చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్‌లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు.
– సాక్షి, విశాఖపట్నం
సేమ్యాలపై జాతీయ గీతం
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది.
– కారంచేడు
ముందుకొచ్చిన సముద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి)
– భోగాపురం
మనోహర దృశ్యం
శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..)
Comments
Please login to add a commentAdd a comment