Beautiful locations
-
Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి
పాడేరు–విశాఖపట్నం ప్రధాన రహదారిలోని ఘాట్‌లో ఆదివారం మేఘాలు కనువిందు చేశాయి. కొండలను తాకుతున్న మేఘాలను చూసి పర్యాటకులు, రోడ్డు ప్రయాణికులు, మోదమ్మ పాదాలు సందర్శనకు వచ్చిన భక్తులు పరవశించిపోయారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకృతి.. పచ్చదనంతో చూపరులను కట్టిపడేస్తోంది. – సాక్షి, పాడేరు -
Photo Feature: అందాలలో అహో మహోదయం
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాదల పంచాయతీలోని దోమలజోరు, రత్తకండి, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం సుంకి, పరిసర ప్రాంతాలు ఆకుపచ్చగా మారి ముచ్చటగొల్పుతున్నాయి. శీతాకాలం తలపించేలా ఉదయం వేళ మంచు సోయగాలు మరింతగా ఆహ్లాదపరుస్తున్నాయి. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మనోహర లోకంలో విహరిస్తున్నారు. –అరకులోయ రూరల్ అరకులోయలో మంచు సోయగాలు మాదల పంచాయతీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి అందాలు -
మన్యం ‘స్నో’గసులు పోతుంది..!
Snowfall In Visakhapatnam In Winter Season: మన్యం అందాలకు పుట్టినిల్లు.. సొగసుల మెట్టినిల్లు..శీతాకాలం వచ్చిందంటే ‘స్నో’గసులు పోతుంది. మంచు తెరలు మనసును మీటుతాయి. వెండిమబ్బుల్లాంటి మేఘాలు నిత్యం హాయ్ అంటూ పలకరిస్తాయి. శీతాకాలం సీజన్ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో ముందస్తు భోగి మంటలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా చలి మంటలు స్వాగతం పలుకుతున్నాయి. చలి తట్టుకోవటం ఎవరికైనా చాలా కష్టం. ఎంతటి వారైనా చలికి గజగజ వణికిపోవల్సిందే.. ఎందుకంటే మన శరీరం 25 నుంచి 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. అంతకన్నా ఉష్ణోగ్రత తగ్గితే శరీరం వణకడం మొదలుపెడుతుంది. విశాఖ మన్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. అయితే చలిని తట్టుకుని నిత్య జీవనం గిరిజనుల సొంతం. అంతటి చలిలోనూ మన్యం వేకువనే నిద్ర లేస్తోంది. పిల్లలు సైతం గంట కొట్టకముందే పాఠశాలకు చేరుకుంటున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అన్ని వర్గాల వారూ చలిగింతల మధ్య నిత్యజీవనం కొనసాగిస్తున్నారు. – పాడేరు చదవండి: బరితెగింపు: ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో తగ్గేదేలే! -
జిల్లాలో కేరళకు దీటైన అందాలు
కోటగమ్మం (రాజమహేంద్రవరం) : పర్యాటకంగా అభివృద్ధి చెందిన కేరళ వంటి రాష్ట్రాలకు దీటుగా జిల్లాలో రమణీయమైన పర్యాటక ప్రాంతాలు, వనరులు ఉన్నాయని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, ఆహారశుద్ధి పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, రారాష్ట్రాన్ని పర్యాటకరంగంలో అగ్రగామిగా నిలిపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పర్యాటక, ఆహారశుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులపై ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో గురువారం హోటల్ రివర్‌బేలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సద్వినియోగం చేసుకుని, తగిన ప్రాజెక్టులతో ముందుకు రావాలని సూచించారు. కాకినాడ బీచ్ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని, మొదటి దశ పనులను ఈనెలలో ప్రారంభిస్తామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద రూ. 56 కోట్లతో రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలన్నింటినీ అనుసంధానం చేసి, గోదావరితీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఈట్‌స్ట్రీట్, జల క్రీడలు నిర్వహిస్తామన్నారు. కడియం నర్సరీలను అనుసంధానిస్తూ బోటు రైడింగ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు. పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ పర్యాటక ప్రాజెక్టు చేపట్టిన ఔత్సాహికులకు మూడేళ్ల పాటు లీజు, అద్దెలపై మారటోరియంను అమలు చేస్తామన్నారు. మారేడుమిల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టామని, కాకినాడ బీచ్, హోప్ ఐలాండ్, కోరింగ మడ అడవులను, అఖండ గోదావరి తీరాన్ని, కోనసీమ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాకినాడ తీరాన్ని, హోప్ఐలాండ్, కోరింగ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ.70 కోట్లు, అఖండ గోదావరి తీరాన్ని ఎకో, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కోనసీమలో హెరిటేజ్, గ్రామీణ, వ్యవసాయ రంగాలన కలుపుతూ ప్రత్యేక పర్యాటక ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఫిక్కీ చైర్మ¯ŒS వి.వాసుదేవరావు, టూరిజం సబ్ కమిటీ చైర్మ¯ŒS కె.లక్ష్మినారాయణ, అఖండ గోదావరి ప్రాజెక్టు ఈడీ జి.భీమశంకరం తదితరులు పాల్గొన్నారు. -
పావనసీమ
-
అందాల కెన్యా
షూటింగ్‌లకు నెలవు సినీ పరిశ్రమకు ఆహ్వానం సీఎంతో కెన్యా ప్రతినిధుల భేటీ కెన్యాలో అందమైన లొకేషన్లు, ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయని ఆ దేశ కేబినెట్ కార్యదర్శి అడెన్ మహ్మద్ తెలిపారు. సినిమా షూటింగ్‌లకు అన్ని రకాలుగా తమ దేశం ఉపయోగకరంగా ఉందని, తమిళ సినీ పరిశ్రమ షూటింగ్‌లకు తమ దేశానికి రావాలని ఆహ్వానం పలికారు. సాక్షి, చెన్నై:సచివాలయంలో సీఎం పన్నీరు సెల్వం తో కెన్యా నుంచి వచ్చిన కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఎంపీలు, అధికారులతో కూడిన ప్రతినిధుల బృందం మంగళవారం భేటీ అయింది. భారత్-కెన్యాల మధ్య సత్సంబంధా లు, భారత్ నుంచి ఎగుమతులు, ఫార్మాసుటికల్, స్టీల్స్, యంత్రాలు, ఆటోమొబైల్స్ తదితర రంగాల గురించి పరస్పరం ఈ భేటీలో చర్చిం చారు. భారత్‌లో తమిళనాడు రెండో అతి పెద్ద రాష్ట్రంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని ఈ సందర్భంగా వారి దృష్టికి సీఎం పన్నీరు సెల్వం తీసుకెళ్లారు. ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రదేశాలు, ఇక్కడ కల్పించిన రాయితీలు, సదుపాయాలను ఆ బృందానికి వివరించారు. అమ్మ జయలలిత మార్గదర్శకత్వంలో తాము అందిస్తున్న పథకాలు, ప్రజా హిత కార్యక్రమాల గురించి విశదీకరించారు. అన్ని రకాల వనరులు ఇక్కడ ఉన్నాయని, పెటుబడుల్ని నిర్భయంగా పెట్టవచ్చని సూచించారు. అనంతరం ఆ బృందానికి చెందిన కేబినెట్ కార్యదర్శి అడెన్ మహ్మద్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటుగా తాము తమిళనాడులో పర్యటించనున్నామని వివరించారు. కోయంబత్తూరులోని టెక్స్టైల్ పరిశ్రమల్ని, ఇంజనీరింగ్ సంస్థల్ని, వివిధ రకాల ఆటోమొబైల్స్ పరికరాల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించనున్నామన్నారు. అలాగే, తమిళనాడులో వైద్య పరంగా సేవల్ని పరిశీలించనున్నామని వివరించారు. తమ దేశం నుంచి ఇక్కడికి వైద్య సేవల నిమిత్తం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. తమిళనాడు సినీ పరిశ్రమ అతి పెద్దదిగా గుర్తు చేస్తూ, వివిధ దేశాల్లో షూటింగ్‌లకు ఇక్కడి పరిశ్రమ తరలి వెళుతోందని వివరించారు. తమ దేశం కూడా షూటింగ్‌లకు అనుకూలంగా పేర్కొన్నారు. అందమైన లోకేషన్లు, ఆకర్షణీయమైన ప్రదేశాలు, పర్యాటక పరంగా మరెన్నో అందాలు కొలువు దీరి ఉన్నాయన్నారు. తమ దేశంలో షూటింగ్‌లకు ముందుకు రావాలని తమిళ సినీ పరిశ్రమకు మహ్మద్ విజ్ఞప్తి చేశారు. భారత్, కెన్యాల మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, మరింత బలపడే రీతిలో త్వరలో ఒప్పందాలు జరగబోతున్నాయన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో చెన్నైలో జరగనన్న ప్రపంచ పెట్టుబడి దారుల భేటీకి తమ దేశం నుంచి ప్రతినిధులు రాబోతున్నారన్నారు. ఈ సమావేశంలో కెన్యా ప్రతినిధులు ఫోర్లెన్స్ ఐ విచే, ఒబురు ఒగింగా, జోషప్ లిమో, సక్వా మున్యాసీ, కిట్టూస్ హైవ్యూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జ్ఞాన దేశికన్, సలహాదారులు షీలా బాలకృష్ణన్, రామానుజం, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సీవీ శంకర్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కే షణ్ముగం, ప్లానింగ్ విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.