ప్రతీకాత్మక చిత్రం
తలలో చుండ్రు సమస్య ఈ కాలం అధికంగా విసిగిస్తుంటుంది. దీనికి కారణం మాడు పై భాగం పొ డిబారడం వల్ల తెల్లటి పొ ట్టులాంటి మృతకణాలు బయటకు కనిపిస్తుంటాయి. దీనివల్ల దురద కూడా ఉంటుంది. ఈ సమస్య నివారణకు..
♦ ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపా లి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి.
♦ కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది.
♦ చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట సేపు ఆలాగే ఉంచి, ఆ తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.
♦ కప్పు నీళ్లలో 2–3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపా లి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.
♦వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపా ళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.
♦ బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్‌ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి.
చదవండి: ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడేమో ఇలా.. చెబితే నమ్మరు గానీ..
Comments
Please login to add a commentAdd a comment