Monsoon
-
వానాకాలం ధాన్యం ప్రైవేటు వ్యాపారులకే!
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ ధాన్యం సేకరణలో పౌరసరఫరాల సంస్థకు నిరాశే మిగిలింది. రికార్డు స్థాయిలో కోటిన్నర మెట్రిక్ టన్నుల మేర ధాన్యం దిగుబడి వచి్చందని ప్రభుత్వం చెబుతున్నా, కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం మాత్రం 53.96 లక్షల మెట్రిక్ టన్నులే. ఇందులో సన్నరకం ధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు. కాగా గత సంవత్సరం వానాకాలం సీజన్లో కూడా పౌరసరఫరాల సంస్థ 47.34 శాతం ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది. దేశ, విదేశాల్లో బియ్యానికి పెరిగిన డిమాండ్ దృష్ట్యా వానాకాలం సీజన్లో పండిన పంటను కల్లాల నుంచే వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. క్వింటాల్‌కు మద్దతు ధర కామన్ వెరైటీకి రూ.2,300, గ్రేడ్ ఏ రకానికి రూ.2,320 చొప్పున కొనుగోలు కేంద్రాల్లో రైతులకు లభించింది. అదనంగా ఈ వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున ప్రభుత్వం బోనస్‌గా ఇస్తామని చెప్పింది. అయినా వ్యాపారులు, రైస్‌మిల్లర్లు సన్న ధాన్యాన్ని నేరుగా రైతుల పొలాల నుంచే మద్దతు ధర కన్నా అదనంగా ఇచ్చి కొనుగోలు చేసిన పరిస్థితి ఈసారి కనిపించింది. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో రైతులే నేరుగా ధాన్యాన్ని బియ్యంగా మిల్లింగ్ చేయించి విక్రయిస్తున్నారు. రైతులు సొంత అవసరాలకు కూడా బియ్యాన్ని నిల్వ చేసుకోవడం ఈ సీజన్లో సాధారణం. దీంతో వానాకాలం సీజన్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తగ్గుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ సీజన్లో పండిన పంటకు, సర్కార్ సేకరించిన ధాన్యానికి పొంతన లేకుండాపోయింది. రేషన్‌కు అవసరమైన సన్న బియ్యం 24 ఎల్ఎంటీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఉగాది నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది. రేషన్ దుకాణాలు, మధ్యాహ్న భోజనం, గురుకుల పాఠశాలలకు సంవత్సరానికి అవసరమయ్యే బియ్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందుకోసం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతుంది. కానీ ఈ సీజన్లో పౌరసరఫరాల సంస్థ సేకరించిన సన్నధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులే. ఈ ధాన్యం ద్వారా 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో వచ్చే సన్న బియ్యాన్ని కూడా పంపిణీకి వినియోగించుకునే అవకాశం ఉంది. వచ్చే నవంబర్ వరకు వానాకాలంలో వచ్చిన సన్న బియ్యాన్ని సరఫరా చేసి, మిగతా నాలుగు నెలలకు యాసంగి బియ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని పౌరసరఫరాల వర్గాలు తెలిపాయి. సీఎంఆర్ ఇలా.... వానాకాలం సీజన్లో ప్రభుత్వం సేకరించిన 53.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం మిల్లులకు పంపించారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 36.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 5.41 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (15 శాతం) పౌరసరఫరాల సంస్థకు రాగా, మరో 30.73 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. రైస్‌మిల్లులు అధికంగా ఉన్న పెద్దపల్లి జిల్లా నుంచి 42 శాతం సీఎంఆర్‌ను ఇప్పటికే సేకరించారు. తర్వాతి స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం (39 శాతం), ఖమ్మం (31 శాతం) జిల్లాలు ఉన్నాయి. -
ఈశాన్యంతో 34 శాతం అధిక వర్షం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ ఏడాది 34 శాతం అదికంగానే వర్షం పడింది. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక చలి పులి దెబ్బకు జనం గజగజ వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వివరాలు.. రాష్ట్రంలో ఏటా ఈశాన్య రుతుపవనాలు ఆశా జనకంగానే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏదో ఒక తుఫాన్, వాయుగండం ప్రళయాన్ని రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వచ్చి రాగానే చైన్నె, శివారు జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఆ తదుపరి రాష్ట్రవ్యాప్తంగా పవనాలు విస్తరించారు. ఈ సీజన్లో సుమారు తొమ్మిది అల్పపీడనాలు బయలు దేరాయి. ఇందులో నాలుగు తమిళనాడు మీద తీవ్రంగానే దాడి చేశాయి. ఇందులో పెంగల్ తుపాన్ తాండవానికి పొరుగున ఉన్నకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటూ రాష్ట్రంలోని విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, కృష్ణగిరి జిల్లాలో వరుణ తాండం అంతాఇంతా కాదు. వరదలు పోటెత్తి గ్రామాలను ముంచేశాయి. ఆ తదుపరి తిరునల్వేలి, తెన్కాశి తదితర జిల్లాల మీద తీవ్ర అల్పపీడనం ప్రభావాన్ని చూపించాయి. ప్రధానంగా డెల్టాలోని నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్ జిల్లాలో అయితే సాధారణం కంటే రెట్టింపుగా వర్ష పాతం నమోదైంది. ప్రస్తుతం ఈశాన్య సీజన్ ముగింపుదశకు చేరింది. ఈ సీజన్లో రాష్ట్రంలో కడలూరు జిల్లాలో అధిక వర్షం పడింది. అతి తక్కువ వర్షం తూత్తుకుడిలో నమోదైంది. తమిళనాడు వ్యాప్తంగా ఈ సీజన్లో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 57 సెం.మీ వర్షం కురిసింది. తిరుపత్తూరులో 25 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 45 సెం.మీ వర్షం కురిసింది. కృష్ణగిరిలో 27 సెం.మీ వర్షంకు బదలుగా 49 సెం.మీ పడింది. విల్లుపురంలో 50 సెం.మీ కురవాల్సి ఉండగా 88 సెం.మీ వర్షం పడింది. తిరునల్వేలి, కాంచీపురం తదితర జిల్లాల్లోనూ సాధాకరణం కంటే అధికంగానే వర్షం పడింది. చైన్నెలో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా అదనంగా 10 సెం.మీ కురిసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తగా 34 శాతం అధికంగానే వర్షాన్ని ఈశాన్య రుతు పవనాలు తీసుకొచ్చాయి. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక క్రమంగా మంచు దుప్పటితో పాటుూ చలి ప్రభావం రాష్ట్రంలో పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే చలి క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. -
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
న్యూఢిల్లీ:నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.గురువారం(అక్టోబర్3)ఢిల్లీలో కాలుష్యం పెరిగినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) సూచించింది.ఢిల్లీ-గజియాబాద్ బోర్డర్లోని ఆనంద్ విహార్‌లో ఏక్యూఏ ఏకంగా 389గా నమోదైంది.దీంతో ఢిల్లీలో అత్యంత కాలుష్య ప్రాంతంగా ఆనంద్‌విహార్ రికార్డులకెక్కింది.ఆనంద్ విహార్ తర్వాత ముండ్కా,ద్వారకా, వాజీపూర్‌లలోనూ కాలుష్యం ఏక్యూఐపై 200 పాయింట్లుగా నమోదైంది.అయితే గురుగ్రామ్,ఫరీదాబాద్‌లలో మాత్రం కాలుష్యం ఏక్యూఐపై అత్యంత తక్కువగా 58,85గా రికార్డయింది.ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించడానికి పంజాబ్,హర్యానా ప్రభుత్వాలు కేవలం సమావేశాలు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గురువారమే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై చర్యలేవి: సుప్రీంకోర్టు ఆగ్రహం -
AP: రెండురోజుల పాటు వర్షాలు
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమలో శని,ఆదివారాల్లో(సెప్టెంబర్7,8) విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీరంలో మత్స్యకారులకు మరో రెండు రోజులపాటు హెచ్చరికలు అమలులో ఉండనున్నాయి. కాగా, వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షసూచన చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
వాతావరణం లో అపరిచిత ధోరణులు
వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారు. కొన్నేళ్లుగా మన దేశంలో వానాకాలం ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటిదాకా కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అకాలంలో భారీ వానలు, సీజన్ మధ్యలో విపరీతమైన ఎండలు పరిపాటిగా మారాయి. వాతావరణ తీరుతెన్నుల్లో ఈ భారీ మార్పులు భారత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాల సీజన్ తీరుతెన్నులే మారిపోతున్నాయి. సీజనల్ వానలు సాధారణంగా జూన్ తొలి, లేదా రెండో వారంలో మొదలై సెపె్టంబర్లో తగ్గుముఖం పడతాయి. కానీ ఈ క్రమం కొన్నేళ్లుగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. వానలు ఆలస్యంగా మొదలవడం, సెప్టెంబర్‌ను దాటేసి అక్టోబర్ దాకా కొనసాగడం పరిపాటిగా మారింది. దాంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సరిగ్గా చేతికొచ్చే వేళ వానల కారణంగా దెబ్బ తినిపోతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్ కూడా అక్టోబర్ దాకా కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల తాలూకు విపరిణామమేనని సైంటిస్టులు చెబుతున్నారు... భారత్‌లో వర్షాకాలం రాకపోకల్లో మార్పులు ఒకట్రెండేళ్లలో మొదలైనవేమీ కాదు. పదేళ్లుగా క్రమంగా చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఏటా పలు రాష్ట్రాల్లో భయానక వరదలకే గాక తీవ్ర పంట నష్టానికీ దారి తీస్తున్నాయి. ఈ ధోరణి దేశ ఆహార భద్రతకు కూడా సవాలుగా పరిణమిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం మినహా ప్రస్తుతానికి మరో మార్గాంతరమేదీ లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘మన దేశంలో వర్షాలకు ప్రధాన కారణమైన నైరుతీ రుతుపవనాల కదలికలు కొన్నేళ్లుగా బాగా మందగిస్తున్నాయి. వాటి విస్తరణే గాక ఉపసంహరణ కూడా నెమ్మదిస్తూ వస్తోంది. మనం ఒప్పుకోక తప్పని వాతావరణ మార్పులివి. మన సాగు పద్ధతులనూ అందుకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే’’ అని చెబుతున్నారు. అంతా గందరగోళమే... సీజన్లో మార్పుచేర్పుల వల్ల ఉత్తర, పశ్చిమ భారతాల్లో కొన్నేళ్లుగా భారీ వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, రాజస్తాన్‌లలో గత దశాబ్ద కాలంగా సగటున ఏకంగా 30 శాతం అధిక వర్షపాతం నమోదవడమే ఇందుకు తార్కాణం. ఆ ప్రాంతాల్లో గతంలో లేని భారీ వర్షాలు ఇప్పుడు మామూలు దృశ్యంగా మారాయి. ఇక గంగా మైదాన ప్రాంతాల్లో అక్టోబర్ దాకా కొనసాగుతున్న భారీ వానలు ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంటల సీజన్‌నే అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో అక్టోబర్ తొలి వారంలో పంట కోతలు జరుగుతాయి. అదే సమయంలో వానలు విరుచుకుపడుతున్నాయి. ‘‘దాంతో కోతలు ఆలస్యమవడమే గాక పంట నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బ తింటోంది. మొత్తంగా వరి, మొక్కజొన్న, పప్పుల దిగుబడి బాగా తగ్గుతోంది’’ అని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎని్వరాన్‌మెంట్ అండ్ వాటర్‌లో సీనియర్ ప్రోగ్రాం లీడ్ విశ్వాస్ చితాలే అన్నారు. ఆహార భద్రతకూ ముప్పు వర్షాలు సీజన్‌ను దాటి కొనసాగడం వల్ల ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. ఈ ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 408.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు అక్టోబర్ దాకా కొనసాగుతాయన్న అంచనాలు ఇప్పట్నుంచే గుబులు రేపుతున్నాయి. ఇది తీవ్ర పంట నష్టానికి, తద్వారా దేశవ్యాప్తంగా బియ్యం, పప్పుల కొరతకు దారి తీయడం తప్పకపోవచ్చంటున్నారు. → ఇలా సీజన్ దాటాక కొనసాగిన భారీ వర్షాలు, వరదల దెబ్బకు 2016 నుంచి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా మొత్తమ్మీద 3.4 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంటలు దారుణంగా దెబ్బ తిన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. → వాతావరణ మార్పుల దెబ్బకు 2022లో భారత్‌లో జీడీపీ వృద్ధిలో 8 శాతం క్షీణత నమోదైంది. 7.5 శాతం సంపద హరించుకుపోయింది. → సాధారణంగా సెపె్టంబర్ తర్వాత భారీ వర్షాలు కురవని పశి్చమ భారతదేశం ఈ మార్పులకు తాళలేకపోతోంది. అక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ ఈ వరదలను తట్టుకోలేకపోతోంది. → ఈ సరికొత్త వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పద్ధతులు అవలంబించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. → డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, ఇటు వరదలను, అటు కరువు పరిస్థితులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తేవడం, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం తప్పదంటున్నారు.మన నిర్వాకమే...! మనిషి నిర్వాకం వల్ల తీవ్ర రూపు దాలుస్తున్న వాతావరణ మార్పులే వానల సీజన్లో తీవ్ర హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. → సముద్రాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది. భారీ వర్షాలు, వరదలకు దారి తీస్తోంది. → ఎల్ నినో, లా నినా వంటివి పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. → ఎల్ నినోతో వర్షాకాలం కుంచించుకుపోయి పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. → లా నినా వల్ల వర్షాలు సుదీర్ఘకాలం కొనసాగి వరదలు పోటెత్తుతున్నాయి. → సాగు, నీటి నిర్వహణతో పాటు దేశంలో సాధారణ జన జీవనమే తీవ్రంగా ప్రభావితమవుతోంది.85 శాతం జిల్లాలపై ప్రభావం మన దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు గత పదిహేనేళ్లలో ఏకంగా ఐదు రెట్లు పెరిగిపోయాయి. ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఏకంగా 85 శాతం పై చిలుకు జిల్లాలను ప్రభావితం చేస్తోంది. వరదలు, తుఫాన్లు, కరువులు, తీవ్ర వడగాడ్పులతో కిందామీదా పడుతున్నట్టు ఐపీఈ–గ్లోబల్, ఎస్రి–ఇండియా సంయుక్త అధ్యయనం తేలి్చంది. అయితే వీటిలో సగానికి పైగా జిల్లాల్లో గతంలో తరచూ వరద బారిన పడేవేమో కొన్నేళ్లుగా కరువుతో అల్లాడుతున్నాయి. కరువు బారిన పడే జిల్లాలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్నాయి! గత 50 ఏళ్ల వాతావరణ గణాంకాలను లోతుగా విశ్లేíÙంచిన మీదట ఈ మేరకు వెల్లడైంది. వాతావరణ మార్పుల వల్ల దేశానికి ఎదురవుతున్న ముప్పును ఇవి కళ్లకు కడుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇంకా ఏం చెప్పిందంటే... → పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2036 నాటికి ఏకంగా 147 కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు. → దేశంలోని తూర్పు, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర వరదలు పరిపాటిగా మారతాయి. → ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటకల్లో కరువు పరిస్థితులు పెరిగిపోతాయి. శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, కటక్ (ఒడిశా) వంటి జిల్లాల్లో ఈ మార్పులు కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి. → ఏపీతో పాటు ఒడిశా, బిహార్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, యూపీల్లో 60 శాతానికి పైగా జిల్లాలు తరచూ ఇటు కరువు, అటు వరదలతో కూడిన తీవ్ర వాతారణ పరిస్థితుల బారిన పడుతున్నాయి. → త్రిపుర, కేరళ, బిహార్, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కరువు ప్రాంతాల్లో వరదలు, వరద ప్రాంతాల్లో కరువులు పరిపాటిగా మారతాయి. → బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, పటా్న, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాలు, వాటి పరిసర ప్రాంతాలు ఈ ‘కరువు–వరద’ ట్రెండుతో అతలాకుతలమవుతున్నాయి. → గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 0.6 డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగిపోవడమే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణం.ఏం చేయాలి? → వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ సాగు తీరుతెన్నులను కూడా తదనుగుణంగా మార్చుకోవడం ఇకపై తప్పనిసరి. → ఇందుకోసం సమీకృత క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లైమేట్ ఫండ్ (ఐసీఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. → ప్రతి సీజన్లోనూ వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా పంటలను మార్చుకుంటూ వెళ్లాలి. → జాతీయ, రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలను మార్చుకోవాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముందు జాగ్రత్తే మందు!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసార (డయేరియా) వ్యాధి కూడా ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో గత రెండు, మూడు నెలల నుంచి వైరల్ జ్వరాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ వీటి బారినపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఇప్పుడు భారీ వర్షాలకు వరదలు కూడా తోడయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముంపు నేపథ్యంలో తాగునీరు కలుíÙతమై అతిసార (డయేరియా), కలరా, టైఫాయిడ్, చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. తాగే నీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ శుద్ధి చేసిన (ఆర్వో) నీటినే తాగాలని చెబుతున్నారు. లేకుంటే పంపు నీటిని కాచి చల్లార్చి తాగాలని పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఇంట్లో, ఆరు బయట పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.వైద్య నిపుణుల జాగ్రత్తలు ఇవే.. » నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి. »తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. »నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. » తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. »రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు శుద్ధమైన నీటిని తాగాలి. »తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. »శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడంతో పాటు మాస్క్ పెట్టుకోవాలి. »దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వినియోగించాలి. »గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. » నాలుగైదు రోజులపాటు జ్వరం ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. డెంగీ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు జ్వర లక్షణాలు ఉంటాయి. ప్లేట్లెట్స్ పడిపోవడం సంభవిస్తుంది.వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వినియోగం వద్దు.. జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు మొదలు కాగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా మందుల షాపుల్లో వాళ్లిచ్చే మందులు వాడుతుంటారు. ఇలా చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలకు ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి యాంటీబయోటిక్స్‌ను మందుల షాపుల వాళ్లు ఇచ్చేస్తున్నారు.జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇవి పనిచేయవని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకుండా ఈ మందులను వాడితే కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధులతో పోరాడే మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉంటుంది. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వాడకంతో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుంది. దీంతో పాటు జీర్ణకోశ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ సంభవిస్తే మందులు కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి. జ్వరం మొదలుకాగానే ఆందోళన వద్దువిష జ్వర బాధితులు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.. సాధారణ చికిత్సలతోనే నయమవుతుంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేనివారు మూడు రోజులు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి పారాసెటమాల్ వేసుకోవాలి. ముక్కు, కళ్లు కారడం, జలుబు వంటివి ఉంటే సిట్రిజెన్ వేసుకుంటే సరిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినా జ్వరం, ఇతర సమస్యలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జ్వరాల వైద్య నిపుణులు, గుంటూరు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వస్తే కంగారు పడొద్దు. మందుల దుకాణాల్లో వాళ్లిచ్చిన యాంటీబయోటిక్స్‌ను అనవసరంగా వాడొద్దు. పారాసిటమాల్, దగ్గు సిరప్‌లను రెండు రోజులు వాడి చూడాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. నిల్వ ఉన్న నీటిలో పిల్లలు ఆడకుండా చూడాలి. కలుíÙత నీటిలో పిల్లలు సంచరిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరేచనాలయ్యే పిల్లలకు మసాలా ఆహారం పెట్టొద్దు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విఠల్ రావు, పిల్లల వైద్య నిపుణుడు, విజయవాడ పరిశుభ్రత పాటించాలి వరదల నేపథ్యంలో ఇంట్లో, వాష్ రూముల్లో చేరిన బురదను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో జలుబు, దగ్గు, జ్వర బాధితులుంటే వారు ఒక గదికి పరిమితం కావడం ఉత్తమం. మాస్క్ ధరించాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగొద్దు. వీలైనంత వరకూ నీరు, తిండి విషయంలో పరిశుభ్రత పాటించాలి. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, గుంటూరు -
వర్షాకాలంలో ఈ కూరగాయలు తీసుకోకపోవడమే మేలు..!
సీజన్ మారేకొద్దీ మనం డైట్ కూడా మార్చాలి. ఆ సీజన్ లో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం, కొన్నింటిని తీసుకోక΄ోవడం వంటివి చేయాలి. దీంతో ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది వర్షాకాలం. ఈ సీజన్లో కొన్ని పుడ్స్ తీసుకోకac΄ోవడమే మంచిది. అవేంటో తెలుసుకుందాం. ఫ్రూట్ సలాడ్.మార్కెట్లో చాలా మంది ఫ్రూట్స్‌ని కట్ చేసి ఇస్తారు. వీటిని తీసుకోవడం తగ్గించాలి. వారు ఎలా నిల్వ చేస్తున్నారో తెలియదు. ఇందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. నిల్వ ఉన్న ఆహారంకొన్నిసార్లు మన ఇంట్లో ఆహారం మిగిలి΄ోతుంది. దీనిని ఎక్కువ సమయం స్టోర్ చేసి తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ టైమ్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫుడ్పాయిజన్లా మారే అవకాశం ఉంది. అందుకనే ఈ ఫుడ్‌ని తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. వేపుళ్లు, జంక్ ఫుడ్చల్లని వాతావరణంలో చాలా మంది సమోసా, పకోడి వంటి ఫ్రై ఐటెమ్స్ ఎక్కువగా తింటారు. అయితే, వీటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా తక్కువగా తినాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. బయట చేసే ఈ ఫుడ్స్‌లో ఏ నూనె కలుస్తుందో తెలియదు కాబట్టి అలాంటి వాటి జోలికిపోకుండా ఉండటం చాలా ఉత్తమం. సీఫుడ్..చేపలు, ఇతర సీ ఫుడ్‌ని ఈ టైమ్‌లో తీసుకోవడం తగ్గించడం, లేదా పూర్తిగా మానడం మంచిది. ఎందుకంటే వర్షం నీటిలో ఉన్న ఈ సీ ఫుడ్స్ తీసుకుంటే డయేరియా, వాంతులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆకుకూరలు..ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఆకుకూర, క్యాబేజీ వంటి వాటి వాడకాన్ని వర్షాకాలంలో తగ్గిస్తే మంచిది. ఇందులో బ్యాక్టీరియా, ΄ారాసైట్స్ పెరగడమే ఇందుకు కారణం. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే చక్కగా కడిగి ఉడికించి వండితే రిస్క్ తగ్గుతుంది.స్పౌట్స్..మొలకల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. కానీ, వీటిలో ఈ సమయంలో బ్యాక్టీరియా, ఫంగస్ ఉండే అవకాశం ఉంది. వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని తినాలనుకుంటే చక్కగా క్లీన్ చేసి డెయిరీ ప్రొడక్ట్స్: అయిన పాలు, చీజ్, పనీర్ కూడా ఈ టైమ్‌లో తక్కువగా తీసుకోవాలి. దీనికి కారణం వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని తీసుకున్ననప్పుడు కూడా సరిగ్గా పాశ్చరైజ్డ్ అయ్యాయా, ఎక్స్పైర్ డేట్ ఎప్పటివరకూ ఉందనేది తెలుసుకుని తీసుకోవాలి. లేదంటే వీటి బదులు పెరుగు, పాలని తీసుకోవచ్చు. (చదవండి: బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!) -
దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయి..ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ప్రతిచోటా దోమలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎంతలా దోమల నివారిణిలు వాడినా ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటాయి. అయితే కొందరూ ఎక్కువగా దోమ కాటుకి గురవ్వతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు అబ్బా దోమలు కుడుతున్నాయని ఫిర్యాదులు చేయరు గానీ వీళ్లు మాత్రం అయ్యా..! బాబోయ్ ఈ దోమలు మమ్మల్ని బాగా కుడతున్నాయి అంటూ గొడవచేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రముఖ ఆరోగ్య నిపుణులరాలు ఊర్వశి అగర్వాల్ వివరించారు. దోమల ఆకర్షణకు కారణమైన జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలని అన్నారు. ఎలా ఉండటం వల్ల దోమలు ఎక్కువగా కుడతాయంటే..ఎక్కువగా దోమ కాటుకి దారితీసే కారణాలు..గట్-స్కిన్..దోమల ఆకర్షణలో ప్రేగు ఆరోగ్యం ఆశ్చర్యకరమైన పాత్ర పోషిస్తుంది. సమతుల్య గట్ మైక్రోబయోమ్ చర్మంలోని మైక్రోబయోమ్‌ను సానుకూలంగా ఉంచుతుంది. దోమలు తక్కువ ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మ అవరోధాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తం పీల్చే దోమల వంటి ఇతర జీవులనుఆకర్షించే కొన్ని రకాల సమ్మేళనాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.ఎక్కువగా తినే వాటిని బట్టి...మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టే దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవ్వుతాయి. చక్కెర, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహ పరిచేలా శరీరం నుంచి ఒకవిధమైన సువాసన వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులుశరీరం నుంచి వచ్చే వాసన..శరీరం వాసన అనేది జన్యుశాస్త్రం, ఆహారంకి సంబంధించింది. ఇది ఒకరకంగా మీ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియాతో సహా శరీరం ఉత్పత్తి చేసే సమ్మేళనాలు అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు కారణమవ్వడమే దోమలకు ప్రీతికరంగా అనిపించేందుకు కారణమువుతంది. అధిక జీవక్రియ రేటు..ఎక్కువ కార్బన్డయాక్సైడ్ని ఉత్పత్తి చేస్తే దోమలు దూరం నుంచే గుర్తిసాయిట. సహజంగా శక్తిమంతంగా ఉన్నా లేదా అధిక జీవక్రియ రేటుని కలిగి ఉంటే ఈ దోమ కాటుకి గురవ్వాల్సి వస్తుంది.వాపు, రోగనిరోధక పనితీరుదీర్ఘకాలిక వ్యాధులు బారినపడిన వారిలో రోగనిరోధక స్థితి బలహీనంగా ఉంటుంది. ఇది దోమల ఆకర్షణకు కారణమవుతుంది. అలాగే శరీరం అసమతుల్యత స్థితిలో ఉంటే దోమలను ఆకర్షించే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. దోమ కాటుకి గురవ్వకూడదంటే..గట్ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి: ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చేలాక ఫైబర్, పులియబెట్టిన ఆహారాలు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. చక్కెర , ఆల్కహాల్‌ను పరిమితం చేయండి: ఈ పదార్ధాలు తీసుకోవడం తగ్గిస్తే శరీరంలో జరిగే రసాయనిక చర్యను నియంత్రిస్తుంది. . శరీర దుర్వాసనను నియంత్రించండి: రెగ్యులర్ షవర్లు, సహజమైన డియోడరెంట్లను ఉపయోగించడం, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వంటివి చేయాలి.(చదవండి: వాకింగ్ వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా.? అలా కాకూడదంటే..?) -
దేశానికి లౌకిక పౌరస్మృతి తక్షణావసరం.. : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!
వర్షాకాలం వ్యాధుల కాలంగా చెప్పొచ్చు. అదీగాక ఈ కాలంలో వాతారవరణం అంతా చల్లబడిపోవడంతో చాలామందికి జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. దీనికి తోడు వాతావరణంలో పెరిగిన తేమ కారణంగా రోగనిరోధక వ్యవస్థ అనారోగ్య బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో ఇలాంటి కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. జీర్ణక్రియకు మద్దతు ఇచ్చేలా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ కూరగాయలని మీ డైట్లో జోడించాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే..ఈ మాన్సూన్ డైట్లో చేర్చుకోగల కూరగాయల జాబితాన ఏంటంటే..వర్షాకాలంలో ప్రయోజనకరంగా ఉండే కూరగాయలు ఏవంటే..కాకరకాయదీనిలోని చేదు లక్షణం రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.ఆనపకాయకడుపులో తేలికగా ఉంటుంది . సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.పొట్లకాయఇది మంచి డైటరీ ఫైబర్. అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. పొట్లకాయలోని పీచు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది.బచ్చలికూరబచ్చలికూరలో అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. అంతేగాక తేమతో కూడిన వాతావరణం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.మెంతి ఆకులుమెంతి ఆకులు (మేతి) యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. మెంతి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటాంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన మంచి ఆకుకూర కూడా. మునగకాయలుమునగకాయలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శ్వాసకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుల బారినపడకుండా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.క్యారెట్లుక్యారెట్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి దృష్టిని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు అంటువ్యాధుల నుంచి రక్షించడానికి, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి. బీట్రూట్బీట్రూట్లోని అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి. వర్షాకాలంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి మెరుగైన రక్త ప్రసరణకు ప్రయోజనకరంగా ఉంటుంది.గుమ్మడికాయగుమ్మడికాయలో విటమిన్ ఏ, సీ, ఈ తోపాటు ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడికాయలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అయితే దాని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలు చెక్‌పెట్టడంలో కీలకంగా ఉంటుంది.బెండకాయ దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫోలేట్, ఫైబర్ల మూలం. బెండకాయలో అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రబలంగా ఉండే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.(చదవండి: బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?
సాధారణంగా ఎండు బాదంపప్పులను నానబెట్టుకుని తింటాం. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా. ఐతే వర్షాకాలంలో మాత్రం పచ్చిబాదంపప్పులు తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ఈ, విటమిన్ సీ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని అందువల్లే ఇవే తీసుకోవడం మంచిదని అంటున్నారు. వర్షాకాలంలో ఏవిధంగా ఇవి మంచివో సవివరంగా చూద్దామా..!పెంకు లోపల ఉన్న గింజ పూర్తిగా పక్వానికి రాకముందే ఆకుపచ్చ బాదంపప్పును తినేందుకు వినియోగిస్తారు. ఇది పోషకమైనది కూడా.ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..విటమిన్ 'ఈ': గ్రీన్ బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, దీనిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ సీ: రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ కూడా వీటిలో ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు: పరిపక్వ బాదం వలె, ఆకుపచ్చ బాదం మోనోశాచురేటెడ్ కొవ్వుల మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఫైబర్: ఇవి డైటరీ ఫైబర్‌ను అందిస్తాయి. అందువల్ల ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.మెగ్నీషియం, పొటాషియంల గని: ఆరోగ్యకరమైన రక్తపోటు, కండరాల పనితీరును నిర్వహించడానికి అవసరమైన ఖనిజాలు.వర్షాకాలంలో ఇవే ఎందుకు తీసుకోవాలంటే..వర్షాకాలంలో అధిక తేమ, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆకుపచ్చ బాదంలో విటమిన్లు ఈ, సీలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.వర్షాకాలం వాతావరణం కొన్నిసార్లు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆకుపచ్చ బాదంలోని ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది , ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, డైటరీ ఫైబర్ గట్ మైక్రోబయోటాను కూడా మెరుగుపరుస్తుంది. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.వర్షాకాలంలో వచ్చేద హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది. దీనిలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఆకుపచ్చ బాదం అనేది హైడ్రేషన్, ఎనర్జీ లెవల్స్ నిర్వహించడానికి సహాయపడే పోషకాల మూలం. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి.(చదవండి: మినీ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!) -
దేశంలో సాధారణ స్థితికి వరిసాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరించిన రుతు పవనాలు, జోరుగా కురుస్తున్న వర్షాలతో వరి సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వరి 23.7 మిలియన్ హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది జూలై 27 నాటికి 21.5 మిలియన్ హెక్టార్లలో సాగైందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ ఐదేళ్ల సగటుతో పోలిస్తే 2.2 శాతం మేర అధికమేనని తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా 40.15 మిలియన్ హెక్టార్లలో వరి సాగు కానుందని అంచనా వేసింది. ఇక వేరుశెనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు వంటి నూనెగింజల సాగు గత ఏడాది కంటే 3.8 శాతం ఎక్కువగా, 17.16 మిలియన్ హెక్టార్లలో సాగయ్యాయని వివరించింది. పప్పుధాన్యాల సాగు సైతం 14 శాతం మేర పెరిగి, 10.2 మిలియన్ హెక్టార్లలో సాగైందని వెల్లడించింది. -
చినుకు తెచ్చిన సంబరం : ఒళ్ళంతా తుళ్ళింతే! వైరల్ వీడియో
మబ్బొచ్చినా, వానొచ్చినా తొలుత పులకించిపోయేది రైతన్నే. బీటలు వారిన నేలన నాలుగు చినుకులు పడినప్పుడు రైతు గుండె ఉప్పొంగి పోతుంది. వర్షపు దాహం తీరిన మట్టి చిందించే పరిమళానికి ఉత్సాహంగా చిందులేస్తాడు. గుజరాత్‌లోని కచ్‌లోని ఒక ప్రాంతంలో సరిగ్గా ఇదే జరిగింది. జోరుగా కురిసిన వాన ప్రవాహంలో పరిపూర్ణ ఆనందంతో తండ్రీ కొడుకులు ఆనందంతో చిందులు వేశారు. అచ్చమైన రైతులా తండ్రి, అతనికి తోడుగా కొడుకు కూడా చేరాడు. ఇద్దరూ కలసి చేసిన అచ్చం లగాన్ సినిమాలో లాగా చేసిన గుజరాతీ సంప్రదాయ నృత్యం ఇంటర్నెట్లో హృద్యంగా నిలిచింది. రోనక్ గజ్జర్ అనే జర్నలిస్టు ఎక్స్లోదీన్ని పోస్ట్ చేశారు. The father and son demonstrated their joy by performing a traditional dance in a field, as the semi-arid region of Kutch experienced substantial rainfall.#Gujarat #Monsoon pic.twitter.com/HTPTJ2D8Qr— Ronak Gajjar (@ronakdgajjar) July 23, 2024 -
వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..?
ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిదని అంటారు. అలాంటి ఆకుకూరలను వర్షాకాలంలో మాత్రం తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో ఎందుకు తీసుకోకూడదు..?. నిపుణులు ఏమంటున్నారంటే..ఈ వర్షాకాలంలో ఆకుకూరలు బురద బురదగా ఉంటాయి. పైగా గాల్లో ఉండే తేమ కారణంగా వైరస్, బ్యాక్టీరియా ఆకులను ఆశ్రయించి ఉంటుంది. చెప్పాలంటే ఈ టైంలో వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసే ప్రదేశంగా ఆకుకూరలను మారుస్తుంది. మనం ఈ కాలంలో వీటిని గనుక సరిగా క్లీనింగ్ చేయకుండా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, డయేరియా, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా అని ఈ సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండాల్సిన పనికూడా లేదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు అమిత. హాయిగా ఈ కాలంలో కూడా ఆకుకూరలు తినొచ్చుని చెబుతున్నారు. అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించినట్లియితే బేషుగ్గా తినవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా కడగడం ఎలా అంటే..ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే తాజా ఆకులను వేరు చేయాలి. తర్వాత నిస్తేజంగా ఉన్న వాటిని శుభ్రం చేసి, బాగానే ఉన్నాయనిపిస్తే వినియోగించాలి. ఆ తర్వాత ఆకులన్నింటిని ఒక్కోక్కటిగా ఓపికతో క్లీన్ చేయాలి. వాటిని పొడి క్లాత్‌పై వేసి చక్కగా ఆరబెట్టండి.వండటానికి ముందు ఆకుకూరలను చక్కగా ఉప్పు వేసిన వేడినీటిలో 30 సెకన్లపాటు ఉంచి వడకట్టండి. ఆ తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లో వేసి చక్కగా వండుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా వండినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.(చదవండి: డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..) -
ఈవినింగ్ స్నాక్స్ : ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు
వర్షాకాలంలో సాయంత్రంపూట ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగే స్కూలు నుంచి పిల్లలు కూడా ఏదో ఒకటి తినడానికి కావాలని మారాం చేస్తూ ఉంటారు. నోటికి రుచిగా ఉండే వెరైటీ స్నాక్స్ కోసం ఆశగా ఎదురు చూసే అత్త మామలు..వీళ్లందర్నీ సంతృప్తి పరచాలంటే.. ఇదిగో ఐడియా!పల్లీ పకోడికావలసినవి: వేరు శనగపప్పు – పావు కిలో (పచ్చివి); శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి– టేబుల్ స్పూన్; మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్)– టీ స్పూన్; మిరపపొపడి– టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; చాట్ మసాలా పొడి– టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; నీరు – పావు లీటరు (అవసరాన్ని బట్టి వేయాలి); నూనె – వేయించడానికి తగినంత.తయారీ: వేరుశనగపప్పును మెత్తటి వస్త్రంలో వేసి తుడవాలి. ఆ తర్వాత వాటిని ఒక పాత్రలో వేయాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మిరప్పొడి, చాట్ మసాలా, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి మరోసారి సమంగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని వేస్తూ పిండి వేరుశనగపప్పుకు పట్టేటట్లు మిశ్రమాన్ని తడి పొడిగా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి వేరుశనగపప్పుల మిశ్రమాన్ని చేత్తో తీసుకుని వేళ్లను కదుపుతూ గింజలు విడివిడిగా పడేటట్లు జాగ్రత్తగా నూనెలో వదలాలి. నూనెలో కాలుతున్నప్పుడు చిల్లుల గరిటెతో కలియబెడుతూ లోపల గింజలో పచ్చిదనం పోయి దోరగా వేగే వరకు కాలనిచ్చి తీయాలి. ఇలా మొత్తం పప్పులను వేయించి ఒక పాత్రలో వేయాలి ∙ఇప్పుడు అదే నూనెలో కరివేపాకులు వేసి చిటపటలాడిన తర్వాత తీసి పకోడీ మీద వేసి కలపాలి. ఈ పల్లీ పకోడీ మరీ వేడి ఉన్నప్పుడు తింటే రుచి తెలియదు. వేడి తగ్గిన తరవాత తినాలి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే వారం రోజులు తాజాగా ఉంటాయి.పీ నట్ చాట్కావలసినవి: వేరు శనగపప్పు – కప్పు (వేయించినవి); ఉల్లిపాయ – 1 (తరగాలి); టొమాటో – 1 (తరిగి గింజలు తొలగించాలి); కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మరసం – టీ స్పూన్; మిరప్పొడి– అర టీ స్పూన్; చాట్ మసాలా– టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; నూనె– 2 టీ స్పూన్లు.తయారీ: ∙బాణలిలో నూనె వేడి చేసి స్టవ్ ఆపేయాలి. నూనెలో మిరపపొడి, చాట్ మసాలా, వేరుశనగపప్పు వేసి కలపాలి. పప్పు వేడెక్కిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేయాలి. చివరగా నిమ్మరసం చల్లి, ఉప్పు కలపాలి. ఇది అన్ని వయసుల వారికీ మంచి ఆహారం. -
రెగట్టాలో మనోళ్ల హవా
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా కొనసాగుతున్న సెయిలింగ్ మాన్సూన్ రెగట్టా పోటీల్లో మరోసారి తెలంగాణ సెయిలర్లు రాణిస్తున్నారు. సాగర్‌లో జరుగుతున్న 15వ మాన్సూన్ రెగట్టాలో బుధవారం అండర్–16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్‌లో ఉద్బవ్ స్కూల్ నుంచి గోవర్ధన్పల్లార, లాహిరి కొమరవెల్లి, దీక్షిత కొమరవెల్లి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. గోవర్ధన్ తన విజయాలతో రెండవ స్థానం కన్నా ముందే ఉన్నప్పటికీ అగ్రస్థానం కోసం మరో 4 రేసులతో నైపుణ్యాలను ప్రదర్శించాలి. సెయిలింగ్ స్టార్ లాహిరికి ఓ ప్రమాదంలో ఎడమ చేయి విరగడంతో మొదటి రెండు రేసులకు అనుమతించలేదు. చివరకు వైద్యుడి పర్యవేక్షణలో అనుమతించడంతో లాహిరి ఒక రేసులో మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ 39 సెయిలర్ ఫ్లీట్‌లో ప్రశంసనీయంగా 19వ స్థానంలో నిలిచింది. ఐఎల్సీఏ 4 బాలుర విభాగంలో టీఎస్సీ మైసూర్‌కు చెందిన కృష్ణ దివాకర్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాథమ్ (3వ స్థానం)ను బీట్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. శశాంక్ బాథమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో సోమ్యా సింగ్, అలియా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ లోకల్స్‌లో తనుజా కామేశ్వర్, వైష్ణవి అగ్రస్థానంలో నిలిచారు. బాలికల హాఫ్ రిగ్ ఫ్లీట్‌లో అఖిల కొప్పుల (13) స్వర్ణం, రెయిన్బో హోమ్స్ ముషీరాబాద్‌కు చెందిన నికిత జీరు (12) రజతం సాధించారు. -
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? జాగ్రత్తలు!
వర్షాకాలం వచ్చిదంటే చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కండరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. వర్షాకాలంలోని తేమకు కీళ్లనొప్పులకు సంబంధం ఉంటుంది. వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వానల రోజులు కొంతమంది ఆహ్లాదాన్ని పంచితే మరికొంతమందికి, ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఆందోళన మోసుకొస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వారికి నొప్పులతో రోజువారీ పనులను కొనసాగించడం, ఒక్కోసారి కాలు కదపడం కూడా కష్టం అనిపిస్తుంది. మారుతున్న వాతావరణానికి, కీళ్ల నొప్పులకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణం, తేమ స్థాయిలలో మార్పులు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వంలో తేడాలు, తిమ్మిర్లు గాయం నొప్పి కనిపిస్తాయి. గాలిలోని అధిక తేమ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి.ఎముకలకు కీలకమైన డీ విటమిన్ కూడా ఈ సీజన్లో సరిగ్గా అందదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో కీళ్ల చుట్టూ ఉండే ప్లూయడ్ పలచబడుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ కారణాల రీత్యా కీళ్ల నొప్పులు పెరుగు తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలువిటమిన్ డీ, బీ 12 లభించే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.విటమిన్ ఇ నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గింజలు, అవకాడో, బెర్రీలు, ఆకు కూరలు, గింజలు, చేపలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అవిసె గింజలు,నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, పనీర్, గుడ్లు తీసుకోవాలి. మోకాళ్లు, ఇతర కీళ్ళపై సురక్షితమైన ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వేడి నీటి, హీట్బ్యాగ్తో కాపడం పెట్టుకోవచ్చు.కండరాలకు వ్యాయామం ఒక వరం. మార్నింగ్ వాక్, లెగ్, కండరాలను సాగదీసేలా వ్యాయామాలు, యోగా, సైక్లింగ్ చేయడం వంటివి చేయడం మర్చిపోకూడదు. అలాగని మరీ ఎక్కువ చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానికోసం వైద్య నిపుణుడు, ఫిజియో థెరపిస్ట్‌ను సంప్రదించడం మంచిది -
వర్షాకాలం..వ్యాధుల కాలం..వీటి బారినపడకూడదంటే..!
సూర్యుడి భగభగలు నుంచి తొలకరి జల్లులతో వర్షాకాలం సమీపించి చల్లదనంతో సేదతీరేలా చేస్తుంది. కానీ ఇది ఎంత చల్లగా ఆహ్లాదంగా ఉన్నా..ఈ తేమకు ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ప్రజలు. వీటిని ఎలా ఎదుర్కోవాలి?, ఈ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.!వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.జలుబు, జ్వరం..ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వ సాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం. కాబట్టి, వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.దోమలు..రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. దీని వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి.డెంగ్యూ..డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యే. ప్రాణాంతకంగా మారింది. ఇది డెంగ్యూ వైరస్ కారణంగా వచ్చినప్పటికీ, క్యారియర్ దోమ, కాబట్టి, దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు.కలరా..కలరా అనేది కలుషిత నీటి ద్వారా వచ్చే సమస్య. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది.టైఫాయిడ్..టైఫాయిడ్ ఫీవర్ కూడా కలుషిత ఆహారం, నీటి కారణంగా వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ వల్ల వచ్చే మరో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు.హెపటైటిస్..కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకడం, కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. ఈ సమస్య లక్షణాలు జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైనవి వస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వలన ఎక్కువగా జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మాస్క్ ధరించి దీని బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు వేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక గొంతు నొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు అయిల్ ఫుడ్‌ని దూరంగా పెట్టాలని సూచించారు. ఆహారం తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని, ఉప్పు నీటిని వాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీ నుండి తప్పించుకోవచ్చు. అంతేగాదు వర్షాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందు నుంచి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.పోషకాహారం తీసుకోవాలి.ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.కాచి చల్లార్చిన నీటిని తాగాలి.దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..దీంతో అతడి రక్తం..! -
వర్షాకాలం: దోమల్ని తరిమి కొట్టే చిట్కాలు, ఈ మొక్కల్ని పెంచండి!
వర్షాకాలం వచ్చిందంటే... మేమున్నామంటూ దోమలు విజృంభిస్తాయి. దీంతో సీజనల్‌గా వచ్చే అనేక వ్యాధుల్లో చాలావరకు వివిధ రకాల దోమల వల్లే వస్తాయి. అందుకే దోమలను నివారించే కొన్ని సహజమైన నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో తడి, తేమ లేకుండా వాతావరణ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులుంటే మరింత జాగ్రత్త అవసరం. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇంటిని, ఇంటి చుట్టుపక్కలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టైర్లు, చిన్ని చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, కుండలు లాంటివాటిల్లో కూడా నీరు ఉండిపోకూడా జాగ్రత్త పడాలి. వర్షాకాలంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. దోమతెరలను వాడాలి.దోమలు తీపి వస్తువులు, శరీర దుర్వాసనకు ఆకర్షితులవుతాయని మనందరికీ తెలుసు, అయితే కొన్ని సుగంధ పరిమళాలు వాటికి నచ్చవు. అలాంటి కొన్ని రకాలు వాసనలొచ్చే మొక్కల్ని పెంచుకుంటే చుట్టూ ఉన్న దోమలు, ఇతర కీటకాల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా దోమల నివారణకు రసాయన రహిత పద్ధతుల ద్వారా దోమలను నివారించే ప్రయత్నాలు చేయాలి.పెరటి మొక్కలులెమన్ గ్రాస్: ఇంట్లో లెమన్ గ్రాస్ చెట్టు పెంచుకుంటే దోమలు రావు. లెమన్ గ్రాస్ కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని ఇంటి బాల్కనీ లేదా మెయిర్ డోర్ దగ్గర ఏర్పాటు చేయాలి. లెమన్ గ్రాస్ వాసనకు దోమలు పారి పోతాయి.నిమ్మ ఔషధతైలం ఈ మొక్కను హార్స్‌మింట్ అని కూడా అంటారు. దీని సుగంధం దోమలను దూరం చేస్తుంది. ఇంకా తులసి మొక్కలు, బంతి పువ్వు మొక్కలు కూడా దోమల నివారణకు పనిచేస్తాయి. వేపాకుల్లో ఔషధ గుణాలు దోమల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిప్పుల్లో వేపాకులు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పొగ ఇంట్లో వ్యాపించేలా చూసుకోవాలి. ఈ పొగ ప్రభావంతో దోమల బెడద క్రమంగా తగ్గుతుంది. వేపనూనె చర్మానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. కర్పూరం సువాసన కారణంగా దోమలను అరికట్టడానికి ఉపయోగించవచ్చు.వెల్లుల్లి ఉత్తమ సహజ దోమల వికర్షకాలలో ఒకటిగా చేస్తుంది. వెల్లుల్లి ఘాటైన రుచి , వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిని నీటిలో వేసి మరిగించి, ఆ నీటికి చుట్టూ పిచికారీ చేయండి. కొబ్బరినూనె, లవంగాలు: దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరినూనె మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే ఫలితం బాగుంటుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో నిల్వ చేసి రోజూ సాయంత్రం చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు.టీ ట్రీ ఆయిల్ ఈ వాసన దోమలకు అస్సలు పడదు. హోం డిప్యూజర్, కొవ్వొత్తులు, క్రీమ్, లోషన్ వంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. అలాగే దోమ కుట్టిన చోట ఈ నూనె రాస్తే దురద తగ్గుతుంది.మస్కిటోకాయిల్స్, రిపెలెంట్స్, ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ఒడోమస్ వంటి ఉత్తమ నాణ్యతగల, హాని చేయని క్రీములు వాడవచ్చు. చిన్న పిల్లలు రాత్రి పూట కాళ్లను పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేయాలి. -
వర్షాకాలంలో ఈ పప్పు ధాన్యాలు తింటున్నారా..?
సూర్యుడి భగభగలు నుంచి చల్లటి తొలకరి చినుకులతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇక ఎప్పుడు ముసురుపట్టి వర్షం పడుతుందో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. ఓ పక్క వంటిట్లో వస్తువులు నిల్వ చేసుకోవడం కష్టమంటే, మరోవైపు వర్షాలకు బ్యాక్టీరయి, వైరస్‌లతో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఊపందుకుంటాయి. ఇలాంటి వర్షాకాలంలో అందుకు తగ్గట్టు మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పలు రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో సవివరంగా చూద్దాం. పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. ఎందకంటే వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. సెనగపప్పు..సెనగపప్పులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్‌ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మసూర్ పప్పు లేదా ఎర్ర పప్పువాటిలో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపానవాయువుకు కారణమవుతుంది.మినపప్పు..ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం, ఉబ్బరానికి దారితీస్తుంది.తినకూడని ఇతర ఆహారపదార్థాలు..వేయించిన ఆహారాలు..వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి కాలేయంపై ఏర్పడుతుంది. పచ్చి ఆకుకూరలు..సలాడ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఈ కాలంలో వాటిని నివారించడం ఉత్తమం. ఆకుల్లో తరుచుగా వ్యాధికారక కీటకాలు ఉంటాయి. వాటిని తొలగించడం కష్టం. అందువల్ల వాటిని బాగా శుభ్రం చేసుకుని తినడం లేదా దూరంగా ఉండటం మంచిది. (చదవండి: -
వర్షాకాలంలో జాంపండు తినకూడదా? ఏమవుతుంది?
వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. సీజన్ ఏదైనా కొన్ని ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు తప్పని సరి. తీసుకునే ఆహారం పట్ల అవగాహన, అప్రమత్తత ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే అపోహలు, అవాస్తవాల పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాంలో జాంపండు తినకూడదని, జలుబు చేస్తుందనే ఒక అపోహ ఉంది. మరి నిజం ఏంటో తెలుసు కుందామా..!సీజన్ ఏదైనా జామకాయను సులభంగా అందరూ తినవచ్చు. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువ , ఫైబర్ ఎక్కువ. ఎదిగే పిల్లలనుంచి, పెద్దవాళ్ల దాకా ఎవరైనా ఈ పండు తినవచ్చు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులుఈ పండ్లకు దూరంగా ఉండాలని కొంతమంది భావిస్తారు. జామపండు తినడానికి తియ్యగా ఉన్నప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. జామలో ఉండే పీచు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.జామ పండులో లభించే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయ పడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో ప్రతిరోజూ తినవచ్చు.జామకాయలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జామపండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ 8 శాతం పెరుగుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక బరువు తగ్గడంలో కూడా జామ అద్భుతంగా పనిచేస్తుంది. క్యాలరీలు తక్కువ. ఇతర పండ్లతో పోలిస్తే జామలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంచుతుంది.నోట్ : అలెర్జీ ఉన్నవారు, జామ తిన్నతరువాత వికారం లేదా పొత్తికడుపులో అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపించినా తినకూడదు. అలాగే తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు ఆహారం విషయంలో వైద్యుల సలహాలను తు.చ. తప్పకుండా పాటించాలి. -
వచ్చే..వానజల్లు : మరి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఉండాలంటే..!
చక్కని మట్టివాసన, స్వచ్ఛమైన, చల్లటి గాలులు...మొత్తానికి వర్షాకాలం వచ్చేసింది. దీంతో మండే ఎండలనుంచి భారీ ఊరట లభించింది. కానీ వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హాయినిచ్చే చిరుజల్లులే జలుబు, జ్వరం, అలెర్జీలు , ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా మోసుకొస్తాయి. ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలూ ఎక్కువే. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే, పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దాం రండి.వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక క్రిములు చెలరేగే అవకాశం ఉంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతంది. తేమ గట్‌లో హానికరమైన బ్యాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇది గట్ ఫ్లోరాకు అంతరాయం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టుతాయి. కలుషితమైన ఆహారం, నీరుతో రోగాలు ప్రబలుతాయి.సాధ్యమైనంతవరకు ఈ సీజన్లో కాలి చల్లార్చిన నీళ్లను తాగాలి. ఆహారాలను కూడా వేడి వేడిగా తినడం ఉత్తమం. వంట ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.పసుపు : మన నిత్యం ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. ఇందులోని కర్కుమిన్ శక్తి వంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి,అలెర్జీ రాకుండా కాపాడుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అంది. ఇది జీర్ణక్రియకు సహాయప డుతుంది. వాపును తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.వెల్లుల్లి: యాంటీబయాటిక్,యాంటీవైరల్ లక్షణాల పవర్‌హౌస్ వెల్లుల్లి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో సాయపడుతుంది.పెరుగు : ప్రోబయోటిక్స్‌తో నిండిన పెరుగు మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆరోగ్య కరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.కాకరకాయ: కాకర యాంటీమైక్రోబయల్లక్షణాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి.రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడతాయి అలాగే ఈ సీజన్లోలభించే బీర,సొర లాంటి తీగ జాతి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.తాజా ఆకుకూరలు : తోటకూర, బచ్చలికూర, పాలకూర తదితర ఆకుకూరలనుఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి,ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.సిట్రస్ పండ్లు: రోగ నిరోధక శక్తిని పెంచే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కీలకమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.తులసి: ఆయుర్వేదంలో తులసి ఔషధ గుణాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాలతో పాటు , తులసి చికాకు కలిగించే అలెర్జీ లక్షణాలతో పోరాడుతుంది. తాజా తులసి ఆకులను నమలవచ్చు. లేదా టీలో నాలుగు తులసి ఆకులు వేసుకున్నా మంచిదే. ముఖ్యంగా చిన్నపిల్లలకు కొద్దిగా అల్లం, తులసి ఆకులతో మరగించిన నీళ్లకు కొద్దిగా తేనె కలిపి తాగిస్తే మంచిది.వీటితో పాటు చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. పిల్లలు, పెద్దవాళ్లు చలినుంచి కాపాడే ఉలెన్ దుస్తులు వాడాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. -
వర్షాకాలంలోపాపాయి పువ్వులాంటి చర్మంకోసం : చిట్కాలివిగో!
మండించే ఎండల నుంచి ఉపశమనంగా వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షంతోపాటు కొన్ని రకాల ఇబ్బందులు, జలుబు, జ్వరం లాంటివి వెంటే వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్న పిల్లలు ఆరోగ్యం, చర్య సంరక్షణ చాలా అవసరం. ఈ నేపథ్యంలో మారికో లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా అందించే చిట్కాలను పరిశీలిద్దాం.పెద్దవారితో పోలిస్తే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది దాదాపు 30శాతం పల్చగా, సుకుమారంగా ఉంటుంది. పెళుసుగా , పొడిగా ఉండి తొందరగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం, ఇన్ఫెక్షన్లు లాంటి వివిధ చర్మ సమస్యలొస్తాయి. పాపాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత, మాయిశ్చరైజేషన్ రెండూ చాలా అవసరం. వర్జిన్(పచ్చి) కొబ్బరి నూతోనె పాపాయి మృదువైన చర్మానికి మసాజ్ చేయాలి.వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆధారిత నరిషింగ్ లోషన్ లేదా క్రీంతో క్రమం తప్పకుండా బేబీ బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. తల్లి పాలలో లభించే పోషకాలుండే ఈ ఆయిల్ శిశువు చర్మాన్ని 24 గంటలూ తేమగా ఉంచేలా సాయపడుతుంది. చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది.బలమైన ఎముకలు, కండరాల అభివృద్ధి , నరాల అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.దీనితో పాటు, బిడ్డకు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాలకి ఉష్ణోగ్రతలు తగ్గి, గాలిలో తేమ పెరుగుతుంది. దీంతో చిన్నారికి చెమటలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక వదులుగా ఉండే దుస్తులను వాడాలి. అలాగే సింథటిక్ దుస్తులు కాకుండా మెత్తటి కాటన్, చలికి రక్షణగా ఉలెన్ దుస్తులను వాడాలి. లేదంటే అధిక చెమటతో, పొక్కులు, దద్దుర్లు వస్తాయి. ఈ సీజన్లో డైపర్లను తరచుగా మార్చుతూ అక్కడి చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి. -
వర్షాకాలంలో చర్మ, ముఖ సౌందర్యం: ఈ పనులు అస్సలు చేయకండి!
మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్లేవాళ్లు, గొడుగు, రెయిన్‌కోట్ లాంటివి కచ్చితంగా తీసుకెళ్లాలి. ఈ సీజన్లో కూడా మాయిశ్చరైజర్ వాడాలా? నీళ్లు ఎక్కువ తాగాలా? తక్కువ తాగాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. వర్షాకాలం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు వర్షాకాలంలో హెవీ మేకప్ కాకుండా, తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి. ఫౌండేషన్ , కన్సీలర్ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్. టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.మేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులుగా మీ చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.తడి జుట్టును అలాగే వదిలేయకుండా సహజంగా ఆరేలా చూసుకోవడం. తప్పదు అనుకుంటే డ్రైయ్యర్ వాడాలి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కండీషనర్ లేదా హెయిర్ సీరమ్‌ని ఉపయోగించండి.అలాగే సున్నితమైన క్లెన్సర్ లేదా మేకప్ రిమూవర్ సాయంతో రాత్రి పడుకునేందుకు మేకప్‌ను పూర్తిగా తొలగించండి. లేదంటే ముఖంపై ఉన్న మేకప్ చర్మానికి హాని చేస్తుంది. మొటిమలు రావచ్చు. అందుకే తేనె వంటి ఇతర సహజ మాయిశ్చరైజర్ పదార్ధాలు ఉన్న సీరమ్‌ను ఎంచుకుంటే మంచిది. -
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్‌హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్‌ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్‌హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్‌హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వరదల ధాటికి పలు చోట్ల రోడ్డు రవాణా స్తంభిస్తోంది. భారీ వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం(జులై )1 వెల్లడించింది.వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. -
ఢిల్లీలో భారీ వర్షం.. మండుటెండల నుంచి ఉపశమనం
దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు(గురువారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎండ వేడిమి నుంచి ఢిల్లీవాసులకు ఉపశమనం లభించింది. ఈసారి ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు కూడా అధికంగా వీచాయి.దేశంలోని తూర్పు రాష్ట్రాలలో రుతుపవనాలు ఇప్పటికే ప్రవేశించాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోనుంది.స్కైమెట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం చివరి నాటికి రుతుపవనాలు ఢిల్లీకి పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 27- 29 తేదీల మధ్య దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. గత ఏడాది జూన్ 26న రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది ఇప్పటికీ ఉత్తరాదిన హీట్‌వేవ్ కొనసాగుతోంది. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ తరుణంలోనే వాతావరణశాఖ రుతుపవనాల రాకకు సంబంధించిన శుభవార్త చెప్పింది. #WATCH दिल्ली: राष्ट्रीय राजधानी के कई हिस्सों में बारिश होने से लोगों को गर्मी से राहत मिली।वीडियो राव तुला राम मार्ग इलाके से है। pic.twitter.com/mkJkJaloVd— ANI_HindiNews (@AHindinews) June 27, 2024 -
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని శనివారం(జూన్22) సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ముంబై వాసులకు వేసవి వేడి నుంచి పూర్తి ఉపశమనం దొరికినట్లయింది. పశ్చిమ తీరం వెంబడి రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కర్ణాటక, కేరళ,గోవాలకు ఐఎండీ ఏకంగా రెడ్అలర్ట్ ప్రకటించింది. ఒడిషాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, యానాంలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ వెల్లడించింది. -
రుతుపవనాలపై ‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య భారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదవగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం రికార్డవగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువ వర్షం పడింది. సాధారణంగా జూన్ 1 నుంచి జులై 8వ తేదీ దాకా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను సమ్మర్ వర్షాలుగా పిలుస్తారు. ఇవి రైతులు విత్తనాలు విత్తుకునేందుకు కీలకమైన వర్షాలు. ‘రుతుపవనాల విస్తరణకు కాస్త బ్రేక్ పడింది. అవి కాస్త బలహీనమయ్యాయి. అయితే అవి ఎప్పుడు బలపడతాయో అప్పుడు కొద్ది సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తాయి’అని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. -
ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆరి్థక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చే వారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూలై 19న, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీఓ జూలై 20న ప్రారంభం కానున్నాయి. బక్రీద్ సందర్భంగా నేడు (సోమవారం) ఎక్సే్చంజీలకు సెలవు. ‘‘వివిధ మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తున్న ‘అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళిక’లను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే సాంకేతికంగా నిఫ్టీకి 22,800–23,100 శ్రేణిలో కీలక మద్దతు లభించే వీలుంది. కొనుగోళ్లు జరిగి 23,600 స్థాయిని చేధించగలిగే 24,000 మైలురాయిని అందుకోవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందనే ఆశలతో గతవారం అభివృద్ధి ఆధారిత రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 77,145 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పంది. నిఫ్టీ 175 పాయింట్లు బలపడి 23,490 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రపంచ పరిణామాలు బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, నార్వేల కేంద్ర బ్యాంకులు ఈ వారంలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడించనున్నాయి. దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపొచ్చనేది ఆరి్థకవేత్తల అంచనా. యూరోజోన్ మే ద్రవ్యోల్బణం డేటా మంగళవారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) బుధవారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పరపతి సమావేశం గురువారం, అమెరికా జూన్ ప్రథమార్థపు సేవా, తయారీ రంగ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.గతవారంలో రూ.11,730 కోట్ల పెట్టుబడులు ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఆచూతూచి వ్యవహరించిన విదేశీ ఇన్వెస్టర్లు తరువాత దేశీయ మార్కెట్లోకి బలమైన పునరాగమనం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, రానున్న బడ్జెట్లో ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయనే ఆశలతో భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. గత వారం (జులై 14తో ముగిసిన వారం)లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో నికర అమ్మకాలు (జూన్ 1– 14 వరకు) రూ.3,064 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ‘‘దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆరి్థక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచింది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. -
బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం(జూన్2) రికార్డుస్థాయిలో భారీ వర్షం పడింది. 133 ఏళ్ల తర్వాత ఒక్కరోజులోనే 111.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1891 సంవత్సరంలో జూన్16న బెంగళూరులో ఒక్కరోజులోనే కురిసిన 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు ఆదివారం పడిన వర్షంతో చెరిగిపోయింది. నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఈస్థాయిలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.తాజాగా బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 3నుంచి5వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించింది. -
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా -
‘నైరుతి’ వచ్చేస్తోంది
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 31 నాటికల్లా ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమ వారం తెలిపింది. నిరీ్ణత సమయానికి మూడ్రోజులు ముందుగా అంటే ఈనెల 19న అండమాన్ సముద్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇవి చురుగ్గా కదులుతుండగా సోమవారం నాటికి బంగాళాఖాతం, శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేనెల 1, 2 తేదీల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.వాతావరణ పరిస్థితులు ఏమైనా మారితే ఒకట్రెండు రోజులు ఆలస్యమై 3, 4 తేదీల నాటికి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముంది. మొత్తంగా ఐదో తేదీలోపే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రుతు పవనాలు చురుగ్గా ఉండడంతో వచ్చేనెల మొదటి వారంలో రాయలసీమలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. రెమల్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఈ తుపాను బంగ్లాదేశ్ వైపు కదిలి ఆ పరిసరాల్లోనే తీరం దాటడంతో రుతు పవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండ్రోజుల్లో అవి చురుగ్గా కదిలాయి. రైతులకు ఎంతో ఊరట.. జూన్‌లో రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు కురవనున్నాయని సోమవారం విడుదల చేసిన రెండో దశ దీర్ఘకాలిక నెలవారీ అంచనా నివేదికలో ఐఎండీ పేర్కొంది. ఈ సమాచారం రైతాంగానికి ఎంతగానో ఊరటనిస్తోంది. గత ఏడాది వారం రో జులు ఆలస్యంగా అంటే జూన్ 8న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం వర్షాలు అరకొరగానే కురిశాయి. పైగా రాష్ట్రంలో జూన్ అంతా మే నెలను తలపించేలా వడగాడ్పులు కొనసాగాయి.ఫలితంగా జూన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఖరీఫ్ పనులు ముందుకు సా గలేదు. ఆపై జూలై, ఆగస్టుల్లో సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో గతేడాది రైతులకు నైరుతి రుతుపవనాలు నిరాశను, నష్టాలను మిగిల్చాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా, అనుకూలంగా మారుతున్నాయి. ఎల్‌నినో బలహీనపడుతూ జూన్ మధ్య నుంచే లానినా పరిస్థితులేర్పడుతున్నాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురవడానికి దోహద పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మూడ్రోజులు వడగాడ్పులు.. ఇదిలా ఉంటే.. రెమాల్ తీవ్ర తుపాను ఫలితంగా గాలిలో తేమను తుపాను ప్రాంతం వైపు లాక్కుపోయింది. దీంతో.. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీనికి తోడు రోహిణి కార్తె కూడా రెండ్రోజుల క్రితమే మొదలైంది. వీటివల్ల రానున్న మూడ్రోజులు సాధారణంకంటే 4–8 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్టంగా కొన్నిచోట్ల 49 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల మళ్లీ వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. టకాగా, మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 160 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం 27, పార్వతీపురం మన్యం 15, అల్లూరి సీతారామరాజు 2, విశాఖపట్నం 6, అనకాపల్లి 20, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పు గోదావరి 18, పశి్చమ గోదావరి 4, ఏలూరు 7, బాపట్ల 1, కృష్ణా 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ⇒ అలాగే, వడగాడ్పులు శ్రీకాకుళం జిల్లాలో 8, అల్లూరి 8, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 3, కోనసీమ 8, తూర్పుగోదావరి 1, పశ్చిమ గోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎనీ్టఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 15, బాపట్ల 20, ప్రకాశం 6 మండలాల్లోను వీయనున్నాయని వివరించింది. ⇒ ఇక బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ⇒ సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9, మనుబోలు (నెల్లూరు) 41.5, వేమూరు (బాపట్ల), పెడన (కృష్ణా) 40.9, చింతూరు (అల్లూరి) 40.8, డెంకాడ (విజయనగరం) 40.7, రావికమతం (అనకాపల్లి) 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్లో వర్షాలే వర్షాలు.. ఈ సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతాలు నమోదవుతాయని తెలిపింది. రుతు పవనాలు వేగంగా విస్తరిస్తుండడంతో మంచి వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. అలాగే, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వాయవ్య భారతంలో సాధారణ వర్షపాతం, మధ్య, దక్షిణ భారతదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో అంచనా వేశారు. జూన్–సెప్టెంబర్ కాలంలో దీర్ఘకాల సగటు 87 సెం.మీ. వర్షపాతంలో 106 శాతం మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు. -
ఐదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
తిరువనంతపురం: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో 5 రోజుల్లో కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని తెలిపింది. కేరళను తాాకిన తర్వాత రుతుపవనాలు సకాలంలో తర్వాత దేశమంతా విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈసారి దేశంలో సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఈశాన్యంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వెల్లడించింది. రానున్న ఐదురోజుల్లో పశ్చిమ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ఈ నెలాఖరువరకు కొనసాగుతాయని తెలిపింది. -
జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. కాగా, బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. సోమవారం(మే20) నుంచి మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఈ 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
మే 19కల్లా అండమాన్‌కు రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మే19కల్లా దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం(మే13) తెలిపింది. నిజానికి దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు మే 22న చేరుకోవాల్సి ఉంది.అయితే రెండు రోజుల ముందే రుతుపవనాలు అక్కడికి చేరుకోనున్నాయని తెలిపింది. కేరళకు రుతుపవనాలు జూన్1న రానున్నట్లు వెల్లడించింది. కేరళ నుంచి ముందుకు కదలి దేశవ్యాప్తంగా జులై 15వ తేదీ కల్లా రుతుపవనాలు వ్యాపించనున్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల వల్ల ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ఐఎండీ మే చివరి వారంలో ఇవ్వనుంది. -
మండే ఎండల్లో కూల్ న్యూస్..‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఎండలు మండుతున్న వేళ దేశ వాసులకు భారత వాతావరణ శాఖ( ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దేశంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 87 సెంటీమీటర్లుగా ఉండగా ఈ ఏడాది ఇందులో 106 శాతం వర్షపాతం రికార్డయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మధ్య పసిఫిక్ సముద్రం మీదుగా ఎల్‌నినో(వర్షాభావ) పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది మెల్లగా తొలగిపోతూ రుతుపవనాలు ప్రారంభమయ్యే సరికి తటస్థ స్థితి(ఈఎన్ఎస్ఓ) ఏర్పడుతుందని వెల్లడించింది. కాగా, భారత్‌లోని ఏకైక ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. స్కైమెట్ అంచనాలు ఐఎండీ అంచనాలకు దగ్గరగా ఉండటం విశేషం. ఇదీ చదవండి.. నేటితో హిమాచల్‌కు 76 ఏళ్లు -
మండు వేసవిలో చల్లని కబురు.. గుడ్ న్యూస్ చెప్పిన ‘స్కైమెట్’
న్యూఢిల్లీ: వేసవిలో ఎండలు దంచి కొడుతున్న వేళ చల్లని కబురు అందింది. ‘స్కైమెట్’ సంస్థ ఈ చల్లని కబురు మోసుకువచ్చింది. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు సమయానికి వస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం వర్షపాతం(102శాతం) నమోదవుతుందని వెల్లడించింది. అయితే ఈ అంచనాకు 5శాతం అటూ ఇటు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. సాధారణంగా రుతపవనాల సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు లాంగర్ పీరియడ్ సగటు(ఎల్పీఏ) వర్షపాతం 868.6మిల్లీమీటర్లు. దీనిలో 96 శాతం నుంచి 104శాతం వరకు వర్షం పడే అవకాశాలుంటే దీనిని సాధారణ వర్షపాతంగా పిలుస్తారు. జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనాల్లోనూ ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ తెలిపింది. తాజా అంచనాలపై స్కైమెట్ ఎండీ జతిన్‌సింగ్ మాట్లాడుతూ‘ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు వేగంగా లానినాగా మారుతున్నాయి. సాధారణంగా ఎల్‌నినో, లానినాగా మారుతున్నపుడు రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. గతంలో లానినా వల్ల కురిసిన వర్షపాతమే ఇందుకు నిదర్శనం. అయితే ఎల్‌నినో ముగింపు దశలో ఉన్నందున రుతుపవనాల ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అయితే రుతుపవనాల రెండో దశలో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయి. లానినాతో పాటు ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐఓడీ) పరిస్థితులు కూడా ఈసారి సమయానికి రుతుపవనాలు రావడానికి, దేశమంతా వాటి విస్తరణకు దోహదం చేయనుంది. రుతుపవనాల వల్ల దక్షిణ భారతంతో పాటు దేశంలోని పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సరిపడా వర్షాలు పడతాయి. బిహార్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల్లో మాత్రం జులై, ఆగస్టు నెలల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్సుంది. ఇక ఈశాన్య భారతంలోనూ జూన్, జులై, ఆగస్టుల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి’అని తెలిపారు. ‘స్కైమెట్’ ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం అంచనాలు.. సాధారణం వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 10 శాతం అవకాశాలున్నాయి(లాంగర్ పీరియడ్ సగటు(ఎల్పీఏ) దాటి 110 శాతం వర్షపాతం ) సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయి(ఎల్పీఏ దాటి 105 శాతం నుంచి 110శాతం మధ్య వర్షపాతం) సాధారణ వర్షపాతం కురిసేందుకు 45 శాతం చాన్స్( సరిగ్గా ఎల్పీ సగటు 96 శాతం నుంచి 104 శాతం వర్షాలు) సాధారణ కంటే తక్కువ వర్షపాతానికి 15 శాతం చాన్స్(ఎల్పీ సగటు 104 శాతానికి దిగువ 90 నుంచి 95 శాతం వర్షాలు) కరువుకు 10 శాతం చాన్స్(ఎల్పీ సగటులో 90 శాతం వర్షాలు మాత్రమే) ఈ సీజన్లో ‘స్కైమెట్’ నెల వారి వర్షపాత అంచనాలు.. జూన్-ఎల్పీఏలో 95 శాతం వర్షపాతం (165.3 మిల్లీమీటర్లు) జులై-ఎల్పీఏలో 105 శాతం వర్షపాతం(280.5మిల్లీమీటర్లు) ఆగస్టు-ఎల్పీఏలో 98 శాతం వర్షపాతం(254.9మిల్లీమీటర్లు) సెప్టెంబర్-ఎల్పీఏలో 110 శాతం వర్షపాతం(167.9మిల్లీమీటర్లు) ‘స్కైమెట్’ ఏం చేస్తుంది..? భారత్‌లో వాతావరణ ముందస్తు అంచనాలు వెల్లడించే ఒకే ఒక ప్రైవేట్ సంస్థ స్కైమెట్. వ్యవసాయ రంగానికి స్కైమెట్ వెల్లడించే వాతావరణ అంచనాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. సమీప భవిష్యత్తులో వాతావరణాన్ని బట్టి పంటలు నిర్ణయించుకునే వెసులుబాటు స్కైమెట్ ద్వారా రైతులకు లభిస్తోంది. సాటిలైట్లు, మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడి రుతుపవనాల రాకకు సంబంధించి ముందస్తు అంచనాలు వెల్లడించడంలో స్కైమెట్ పేరుగాంచింది. -
AP: వచ్చే నెల వర్షాలే వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే నెల ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ సీజన్లో కొద్దిరోజులుగా కానరాని వర్షాలు నాలుగైదు రోజుల్లో తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి. ⛈️ ఆగస్టులో వర్షాల జాడ లేదు. ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. ఆ మధ్య సమయంలోనే కొద్దిరోజుల పాటు బ్రేక్ మాన్సూన్ (వర్షాలకు విరామం) ఏర్పడి వానలకు అడ్డుకట్ట వేస్తుంది. ⛈️ అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు. ⛈️ ఈ ద్రోణి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ⛈️ రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకు మించి ఒకింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ కూడా అంచనా వేసింది. జాడలేని అల్పపీడనాలు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్‌నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
‘కలుపు’కొని తినాలి..
వర్షాకాలంలో పంట పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకొనేందుకు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వచ్చిన కొందరు సందర్శకులకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్‌తండా, ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామాల్లో సహజ ఆకుకూరల ప్రాధాన్యం గురించి వివరించారు. అవి ఏ మేరకు ఆరోగ్యాన్ని అందిస్తాయో సభ్యులు చెప్పారు. వర్షాకాల పంటల్లో పలు రకాల కలుపు మొక్కలు వస్తాయని.. వాటిని రైతులు తొలగిస్తుంటారని.. కానీ వాటిలోనూ ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక పోషకాలు కలిగి ఉన్నాయని సందర్శకులకు మహిళా రైతులు చిందిబాయి, రాజీబాయి తెలియజేశారు. కలుపు మొక్కల్లో వందకుపైగా రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకోవచ్చని చెప్పారు. – జహీరాబాద్ ప్రదర్శన ద్వారా అవగాహన పొలాల్లో సహజంగా పండే ఆకుకూరల గురించి సందర్శకులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు డీడీఎస్ సభ్యులు వారిని పొలాల్లో తిప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఏయే ఆకుకూరలో ఎలాంటి పోషకాలు ఉంటాయనే అంశాన్ని వివరించారు. చక్కెర వ్యాధి నివారణకు ఉపయోగపడే ఆకుకూరలతోపాటు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఎలాంటి ఆకుకూరలు తినాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణిరావు, రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు అనితకుమారి, సంస్థ సభ్యులు మంజుల, పెద్ద నర్సమ్మ, చిన్న నర్సమ్మ, అల్గోల్ నర్సమ్మ, మాణిక్యం, రోజా, మయూరి పాల్గొన్నారు. నోరూరించిన వంటకాలు పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరలతో వంట లు వండారు. ఆయా వంటకాలను సందర్శకులకు వడ్డించారు. మార్కెట్లో లభించే ఆకుకూరల కంటే ఇవి రుచిగా ఉన్నాయని పలువురు అన్నారు. కలుపు మొక్కలుగాభావిస్తున్న వాటిలో కొన్ని... అత్తిలి, పిట్టకూర, సన్న పాయలు, బంకంటికూర, చెన్నంగి, ఎన్నాద్రి, ఉత్తరేణి, గునుగు, బుడ్డకాశ, గోరిమడి, తెల్లగజ్జర, తకడదొబ్బుడు, జొన్న చెంచలి, పుల్లకూర, తగరంచ, ఎలుకచెవుల కూర, అంగిబింగి, పప్పుకూర, అడవి మెంతెంకూర, తుమ్మికూర, గురిమాసి, అడవి పొన్నగంటి అలం, నల్లకాశ, దూసరి, తలాయిలా, రేలపప్పు, తెల్లవార్జంపువ్వు, గురిమాసిగడ్డ, చిత్రమాలం, పొనగంటి, పల్లెరుకాయ, పొలపత్రం, బంకటి ఇలా అనేక రకాల ఆకు కూరలు సహజంగా లభిస్తాయి. ఆకుకూరల్లో పోషక విలువలు... ఆకుకూరలు ఆరోగ్య సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు అన్ని ఆకుకూరల్లో క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్–సి, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. సహజ ఆరోగ్యం పొందవచ్చు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజంగా ఆకు కూరలు లభ్యమవుతాయి. ఇవి సేంద్రియ విధానంలో వస్తున్నందున మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. – నర్సింహారావు, రిటైర్డ్ ఉద్యోగి, హైదరాబాద్ ఎన్నో ఆకుకూరల గురించి తెలుసుకున్నాం ఆకుకూరల్లో ఇన్ని రకాలు ఉంటాయనే విషయం నాకు తెలియదు. కలుపు మొక్కలుగా భావిస్తున్న ఆకుకూరల్లో అనేక పోషకాలు నిండి ఉన్నాయనే విషయం ఇప్పుడే తెలిసింది. వీటి గురించి తగిన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. – లిఖిత, బీటెక్ విద్యార్థిని, హైదరాబాద్ ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిసింది సహజంగా వచ్చే ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. వాటి గురించి తెలుసుకునేందుకే వచ్చా. – స్వప్న, గృహిణి, హైదరాబాద్ -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
కాళేశ్వరం కింద 97,170 ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ సమావేశమై వానాకాలంలో వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ నిండి ఉన్న నేపథ్యంలో వాటి కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరదలను పరిగణనలోకి తీసుకుని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల కింద 36.81లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. రాష్ట్రంలో 13,16,557 ఎకరాల ఆరుతడి, 23,64,530 ఎకరాల వరి పంటకు కలిపి మొత్తం 342.43 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం కింద 71600 ఎకరాల వరి, 25570 ఎకరాల ఆరుతడి పంటలు కలిపి మొత్తం 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని కమిటీ ప్రతిపాదించింది. -
అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!
ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్ ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి. ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!) -
కండ్లకలక వస్తే అలా మాత్రం చేయకండి, కంటిచూపు పోతుంది
కండ్లకలక.. దీన్నే పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలే వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే ప్రజలకు కండ్లకలక ఇప్పుడు మరో సమస్యగా మారింది. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. కండ్లకలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లను చూసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కంటిలో చిన్న నలక పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలక వచ్చిన రోగి నుంచి ఈజీగా ఎనిమిది మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది.ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. వ్యాధి నయం కావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కండ్లకలక లక్షణాలు కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. కంటి నుంచి కంటిన్యూగా నీరు కారుతుంది, కంటిరెప్పలు ఉబ్బిపోతాయి. సరిగా చూడలేకపోవడం, లైట్ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం దీని లక్షణాలు కండ్లకలక వస్తే జ్వరం, తేలిపాటి గొంతునొప్పి కూడా బాధిస్తుంది. కండ్లకలక వస్తే ఏం చేయాలి? కండ్లకలక సోకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్ వాడొచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి. కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించాలి. కండ్లకలక వస్తే ఇలా అస్సలు చేయొద్దు కండ్లకలక చిన్న సమస్యే అని సొంత వైద్యం చేసుకోవద్దు కళ్లను తరచూ తాకొద్దు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతంది ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పడు జనంలోకి తిరగడం వంటివి చేయొద్దు సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 #Conjuctivitis#HealthForAll#SwasthaBharat pic.twitter.com/1r7hp7II4D — Ministry of Health (@MoHFW_INDIA) August 2, 2023 వాళ్లను చూస్తే కండ్లకలక వస్తుందా? కండ్లకలక వచ్చినవారిని నేరుగా చూస్తే ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకుతుందా? అంటే అది ఒట్టి అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. వైరల్ కన్జక్టివిటిస్ ఉన్న వాళ్లను చూస్తే ఇది వ్యాపించదు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుంది. కండ్లకలక వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను తాకడం, ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి అంటుకుంటుంది. అలాగే వాళ్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల నుంచి కూడా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకానీ కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంత మాత్రాన్నే వ్యాధి సోకే అవకాశమే లేదు. ఇక సన్ గ్లాసెస్ లేదా ముదురు కళ్లద్దాలు ధరించడం వల్ల కండ్లకలక ఇతరులకు వ్యాపించదు అనే సందేహం చాలామందికి వెంటాడుతుంది. కానీ ఇందులో నిజం లేదు. కళ్లద్దాలు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధిని నిరోధించే ఛాన్స్ లేదు. ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
..వాళ్లొచ్చింది వరద ప్రాంతాల పరిశీలనకట!
-
షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!
వర్షాలు కొన్ని ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొస్తాయి. మరికొన్ని వ్యాధుల్ని మరింతగా పెచ్చరిల్లేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో! వాళ్లతో పాటు పెద్దల్లో కూడా. ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యే. సామాన్యజనం పరిభాషలో ‘నెత్తుటిబంక విరేచనాలు’ అంటారు. విరేచనాలవుతూ ఉండగా అందులో కొద్దిగా రక్తం, మరికొద్దిగా చీములా పడుతుండటంతో ఈ పేరు. షిజెల్లా అనే ప్రజాతికి చెందిన ఓ బ్యాక్టీరియాతో వచ్చే సమస్య ఇది. కలుషితమైన నీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నీరు కలుషితం అవ్వడానికి అనువుగా ఉండే ఈ సీజన్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. షిజెల్లోసిస్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. మానవ విసర్జకాలతో కలుషితమైన నీరు తాగడం వల్ల, ఆ నీటితో చేసిన వంటల వల్ల షిజెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిం, మానవ జీర్ణవ్యవస్థలోకి చేరి, విరేచనాలు మొదలవుతాయి. ఈ విరేచనాలు కాస్త జిగటగా, నెత్తురుతో ఉండటంతో మామూలు వాటికంటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. పిల్లల్లో అందునా ఐదేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూస్తుంటారు. లక్షణాలు: విరేచనాల్లో బంక (మ్యూకస్), నెత్తురు కనిపించడం. కడుపు పట్టేసినట్లుగా అనిపించడం (స్టమక్ క్రాంప్స్), కడుపు నొప్పి జ్వరం (జ్వరతీవ్రత 101 ఫారెన్‌హీట్ వరకు ఉండవచ్చు) వికారం, కొన్నిసార్లు వాంతులు. వ్యాప్తి ఇలా... ∙కలుషితాహారంతో : షిజెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన నీటితో తయారు చేసిన ఆహారంతో లేదా ఆ నీళ్లు తాగడం వల్ల; లేదా ఆ నీటిలో ఈదినప్పుడు నోట్లోకి వెళ్లినప్పుడు మింగడం వల్ల. వ్యక్తి నుంచి వ్యక్తికి: ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న వ్యక్తి తన పెదవుల్ని చేతులతో తాకాక అవే చేతుల్ని ఇతరులు ముట్టుకున్నప్పుడు. ఇది పిల్లల డే కేర్ సెంటర్లలో, పిల్లలను ఆడిపించే క్రష్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ ద్వారా... అలాగే హైజీన్ తక్కువగా ఉండే విద్యార్థుల హాస్టల్స్, మెస్‌లు, క్యాంపస్‌లలో వ్యాపించే అవకావం ఎక్కువ. ఇక ప్రయాణాల్లో అంతగా పరిశుభ్రత పాటించని హోటళ్ల వల్ల కూడా ఒకరినుంచి మరొకరికి పాకవచ్చు. కొన్నిసార్లు కాంప్లికేషన్లు... డీ–హైడ్రేషన్‌తో : విరేచనాల కారణంగా దేహంలోని ద్రవాలను కోల్పోవడంతో డీ–హైడ్రేషన్‌కు గురికావచ్చు. ఫలితంగా తల తిరగడం (డిజ్జీనెస్); తేలిగ్గా అనిపించడం (లైట్ హెడెడ్నెస్); పిల్లల్లో కన్నీళ్లు కూడా కనిపించకపోవడం, కళ్లు లోతుకుపోయినట్లుగా కనిపించడం... మరీ చిన్నపిల్లల్లో ఈ పరిస్థితులు తీవ్రమైతే ఒక్కోసారి షాక్కూ... అటు తర్వాత ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. మూర్ఛ (సీజర్స్) : కొంతమంది పిల్లల్లో మూర్ఛ (సీజర్స్) కనిపించవచ్చు. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకావాలు ఎక్కువ. ∙మలద్వారం చివరి భాగం బయటికి జారడం (రెక్టల్ ప్రొలాప్స్) : జిగురుతో కూడిన మ్యూకస్ బంకలా పడటం వల్ల మలద్వారం చివరి భాగం బయటకు జారే అవకాశం ఉంటుంది. దీన్నే రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. హీమోలైటిక్ అనీమియా : ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు అయినప్పటికీ కొట్టి పారేయలేని సమస్య. నెత్తుటి విరేచనాలు అవుతుండటంవల్ల ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం (హీమోలైటిక్ అనీమియా), ప్లేట్లెట్స్ తగ్గడం (థ్రాంబోసైటోపీనియా)... చాలా అరుదుగా ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కనిపించవచ్చు. టాక్సిక్ మెగాకోలన్: ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు. ఇందులో పేగుల కదలిక (బవెల్ మూవ్మెంట్) మందగించి మలం ముందుకు కదలడం ఆగిపోవచ్చు. దాంతో గ్యాస్‌గానీ, మలవిసర్జన గానీ జరగకపోవచ్చు. ఇలాంటి వైఫల్యం కనిపింనప్పుడు దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిం వెంటనే చికిత్స తీసుకోకపోతే పెద్దపేగు గాయపడటంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీసే ప్రవదం ఉంటుంది. బ్యాక్టీరిమియా : షిజెల్లా ఇన్ఫెక్షన్తో పేగుల లోపలి లైనింగ్ దెబ్బతినవచ్చు. దాంతో ఇలా దెబ్బతిన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఇది కాస్త అరుదు. నివారణ కేర్‌ఫుల్ డిస్పోజల్ ఆఫ్ డయపర్స్ : చిన్న పిల్లల డయపర్స్ను జాగ్రత్తగా పారేయాలి. వీటిని నీటివనరు (వాటర్ సోర్స్)తో కలవనివ్వకుండా జాగ్రత్తపడాలి. అప్పటికే విరేచనాల, నీళ్ల విరేచనాల, నెత్తుటిబంక విరేచనాలతో బాధపడుతున్నవారు... వంట చేయడం సరికాదు. వాళ్లు కిచెన్ నుంచి దూరంగా ఉండాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్ టాయెలెట్ హ్యాబిట్స్: పిల్లలకూ చేతులు కడుక్కునే అలవాటు నేర్పాలి. స్ల్స్కూ, పిల్లల కేర్ సెంటర్స్, ఆటస్థలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, వాళ్ల టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్‌లో లేదా పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈదుతున్నప్పుడు ఆ నీటిని మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు, వాగుల వంటి నీటి వనరు నుంచి తెచ్చిన నీటిని కాచి వడబోయకుండా తాగవద్దు. అలాగే పట్టణాల్లోన కొళాయి/నల్లా నీటిని శుభ్రం చేయడం, వడబోయడం వంటివి చేయకుండా వాడకూడదు. --డాక్టర్ శివనారాయణ రెడ్డి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
అలోవెరా జెల్‌తో ఇలా చేస్తే..అందమైన కురులు మీ సొంతం!
వర్షాకాలంలో జుట్టు డల్‌గా ఉంటుంది. దీనికి తోడు వర్షంలో అప్పడప్పుడూ తడవడంతో చుండ్రు, చిట్లడం, రఫ్‌గా తయారవ్వడం వంటి సమస్యలు ఎదరువ్వతాయి. ఈ సమస్యల నుంచి మీ శిరోజాలను కాపాడుకోవాలంటే ఈ జ్రాగత్తలు తీసుకోవాల్సిందే. మనం నిత్యం చూసే, అందుబాటులో ఉండే వాటితో ఈజీ జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. వర్షాకాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే.. ►తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు గోరువెచ్చని నూనె వెంట్రుకు కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు మృదుత్వాన్ని కోల్పోవు. ►తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్ రాసుకొని, పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా జెల్లో ఉండే ఔషధ గుణాలు చుండ్రును, వెంట్రుకలు చిట్లడాన్ని నివారిస్తాయి. దీంతో పాటు శిరోజాలలో ఉండే బాక్టీరియా, మాడుపై దురద.. వంటి సమస్యలను నివారిస్తాయి. వెంట్రుకలు పెరగడానికి కూడా దోహదం చేస్తాయి. ►తలస్నానానికి రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూలనే వాడాలి. ►తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సోయాబీన్, గుడ్లు, కొవ్వు తక్కువగా ఉండే ఛీజ్, బీన్స్.. వంటివి ఉండేలా జాగ్రత్తపడాలి. ►తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన సలాడ్స్ ఈ కాలం తీసుకోవడం చాలా అవసరం. అలాగే మొలకెత్తిన గింజలను సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఆహారంలో ఈ తరహా పదార్థాలు చేర్చడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అంది జుట్టు రాలడం తగ్గుతుంది. ►కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ వెంట్రుకలు రాలడానికి దోహదం చేస్తుంది. కాఫీ, టీలకు బదులుగా పండ్లరసాలు, పాలు, హెర్బల్ టీ... వంటి కెఫెన్ లేని ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యల నుంచి సులభంగా బయటపడోచ్చు. చిట్కాల తోపాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. (చదవండి: వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!) -
వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!
వానల్లో... మొన్నటిదాకా మండించిన ఎండలు ఇప్పుడు చల్లటి వర్షాలను తీసుకువచ్చాయి. వర్షాకాలం అంటే ఇష్టం లేనిదెవరికి? ముఖ్యంగా పిల్లలకు మరీ ఇష్టం. ఎందుకంటే కాస్త గట్టి వానలు పడితే సెలవలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ అంతా భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో వానాకాలం సెలవలే. సెలవల వరకు బాగానే ఉంది కానీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన పెద్దలకు మాత్రం కాస్త కష్టమే. ఆ మాటకొస్తే అంటువ్యాధులు ప్రబలే ఈ కాలంలో పెద్దవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం... వానరాకడా... మరొకటీ తెలియదని సామెత. ఒక్కోసారి మబ్బులు పట్టిన ఆకాశం ఉరుముతూ వర్షాలకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఒకోసారి ఏవిధమైన హెచ్చరికలూ చేయకుండానే వర్షం వచ్చి మీదపడుతుంది. అందువల్ల వాతావరణ హెచ్చరికల గురించి తెలుసుకోవడం మంచిది. తగిన దుస్తులు: వర్షాకాలంలో పిల్లలే కాదు, ఎవరైనా సరే, తేలికగా ఆరిపోయే దుస్తులు ధరించడం మంది. తేలికపాటి దుస్తులను పిల్లలకు ధరింపజేయాలి. అసౌకర్యం, చికాకు కలిగించే దుస్తులను ఈ కాలంలో వారికి తొడగకపోవడం చాలా మంది. పాదరక్షల ఎంపిక: వర్షాకాలంలో మీ పిల్లలకు తగిన పాదరక్షలను ఎంచుకోండి. తడి ఉపరితలాలపై జారకుండా నిరోధించడానికి మంచి ట్రాక్షన్‌తో ఉండే వాటర్‌ప్రూఫ్ బూట్లు లేదా చెప్పులను ఎంచుకోండి. దోమల నుంచి రక్షణ: వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దోమల నిరోధకాలను లేదా దోమతెరలను ఉపయోగించడంతోపాటు ఇంటి చుట్టూ దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా వరే నీటి వనరులు ఉండకుండా చూసుకోవడం మంచిది. పరిశుభ్రత పద్ధతులు: పిల్లలకు మంచి పరిశుభ్రత అలవాట్లను నేర్పాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడాన్ని నొక్కి చెప్పండి, భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ఇంటి ఆవరణలో నిలిన నీరు, నీటి కుంటలు లేదా మురికి గుంటలు ఉన్న ప్రదేశాలలో ఆడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురిం పిల్లలకు అవగాహన కల్పించండి. అటువంటి నీటిలో వ్యాధులకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి కాబట్టి నిల్వ ఉన్న నీటి లో ఆడకుండా చూడండి. ఆహార భద్రత: వర్షాకాలంలో ఆహార పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ అవసరం. స్ట్రీట్ ఫుడ్ లేదా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో నిల్వ ఉండే ఆహారం తీసుకోకుండా చూడాలి. పండ్లు, క్యారట్, బీట్రట్ వంటి పచ్చి కరగాయలను తినేముందు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి చేయడం అవసరం. తగినంత వెంటిలేషన్: భారీ వర్షాల సమయంలో కిటికీలు మూసి ఉంచడం చాలా కీలకమైనప్పటికీ, మీ ఇంటిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం తేమ పెరగకుండా నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలర్జీలు, ఆస్తమా నిర్వహణ: మీ పిల్లలకు అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నట్లయితే, వర్షాకాలం వారి ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే మీ ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం, అవసరమైతే తగిన మందులను సిద్ధం చేసుకోవడం మంచిది. పరిశుభ్రమైన నీరు: కాచి చల్లార్చిన నీటిని తాగడం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. రింగ్వార్మ్: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎరుపు, రింగ్–ఆకారపు దద్దురును కలిగిస్తుంది. దురద లేదా పొలుసులుగా ఉంటుంది. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు, తలమీద, గజ్జల్లో , పాదాలపై సర్వసాధారణంగా ఉంటుంది. దీని బారినుంచి పిల్లలను రక్షించుకోవాలి. ఈ కాలంలో రోజువారీ తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్ మారుతున్న సీజన్‌తో, ఆహార శైలులను కూడా మార్చడం అత్యవసరం. వ్యాధులు పెరుగుతున్న సమయంలో కొన్ని ఆహారాలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవాలి. పసుపు కలిపిన పాలు, శొంటి కషాయం, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం, మొలకలు వంటి ఆరోగ్యకరమైన రుతిండి ఇవ్వాలి. పెరుగు వంటి ప్రోబయోటిక్స్ పిల్లల్లో మం బ్యాక్టీరియాను పెంచటానికి సహాయపడుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఏదోరకంగా పిల్లలకు ఇవ్వాలి. తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి: ఈత లేదా స్నానం చేసిన తర్వాత పూర్తిగా శరీరాన్ని ఆరనివ్వటం మంచిది. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..) -
పది రోజుల్లో నాలుగింతల వాన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా గత పది రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేశాయి. పది రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధా రణం కంటే 22.11 సెంటీమీటర్లు (65 శాతం) అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత పదిరోజుల వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణం కంటే ఏకంగా నాలుగింతలు అధికంగా వర్షాలు కురిశాయి. లోటు నుంచి అధికం వైపు వాస్తవానికి ఏటా నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ప్రా రంభమవుతుంది. ఆ నెల తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వానలు మొదలవుతాయి. కానీ ఈసారి జూన్ నాలుగో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఒకట్రెండు రోజులు మోస్తరు వానలు పడ్డాయి. తర్వాత రుత పవనాల కదలికలు మందగించి వర్షాలు జాడ లే కుండాపోయాయి. దీనితో లోటు పెరుగుతూ వచ్చింది. ఈ నెల 18 నాటికి 19.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 54శాతం లోటు. కానీ 18వ తేదీ నుంచి వానలు మొదలయ్యాయి. తర్వాతి పది రోజులకుగాను 8రోజులు వానలు పడ్డాయి. దీనితో వర్షపాతం 54 శాతం లోటు నుంచి ఏకంగా 65 శాతం అధికానికి చేరింది. అంతటా కుండపోత వానలతో.. గత పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతిభారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక తొమ్మిది జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్లపైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. -
విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు జలకళను సంతరించుకోవడంతో వీటిని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలువురు ప్రమాదానికి గురై మృతి చెందుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలోనే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. పెద్దపల్లి మండలం సబితం జలపాతం(గౌరీ గుండాల జలపాతం) వద్ద బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి యువకుడు మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చారు. జలపాతం వద్ద ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. చదవండి: ముగ్గురి హత్యలతో విషాదంగా ముగిసిన లాక్డౌన్ ప్రేమ.. చంటి బిడ్డతో పోలీస్ స్టేషన్‌కు -
Conjunctivitis: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా?
వర్షాకాలం కారణంగా గత కొన్ని రోజులుగా దేశంలో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సీజన్‌కి తగ్గట్టుగా వచ్చే వ్యాధులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ తరుణంలో పెరుగుతున్న కండ్లకలక కేసులు మరింత కలవారుపాటుకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తేమతో కూడిన వాతావరణం కావడంతో వైరస్లు, బ్యాక్లీరియాలు పెరిగేందుకు ఇది కాస్త అనుకూలంగా ఉంటుంది. దీంతో దేశంలో కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఈశాన్యా రాష్ట్రాలలోని చిన్నారులు అధికంగా ఈ వ్యాధి భారిన పడ్డారు. అంతేగాదు మహారాష్ట్రలోని పూణేలో అలంది అనే పట్టణంలో కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 2,300 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఇక అరుణాచల్‌ప్రదేశ్ అయితే కండ్లకలక వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. యమునా నది వరద కారణంగా ఢిల్లీలో ఈ కంటి ఇన్ఫెక్షన్లు గతేడాదికంటే అధికంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు కండ్లకల అంటే ఏమిటి? వర్షాకాలంలో ఇది వస్తుందా? తదితరాలు గురించి చూద్దాం!. 'ఐ ఫ్లూ' అని కూడా పిలుస్తారు కళ్లను ప్రభావితం చేసే ఇన్ఫెక్షనే కండ్లకలక. దీన్ని వైద్య పరిభాషలో 'ఐ ఫ్లూ' లేదా 'పింక్ ఐ' అని కూడా పిలుస్తారు. ఇది కంటిని కప్పి ఉంచే స్పష్టమైన పొర కండ్లకలక వాపుకు కారణమవుతుంది. ఎందువల్ల వస్తుందంటే.. ఏదైనా అలెర్జీ కారకాలు లేదా పొగ, దుమ్ము, పుప్పొడి లేదా రసాయనాల నుండి వచ్చే గాఢతతో కూడిన గాలి కంటి ఫ్లూకి దారితీయవచ్చు. కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువ కాలం ధరించడం లేదా వాటిని సరిగా శుభ్రం చేయకుండా ధరించడం తదితరాల కారణంగా ఈ కంటి ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే జలుబు లేదా దగ్గు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఈ కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గొంతు, కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ ఒకటే కావడమే అందుకు కారణం. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొలా ఉంటుంది. ఐతే అందరిలో కామన్‌గా కనిపించేది.. స్టికీ డిశ్చార్జ్‌తో కళ్ళు ఎర్రగా ఉంటాయి. దురదగా అనిపించడం. కళ్ల నుంచి అదేపనిగా నీరు రావడం. కళ్లు తెరవలేకపోవడం, కంటి నొప్పి తదితర లక్షణాలు వ్యాధి సోకిన పేషెంట్లో కనిపిస్తాయి. ఈ సీజన్లోనే ఎందుకు.. వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా కూల్‌గా మారుతుంది. దీనికితోడు వర్షాకాలం కావడంతో విపరితమైన నీటి ఎద్దడిన ఉంటుంది. దీంతో నీటి వనరులన్నీ కలుషితమవుతాయి. దీంతో వైరస్లు, బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. మనం తెలియకుండా ఆ నీటితో కడుక్కోవడంతో ఈ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు అన్ని మూక్ముమ్ముడిగా దాడి చేస్తాయి. ఈ వాతావరణ మార్పులు తగ్గట్టు సరైన శుభ్రత పాటించకపోవడంతో ప్రజలు ఈ వర్షాకాలంలో ఈ వ్యాధుల బారినపడే అవకాశాలు అధికం. నివారణ: కృత్రిమ కన్నీళ్లు లేదా ఏదైనా లూబ్రికేటింగ్ కంటి చుక్కలను ఉపయోగించడం ప్రభావంతమైన చికిత్సలలో ఒకటి. వేడి నీటితో కాటన్ క్లాత్‌ని ముంచి కళ్లను కడగడం. పరిశుభ్రతను పాటించాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లతో కూడిన యాంటీబయాటిక్ కంటి చుక్కలు మాత్రమే ఉపయోగించాలి. వ్యాధిని ముదరిపోయేంత వరకు నిర్లక్ష్యం చేస్తే ఈ యాంటిబయోటిక్స్ కూడా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. మంచి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవడం. వెచ్చని నీటితో తరచుగా మీ చేతులను కడగడం వంటివి చేయాలి ముఖ్యంగా మీ కళ్ళను తాకడానికి ముందు లేదా తర్వాత కంటి చుక్కలు వేయండి. మీ కళ్ళను తాకడం లేదా రుద్దడం మానుకోండి ఒకవేళ మీకు కండ్లకలక ఉంటే, శుభ్రమైన, తడి వాష్‌క్లాత్ లేదా తాజా కాటన్ బాల్ని ఉపయోగించి మీ కళ్ళను క్లీన్ చేసుకోండి. దీంతోపాటు దిండ్లు, వాష్‌క్లాత్‌లు, తువ్వాళ్లు, కంటి చుక్కలు, కన్ను లేదా ముఖ అలంకరణ, మేకప్ బ్రష్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, కాంటాక్ట్ లెన్స్ నిల్వ కేసులు లేదా కళ్లద్దాలు వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేయవద్దు. వీటిలో వైరస్ లేదా బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సంక్రమించే అవకాశం ఉంటుంది. మీ తలగడ కవర్లను తరుచుగా మార్చండి. వేడినీటి డిజర్జెంట్లోను వాష్ చేయండి. ప్రతి రోజు శుభ్రమైన టవల్ లేదా వాష్ చేసిన క్లాత్ ఉపయోగించండి. విటమిన్ ఏ, సీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. రెగ్యులర్ కంటి చెకప్‌లు చేయించుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి సత్వరమే బయటపడొచ్చు లేదా రాకుండా జాగ్రత్తపడవచ్చు కూడా. (చదవండి: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య) -
చిన్నారుల ముక్కు నుంచి రక్తం వస్తుందా? చాలావరకు ఇది..
ఈ సీజన్లో పిల్లలు వానల్లో తడిసి, జలుబు చేసి ముక్కు చీదినప్పుడు రక్తం రావచ్చు. చిన్నారుల ముక్కు నుంచి రక్తస్రావం జరగడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. చాలావరకు ఇది ఏమాత్రం ఆందోళనకరం కాదు. పిల్లల ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పిల్లలు కాస్త ముందుకు ఒంగి కూర్చునేలా చూడాలి నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి. రక్తస్రావం అవుతున్న ముక్కు రంధ్రం వైపు భాగాన్ని బొటనవేలు, చూపుడువేలుతో కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచాలి. ముక్కుపైన ఐస్‌ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి. వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి. రక్తస్రావం తగ్గాక మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు పిల్లల వేళ్ల గోళ్లు కత్తిరిస్తూ, వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో రక్తస్రావం తప్పక ఆగిపోతుంది. ఒకవేళ ఆగకపోతే తక్షణం డాక్టర్ / ఈఎన్టీ స్పెషలిస్ట్‌ను కలవాలి. (చదవండి: ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..) -
ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు
నిన్న మొన్నటి దాకా చెమటలు పట్టించిన ఎండలు కాస్తా ఇప్పుడు మబ్బుల వెనక దాక్కుని, వానలు కురిపిస్తున్నాయి. వానలు ఆహ్లాదంగానే ఉంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులను కూడా వెంట మోసు కొస్తాయి. ఈ అనారోగ్యాలతో పోరాడటానికి. రోగనిరోధకశక్తి బలంగా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుకోవడానికి నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. ఆ మార్పులేమిటో, ఈ సీజన్లో ఏ ఆహారం తీసుకుంటే మందో చూద్దాం... ముసురు పట్టినప్పుడు వేడి వేడి టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వాటికి బదులు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. దాంతోపాటు అల్లం, మిరియాలు, తేనెతో తయారు చేసిన టీ సేవిస్తే.. ఆరోగ్యానికి చాలా మంది. అదేవిధంగా బజ్జీలు, పునుగులు, బోండాలకు బదులు వేడి వేడి ఉగ్గాణి, సెనగ, పెసర గుగ్గిళ్లు, చుడువా, సగ్గుబియ్యం కిచిడీ మంది. పుదీనా, తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటితో కషాయం కాచుకుని తాగితే మంది. రాగులు, సోయాబీన్, పెసలు, మెుక్కజొన్న వంటి పప్పుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల దరిచేరవు. వీటితోపాటు పోషక విలువలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు అంటే దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటì , క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర వంటివి తీసుకుంటే మంచిది. అల్లం: ఇది శరీర కణ జాలాలకు పోషకాలను సమీకరించడానికి, సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. ఈ రోజుల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. అల్లం కఫాన్ని తగ్గిస్తుంది కాబట్టి అల్లం టీ తాగితే జలుబు, దగ్గు దూరం అవుతాయి. ఫ్లూతో పోరాడటానికి అల్లం తోడ్పడుతుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి. టీలు, సప్లు, కూరల్లో అల్లాన్ని ఎక్కువ ఉపయోగిస్తే వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు. నేరేడు పండు... ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాల ఫైటోకెమికల్సూ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. నేరేడులో క్యాలరీలు తక్కువ. వానాకాలంలో వచ్చే అతిసార, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకీ నేరేడు ఔషధంలా పనిచేస్తుంది. తులసి... ఈ కాలంలో రోజూ తులసి ఆకులను నమలడం ద్వారా అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చు. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని.. నీటిని తాగాలి. తులసి రోగనిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. నిమ్మ... నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచే సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు, శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మిరియాలు... నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జీవక్రియలను పెంచుతాయి. దగ్గు, గొంతు నొప్పి ఉన్నట్లయితే నల్ల మిరియాలను పొడి చేసి నిద్రవేళకు ముందు వేడి పాలలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు... పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రోజూ రాత్రిపూట చిటికడు పసుపు కలిపిన వేడి పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లవంగం... ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. వర్షాకాలంలో లవంగాలను తీసుకుంటే గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దాల్చిన చెక్క... అద్భుత ఔషధ గుణాలెన్నో దాగి ఉన్న దాల్చిన చెక్క మధుమేహులకు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. రోజూ గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం దీనిలో ఇమిడి ఉంది. వీటికి దూరంగా ఉండటం మేలు! రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే చక్కెర పదార్థాలకి దరంగా ఉండాలి. ముఖ్యంగా ఐస్ క్రీం, కేక్, క్యాండీ, చాక్లెట్, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. చాలామంది ప్యాక్ చేసిన ఆహారాలని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అధిక ఉప్పు ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఆల్కహాల్, ధూమపానం కూడా శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉంటే మేలు. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!) -
వర్షాకాలంలో వేధించే చర్మవ్యాధులకు చెక్ పెట్టండి ఇలా..
వర్షాకాలంలో దురదలు ఇన్ఫెక్షన్లుకు ఎందుకొస్తాయని అందరి మదిలో ఎదురై ప్రశ్నే..మరీ ముఖ్యంగా కాలి వేళ్లు, చర్మం మడతలలో దురద, తామర, గజ్జి వంటి వాటితో ఒకరకమైన ఇబ్బంది ఉంటుంది. అందుకు కారణంలో వేడి తేమతో కూడిన పరిస్థితులు. ఈ కాలంలో గాల్లో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. మనం ఈ కాలంలో కురిసే వాన కారణంగా కాళ్లకు వేసుకునే సాక్స్ దగ్గర్నుంచి, వివిధ చెప్పులు తడచిపోవటం లేదా చాల సేపటి వరకు నీటిలో నానిపోయి ఉండటం జరుగుతుంది. పైగా ఈ కాలంలో తడిగా అయిన వస్తువు డ్రైగా ఉండే అవకాశమే తక్కువ. పూర్తి స్తాయిలో ్రడైగా ఉండదు ఆ దుస్తులు లేదా సాక్స్‌లు వేసుకున్నా బ్యాక్టీరియా చేసి ఈ దురద, తామర వంటి ఇన్షెక్షన్లు వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫ్టెక్టులు లేని ఆయుర్వేదంలోని ఈ చిట్కాలు ఫాలోయితో ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దామా!జ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టండి ఇలా.. హైడ్రోకార్టిసోన్ క్రీమ్: ఈ క్రీమ్ తామర, దురద, గజ్జితో సంబంధం ఉన్నవాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలమైన్ ఔషదం: కాలమైన్ లోషన్ చర్మం దురదను ఉపశమనం చేస్తుంది. అలాగే తామర, దురద, గజ్జి వల్ల కలిగే దద్దుర్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. యాంటిహిస్టామైన్లు: బెనాడ్రిల్ వంటి కొన్ని యాంటిహిస్టామైన్లు, తామర, దురద మరియు గజ్జితో సంబంధం ఉన్న దురద నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. టీట్రీఆయిల్: టీ ట్రీ ఆయిల్లో యాంటీమైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గజ్జి, తామర దురదతో, సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కలబంద: ఇది ఒక అద్భుత మూలిక, ఇది దాదాపు ఏ చర్మ పరిస్థితికైనా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కలబంద ఆకును చూర్ణం చేసి, దానిలోని జెల్‌ను ప్రభావిత ప్రాంతంలో పూయండి. ముందుగా ఆ ప్రాంతాన్ని క్రిమిసంహారక మందుతో కడగాలని నిర్ధారించుకోండి. కొబ్బరి నూనె: దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇది బాక్టీరియా, శిలీంధ్రాల వల్ల కలిగే చర్మ వ్యాధులకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. దాల్చినచెక్క సారాంశాన్ని జోడించడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడంలో మీ చర్మాన్ని వ్యాధి రహితంగా ఉంచడంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లి: తాజా వెల్లుల్లి యొక్క కొన్ని లవంగాలను చూర్ణం చేసి, ఆ పేస్ట్‌ను దురద ఉన్న ప్రదేశంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు రాయండి. వెల్లుల్లిని నమలడం కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. గమనిక: కొందరికి పడకపోవచ్చు అది ఎలా తెలుస్తుందంటే..మీరు వెల్లులి పేస్ట్ చర్మంపై రానివెంటనే ఎర్రగా మారి దురద ఇంకాస్తా ఎక్కువై రక్తం కారేంత బాధగా ఉంటుంది. అలా అనిపిస్తే..ఉపయోగించకండి. వేప, పసుపుల పేస్ట్: కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని, తాజా పసుపు ముక్కను వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని దురద ఉన్న చోట అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుదీనా రసాం: ఇది కూడా బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తుంది. దురదలు దద్దుర్లు నిరోధించడంలో మంచి సహాయకారిగా ఉంటుంది. అలాగే వీటన్నింటి తోపాటు మనం నిత్యం తీసుకునే డైట్ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీపి ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ఎందకంటే ఇవి మీ శరీరంలోని ఈస్ట్ పెరుగుదలను పెంచి ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేస్తాయి. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!) -
ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!
వేసవి తాపం చల్లారి హమ్మయ్యా అనిపించే కాలం. చలచల్లగా హాయిగా ఉంటుందని ఆనందించేలోపు అంటు వ్యాధులు మనం కోసం రెడీగా ఉంటాయి. ఈ కాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ తదితర అంటువ్యాధులు ప్రబలేకాలం. ఇలాంటి కాలంలో ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు నేరెడు పండ్లు: ఇందులో పోటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే రక్తంలో ఆకస్మికంగా పెరిగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెర్రీస్: దీనిలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణం కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలోనూ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడంలో ఉపకరిస్తుంది. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ ఇన్వెక్షన్ల నుంచి సునాయసంగా బయటపడే సామార్థ్యాన్ని పెంపొందిస్తాయి. బొప్పాయి: ఈ బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సంక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే గాక చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. దానిమ్మ : దానిమ్మ గింజలు: ఆరోగ్యాన్ని అందించే రుచికరమైన పండు. ఇందులో ముఖ్యంగా బీ విటమిన్లు, ఫోలేట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, రక్త ప్రసరణకు సహయపడతాయి. ఈ పళ్లు హైపర్‌టెన్షన్, గుండె సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పీచెస్: ఈ పండ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని పచ్చిగా గానీ సలాడ్‌తో గానీ కలిపి తినండి. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ ఐరన్ ఉన్నాయి. ఇది జామూన్ మాదిరి మంచి శక్తిమంతమైన పోషకాలను అందిస్తుంది. లిచ్చి: ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆస్తమా రోగుల శ్వాసక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి తరుచుగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పైన చెప్పిన ఈ పళ్లల్లో దేని రుచి మీకు నచ్చకపోయినా, వాటిని తినడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ పండ్లను పచ్చిగా తినడం లేదా జ్యూస్ /సలాడ్లు, స్మూతీలు, యోగర్ట్‌లు లేదా డెజర్ట్‌లలో చేర్చి తీసుకోండి. ఇవి మీ రోజువారీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
బీమాపై సాగదీత.. రైతుకు ఏదీ భరోసా?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. పంటలు పండి, చేతికొచ్చి అమ్ముకునేంత వరకు అంతా సజావుగా జరిగితేనే రైతులు ఊపిరి పీల్చుకునేది. మధ్యలో అధిక వర్షాలతో వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మాత్రం కోలుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంట నష్టం జరిగితే బీమా కానీ, పరిహారం అందించే పరిస్థితి కానీ లేకపోవడం ఇందుకు కారణం. ఈ ఏడాది యాసంగిలో మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు మూడు దఫాలుగా కురిసిన తీవ్రమైన వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 10 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు అనధికార అంచనా కాగా.. మార్చిలో 1.51 లక్షల ఎకరాలు, ఏప్రిల్‌లో 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఆ మేరకు పరిహారం ఇవ్వాలని ప్రకటించింది. మిగిలిన వారికి ఎలాంటి సాయానికీ దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం పరిహారం ప్రకటించినప్పుడు ఆ సందర్భంలో జరిగిన పంట నష్టానికి మాత్రమేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే మున్ముందు జరిగే పంట నష్టాలకు ఇది వర్తించదని అర్థమవుతుండగా, ఈ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులను పరిహారానికి సంబంధించిన ఆందోళన వెంటాడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి బయటకు... రాష్ట్ర రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ (పంటల) బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం నుంచి 2020లో రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. కేంద్ర బీమా పథకాలు రైతులకు నష్టం చేకూర్చడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి బయటకు వచ్చిందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పంజాబ్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా పీఎంఎఫ్‌బీవై నుంచి బయటకు వచ్చాయని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. బీమా సంస్థలకే ఎక్కువ ప్రయోజనం? రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది రైతులున్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది తమ పంటలకు బీమా చేయించేవారు. దీంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం వచ్చేది. 2015–16లో 7.73 లక్షల మంది పంటల బీమా చేయగా, ఆ ఏడాది నష్టం ఎక్కువ జరగటంతో ఏకంగా రూ.441.79 కోట్ల నష్ట పరిహారం రైతులకు అందింది. 2016 వానాకాలం సీజన్ నుంచి దేశ వ్యాప్తంగా పీఎంఎఫ్‌బీవై పథకం అమలులోకి వచ్చింది. 2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు 7.33 లక్షల ఎకరాలకు ఈ పథకం కింద బీమా చేయించగా, 1.34 లక్షల మంది రైతులకు రూ.111.33 కోట్ల పరిహారం వచ్చింది. అలాగే 2018–19, 2019–20లో రూ.960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరు కాగా.. అందులో కొంతమేరకు రైతులకు దక్కింది. అయితే కేంద్ర పథకం వల్ల రైతులకు జరిగే లాభం కంటే బీమా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కొందరు రైతులు కూడా బీమా పథకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు భారీగా లాభాలు గడిస్తున్నప్పటికీ ప్రీమియం ధరలను బీమా కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. ప్రైవేటు సంస్థలకు సైతం పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పంటల బీమా పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పథకం జాడేదీ? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గతంలో వ్యవసాయశాఖ కసరత్తు చేసింది. రైతు యూనిట్‌గా దీన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వ్యక్తిగత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా నగదు అందేలా చూస్తోంది. కానీ పంటల బీమా పథకంపై ఇంతవరకు ముందడుగు పడక పోవడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. దేశంలో రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకోవడాన్ని రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. -
ఉప్పొంగిన బియాస్.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బియాస్ నదిలో ప్రవాహం ప్రమాద స్థాయిని మించి పారుతోంది. దీని కారణంగా బియాస్ నది పక్కనే ఉన్న జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రోడ్డుపైనే ప్రవాహం ఉద్ధృతంగా పారుతోంది. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో మండీ, కులు మధ్య రహదారిపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. #WATCH | Portion of National Highway 3 washed away by overflowing Beas river in Kullu, Himachal Pradesh pic.twitter.com/c8gRsvSkt5 — ANI (@ANI) July 9, 2023 వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అటు బియాస్ నది ప్రవాహం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలబడ్డాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సిమ్లా, సిర్మౌర్, లాహుల్, స్పితి, ఛంబా, సోల్ జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. #WATCH | River Beas flows furiously in Himachal Pradesh's Mandi as the state continues to receive heavy rainfall pic.twitter.com/Wau6ZwLLue — ANI (@ANI) July 9, 2023 రాష్ట్రంలో బియాస్ నదితో పాటు పలు నదుల్లో వరద నీరు ప్రమాద స్థాయిల్లో ప్రవహిస్తోంది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 133 మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. జులై 11 వరకు శ్రీఖండ్ మహాదేవ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కులు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.322 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. -
వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు!
చినుకు రాలే కాలమిది. వానలతో నేల తడిసే సమయమిది. దాంతో బొరియల్లోని ఎలుకలు బయటకు వస్తాయి. ఆహారం కోసం.. మెతుకుల్ని వెతుక్కుంటూ కిచెన్‌లో ప్రవేశిస్తాయి. వర్షాలు ఎక్కువగా ఉండి, కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఎలుక కనిపించిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే. వాటి నుంచి వ్యాప్తిచెందే లెప్టోస్పైరా జాతికి చెందిన బ్యాక్టీరియాతో ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా సందర్భాల్లో పెద్దగా ప్రమాదం లేకపోయినా... కొన్నిసార్లు మాత్రం ప్రాణాంతకం అయ్యే ప్రమాదమూ ఉంది. మనం వర్షాకాలం ముంగిట్లో ఉన్న ప్రస్తుత సమయంలో ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. లెప్టోస్పైరా ఇంటెరొగాన్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆరోగ్య సమస్య కాబట్టి దీనికి ‘లెప్టోస్పైరోసిస్’ అని పేరు. ఇది ఎక్కువగా ఎలుకలు, కొన్ని పెంపుడు జంతువులైన కుక్కలూ, ఫామ్‌లలో పెంచే జంతువులతోనూ వ్యాపిస్తుంది. దీన్ని ‘వీల్స్/ వెయిల్స్ డిసీజ్’ అని కూడా అంటారు. వ్యాప్తి ఇలా.. ఎలుకలు, ఇతర రోడెంట్స్ల (ఎలుక జాతికి చెందిన జీవుల) మూత్రవిసర్జనతో పొలాల్లోని నీరు కలుషితమవుతుంది. ఆ నీరూ, మట్టీ కలిసిన బురదలో పనిచేసేవారి ఒంటిపై గాయాలుంటే.. వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా. మనిషి దేహంలోకి ప్రవేశించి లెప్టోస్పైరోసిస్‌ను కలుగజేస్తుంది. అందుకే చేలలో పనిచేసే రైతులు, పశువుల డాక్టర్లు (వెటర్నేరియన్స్), అండర్‌గ్రౌండ్ సీవరేజ్ వర్కర్లు వంటి వాళ్లలో ఇది ఎక్కువ. కలుషితమైన చెరువులు, వాగులు, సరస్సుల్లో ఈదేవారిలోనూ కనిపిస్తుంది. నివారణ: ఆహారాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో (ఎలుకల వంటివి చేరలేని చోట్ల) సురక్షితంగా ఉంచాలి. రోడ్లపై మలమూత్రాలతో కలుషితమైన నీళ్లు (సీవరేజ్) ప్రవహించే చోట్ల నడవకపోవడం (కాళ్లకు పగుళ్లు, ఇతర గాయాలు ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది); వీలైనంతవరకు జంతుమూత్రాలతో కలుషితమైన బురదనీటిలో, బురదనేలల్లో తిరగకుండా ఉండటం; పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. చికిత్స: పెన్సిలిన్, డాక్సిసైక్లిన్ వంటి మామూలు యాంటిబయాటిక్స్‌తో చికిత్స అందించడం ద్వారా దీన్ని తేలిగ్గానే నయం చేయవచ్చు. కాకపోతే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాల్సి రావచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కిడ్నీ ఫెయిల్యూర్, మెదడువాపు కలిగించే మెనింజైటిస్, లంగ్ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గుండె కండరాలు, అంతర్గత రక్తస్రావం వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా అరుదు. లక్షణాలు: బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించిన రెండువారాల్లో లక్షణాలు బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. తీవ్రమైన తలనొప్పి (కొన్నిసార్లు కొద్దిగా జ్వరంతో) ఛాతీ నొప్పి, కండరాల నొప్పి కొందరిలో కామెర్లు (కళ్లు, చర్మం పచ్చబడటం) వాంతులు, విరేచనాలు కొందరిలో చర్మంపై ర్యాష్‌తో. నిర్ధారణ: రక్తపరీక్షల్లో బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్ష కూడా అవసరం పడవచ్చు. అయితే లక్షణాలు,ఆయా సీజన్లలో ఇది వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జబ్బును అనుమానించి చికిత్స అందిస్తారు. డాక్టర్ గురుప్రసాద్, సీనియర్ ఫిజీషియన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ (నిర్థారణ: బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..) -
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!
మొన్నటివరకు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు జూన్ వచ్చిందంటే చాలు హమ్మయ్యా! అని ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే?.. ఋతుపవనాలు మారి ఒక్కసారిగా తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి. వర్షాకాలం అంటే చల్లగా హాయిగా ఉంటుందని భావిస్తాం కానీ ఇది వ్యాధులు ముసురుకునే కాలం. అంతేగాదు మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వైరస్లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో జలబు, దగ్గు, గొంతులో కఫం, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడతారు. దీనికి తోడు దోమల బెడద కూడా ఎక్కువ అవ్వడంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు అవకాశాలు అక్కువ. ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరూ ఆయా వ్యాధుల బారిని పడుతుంటారు. అలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి ఔషధాలు తయారు చేసుకుని సులభంగా ఆయా వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 👉ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్ల ఉండకూదు 👉దోమలు లేకుండా ఉండేలా చేసుకోండి 👉నిండుగా దుస్తులు ధరించండి. బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించండి 👉తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి 👉పచ్చికాయగూరలు తినొద్దు 👉మరిగించి చల్లార్చిన నీటిని తాగండి ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే మసాల దినుసులతో ఈ కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఆయా వ్యాధుల బారిన పడుకుండా ఉండోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కషాయం తయారు చేసే విధానం: ధనియాలు: రెండు స్పూన్లు లవంగ-4 యాలుకలు-2 దాల్చిన చెక్క-అంగుళం ముక్క మిరియాలు-8 జీలకర్ర-అరస్పూన్ అల్లం లేదా శోంఠి: అర అంగుళం ముక్క తయారీ విధానం: పైన చెప్పిన వాటిని అన్నింటిని దంచుకుని పొడి చేసుకుని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుండి. కాచిన నీటిలో ఈ పొడిని చిటికెడు వేసుకుని, ఉప్పు వేసుకుని తాగొచ్చు లేదా నిమ్మరసం కలుపుకుని పరగడపున తీసుకుంటుంటే వర్షాకాలంలో వచ్చే ఎలాంటి వ్యాధులు మీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. మీరు కూడా ఓసారి దీన్ని ట్రై చేసి చూడండి. (చదవండి: ఫుల్లుగా తిన్నారా...ఆందోళన వద్దు) -
రుతుపవనాల రాక.. ఈ ఏడాది ఓ విశేషముంది.. 60 ఏళ్లలో ఇలా..
ఢిల్లీ: రుతుపవనాల రాకతో దేశంలో పలు నగరాల్లో వర్షాలు మొదలయ్యాయి. అయితే.. రావడం కాస్త లేటయినా రుతుపవనాలు ఈ ఏడాది ఓ విశేషాన్ని తీసుకొచ్చాయి. ఈ సారి ఢిల్లీ, ముంబయిల్లోనూ ఒకేసారి కుండపోత వర్షాలు కురిశాయి. దేశ రాజధానిని, పశ్చిమ తీరంలో ఉన్న ముంబయిని ఒకే సారి రుతుపవనాలు తాకడం గత అరవై ఏళ్లలో ఇదే ప్రథమం. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా వేసిన గడువుకు రెండు వారాల తర్వాత ముంబయిని తాకాయని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) తెలిపింది. కానీ దేశ రాజధాని ఢిల్లీని మాత్రం రెండ్రోజుల ముందే చేరాయని వెల్లడించింది. 1961 జూన్ 21న మొదటిసారి ముంబయి, ఢిల్లీని రుతుపవనాలు ఒకేసారి తాకాయి.. ఇన్నాళ్లకు మళ్లీ పునరావృతం అయినట్లు ఐఎమ్‌డీ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు మహారాష్ట్ర మొత్తం వ్యాపించాయి. అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యాణాలో కొంత భాగం, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ముని చేరాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో దేశమంతటా వ్యాపిస్తాయని పేర్కొంది. ముంబయి, ఢిల్లీలో శనివారం రాత్రి కుండపోత వర్షం సంభవించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇదీ చదవండి: సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్... -
నైరుతి రుతుపవనాల ఆలస్యానికి కారణం
-
రాష్ట్రంలోకి ఇంకా ప్రవేశించని రుతుపవనాలు
రాష్ట్రంలోకి ఇంకా ప్రవేశించని రుతుపవనాలు -
జూన్ రెండోవారం దాటినా.. వర్షాల జాడేది? ఇంకా మండుతున్న ఎండలు
మే నెల ముగిసింది.. సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలోకి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఒక వారం రోజులు అటూ ఇటూగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. కానీ జూన్ రెండోవారం దాటినా ఇంకా వరణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇంకా భానుడి భగభగలతో జనాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి ఉంది? వర్షాకాలం మొదలైనా ఇంకా ఎందుకు ఎండలు మండిపోతున్నాయి? అసలు వర్షాలు పడేదెప్పుడు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం. గడిచిన 15 రోజుల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం 75.3. మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా రాలలేదు. నైరుతి రుతు పవనాలు ఇంకా కేరళ తీరాన్ని తాకలేదు.మండుతున్న ఎండలు చూస్తుంటే ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితి కనబడడం లేదు. వర్షాకాలంలోనూ ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డ్ అవుతున్నాయి. ప్రస్తుతం హీట్‌వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలం కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.ప్రతి ఏటా జూన్ మాసం నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలోనే కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా అంటే, 8వ తేదీన కేరళను తాకాయి. అక్కడి నుంచి రుతుపవనాలు విస్తరించడానికి 5 రోజుల సమయం పడుతుంది.నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతోనే ఎండలు మండిపోతున్నాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పశ్చిమ దిశ, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా ఇంకా ఎండలు మండుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాక ఆలస్యం అయినా ఒక్కసారి అవి ఎంటర్ అయ్యాక సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త
-
అందీ అందని మేఘసందేశం
వాన రాకడ... ప్రాణం పోకడ చెప్పలేమంటారు. చిత్రంగా ఏటా నిర్ణీత సమయానికి వచ్చే తొలకరి చినుకుల రాకడ కూడా ఇప్పుడు దాదాపు అలాగే తయారవుతోంది. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈసారి అంతకన్నా ముందుగా మే 27 నాటికే ఋతుపవనాలు వస్తాయంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కొంతకాలం క్రితం అంచనా వేసింది. ఆ తర్వాత జూన్ 4 అంటూ కొత్త అంచనా చెప్పింది. తీరా అసలుకే లెక్క తప్పి, జూన్ 7 దాటినా చినుకు జాడ లేకపోవడం గమనార్హం. ఇక, తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం ‘బిప్రజయ్’ సైతం ఈసారి ఋతుపవనాలపై దుష్ప్రభావాన్ని చూపనున్నట్టు తాజా వార్త. అసలే వారానికి పైగా ఆలస్యమైన వానలకు ఇది ఊహించని అవరోధం. తొలకరి చినుకును శాస్త్రీయంగా అంచనా వేయడంలో తప్పుతున్నామా, లేక పర్యావరణంలో మార్పులతో పూర్తిగా లెక్కలే మారిపోతున్నాయా అన్నది ఇప్పుడు జవాబు వెతకాల్సిన ప్రశ్న. ఋతుపవనాలు వాతావరణ అంశమే కావచ్చు. కానీ భారత ఆర్థికరంగానికి అది అత్యంత కీలకం. దేశానికి ‘అసలైన’ ఆర్థికమంత్రి ఋతుపవనాలే అని ఓ మాజీ రాష్ట్రపతి గతంలో వ్యాఖ్యానించారు. దేశ వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా అందించే నైరుతి ప్రాధాన్యానికి ఆ వ్యాఖ్యలే మచ్చుతునక. బిప్రజయ్ దెబ్బతో ఋతుపవనాలు బలహీనమై, వాటి రాకకు మరో 48 గంటలు పట్టవచ్చని శాస్త్రవేత్తల హెచ్చరిక. వరుసగా రెండు రోజులు లక్షద్వీప్, కేరళ, కోస్తా కర్ణాటకలో వానలు కురిస్తేనే ఋతుపవనాలు వచ్చినట్టు లెక్క. ప్రస్తుతం కేరళలో కురుస్తున్న వానలు వాయు గుండం ప్రభావంతోనేనట. పైగా నలుమూలల ఋతుపవనాలు విస్తరించడానికి మరింత సమయం పడుతుందంటున్నారు. కారణాలేమైనా – ఈ జాప్యంతో, బలహీనమైన వానలతో ఈ జూన్‌లో పడాల్సిన వర్షపాతం తగ్గడం అనివార్యం. దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ) వర్షపాతం కనీసం 20 శాతం తగ్గుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంటోంది. ఈ జాప్యాల నడుమ పొలం పనులు కనీసం వారం రోజులు వెనక్కి వెళ్ళకా తప్పదు. వెరసి ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. అసలే ఈ ఏడాదీ వేసవిలో ఎండలు దంచేస్తున్నాయి. ఉష్ణపవనాల తాకిడి ఉండనే ఉంది. ఫలితంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువుంటుందని స్కైమెట్ జోస్యం. కొద్ది నెలల క్రితమే చెప్పిన ఈ జోస్యం నిజమై, జూన్ – సెప్టెంబర్ల మధ్య సాధారణ వర్షపాతంలో 94 శాతమే కురిస్తే చిక్కులు తప్పవు. ఆసియాలోని మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మనం ఇరుకున పడతాం. వరి, చెరకు లాంటి పంటల దిగుబడి తగ్గి, ఆహార ధరలు అమాంతం పెరుగుతాయి. గమ నిస్తే – నిరుడు మార్చిలో శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంతటి ఉష్ణోగ్రత, ఉడుకెత్తించిన ఉష్ణపవనాల వల్ల గోదుమల ఉత్పత్తి తగ్గింది. కొన్ని ఎగుమతులపై నిషేధం తప్పలేదు. ఈసారీ వ్యావసాయిక ఉత్పత్తులు తగ్గితే కష్టమే. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా హెచ్చి, ఖజానాపై భారం పడుతుంది. కోట్లాది సామాన్యులకు కడుపు నిండా తిండి కష్టమవుతుంది. నిజానికి, ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలు మనకు నైరుతి ఋతుపవనాల కాలం. వార్షిక వర్షపాతంలో అత్యధికం ఈ సీజన్లో కురిసేదే. అందుకే, మన దేశంలో సాంస్కృతికంగానే కాక ఆర్థిక కాలపట్టికలోనూ ఈ ఋతుపవనాలు కేరళను తాకే రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. గత పదేళ్ళలో 2018లో, 2022లో ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. గత ఏడాది మే 29కే తొలికరి కురిసింది. అలాగే, గత దశాబ్దిలో అతి ఆలస్యంగా వానలు మొదలైంది 2019లో. ఆ ఏడాది జూన్ 8న కానీ పుడమి తడవలేదు. ఈసారి జాప్యంలో ఆ రికార్డు బద్దలవుతున్నట్టుంది. ఈ ఆలస్యా నికీ, ముందస్తుగానే ముగిసిపోవడానికీ ఎల్ నినో లాంటివి కూడా కారణమని శాస్త్రజ్ఞుల ఉవాచ. ఈ వాతావరణ మార్పుల మధ్య ఋతుపవనాల జోస్యం తప్పకూడదంటే, సమర్థంగా లెక్కలు కట్టాలి. ఐఎండీ పరిశోధకులు పదేళ్ళ పైగా శ్రమించి, ఏటా ఎప్పుడు, ఎంత వర్షం పడుతుందని అంచనా వేసేందుకు కొత్త విధానం రూపొందించారు. కచ్చిత అంచనాలందించే విధాన రూపకల్పన కోసం 2012లో ఏర్పాటైన నేషనల్ మాన్సూన్ మిషన్ సైతం ఫలితమిస్తోంది. చారిత్రక విధానాలపై కాక, అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే పద్ధతిని అది ప్రవేశపెట్టింది. దానితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 వాతావరణ నమూనాలను పరిగణనలోకి తీసుకొని, విస్తృత సమాచారాన్ని సేకరించి, పరీక్షించి, దక్షిణాసియా వాతావరణానికి సరిపడే నాలుగైదింటిని ఖరారు చేసే శ్రమతో కూడిన పని సాగుతోంది. ఇక, 2016లో ఆమోదించిన కొత్త నిర్వచనాలు, పరామితుల ఆధారంగా ఐఎండీ ఋతుపవనాల రాకను మునుపటి కన్నా మెరుగ్గా అంచనా కట్టి ప్రకటిస్తోంది. ఇంత చేసినా ప్రతి జూన్‌లో కచ్చితమైన అంచనా కట్టలేకపోతున్న వానల వ్యవహారం చూస్తుంటే, మరింత లోతైన అధ్యయన అవసరం కనిపిస్తోంది. పరిశోధనలు పెరగాల్సిన అగత్యం అర్థమవు తోంది. వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్‌కు అంచనాల్లో కచ్చితత్వం కీలకం. దీనితోనే రైతులకు మార్గదర్శనం, పంటల సంరక్షణ వీలవుతుంది. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రత లతో ఇతర సముద్రాల కన్నా వేగంగా హిందూ మహాసముద్రం వేడెక్కుతోంది. ఫలితంగా భూ, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య తేడా తగ్గిపోతోంది. అంటే, రానున్న ఏళ్ళలో ఋతుపవనాలు మరింత జాప్యమవుతాయని విశ్లేషణ. మారుతున్న పర్యావరణంతో వాన, వాతావరణంపై కచ్చితమైన జోస్యం చెప్పడం సవాలే. కానీ, ఏ సవాలుకైనా శాస్త్ర విజ్ఞానం, సమగ్ర పరిశోధనలే పరిష్కారం కదా! -
Hyderabad: ‘ముంపు’ పేరిట ముంచేస్తూ.. రూ. 37 కోట్ల పనుల్లో అక్రమాలెన్నో
సాక్షి, హైదరాబాద్: పూడికతీత పనుల నుంచి రోడ్ల పనుల దాకా అన్నింటా కుమ్మక్కవుతున్న జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వానాకాలంలో ముంపుసమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ)లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. ఒకే రకమైన పనికి ఒక్కోచోట ఒక్కోరేటు ఉండగా, కొన్ని చోట్ల ఒక్క శాతం కంటే తక్కువకే కాంట్రాక్టర్లకు కేటాయించగా, కొన్ని చోట్ల 40 శాతానికి మించి లెస్‌కు పనులప్పగించారు. గత సంవత్సరం వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా వెంటనే తోడిపోయడానికి 326 టీమ్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో 160 స్టాటిక్ టీమ్స్ కాగా, మిగతావి మొబైల్ టీమ్స్. మైబైల్ టీమ్స్‌లో డీసీఎం, ట్రాక్టర్, టాటా ఏస్, జీప్ వంటి వాహనంతో పాటు నలుగురు కార్మికులుంటారని చెబుతున్నా, చాలా ప్రాంతాల్లో ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులనే పనులకు వినియోగించారు. ఉంచాల్సిన వాహనాల బదులుగా ఆటోలనుసైతం వినియోగించారు. ఇక కార్మికులకు ఇవ్వాల్సిన రేడియం జాకెట్లు, షూస్, రెయిన్కోట్లు, గొడుగులు, టార్చిలు వంటివి మాటలకే పరిమితమయ్యాయి. ఈ టీమ్స్ ఏర్పాటు పేరిట రూ. 37.42 కోట్ల పనులు చేశారు. కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువచోట్ల పనులు పొందడం.. వాటిల్లో కొన్ని చోట్ల తక్కువలెస్కు టెండర్ దక్కించుకోగా, మరికొన్ని చోట్ల చాలా ఎక్కువ లెస్‌కు వేయడం అనుమానాలకు తావిస్తోంది. రూ. 14 లక్షల పని రూ.6 లక్షలకే .. ఒక కాంట్రాక్టు ఏజెన్సీ ఈ టీమ్స్ ఏర్పాటుకు సంబంధించి మలక్‌పేట సర్కిల్లో ఒక్కొ క్కటి రూ.14.20 లక్షల విలువైన రెండు పనులను దాదాపు రూ. 6.75 లక్షలకే చేసింది. అంటే ఎంత ఎక్కువ లెస్‌కు పనిచేసిందో అంచనా వేసుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ సర్కిల్లో ఒక కాంట్రాక్టర్ రూ.17.30 లక్షల విలువైన ఒక పనిని 48.58 శాతం లెస్తో, రూ.17.35 లక్షల విలువైన మరో పనిని 48.99 శాతం లెస్తో చేసేశారట. అలాగే ఫలక్‌నుమా సర్కిల్లో రూ.12.80 లక్షల విలువైన పనిని 48.01 శాతం లెస్తో, రూ.12.80 లక్షల విలువైన పనిని 47.99 శాతం లెస్తో పూర్తిచేశారు. ఇంత ఎక్కువ లెస్‌కు పనులు చేశారంటే, టీమ్‌లు అన్నివేళలా పని చేయకపోవడమైనా ఉండాలి. లేదా ఒకే యూనిట్‌ను(వాహనం,వర్కర్లు ) రెండు చోట్లా చూపి ఉండాలి. లేదా వర్కర్లను తగ్గించి ఉండాలి. ఈ ఉదాహరణలు కేవలం మచ్చుకు మాత్రమే. ఇలా అత్యధికంగా 40 శాతం, అంత కంటే ఎక్కువ లెస్తో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. ఒక్క శాతం లోపునే.. ఇక అత్యల్పంగా ఒక్క శాతం కంటే తక్కువ లెస్తోనే పనులు చేసిన వారు సైతం ఉన్నారు. హయత్‌నగర్ సర్కిల్లో రూ.13 లక్షల విలువైన పనిని చాంద్రాయణగుట్ట సర్కిల్లో రూ. 15 లక్షల విలువైన పనిని కేవలం ఒక్కశాతం కంటే తక్కువ లెస్‌కే చేశారు. రూ. 10 కోట్ల అవినీతి..? వీటిని చూస్తుంటే కొన్ని సర్కిళ్లలో అధికారులు అంచనా వ్యయం అత్యధికంగా వేసి కాంట్రాక్టర్లతో ఎక్కువ లెస్ వేయించారా? లేక పనులు మేం చూసుకుంటాంలే అని పనులు చేయకున్నా బిల్లులు చెల్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సర్కిళ్లలో అంచనా వ్యయం రూ.20 లక్షలుంటే కొన్ని సర్కిళ్లలో కోటిరూపాయల వరకుంది. వాహనాలు ఎక్కడైనా ఒకటే. సిబ్బంది సంఖ్యలో తేడా ఉంటే అంచనా వ్యయంలో ఆమేరకు కొంత తేడా ఉండవచ్చుకానీ రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటానికి కారణం సంబంధిత ఇంజినీర్లకే తెలియాలి. ఇంజినీర్లు, కాంట్రాక్టరు కుమ్మక్కై జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొట్టడానికి వారి ఇంజినీరింగ్ ప్రతిభాపాటవాలు ప్రదర్శించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడులా కొందరు స్థానిక కార్పొరేటర్లకు సైతం వాటాలంది ఉంటాయని జీహెచ్ఎంసీ వ్యవహారాలు తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ముంపు పరిష్కార పనుల్లో దాదాపు రూ. 10 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.. అవకతవకలపై ఫిర్యాదులున్నాయని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. కొందరికే ఎక్కువ పనులు.. ∙కొందరు కాంట్రాక్టర్లు ఎక్కువ పనులు దక్కించుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్,హయత్‌నగర్ రెండు సర్కిళ్ల పనులు చేసిన ఒక కాంట్రాక్టర్ ఒక చోట 7.25 శాతం లెస్తో చేయగా, మరోచోట 29.09 లెస్తో చేశారు. అంటే ఒక చోట తగ్గించింది మరోచోట పూడ్చుకున్నారన్న మాట. ఇదే కాంట్రాక్టర్ అల్వాల్, మల్కాజిగిరి సర్కిళ్లలోనూ చేశారు. అక్కడ మాత్రం కేవలం 0.09 శాతం, 0.56 శాతం లెస్‌కు మాత్రమే చేయడం విశేషం. ►అదే జోన్లో ఇద్దరు కాంట్రాక్టర్లు హయత్‌నగర్, ఎల్బీనగర్ రెండు సర్కిళ్లలోనూ , మరో కాంట్రాక్టర్ ఉప్పల్, సరూర్‌నగర్ రెండు సర్కిళ్లలో పనులు చేశారు. హయత్‌నగర్, ఎల్బీనగర్ సర్కిళ్లలో పనులు చేసిన ఒక కాంట్రాక్టరే కూకట్పల్లి, అల్వాల్, రాజేంద్రనగర్,బేగంపేట సర్కిళ్లలోనూ పనిచేశారు. ►చందానగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలోని ఆరు పనుల్లో నాలుగింటిని ఒక్క కాంట్రాక్టరే చేశారు. మరో కాంట్రాక్టర్ జూబ్లీహిల్స్‌తోపాటు కార్వాన్, గోషామహల్‌లోనూ పనులు చేశారు. ► గోషామహల్‌లోని కాంట్రాక్టర్ మూడు పనుల్ని 45 శాతం లెస్‌కు చేశారు. ►రాజేంద్రనగర్‌లోని పనులన్నింటినీ రెండు సంస్థలే దక్కించుకున్నాయి. ►ఇలా చెప్పుకుంటూ పోతే మాన్సూన్ ఎమర్జెన్సీటీమ్స్ పేరిట జరిగిన మాయాజాలానికి అంతే లేదు. -
ఏపీలో చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు
-
వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎంఆర్ గడువు ముగిసి మూడు రోజులైనా పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. యాసంగి సీఎంఆర్‌కు సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును నెలరోజులపాటు పొడిగించిన కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. వానకాలం సీఎంఆర్ గురించి ఊసెత్తలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు అయోమయంలో పడిపోయారు. 60 శాతమే పూర్తయిన వానాకాలం సీఎంఆర్ వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతమే పూర్తయింది. వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ కింద 47 ఎల్ఎంటీ మేర ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సుమారు 30 ఎల్ఎంటీ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు సమాచారం. అంటే 60 శాతం సీఎంఆర్ మాత్రమే పూర్తయింది. మిగతా సీఎంఆర్‌తో పాటు యాసంగి సీఎంఆర్ పూర్తి చేసేందుకు మరో నెల గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే కేంద్రం మాత్రం కేవలం యాసంగి సీఎంఆర్‌కు సంబంధించిన గడువును మాత్రం అక్టోబర్ 31 వరకు పెంచుతూ గతనెల 27న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖలో ముగిసిన వానకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గురించి ప్రస్తావించలేదు. గత కొంతకాలంగా సీఎంఆర్ ఆలస్యం ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సీఎంఆర్ అప్పగించడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిల్లింగ్‌లో అవకతకవలు, పీడీఎస్ బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహించిన ఎఫ్‌సీఐ.. జూన్ 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు సీఎంఆర్ తీసుకోలేదు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జూలై నెలాఖరు నుంచి మిల్లింగ్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ వర్షాల కారణంగా మిల్లుల్లో ధాన్యం తడిసిపోవడం, మిల్లులు నిలిచిపోయినప్పుడు కూలీలు, హమాలీలు సొంతూర్లకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో మిల్లింగ్ జరగలేదు. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు 60 శాతమే సీఎంఆర్ పూర్తయింది. ఈ విషయమై మంత్రి కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ గత నెల చివరివారంలో సమావేశమై సీఎంఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు పంపాలని కూడా నిర్ణయించి, ఎఫ్‌సీఐ అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్ వేగం పెరిగింది. కానీ సెపె్టంబర్ 30 తరువాత గడువు పొడిగించకపోవడంతో వానకాలం సీఎంఆర్‌పై నీలినీడలు కమ్ముకున్నట్లయింది. చదవండి: మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ -
సెప్టెంబర్‌లో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్!
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతీ రుతుపవనాలు ముందుగానే నిష్క్రమించవచ్చంటూ గత వారం వేసిన అంచనాలను వెనక్కు తీసుకుంది. అవి మరికొంతకాలం కొనసాగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం మీడియాకు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం తదితరాలు ఇందుకు కారణమని చెప్పారు. వాటి ప్రభావంతో ఉత్తరప్రదేశ్, బిహార్లలో రానున్న రెండు మూడు రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తమ్మీద సాధారణం కంటే 7 శాతం దాకా ఎక్కువ వర్షపాతం నమోదైనా యూపీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, మణిపూర్, త్రిపురల్లో పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. ఇది ఖరీఫ్ సీజన్లో వరి నాట్లపై బాగా ప్రభావం చూపింది. ఈ లోటును సెప్టెంబర్ వర్షపాతం భర్తీ చేస్తుందని మహాపాత్ర ఆశాభావం వెలిబుచ్చారు. చదవండి: భారీ అగ్నిప్రమాదం.. 300 ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో పేలుడు -
మామిడి తోటల సంరక్షణ.. సీవీఆర్ మెళకువలు
వర్షాకాలంలో మామిడి తోటల సంరక్షణకు మట్టి సేద్య నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఈ సూచనలు చేశారు. మామిడి ప్రూనింగ్ చేయటానికి ముందు లేదా చేసిన తర్వాత ప్రతీ చెట్టుకు 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు+ 50 నుంచి 100 కిలోల లోపలి మట్టి (సబ్ సాయిల్.. అంటే భూమిలో 2 నుంచి 4 అడుగుల లోతు నుంచి తవ్విన మట్టి) + 5 కిలోల ఆముదం పిండి (హై డెన్సిటీ ప్లాంటింగ్‌లో అయితే ఆముదం పిండి చెట్టుకు 2 కిలోలు చాలు) వేసుకోవాలి. మట్టి, ఎరువు, ఆముదం పిండిని ఈ పాళ్లలో కలిపిన (130 కిలోల) మిశ్రమాన్ని సీజన్‌కు ఒకసారి ప్రతి చెట్టుకూ డ్రిప్పర్ల దగ్గర వేసుకోవచ్చు. ఆ తర్వాత, ప్రతి 15 రోజులకోసారి.. డ్రిప్పర్ల దగ్గర 2 కిలోల చొప్పున పై మట్టి (టాప్ సాయిల్) + లోపలి మట్టి కలిపిన మిశ్రమాన్ని వేసుకుంటే పోషకాల లోపం రాకుండా ఉంటుంది. చెట్టు ఎదుగుదల సంతృప్తికర స్థితికి వచ్చేంత వరకు ప్రతి 15 రోజులకోసారి వెయ్యాలి. అయితే, చెట్టుకు ఈ విధంగా 130 కిలోల మిశ్రమాన్ని ఒకటేసారి కాకుండా దాన్ని 4 భాగాలుగా విభజించి.. 20 రోజులకు ఒక్కో భాగాన్ని వేసుకోవచ్చు. అటువంటప్పుడు ఇక డ్రిప్పర్ల దగ్గర 15 రోజులకోసారి 2 కిలోల చొప్పున అదనంగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అమావాస్య/పౌర్ణమికి ముందు పిచికారీ: 200 లీటర్ల నీటిలో 20 కిలోల లోపలి మట్టి తో పాటు.. 2 కిలోల గోధుమ లేదా సోయా బీన్ మొలకల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చెయ్యాలి. సంతృప్తికర స్థితికి తోట ఎదిగేంత వరకు అమావాస్యకు ముందు, పౌర్ణమికి ముందు ఈ మట్టి, మొలకల ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. -
వామ్మో...ఎండలు!
కడప కల్చరల్: ఇవేమి ఎండలలు నాయనా..ఈ మధ్య కాలంలో ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు...అంటూ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. దాదాపు నెల రోజులుగా తేలికపాటి వర్షంతో వాతావరణం చల్లగానే ఉంది. వేసవి తాపం నుంచి బయట పడ్డామని భావించిన ప్రజలకు ఇటీవలి ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచినా వెంటనే తీక్షణమైన ఎండ చిటపటలాడిస్తోంది. ఊహించని విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట తీవ్రమైన ఎండలను భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉభయ జిల్లాల్లో నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 9 గంటలకే బయట కొద్దిసేపు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు రోజులు వాతావరణంలో 35–37 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఇళ్లలో ఫ్యాను, ఏసీ వాడక తప్పడం లేదు. పాఠశాలల విద్యార్థులు ఉదయం ప్రార్థన చేసేందుకు కూడా ఎండ ఆటంకంగా నిలుస్తోంది. వీధుల్లో వెళ్లే ప్రజలు గొడుగులు, టోపీలు, టవళ్లు వాడక తప్పడం లేదు. ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ పడేంత వరకు వాహనదారులకు ఎండలో ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. నిపుణులు ఏమంటున్నారంటే.. రుతు పవనాల్లో ఏర్పడిన అంతరాయం వల్లే ఆకస్మిక ఎండలను ఎదుర్కోవాల్సి వస్తోందని యోగివేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కృష్ణారెడ్డి చెబుతున్నారు.కొద్దిరోజులు వర్షాభావ స్థితి ఉండడం, తాత్కాలికంగా ఈశాన్యం నుంచి వేడిగాలులు వస్తుండడంతో రాయలసీమ ప్రాంతంలో సాధారణ వాతావరణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు. -
కామ్‌గా ఉంటే కబళించే దోమ కాటు.. క్యూలెక్స్, ఏడిస్, అనాఫిలిస్తో జరపైలం!
నేరడిగొండ (ఆదిలాబాద్): వర్షాకాలం కావడంతో దోమల సీజన్ మొదలైంది. చిన్నదోమే కదా.. కుడితే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దోమల నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనారోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల వ్యాప్తితో ప్రమాదం.. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీటి గుంతలు, కంప చెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రా ంతాల్లో దోమలు నివాసం ఏర్పర్చుకుంటాయి. గు డ్డు, లార్వా, ప్యూపా వృద్ధి చెంది దోమగా మారి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈప్రమాదాన్ని ని వా రించాలంటే నీటిని సక్రమంగా వినియోగించా లి. దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. క్యూలెక్స్తో దోమ కాటుతో హఠాత్తుగా జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలో పెరిగే క్యూలెక్స్ దోమతో ఈవైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించడం కష్టం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. పంట పొలాలు, పెద్ద పెద్ద స్థలాలు, మైదానాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. ఏడిస్ దోమతో.. 1 ఆకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్లుగానే తగ్గి వారం లేదా పది రోజుల్లో మళ్లీ తిరగబెడుతుంది. ఏడిస్ దోమ కాటు కారణంగా ఈవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాళ్లలో నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతాయి. డెంగీ, చికెన్‌గున్యా వ్యాధి లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. నెలల తరబడి నొప్పులు బాధిస్తాయి. దీని నివారణ కోసం దోమల పెరుగుదలను అరికట్టాలి. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స చేయించుకోవాలి. దోమ కాటుకు గురైతే.. అనాఫిలిస్ దోమ కాటుతో మలేరియా, చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. వ్యాధి ప్రారంభంలో సరైన చికిత్స చేయించకపోతే నెలల తరబడి బాధిస్తుంది. గర్భిణులకు, చిన్నారులకు ఈవ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలి. సకాలంలో మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. -
Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి
పాడేరు–విశాఖపట్నం ప్రధాన రహదారిలోని ఘాట్‌లో ఆదివారం మేఘాలు కనువిందు చేశాయి. కొండలను తాకుతున్న మేఘాలను చూసి పర్యాటకులు, రోడ్డు ప్రయాణికులు, మోదమ్మ పాదాలు సందర్శనకు వచ్చిన భక్తులు పరవశించిపోయారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకృతి.. పచ్చదనంతో చూపరులను కట్టిపడేస్తోంది. – సాక్షి, పాడేరు -
Photo Feature: అందాలలో అహో మహోదయం
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాదల పంచాయతీలోని దోమలజోరు, రత్తకండి, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం సుంకి, పరిసర ప్రాంతాలు ఆకుపచ్చగా మారి ముచ్చటగొల్పుతున్నాయి. శీతాకాలం తలపించేలా ఉదయం వేళ మంచు సోయగాలు మరింతగా ఆహ్లాదపరుస్తున్నాయి. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మనోహర లోకంలో విహరిస్తున్నారు. –అరకులోయ రూరల్ అరకులోయలో మంచు సోయగాలు మాదల పంచాయతీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి అందాలు -
తగ్గిన పెట్రోల్, డీజిల్ వాడకం..కారణం అదేనా!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నెల మొదటి 15 రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉండడం ఇంధన వినియోగంపై ప్రభావం చూపించింది. డీజిల్ వినియోగం 13.7 శాతం తగ్గి 3.16 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో మొదటి 15 రోజుల్లో డీజిల్ వినియోగం 3.67 మిలియన్ టన్నులు ఉండడం గమనించాలి. సాధారణంగా ఏప్రిల్–జూన్ కాలంలోని వినియోగంతో పోలిస్తే.. జూలై–సెప్టెంబర్ కాలంలో డీజిల్, పెట్రోల్ డిమాండ్ సహజంగానే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలతో రవాణా తగ్గుతుంది. సాగు రంగం నుంచి కూడా డిమాండ్ తక్కువగా ఉంటుంది. 2021 జూలై మొదటి 15 రోజుల వినియోగంతో పోలిస్తే మాత్రం.. ఈ ఏడాది ఇదే కాలంలో 27 శాతం వృద్ధి నమోదైంది. ఇక 2020 ఇదే కాలంతో చూస్తే 43 శాతం పెరిగింది. పెట్రోల్ వినియోగం సైతం ఈ నెల మొదటి 15 రోజుల్లో 8 శాతం తగ్గి 1.27 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం 1.38 మిలియన్ టన్నులుగా ఉంది. 2021 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 23 శాతం, 2020 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 46 శాతం అధికం. ఇక 2019 జూలై 15 రోజులతో పోల్చి చూసినా పెట్రోల్ వినియోగం 28 శాతం ఎక్కువగా ఉంది. -
'రివర్స్ వాటర్ ఫాల్'.. ఎక్కడో కాదు మన దేశంలోనే
ముంబై: ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాల్ని చాలానే చూసి ఉంటాం. కానీ గాల్లో పైపైకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? అలా ఎలా అనుకుంటున్నారా? అవునండి అది నిజమే.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం ఎక్కడో కాదు మన దేశంలోనే కనువిందు చేస్తోంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఈ ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ నంద.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం అద్భుత దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాదు.. అసలు ఇలా రివర్స్ వాటర్‌ఫాల్ ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించారు. గురుత్వాకర్షణ, గాలి ఒకదానినొకటి వ్యతిరేక దిశలో సమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ వద్ద ఆదివారం ఇదే జరిగిందంటూ దానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. When the magnitude of wind speed is equal & opposite to the force of gravity. The water fall at its best during that stage in Naneghat of western ghats range. Beauty of Monsoons. pic.twitter.com/lkMfR9uS3R — Susanta Nanda IFS (@susantananda3) July 10, 2022 వర్షాకాల సోయగం.. ఈ ప్రకృతి అద్భుతాన్ని 'వర్షాకాల సోయగం'గా అభివర్ణించారు నంద. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షల వీక్షణలు, 15వేలకుపైగా లైక్‌లు సంపాదించింది. చాలా మంది ఆ అద్భుతంపై కామెంట్లు చేశారు. 'ఆ ప్రాంతాన్ని నేను సందర్శించాను. అది భూలోక స్వర్గం' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. 'దీనికన్నా సుందరమైనదాన్ని ఇప్పటి వరకు చూడలేదు' అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: IndiGo Airlines: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
కురిస్తే కుండపోతే..మారుతున్న రుతుపవన సరళి
సాక్షి, విశాఖపట్నం: కొన్నేళ్లుగా వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోతోంది. దాని ప్రభావం రుతు పవనాలపై చూపుతోంది. అంతేకాదు.. వర్షపాతం, తేమ, గాలి దిశలపైనా ప్రభావం చూపిస్తోంది. వాయుగుండాలు, తుపానుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తక్కువ రోజుల్లోనే కుండపోత వర్షాలు కురవడం, గాలుల తీవ్రత పెరగడం వంటి అనూహ్య.. అసాధారణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది మే 14న పాకిస్తాన్‌లోని జకోబాబాద్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. భారత్ సహా పలు దేశాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు వీచాయి. మేఘాలయలోని చిరపుంజిలో ఈ నెల 17న 97 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. ఇది 122 ఏళ్ల చరిత్రలో మూడో అతి పెద్ద వర్షపాతంగా నమోదైంది. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క అధిక వర్షాలు కురుస్తూ వాతావరణంలో భారీ మార్పులను స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రభావం మన దేశంలో రుతు పవనాలపైనా చూపుతూ వాటి సరళిలోను, గాలి దిశ మార్పునకు దోహదం చేస్తున్నాయి. భవిష్యత్‌లో భారీ వర్షాలే సాధారణంగా రుతు పవనాల సీజన్ మొత్తమ్మీద గాలుల దిశ ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు నైరుతి రుతుపవనాల సీజన్లో నైరుతి నుంచి, ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయి. కానీ.. వీటి గమనంలోనూ వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం నుంచి అనూహ్యంగా రుతు పవన గాలులు ఉధృతం కావడంతో అలలు ఎగసిపడుతూ తేమను సరఫరా చేయడం వల్ల భారీ వర్షాలకు కారణమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలతో రుతు పవన వర్షపాతం 5 శాతం వరకు పెరుగుతోందని, ఫలితంగా రానున్న సంవత్సరాల్లో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న వాయుగుండాలు, అల్పపీడనాలు గతంలో నైరుతి రుతు పవనాల సీజన్లో (జూన్–సెప్టెంబర్) బంగాళాఖాతంలో 10నుంచి 12 వరకు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడతాయి. కానీ.. అవి 3–4కి తగ్గిపోతున్నాయి. అయితే ఆకస్మికంగా ఏర్పడుతున్న అల్పపీడన/ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం అరుదైన పరిణామంగా చెబుతున్నారు. ఇక ఈశాన్య రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానుల సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ.. వాటి తీవ్రత మాత్రం పెరుగుతూ అధిక వర్షపాతం కురుస్తున్నట్టు, తుపాను గాలుల తీవ్రత పెరిగినట్టు నిపుణులు గుర్తించారు. ఇది ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతోంది. మరోవైపు ప్రీ–మాన్సూన్ సీజన్‌గా పిలిచే నైరుతి రుతు పవనాలకు ముందు కాలం (ఏప్రిల్–మే)లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో (థండర్ స్ట్రోమ్స్) అకాల వర్షాలు కురుస్తాయి. కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గినా వర్షం, గాలుల తీవ్రత మాత్రం పెరుగుతున్నట్టు గుర్తించారు. వర్షం రోజులు తగ్గి.. ఉధృతి పెరిగి వాతావరణ మార్పుల ప్రభావం రుతు పవనాల సీజన్‌పై పడుతోందని ఇప్పటికే పలు క్లైమేట్ మోడల్స్ నిర్ధారించాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. 2025, 2030, 2035 సంవత్సరాలకు రుతు పవనాల సీజన్లో వర్షం కురిసే రోజులు తగ్గుతాయి. కానీ.. వర్షాల ఉధృతి మాత్రం పెరుగుతుంది. తేమ, గాలుల వేగం కూడా పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్‌లో భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) లోతుగా అధ్యయనం చేస్తోంది. – ఓఎస్ఆర్యూ భానుకుమార్, పూర్వ అధిపతి, సముద్ర అధ్యయన విభాగం, ఆంధ్రా యూనివర్సిటీ -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్‌కవరింగ్‌కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
వడగాడ్పులు.. రెండ్రోజుల్లో రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాకపోవడంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ నమోదైనప్పటికీ... గత నాలుగు రోజుల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే తక్కువగా నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 41.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రాక నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సము ద్రంలోని చాలా భాగాలు, కొంకణ్‌లోని చాలా ప్రాంతాలు (ముంబైతో సహా), మధ్య మహా రాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ, మధ్య, వాయవ్య బం గాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముం దుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని సూచించింది. -
ఏపీ వాసులకు చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో..
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ (రాయలసీమ)లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ఏపీలోకి విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు పేర్కొంది. అలాగే మధ్య అరేబియా సముద్రం, గోవాలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని భాగాల్లోకి విస్తరిస్తాయని పేర్కొంది. చదవండి: మీరు టీచరా?.. ఈ నూతన మార్గదర్శకాలు మీకోసమే.. రుతు పవనాలు ఏపీకి దగ్గరగా రావడం వల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గినట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు కార్వార్, చిక్‌మంగళూర్, బెంగళూర్, పుదుచ్చేరి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
వాతావరణంలో వేగంగా మార్పులు...త్వరలోనే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్, నికోబార్ దీవులతోపాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. రుతుపవనాల రాకతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలి పింది. కానీ వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రత అనుభూతి ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం నల్లగొండలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని ప్రకటించింది. -
వర్షాకాలం: ఆహారాన్ని సరిగ్గా ఉడికిస్తున్నారా లేదా!
ఋతువులు మారే కొద్దీ మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాకాలంలో ఐతే ఇక చెప్పక్కరలేదు. షరా మామూలే! అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి. మరెలాగని అనుకుంటున్నారా? వెరీ సింపుల్!! మన రక్షణా వ్యవస్థ పటిష్టంగా ఉంటేచాలు. ప్రముఖ నూట్రీషనిస్ట్ రాధికా కార్లే సూచించిన ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి.. విటమన్ ‘సి’ అధికంగా ఉండే ఆహారం రెడ్ బెల్ పెప్పర్ లేదా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్, బొప్పాయి, నిమ్మ, టమాటాలలో విటమన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే మీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. బయట తినకపోవడం మంచిది ఇంటి వంటలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. సాధ్యమైనంత వరకు హోటళ్లు, రోడ్డు పక్క దొరికే చిరుతిండ్లు తినకపోవడం మంచిది. జొన్న లేదా అమరంత్ వంటి చిరు ధాన్యాల్లో కూడా ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. కూరగాయల ముక్కలు వేసి కిచిడీలా తయారు చేసుకుని తింటే రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. సుగంధ ద్రవ్యాలు పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వంటి మసాలా దినుసులు కూడా మీ ఇమ్యునిటీ పుంజుకునేలా చేస్తాయి. వంటకాల్లో ఈ మసాలా దినుసుల వాడకం ఉండేలా చూసుకోంది. అలాగే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన టీ లేదా నిమ్మ రసంలో కొన్ని అల్లం ముక్కలు చేర్చి ఉదయాన్నే తాగితే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. తగు మోతాదులో నీరు త్రాగాలి కాలాలతో సంబంధం లేకుండా అన్ని ఋతువుల్లో తప్పనిసరిగా సరిపడినంత నీరు త్రాగాలి. నీళ్లతోపాటు జ్యూస్‌లు, ఔషధ మూలికలతో తయారుచేసిన కషాయాలు తరచూ తాగుతూ ఉండాలి. ఆహారాన్ని సరిగ్గా ఉడికించాలి మార్కెట్ నుంచి కొని తెచ్చుకునే తాజా ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా కూడా వెన్నంటే ఉంటుంది. కాబట్టి తగినంత వేడి మీద ఆహారాన్ని ఉడికించాలి. అలాగే తొక్క ఒలిచి తినే పండ్లు అంటే.. అరటి, మామిడి, పుచ్చకాయ, ఆరెంజ్, లీచీ.. వంటి ఇతర ఫలాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఇమ్యునిటీ పుంజుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మేకప్‌తో దాచేసినా ఇబ్బంది తప్పదు.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్! -
వానాకాలంలో చర్మసమస్యలా.. ఈ డ్రింక్స్ తాగితే..
వర్షాకాలం వచ్చేసింది. వాన జల్లులు హాయిని కలిగించినా ఎన్నోచర్మ, ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో పొంచి ఉంటాయనే విషయం మరచిపోకూడదు. జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం వల్ల వీటినుంచి బయటపడవచ్చు. రోజువారీ ఆహారంలో కొన్ని డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. డిటాక్స్ డ్రింక్స్ అంటే.. యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటే పండ్లు, కూరగాయలతో తయారు చేసిన ద్రావకం. ఇవి శరీరంలో ఉత్పత్తయ్యే హానికర విషపదార్థాలను బయటికి పంపడానికి, రక్త శుద్ధికి, జీవక్రియను క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. తద్వారా మన చర్మకాంతి పెరగడమేకాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే 5 రకాల డిటాక్స్ డ్రింక్స్ మీకోసం.. గ్రీన్ టీ మనకు తెలిసిన ప్రసిద్ధ డిటాక్స్ డ్రింక్స్‌లో గ్రీన్ టీ ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నిమ్మ రసం ఇంట్లో తయారు చేసుకుకోగల నిమ్మరసం శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ డ్రింక్‌లో విటమిన్ ‘సి’ నిండుగా ఉంటుంది. ఇది కేవలం సూక్ష్మజీవులు, శిలీంధ్ర సంబంధిత అంటురోగాల నుంచి కాపాడటమేకాకుండా, చర్మకాంతిని పునరుద్ధరిస్తుంది. పసుపు కలిపిన పాలు పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల చేకూరే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసి టీ ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఔషధ మొక్క తులసి. ప్రాచీనకాలం నుంచే సంప్రదాయ వైద్య పద్ధతుల్లో తులసి వాడుకలో ఉంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలానుగుణంగా సంక్రమించే అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తులసి ఆకులను నీళ్లలో బాగా మరిగించి, ఒడగట్టి, వేడి వేడిగా తాగాలి. ఈ హెర్బల్ టీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, రోజు మొత్తం ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజమైన డిటాక్స్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ప్రసిద్ధమైనవి. ఇవి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొబ్బరినీళ్లు చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేకాకుండా, చర్మంపై ముడతలు, గీతలు తగ్గిస్తాయి. రోజువారి పోషకాహారంలో భాగంగా ఈ 5 రకాల డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యమైన, ప్రకాశవంతమైన చర్మసౌందర్యం మీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది! చదవండి: Dandruff Tips: చుండ్రు సమస్యా.. ‘వేప’తో ఇలా చెక్ పెట్టొచ్చు! -
జ్ఞాపకాల వాన
రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలను చీల్చుకుంటూ, భగ భగమని మండే గ్రీష్మతాపాన్ని వెక్కిరిస్తూ, నల్లటి మబ్బులు ఆకాశమంతా పహారా కాసే దృశ్యం ఓ అద్భుతం. ఎండవేడికి ఎడారిలా మారిన నేలతల్లిని ఆకాశం చూరు నుండి జారిపడ్డ వాన నీటి బొట్టు ముద్దాడే వేళ... గతజన్మను గుర్తు చేసే మట్టి పరిమళం.. ఎండాకాలపు కష్టాలన్నింటినుండీ విముక్తం చేసే ప్రకృతి మంత్రం. ఆకాశపు జల్లెడ నుండి కురిసే వర్షపు నీటి ధారలు చూస్తుండగానే పిల్లకాలువలై, ఏటి వాగులై, నదీ నదాలై... పరుగులు పెట్టే చల్లదనపు ప్రవాహం వర్షాకాలపు తొలి సంతకం. వాన చినుకు పడితే చాలు... ఈ రోజు బడికి సెలవిచ్చే స్తారన్న ఆనందాన్ని అనుభవించని బాల్యం ఉంటుందా అసలు? మాస్టార్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయని రోజున ఈ ఒక్కరోజుకు వర్షం పడితే బాగుండునని దేవుడికి కోటి మొక్కులు మొక్కే చిన్నారుల ఆకాంక్షలు మేఘాలూ వింటాయి. విని చల్లటి వానతో మురిపించి బడికి సెల విప్పించిన వానాకాలపు చదువురోజులు అనుభవంలోకి రానివారెంతమంది? బడికెళ్లేటపుడు వాన లేకపోయినా, బడికెళ్లిన వెంటనే తరగతి గదిలో ఏ అప్పారావు మాస్టారో సుమతీ శతకపు పద్యాన్ని వల్లెవేయించేటపుడు పెంకుటింటి బడి పైకప్పుపై అమాంతం పెద్ద వాన పడి... పిల్లల పుస్తకాలపై వాన నీటి బొట్లు టపటపా రాలి పడుతుంటే.. అవే ముత్యాలుగా ఏరుకుని సెలవు పిలుపు ప్రకటించే బడిగంట కోసం ఆత్రుతగా ఎదురు చూసే చిన్ని చెవుల్లో ఇక పద్యాలు వినపడని హాయిని అందరూ చూసిన వాళ్లమే కదా. సెలవిచ్చి ఇంటికి రాగానే ఇంటి చూరు నుంచి నయాగరా జలపాతాల్లా జారిపడే వర్షపు నీటి చప్పుడుకు లయబద్ధంగా దానికి కోరస్ పాడే కప్పల బెక బెక కచేరీలను ఆలకిస్తూ... లోకాన్ని మర్చిపోవడం ఎంత గొప్ప జ్ఞాపకం. వాన నీటి కాలువలో... కాగితపు పడవలు వేసి అవి వేగంగా దూసుకుపోతూ ఉంటే... టైటానిక్ షిప్ యజమానుల వలే గర్వంగా నవ్వుకునే బాల్యం ఆనందాన్ని ఎవరైనా కొలవగలరా అసలు? అలా గమ్యం తెలియని తీరానికి వెళ్లే పడవ కాస్తా ఏ బుల్లి సుడిగుండంలోనో చిక్కుకుని మునిగి పోతే... మనసంతా బాధతో నిండిపోయి... ఏడుపొచ్చేసి కంటి చూరు నుంచి జారిపడే కన్నీటి బొట్లు బుగ్గలను ఓదారుస్తూ కిందకి జారిపోయే తియ్యటి బాధలు మళ్లీ మళ్లీ వస్తే బాగుండునని అనుకునే ఉంటారు కదా. వర్షం తగ్గాక ఇంటి కెదురుగా మోకాల్లోతు నీటిలో ఆడుతూ పాడుతూ తిరగడం ఎంత ఆనందం? ఆ తర్వాత ఇంట్లో అమ్మో నాన్నో చూసి వీపు విమానం మోత మోగిస్తే... ఉక్రోషంతోనూ... తమ రాజ్యం నుంచి తమని బలవంతంగా గెంటివేసిన శత్రుసైన్యంలా అమ్మానాన్నలపై మనసులోనే కోపంతో రగిలిపోయే ఆక్రోశం గుర్తొస్తే ఇపుడు నవ్వొస్తుంది కదూ. వానలో తడిసి ముదై్ద తల సరిగ్గా తుడుచుకోక ముతక వాసన వేయడం.. తడిసిన తల సరదాగా జలుబు తెచ్చి పెట్టడం.. ముక్కు కారుతూ ఉంటే ఎగపీల్పులతో... వర్షంతో పోటీ పడ్డం పిల్లలకు ఓ ఆటే. కానీ పెద్దాళ్లకు మాత్రం... వెధవా చెబితే విన్నావు కాదు... అంటూ ఓ టెంకిజెల్ల ఇచ్చుకుని... బల వంతంగా పొగలు కక్కే మిరియాల కషాయంతో పనిష్ మెంట్ ఇచ్చే చేదు జ్ఞాపకాలకూ కొదవుండదు. కషాయం తాగించడం కోసమే బెల్లం ముక్క తాయిలాన్నీ చేతిలో పెట్టుకునే పెద్దాళ్ల గడుసుతనం... ఆ బెల్లం ముక్క తీపిని ఊహించుకుంటూనే కారపు కషాయాన్ని అమాంతం గుటకేసి తాగేసే బాల్యం... ఇంటింటా ఓ అద్భుత చిత్రమే. ఎక్కడో శత్రు సేనలు గొడవ పడుతున్నట్లుగా వర్షా కాలంలో ఉరుములు చేసే బీభత్సం... మెరుపులు సృష్టించే భయానక వాతావరణం... కాసేపు భయపెట్టినా.. వాన చిను కులు పడుతుండగానే మళ్లీ ప్రత్యక్షమయ్యే ఎండను వాన ముద్దాడినపుడు ఆకాశంపై ఈ మూల నుండి ఆ మూలకి వయ్యారంగా వంగి మెరిసే ఏడురంగుల ఇంద్రధనుస్సు ఏ దేవుడు గీసిన రంగుల బొమ్మో? లేదా ఏ చిత్రకారుడు నేలపై కోపంతో ఆకాశంపై గీసిన చిత్రకళాఖండమో? తేల్చుకోవడం కష్టమే. ఆకుపచ్చ దనాన్నీ, హాయిదనాన్నీ అందరికీ అందించే ప్రకృతి ఖజానా ...వాన. వానాకాలపు జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా మధురంగానే ఉంటాయి. ప్రతీ వాన చుక్కకీ ఓ అనుభవం. నైరుతీ చుట్టాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హుషారుగా తిరిగేస్తున్నారు. వానాకాలం చల్లగా వచ్చేసింది. దాన్ని సాదరంగా స్వాగతించి... ఈ వానాకాలమంతా ఎన్నో జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారనే ఈ పాత జ్ఞాపకాల వానను మీ ముందుంచింది. – సి.ఎన్.ఎస్. యాజులు -
21న అల్పపీడనం: తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలే
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య బంగాళా ఖాతం నుంచి దాని పరసర ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతం మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు ఉపరితల అవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ప్రధానంగా దక్షిణ, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో 1.09 సెం. మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారాయణపేట్ జిల్లాలో 7.9 సెం.మీ., వనపర్తి జిల్లాలో 5.1సెం.మీ., మహబూబ్‌నగర్ జిల్లాలో 4.1సెం.మీ., నిర్మల్ జిల్లాలో 2.8 సెం.మీ. వర్షం కురిసినట్లు వెల్లడించింది. -
Telangana: దంచికొట్టిన వాన
మెదక్ జిల్లా చేగుంటలో అత్యధికంగా 21.7 సెంటీమీటర్లు, మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వాన కురిసింది. చాలా ప్రాంతాల్లో పది, పదిహేను సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. పెద్ద సంఖ్యలో కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఐదు జిల్లాల్లో అప్రమత్తం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల కింద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోపాటు ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 36.9 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.67 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్‌లో 8.17 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది. జిల్లాల్లో వానలే వానలు.. యాదాద్రి జిల్లాలో బుధవారం రాత్రంతా కుండపోత వాన పడింది. 25 చెరువులు అలుగు పోస్తున్నాయి. బిక్కేరు వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,000 ఎకరాల్లో వరి నీటమునిగింది. పత్తి చేలలో నీరు నిలిచింది. మూసీ కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు. జనగామ జిల్లాలో భారీ వర్షంతో బచ్చన్నపేట- నక్కవానిగూడెం శివారు, జనగామ మండలం గానుగుపహాడ్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లచెరువు, వెల్దండ, గండిరామారం, తాటికొండ వల్లభరాయ్, ఛాగల్ మర్రికుంట చెరు వులు మత్తడి పోస్తున్నాయి. రోడ్లపై నీటి వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వీర్నపల్లి మండలంలోని గిరిజన తండాల్లో వాననీరు ఇళ్లలోకి చేరింది. పత్తి చేన్లు మునిగాయి. నక్కవాగు, సుద్దవాగు, బిక్కవాగు, గంజివాగు, సండ్రవాగులు పొంగిపొర్లుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రంగి మండలంలో గొర్రెగుండం జలపాతం దూకుతోంది. వికారాబాద్ జిల్లాలో వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పరిగి, వికారాబాద్, తాండూర్ పట్టణాల్లోని పలు కాలనీల్లో నీళ్లు చేరాయి. ధారూర్ మండలం రాళ్లచిట్టంపల్లిలో ఇల్లు కూలి షబ్బీర్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మోమిన్‌పేట మండలం గోవిందాపూర్‌కు చెందిన బుడ్డమ్మ ఆసరా పింఛన్ తీసుకొని వస్తుండగా మల్లారెడ్డిగూడెం సమీపంలోని వాగు దాటుతూ కొట్టుకుపోయింది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకుని.. సురక్షితంగా బయటపడి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం–ఎఖీన్‌పూర్ గ్రామాల మధ్య వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా.. పోలీసులు ఫైర్ రెస్క్యూ టీం, గ్రామస్తులతో కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తెగిన చెరువు కట్ట భారీవర్షంతో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చెరువు కట్ట తెగిపోవడంతో పెద్దవాగు పొంగిపొర్లింది. సాతారంలో శివార్లలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఏడుగురు, వేంపల్లిలో మరొకరు వాగులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్లు, తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. -
తడిసి ముద్దయిన తెలంగాణ: నేడూ కూడా
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో 2.23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా వికారాబాద్‌లో 5.6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రాంతంవారీగా.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో అత్యధికంగా 20.85 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా మంబాలో 15.3 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 12.8 సెం.మీ., జగిత్యాల జిల్లా వెల్గటూరులో 12.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 15 మండలాల్లో పది సెంటీమీటర్లకు మించి వర్షం కురిసింది. రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 22.64 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.31 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కందనెల్లి బ్రిడ్జి వద్ద తాండూరు–హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దోర్నాల్ సమీపంలోని కాగ్నా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన తెగిపోయింది. కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన వేలాది ఎకరాలు కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. బిచ్కుంద మండలంలోని మెక్క, గుండె కల్లూర్, ఖద్గాం, రాజుల్లా, మిషన్కల్లాలి, కందార్పల్లి, గుండె కల్లూర్, జుక్కల్ మండలంలోని గుల్లా, లడేగాం, నాగల్గాం, మద్నూర్ మండలంలోని చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ, సిర్పూర్, దోతి, ఇలేగావ్, కుర్లా తదితర గ్రామాల పరిధిలోని వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల పంటచేలు నీట మునిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో చెరువులకు జలకళ నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీటమునిగాయి. జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలిలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద వరద నీరు పోటెత్తుతోంది. కుంటాల జలపాతం వద్ద నీరు పైనుంచి ఎగిసి పడుతుండటంతో సందర్శకులను వ్యూ పాయింట్ వరకే అనుమతిస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని వర్షాలకు ప్రాణహిత ఉప్పొంగడంతో భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో కలుస్తోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి, చెన్నూరు, భీమిని మండలాల్లో వాగులు పొంగిపొర్లడంతో దాదాపు 33 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మామడ మండలంలోని అనంతపేట్-టెంబుర్ని గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపూర్(జి) మండలకేంద్రం నుంచి దేవునిచెరువు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. కడెం మండలంలోని అటవీ గ్రామం ఇస్లాంపూర్‌కు వెళ్లే మార్గంలో నాలుగు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాద్రి జిల్లాలో రాకపోకలకు ఇబ్బందులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని నుంచి ఉల్వనూరు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిన్నది. దీంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురయ్యాయి. సుజాతనగర్ మండలంలోని నరసింహసాగర్, సర్వారం గ్రామాల మధ్య రైల్వే వంతెనను వరదనీరు ముంచెత్తింది. వరదపోటుతో నరసింహసాగర్, అంజనాపురం, బేతంపూడి, గద్దెలబోరు తదితర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. టేకులపల్లి మండలంలో సంపత్‌నగర్, అనిశెట్టిపల్లి మధ్య వాగు ప్రవహిస్తుండగా రాకపోకలు స్తంభించాయి. నేడూ భారీ వర్షాలు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించిందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు (గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
వాన చూపిన స్త్రీలు
గాలివానలో చిక్కుకున్న ఓ పెద్దమనిషిని గుండెకు పసిపిల్లాడిలా హత్తుకుని కాచుకుంటుంది ప్రఖ్యాత తెలుగు కథ ‘గాలివాన’లోఒక ముష్టామె.దారుణమైన వానలో ఎవడో ఒకడు రాకపోతాడా అని ఎదురుచూస్తుంది ‘ఊరి చివరి ఇల్లు’ కథలో ఒక వేశ్య. తాను ఏ ఇంట అయితే పాలు పిండుతుందో ఆ పాలను తన బిడ్డకు తాపుకోలేకపోతుంది ఒక దీనురాలు ‘పాలు’ కథలో. వానలు పడే కాలం ఇది. వాన అంటే కేవలం దివికి దిగే నీటి దారం కాదు. బతుకును, ముఖ్యంగా స్త్రీ బతుకును కూడా గుచ్చి చూపే సూదిములుకు. తెలుగు కథా సాహిత్యంలో వానతో ముడిపడిన పాత్రలు స్త్రీల జీవితాన్ని చూపుతాయి. ఆ పరిచయం... ఆ తండ్రి కూతురి పెళ్లి చేశాడు. అతడు రైతు. పత్తి పంట వేసి ఉంటాడు. ఒక్క వాన నిండుగా పడితే ఆ పత్తి పంట గట్టున పడి లాభం వస్తుంది. పెళ్లి అప్పు కొంతైనా తీరుతుంది. కాని వాన పడదు. రైతుగా వానకోసం ఎదురుచూస్తుంటాడు. కాని తండ్రిగా అతడు చేయవలసిన పని ఉంది. అల్లుణ్ణి ఇంటికి ఆహ్వానించి కార్యం జరిపించాలి. మంచి ముహూర్తం లేక ఇన్నాళ్లూ ఆగింది. ఇప్పుడు ముహూర్తం దొరికింది. అల్లుడు వచ్చాడు. కూతురు సంబరపడింది. రాత్రి ఏర్పాట్ల కోసం భార్య ఉన్న మట్టి మిద్దెలోని ఒక గదిని అలంకరించింది. కాని ఇంతలో వర్షం. పెద్ద వర్షం. ఇల్లు మొత్తం ఉరుస్తూ నిలువనీడ లేనంత వర్షం. ఆ వర్షానికి రైతుగా అతడు సంతోషపడాలి. కాని తండ్రిగా బాధపడతాడు. ఈ వర్షం ఇప్పుడే కురవాలా అని తిట్టపోస్తాడు. అప్పుడు కూతురు తండ్రి వద్దకు వస్తుంది. ‘నాన్నా... ఈ వాన వల్ల మన పత్తి చేను పండుతుంది కదా. కార్యందేముంది. వాన పడనీ’ అంటుంది. ‘ఆ సంతోషం ముందు దీని వాయిదా పెద్ద లెక్క కాదు మావయ్యా’ అని అల్లుడు అంటాడు. అందరూ సంతోషంగా వానను చూస్తూ కూచుంటారు. గుంగుల నరసింహారెడ్డి రాసిన ‘వాన కురిసింది’ కథ ఇది. రైతు కూతురంటే అలా ఉంటుంది అని చూపిన కథ అది. ఇంటి నుంచి పారిపోయిన నిరర్థక సోదరుడు చాలా ఏళ్ల తర్వాత ఆ వాన సాయంత్రం ఇల్లు చేరుకుంటాడు. ఇంట్లో ఎవ్వరికీ పెళ్లయి ఉండదు. పెద్దక్క చిన్నా పెద్దా పనులు చేస్తూ ఒక తమ్ముణ్ణి, ఇద్దరు చెల్లెళ్లనీ సాకుతూ ఉంటుంది. ఘోరమైన పేదరికం. ఇప్పుడు ఇతను ఊడిపడ్డాడు. అన్ని విధాలా ధ్వంసమై వచ్చినవాడు తన తల మీద బరువు కాబోతున్నాడు. అనుబంధం ముఖ్యమా? బతుకు భారం ముఖ్యమా? ఆ అక్క గుండె రాయి చేసుకుని ‘తెల్లారే రైలు ఉంది. రైలు కంటే ముందు బస్సు ఉంది. బయల్దేరు’ అంటుంది. వాడు ఎక్కడికి వెళ్తాడు. ఎక్కడికైనా వెళ్లనీ. అతడు వెళ్లిపోతూ ఉంటే ఆమె వెర్రిగా చూస్తూ ఉంటుంది. గుమ్మా ప్రసన్న కుమార్ రాసిన ‘ముసురు పట్టిన రాత్రి’ కథలోని స్త్రీ పాత్ర ఇది. కుటుంబం స్త్రీ మీద వేసే బరువును మోయలేక ఆమె చేసిన ఆక్రందన అది. తెలుగు కథల్లో వాననూ వానతో ముడిపడిన స్త్రీలనూ చాలామంది రచయితలు చూపించారు. బి.ఎస్.రాములు రాసిన ‘పాలు’ కథ ఉంటుంది. అందులో భూస్వామి దగ్గర పని చేసే ఒక ఆడ పాలేరు మూడు బర్రెలకు రోజూ పాలు పిండుతూ ఉంటుంది. కాని ఒక్క రోజు కూడా ఆ పాలలో చుక్క కూడా తన బిడ్డకు తాగించలేని పరిస్థితికి బాధ పడుతుంది. చంటి పాప ఇంట్లో జ్వరంతో ఉన్నా ఆ రోజు వాన కురుస్తూ ఉన్నా తాను పనికి తప్పనిసరిగా వచ్చే వెట్టి బతుకు ఏమిటా అని ఆమె ఆలోచనలో పడుతుంది. భూస్వామి పాలు తాగి తిరిగి ఇచ్చిన గ్లాసును కడిగి పెట్టకుండా అలాగే వదిలి రావడమే ఆమె చూపగలిగిన అతి పెద్ద ప్రతిఘటన. దేవరకొండ బాల గంగాధర తిలక్ ‘ఊరి చివరి ఇల్లు’లో ఒక వేశ్య ఉంటుంది. ఆమెను కనిపెట్టుకుని ఒక ముసలామె ఉంటుంది. ఆమెకు ఆ జీవితం ఇష్టం లేదు. అప్పుడే ఒక పుణ్యాత్ముడు ఆ వర్షం కురిసిన రాత్రి ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెను చూశాడు. మెచ్చాడు. ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆమె తన జీవితం ధన్యం కానుంది. కాని ఆమె ఆ పెళ్లి చేసుకుని వెళితే ముసలామె ఎలా బతకాలి. అందుకే ఆ ముసలామె ఆ పుణ్యాత్ముడి మనసు విరిచేస్తుంది. వేశ్యది అంతా నాటకం అంటుంది. ఆమె మోసగత్తె అని చెబుతుంది. అతడు హతాశుడై ఆ ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఇక అలాంటి వాన రాత్రి గాని, అలాంటి పుణ్యాత్ముడుగాని ఆమె జీవితంలో మళ్లీ వచ్చే అవకాశం లేదు. స్త్రీల దేహాలపై బతికే పరాన్నభుక్కుల విషకౌగిలింత ఇలా ఉంటుంది... దానిలో నలిగే స్త్రీలు ఇలా ఉంటారు అని చూపిన కథ అది. పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలి వాన’ సుప్రసిద్ధం. అందులో ఒక పెద్దమనిషి ఒక అతి పెద్ద గాలివానలో ఎవరూ లేని ఒక చిన్న రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూమ్‌లో చిక్కుకుంటారు. ఆయనకు అప్పటి వరకూ పేదలన్నా, సరిగా బతకని వారన్నా, సంఘంలో ఏ గౌరవం లేని వారన్నా చిన్నచూపు. కాని ఇప్పుడు అలాంటి పెద్దమనిషికి ఆ వెయిటింగ్ రూమ్‌లో ఒక ముష్టిది మాత్రమే తోడు. ఆమెకు ఆ పెద్దమనిషికి ఉన్నంత చదువు, తెలివి, గొప్పతనం లేవు. తను మనిషి అని తెలుసు. సాటి మనిషికి సాయం చేయాలి అని తెలుసు. ఆ పెద్ద మనిషి భయంతో వొణకుతూ ఉంటే ‘ఇల్రా బాబూ... ఎచ్చగుంటది’ అని దగ్గరకు తీసుకుని ధైర్యం చెబుతుంది. ఆ క్షణంలో ఆ స్త్రీ ఆ పెద్ద మనిషికి ఎంతో గొప్పదిగా అనిపిస్తుంది. ఆయన పరివర్తన చెందుతాడు. కాని ఆ ముష్టిది తెల్లారే సరికి చనిపోతుంది. పాఠకులకు ఆ పాత్ర గుర్తుండిపోతుంది. ఇవి వాన పడే రోజులు కదా. ఇల్లు కదలక పుస్తకాలు చదవండి. వాన ఉన్న కథలు అవి చూపిన స్త్రీల పాత్రలు గమనించండి. బయట పరిసరాలు తడుస్తుంటే ఇంట్లో సాహిత్యం చూపిన జీవితాల్లో తడవండి. – ఫీచర్స్ డెస్క్ -
‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తొలిసారి కొత్త ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటివరకు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగానే ఎత్తిపోతలు కొనసాగగా.. మొదటిసారి 2.70 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి పారనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా సాగునీటి శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద సైతం 55వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందనుంది. అన్ని రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 18.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలకు గానూ లోయర్ మానేరు దిగువున ఉన్న ఆయకట్టు సుమారు 8 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరందిస్తున్నారు. మిడ్‌మానేరు దిగువున కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపినా వాటి చెరువులు నింపేందుకు మాత్రమే నీటిని వదిలారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం తొలిసారి కాళేశ్వరంలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు.. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఇటీవలే నిర్ణయించగా, దీనితో పాటు అనంతగిరి రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాలు, రంగనాయక్ సాగర్ కింద 55 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 55 వేల ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కింద 70 వేల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. 95 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తవగా, జూలై 20 నాటికి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో 50 టీఎంసీలకు గానూ మొదట 10 టీఎంసీలు నింపి, తర్వాత ప్రతి మూడు నెలలకు మరో 10 టీఎంసీలు నింపుతూ వెళ్లనున్నారు. తొలిసారిగా నింపే నీటి నుంచే సుమారు 55 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాల్వల పనులు పూర్తి చేస్తున్నారు. ఇక 15 టీఎంసీల సామర్ధ్యం గల కొండపోచమ్మ కింద తొలి ఏడాదిలో 7.8 టీఎంసీలు మాత్రమే నింపగా, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపనున్నారు. దీనికింద సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రావెల్ కోల్ వంటి కాల్వలు ఉండగా, 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటికింద కనీసంగా 70 వేల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు జరిగాయి. ఇక కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన పైప్‌లైన్‌న్ వ్యవస్థ నిర్మాణాలు పాక్షికంగా పూర్తవడంతో ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఆయకట్టుకు నీటిని ఇవ్వడంతో ఈ రిజర్వాయర్ల కింద కనీసంగా 300 వరకు చెరువులు నింపే ప్రణాళిక సైతం సిద్ధమైంది. వానాకాలం, యాసంగిలో నీటి లభ్యత పెంచేలా చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. అయితే తొలిసారిగా ఈ సీజన్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు, అనంతగిరి 20 వేల ఎకరాలు రంగనాయక్ సాగర్- 55 వేల ఎకరాలు మల్లన్న సాగర్ - 55 వేల ఎకరాలు కొండపోచమ్మ సాగర్- 70 వేల ఎకరాలు కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద - 20 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.70 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వనున్నారు. -
భయం పోయి భరోసా రావాలి!
రుతుపవనాలు ఈసారీ సకాలంలోనే పలుకరించి వెళ్లాయి. మళ్లీ వర్షాలు లేక తెలుగునాట రైతాంగం దిగాలుగా ఉంది. ఆందోళన చెందాల్సిన పని లేదు, వర్షాలున్నాయని వాతావరణ విభాగం చెబు తోంది. ప్రస్తుతం గాలులు బలహీనంగా ఉండి వర్షాలు కాస్త ఆలస్యమవుతున్నాయే తప్ప. రైతులు నిశ్చింతగా సాగుకు సన్నద్ధం కావొచ్చని భరోసా ఇస్తున్నారు. అయిదారు రోజుల్లోపే గాలులు బలపడి వర్షాలు కురియవచ్చంటున్నారు. వ్యవసాయ శాఖా నింగి చూపులతో, వాన కోసం నిరీక్షి స్తోంది. ఈ క్రమంలో రైతాంగం గ్రహించాల్సింది ఒకటే! రుతుపవన గమనంపైన, కారణమయ్యే గాలులపైన ‘వాతావరణ మార్పులు’ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మనిషి విపరీత చేష్టల వల్ల పుట్టే పలు కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు, భూతాపోన్నతి వంటివి ఈ మార్పులకు కారణం! ఫలితంగా వర్షాల రాకలో అనిశ్చితి నెలకొంటోంది. గడచిన అయిదారు సంవత్సరాల అనుభవాల్ని పరిశీలించినా... వర్షరుతువే కాస్త వెనక్కి జరిగిన భావన కలుగుతోంది. జూన్ రెండో భాగం, జూలై మాసాల్లో రావాల్సిన వర్షాలు జూలై రెండో భాగం, ఆగస్టు... ఒకోసారి సెప్టెంబరు నెలల్లో భారీగా కురుస్తున్నాయి. ఇటీవల ఏడాది పొడుగునా అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తేమ శాతం పెరిగి వర్షాలకు డోకా ఉండటం లేదు, ఎటొచ్చీ వానలు కురిసే సమయమే సరిగా లేక రైతు గందరగోళానికి గురవుతున్నాడు. ఇదంతా వాతావరణ మార్పు ప్రభావమే! రైతాంగం ఈ వాస్తవాన్ని గ్రహించి పంటల ఎంపిక, విత్తే సమయం, భరోసా ఇచ్చే గట్టి వర్షాల వరకు వేచిచూడటం, అంతర పంటలు తదదితరాల్లో వ్యూహాలు–ఎత్తుగడలను మార్చుకోవాల్సి ఉంది. వ్యవసాయ శాఖ అప్రమ త్తమై రైతులతో నిరంతర సంపర్కం జరపాలి. గరిష్ట ప్రయోజనం కలిగేలా సూచనలు, సలహాలి వ్వాలి. కానీ, వాస్తవంలో అలా జరగటం లేదు. అందుకే రైతులిప్పుడు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా తొలకరి వానల మురిపెంతో పంట విత్తిన వారు విత్తనం, తమ శ్రమ... రెంటినీ నష్ట పోవాల్సి వస్తోంది. మరో నాలుగయిదు రోజులు వర్షాలు రాకుంటే... ఎండవేడికి విత్తనం మట్టిలో మాడిపోతుంది. మళ్లీ విత్తుకోవాల్సి వస్తుంది. ఇదంతా నష్టమే! తెలంగాణలో ఇప్పటిరవకు 2.20 లక్షల ఎకరాల్లో విత్తనం వేస్తే, అందులో 1.79 లక్షల ఎకరాలు వాణిజ్య పంటైన పత్తి వేశారు. వాతావరణ మార్పుల్లో భాగమైన ‘లానినో’, నైరుతి రుతుపవనాలతో స్థూలంగా మనకు వర్షాలు బాగానే పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీజన్ సగటు వర్షపాతం 566 మిల్లీమీటర్లు కాగా గత యేడు 720 మి.మీ కురిసింది. తెలంగాణలో సాధారణ వర్షపాతం 720.4 మి.మీ కాగా నిరుడు 1043.4 మి.మీ పడింది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి. అంతకు ముందు, ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల ప్రతికూల పరిస్థితి ఉండి, వర్షాలు కురవక కరువు తలెత్తింది. బంగాళఖాతంలో పేరుకుపోయిన మృతికపొరల్ని తవ్వితీసి, జరిపిన ఓ అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. దక్షిణాసియా దేశాల్లో దీర్ఘకాలంగా రుతుపవన క్రమం, వాతావరణ మార్పు ప్రభావంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, తేమ పెరిగి ఎక్కువ విడతలు అధిక, అసాధారణ వర్షాలే కురుస్తున్నట్టు నిర్ధారించారు. ఈ తేడాల్ని రైతులు, వ్యవసాయ నిపుణులు, ప్రభుత్వాధికారులు గుర్తించాలి. అప్పుడే, తగిన చర్యలకు ఆస్కారం. ఈ యేడు కూడా జూన్ 3న కేరళ తీరం తాకిన నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా రెండు తెలుగు రాష్ట్రాలను చేరాయి. 4, 5 తేదీల్లో ఏపీని, 6, 7 తేదీల్లో తెలంగాణను తాకి వర్షాలు కురిపించాయి. రుతుపవనాలు సకాలంలో వచ్చినా, ‘యాస్’ తుఫాన్ వల్ల మేఘాలు వేగంగా కదిలి ఇక్కడ పెద్దగా పడలేదు. ఉత్తరాదిలో భారీగా కురిసాయి. ఈ తేడాలే కాకుండా వాతావరణ మార్పుల వల్ల రుతు పవనాలు, వాటి గమనం, వర్ష తీవ్రత ఎక్కువ ప్రభావితం అవటం ప్రమాదకరం! వేసవి సౌర ధార్మికతకే నైరుతి రుతుపవనాలు సున్నితంగా ప్రభావితం అవుతాయనేది తప్పుడు భావన అని శాస్త్రీయంగా రుజువైంది. భౌగోళిక స్థితిని సాంకేతికంగా చెప్పడం కాకుండా వాతావరణ విభాగం లోతైన అధ్యయనాలు జరపాలి, విశ్లేషణలు చేయాలి. రాగల పరిస్థితుల ప్రభావాలను వివరిస్తూ రైతులకు ఉపయుక్త సమాచారం నిరంతరం ఇవ్వగలగాలి. దాని ఆధారంగా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతును అప్రమత్తం చేసి, చైతన్యపరచాలి. ఏ ‘వాతావరణ మండలం’లో ఎంత వర్షపాతం ఉంటుంది? ఏం పంటలు వేసుకోవాలి? ఎప్పుడేం చర్యలు? చెప్పాలి. వ్యవసాయ విస్తరణాధికారుల వ్యవస్థను పటిష్టపరచాలి. ఇంతకుమునుపు రైతు చైతన్యయాత్రలు జరిగేవి. ఇప్పుడవన్నీ కాగితాల్లోనే! ఏమంటే, మేం రైతుబంధు పనుల్లో ఉన్నామనో, రైతుభీమా వ్యవహారాల్లో ఉన్నామనో అంటారు. తొలకరికే పులకించిపోయే రైతు ఆశతో విత్తనాలు అలుకుతాడు. సాలు (సాగు యోగ్య స్థితి) వచ్చిందా చూసుకోడు! కనీసం 3 అంగుళాలైనా తడవకుండా, నీరు నేలలో ఇంక కుండా విత్తనాలకు రక్షణ ఉండదు. కొన్నాళ్లు వర్షం జాప్యమైనా... విత్తనాలుగానో, చిన్నపాటి పిలకలుగానో మాడి మసై పోతాయి. విత్తనంతోపాటు రైతు శ్రమ, వ్యయం ఇక గాలికే! ఆర్థికంగా దెబ్బతింటాడు. వాతావరణ విభాగం పరిశీలనలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిశోధనలు, ప్రభుత్వ శాఖల ప్రణాళికలు... వెరసి రైతును ఆదుకోవాలి. రుతుపవన సమాచారం నుంచి సరైన మార్కెట్ ద్వారా పంట నగదుగా రైతుల చేతికి వచ్చే వరకు చేయూత ఇవ్వాలి! అప్పుడే మన వ్యవసాయం రైతన్న రాజ్యం! మనదేశం రైతాంగ భారతం! -
Stock Market: ఈ వారంలో జోష్ రావాలంటే ఇవే కీలకం
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు రుతు పవనాల గమనం దారి చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థికపరమైన ప్రధాన గణాంకాల విడుదల లేకపోవడంతో కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి జరుగుతున్న అన్లాకింగ్, వ్యాక్సినేషన్ తదితర అంశాలు సైతం ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషించారు. వీటికితోడు విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరును సైతం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని తెలియజేశారు. ఒడిదొడుకులు.. ఈ వారం జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో హెచ్చుతగ్గులకు అవకాశమున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ట్రేడర్లు జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్ చేసుకునే వీలున్నట్లు తెలియజేశారు. కాగా.. సాంకేతికంగా చూస్తే ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీకి 15,450–15,900 పాయింట్ల మధ్య పటిష్ట అప్‌ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో చార్టుల ప్రకారం నిఫ్టీ 15,400 స్థాయికి ఎగువన కొనసాగితే.. 15,800–15,900 పాయింట్ల వరకూ బలపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 16,050–16,130 పాయింట్లకు చేరవచ్చని అభిప్రాయపడ్డారు. 15,400 దిగువకు చేరితే అప్‌ట్రెండ్‌కు విఘాతం ఏర్పడవచ్చని చెప్పారు. చమురు ధరల ఎఫెక్ట్ గత వారం ముడిచమురు ధరలు 73 డాలర్ల స్థాయికి చేరడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయనుంది. వీటికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 90 నుంచి 92కు బలపడింది. 2023లో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు దీనికి కారణంకాగా.. రూపాయి 74 స్థాయికి బలహీనపడింది. గత వారం 1.17 శాతం క్షీణించింది. ఈ అంశాలు సెంటిమెంటును బలహీనపరిచే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా చూస్తే రుతు పవన విస్తరణ, వ్యాక్తినేషన్ వేగం వంటి అంశాలు మార్కెట్ల కదలికలను నిర్దేశించగలవని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, రిలయన్స్ సెక్యూరిటీస్ నిపుణులు బినోద్ మోడీ పేర్కొన్నారు. ఈ వారం మార్కెట్లు కొంతమేర కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని అంచనా వేశారు. మిడ్ క్యాప్స్ ఫలితాలు ఇప్పటికే ఫలితాల సీజన్ ముగింపునకు చేరుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఇకపై మరిన్ని క్యూ4, పూర్తి ఏడాది(2020–21) ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా సుమారు 500 మిడ్, స్మాల్ కంపెనీలు ఫలితాలు వెలువడనున్నట్లు తెలియజేశారు. ఎఫ్‌పీఐల జోరు గత కొద్ది నెలలుగా దేశీ క్యాపిటల్ మార్కెట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను భారీగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బాటలో జూన్ నెలలో ఇప్పటివరకూ దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ. 13,667 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. కాగా, ఫెడ్ రేట్ల నిర్ణయ ప్రభావం ఇకపై ఎలా ఉంటుందో చూడాలి. చదవండి : డెట్ ఫండ్స్..తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి! -
వానలొస్తున్నాయ్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
తొలకరి చినుకులకు ప్రకతి పులకరింపు సహజం. ఇదే సమయంలో అణగారిఉన్న సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం కూడా సహజమే!వర్షాలు పడడం స్టార్టయిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్ వరకుఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం. వానాకాలం ఆరంభంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కమారుగా చల్లబడటం, ఈ క్లైమేట్ ఛేంజ్‌తో ఇమ్యూనిటీ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి రకరకాల రోగాలు... వర్షాకాలం సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ బాధపడేది జలుబుతోనే! ఇది వైరల్ ఇన్ఫెక్షన్లలో అత్యంత కామన్ ఇన్ఫెక్షన్. ఈ జలుబు కొంతమందిలో క్రమంగా ఫ్లూ, నిమోనియా తదితర వ్యాధుల్లోకి దిగుతుంటుంది. వర్షాలు పడడంతో దోమల ప్రత్యుత్పత్తి వేగం పుంజుకుంటుంది. దీంతో వీటి జనాభా తీవ్రంగా పెరుగుతుంది. వీటి కారణంగా మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులు ప్రబలుతాయి. ∙వానలతో గ్రౌండ్‌వాటర్‌లో, ఉపరితల నీటివనరుల్లో రసాయన మార్పులు జరుగుతాయి. ఇవి నీటిలో బాక్టీరియా ఉధృతికి దోహదం చేస్తాయి. ఇలాంటి కలుషిత జలాలతో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్‌లాంటి రోగాలు విజృంభిస్తాయి. కొత్తనీరు, పాతనీరు కలయికతో పెరిగే ఫంగస్ కారణంగా కొన్నిరకాల చర్మరోగాలు కలుగుతాయి. చదవండి: బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే వర్షాకాలం కరోనా ఎలా మారుతుంది? వేడి వేడి వేసవిలోనే ప్రపంచంపై ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి, వానలు పడ్డాక మరింత చెలరేగుతుందని సామాన్య ప్రజల్లో చాలా భయం నెలకొంది. కానీ ఇందుకు సరైన ఆధారాల్లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది సైతం వర్షాకాలంలో కరోనా విజృంభణ చాలావరకు తగ్గింది. నిజానికి వర్షాకాలంలో కరోనా కన్నా సీజనల్ వ్యాధులే ఎక్కువ డేంజరని చెబుతున్నారు. వీటికి కరోనా జతకలిస్తే మరింత ప్రమాదమని, అందువల్ల సీజనల్ వ్యాధులను అరికడితే కరోనా ఆట కూడా కొంతమేర కట్టించవచ్చని సూచిస్తున్నారు. వర్షాలతో ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ డిపాజిట్లు కొట్టుకుపోతాయని కొందరు నిపుణుల అంచనా. అయితే ఇది పూర్తిగా నిజం కాదని, కరోనాను వర్షాలు కొంతమేర డైల్యూట్ చేయగలవు కానీ పూర్తి గా తొలగించలేవని డెలావర్ ఎపిడమాలజీ డిపార్ట్మెంట్ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వైరస్ సంగతేమో కానీ వాననీటితో బాక్టీరియా పెరుగుతుందని, ఇది కొత్త రోగాలను తెస్తుందని చెప్పారు. వర్షాలతో కరోనా విజృంభిస్తుందని చెప్పలేమని, సీజనల్ వ్యాధులతో కలిసి కరోనా మరింత కలకలం సృష్టిస్తుందని, అందువల్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో కలిగే చిన్నపాటి శారీరక ఇబ్బందులకు వంటింటి చిట్కావైద్యాలు బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలు పాలు, పసుపు నీళ్ల ఆవిరి లాంటివి. సో... తగిన ముందు జాగ్రత్తలు తీసుకొంటే వానాకాలం రాగానే వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడం ఈజీనే! ఏం చేయాలి... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.. అంటే చికిత్స కన్నా నివారణే మేలు! వర్షాకాలంలో వచ్చే జబ్బులబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ సీజన్లో సప్తసూత్రాలు పాటిస్తే చాలావరకు రైనీ సీజన్ రోగాలకు చెక్ పెట్టవచ్చు. ► ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం. బాగా ఉడికించిన ఆహారాన్ని, వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ►దాహం లేకున్నా వీలయినంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అదికూడా ఫిల్టర్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి. ►వానలో తడిసేటప్పుడు మాత్రమే సరదాగా ఉంటుంది, తర్వాత వచ్చేరోగాలతో సరదా తీరిపోతుందని గ్రహించి సాధ్యమైనంత వరకు వానలో తడవకుండా జాగ్రత్త పడాలి. ►ఇంటిలోపల, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు ముసిరే వాతావరణం కల్పించకూడదు. ►ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మస్క్యుటో రిపల్లెంట్స్ వాడాలి. లేదంటే కనీసం ఇంట్లో వేపాకు పొగ పెట్టైనా దోమలను తరిమేయాలి. ►చలిగా ఉందని బద్దకించకుండా రోజూ రెండుపూట్లా శుభ్రంగా స్నానం చేయాలి. లేదంటే చర్మరోగాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ►చేతులతో ముక్కు, కళ్లు, నోరును సాధ్యమైనంతవరకు టచ్ చేయకుండా జాగ్రత్త పడాలి. -
‘నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం’
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి, ఎల్బీనగర్, ఓల్డ్‌సిటీలో నాలాల పరిస్థితిపై శ్రద్ధ చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, నాలాల పనితీరుపై కేటీఆర్ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ నాలాలను ప్రతిరోజూ మ్యాన్‌పవర్‌తో శుభ్రం చేయిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాకాల కార్యాచరణ ప్రణాళికపై మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించామని తెలిపారు. నాలాలు శుభ్రపరిచేందుకు యంత్రాల కొనుగోలు యోచనలో ఉన్నామని, నాళాలపై ప్రతిరోజూ అధికారులు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు నిర్మించామని మంత్రి వెల్లడించారు. నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను త్వరలోనే తొలగిస్తామన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చదవండి:ఈటెల బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడటం.. -
stockmarket: అన్ని మంచి శకునాలే,లాభాల దౌడు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉంది. ఫలితంగా ఫ్లాట్‌గా ఉన్న కీలక సూచీలు ప్రస్తుతం లాభాలతో కళకళలాడాయి.. రికార్డు స్థాయిలను అధిగమించిన సూచీలు జోడు గుర్రాల్లా దూసుకుపోయాయి. . సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 52,328 వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 15,751 రికార్డు స్థాయికి చేరుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల సందడి కనిపించింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవనున్నాయన్న వాతావారణశాఖ అంచనాలకు తోడు సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతుండటం, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షల సడలింపు వార్తలు రావడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది.. బ్యాంకింగ్ ,ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, కోల్ ఇండియా, అదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ లాభాల్లోనూ, మరోవైపు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, సిప్లా టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి. చదవండి : vaccine: చిన్నారులపై ఎయిమ్స్ ట్రయల్స్ Petrol, diesel price today: పెట్రో ధరల రికార్డు -
చల్లటి కబురు.. మూడు రోజుల్లో నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి పులకరించనుంది. అతి త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కొంత భాగంలోకి వ్యాపించాయి. రానున్న రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి దక్షిణ దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ముందుగా ప్రవేశించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. అయితే, రాష్ట్రంలో రుతుపవనాల సీజన్ అప్పుడే కనిపిస్తోంది. నైరుతి ప్రవేశానికి ముందుగానే వానలు కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతం నుంచి భారీ, అతిభారీ వానలు గత రెండుమూడు రోజులుగా నమోదవుతున్నాయి. సీజన్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతాంగంలో నూతనోత్సాహం నిండుతోంది. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురైన ప్రజలు కాస్త చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నైరుతి, ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈసారీ భారీ వర్షాలే... రాష్ట్రంలో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యమైనా... చివరి రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర సాధారణ వర్షపాతం 72.04 సెంటీమీటర్ల వర్షపాతం ఉండగా సీజన్ ముగిసేనాటికి 107.83 సెం.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంకంటే 50 శాతం అధికంగా వానలు కురిశాయి. గత సీజన్‌తో పోలిస్తే 5 శాతం తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ లెక్కన సాధారణ వర్షపాతాన్ని మించి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి మొదలుకుని భారీ వర్షాలు కురిసాయి. వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. చదవండి: థర్డ్‌వేవ్ తీవ్రత: ఆ మూడే కీలకం! -
అన్నదాతకు ‘వర్షా’నందం
భువనేశ్వర్: దేశంలో రుతు పవనాల ఆగమనానికి సానుకూల సంకేతాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి వానలు దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సామాన్యంగా ఉంటాయి. వర్షాధార పంట పొలాల ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురుస్తుంది. జూన్ నెలలో రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షం కురుస్తుందని భారత వాతావరణ విభాగం సోమవారం ముందస్తు (లాంగ్ రేంజ్ ఫోర్కాస్టు) సమాచారం జారీ చేసింది. రాష్ట్రంలో నైరుతి వానలు ప్రారంభమయ్యే తేదీ ఇంకా స్పష్టం కానట్లు వాతావరణ విభాగం తెలిపింది. దేశవ్యాప్తంగా సాధారణం నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అత్యధిక ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని భావిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96 శాతం నుంచి 104 శాతం సమగ్ర వర్షపాతం ముందస్తు అంచనాగా వాతావరణ విభాగం పేర్కొంది. పిడుగుపాటు హెచ్చరిక రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పిడుగుపాటు ప్రమాదాలు ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. బాలాసోర్, భద్రక్, సుందరగడ్, కెంజొహార్, మయూర్భంజ్, సోన్పూర్, బౌధ్, నువాపడా, కలహండి, కందమాల్, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, గంజాం, ఖుర్దా, నయాగడ్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో వాతావరణంలో మార్పు సంభవిస్తుందని ఉరుములు, మెరుపులతో పిడుగుపాటు సంఘటనలకు ముందస్తు సమాచారం జారీ అయింది. సమగ్రంగా 21 జిల్లాల్లో కాల వైశాఖి వాతావరణం తాండవిస్తుందని ఎల్లో వార్నింగ్ జారీ అయింది. ఈ నెల 2వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం వరకు ఇటువంటి వాతావరణం బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, ఢెంకనాల్, కెంజొహార్, మయూర్భంజ్, నువాపడా, కలహండి, కందమాల్, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, గంజాం, పూరీ, ఖుర్దా, నయాగడ్ జిల్లాల్లో నెలకొని ఉంటుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం వరకు బాలాసోర్, భద్రక్, దేవ్గడ్, అనుగుల్, కెంజొహార్, మయూర్భంజ్, సోన్పూర్, బౌధ్, నువాపడా, బలంగీరు, కలహండి, కందమాల్, నవరంగపూర్, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు పిడుగుపాటు వాతావరణం నెలకొంటుంది. -
కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యం..
తిరువనంతపురం: దేశంలో నైరుతి రుతుపవనాలు రెండ్రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నట్లు భారత దేశ వాతావరణ విభాగం తెలిపింది. అయితే, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అదే విధంగా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం, మధ్య భారతదేశంలో ఓ మోస్తరు అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం ఒక ప్రకటనలో తెలియ చేసింది. -
Monsoon: రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు వేగంగా వచ్చేస్తున్నాయి. జూన్ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకుంటాయి. అయితే ఈసారి మే 31న కేరళకు రుతుపవనాలు వస్తాయని వాతవరణ శాఖ మొదట అంచనా వేసింది. ప్రస్తుతం జూన్ 3న కేరళను తాకుతాయని చెబుతోంది. తొలకరి చినుకులు జూన్ మొదటి వారానికి కర్నాటక, గోవా తీరాలకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. రుతు పవనాల ఆగమనంతో కేరళ, మహే, కర్నాటకలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. మండుతున్న ఎండలు గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగ్గుమంటున్నాడు. మరో వారం పది రోజుల్లో రుతు పవనాలు తెలుగు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గనుంది. ఇటీవల వచ్చిన టౌటే, యాస్ తుపానుల కారణంగా రుతుపవనాల రాకలో ఏదైనా జాప్యం జరుగుతుందేమమో అనే ఆందోళన రైతుల్లో నెలకొని ఉండేది. కానీ రుతుపవనాలు సకాలంలో వస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. -
యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: యాస్ తుపాను గురువారం బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఇంకా బలహీనపడి తీవ్రత తగ్గుతుందని వివరించింది. ప్రస్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు సూచిస్తూ, దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని స్పష్టం చేసింది. నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో చాలాభాగం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొంతభాగం వరకు బలమైన గాలులు ప్రవేశించాయని వివరించింది. రాష్ట్రానికి పశి్చమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నైరుతి రుతుపవనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శని, ఆది, సోమవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఓ మాదిరి వానలు పడతాయని వివరించింది. ఇక రాష్ట్రంలో గురువారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
Monsoon 2021: ఈ ఏడాది సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో కురిసే 75 శాతంపైగా వర్షపాతానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది సాధారణంగా ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల సరాసరి వర్షపాతం 103 శాతంగా ఉంటుందని, ఈ అంచనాకు అటూఇటూగా 5 శాతం మాత్రమే తేడా ఉండే అవకాశముందని స్కైమెట్ వాతావరణ విభాగం ప్రెసిడెంట్ జీపీ శర్మ తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన సాధారణ పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు. రుతు పవనాలు సాధారణంగా ఉండేందుకు 65%, సాధారణంగా కంటే ఎక్కువగా ఉండేందుకు 15%వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 96–104 మధ్యలో వర్షపాతం ఉంటే సాధారణంగా, 103 ఉంటే సాధారణంగా కంటే ఎక్కువగా పరిగణిస్తారు. నెలల వారీగా చూస్తే, జూన్‌లో సరాసరి వర్షపాతం 106%, జూలైలో 97%, ఆగస్టు, సెప్టెంబర్లలో 99%, 116 శాతం కురిసే అవకాశాలున్నాయని స్కైమెట్ తెలిపింది. వరసగా మూడో ఏడాది 2021లో కూడా రుతుపవనాలు సానుకూలంగా ఉన్నాయని జీపీ శర్మ తెలిపారు. గడిచిన రెండేళ్లలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైందన్నారు. భౌగోళిక పరంగా చూస్తే ఉత్తర భారత మైదాన ప్రాంతం, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే ప్రమాదముందని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతున్న లానినా ప్రభావం నెమ్మదించడంతోపాటు ఈ సీజన్లో స్థిరంగా ఉండే అవకాశముందని స్కైమెట్ సీఈవో యోగేశ్ పాటిల్ చెప్పారు. కాగా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారిక అంచనాలను ఈ వారంలోనే విడుదల చేయనుంది. ఇక్కడ చదవండి: గుడ్‌న్యూస్: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు టైమ్ మెషీన్స్: ఏయే పనికి ఎంత టైం కేటాయిస్తున్నామంటే! -
ఈ ఏడాది సాధారణ వర్షపాతమే
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని ప్రైవేట్ రంగ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. పసిఫిక్ సముద్రంలో చల్లదనం, లా నినో పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో జూన్–సెప్టెంబర్ నెలల్లో వానలు సాధారణంగానే ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం గడ్డు పరిస్థితులే కొనసాగుతాయని ఆదివారం తన వెబ్సైట్లో వివరించింది.2021 వర్షాకాలం ఘనంగా ప్రారంభమయినా తర్వాతి సగం కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతం 96%–104% మధ్య అంటే 88 సెంటీమీటర్ల మేర నమోదవుతుందని పేర్కొంది. మన దేశానికి జూన్‌లో మొదలయ్యే 4 నెలల వర్షాకాలం చాలా కీలకమైంది. ఖరీఫ్‌లో వర్షాధార పంటలకే కాదు, జలాశయాలు నిండితే రబీలో కూడా పంటలు పండేందుకు వర్ష రుతువే ఆధారం. కోట్లాది మందికి వర్షాలే జీవనాధారం. ఆహార ధరలను కూడా ఈ కాలం ప్రభావితం చేస్తుంది. వరి, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌లో వానలు సరిగ్గా కురియకుంటే పంటల దిగుబడి పడిపోతుంది. మంచినీటికి కూడా కొరత ఏర్పడుతుంది. తమిళనాడు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఏడాదిలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో నాలుగు నెలల కాలంలోనే 60 శాతం నుంచి 90 శాతం వరకు నమోదవుతుంది. కాగా, 2012 నుంచి స్కైమెట్ సంస్థ వాతావరణ అంచనా నివేదికలను ప్రకటిస్తోంది. త్వరలోనే 2021కి సంబంధించిన అంచనాలను వెలువరించనుంది. -
షాక్ కొడుతుంది జాగ్రత్త..
సీతంపేట: రెండు రోజుల కిందట లోవగూడ గ్రామానికి చెందిన సవర చిన్నారావు తెగిపడిన విద్యుత్ వైరును చూడకుండా ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి మృతి చెందాడు. అలాగే ముత్యాలుకు చెందిన సవర జమ్మడు అనే గిరిజనుడు కొండపోడు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో పడి ఉన్న విద్యుత్ తీగ లపై చూసుకోకుండా కాలు వేయడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఇటీవల దేవనాపురానికి చెందిన కుండంగి మే డపైకి ఎక్కుతుండగా వాలి ఉన్న విద్యుత్ వైరు పొరపాటున పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందింది. ఇలా ఇదే మండలంలో కాకుండా జిల్లాలోని విద్యుత్ ప్రమాదాలు చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించడానికి మనమే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైందంటే విద్యుత్ ప్రమాదాలు మొదలైనట్టే. ఎందుకంటే వర్షాలకు, గాలులకు చెట్లు కొమ్మలు విరగడం, విద్యుత్ తీగలు తెగిపడడం జరుగుతుంటాయి. ఈ సమయంలో వీటిని గమనించకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. మ రోవైపు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఇళ్ల మధ్యనే ఉండడం, వాటికి సరైన రక్షణ ఏర్పాటు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అలాగే ట్రాన్స్ఫార్మర్ల మధ్య తుప్పలు ఉండడం, విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడడం, పొలాల్లో వేసిన విద్యుత్ తీగలు చేతికందేలా ఉండడం, ఇంటికి సమీపం నుంచే విద్యుత్ తీగలు వెళ్లడం, స్తంభాలు విరిగిపోవడం, ఒరిగిపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడుడు లోటు పాట్లు సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నివారణ ఇలా.. •విద్యుత్ స్తంభాలను తాకకూడదు. •స్తంభాలకు తాకుతూ వెళ్లే టెలిఫోన్, టెలివిజన్ కేబుళ్లు తాకరాదు. •నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు. •సబ్‌స్టేషన్ చుట్టూ ఉన్న రక్షణ తీగను పట్టుకోకూడదు. •భవన నిర్మాణం పనుల్లో విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి. •తడి బట్టలు, తడి చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోకూడదు. మరమ్మతులు చేయరాదు. వీటిని చేయవద్దు.. ►ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్తవేయడం. ►సబ్‌స్టేషన్ వారి అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలు ఎక్కడం. ►సొంతంగా ఇంటికి వైరింగ్ చేయడం. ►స్తంభం ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయడం ►విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టడం. ఇంట్లో ఈ జాగ్రత్తలు.. •ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వద్దకు పిల్లలు వెళ్లకుండా చూడాలి. •వేడి నీరు ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ పరికరాలు ఉంచకూడదు. •చేతులు తడిగా ఉన్నప్పుడు స్విచ్ లు తాకకూడదు. •స్విచ్ ఆఫ్ చేయకుండా ప్లగ్‌లను తీయకూడదు. •పిల్లలకు అందేంత ఎత్తులో ప్లగ్గులు ఉంచకూడదు. అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్ వైర్లు తెగిపడినా, వాలినా లోకల్‌గా ఎలాంటి రిపేర్లు చేయరాదు. మాకు సమాచారం ఇవ్వాలి లేదంటే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. వెంటనే సమస్య పరిష్కారమవుతుంది. వ్యవసాయ బోర్లకు ఏవైనా పాత సరీ్వస్ వైర్లు ఉంటే వాటిని మార్చుకోవాలి. స్విచ్‌లు వంటివి చూసుకోవాలి. పాతకాలానికి ఎలాంటి వైర్లు ఉన్నా తీసివేయాలి. – బి.సాంబశివరావు, ఈఈ, ట్రాన్స్‌కో -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
మాన్సూన్ వచ్చేసింది..
-
గుడ్‌న్యూస్ : కేరళను తాకిన రుతుపవనాలు
తిరువనంతరం : మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాలకు ఐఎండీ యల్లో అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్ జిల్లాలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు పేర్కొన్నారు. కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి : వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు -
ఆ భవనాలను కూల్చివేస్తాం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. కేబీఆర్ పార్కులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 267 మాన్సున్ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.16 డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.70 జేసీబీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. చెట్లు పడిన 10 ప్రాంతాల్లో వెంటనే క్లియర్ చేశామని పేర్కొన్నారు. అధికంగా నీళ్లు నిలిచిపోయే 30 ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ నీళ్లు తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా నగరంలో 1500 శిథిల భవనాలను కూల్చివేశామని.. మరో 200 భవనాలను గుర్తించామన్నారు. వాటిని త్వరలోనే కూల్చివేస్తామని బొంతు రామ్మోహన్ వెల్లడించారు. -
వానాకాలం వ్యవసాయంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్లో వ్యవసాయ సన్నద్ధతపై సీఎం కేసీఆర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు మొదలు వ్యవసాయ శాఖకు చెందిన కిందిస్థాయి ఏఈవో నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఇందులో పాల్గొననున్నారు. అలాగే ఉద్యాన, మార్కెటింగ్ జిల్లా ఉన్నతాధికారులు, మార్క్‌ఫెడ్ మేనేజర్లు, ఆగ్రోస్ రీజనల్ మేనేజర్లు, విత్తన కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు, జిల్లా సహకారశాఖ అధికారులు, రైతుబంధు సమితి గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. కాన్ఫరెన్స్ ఎజెండా అంశాలను వ్యవసాయశాఖ ఆదివారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు అందజేసింది. ఎజెండా అంశాలు ఇవే... గ్రామాలు, మండలాల వారీగా ప్రస్తుత వానాకాలం సీజన్లో సాగు చేయాల్సిన వరి, మేలు రకం విత్తనాలు } గ్రామాలు, మండలాలవారీగా మొక్కజొన్న ప్రత్యామ్నాయ పంటల సాగు, ∙గ్రామాలు, మండలాలవారీగా కంది పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు అవకాశాలపై సలహాలు గ్రామాలు, మండలాలవారీగా పత్తి పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు గల అవకాశాలపై చర్చ ఆయిల్‌పామ్, నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి అనుకూలమైన మండలాలు, గ్రామాల వారీగావివరాలు ∙పచ్చిరొట్టను ప్రోత్సహించడంపై వివిధ రకాల పంటలకు సంబంధించి అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఎరువుల సరఫరా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నది ఎంత? జిల్లాలు, మండలాల వారీగా పంటల మ్యాపింగ్ -
వ్యాధులనుంచి ప్రజలను కాపాడుకుందాం
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా పు రపాలక శాఖ ఆధ్వర్యంలో శ్రీ కారం చుట్టిన ‘ప్రతి ఆదివారం– పది గంటలకి –పది నిమిషాలు’ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పాల్గొనడంతో పాటు ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను నివారిద్దామని కోరారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరికీ మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఈ లేఖలో తెలిపారు. కరోనాపై చేస్తున్న స మష్టి పోరాటం వల్ల ప్రజారో గ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అందరిలో అవగాహన పెరిగిందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించ కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించారని, పట్టణ ప్రగతిలో భాగంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. దోమల నివారణకు జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఇందుకోసం వారానికి కనీసం 10 నిమిషాలను మన కోసం, మన పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని నిర్ణయించామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ సహకారంతో పురపాలక శాఖ ఒక క్యాలెండర్ రూపంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా కీటక నివారిణిల వినియోగం, దోమల నిర్మూలనకు మలాథియాన్ స్ప్రే, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వారానికోసారి స్ప్రే చేస్తున్నామన్నారు. మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి న నీటిని ఎత్తిపోయడం, రోజూ చెత్త తరలింపును పకడ్బందీగా నిర్వహించాలని పురపాలికల ను ఆదేశించామన్నారు. ఆదివారం శుభ్రత కోసం.. మన ప్రజలను, పట్టణాలను కా పాడుకునే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం –పది గంటలకు–పదినిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని,. రానున్న పదివారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నా రు. శాసన సభ్యులు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని, తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. డాక్యుమెంట్ రైటర్స్ రూ.4లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం రూ. 4 లక్షల విరాళాన్ని అందించింది. ఆదివారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డితో కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివనాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణమాచారి తదితరులు ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేశారు. -
రైతులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలో కోట్లాది రైతులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని బుధవారం వెల్లడించింది. ఈ సంవత్సరం సాధారణ రుతుపవనాలు ఉంటాయని భూఉపరితల శాస్ర్తాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి ఐఎండీ ప్రారంభ తేదీలను విడుదల చేసింది. రాజీవన్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనుండగా, జూన్ 4న చెన్నైలో, జూన్ 8న హైదారబాద్‌ను తాకనున్నాయి. ఇక జూన్ 10న పుణేలో, జూన్ 11న ముంబైలో రుతుపవానాలు ప్రవేశిస్తాయి. జూన్ 27న నైరుతి రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీని తాకుతాయని ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ భారత్‌లో రుతుపవనాల సీజన్ ఉండగా..వరి, గోధుమలు, చెరకు, నూనెగింజలు వంటి పలు ప్రధాన పంటల కోసం రైతులు వర్షాలపైనే అధికంగా ఆధారపడతారు. చదవండి : హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం -
ఈసారి వర్షాల్లో దూకుడెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఉపఖండం నుంచి సాధారణంగా రుతు పవనాలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వెనక్కి పోతాయి. ఈ సారి నెల పది రోజులు ఆలస్యంగా అక్టోబర్ పదవ తేదీ నుంచి వెనక్కి మళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధన శాఖ అంచనా వేసింది. ఈసారి సాధారణ వర్షపాతాలే ఉంటాయని గత ఏప్రిల్ నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి రుతు పవనాల సీజన్ పూర్తి అనూహ్యంగా కొనసాగింది. మొట్టమొదట కేరళలోని వారం రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. మూడు వారాల అనంతరం ముంబైకి చేరుకున్నాయి. రుతుపవనాల ఆలస్యం వల్ల జూన్ నెలలో 33 శాతం లోటు వర్షపాతం నమోదయింది. సీజన్ ముగిసే సమయానికి సాధారణ వర్షపాతం కన్నా పది శాతం ఎక్కువ కురిసింది. అనతి కాలంలోనే భారీ వర్షాలు కురియడం మరో విశేషం. దీని వల్లనే అధిక వర్షపాతం నమోదయింది. ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి. మొదట్లో కర్ణాటక వరదల్లో 80 మంది మరణించారు. బీహార్‌లో సెప్టెంబర్ నెలలో వరదలు సంభవించి అంతే మంది మరణించారు. 1951 నుంచి 2000 వరకు 50 సంవత్సరాల్లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు సరాసరిన 88 శాతం వర్షపాతం నమోదయింది. ఈ ఒక్క ఏడాదే రుతుపవనాల కాలంలో 97 శాతం వర్షపాతం కురిసింది. సీజన్ పూర్తి కాలానికి అంటే అక్టోబర్ మొదటి వారానికి సరాసరి తీసుకున్నట్లయితే 110 శాతం వర్షపాతం నమోదయింది. జూన్ మొదటి వారంలో వర్షపాతం లోటు సెప్టెంబర్ మూడోవారంలో వర్షపాతం లోటు సీజన్లో మొదటి మూడు వారాలపాటు అతి తక్కువ వర్షపాతం కురిసి, ఆ తర్వాత వెనువెంటనే భారీ వర్షాలు కురిశాయి. ఈసారి వర్షపాతం ఇలా కొనసాగడం అన్నది ఓ ప్రత్యేకమైనదని, వచ్చే ఏడాది ఇది పునరావృతం అవుతుందని భావించడం తప్పని పుణెకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ తెలిపారు. ఈసారి మధ్య, దక్షిణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిసింది. ఈ రెండు ప్రాంతాల్లో గతేడాది తక్కువ వర్షపాతం నమోదయింది. ఇప్పటికీ ఈశాన్య ప్రాంతాల్లో, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురిసింది. గతేడాది కూడా ఈ ప్రాంతాల్లో 24 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. గతేడాది 9 శాతం తక్కువ వర్షపాతం నమోదుకాగా, ఈసారి 110 శాతం నమోదవడం విశేషం.ఆలస్యంగా వర్షాలు కురవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడం వాస్తవమే అయినా అధిక వర్షపాతం వల్ల దేశంలోని పలు రిజర్వాయర్లు నిండడం, భూగర్భ జలాలు పెరగడం హర్షించతగ్గ పరిణామం. అల్ప పీడనాల వల్లనే ఈసారి అధిక వర్షం కురిసినట్లు డీఎస్ పాయ్ తెలియజేశారు. -
ఇక వర్షాలే వర్షాలు
సాక్షి, అమరావతి : ఈ రెండు నెలలు వర్షాలకు కొదవ ఉండదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భరోసా ఇచ్చింది. రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో సరైన వానలు కురవక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు చల్లని కబురు చెప్పింది. ప్రతి ఏటా నైరుతి సీజనుకు ముందు ఒకసారి, రెండు నెలల తర్వాత మరోసారి వర్షాల పరిస్థితిపై రూపొందించే దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ) అంచనాలను ఐఎండీ గురువారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, దాదాపు వంద శాతం (8 శాతం +/–) సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆ నివేదికలో వెల్లడించింది. ఈ నెలలో 99 శాతం, సెప్టెంబరులో అంతకు మించి వర్షపాతం కురుస్తుందని తెలిపింది. పసిఫిక్ మహా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల న్యూట్రల్‌గా ఉన్న ఎల్ నినో పరిస్థితులు క్రమంగా బలహీనపడి లానినా (అనుకూల) పరిస్థితులేర్పడుతున్నాయని, ఇవి రుతుపవనాల సీజను ముగిసే దాకా కొనసాగుతాయని వివరించింది. మొదటి రెండు నెలలు నిరాశాజనకమే.. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబరు వరకు ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది ఇవి మొదటి రెండు నెలలు ఆశాజనకంగా వర్షాలు కురిపించలేదు. జూన్ నెలంతా తేలికపాటి వానలకే పరిమితమయ్యాయి. రుతుపవనాల చురుకుదనానికి దోహదపడే అల్పపీడనాలు, వాయుగుండాలు వంటివి బంగాళాఖాతంలో ఏర్పడకపోవడం ఈ పరిస్థితికి దారి తీసింది. దీంతో రాష్ట్రంలో సాధారణం కంటే 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఖరీఫ్ సీజనులో 19.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరగాల్సి ఉండగా 13.83 లక్షల హెక్టార్లలో మాత్రమే పూర్తయింది. వారం రోజుల నుంచి ఉపరితల ఆవర్తనం, ద్రోణులు, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఈ సీజనులో చెప్పుకోదగిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పలు జిల్లాల్లో వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నూలు జిల్లా నంద్యాల, జూపాడు బంగ్లాలో ఏకధాటిగా మూడు గంటల పాటు వర్షం కురిసింది. ఆదోనిలో 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్లో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే మొదటి సారని రైతులు తెలిపారు. కృష్ణా జిల్లాలో 16.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అవనిగడ్డ మండలంలో 53.2 మిల్లీ మీటర్లు కురిసింది. జల దిగ్బంధంలో 34 గిరిజన గ్రామాలు తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనం స్తంభించిపోయింది. లంక గ్రామాల్లో తాత్కాలిక రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. గంటి పెదపూడిలంక, అనగారలంక, ఉడుమూడిలంక, బూరుగలంక, అరిగెలివారి లంకల్లో రాకపోకలు స్తంభించాయి. పలు మండలాల్లో గోదావరి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ 34 గిరిజన గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయి. 2 వేల మంది ముంపు బాధితులను గుర్తించిన అధికారులు వారికి భోజనాలు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దేవీపట్నం–వీరవరం గ్రామాల మధ్య వరద నీరు ఉండటంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. -
రాష్ట్రంలోకి రుతుపవనాలు
-
రెండ్రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు రాష్ట్రంలో మొదలైనట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయని, పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో 13.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసిందని ఆయన తెలిపారు. కునూరులో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి గోరిలలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. కమాన్‌పూర్‌లో 8.8, భూపాలపల్లి, జనగాం జిల్లా రఘునాథపల్లిలో 8.7 సెంటీమీటర్ల చొప్పున వర్ష పాతం రికార్డు అయ్యింది. పెద్ద పల్లి జిల్లా శ్రీరాంపూర్ లో 8.3 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ములుగు జిల్లా మల్లంపల్లి లో 7.8 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వైకేరెడ్డి తెలిపారు . పెద్దపల్లి జిల్లా కనుకులలో 7.4, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 7.1, ఖమ్మం జిల్లా లింగాల, వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో 6.9, వరంగల్ అర్బన్ జిల్లా మర్రిపల్లిగూడెంలో 6.8, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 6.5, మల్లారంలో 6.4, కరీంనగర్ జిల్లా చింతకుంటలో 6.2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. -
‘మృగశిర’ మురిపించేనా!
ఖరీఫ్ సాగుకు కోటి ఆశలతో అన్నదాత సన్నద్ధమయ్యాడు. తెల్లవారుజాము కోడి కూత మొదలుకొని హలం పట్టి పొలం దున్నడానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు. మరోపక్క వ్యవసాయశాఖ ఖరీఫ్‌కు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా గతేడాది వర్షాభావ పరిస్థితుల పుణ్యమా అని పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొని చినుకు రాలలేదు. అన్నదాత తీవ్ర స్థాయిలో నలిగిపోయాడు. ఈసారి ఖరీఫ్‌కు సంబంధించి సాగుకు అన్నదాత సిద్ధమయ్యాడు. అందులోనూ రోహిణికార్తె సమయంలో రోళ్లు సైతం పగలిపోతాయని నానుడి ఉంది. రోహిణికార్తె పోయి మృగశిర వచ్చింది. ప్రస్తుతం ఆశలన్నీ మృగశిరపైనే నెలకొన్నాయి. సాక్షి కడప : జిల్లాలో అన్నదాతలు ప్రస్తుతం పొలాలను దున్ని.. పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఎక్కువగా వేరుశనగ, వరి పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌లో వర్షాధారం కింద ఒకపక్క, ఇంకోపక్క కేసీ కెనాల్ కింద కూడా వరి పంటను కూడా సాగు చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉండగా..1,79,929 హెక్టార్లలో పంటల సాగు చేసే అవకాశముందని వ్యవసాయశాఖ గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ప్రస్తుతం మృగశిర కార్తె మురిపిస్తుందని రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది జూన్‌లో వర్షాలు రావడం, సాగుతోపాటు పంటలు వేయడం జరుగుతుంది. అయితే గత రెండు, మూడేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఈసారి వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్న నేపధ్యంలో వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. రోహిణిని మరిపిస్తున్న ఎండలు జిల్లాలో రోహిణికార్తె శకం ముగిసినా ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. జూన్ నె ల ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఎండల వేడి మాత్రం తగ్గలేదు. పైగా వేడిగాలులు కూడా భయపెడుతున్నాయి. ఒకప్రక్క ఎండలు, మరోప్రక్క వేడిగాలులు, ఇంకోప్రక్క ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రోహిణికార్తె సమయంలోనే ఎండలు అధికంగా ఉంటాయి. అలాంటిది కార్తె పోయినా కూడా మరిపించేలా ఇప్పుడు ఎండలు కనిపిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఏది ఏమైనా భారీ వర్షాలు కురిస్తే తప్ప ఉపశమనం కనిపించడం లేదు. రుతు పవనాలపైనే ఆశలు రాష్ట్రంలోకి నైరుతి రుతు వపనాలు నాలుగైదు రోజుల్లో ప్రవేశించనున్నాయి. రుతు పవనాల రాకతో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి వర్షాలు కురిస్తే ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ప్రారంభించవచ్చని అన్నదాతలు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అక్కడక్కడ తొలకరి జల్లులు మాత్రమే కురిశాయి. కొంతమేర భారీ వర్షాలు వస్తేనే ప్రస్తుత ఖరీప్ సీజన్లో సాగుకు అనుకూల పరిస్థితి ఉంటుంది. ఆకాశం మేఘావృతం అవుతున్నా గా>లులు, ఇతర కారణాలతో సరైన వర్షపాతం నమోదు కాలేదు. ప్రస్తుతం జూన్‌కు సంబంధించి 73.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా....ఇప్పటివరకు 14.9 మి.మీ. కురిసింది. మరో 58.5 మి.మీ. లోటు వర్షపాతం కురిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాలపైనే రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయశాఖ సన్నద్దం ఖరీఫ్‌సాగుకు వ్యవసాయశాఖ సన్నద్దమైంది. అందుకు సంబంధించి ప్రభుత్వం సరఫరా చేసే వేరుశనగ విత్తనకాయల ధరలను నిర్ణయించగా....ఇప్పటికే విత్తన కాయలను మండలాలను మంజూరు చేశారు. జిల్లాకు 32,175 క్వింటాళ్లను కేటాయించారు. అంతేకాకుండా వేరుశనగతోపాటు మిగతా అన్ని రకాల పంటలకు సంబంధించి వ్తితనాలను కలుపుకుని మరో 49 వేల క్వింటాళ్లు అవసరమని ప్రణాళికలు రూపొందించారు. విత్తనాలను అందించి రైతన్నలను సిద్దం చేయడం ద్వారా ఎప్పుడు వర్షం పడినా అప్పటికప్పుడు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంతేకాకుండా 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా అవసరమని ఇప్పటికే వ్యవసాయశాఖ జూన్ మొదటివారంలోనే నివేదికలు పంపారు. -
ఈసారి రుతుపవనాల రాక మరింత ఆలస్యం
-
రుతు పవనాల రాక మరింత ఆలస్యం
న్యూఢిల్లీ: రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తాజాగా అంచనా వేసింది. రుతుపవనాల్లో మందగమనం కారణంగా జూన్ 7వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకనున్నాయని పేర్కొంది. ఇంతకు ముందు అంచనా ప్రకారం జూన్ 4వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకవచ్చని తెలిపింది. రుతుపవనాల పురోగమనం మందకొడిగా సాగడంతో ఈ అంచనాలను మార్చుకోవాల్సి వచ్చిందని స్కైమెట్ ప్రెసిడెంట్ జీపీ శర్మ తెలిపారు. రుతుపవనాలు నెమ్మదిగా కదలటానికి సొమాలియా తీరంలో అల్పపీడనం, మధ్య అరేబియా సముద్రంపై అధికపీడనం, సొమాలియా తీరంపై వైపు నుంచి వీస్తున్న బలమైన గాలులే కారణమన్నారు. -
జూన్ 11న రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉం డాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై బుధవారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వడగాడ్పు లు ఇంకా కొనసాగితే వ్యవసాయ శాఖ అందుకు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవసరమైన హెచ్చరికలు పంపాలని ఆదేశించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, తెలంగాణలో జూన్ 10 లేదా 11న చేరుకునే అవకాశం ఉంద న్నారు. అధిక వర్షపాత హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంట్రోల్ రూంల ద్వారా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాతావరణ శాఖ ద్వారా ప్రాంతాల వారీగా వర్షం వచ్చే వివరాలను ఇవ్వాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వర్షాకాలం ప్రారంభానికి ముందే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు, పట్టణాలలో అత్యధిక వర్షాలు కురిసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు ఇచ్చారు. వివిధ శాఖల కంట్రోల్ రూంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడంతోపాటు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వర్షపాత వివరాలు రోజువారీగా జిల్లాలకు పంపిస్తామని, జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమీక్షించడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. రైల్వే, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించామని.. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. 195 బృందాల ఏర్పాటు.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధిలో 195 సంచార బృందాలను ఏర్పాటు చేశామని సంస్థ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో ఫ్లడ్ మ్యాప్స్ రూపొందిస్తున్నామని, విపత్తుల నిర్వహణ బృందాలు 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. నాలాల పూడికతీతను జూన్ 6 నాటికి పూర్తి చేస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పట్టణ, గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కూలిన చెట్ల తొలగింపునకు చర్యలతోపాటు అవసరమైన హెలీప్యాడ్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆర్అండ్బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. గోదావరి నది పరీవాహక పరిధిలో ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు కరకట్టలను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు తెలిపారు. -
అండమాన్‌లోకి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులలో కొన్ని ప్రాంతాలలోకి శనివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. భారత వాతావరణశాఖ ఈనెల 18, 19 తేదీల్లో ఈ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం సరిగ్గా అనుకున్న సమయానికి అండమాన్, నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లోకి రావడంతో మిగిలిన ప్రాంతాల్లోకి కూడా వాతావరణ శాఖ చెప్పినట్లుగానే వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్తంత ఆలస్యంగానే రానున్నాయి. ఆరో తేదీన కేరళలో ప్రవేశిస్తాయని, దీనికి నాలుగు రోజులు అటుఇటు తేదీల్లో ఎప్పుడైనా వచ్చే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత 11వ తేదీన తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించినా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు తెలంగాణలో వడగాడ్పులు కొనసాగే అవకాశముంది. రాగల మూడు రోజులు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శనివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 44, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, హన్మకొండలలో 42, భద్రాచలం, ఖమ్మం, నల్లగొండల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. -
11న రాష్ట్రానికి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణకు కాస్తంత ఆలస్యంగానే రానున్నాయి. ఇవి జూన్ 11వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దానికిముందు జూన్ ఆరో తేదీన కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అనంతరం తెలంగాణలోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అండమాన్ దీవుల సమీపంలో సముద్రంపై రుతుపవనాల సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో కేరళలో రుతుపవనాలు కొద్దిగా మిగతా 2వ పేజీలో u ఆలస్యం కానున్నాయి. ఆరో తేదీన కేరళలో ప్రవేశిస్తాయని భావిస్తుండగా.. ఈ సమయానికి నాలుగైదు రోజులు అటు ఇటుగా రావడం ఖాయమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీనే కేరళను తాకాయి. ఆ తర్వాత జూన్ 8వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈసారి కేరళను తాకిన ఐదు రోజులకు అంటే 11వ తేదీన తెలంగాణలోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ఈసారి 96% వర్షాలు సాధారణంతో పోలిస్తే ఈసారి 96% వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ లెక్క దాదాపుగా సాధారణ వర్షాపాతం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో నైరుతి సీజన్ సాధారణ వర్షపాతం 755.1 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, 96% లెక్కన ఈసారి 717 ఎంఎంలు నమోదయ్యే అవకాశముంది. అయితే గతేడాది ఇదే సీజన్లో సాధారణానికి దగ్గరగా 97% వర్షపాతం కురుస్తుందని వాతావరణశాఖ వెల్లడించినా 92 శాతం వర్షమే కురిసింది. ఐదు శాతం లోటు నమోదైంది. 2016లో సాధారణం కంటే ఏకంగా 19% అధిక వర్షపాతం తెలంగాణలో నమోదైంది. రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కోసారి రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని వాతావరణాధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే గతేడాది ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అప్పుడు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసిన తేదీల్లోనే రుతుపవనాలు ప్రవేశించడం విశేషం. జూన్ 4–8 తేదీల మధ్య తెలంగాణలోకి నైరుతి ప్రవేశిస్తుందని ప్రకటించగా, ఆ ప్రకారమే 8వ తేదీన రావడం గమనార్హం. ఈసారి 11వ తేదీన వస్తాయని, నాలుగైదు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చంటున్నారు. గతేడాది 17 జిల్లాల్లో వర్షాభావం గతేడాది నైరుతి రుతుపవనాలు నిరాశాజనకంగా ఉండటం, ఆ తర్వాత వచ్చిన ఈశాన్య రుతుపవనాలూ అంతంత మాత్రంగానే ఉండటంతో భూగర్భ జలాలు పడిపోయాయి. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో నీటి వనరులు అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో తాగు, సాగునీటికి కటకట ఏర్పడింది. తెలంగాణలో గత 3నెలలుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయశాఖ తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని వివరించింది. మొత్తంగా చూస్తే 17 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వరంగల్ (రూరల్), రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు తెలిపింది. -
చల్లని కబురు; జూన్ 4న కేరళకు రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ : భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. జూన్ 4న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని జూన్ 29 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుతాయని ప్రైవేట్ వాతావరణ కేంద్రం స్కైమెట్ అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల మీదుగా రుతపవనాలు ఈనెల 22న ప్రవేశించి కేరళ దిశగా కదులుతాయని వాటి పురోగమనం మందకొడిగా ఉండటంతో ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుందని, తూర్పు, ఈశాన్య, మధ్య భారత ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. జూన్ 4కు అటూ ఇటుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. -
ఎల్‌నినో ప్రమాదంతో తక్కువ వర్షాలు: స్కైమెట్
వ్యవసాయం కీలకమైన భారత ఆర్థిక వ్యవస్థకు, అన్నదాతలకు నిజంగా బ్యాడ్ న్యూస్. ప్రయివేట్ రంగ సంస్థ స్కైమెట్ వర్షపాతానికి సంబంధించిన నిరాశాజనక అంచనాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం సాధారణం తక్కువ నమోదవుతుందని తెలిపింది. సగటుకంటే అధికం లేదా అధిక వర్షపాతానికి అవకాశాలు కనిపించడంలేదంటూ ముందస్తు వాతావరణ అంచనాల్లో స్కైమెట్ పేర్కొంది. 2019 సంవత్సరంలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 55 శాతం ఉందని తెలిపింది. అంతేకాదు కరువు సంభవించే అవకాశాలు 15 శాతం ఉన్నాయంటూ సంచలన అంచనాలను వెల్లడించింది. ఎల్పీఏ వర్షపాతం జూన్‌లో 77 శాతం, 91 శాతం, ఆగస్టులో 102 శాతం, సెప్టెంబరులో 99 శాతంగా వుంటుందని అంచనా వేసింది.ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎల్పీఏ 96-104 శాతం మధ్య రుతుపవనాలు సాధారణమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా వర్షాకాలమైన (జూన్ -సెప్టెంబరు) నాలుగునెలల కాల వ్యవధిలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుందని తెలిపింది. అధిక లేదా సాధారణ వర్షపాతం అన్న ఊసేలేదని వ్యాఖ్యానించింది. లాంగ్ పీరియడ్ రేంజ్(ఎల్పీఏ)లో రుతుపవనాల ప్రభావం 93 శాతం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది సాధారణం కంటే తక్కువే. 1951 నుంచి 2000వరకు ఎల్పీఏ సగటున 89 సెంటీమీటర్లు ఉందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర బాగా ప్రభావితం కానుందన్నారు. అయితే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏప్రిల్ మధ్యలో అంచనాలను ప్రకటించనున్నది. మరోవైపు వేసవి పొడవునా ఎల్‌నినో కొనసాగుతున్నందున వచ్చే వానాకాలంలో వర్షాలు కురిసే అవకాశం 60శాతమేనని అమెరికా వాతావరణశాఖ ఇటీవల హెచ్చరించింది. దీని ప్రభావం భారత్‌పైనా ఉంటుందని తెలిపింది. El Nino reason for below normal Monsoon https://t.co/exF7cAGVAG — SkymetWeather (@SkymetWeather) April 3, 2019 -
ఎందుకు ఇలా అవుతోంది?
కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తడంతో కేరళ విలవిలలాడుతోంది. సాయం కోసం ఎదురుచూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇలా ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఈ సీజన్లో అత్యధిక వర్షాలు, వరదలతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రాల్లో ఈసారి కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనీస స్థాయీ కరువే అస్సాంను వర్షాకాలంలో ఏటా వరదలు ముంచెత్తుతాయి. అయితే, ఈ ఏడాది ఆగస్టు 18 వరకు 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అస్సాంలో సాధారణ వర్షపాతం 1088.5 మిల్లిమీటర్లు. ఇప్పటివరకు కురిసింది 759.3 మి.మీ. మాత్రమేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మణిపూర్‌లో 66 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 46 శాతం, మేఘాలయాలో 43 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో 28 శాతం, 23 శాతం, 10 శాతం తక్కువగా నమోదయ్యాయి. అత్యధిక వర్షపాతం కల్గిన మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాల్లోని మాసిన్రం, సోహ్రాల్లో ఈ సీజన్లో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదు అవ్వడం గమనార్హం. తేమశాతం తగ్గిపోవడం వల్లే.. నైరుతీ రుతుపవనాల కాలంలో ఈశాన్య ప్రాంతంలో వీస్తున్న గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉంటోంది. పశ్చిమ బంగాళాఖాతంలో తరుచుగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా పశ్చిమం నుంచి దక్షిణ దిశగా గాలులు వీయడంతో తేమ శాతం తగ్గిపోతోందని ప్రాంతీయ వాతావరణ శాఖకు చెందిన ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా కురవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎగువ అస్సాంలోని నార్త్ లక్ష్మిపూర్‌లో రెండు రోజుల క్రితం 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రీజియన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇక్కడ సాధారణం కంటే 6.2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. తేమతో కూడిన మేఘాలు లేకపోవడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని ప్రాంతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. నైరుతీ రుతుపవనాలు జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని కావున సీజన్ ఇంకా ముగియలేదని, అయితే ఈసారి సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. -
ఇంతకు అవసరమైన వర్షాలు పడతాయా!?
సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాలంలో ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి. మరో రెండు నెలల కాలం మిగిలి ఉంది. జూలై 31వ తేదీ వరకు దేశంలో సాధారణ వర్షపాతం 452.8 మిల్లీ మీటర్లు పడాల్సి ఉండగా, 426.1 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే పడింది. అంటే, ఆరు శాతం వర్షపాతం తక్కువైంది. భారత వాతావరణ శాఖ అనుసరిస్తున్న విధానం ప్రకారం 1951–2000 సంవత్సరం వరకు అంటే యాభై ఏళ్లపాటు కురిసిన వర్షపాతం సరాసరి సగటును తీసుకొని దాన్నే సాధారణ వర్షపాతం అని లెక్కిస్తున్నారు. ఆ లెక్కన సాధారణ వర్షపాతం అంటే, దేశవ్యాప్తంగా 89 సెంటీ మీటర్లు వర్షపాతం పడడం. నైరుతి రుతుపవనాల సందర్భంగా జూన్ నుంచి నాలుగు నెలలపాటు కురిసిన వర్షపాతాన్నే పరిగణలోకి తీసుకొని సగటును లెక్కిస్తారు. ఈ ఏడాది కూడా దేశంలో సాధారణ వర్షపాతం పడుతుందని వాతావరణ పరిశోధన సంస్థలు అంచనా వేయగా, ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువా, మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ కురవడమే కాదు, వరదలు కూడా వచ్చాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో విచిత్రంగా ఓపక్క వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, మరో పక్క వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొన్నది గుజరాత్లో. సౌరాష్ట్రలోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో జూలై 31వ తీదీవరకు సాధారణ వర్షపాతంకన్నా 128 శాతం ఎక్కువ వర్షం కురియగా, గాంధీనగర్ జిల్లాలో 64 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. కచ్ ప్రాంతంలో 74 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లో జూలై మధ్యకాలంలో భయంకర వరదలు వచ్చాయి. వరదల కారణంగా గుజరాత్లో 52 మంది చనిపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా అసాధారణ వర్షాలు పడడం వాతావరణంలో వస్తున్న అసాధారణ మార్పుల ఫలితమని గాంధీనగర్‌లోని ఐఐటీ ప్రొఫెసర్ విమల్ శర్మ చెప్పారు. వర్షాలు ఎక్కువ పడ్డాయా, తక్కువ పడ్డాయా? అన్నది ముఖ్యం కాదని, ఎప్పుడు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి? అన్నది ముఖ్యమని ఆయన అంటున్నారు. ఈశాన్య ప్రాంతంలోని అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు తక్కువ వర్షాలు పడగా, ఇప్పుడు ఎక్కువ వర్షాలతో వరదలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జూన్ నెలలో 20 శాతం తక్కువగా వర్షాలు కురియగా జూలై నెల నాటికి 29 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయింది. వరదల కారణంగా ఈ రాష్ట్రంలో 49 మంది మరణించారు. ఈసారి వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 537 మంది మరణించారు. తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి తెలుగు రాష్ట్రాలయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ లోటు వర్షపాతమే కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో జూలై 27 నుంచి వర్షాలు పడడం లేదు. మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ వర్షాభావ పరిస్థితులు ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొడివాతావరణ కొనసాగితే వర్షాలు పడవన్న అభిప్రాయం తప్పని, రుతుపవనాల సమయంలో వర్షాలకు అనువైన వాతావరణం, ఆ తర్వాత పొడివాతావరణం, మళ్లీ వర్షాలకు అనువైన వాతావరణ రావడం సహజమని భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ ఆర్ఆర్ ఖేల్కర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ వర్షాలు ఎప్పుడు పడ్డాయన్నదే ముఖ్యమైన అంశమని, ఆగస్టు 23 వరకు పొడి వాతావరణం కొనసాగినట్లయితే పలు ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖరీఫ్ పంటకు బాగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. -
వర్షాకాలం ఆహార విహారాలు
‘కాదేదీ పంచభూతాలకతీతం, లేదేదీ పంచభూతాత్మకం కానిది’, ఇది చరకుడు చెప్పిన ఆయుర్వేద తాత్త్వికత. దీని సూత్ర ప్రభావాలు మనిషిపై వాతావరణం చూపించే అనుబంధానికి ఆధారభూతం. ఇందుకు అనుగుణంగా ‘ఋతుచర్య’ని వివరించింది ఆయుర్వేదం. పన్నెండు మాసాలు, ఆరు ఋతువులు అందరికీ తెలిసినవే. సుమారుగా జూలై మాసం నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ‘వర్ష ఋతువు’ ఉంటుంది. ఈ సమయమే శ్రావణ భాద్రపద మాసాలు. జలప్రళయాలకు పెట్టింది పేరు. గ్రీష్మాంతపు తొలకరి జల్లులతో ఆరంభమవుతుంది. ఈ దక్షిణాయన సమయాన్నే ‘విసర్గ’ కాలం అంటారు. అంటే సూర్యుని శక్తి సమస్త ప్రాణులకు లభించే సమయం. వర్షాకాలంలో మనం ఇంకా నీరసంగానే ఉంటాం. క్రమేపీ ‘బలం’ పుంజుకుంటాం. ఈ ఋతువులో మన జఠరాగ్ని చాలా ‘మందం’గా ఉంటుంది. త్రిదోషాలలో ఒకటైన ‘వాతం’ మనలో ప్రకోపావస్థలో ఉంటుంది. వాతావరణం పృధ్వీ తేజో భూతాల ప్రాబల్యంతో, ఆమ్ల రసాత్మకంగా ఉంటుంది. గ్రీష్మం పూర్తయి వర్షాకాలం ఆరంభమవటం ఒక ‘ఋతుసంధి’ని సూచిస్తుంది. ఇటువంటి భౌతిక రసాయనిక మార్పుల వలన వాతావరణం సూక్ష్మక్రిముల మయం అవుతుంది. అందువల్ల క్రిముల ద్వారా సంక్రమించే రోగాలకు గురవుతాం. పరిసర జల కాలుష్యాల వల్ల దోమల వంటి కీటకాలు పేట్రేగుతాయి. వీటికి తోడు ఆహారవిహారాల్లోని మనం చూపే అశ్రద్ధ కారణంగా మరి కొన్ని రోగాలు తోడవుతాయి. వీటిని ఆయుర్వేద పరిభాషలో ‘ప్రజ్ఞాపరాధం, జనపదోధ్వంశం, క్రిమి, సాంక్రామిక రోగాలు’ గా చెప్పబడ్డాయి. కనుక ఇప్పుడు సంభవించే రోగాలకు, ‘అజీర్ణం, ఆహార కాలుష్యం, వాతావరణ క్రిములు’ ప్రధాన కారణాలని గమనించాలి. ఏయే రోగాలు సంభవిస్తాయి... ప్రతిశ్యాయం (జలుబు), కాస (దగ్గు), వమన (వాంతులు), అతిసార (విరేచనాలు), అజీర్ణం, ఆధ్మానం (కడుపు ఉబ్బరం), కామలా (పచ్చ కామెర్లు), మలేరియా, డెంగూ, టైఫాయిడ్, న్యుమోనియా వంటి అనేక రకాల జ్వరాలు వస్తాయి. నివారణ చర్యలు వర్షంలో తడవకూడదు ∙శీతల వాయువులకు గురికాకూడదు కనుక మనం ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి ∙ పరిసర ప్రాంతాలు, నీరు కలుషితం కాకుండా మన వంతు బాధ్యత వహించాలిఇంట్లోను, బయట ప్రతిరోజు ‘ధూపన’ కర్మ చేయాలి ఉదా: వేపాకులు ఆవాలు కాల్చి పొగ పెట్టడం, సాంబ్రాణి ధూపం వంటివి. వీటి వల్ల దోమల నుండి, సూక్ష్మక్రిముల నుండి రక్షణ కలుగుతుందివేడినీటితో స్నానం మంచిది, అభ్యంగ స్నానం కూడా మంచిదే ∙మరిగించి చల్లార్చిన నీరు తాగాలి ∙పగటి నిద్ర, వాయామ, శృంగారాలు తగ్గించాలి. గమనిక: ∙ కేవలం ఇంట్లో తయారు చేసుకునే, తేలికగా జీర్ణమయ్యే వేడివేడి ఆహారాన్ని మితంగా తినాలి ∙ఆకుకూరలలో క్రిముల యొక్క అతి చిన్నని గుడ్లు పొంచి ఉంటాయి కనుక అతి జాగ్రత్తగా వ్యవహరించాలి ∙ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటితో చక్కగా కడిగి, ఆ తరవాత సంపూర్ణంగా ఉడికించి మాత్రమే తినాలి ∙సలాడ్సుగా పచ్చివి తినడం తగ్గించాలి లేదా పచ్చివాటిని కూడా పైన చెప్పినట్లు ప్రక్షాళనం చెయ్యాలి ∙వేపడాలు, డీప్ ఫ్రై భక్ష్యాలు (పూరి, వడ, బజ్జీ మొదలైనవి) మంచిది కాదు. ఒకవేళ నిగ్రహించుకోలేక తింటే ‘హింగ్వాష్టక చూర్ణం’ అనే ఆయుర్వేద మందును ఒక చెంచా ఉదయం, ఒక చెంచా రాత్రి మజ్జిగతో లేదా వేడినీటితో సేవించాలి. ఆహారం తినకూడనివి: ఇంటి బయట తయారుచేసిన, బజారులో తినటానికి సిద్ధం చేసి అమ్మే తినుబండారాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, పానీపూరి, చెరకురసం మొదలైనవి. తినదగిన ఆహారం: ∙ఉడికించిన కూరలలో నిమ్మరసం కలుపుకొని తింటే మంచిది ∙ఉప్పుని అతి తక్కువగా వాడాలి ∙స్నిగ్ధ పదార్థాలు (పాయసాలు), ఆవు నెయ్యి, నువ్వుల నూనె తినటం మంచిదిపంచదారకు బదులు బెల్లం వాడుకోవటం మంచిది ∙ మాంసరసాలు కూడా మంచిదే. సూప్స్ (యూష): తృణ ధాన్యాలు, శాకములతో చేసిన వాటిలో శొంఠి, మిరియాల పొడి స్వల్పంగా కలిపి సేవించాలి ∙బియ్యం, గోధుమలు, కొర్రలు, బార్లీ మొదలైనవి బాగా పాతబడినవి మంచిది ∙తాజాఫలాలు కూడా మంచిదే ∙శుష్క ఫలాలు (డ్రైఫ్రూట్స్), ఇతర గింజలు (గుమ్మడి, సూర్యకాంతం) కూడా సేవించడం మంచిదే. వర్ష ఋతువున వలదోయి బయటి తిండి‘‘ ఇంట వండిన లఘువైన వంటకముల వేడివేడిగ తినవలె ప్రీతిమీర‘‘ త్రాగునీటిని మరిగింప ధ్యాస పెట్టు!పసుపుదాల్చీని లశునంబు పదిలరీతిఅల్లమును జేర్చి ఘన కషాయమును కాచిఆరు చెంచాలు ప్రతిరోజునారగింపదరికి రాబోవు రోగముల్ తథ్యమిదియ. ఔషధాలు అల్లం (5 గ్రా.), వెల్లుల్లి (5 రేకలు), దాల్చిన చెక్క చూర్ణం (3 గ్రా.), పసుపు (మూడు చిటికెలు), కలిపి పావు లీటరు నీళ్లు పోసి బాగా మరిగించి వడగట్టుకోవాలి. (మూడు వంతుల ద్రవ భాగం ఇగిరిపోవాలి. అంటే 60 మి.లీ. మిగలాలి) ∙ఉదయం 30 మి.లీ. (ఆరు టీ స్పూన్లు), సాయంత్రం 30 మి.లీ. తాగాలి. ఎంతమందికి ఈ కషాయం కావాలో... దానికి అనుగుణంగా ద్రవ్యాల పరిమాణం పెంచుకోవాలి. పరగడుపున కాని ఏదైనా తిన్న తరవాత కాని, ఎప్పుడు తాగినా మంచిదే. వర్షాకాలమంతా తాగితే మరీ మంచిది. కనీసం రోజుకి ఒకసారైనా తాగండి. ఇది జీర్ణకోశ సమస్యలకు, క్రిమిరోగ సమస్యలకు, జ్వరాలకు... అన్నిటికీ మంచిది. జలుబు, దగ్గులకు దివ్యౌషధం. ∙అతిసారానికి: వాము కషాయం తక్షణం పనిచేస్తుంది. ∙జలుబు, దగ్గులకు: తులసి లేదా తమలపాకు రసం + తేనె: రోజూ మూడుపూటలా తీసుకోవాలి. ∙పచ్చ కామెర్లకు: నేల ఉసిరిక (భూమ్యామలకి) రసం ఒక టీ స్పూను (5 మి.లీ.) + తేనె: రెండుపూటలా రెండు వారాలు సేవించాలి ∙గుంటకలగర (భృంగరాజ), తిప్పతీగె (గుడూచి) ఉసిరిక (ఆమలకీ) రసాలు కూడా శ్రేష్ఠమే. పునుగుల పులుసు పులుసు కోసం కావలసినవి: పెరుగు – రెండు కప్పులు (చిక్కగా గిలకొట్టాలి); సొరకాయ ముక్కలు – అర కప్పు; మునగకాడ – 1 (ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటో – 1 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా కట్ చేయాలి); ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూన్; పసుపు – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; అల్లం తురుము – ఒక టీ స్పూన్; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూన్; ధనియాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పోపు గింజలు – ఒక టీ స్పూన్; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పునుగుల కోసం కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు; అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 3; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర – కొద్దిగా పులుసు తయారీ: ∙ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙వేరే పాత్రలో పెరుగు, సెనగ పిండి, పసుపు వేసి గిలకొట్టాలి ∙ఉడుకుతున్న ముక్కలలో ఈ మిశ్రమం పోసి బాగా కలిపి ఉడికించాలి ∙మిక్సీలో అల్లం తురుము, సెనగ పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా చేసి ఉడుకుతున్న పులుసులో వేసి కలపాలి ∙కరివేపాకు, కొత్తిమీర జత చేయాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక ఆవాలు జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వేసి కలిపి దింపేయాలి. పునుగుల తయారీ: ∙పచ్చి సెనగ పప్పును సుమారు రెండు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙మిక్సీలో సెనగ పప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా చేసి, తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పునుగులుగా వేసి వేయించి తీసి, పులుసులో వేసి గంట సేపు నాననివ్వాలి ∙పునుగులు జత కలవడంతో, మారు మాట్లాడకుండా పులుసును జుర్రేస్తారు. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@ gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. Monsoon ,food ,Getaways – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
మంచి ‘వాతావరణం’ భారీ లాభాల ముగింపు
సాక్షి, ముంబై: రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్‌మార్కట్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే డబుల్ సెంచరీతో అదరగొట్టిన సెన్సెక్స్ చివరివరకు అదే జోరును కంటిన్యూ చేసింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి వారాంతంలో సెన్సెక్స్ 391పాయింట్ల లాభంతో 37556 వద్ద, నిఫ్టీ116 పాయింట్లు ఎగిసి 11360 వద్ద ఉత్సాహంగా ముగిసింది. అన్ని రంగాలూ లాభపడగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రియల్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. మంచివాతావరణ అంచనాలు, జీఎస్టీ రేట్ కట్, బలమైన త్రైమాసికి ఫలితాలు మార్కెట్లకు ఊత మిచ్చినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. ఐబీ హౌసింగ్, యాక్సిస్, వేదాంతా, యస్‌బ్యాంక్, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, గ్రాసిమ్, హీరోమోటో, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, విప్రో, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో ఉందన్న అంచనాలతో భారీగా నష్టపోయింది. -
అంచనాలు తగ్గించనున్న ఐఎండీ
న్యూఢిల్లీ: ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు రుతుపవనాలపై తన అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ సీజన్ మొత్తానికి అంచనాలు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఇప్పటికే అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)ని 92 శాతంగా సవరించింది. ఎల్పీఏ 96–104 శాతం మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. ఈ సీజన్లో 100 శాతం ఎల్పీఏతో వర్షాలు పడతాయని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
వచ్చేవారం విస్తారంగా వర్షాలు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాల్లో 25 శాతం అధిక, మరికొన్ని ప్రాంతాల్లో అదే మోతాదులో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలు పేర్కొన్నాయి. అయితే వచ్చేవారం ఉత్తరాది, మధ్య భారత్‌లకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతుండగా రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 27నుంచి ఉత్తరాది, మధ్య భారత్‌లో వాతావరణం చల్లబడటంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. జూన్ 29న దేశ రాజధాని ఢిల్లీకి రుతుపవనాలు తాకనున్నాయని చెప్పారు. రానున్న 48 గంటల్లో ఒడిషా, పశ్చిమ బెంగాల్ సహా గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో, మహారాష్ట్ర, తూర్పు యూపీలో వర్షాలు కురుస్తాయన్నారు. ఇక నైరుతి రుతుపవనాల రాకతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు శనివారం నాటికి మైనస్ 10గా నమోదైంది. -
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు సాధారణంగా కొనసాగుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు చురుగ్గుగా కదిలే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా రెండురోజుల్లో ఉష్టోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. -
నాలుగైదు రోజుల్లో రుతుపవనాల జోరు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ నైరుతి రుతుపవనాలు త్వరలో ఊపందుకోనున్నాయి. కొద్దిరోజుల నుంచి ఇవి బలహీనంగా ఉండడంతో వర్షాల జాడ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రుతుపవనాలు ఈ నెల 24 నుంచి మళ్లీ బలం పుంజుకుంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తరాం ధ్రకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఇది మంగళవారం నాటికి ఒకింత దిగువకు అంటే 5.8 కిలోమీటర్లకు వచ్చింది. ఈ నెల 24 అనంతరం ఇది 3.6 కిలోమీటర్ల కిందకు వస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు (40 డిగ్రీలకు పైగా) నమోదయ్యాయి. సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధికంగా రికార్డవడంతో వడగాడ్పులు వీచాయి. రానున్న మరో రెండు మూడు రోజులు కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గానీ, వర్షం గానీ కురిసే అవకాశం ఉందని మంగళవారం రాత్రి నివేదికలో ఐఎండీ తెలిపింది. బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో పాటు పిడుగులు పడేందుకు అవకాశాలున్నాయని, ఆయా ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో విశాఖలో 4, కురుపాంలో 3, గరివిడిలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
పెట్టుబడులకు మంచి సమయమే!!
దేశీ ఎకానమీలో కొన్ని సవాళ్లున్నప్పటికీ... రిటైల్, బ్యాంకులు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన రంగాలకు చెందిన సంస్థల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలుంటాయని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సీఈవో ఎ.బాలసుబ్రమణియన్ చెప్పారు. ఈ సారి రుతుపవనాలు కాస్త మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆధారిత సంస్థలూ సానుకూలంగానే కనిపిస్తున్నాయని తెలియజేశారాయన. మార్కెట్ల రాబడులు, సిప్‌లు తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో రుతుపవనాలపై సానుకూల అంచనాలు.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, వాణిజ్య యుద్ధ భయాలు మొదలైన వాటితో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో కొన్ని నెలలుగా అనిశ్చితి నెలకొంది. ఇక చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. అయితే, మెరుగైన వర్షపాతంతో వ్యవసాయోత్పత్తి ఆశావహంగా ఉండగలదన్న అంచనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకుంటుండటంతో ఆటోమొబైల్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఈ రంగాల సంస్థల షేర్లతో పాటు రిటైల్ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టే బ్యాంకులు, గ్రామీణ.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన సంస్థల షేర్లు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. దీర్ఘకాలంలో ఈక్విటీలతో అధిక రాబడి.. ప్రతి రెండు మూడేళ్లకోసారి మార్కెట్లు కొంత అనిశ్చితం పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటా యి. అయినప్పటికీ.. దీర్ఘకాలంలో చూస్తే జీడీపీ వృద్ధికి మించి 3–4 శాతం అధికంగానే రాబడులిస్తుంటాయి. పెట్టుబడులకు కట్టుబడి ఓపికగా వేచి చూడగలిగితే ప్రయోజనాలు అందుకోవచ్చు. గడిచిన 20 ఏళ్లుగా చూస్తే.. పదేళ్ల వ్యవధిలో ఈక్విటీలు 20 శాతానికి పైగా రాబడులిచ్చాయి. అంటే హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. సగం కాలం అత్యధిక రాబడులు ఇచ్చినట్లే లెక్క. ఈ 20 ఏళ్లలో కేవలం ఆరు సార్లే మార్కెట్లు ప్రతికూల ఫలితాలు కనపర్చాయి. మొత్తం మీద అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ వ్యవధిలో పెట్టుబడులపై సగటున 17.3 శాతం రాబడి ఉండొచ్చు. సిప్ల నిష్పత్తి ఇలా .. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పథకాల (సిప్) ద్వారా ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయి. ఏటా ఇది పెరుగుతోంది. మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. సిప్‌లను కొనసాగించడంతో పాటు వీలైతే ఇన్వెస్ట్మెంట్ పరిమాణం పెంచడం, బహుళ సిప్ల విధానాన్ని అనుసరిస్తే మరింత అధిక రాబడులు పొందవచ్చు. అయిదేళ్ల పైబడిన కాలవ్యవధి గల సిప్‌లలో పెట్టుబడులకు సంబంధించి లార్జ్, మల్టీ, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో 30:30:40 నిష్పత్తిలో కేటాయించడం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే.. డబ్బంతా ఒకే సాధనంలో పెట్టకుండా ఈక్విటీతో పాటు ఫిక్సిడ్ ఇన్‌కం స్కీమ్స్‌లోనూ పెట్టడం ద్వారా సమతుల్యత ఉండేలా చూసుకోవచ్చు. -
బలహీనంగా రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే వారం రోజుల్లో రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలను కొట్టివేయలేమని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర మధ్య కర్ణాటక వరకు విదర్భ, తెలంగాణ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. శుక్రవారం హైదరాబాద్, ఖమ్మం, మెదక్‌లలో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాచలం, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, హన్మకొండ, హైదరాబాద్, మెదక్‌లలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. -
వర్షాకాలం ఆహార విహారాలలో జాగ్రత్తలు
జూన్ నెల ప్రారంభమైందంటే గ్రీష్మతాపం తగ్గు ముఖం పట్టినట్లే. సూర్య గమనంలో మార్పు చోటు చేసుకుంటుంది. ఉత్తరాయణానికి పూర్తయ్యి, దక్షిణాయనం మొదలవుతుంది. ఆదానకాలం పోయి విసర్గ కాలం ప్రారంభమవుతుంది. అంటే మనుషులలో నీరసం తగ్గి శక్తిని పుంజుకునే సమయం అన్నమాట. శ్రావణ భాద్రపద మాసాలు (సుమారుగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు) వర్ష ఋతువు. జూన్‌లో కనిపించే తొలకరి జల్లులు వర్షాకాలానికి ప్రథమ సోపానమన్నమాట. ఈ వర్షాకాలంలో మన శరీరంలో ‘వాత’ ప్రకోపం జరుగుతుంది. పిత్తం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల మన జఠరాగ్ని (ఆకలి పుట్టించే దీపకాగ్ని, జీర్ణక్రియకు తోడ్పడే పాచకాగ్ని) వైకల్యం చెంది మనకు ఇబ్బందులు మొదలవుతాయి. వర్షాల కారణంగా మనం త్రాగే నీరు కలుషితమౌతుంది. పరిసర ప్రాంతాలలో నీరు, భూమి అపరిశుభ్రమౌతాయి. గాలిలోని తేమలో సంభవించే మార్పులు మన మీద ప్రభావం చూపుతాయి. కనుక మనం తినవలసిన ఆహారంలోనూ, జీవనశైలిలోనూ జాగ్రత్త అవసరం. పై కారణాల వల్ల మనకు సాధారణంగా కలిగే వ్యాధులు... ఆకలి లేకపోవడం, అజీర్తి, నీళ్ల విరేచనాలు లేదా చీము నెత్తురు విరేచనాలు, పచ్చ కామెర్లు, దగ్గు, ఆయాసం (ఉబ్బసం), వివిధ రకాలైన జ్వరాలు మొదలైనవి. ఈ కాలంలో తినకూడని ఆహారం: బజారులో అమ్మే ఏ తినుబండారాల జోలికీ పోకూడదు. ముఖ్యంగా ఐస్‌క్రీములు, చాక్లేట్లు, శీతల పానీయాలు, చెరకు రసం, జంక్ ఫుడ్స్ మొదలైనవి. ఇంట్లో వాటిలో కూడా బరువైన ఆహారం నిషిద్ధం. అంటే పూరీలు, గారెలు, సమోసాలు వంటి yీ ప్ ఫ్రైలు. సేవించవలసినవి: మరిగించి చల్లార్చిన నీరు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం (పెసలు, ఉలవలతో చేసిన జావలు/సూప్స్). అల్లం, కరివేపలతో తయారుచేసిన మజ్జిగ, బాగుగా ఉడికించిన కూరలు, తాజాగా వండిన వేడి వేడి ఆహారం తీసుకోవాలి. ఊరగాయలు కాకుండా తాజాగా తయారుచేసిన పచ్చళ్ల వల్ల అగ్నిదీప్తి కలుగుతుంది. (ఉదా: అల్లం/కరివేపాకు/పుదీనా/కొత్తిమీర పచ్చళ్లు)ఆహారంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె తగురీతిలో సేవించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. జఠరాగ్నిని సరిదిద్దడంతో బాటు మనకు కావలసిన శక్తిని కూడా అవి సమకూరుస్తాయి. రోగనిరోధకశక్తి కూడా పటిష్టమవుతుంది.శాకాహారాన్ని ఉడికించుకొని, కొద్దిగా మిరియాల పొడిని చేర్చి తినడం వల్ల ఆకలి పుట్టి శరీరం తేలికపడుతుంది. పోషకపదార్థాలు సక్రమంగా రక్తంలోకి చేరతాయి గృహవైద్యం అరుచి తగ్గి ఆకలి పుట్టడానికి... చిన్నపాటి అల్లం ముక్కలు లేదా జీలకర్రలను కొంచెం సైంధవ లవణం కలిపిన నిమ్మరసంలో రాత్రంతా నానబెట్టి, మరుసటిరోజు వాటిని మెల్లగా కొరుకుతూ చప్పరించాలి. (వీటిని భావన అల్లం, భావన జీలకర్ర అంటారు)కడుపు నొప్పి, గ్యాస్ తగ్గడానికి: మరిగించి చల్లార్చిన కప్పుడు గోరువెచ్చని నీళ్లలో అర చెంచా శొంఠిపొడి, చిటికెడు ఇంగువ కలిపి రెండు పూటలా తాగాలి.నీళ్ల విరేచనాలు కట్టడానికి: వాముని పొడిగా చేసి, కషాయం చేసుకుని ఆరు లేదా ఏడు చెంచాలు రెండుపూటలా తాగాలి. ఈ కషాయంంలో మెంతులు కూడా కలిపితే చీము, నెత్తురు విరేచనాలు కూడా తగ్గుతాయి. దగ్గు తగ్గడానికి: తులసి రసం లేదా తమలపాకుల రసం (ఒక చెంచా) తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఆయాసానికి (ఉబ్బసం): ఒక చెంచా ఆవనూనెకు చెంచాడు తేనె కలిపి రెండుపూటలా సేవించాలి. వివిధరకాలైన జ్వరాలు తగ్గడానికి: అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చినచెక్కలతో కషాయం కాచి, 30 మి.లీ. (ఆరు చెంచాలు) రెండు లేక మూడు సార్లు రోజూ తాగాలి. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు -
నైరుతి వచ్చేసింది..
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు శుక్రవారం తెలంగాణలోకి ప్రవేశించాయి. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 4–8 తేదీల మధ్య రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశిస్తుందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా నిజమైంది. రుతుపవనాలు ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించడం శుభపరిణామమని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. భారీ వర్షాలు... రుతుపవనాల రాకతో గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాలలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవగా, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 13 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 10 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురిసింది. జూన్ 1 నుంచి 8 వరకు రాష్ట్రంలో సాధారణంగా 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 53.4 మిల్లీమీటర్లు రికార్డయింది. అంటే 147 శాతం అధికంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 14 వరకు సాధారణ వర్షాలు.. రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో సాధా రణం నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. 15 నుంచి నెలాఖరు వరకు తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారీ వర్షాలు : శని, ఆదివారాలు సెలవులు రద్దు
ముంబై : ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం కూడా స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని నగరవాసులను వాతావరణ శాఖ హెచ్చరించింది. పుణేలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. ఈ హెచ్చరికతో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ తన ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు రద్దు చేసింది. ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడే ప్రజలకు సేవలందించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాక అత్యవసర సమయంలో తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక వాతావరణ కేంద్ర ఇచ్చే వెదర్ అప్డేట్లను ఎప్పడికప్పుడూ తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు అరేబియా సముద్రంలోని పలుచోట్ల వేటకు వెళ్లవద్దని చెప్పింది. కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మరోవైపు కుండపోతగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ముంబైకి ఎయిర్‌లైన్ సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. లండన్ నుంచి ముంబై వచ్చే జెట్‌ఎయిర్‌వేస్ విమానాన్ని కూడా అహ్మదాబాద్ విమానశ్రయానికి తరలించారు. ముందస్తుగా వచ్చిన ఈ రుతుపవనాలతో థానే, పాల్గఢ్, రాయ్‌ఘడ్, రత్నగిరి ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో, భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో ముంబైవాసులు 1916కు, ముంబై బయటివారు 1077కు ఫోన్ చేయవచ్చని బీఎంసీ తెలిపింది. సెంట్రల్ అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా, మరిన్ని కర్ణాటక, రాయమలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి. -
మండే ఎండల నుండి తీపికబురు
-
కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
కేరళను తాకిన రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ : మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళను తాకాయని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ తెలిపింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని స్కైమెట్ పేర్కొనగా మే 29న రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. కేరళలో రుతుపవనాల రాకకు సానుకూల వాతావరణం నెలకొందని, ఈ ఏడాది వర్షాకాలం ఆరంభమైందని స్కైమెట్ సీఈఓ జతిన్ సింగ్ చెప్పారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన అనంతరం దక్షిణ అరేబియా సముద్రం, తమిళనాడు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అడిషనల్ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. -
మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు
-
వర్షాల కోసం గుజరాత్ సర్కార్ పూజలు
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్లో వరుణ దేవుడి కరుణ కోసం విజయ్ రూపానీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పూజలు చేసేందుకు సన్నద్ధమైంది. వరుణ దేవుడి కటాక్షం కోసం అన్ని జిల్లాల్లో 41 యాగాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌లోని 33 జిల్లాలు, ఎనిమిది నగరాల్లో మే 31న యజ్ఞాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. చెరువులు, నదుల్లో పూడికతీతకు ప్రభుత్వం చేపట్టిన సుజలాం సుఫలం జల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగానే వరుణ యాగాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మే 31న జరిగే వరుణ యాగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారని, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తెలిపారు. ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో గుజరాత్ ముందవరుసలో ఉంది. -
హైదరాబాద్ లో వర్షం
-
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్ : క్యుములోనింబస్ మేఘాల కారణంగా రుతుపవనాలు రాకముందే వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, కర్మన్‌ఘాట్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. తర్వాత వాతావరణం మేఘాలు కమ్ముకుని, కొన్నిచోట్ల వర్షం పడింది. పలుచోట్ల బలమైన గాలులు వీచాయి. నగరంలో ఇంకా మేఘాలు కమ్ముకున్నాయి. కాగా, తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రానున్న నాలుగైదు రోజుల వరకు ఇదే రకమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకేరోజు భిన్న వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే
-
వర్షపాతంపై చల్లటి కబురు
న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది కూడా భారత్‌లో సాధారణ వర్షపాతమే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. 97 శాతం సాధారణ వర్షపాతాన్ని అంచనావేస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ పేర్కొన్నారు. అసలు ఈ ఏడాది తక్కువ వర్షపాతాల సూచనే లేదని తెలిపారు. నేడు నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో 2018 సంవత్సరానికి సంబంధించిన తొలి వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. గత రెండేళ్లలో భారత్‌లో మంచి వర్షాలు పడ్డాయని, మంచి పంటలు కూడా పండాయని, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా వర్షాలు ఉండనున్నాయని రమేష్ చెప్పారు. మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేరళకు రుతుపవనాలు వస్తాయని, 45 రోజుల్లో అవి దేశమంతటా విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఈసారి బలహీన లానినో ఉందని, ఇది కూడా న్యూట్రల్ కావొచ్చన్నారు. ఎల్‌నినోకు పూర్తిగా వ్యతిరేక లక్షణాలను లానినో కలిగి ఉంటుంది. సాధారణ వర్షపాతం కేవలం వ్యవసాయ వృద్ధిని పెంచడమే కాకుండా.. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపనుందని ఐఎండీ తెలిపింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి ఎంతో కీలకమని పలువురంటున్నారు. 2019లో సాధారణ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రభుత్వానికి ఐఎండీ గుడ్‌న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణం వర్షపాతంగా పేర్కొంటారు. 104 శాతం కన్నా ఎక్కువ పడితే అధిక వర్షపాతం అని, 96 శాతం కన్నా తక్కువ పడితే లోటు వర్షపాతంగా వ్యవహరిస్తారు. -
ఈ ఏడాది కరువే?!
235 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఆయా జిల్లాల్లో కరువు పరిస్థితులు వేసవిలో దారుణ పరిస్థితులు తాజాగా వివరాలు వెల్లడించిన ఐఎండీ సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ ఏడాది కూడా కరువు పరిస్థితులు తలెత్తబోతున్నాయి. రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా.. సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో అక్కడక్కడా కుంభవృష్టి కురిసినా.. ఎక్కడా సాధారణం కంటే ఎక్కువగా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 235 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొనబోతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు వల్ల సాధారణం కన్నా6.1 శాతం వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వేసవి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 28 శాతం మించి వర్షపాతం నమోదుకాలేదని ఐఎండీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల్లో కదలికలు పెద్దగా లేవని ఐఎండీ ఉన్నతాధికారి శివానంద చెప్పారు. -
నేడు రేపు మోస్తరు తర్వాత భారీ వర్షాలు
-
నేడు రేపు మోస్తరు.. తర్వాత భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు ఊపందుకోవడంతో మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 24, 25 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో సారంగాపూర్, బాన్సువాడ, లింగంపేట్, నాగరెడ్డి పేట్, ఎల్లారెడ్డి, తాడ్వాయిలలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరికొన్నిచోట్ల ఒక సెంటీమీటర్ చొప్పున వర్షం కురిసింది. -
రుతుపవనాలకు విరామం
మధ్య, దక్షిణ భారతంలో తగ్గిన వర్షపాతం న్యూఢిల్లీ: మధ్య, దక్షిణ భారత దేశ ప్రాంతాల్లో గత వారం రోజులుగా రుతపవనాలు మందగించాయి. సాధారణ వర్షపాతంతో పోల్చితే అక్కడ తక్కువ వానలు కురిశాయని వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం పేర్కొంది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ సీజన్లో కురవాల్సిన దానికన్నా 8 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం ఒక శాతం తగ్గింది. ఇక ఉత్తర, ఈశాన్య భాగాల్లో వానలు 5 శాతం తక్కువగా కురిశాయి. కేరళ, దక్షిణ కర్ణాటకలోని లోతట్టు ప్రాంతాలు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లో అంచనా వేసిన దానికన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మాత్రం సాధారణం కన్నా 29 శాతం అధికంగా వానలు కురిశాయి. అయితే వచ్చే వారంలో దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎం. మొహాపాత్ర పేర్కొన్నారు. -
23 నుంచి మరింత చురుగ్గా రుతుపవనాలు
న్యూఢిల్లీ: ఈనెల 23 నుంచి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం అంచనా వేసింది. పశ్చిమ భాగంలో గుజరాత్‌లోని వాల్సాద్, తూర్పున బెంగాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. అలాగే మహారాష్ట్ర, విదర్భ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తూర్పు భాగంలో బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు అడుగుపెట్టాయన్నారు. తుపాన్ కారణంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ‘కొంత స్తబ్దత తరువాత... నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదలడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2–3 రోజుల్లో దేశంలోని చాలా భాగాల్లో విస్తారంగా వానలు కురుస్తాయి’ అని అన్నారు. -
15 రోజుల్లో రెట్టింపు వర్షాలు
నేడు, ఎల్లుండి భారీ వర్షాలకు సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా వర్షపాతం నమోదవుతోంది. వానాకాలం ప్రారంభమైన ఈ నెల 1 నుంచి 15 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైంది. ఈ 15 రోజుల్లో సరాసరి 54.6 మిల్లీమీటర్ల (ఎం.ఎం.)వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 109.8 ఎం.ఎం.లు (101%) రికార్డు అయింది. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 55.3 ఎంఎంలు కాగా, 163.9 ఎంఎంలు (196%) కురిసింది. హైదరాబాద్ జిల్లాలో 46.9 ఎంఎంలు కురవాల్సి ఉండగా, 125.6 ఎంఎం (168%) అధికంగా కురిసింది. ఖమ్మం జిల్లాలోనూ 57.1 ఎంఎంలకు గాను 119.2 ఎంఎంలు (109%) అధికంగా కురిసింది. మెదక్ జిల్లాలో 55.8 ఎంఎంలు కురవాల్సి ఉండగా, 117.9 ఎంఎంలు (111%) కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతమే నమోదైంది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 12న ప్రవేశించాక అధిక వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నేడు, ఎల్లుండి భారీ వర్షాలు... రాష్ట్రంలో రుతుపవనాల కారణంగా శని వారం, సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జుక్కల్, మద్నూరులలో 12 సెంటీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. నిర్మల్‌లో 10, బోథ్, కోస్గిలలో 9, దోమకొండలో 8, సంగారెడ్డిలో 7, బిక్నూరు, హకీంపేట్, నారాయణ్‌పేట్, కొడంగల్‌లలో 6 సెంటీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. ఖానాపూర్, రంజల్, జఫర్‌గఢ్, కాన్పూర్, ము«థోల్, శామీర్‌పేట్, గండీడ్‌లలో 5 సెంటీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. -
నేడు రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా ఉండడం, మరోవైపు ఒడిశా సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్టంలో వచ్చే రెండ్రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, ఆ తర్వాత మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో ఎడపల్లిలో 7 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. రామాయంపేట, మక్లూరులో 5, వెంకటాపూర్, మెదక్‌లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.