Dandruff problem
-
సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..
ప్రతీరోజూ బిజీ బిజీగా గడుపుతున్న జీవితంలో మనం మన ఆరోగ్యాన్ని పట్టించుకోము. అందులో మన ముఖము, జుట్టుల గురించి అయితే అసలు ధ్యాసే ఉండదు. పలువురితో సాగుతున్న క్రమంలో వీటివలన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం. ఇతరులతో హేళనలను భరిస్తూ ఉంటాం. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఈ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసమే..! పిగ్నెంటేషన్... కీరాతో కట్అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి. బార్లీతో మేని మిలమిల ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మిరియాలతో చుండ్రుకు చెక్! మిరియాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి వీటితోపాటు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో టేబుల్ స్పూన్ ఆవనూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. ఈ టానిక్‌ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్‌షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి చదవండి: మార్చి వచ్చింది.. బోండాం కొట్టు... -
చిన్నపిల్లల్లో చుండ్రు సమస్య.. ఎలా వదిలించాలి?
చిన్నపిల్లల్లో చుండ్రు రావడం కాస్త తక్కువే అయినా చలికాలంలో అప్పుడప్పుడు కనిపిస్తుండటం మామూలే. దీని నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలివి... ►పిల్లలకు వారానికి 3–4సార్లు తలస్నానం చేయించాలి. తలకు తేమనిచ్చే ఆయిల్స్, లోషన్స్ వంటివి అప్లై చేస్తుండాలి. ఒకసారి జుట్టు రాలడం తగ్గిన తర్వాత హెయిర్ ఆయిల్స్, లోషన్స్ వాడుతూ మాటిమాటికీ మాడు పొడిబారకుండా చూసుకోవాలి. ►అన్ని విటమిన్లతో పాటు ప్రత్యేకంగా విటమిన్ బీ కాంప్లెక్స్ లభ్యమయ్యే ఆహారాలు తీసుకోవాలి. అందులో జింక్ మోతాదులు ఎక్కువ ఉండటం మరింత మేలు చేస్తుంది. ► ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని కెటకెనజోల్, సాల్సిలిక్ యాసిడ్, జింక్ ఉన్న షాంపూలను వారానికి 2–3 సార్లు... అలా 4–6 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. ► అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులతో పాటు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సీబమ్ సెక్రిషన్స్ తగ్గించే మందుల్ని కూడా వాడాల్సి రావచ్చు. -
చుండ్రు సమస్య వేధిస్తుందా? అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు
చలికాలంలో బాధించే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, వయసుతో సంబంధం లేకుండా చాలామందిని చుండ్రు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అసలు చుండ్రు ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి? అన్న విషయాలు తెలుసుకుందాం. చుండ్రు ఎందుకు వస్తుంది? చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది. దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు. ఆహారంలో గణనీయమైన మార్పులు, తరచూ ప్రయాణాలు చేయడం, వాతావరణ మార్పు, నీళ్లు మారడం లాంటివి చుండ్రుకు కారణాలు. ఏం చేయాలి? ► ఆపిల్ సీడర్ వెనిగర్‌తో చుండ్రును అరికట్టవచ్చు. ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ►బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ►కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. ►రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి, ఉదయం దానిని పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ► వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ►చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.. -
అలోవెరా జెల్‌తో ఇలా చేస్తే..అందమైన కురులు మీ సొంతం!
వర్షాకాలంలో జుట్టు డల్‌గా ఉంటుంది. దీనికి తోడు వర్షంలో అప్పడప్పుడూ తడవడంతో చుండ్రు, చిట్లడం, రఫ్‌గా తయారవ్వడం వంటి సమస్యలు ఎదరువ్వతాయి. ఈ సమస్యల నుంచి మీ శిరోజాలను కాపాడుకోవాలంటే ఈ జ్రాగత్తలు తీసుకోవాల్సిందే. మనం నిత్యం చూసే, అందుబాటులో ఉండే వాటితో ఈజీ జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. వర్షాకాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే.. ►తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు గోరువెచ్చని నూనె వెంట్రుకు కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు మృదుత్వాన్ని కోల్పోవు. ►తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్ రాసుకొని, పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా జెల్లో ఉండే ఔషధ గుణాలు చుండ్రును, వెంట్రుకలు చిట్లడాన్ని నివారిస్తాయి. దీంతో పాటు శిరోజాలలో ఉండే బాక్టీరియా, మాడుపై దురద.. వంటి సమస్యలను నివారిస్తాయి. వెంట్రుకలు పెరగడానికి కూడా దోహదం చేస్తాయి. ►తలస్నానానికి రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూలనే వాడాలి. ►తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సోయాబీన్, గుడ్లు, కొవ్వు తక్కువగా ఉండే ఛీజ్, బీన్స్.. వంటివి ఉండేలా జాగ్రత్తపడాలి. ►తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన సలాడ్స్ ఈ కాలం తీసుకోవడం చాలా అవసరం. అలాగే మొలకెత్తిన గింజలను సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఆహారంలో ఈ తరహా పదార్థాలు చేర్చడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అంది జుట్టు రాలడం తగ్గుతుంది. ►కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ వెంట్రుకలు రాలడానికి దోహదం చేస్తుంది. కాఫీ, టీలకు బదులుగా పండ్లరసాలు, పాలు, హెర్బల్ టీ... వంటి కెఫెన్ లేని ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యల నుంచి సులభంగా బయటపడోచ్చు. చిట్కాల తోపాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. (చదవండి: వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!) -
చుండ్రు నిమిషాల్లో మాయం
-
ఎండలు బాబోయ్ ఎండలు... చుండ్రు తగ్గేదెలా..?
వేసవిలో తలకి ఎక్కువ చెమట పట్టడం, దానికితోడు వాతావరణ కాలుష్యం వల్ల తల తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ►వేసవిలో చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. తలలో అమితంగా పొట్టు చేరడం, తలంతా దురద.. ఈ సమస్యలు ఎండాకాలంలో కాస్త ఎక్కువుంటాయి. అలాంటపుడు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవేమిటో చూద్దాం... ►వేప నూనె లేదా వేప ఆకులను గుజ్జుగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్యే కాదు, దురద కూడా తగ్గుతుంది. ►నాలుగు స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనెలో అరచెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి గంట తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ►పెరుగు కూడా బాగానే పని చేస్తుంది. కప్పు పెరుగును తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు. ►కలబంద గుజ్జును తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ ను కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►పావు కప్పు యాపిల్ సిడార్ వెనిగర్‌ను పావు కప్పు నీళ్లలో కల΄ాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు తడిగా ఉన్నపుడు మాడుకు పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు. చుండ్రు ఎందుకు వస్తుంది? ►చుండ్రుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, నిద్రలేమి. అయితే ఎండాకాలంలో చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ►షాంపూను ఎక్కువగా వాడటం వల్ల మాడు పొడుబారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్య వస్తుంది. ►కొందరికి జడను గట్టిగా బిగించి కట్టుకోవడం అలవాటు. అయితే అలా జుట్టును బిగుతుగా అల్లుకోవడం వల్ల గాలి తగలక సమస్య తీవ్రమవుతుంది. ►ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. అందువల్ల తల మీద ఎండపడకుండా తలను కవర్ చేసేందుకు ఏమైనా వాడాలి. ►చెమట వల్ల చికాకుగా ఉండి ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటాం. దీనివల్ల కూడా చర్మం పొడిబారి చుండ్రు సమస్య వస్తుంది. ఇవి పాటించాలి ►వారానికి మూడుసార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడునుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువవుతుంది. ►తరచూ తల ముట్టుకోకూడదు. అంటే తలలో చేతులు పెట్టి గోక్కోకూడదు. చుండ్రు వల్ల దురద వస్తుంది. దాంతో తరచూ తలలో చేయి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. సమస్య ఇంకాస్త పెరుగుతుంది. ►ఎండాకాలంలో హెయిర్ స్టైలింగ్ కోసమని క్రీములు, స్ప్రేలు ఎక్కువగా వాడితే అవి మాడును పొడిబారేలా చేసి చుండ్రును పెంచుతాయి. ►వారానికి ఒకసారైనా ఏదైనా ఆయిల్‌తో కుదుళ్లకు బాగా మర్దనా చేసుకోవాలి. దీనివల్ల మంచి రక్త సరఫరా జరుగుతుంది. మాడులో ఉండే చర్మ కణాల పనితీరు మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది. -
Hair Care: చుండ్రు నివారణకు ఈ చిట్కాలు పాటిస్తే..
తలలో చుండ్రు సమస్య ఈ కాలం అధికంగా విసిగిస్తుంటుంది. దీనికి కారణం మాడు పై భాగం పొ డిబారడం వల్ల తెల్లటి పొ ట్టులాంటి మృతకణాలు బయటకు కనిపిస్తుంటాయి. దీనివల్ల దురద కూడా ఉంటుంది. ఈ సమస్య నివారణకు.. ♦ ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపా లి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ♦ కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది. ♦ చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట సేపు ఆలాగే ఉంచి, ఆ తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది. ♦ కప్పు నీళ్లలో 2–3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపా లి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ♦వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపా ళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ♦ బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. చదవండి: ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడేమో ఇలా.. చెబితే నమ్మరు గానీ.. -
Beauty Tips: యాపిల్ సైడర్ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం!
యాపిల్ సైడర్ వెనిగర్ బరువుని నియంత్రణలో ఉంచడంతోపాటు చర్మం, జుట్టుని కూడా చక్కగా సంరక్షిస్తుంది. యాపిల్ సైడర్‌వెనిగర్‌ను ముఖానికి రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. ►వెనిగర్‌లో మూడొంతుల నీళ్లు కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరుపులీనుతూ కనిపిస్తుంది. ►యవ్వనంలో ఉన్న చాలామందికి మొటిమలు, నల్లమచ్చలు వేధిస్తుంటాయి. ►మొటిమలు మచ్చలపైన వెనిగర్ రాస్తే మచ్చలు ఇట్టే పోతాయి. ►వెనిగర్‌లోని పీహెచ్ స్థాయులు తక్కువగా ఉండడం చర్మానికి హాని లేకుండా సంరక్షిస్తుంది. కేశ పోషణ సైతం.. ►ముఖ చర్మానికి మాయిశ్చర్ అందించడంలో టోనర్లు చక్కగా పనిచేస్తాయి. ►మార్కెట్లో దొరికే వివిధ రకాల టోనర్ల కంటే యాపిల్ సైడర్ వెనిగర్ మంచి టోనర్‌గా బాగా పనిచేస్తుంది. ►సైడర్లో కొన్ని నీళ్లు కలిపి టోనర్‌లా వాడుకోవచ్చు. ►కాలుష్యం, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల.. చర్మం పొడిబారి చుండ్రు వచ్చేస్తుంది. ►అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చుండ్రు మాత్రం వదలదు. ►యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల చుండ్రుని నియంత్రణలో ఉంచుతాయి. ►వెనిగర్‌లో నీళ్లు కలిపి కుదుళ్ల నుంచి జుట్టువరకు పట్టిస్తే జుట్టుకు పోషణ అంది వెంట్రుకలు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి. చదవండి: Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
చుండ్రు సమస్యకు 2 చిట్కాలు! సింపుల్‌గా వదిలించేద్దాం
► అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం నీళ్లు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ► దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. ► అరకప్పు నానిన మెంతులను పేస్టులా రుబ్బుకోవాలి. ► దానికి, పావు కప్పు అలోవెరా పేస్టు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. చదవండి👉🏻 పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి.. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి . ► ఈ రెండు ప్యాక్‌లలో ఏదైనా ఒకదానిని వారానికి రెండుసార్లు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. దురద కూడా తగ్గుతుంది. చదవండి👉🏼 పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్! -
చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?
చలికాలంలో గాలిలోని తేమ తక్కువ. ఈ కారణంగా మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. మరీ ఎక్కువ ఇబ్బందిపెట్టే సమస్య జుట్టు రాలడం సమస్య . విపరీతైమన చుండ్రుతో జుట్టు రాలిపోతుంది. హెయిర్ అంతా పొడబారి నిర్జీవంగా కాంతి విహీనంగా మారిపోతుంది. సో... ఈ వింటర్లో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది తెలుసా? మరి జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి? వింటర్లో అందరినీ వేధించే సమస్య హెయిర్‌లాస్, విపరీతమైన చుండ్రు. దీంతోపాటు జుట్టుచిట్టిపోవడం, పొడిగా ఉండటం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కనుక చలికాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసిందే. చర్మంగానీ, జుట్టుకానీ డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కానీ చలికాలంలో చాలా తక్కువ నీటిని తాగుతాం ఈ కారణంగా సమస్యలు మరింత విజృంభిస్తాయి. తల పొడిబారిపోతుంది. తేమలేక జుట్టు రాలి పోతుంటుంది. చుండ్రు చేరుతుంది. ఆ ఇరిటేషన్, దురద బాగా వేధిస్తుంది. మరి చుండ్రును ఎదుర్కోవాలంటే జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే పోషకాహారంతో పాటు, తాజా కూరలు, పండ్లు, తీసుకోవాలి. వీటన్నింటికంటే చాలా ప్రధానమైనవి విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఇ అండ్ విటమిన్ సి. అంతేకాదు తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా తగినంత న్యూటియంట్స్ శరీరానికి అందవు. ఫలితంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. దీంతో సహజమైన, మెరుపును కోల్పోవడంతో పాటు జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా జంక్ ఫుడ్‌కి నో చెప్పాలి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ డీ, నూట్రిషనల్ ఈస్ట్, బ్రస్సెల్ మొలకలు, బయోటిన్, అవకాడో, సీఫుడ్ ద్వారా లభించే సిలీనియం, జింక్, ఐరన్, మాంగనీస్ ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా అవసరం. విటమిటన్ డీ ఎంత పుష్కలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు. విటమిన్ డీ ని డైరెక్టు సన్ ద్వారా గానీ, సప్లిమెంట్ రూపంలో గానీ, ఆహార పదార్థాల ద్వారా గానీ తీసుకోవాలి. మరోవైపు జుట్టు, చర్మం కాంతివంతంగా ఉండటంలో విటమిన్ డి- బయోటిన్ ది కీలకమైన పాత్ర. కార్బోహైడ్రేట్, లిపిడ్ జీవక్రియలో ప్రత్యేక పాత్ర విటమిన్ హెచ్ లేదా బయోటిన్ది అని చెప్పొచ్చు. బయోటిన్ లోపిస్తే జుట్టు, గోర్లు, చర్మం కాంతి విహీనంగా మారిపోతాయి. జుట్టు పెళుసుగా మారుతుంది, గోర్లు ఎక్స్ఫోలియేట్ అవుతాయి. చలికి తట్టుకోలేక వేడి వేడి నీళ్లతో తల స్నానం చేస్తుంటాం. నిజానికి ఇది చాలా పెద్దపొరపాటు. వేడి నీటితో జుట్టు మరింత డ్రై అవుతుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు హడావిడిగా దువ్వుకూడదు. తడిగా ఉన్నజుట్టు బలహీనంగా ఉండి, సులువుగా ఊడిపోతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్లు హెయిర్ డ్రయ్యర్ అస్సలు వాడకూడదు. పల్చటి, మెత్తటి కాటన్ క్లాత్‌తో జుట్టును ఆర బెట్టుకోవడం మంచిది. దీంతోపాటు ఇంట్లోనే తయారుచేసిన హెయిర్ మాస్క్, ఆయిల్ మసాజ్, రైస్ వాటర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. తల స్నానానికిముందు శుద్ధమైన కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే కుదుళ్లు గట్టిపడతాయి. ఇంకా ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ మిశ్రమం, అలోవేరా, ఉల్లిపాయ రసం, కరివేపాకులు వేసి మరగించిన నూనె, బియ్యం గంజి, మందార ఆకుల మిశ్రమాన్ని స్కాల్ఫ్‌కి పట్టేలా మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే ఈజీగా దొరికే రైస్ వాటర్‌లో అమినో యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి చిట్కాలు జుట్టుకు మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ఎక్కువ స్ట్రాంగ్ ఉండే షాంపూలకు దూరంగా ఉండండి. ఆర్గానిక్, లేదా హెర్బల్ షాంపూలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. -
ఇలా చేస్తే .. ఎప్పటినుంచో వెంటాడుతున్న చుండ్రు సమస్య పరార్!!
How To Cure Dandruff Tips In Telugu: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ప్రాంతాలలో చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యలలో చుండ్రు ఒకటి. చుండ్రు ఒకప్పుడు చలికాలం మాత్రమే వచ్చే సమస్య. ఇప్పుడు కాలాలు, వాతావరణాలతో, వయసుతో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. ఇదేమీ పెద్ద అనారోగ్య సమస్య కాదు... ప్రాణాంతక వ్యాధి అసలే కాదు, కాని చాలా చిరాకు కలిగించే సమస్య. కొందరిలో ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది! దేనికైనా అది రావడానికి కారణాలు తెలిస్తే నివారించడం సులభం... చుండ్రు ఎందుకు వస్తుంది? దానిని ఎలా నివారించవచ్చనే దానిపై అవగాహన కోసం... చుండ్రు అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది. దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు. ఆహారంలో గణనీయమైన మార్పులు, తరచు ప్రయాణాలు చేయడం, నీటి మార్పు, వాతావరణ మార్పు వంటివి ఇప్పుడు ఇంచుమించు అందరి జీవితంలో తప్పనిసరి అయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో జుట్టుని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవటానికి ఖచ్చితంగా కొంత టైం కేటాయించాలి. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! నివారణ చర్యలు ►ఇతరుల దువ్వెనలను, హెయిర్ బ్రష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. వారానికి ఒకసారి స్వచ్ఛమైన కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలు లేదా శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి. ►తలస్నానం చేసే నీళ్ళు పొగలు కక్కేంత వేడిగా లేదా వణుకు పుట్టించేంత చల్లగా ఉండకూడదు. గోరువెచ్చని నీరు చాలా మంచిది. ప్రకటనలలో చూపించారు కదా అని గాఢమైన రసాయనాలు కలిసిన హెయిర్ ఆయిల్స్‌ను, షాంపూలను ఇష్టం వచ్చినట్లు వాడటం కూడా తలపై ఈస్ట్ పెరిగేందుకు అవకాశం కలిగిస్తుంది. ►మాసిపోయిన దుప్పట్లను, తలగడలను వాడటం, దుమ్ము, ధూళి పడే ప్రదేశంలో పని చేయడం, పోషకాహారం తీసుకోకపోవడం, మానసిక ఆందోళన, కొన్ని రకాల మందులను వాడటం చుండ్రుకు దారి తీసే కారణాలలో ప్రధానమైనవి. ►చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి. పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు. చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. మందార ఆకులు : జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతి: మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి. వేపాకు: తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది. కాసిని గసగసాలు తీసుకొని, సన్నని మంట పై వేయించి, గోరువెచ్చటి నీటిలో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని, తలకు పట్టించి, గంట ఆగి తల స్నానం చేయాలి. నాణ్యమైన వెనిగర్ బాటిల్ తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్ చొప్పున కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే చుండ్రు సమస్య నుంచి తొందరలోనే బయట పడవచ్చు. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! ఈ చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి.. ►చుండ్రుతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరి పొడిని కలిపి తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ►రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి, ఉదయం దానిని పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ►అలోవెరా జెల్‌ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగి తల శుభ్రంగా ఉంటుంది. ►తీక్షణమైన ఎండ వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం లేదా బట్టను కట్టుకోవడం మంచిది. ►పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. ►నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి. తల దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది. ►వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. ►వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల తల తొందరగా మాసిపోతుంది కాబట్టి వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది. చదవండి: మళ్లీ వచ్చేశాయ్.. ఏ చీరకాకాసు.. తళతళల కాసులు!! -
మీకో విషయం తెలుసా? రోజూ ఈ సంఖ్యలో వెంట్రుకలు రాలడం సహజమేనట!
పొడవైన, ఒత్తైన జుట్టు ప్రతి అమ్మాయికి ఉండే కల. జుట్టు వత్తుగా ఏవిధంగా పెరుగుతుంది? చుండ్రు సమస్యను అరికట్టడం ఎలా? జుట్టు రాలిపోకుండా ఎట్లా కాపాడుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకనివారుండరు. అయితే జుట్టు ఆరోగ్యం, పెరుగుదల విధానం మన జెనెటిక్స్ నిర్మాణాన్నిబట్టి ఉంటుందని, తలపై దాదాపుగా లక్ష రంధ్రాలుంటాయని, వాటి నుంచే వెంట్రుకలు పెరుగుతాయని, రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమేనని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వెల్లడించింది. వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగితే జట్టురాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరుగుతుందని ఆ అకాడెమీ తెలిపింది. కాగా కొన్ని ఆహారపు అలవాట్లతో జుట్టును ఆరోగ్యంగా పాకాడుకోవడం వల్ల కూడా సహజపద్ధతుల్లో వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం జుట్టు పెరుగుదలకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎంతో ఉపకరిస్తుంది. 95శాతం కెరటీన్ ప్రొటీన్, 18 శాతం అమైనో యాసిడ్లు వెంట్రుకల పెరుగుదలకు అవసరమవుతాయి. అయితే మన ఆహారపు అలవాట్లలో కార్బొహైడ్రేట్లు ఉండేవే ఎక్కువ. కానీ ప్రొటీన్ల గురించి అంతగా పట్టించుకోం. ఫలితంగా జుట్టు బలహీనపడి ఊడిపోయే అవకాశం ఉంటుంది. గుడ్డు, పాలు, పన్నీర్, పెరుగు, వెన్న, చికెన్, తృణధాన్యాలు.. వంటి ఇతర పధార్థాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ‘బి’ విటమన్ ఉండే ఆహారం జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ‘బి’ విటమన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, వాల్నట్స్ వంటి కాయధాన్యాలు, క్యాలీఫ్లవర్, క్యారెట్లను మీ రోజువారి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: అతిపిన్న వయసులోనే పైలట్ అయిన పేదింటి బిడ్డ!! ఐరన్ అధికంగా ఉండే ఆహారం ఐరన్ లోపం వల్ల వెంట్రుకల కుదుళ్లలోని కణాలకు ఆక్సిజన్ తగు మోతాదులో అందదు. ఐరన్‌తోపాటు ఫెర్రిటిన్ కూడా జుట్టు రాలడాన్ని అరికట్టి, పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మాంసం, గుడ్డు, ఆకు పచ్చ కూరగాయలు, జామ వంటి ఫలాల్లో ఫెర్రిటిన్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. బి12, బి6, ఫోలెట్స్ విటమిన్లు రక్తహీనతను నిర్మూలించడంలో విటమిన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. రాజ్మా, బీన్స్, పాలల్లో ‘బి’ విటమిన్ నిండుగా ఉంటుంది. ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలు, అవిసెగింజల్లో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తల మీద చర్మం పొడిగా ఉంటే జుట్టు బలహీనపడి రాలిపోతుంది. ఈ ఒమేగా - 3 నూనెలు పొడి చర్మాన్ని అరికట్టి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. విటమిన్ ‘సి’ విటమిన్ ‘సి’చర్మ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకం. తలపై వెండ్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి మాత్రమే కాకుండా, రక్తహీనతకు, ఐరన్ పెరుగుదలకు తోడ్పడుతుంది. సిట్రస్ ఫలాలు, క్యాప్సికం, నిమ్మ రసం.. ఇతర పధార్ధలను మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే సరిపోతుంది. జింక్ ఉండే ఆహారం మన శరీరానికి జింక్ అతి తక్కువ మోతాదులో అవసరమైన ఖనిజమైనప్పటికీ, అది నిర్వహించే పాత్ర చాలా కీలకమైనది. శిరోజాల విషయంలో కుదుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన శరీరంలో ప్రొటీన్ల నిల్వకు ఉపకరిస్తుంది. తృణ ధాన్యాలు, చిక్కుల్లు, వేరుశనగ, పొద్దు తిరుగుడు విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఈ సూచలను పాటించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చనేది నిపుణుల మాట. చదవండి: Eye Health: స్మోకింగ్ చేసేవారికి పొంచి ఉన్న ప్రమాదం.. ఈ సమస్యలు మూడు రెట్లు ఎక్కువే.. -
చుండ్రు వల్ల ఇబ్బందా.. ‘వేప’తో ఇలా చెక్ పెట్టొచ్చు!
Home Remedies For Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? వేపతో చుండ్రు సమస్యను అరికట్టవచ్చని మీకు తెలుసా!! నిజానికి చుండ్రు నివారణకు వేపకంటే కంటే శ్రేష్ఠమైన, సౌకర్యవంతమైన రెమిడీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో! ట్రైకాలజిస్టులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. చుండ్రు నివారించి, అందమైన సిల్కీ హెయిర్ పొందడంలో వేప ఆకుల పాత్ర ఏమిటో, అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.. చుండ్రుతో తంటాలెన్నో.. తలపై చర్మం పొడి (డ్రై స్కిన్)గా ఉండే వారిలో సాధారణంగా కనిపించే సమస్య చుండ్రు. భుజాలపై పొలుసులుగా రాలి చూపరులకే కాకుండా మనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చుండ్రు కేవలం తలపై చర్మాన్ని మాత్రమే కాకుండా, ముఖం, శరీరం అంతటిపై కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చుండ్రుకు కారంణం పొడి చర్మం అని మీరనుకోవచ్చు. కానీ నిజానికి ఇది మలస్సేజియా అనే శిలింధ్రాల జాతికి చెందిన ఫంగస్ కారణంగా చర్మంపై పుడుతుంది. దీని జీవితకాల పరిమితి అతిస్వల్పమైనప్పటికీ వేగంగా పెరగడం, విస్తృతంగా వ్యాపించడం దీని ప్రధాన లక్షణాలు. సాధారణంగా ఈ శిలింధ్రం చలికాలంలో వేగంగా వ్యాపిస్తుంది. అయితే మీరు సరైన సమయంలో, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎన్నిసార్లు తొలగించినా చుండ్రు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి సమస్యను సకాలంలో గుర్తించి సరైన చికిత్స అనుసరించడం ఉత్తమం. సుగుణాల వేప వేప మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే దివ్యౌషధం. ఏ ఋతువులోనైనా అందుబాటులో ఉంటుంది. అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో వేపకు సాటి మరొకటి లేదు. రక్తశుద్ధీకరణతో పాటు యాంటీ మైక్రోబయల్ కారకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఫంగల్ (శిలీంధ్ర సంహారిణి), యాంటీ వైరల్ (వైరస్ నిరోధకత), యాంటీ ఇన్ఫ్లమేటరీ (తాపనివారణ)కు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం వేప ఆకులను తినాలి బ్యూటీ ఎక్స్పర్ట్స్, ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. చుండ్రు నుంచి సులువుగా ఉపశమనం పొందాలంటే రోజూ ఉదయం గుప్పెడు వేప ఆకులు తినాలి. చేదును తప్పించుకోవడానికి కొంచె తేనె జోడించి తింటే సరి. వేపాకులను మరిగించి కషాయం రూపంలో కూడా తాగవచ్చు. దీనివల్ల కలిగే లాభాలను మీరొకసారి గమనించారంటే, ఈ ప్రక్రియ మరీ అంత కష్టమనిపించదు. వేప నూనె వేప నూనెను ఇంటిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసి మరిగించిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మ రసం చేర్చితే వేప నూనె రెడీ! ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం బెటర్. నూనెలోని నిమ్మరసం సూర్యరశ్మి వల్ల జుట్టుకు హాని కలగచేయవచ్చు. ఈ నూనెతో మాడుకు మర్ధనాచేసి, రాత్రంతా ఉంచి ఉదయానే తలస్నానం చేస్తే సరిపోతుంది. వేప - పెరుగు మిశ్రమం పెరుగుకలిపిన వేపాకును తలకు పట్టించటం ద్వారా చుండ్రు సమస్యకు కళ్లెం వేయవచ్చు. ముందుగా వేపాకును పేస్టులా చేసుకుని, ఒక గిన్నె పెరుగులో కలుపుకుని మాడు మొత్తానికి పట్టించి, 15-20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు, పెరుగులోని చల్లదనం చుండ్రును నివారించడమే కాకుండా కుదుళ్లను బలపరచి, మెత్తని సిల్కీ హెయిర్‌ను మీ సొంతం చేస్తుంది. వేప హెయిర్ మాస్క్ డాండ్రఫ్ నివారణ పద్ధతుల్లో వేప హెయిర్ మాస్క్ మరొక సులువైన మార్గం. కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనెను దానికి కలపాలి. దీనిని హెయిర్ మాస్క్‌లా మాడు భాగం మొత్తానికి పట్టించి 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. జుట్టు ఆరిపోయాక ఫలితం మీకే తెలుస్తుంది. హెయిర్ కండీషనర్‌లా వేప వేప ప్రత్యేకత ఏమిటంటే దానిని తలస్నానానికి ముందు లేదా తర్వాత వాడినా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎలాచేయాలంటే.. కొన్ని వేపాకులను తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత చల్లారనివ్వండి. షాంఫుతో తలస్నానం చేశాక, ఈ వేప మిశ్రమంతో తలను కడిగిచూడండి. తేడా మీకే తెలుస్తుంది. వేప షాంపు అన్ని రకాల చుండ్రు సమస్యలకు సులభమైన పరిష్కారం వేపషాంపు. వేపతో తయారు చేసిన షాంపుతో వారానికి రెండూ లేదా మూడు సార్లు తలస్నానం చెస్తే సరిపోతుంది. సాధారణంగా డాండ్రఫ్ నివారణకు వేపతో తయారుచేసిన షాంపులను వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే చుండ్రు నివారణకు అవసరమైన అన్ని సుగుణాలు వీటిల్లో సరిపడినంతగా ఉంటాయి. హెయిర్ ఎక్స్పర్ట్స్ చెప్పేదేమిటంటే.. వేపలోని ఔషధ గుణాలు అన్నిరకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఈ 6 రకాల సింపుల్ రెమెడీస్ తరచుగా వినియోగించడం ద్వారా ఆరోగ్యమైన, అందమైన జుట్టు మీ సొంతమవుతుందనేది నిపుణుల మాట. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
జుట్టు రాలుతుందా? అయితే ఇది ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో జట్టు రాలడం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ జుట్టు తెల్లబడటం, ఎక్కువగా రాలిపోవడం, దురద, చుండ్రు లాంటి అనేక సమస్యలకు పెరుగు చాలా చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వేలకు వేలు పోసి జుట్టుపై కెమికల్స్ ప్రయోగించినా ఎలాంటి ఫలితం ఉండకపోగా దీర్ఘకాలిక సమస్యలు, సైడ్ ఎఫెక్స్ వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పెరుగులోని ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే పెరుగులో ఉండే జింక్, బయోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. (సరస్సులో సినిమా) మన శరీర దృఢత్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అంతే పోషకాలు అవసరం. పెరుగులో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమగా, మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా తలస్నానం చేశాక జుట్టుకు కండీషనింగ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగు గొప్ప కండీషనర్‌గా పని చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం వీకెండ్స్‌లో పార్లర్లు, స్పాలకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్రయత్నించి ఆరోగమైన కురులకు వెల్కమ్ చెప్పేయండి. (‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) -
చుండ్రుకు ఉసిరి
కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి. ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను ఉసిరితో తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి నీళ్లలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మాడుకు పట్టించి, జుట్టును తడపాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. చుండ్రు కూడా తగ్గుతుంది. -
వింటర్‌కి విరుగుడు
చలికాలం కురుల సహజత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. లేదంటే వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం, చుండ్రు సమస్య తలెత్తడం వంటివి చూస్తుంటాం. వీటికి విరుగుడుగా.. అలొవెరాతో కండిషనర్ షాంపూలు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలంలో వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా రసం జుట్టు్టకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో జుట్టు మెత్తగా, నిగ నిగలాడుతూ ఉంటుంది. అలోవెరా జెల్‌ను రాత్రి పడుకునే ముందు మాడుకు పట్టించి, మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది. ఉసిరితో మర్దన ఉసిరి, మందార పువ్వులు మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లే సమస్య తగ్గుతుంది. కురుల మృదు త్వం పెరుగుతుంది. బీట్రూట్ థెరపీ బీట్రూట్ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. -
బ్యూటిప్స్
► పెదవులు పొడిబారి ఇరఇరలాడుతుంటే... రెండు చెంచాల వెన్నలో, ఒక చెంచా తేనె కలిపి, ఆ మిశ్రమంతో పెదవుల మీద మృదువుగా మర్దనా చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే... పెదవుల్లో తేమ పెరుగుతుంది. ► పచ్చి పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది సహజసిద్ధ్దమైన బ్లీచ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. ►కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి అందులో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ముఖంమీద మచ్చలు పోతాయి. ►పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. ►గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. -
బ్యూటిప్స్
► ఓట్స్‌ని ఉడికించి, మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చెమట వల్ల పట్టిన మురికి తొలగిపోయి, ముఖం కాంతిమంతమవుతుంది. ► పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. ► గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ►సాయంత్రం ఇంటికి రాగానే నేరుగా సబ్బుతో ముఖాన్ని శుభ్రపరచకుండా ముందుగా క్లెన్సింగ్ మిల్క్‌ను తగినంత దూది ఉండకు అద్దుకొని, ముఖాన్ని, మెడను తుడుచుకోవాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై చేరిన మలినాలు, దుమ్ము త్వరగా తొలగిపోతాయి. ►జిడ్డుచర్మం అయితే... స్వచ్ఛమైన పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, మోచేతులకు పట్టించాలి. నిమ్మరసం సహజమైన బ్లీచ్‌గా పని చేస్తుంది. ఈ ప్యాక్ వేసినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది. ►ఒక కప్పు బీట్రూట్ రసంలో అరకప్పు పెరుగు, పావుకప్పు బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. నెలకు రెండుసార్లయినా ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. -
తక్కువ బరువుతో పుడితే కిడ్నీ సమస్యలు తప్పవా?
స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 22 ఏళ్లు. చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య తగ్గడానికి మార్గాలు చెప్పండి. - రాజారాం, వరంగల్ మీరు తలమీద సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ మాడు మీద ఉండే సీబమ్ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. మీరు ఇక్తియోల్ పేల్, కెటాకోనజాల్ ఉండే షాంపూను వాడండి. మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు. ఇక నోటి ద్వారా తీసుకోవాల్సిన ఇట్రాకొనజోల్ టాబ్లెట్లను ఉదయం రెండు, రాత్రికి రెండు మాత్రలు చొప్పున రెండు రోజుల పాటు వాడాలి. ఈ మోతాదును స్టాట్ డోసింగ్ అంటారు. అంటే ఇది మీ సమస్యకు తక్షణం పనిచేసే మోతాదు అన్నమాట. అప్పటికీ సమస్య తగ్గకపోతే నోటి ద్వారా తీసుకునే ఐసోట్రెటినాయిన్ 10 ఎంజీ అనే మందును రెండు నెలల పాటు వాడవచ్చు. నా స్కిన్‌లో స్వాభావికంగా ఉండాల్సిన మెరుపు లేదు. చర్మం ఎండిపోయినట్లుగా ఉంటోంది. మందులు తీసుకోకుండా, క్రీమ్స్ వంటివి రాసుకోకుండా కేవలం మంచి ఆహారం ద్వారానే చర్మానికి మెరుపు రావాలంటే ఏం చేయాలి? - సుమ, నల్లగొండ చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇవి శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యతలో వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ హెమటాలజీ కౌన్సెలింగ్ మాకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. వాడికి వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ఎప్పుడూ తీవ్రమైన అలసటతో ఉంటున్నాడు. దాంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన కొన్ని పరీక్షలు చేసి బాబుకు తలసేమియా అనే వ్యాధి ఉందన్నారు. మాకు తీవ్రమైన ఆందోళనగా ఉంది. ఈ జబ్బు మా బాబుకు ఎందుకు వచ్చింది. దీనికి సరైన, శాశ్వతమైన చికిత్స ఉందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - రేణుక, విజయనగరం తలసేమియా వ్యాధి జన్యుపరంగా వస్తుంది. ఇది రక్తానికి వచ్చే వ్యాధి. ‘హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోపోరోసిస్’ అనే వైద్యపరీక్ష నిర్వహించడం ద్వరా దీనిని మనం గుర్తించవచ్చు. సాధారణంగా ఈ జబ్బు బారిన పడ్డ చిన్నపిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండదు. దీనికి కారణం ఎర్రరక్తకణాల లోపం. వీరిలో ఆరోగ్యవంతమైన ఎర్ర రక్తకణాల వృద్ధికి కారణమైన హిమోగ్లోబిన్ స్వతహాగా తయారు కాలేదు. దాంతో శరీరంలో ‘ఐరన్’ శాతం తగ్గి... వారిలో ఎదుగుదల మందగిస్తుంది. అయితే మీ అబ్బాయి విషయంలో ఈ వ్యాధి ఏ స్థాయిలో ఉందనే అంశాన్ని తగిన పరీక్షలు చేసి నిర్ధారణ చేయాలి. ఒకవేళ ‘తలసేమియా మైనర్’ స్టేజ్‌లో ఉంటే రక్తమార్పిడి అసలు అవసరం ఉండదు. మందులతోనే మీ అబ్బాయిని నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. అలాకాకుండా ‘తలసేమియా మేజర్’ స్టేజ్‌లో ఉంటే మాత్రం కచ్చితంగా 2 లేదా 4 వారాలకు ఒకసారి రక్తమార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కించిన రక్తంలో ఉండే ‘ఐరన్’ శాతాన్ని బట్టి ఈ రక్తమార్పిడి అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే రక్తంలోని ఐరన్ గుండె, లివర్లకు చేటు తెస్తుంది. ఈ అవయవాలు పూర్తిగా పాడైపోయి మనిషి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రక్తమార్పిడి తర్వాత శరీరంలోని ఐరన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటూ, దానిని బ్యాలెన్స్ చేసుకోడానికి మందులు వాడుతూ ఉంటే, రోగి అందరిలాగే జీవితాన్ని ఆస్వాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఈ వ్యాధికి ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్’ చికిత్స అత్యుత్తమమైందని చెప్పవచ్చు. ఈ విధానంలో రక్తమార్పిడి అవసరం ఉండదు. ఎందుకంటే రక్త కణాలు పుట్టేది ‘బోన్ మ్యారో’ (ఎముక మజ్జ)లోనే కాబట్టి అక్కడే శాశ్వత చికిత్స నిర్వహిస్తే సరిపోతుంది. వ్యాధిని సంపూర్ణంగా రూపుమాపవచ్చు. ఇందుకోసం మీ బాబు నెల రోజుల పాటు తప్పనిసరిగా ఆసుపత్రిలో ఉండాలి. అలాగే ఆపరేషన్ తర్వాత ఆర్నెల్ల పాటు డాక్టర్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. చికిత్సను నిపుణులైన వైద్యులు, అధునాతమైన చికిత్సా సదుపాయాలు ఉన్న హాస్పిటల్లో చేయించుకోండి. చికిత్స తర్వాత మీ బాబు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటాడు. డాక్టర్ గణేశ్ జెషైట్వార్ హెమటాలజిస్ట్ అండ్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజగూడ, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ మా అమ్మాయికి ఇటీవల బాబు పుట్టాడు. పుట్టినప్పుడు బాబు బరువు చాలా తక్కువ. అయితే ఇలా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇది నిజమేనా? కొంచెం వివరంగా చెప్పండి. - సవిత, నిజామాబాద్ మీరు మీ అమ్మాయికి జన్మించిన శిశువు బరువు వివరాలు చెప్పలేదు. సాధారణంగా బరువు తక్కువతో పుట్టిన పిల్లలకు కిడ్నీల జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. వీళ్లలో మూత్రపిండాలలోని ఫిల్టర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇవి పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉండాలి. కానీ ఇలాంటి పిల్లల్లో ఇవి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు మాత్రమే ఉంటాయి. సాధారణంగా 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన వారిలో ఈ ముప్పు ఉండే అవకాశం ఎక్కువ. ఫిల్టర్స్ తక్కువ కావడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. షుగర్ రిస్కు కూడా ఎక్కువ. తొందరగా కిడ్నీలు పాడైపోతాయి. ఇక పిల్లలకు కిడ్నీ సమస్య ఉన్నట్లయితే వాళ్లు తీసుకునే ప్రొటీన్ తగ్గించాలి. అయితే శాకాహార ప్రొటీన్ల వల్ల సమస్య ఏమీ ఉండదు. కాబట్టి మాంసాహారాన్ని పూర్తిగా మానివేసి, ఇతర ప్రొటీన్లను తగ్గిస్తే సరిపోతుంది. ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించాలి. దాహంగా ఉంటేనే నీళ్లు తాగాలి. పండ్లు పండ్లరసాలు, పొటాషియం తగ్గించాలి. పొటాషియం ఎక్కువైతే గుండెకు కూడా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆపిల్స్, బొప్పాయి తప్ప వేరే పండ్లు తినకూడదు. ఈ జాగ్రత్తలు పాటించి మీ అమ్మాయి వాళ్ల బాబు కిడ్నీలను కాపాడుకోవచ్చు. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నిమిషాల్లో నిగారింపు
బ్యూటిప్స్ రసాయనాలతో తయారు చేసిన క్రీమ్స్, కండీషనర్స్ లాంటివి ఉపయోగించకుండా, ఇంటి చిట్కాలు వాడితే అందంతో పాటు ఆరోగ్యమూ మీ సొంతం అవుతుంది.అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే ఇంట్లో చక్కటి ఫేషియల్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ పెరుగు తీసుకొని బాగా కలపాలి. ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్ వేసుకొని, 15 నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. ఇంట్లోనే జుట్టుకు కండీషనర్ తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక ఇనుప పాత్రలో అరకప్పు కాఫీ పొడి, అరకప్పు హెన్నా పౌడర్ తీసుకొని వాటికి నిమ్మరసం కానీ పెరుగు కానీ కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలంటు స్నానం చేసిన మరుసటి రోజు మాడుకు, జుట్టుకు అప్లై చేసుకొని, అది పూర్తిగా ఆరిపోయాక కడిగేసుకోవాలి. అలా చేస్తే చుండ్రు సమస్య పోవడంతో పాటు జుట్టు ముదురు రంగులో నిగారిస్తుంది. తరచూ పెదాలు పగులుతూ, అందంగా కనిపించట్లేదని బాధపడే వారికి ఈ చిట్కాతో మంచి ఫలితం దక్కుతుంది. చిన్న పాత్రలో అర టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ ఆముదం, అర టీస్పూన్ గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న డబ్బాలోకి తీసుకొని ప్రతి రోజూ పెదాలకు రాసుకుంటే పగలకుండా ఉంటాయి. దాంతో మీ పెదాలు అందంగా తయారవుతాయి.