఈ తప్పులు అస్సలు చేయకండి
మెహందీలో ఇవి కలిపితే... ►జుట్టుకు మెహందీ పెట్టుకునేటప్పుడు అరటిపండుని కలిపితే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మాడు దురదను తగ్గిస్తాయి. అరటిపండుని మెత్తగా చిదుముకుని మెహందీలో వేసి కలపాలి. ఈ మెహందీని జుట్టుకి పట్టించి గంట తరువాత కడిగేయాలి. ► కొబ్బరిపాలను కొద్దిగా వేడి చేసి కొన్ని చుక్కలు ఆలివ్ ఆయిల్‌ను వేసి కలపాలి. ఈ పాలను మెహందీలో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే... కొబ్బరి పాలలోని లారిక్ ఆమ్లం మంచి యాంటీబయోటిక్‌గా పనిచేసి, మాడు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. కండీషనర్స్, షాంపులలో కొబ్బరిపాలను వాడతారు. ఇలా మెహందీలో కొబ్బరిపాలు కలపడం వల్ల మెహందీ మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. ►టేబుల్ స్పూను హెన్నా, టేబుల్ స్పూను ముల్తానీ మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని తలలో బాగా దురదపెడుతోన్న భాగంలో రాసి, అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. హెన్నా రాసేముందు ఈ తప్పులు చేస్తున్నారా? మెహందీ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పెట్టాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. మెహందీని అప్పటికప్పుడు కలుపుకోకుండాముందు రోజు రాత్రే కనీసం 4-5 గంటల పాటు స్టోర్ చేసుకోవాలి. ఇక హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే, అంత బాగా జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు.కానీ, ఇలా ఎక్కువ సేపు ఉంచితే, హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుంది. జుట్టు విపరీతంగా పొడిగా మారుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి 1-2 గంటలకు మించి పెట్టరాదు. చాలామంది పొడి జుట్టు మీదే మెహందీని పెడుతుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. దీని వల్ల జుట్టు మరింత డ్రైగా కనిపిస్తుంది. రంగు కూడా బాగా కనిపించదు. దీని కోసం, ముందుగా హెయిర్ కండీషనర్‌ని వాడండి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. దీనివల్ల జుట్టు పొడిగా మారదు. అలాగే, మెహందీని అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్య ఉండదు. కొంతమందికి హెన్నా పడకపోవచ్చు. కానీ, ఇది జుట్టు రాలడం, అలెర్జీలకు దారితీయవచ్చు. అందువల్ల,జుట్టుకు రాసేముందే కాస్తంత హెన్నాను తీసుకొని చర్మంపై రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మెహందీ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కొందరు వారం రోజులకు ఒకసారి కూడా పెడుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. హెన్నాను నెలకు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. అతిగా వాడొద్దు. -
అవిసె గింజలతో జుట్టు సిల్కీగా, స్ట్రెయిట్‌గా.. ఈ ప్యాక్ ట్రై చేయండి
బ్యూటీ టిప్స్ రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెలో టీ స్పూను పసుపు, టేబుల్ స్పూను పెరుగు, టేబుల్ స్పూను శనగపిండి, రెండు టీస్పూన్ల టొమాటో రసం, రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి ఐదునిమిషాలు రుద్దాలి. తరువాత నీటితో కడిగితే ట్యాన్ మొత్తం పోతుంది. స్ట్రెయిట్‌గా... సిల్కీగా... గ్లాసు నీటిలో రెండు టీసూన్ల అవిసె గింజలు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి పదినిమిషాలు మరిగించాలి. తరువాత వడగట్టి...పేస్టులాంటి పదార్థాన్ని తీసుకోవాలి. దీనిలో టేబుల్‌స్పూను కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి చివర్లవరకు పట్టించాలి. గంట తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ జుట్టుని స్ట్రెయిట్‌గా, సిల్కీగా మారుస్తుంది. -
ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బ్యూటీ టిప్స్ ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది. ►రెండు కర్పూరం బిళ్లలు, మూడు కప్పల వేపాకుల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి పేస్టుచేయాలి. ఈ మిశ్రమాన్ని చుండ్రు ఉన్న ప్రాంతంలో రాసి మర్దన చేయాలి. చుండ్రు బాధ క్రమంగా తగ్గిపోతుంది. కర్పూరం పొడిని ఆలివ్ నూనెలో వేసి కలిపి జుట్టుకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వారానికి మూడుసార్లు చేస్తే ఉపశమనం త్వరగా వస్తుంది. ► కాలివేళ్ల సందుల్లో గాలి తగలక పాచిపడుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...కాళ్లను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు టూత్పేస్టుని వేళ్ల సందులో రాయాలి. రోజూ పడుకునేముందు ఇలా చేస్తే కాళ్లు పాయవు. ► ఒక బౌల్లో హాఫ్ కప్ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్‌ని మొహానికి అప్లయ్ చేసి.. 15 మినట్స్ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోండి. -
వీకెండ్లో మెరిసిపోండి.. ఇలా చేస్తే జుట్టు తెల్లబడదు
ట్యాన్ తగ్గాలంటే... ► స్పూను కాఫీ పొడిలో స్పూను తేనె, స్పూను బంగాళ దుంప రసం, స్పూను గంధం పొడివేసి చక్కగా కలిపితే డీ ట్యాన్ ప్యాక్ రెడీ. ఈ ప్యాక్‌ను ముఖం, చేతులు, మెడపైన పూతలా వేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత తడి బట్టతో తుడిచేసి, నీటితో కడిగేయాలి. ► వారానికి రెండు–మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే నలుపు పోయి, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ప్యాక్ వేసుకునే సమయం లేనప్పుడు..టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే ట్యాన్ తగ్గుతుంది. ► నిమ్మరసంలో బంగాళదుంప రసం కలిపి ముఖానికి పెట్టుకున్నా ట్యాన్ పోతుంది ► ఈ ప్యాక్‌లు వేసుకున్నప్పటికీ రాత్రి పడుకునేముందు చేతులు, కాళ్లకు నైట్‌క్రీమ్ రాసుకుంటే ట్యాన్ తొలగి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. హెయిర్ కేర్ యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. ఉసిరి పొడిలో నిమ్మరసం వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి క్యాప్ పెట్టుకోవాలి. గంట తరువాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ ప్యాక్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండి కురులను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. త్వరగా తెల్లబడదు. -
డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ ప్రచారకర్తగా దీపికా పదుకొనే
హైదరాబాద్: గ్లోబల్ టెక్నాలజీ సంస్థ డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నటి దీపికా పదుకొనేను నియమించుకుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి శిరోజాల సంరక్షణపై కనీస అవగాహన అవసరం. ఆరోగ్యకరమైన హెయిర్ స్టైల్ కోసం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను చేస్తున్న డైసన్‌కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తుండటం సంతోషంగా ఉందని దీపికా అన్నారు. ‘‘మా బ్రాండ్‌కు దీపికా మరింత గుర్తింపు తీసుకొస్తుంది. అధునాతన కేశాలంకరణ పరికరాల మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు ఆమెకు ఉన్న ఆకర్షణ మాకు కలిసొస్తుంది’’ అని డైసన్ ఇండియా ఎండీ అంకిత్ జైన్ తెలిపారు. -
వర్షకాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? అయితే ఇలా చేయండి
♦ వాతావరణంలో మార్పుల వల్ల లేదా జుట్టు స్వభావం వల్ల ఒకోసారి తలస్నానం చేసినప్పటికీ వెంట్రుకలు వాసన వస్తుంటాయి. కొంతమందిలో వాసనతోపాటు జుట్టు ఊడిపోతుంటుంది. ఈ సమస్య నివారణకు ఇంట్లోనే సులభంగా చేసుకోదగిన ఈ రెండు చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. ♦ అలోవెరా జెల్ లేదా అలోవెరా నూనెను వారానికి ఒకసారి తలకు పట్టించి గంట తరువాత కడిగితే వెంట్రుకల నుంచి వచ్చే వాసన పోతుంది. అలోవెరాలోని విటమిన్ ఎ, సి, ఇ, బీ12 లు జుట్టుకు అంది పెరుగుదలకు దోహద పడతాయి. ♦ శీకా కాయ, ఉసిరిపొడి, కరివేపాకు, మందార పువ్వులను సమపాళ్లల్లో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వీటన్నింటిని పేస్టు చేయాలి. ఈ పేస్టుని జుట్టుకి పట్టించి అరగంట తరువాత షాంపూతో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల కురుల నుంచి వచ్చే చెడువాసన పోవడంతోపాటు, జుట్టుకూడా పెరుగుతుంది. -
ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవను.. నా బ్యూటీ సీక్రెట్ అదే: తాప్సీ
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెరంగేట్రం చేసిన మోడల్ తాప్సీ పన్ను. 2010లో విడుదలైన ఈ మూవీలో గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ ఢిల్లీ అందం.. 2011లో ఆడుకాలంతో కోలీవుడ్‌లో అడుగిడింది. ఇక వరుణ్ ధావన్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఛష్మే బద్దూర్’తో బీ-టౌన్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ.. థప్పడ్ వంటి వుమెన్ ఓరియంటెడ్ సినిమాతో సత్తా చాటింది. నటిగా రోజురోజుకూ మరింత మెరుగుపడుతున్న ఈ సోగకళ్ల సుందరి తన బ్యూటీ సీక్రెట్‌ను రివీల్ చేసింది. తన ఉంగరాల జుట్టు అందంగా కనిపించడానికి అమ్మే కారణమంటూ మురిసిపోయింది. నిద్ర దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవను. కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోతాను. స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్..మాయిశ్చరైజింగ్.. హైడ్రేటింగ్ కంపల్సరీ. అలాగే నా జుట్టు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. తెలుసు కదా.. కర్లీ హెయిర్‌ని మేనేజ్ చేయడం ఎంత కష్టమో! ఆ క్రెడిట్ మా అమ్మదే! నా జుట్టు కోసం కొబ్బరి నూనెలో మందార ఆకులు, ఉసిరి ఎట్సెట్రా ఇన్‌గ్రీడియెంట్స్ వేసి స్పెషల్ ఆయిల్ తయారు చేస్తుంది. ఆ ఆయిల్‌ని రోజూ రాత్రి తలకు పట్టించి తెల్లవారి తలస్నానం చేస్తా! అందుకే కర్లీ హెయిర్ అయినా కాస్త సాఫ్ట్‌గా కనపడుతుంది’’ అని తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది. చదవండి: ఆపకుండా గట్టిగా నవ్వితే చనిపోతారా? దీనిలో నిజమెంతంటే... -
ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు
జుట్టు రాలడం తగ్గి కురులు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మందార తైలం తయారు చేసుకుని తలకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ►ఇరవై మందార పువ్వులను తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. ►పువ్వులు బాగా ఆరిన తరువాత మిక్సీజార్‌లో వేసుకుని రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెపెట్టి దానిలో అరలీటరు నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె పోయాలి. మెంతులు కూడా వేసి ►అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మందార పువ్వుల పేస్టు, స్పూను మెంతులు వేసి మరగనివ్వాలి. ►మరిగిన తరువాత దించేముందు కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం లేదంటే.. ►తర్వాత ఆయిల్‌ను చల్లారనిచ్చి వడకట్టి సీసాలో భద్రపరుచుకోవాలి. ►ఈ మందార తైలాన్ని వారానికి రెండుసార్లు తలకు పట్టించి మర్దనా చేస్తే.. కుదుళ్లకు పోషణ అందుతుంది. ►ఫలితంగా రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ►పచ్చకర్పూరం లేదా ముద్దకర్పూరం వేయడం వల్ల పేలు రాకుండా ఉండటమే కాక మాడుకు చల్లగా హాయిగా అనిపిస్తుంది. -
Hair Care: చుండ్రు నివారణకు ఈ చిట్కాలు పాటిస్తే..
తలలో చుండ్రు సమస్య ఈ కాలం అధికంగా విసిగిస్తుంటుంది. దీనికి కారణం మాడు పై భాగం పొ డిబారడం వల్ల తెల్లటి పొ ట్టులాంటి మృతకణాలు బయటకు కనిపిస్తుంటాయి. దీనివల్ల దురద కూడా ఉంటుంది. ఈ సమస్య నివారణకు.. ♦ ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపా లి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ♦ కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది. ♦ చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట సేపు ఆలాగే ఉంచి, ఆ తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది. ♦ కప్పు నీళ్లలో 2–3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపా లి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ♦వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపా ళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ♦ బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. చదవండి: ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడేమో ఇలా.. చెబితే నమ్మరు గానీ.. -
పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి...
చిన్నపిల్లల్లో అంటే ఐదేళ్లు మొదలుకొని... ఎనిమిది, తొమ్మిదేళ్ల పిల్లల్లో జుట్టు రాలిపోవడం కాస్తంత తక్కువే అయినా మరీ అంత అరుదేమీ కాదు. నిజానికి ఆ వయసులో క్రమంగా జుట్టు దట్టమమవుతూ ఉంటుంది. అలాంటి వయసులోనూ పిల్లల్లో జుట్టు రాలుతుండటానికి కారణాలు, వాటి నివారణ మార్గాలు తెలిపే కథనమిది. జుట్టు రాలడం అనే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘టీలోజెన్ ఎఫ్లువియమ్’ అంటారు. పిల్లల్లో ఇలా జుట్టు రాలడం అనేది నిర్దిష్టంగా ఒక భాగంలో (లోకల్‌గా) జరగవచ్చు దీన్ని ‘అలోపేషియా ఏరేటా’ అంటారు. నిజానికి వెంట్రుకలు పాటించే సైకిల్ కారణంగా జుట్టులో కాస్త భాగం నిద్రాణంలోకి వెళ్లడం, మరికొంత రాలిపోవడం రోజూ సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇలా పిల్లల్లో రోజూ 30 నుంచి 40 వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటే... దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంతకు మించి అంటే 80 – 100 వరకు వెంట్రుకలు రాలుతుంటే మాత్రం దాన్ని కాస్త సీరియస్‌గా జుట్టురాలడం (సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్)లాగే పరిగణించాలి. సాధారణ కారణాలు : ►అన్నిటికంటే పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టిక ఆహార (ప్రోటిన్ మాల్న్యూట్రిషన్, ఐరన్, జింక్‌తో పాటు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) లోపాల వల్ల కావచ్చు. ఇదే కారణమైతే పిల్లలకు ఐరన్, జింక్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారంతో పరిస్థితి చక్కబడుతుంది. ►అలా కాకుండా కొన్ని మెకానికల్ సమస్యల (అంటే... జడలు బిగుతుగా వేయడం, బిగుతైన క్లిప్పులు పెట్టడం)వంటి కారణాలతోనూ జుట్టు రాలవచ్చు. ఆ వయసు పిల్లల్లో మరీ బిగుతుగా కాకుండా కాస్త తేలిగ్గా ఉండేలా జడలల్లడం వల్ల ఈ సమస్యని చాలా తేలిగ్గా నివారించవచ్చు. ►కొంతమంది పిల్లల్లో జ్వరాలు (డెంగీ, మలేరియా, కోవిడ్ వంటివి) వచ్చి తగ్గాక కూడా మూడు నుంచి నాలుగు నెలల తర్వాత జుట్టు రాలడం కూడా జరగవచ్చు. దీన్ని పోస్ట్ వైరల్ ఫీవర్ ఎఫెక్ట్‌గా పరిగణించాలి. కొన్ని నిర్దిష్ట కారణాలు ►పైన పేర్కొన్న సాధారణ కారణాలు మినహాయిస్తే... చిన్న వయసు పిల్లల్లో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు పుట్టుకతోనే వచ్చే కారణాలు (కంజెనిటల్ కాజెస్), ఇన్ఫెక్షన్లు (అంటే... కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పయోడెర్మా లాంటివి), తలలో పేలు పడటం, ఇతర అనారోగ్యల కారణంగా మందులు వాడుతున్నప్పుడు అవి వారికి సరిపడక కూడా జుట్టు రాలిపోవచ్చు. ►ఇక మరికొందరు పిల్లల్లో హార్మోన్ల అసమతౌల్యత (హైపోథైరాయిడ్, పారాథైరాయిడ్, చైల్డ్ డయాబెటిస్) లాంటి సమస్య వల్ల కూడా జుట్టు రాలవచ్చు. వీటిని పక్కన పెడితే పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. ఇలా పిల్లల్లో మానసిక ఒత్తిడి వల్ల కూడా జట్టు రాలిపోవచ్చు. ఏం చేయాలి? ►మంచి పౌష్టికాహారం ఇవ్వడం, పిల్లలు బాగా ఆడుకునేలా చూస్తూ... మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండేలా చేయడం వంటి సాధారణ చర్యలతోనూ సమస్య చక్కబడకపోతే, అప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. -డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. -
చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా..
చర్మ, కేశ సంరక్షణకు ఉపయోగపడే సులువైన చిట్కాలు.. ఓ లుక్కేయండి మరి! ►చర్మం చిట్లి బిరుసెక్కినట్లుగా ఉంటే శరీరానికి పెరుగు రాసి, అరగంట ఆగి స్నానం చేయండి. ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ►చర్మం మీది ముడతలు పోవాలంటే కొద్ది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం చేమంతి పూలతో సున్నితంగా మర్దన చేయాలి. నిగనిగలాడే జుట్టు కోసం ►జుట్టు నిగనిగలాడుతూ మెరవాలంటే కోడిగుడ్డు సొనను, అరటి పండును బాగా కలిపి, ఆ పేస్టును తలకు పట్టించి పావుగంట తర్వాత మైల్ట్ షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ►జుట్టు బిరుసుగా ఉండి వెనకకు దువ్వడానికి వీలులేకుండా ఉంటే నీళ్ళలో కొంచం నిమ్మరసం కలిపి తలకి రాసి దువ్వండి. ►ఒక భాగం ఆపిల్ జ్యూస్, మూడు భాగాల నీరు కలిపి తలకి రాసి ఆరిన తరువాత తల స్నానం చేస్తే ఎరుపు రంగులోని జుట్టు నల్లగా మారడమే కాకుండా వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. గులాబీ రంగు పెదాల కోసం ►పెదవులు తరచు ఎండిపోవడం లేదా పగలడం జరుగుతుంటే పాలమీగడను, కుంకుమ పువ్వును బాగా కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు పెదవులకు పూయాలి. ఈ విధంగా వారం పదిరోజులు చేస్తే మీ పెదవులు గులాబీ రంగులోకి మారి అందంగా ఉంటాయి. ►తేనె, నిమ్మరసం, గ్లిసరిన్‌లో కలిపి రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసి మర్దన చేస్తే పెదాల నల్లదనం పోతుంది. గులాబీ రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి. ►పెదాలపైన మచ్చలు పోవాలంటే గ్లిసరిన్ లో కొంచం రోజ్ వాటర్ కలిపి దానిని పెదాలకు మర్దన చేయాలి. పిల్లలకు ►పిల్లలకి స్నానం చేయించడానికి సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడితే చర్మవ్యాధులు రాకుండా వుండడమే కాకుండా, శరీరంమీద వుండే నూగులాంటి వెంట్రుకలు కూడా పోతాయి. ►ఎండబెట్టిన పుదీనా ఆకుల్ని పొడిచేసి, తగినంత నీరు కలిపి బాగా కాచి, చల్లార్చిన కషాయాన్ని ప్రతిరోజూ పుక్కిలి బడితే నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం కారటాన్ని నివారించవచ్చు. చదవండి: Constipation: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే.. Health Tips In Telugu: పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? -
జుట్టుకు జింజర్ ఆయిల్.. షాంపూతో అల్లం రసం కలపొచ్చా?
అల్లంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జుట్టుకు అల్లం రసాన్ని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా తలలో దురద, తీవ్రమైన చుండ్రు సమస్యలకు చికిత్స చేయడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అల్లం జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది. తద్వారా వెంట్రుకల కుదుళ్లు ఉత్తేజితమై జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అల్లంలో జింజరోల్, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల జుట్టు రాలడాన్ని నివారించడంతోబాటు జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే జింజర్ ఆయిల్‌ను వాడవచ్చు. మీ షాంపూతో అల్లం రసం కలపవచ్చు. లేదా అల్లం ఆధారిత షాంపూని ఉపయోగించవచ్చు. నూనెతో పాటు అల్లం రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీ హెయిర్ మాస్క్‌లకు అల్లం కూడా జోడించవచ్చు. (క్లిక్ చేయండి: డిజిటల్ అడిక్షన్‌ను గుర్తించడమెలా?) -
జుట్టు నిగనిగల కోసం... ఆవనూనె, మెంతి పొడి, ఉసిరి పొడి.. ఇంకా
Hair Care Tips: నల్లని నిగనిగలాడే ఒత్తైన కురులు కావాలని కోరుకోని అమ్మాయి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లు ఈ చిన్న చిట్కాతో నల్లటి జుట్టు సొంతం చేసుకోవచ్చు. ఆవనూనె, మెంతి పొడి.. ఇంకా ►ఇనుప మూకుడు తీసుకుని దానిలో టీకప్పు ఆవనూనె, మరోకప్పు కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదా మెంతులు, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, అరకప్పు ►గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు సన్నని మంట మీద ఈ మూకుడు పెట్టి పదినిమిషాల పాటు మరగనివ్వాలి. ఆయిల్ రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి దించి పక్కనపెట్టుకోవాలి. ►చల్లారిన తర్వాత దీనిని ఒక శుభ్రమైన పొడి సీసాలో పోసుకుని ఒక పూటంతా పక్కన పెట్టాలి. ►దీనిని రోజూ తలకు రాసుకోవాలి. ►ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. ►రోజూ వాడటం ఇష్టం లేనివాళ్లు వారానికి ఒకటి రెండుసార్లు తలకు పట్టించి రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ►ఈ ఆయిల్‌ను వాడటం వల్ల నల్లని ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి. చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! -
Hair Care: జుట్టు రాలుతోందా? ఈ లేజర్ హెల్మెట్ వాడితే..
సాధారణ హెల్మెట్.. ప్రయాణాల్లో ప్రాణాలను కాపాడితే.. ఈ లేజర్ హెల్మెట్.. రాలిపోతున్న జుట్టును సంరక్షిస్తుంది. రాలిపోయిన జుట్టును తిరిగి రప్పిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హెయిర్ గ్రోత్ ఆగిపోయిందని.. కారణం లేకుండానే హెయిల్ లాస్ అవుతోందని వాపోయేవారికి ఈ డివైజ్ ఓ వరం. ప్రసవానంతర సమస్యలతోనో.. వాతావరణ మార్పులతోనో.. ఆహారపు అలవాట్లతోనో.. కారణం ఏదైనా జుట్టు రాలిపోవడం, తిరిగి పెరగకపోవడం.. చాలామందికి ఉండే ప్రధాన సమస్యే. ఆయిల్స్, షాంపూలు, కండిషనర్స్ మారుస్తూ తాపత్రయపడేవారికి ఈ మెషిన్ చక్కటి పరిష్కారం. ఈ డివైజ్‌ని ఆన్ చేసుకుని.. తలకు హెల్మెట్‌లా తగిలించుకుంటే చాలు. ఫలితం చాలా త్వరగా అందుతుంది. జుట్టు పెరుగుదల కోసం ప్రతిరోజూ 25 నిమిషాల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆన్ – ఆఫ్, అడ్జస్ట్మెంట్ల కోసం ప్రత్యేకమైన రిమోట్.. హెల్మెట్‌తో పాటు లభిస్తుంది. ట్రీట్మెంట్ సెషన్లను ట్రాక్ చేయడానికి రిమోట్లో ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దాంతో ప్రత్యేకంగా గడియారం ముందు కూర్చోవాల్సిన పనిలేదు. ఈ మెషిన్ సమర్థవంతమైనది.. సురక్షితమైనది కూడా. అంతేకాదు తేలికగా.. సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఇది ప్రతి సెషన్లో ఒక డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అంతర్నిర్మాణ సెన్సర్‌ను కలిగి ఉంటుంది. దాంతో ఉష్ణోగ్రత స్థాయిని పెరగనివ్వకుండా నియంత్రిస్తుంది. ఈ మోడల్ హెల్మెట్స్ ధర సుమారుగా పదిహేను వందల రూపాయల నుంచి అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి డివైజ్‌లను క్వాలిటీతో పాటు వినియోగదారుల రివ్యూల ఆధారంగానే కొనుగోలు చేయాలి. చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా? -
Hair Care: ఉంగరాల జుట్టుతో ‘చిక్కులు’! సోంపు ఆకులను ఇలా వాడితే..
Hair Care Tips In Telugu: ఉంగరాల జుట్టు ఉండటం అందానికి చిహ్నంగా చెప్తారు. కొంతమంది స్టైల్ కోసం కూడా జుట్టును ఉంగరాలుగా మలుచుకుంటారు. అయితే ఉంగరాల జుట్టు వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య జుట్టు చిక్కులు పడటం. ఈ జుట్టు కుదుళ్ల దగ్గర జిడ్డుగా ఉండి చివర్లు పొడిబారినట్లుగా ఉంటాయి. ఉంగరాల జుట్టు కలవారు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే జుట్టుకి పోషణను అందించే షాంపూలు, బాదం, అవకాడో గుణాలు కలిగిన షాంపూలు, సల్ఫేట్ రహిత షాంపూలు వాడటం ఉత్తమం. కొంచెం రింగులు తక్కువ ఉండి, అలలలాగా జుట్టు ఉండేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే వీరు సల్ఫేట్ రహిత షాంపూ లేదా నురగతో శుభ్రపరుచుకోవడం చేసుకుంటే ప్రయోజనాలుంటాయి. ఒత్తైన కేశాల కోసం సోంపు ఆకులు ►సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మృదుత్వం సంతరించుకుంటాయి. ►రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంపు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి. ►నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది. ►ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి. చదవండి: Hair Care Tips: జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండాలంటే.. ఇంట్లోనే ఇలా షాంపూ తయారు చేసుకోండి! Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే!