
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాదల పంచాయతీలోని దోమలజోరు, రత్తకండి, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం సుంకి, పరిసర ప్రాంతాలు ఆకుపచ్చగా మారి ముచ్చటగొల్పుతున్నాయి. శీతాకాలం తలపించేలా ఉదయం వేళ మంచు సోయగాలు మరింతగా ఆహ్లాదపరుస్తున్నాయి. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మనోహర లోకంలో విహరిస్తున్నారు.
–అరకులోయ రూరల్
అరకులోయలో మంచు సోయగాలు
మాదల పంచాయతీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి అందాలు