వర్షాకాలంలో జుట్టు డల్‌గా ఉంటుంది. దీనికి తోడు వర్షంలో అప్పడప్పుడూ తడవడంతో చుండ్రు, చిట్లడం, రఫ్‌గా తయారవ్వడం వంటి సమస్యలు ఎదరువ్వతాయి. ఈ సమస్యల నుంచి మీ శిరోజాలను కాపాడుకోవాలంటే ఈ జ్రాగత్తలు తీసుకోవాల్సిందే. మనం నిత్యం చూసే, అందుబాటులో ఉండే వాటితో ఈజీ జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు.
వర్షాకాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే..
►తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు గోరువెచ్చని నూనె వెంట్రుకు కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు మృదుత్వాన్ని కోల్పోవు.
►తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్ రాసుకొని, పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా జెల్‌లో ఉండే ఔషధ గుణాలు చుండ్రును, వెంట్రుకలు చిట్లడాన్ని నివారిస్తాయి. దీంతో పాటు శిరోజాలలో ఉండే బాక్టీరియా, మాడుపై దురద.. వంటి సమస్యలను నివారిస్తాయి. వెంట్రుకలు పెరగడానికి కూడా దోహదం చేస్తాయి.
►తలస్నానానికి రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూలనే వాడాలి.
►తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సోయాబీన్, గుడ్లు, కొవ్వు తక్కువగా ఉండే ఛీజ్, బీన్స్.. వంటివి ఉండేలా జాగ్రత్తపడాలి.
►తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన సలాడ్స్ ఈ కాలం తీసుకోవడం చాలా అవసరం. అలాగే మొలకెత్తిన గింజలను సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఆహారంలో ఈ తరహా పదార్థాలు చేర్చడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అంది జుట్టు రాలడం తగ్గుతుంది.
►కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ వెంట్రుకలు రాలడానికి దోహదం చేస్తుంది. కాఫీ, టీలకు బదులుగా పండ్లరసాలు, పాలు, హెర్బల్ టీ... వంటి కెఫెన్ లేని ద్రవపదార్థాలను తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యల నుంచి సులభంగా బయటపడోచ్చు. చిట్కాల తోపాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
(చదవండి: వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!)
Comments
Please login to add a commentAdd a comment