Karamchedu
-
Photo Feature: చెట్టుకు రాఖీ.. సేమ్యాలపై జాతీయ గీతం
చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు. – సాక్షి, విశాఖపట్నం సేమ్యాలపై జాతీయ గీతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది. – కారంచేడు ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి) – భోగాపురం మనోహర దృశ్యం శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..) -
ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు
కారంచేడు (బాపట్ల): వివాహేతర సంబంధం నెరపుతున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కారంచేడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామానికి చెందిన పేర్లి సురేష్ (35) కొంత కాలంగా కారంచేడు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కారంచేడులోని యువతి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు కానీ, తెల్లవారే సరికి సురేష్.. యువతికి చెందిన ఇంటి వరండాలో ఉరేసుకుని మృతిచెందాడు. అతడిని చంపి, ఉరేసినట్లు చిత్రీకరించే యత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇతని వ్యవహారం వల్లే భార్య ధనలక్ష్మి కొద్దిరోజుల కిందట అలిగి పుట్టింటికి వెళ్లింది. మృతుడికి చందు, కిరణ్యలనే ఇద్దరు పిల్లలున్నారు. మృతుని శరీరంపై అనేక గాయాలున్నట్లు గుర్తించామని, తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు ఇమ్మానుయేలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి) -
సంక్రాంతి: కారంచేడుకు బాలకృష్ణ దంపతులు
Nandamuri Balakrishna Family Celebrations At Prakasham District: సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు వచ్చారు. అక్కాబావలైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకొనేందుకు కారంచేడులోని వారింటికి చేరుకున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఇటీవల బాలకృష్ణ సతీమణి వసుంధర వచ్చినప్పటికీ.. చాలా కాలంగా బాలకృష్ణ రాలేదు. ఈ సారి బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు. గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించలేదు. -
టీడీపీ నేత.. ఎరువుల మేత!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులకు చెందాల్సిన ఎరువులు, పురుగు మందులను టీడీపీ నేతలు అప్పనంగా కాజేశారు. రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు సరఫరా చేసిన ఎరువులు, పురుగు మందుల సొమ్మును టీడీపీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్ స్వాహా చేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.38.79 లక్షలు నొక్కేశారు. పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో ఈ బాగోతం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారం వెలగబెడుతున్న సమయంలో 2016 నుంచి 2018 మధ్యలో ఎరువులు, పురుగు మందుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను మింగేశారు. అక్రమాలకు పాల్పడింది అప్పటి కారంచేడు పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య కాగా అందుకు పూర్తిగా సహకారం అందించింది మాత్రం సీఈవో గంటా మల్లయ్య చౌదరి. ఆడిట్లో బయటపడ్డ బండారం జిల్లా సహకార శాఖ అధికారులు ఏటా పీఏసీఎస్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ జమానాలో సహకార శాఖ అధికారులు పీఏసీఎస్ ఆడిట్ చేయడానికి కూడా భయపడ్డారు. కారంచేడు పీఏసీఎస్ మీద తీవ్రమైన ఆరోపణలు రావడంతో చివరకు మూడేళ్లకు సంబంధించి 2018లో సహకార శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించారు. అంటే 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి ఏకకాలంలో ఆడిట్ నిర్వహించారు. దీంతో అప్పటి వరకు జరిగిన అక్రమాలు కొంతమేర బయటపడ్డాయి. ఆడిట్ రిపోర్టును అప్పటి అధికారులు జిల్లా సహకార శాఖ అధికారులకు సమర్పించారు. చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనమేషాలు రైతులకు సరఫరా చేసేందుకు పీఏసీఎస్‌లకు ఎరువులు, పురుగు మందుల కొనుగోలు కోసం జిల్లా పీడీసీసీ బ్యాంకు రుణం రూపంలో నిధులు కేటాయిస్తుంది. అయితే కారంచేడు పీఏసీఎస్‌లో చైర్మన్‌తోపాటు సీఈవో కలిసి రూ.38,79,001.63 స్వాహా చేశారు. అప్పటి నుంచి పీఏసీఎస్ తీసుకున్న నిధులు బ్యాంకుకు తిరిగి జమ కాలేదు. బ్యాంకు సీఈఓ సొసైటీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే జిల్లా సహకార శాఖ అధికారులు మాత్రం కాజేసిన సొమ్మును తిరిగి వసూలు చేయడంలో మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. ఇంత వరకు వారిద్దరిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అంతుపట్టని అంశంగా మారింది. విచారణతో వెలుగులోకి.. ఆడిట్ రిపోర్టు ఆధారంగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి కారంచేడు పీఏసీఎస్‌లో నిధుల స్వాహా విషయమై డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.సుధాకర్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణ 2019లో చేపట్టారు. అయితే ఆడిట్ రిపోర్టులో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు విక్రయించి తద్వారా వచ్చిన నిధులను కాజేశారని తేలింది. మందులు అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము రూ.28,35,957ను పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య, సొసైటీ సీఈవో గంటా మల్లయ్య చౌదరి కలిసి కాజేశారని స్పష్టమైంది. దీంతోపాటు చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య ఒక్కడే రూ.10,43,044.63 కాజేశారని విచారణలో బయటపడింది. మొత్తం రూ.38,79,001.63 సొమ్మును కాజేశారని విచారణాధికారి జిల్లా సహకార శాఖ అధికారికి 2019 జనవరిలోనే నివేదిక అందించారు. రికవరీకి నోటీసులిచ్చాం కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ అప్పటి చైర్మన్‌కు, సీఈవోకు నోటీసులిచ్చాం. సహకార చట్టం సెక్షన్ 52 కింద నోటీసులు జారీ చేశాం. 2020 మార్చి 7వ తేదీన నోటీసులు వారికి అందాయి. వారు కాజేసిన సొమ్మును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాం. అయితే ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు వెలువడటంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉన్నతాధికారులు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించారు. – ఎల్.సుధాకర్, డిప్యూటీ రిజిస్ట్రార్, సహకార శాఖ చదవండి: కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు విషాదం: అమ్మకు తోడుగా వచ్చి.. -
పంచాయితీ బరిలో అక్కా, చెల్లెళ్ల ఢీ
సాక్షి, కారంచేడు(ప్రకాశం) : ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. అక్కడే ఇద్దరూ ఇంటర్ వరకు చదువుకున్నారు. అదే ఊరికి చెందిన ఒకే ఇంటి పేరున్న వారిని వివాహమాడారు. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామంలోని ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో ఉంచితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బరిలోకి దించారు. ఇంత వరకు ఇద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేకపోయినప్పటికీ. .ఇప్పుడు ఇద్దరు తమ, తమ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. చదవండి: ఓసారి ఊరొచ్చి పోప్పా.. కావాలంటే కారు పంపిస్తా! బొడ్డు అంకయ్య, బొడ్డు నరసింహం అన్నదమ్ములే ప్రత్యర్థులు.. మిట్టపాలెం(కొండపి): ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు పోటీపడుతున్నారు. గ్రామంలో 793 ఓట్లుండగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 380 దాకా ఉంటాయి. సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్లు వేశారు. 87 ఏళ్ల వయస్సులో పోటీ మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని శేరేపాలెం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు 1993లో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001–2006 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. 87 ఏళ్ల వయస్సులోనూ మరోసారి సర్పంచ్‌గా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన భార్య లక్ష్మీదేవి 1995 నుంచి 2001 వరకు సర్పంచ్‌గా, 2001 నుంచి 2006 వరకు జెడ్పీటీసీ సభ్యురాలిగా చేశారు. -
కలకలం రేపిన చోరీ: ఆ దొంగ దొరికాడు!
సాక్షి, కారంచేడు: బాపట్ల మాజీ ఎంపీ, మూవీ మొఘల్ దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును కారంచేడు పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి.. అతడి వద్ద నుంచి రూ. 3 లక్షల 60వేల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కారంచేడు నడిబొడ్డు చినవంతెన సెంటర్ లైబ్రరీ బజారులో సినీ నిర్మాత, మూవీ మోఘల్‌గా పేరొందిన గ్రామానికి చెందిన డాక్టర్ దగ్గుబాటి రామానాయడు ఇంట్లో ఇటీవల దొంగలు పడిన సంగతి తెలిసిందే. రామానాయుడు ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటుండటంతో దంపతులు తరుచూ హైదరాబాద్ వెళ్లి వారం, పది రోజులు ఉండి వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 16వ తేదీన మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో పనులు చేసే నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి గ్రామంలోనే ఉండే ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్ని బీరువాలు, అరమరలు పగులగొట్టి ఉండటంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల రూరల్ సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలిసిన సినీ నిర్మాత, నటుడు, మోహన్‌బాబు బావమరిది కొల్లా అశోక్‌కుమార్ వచ్చి పోలీసులకు వివరాలు అందించారు. -
మూవీ మొఘల్ రామానాయుడు ఇంట్లో చోరీ
సాక్షి, కారంచేడు: బాపట్ల మాజీ ఎంపీ, మూవీ మొఘల్ దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో దొంగలు చేతివాటం చూపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీభత్సం సృష్టించారు. బీరువాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మండల కేంద్రం కారంచేడు చినవంతెన సమీపంలో జరిగింది. రామానాయుడు ఇంట్లో దొంగలు పడ్డారని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కారంచేడు నడిబొడ్డు చినవంతెన సెంటర్ లైబ్రరీ బజారులో సినీ నిర్మాత, మూవీ మోఘల్‌గా పేరొందిన గ్రామానికి చెందిన డాక్టర్ దగ్గుబాటి రామానాయడు ఇంట్లో దొంగలు పడ్డారు. రామానాయుడు ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటుండటంతో దంపతులు తరుచూ హైదరాబాద్ వెళ్లి వారం, పది రోజులు ఉండి వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 16వ తేదీన మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంట్లో పనులు చేసే నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి గ్రామంలోనే ఉండే ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్ని బీరువాలు, అరమరలు పగులగొట్టి ఉండటంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల రూరల్ సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలిసిన సినీ నిర్మాత, నటుడు, మోహన్‌బాబు బావమరిది కొల్లా అశోక్‌కుమార్ వచ్చి పోలీసులకు వివరాలు అందించారు. సంఘటన స్థలాన్ని చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి పరిశీలించి పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10 కేజీల వెండి మాయం బాధితుల ఫోన్ సమాచారం మేరకు 10 కేజీల వెండి వస్తువులు, మూడు సవర్ల బంగారం, రూ.60 వేల నగదు మాయమయ్యాయని సీఐ శ్రీనివాసరావు వివరించారు. మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్ నుంచి వస్తున్నారని, వారు వచ్చిన తర్వాత చోరీ సొత్తు వివరాలు పూర్తిగా తెలుస్తాయని, అప్పుడు పూర్తి స్ధాయి విచారణ చేపడతామని సీఐ వివరించారు. గ్రామస్తుల ఆందోళన ఎప్పుడూ రద్దీగా, పటిష్ట భద్రత ఉండే రామానాయుడు ఇంట్లో దొంగల పడ్డారనే సమాచారంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఇంట్లో ఎవరూ లేకుండా తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ ఇదే మాదిరి దొంగతనాలు జరిగిన విషయాన్ని గ్రామస్తులు చర్చించుకుంటుంన్నారు. గ్రామంలో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చీరాల రూరల్ సీఐ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
-
తప్పిన పెను ప్రమాదం; కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని కారులోని వారిని సురక్షితంగా బయటకు లాగారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వారందరిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదాన్నికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. -
ప్రేమ జంటలే టార్గెట్
ఏకాంతం కోరుకునే ప్రేమికులు, ఇతర జంటలను టార్గెట్ చేస్తూ ఓ ముఠా దోపిడీలు, లైంగిక దాడులకు పాల్పడుతోంది. వీరు తమ అఘాయిత్యాలకు కారంచేడు సమీపంలోని కాలువకట్టను అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. ఆవైపు ఎవరైనా జంటలు సరదాగా వస్తే వారిని వెంబడించి బెదిరించి డబ్బు, బంగారం, సెల్ఫోన్లు దోపిడీ చేయడం, పరిస్థితులను బట్టి మహిళలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడటం చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు గతంలో పలుమార్లు జరిగాయి. తాజాగా శుక్రవారం నాటి సంఘటనతో పోలీసులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. సాక్షి, పర్చూరు: కొత్తవారు ఎవరైనా కారంచేడులో అడుగు పెట్టిన వెంటనే ఓ ముఠా ప్రేమజంటలను టార్గెట్ చేస్తోంది. చీరాలకు చెందిన ఒక ముఠా కొన్నేళ్లుగా ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారి వద్ద డబ్బు, విలువైన వస్తువులతో పాటు కొన్ని సందర్భాల్లో లైంగికదాడులకు సైతం పాల్పడుతున్నారు. కేవలం కొందరు ప్రేమజంటలు, వివాహేతర సంబంధాలున్న జంటలు ఈ ముఠాకు బలి అవుతున్నారు. – ప్రస్తుతం జరిగింది ఇలా.. మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి లైంగిక దాడికి పాల్పడటంపై కారంచేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సంచలనం రేపిన ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చీరాల విఠల్ నగర్‌కు చెందిన మహిళకు చెరుకుపల్లికి చెందిన వ్యక్తితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఓ పాప ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఒకటిన్నర సంవత్సరం కిందట ఇద్దరూ విడిపోయారు. భర్తతో విడిపోయిన ఆ యువతి తల్లిదండ్రుల వద్ద చీరాలో ఉంటోంది. ఆమెకు కొత్తపాలెంనకు చెందిన శివారెడ్డితో పరిచయమైంది. అది వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. ఈనెల 19వ తేదీ శుక్రవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వారిరువురు కలిసి ద్విచక్రవాహనంపై కారంచేడు కాలువ కట్ట వద్దకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వారి వద్దకు వచ్చి ఒకరు శివారెడ్డిని గట్టిగా పట్టుకొన్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు మహిళను బలవంతంగా పక్కకు ఈడ్చుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆగంతకులు శివారెడ్డి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను, రూ. 2,300 నగదును తీసుకొని పారిపోయినట్లు బాధితులు చెప్తున్నారు. శనివారం బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బి. నరసింహారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. విచారణ వేగవంతం.. మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల సామూహిక లైంగిక దాడికి సంబంధించిన ఫిర్యాదుపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు. గతంలో జరిగింది ఈ ప్రాంతంలోనే.. 2018 నవంబరు 25న చీరాల హయ్యర్‌పేటకు చెందిన బొనిగల సాల్మన్, మరొక మహిళ ద్విచక్రవాహనంపై కారంచేడు రోడ్డులోని కుర్తుల చప్టా మీదుగా వెళుతుండగా చీరాలలోని దండుబాటలో నివసించే దాన గోపి, జయశంకర్ నగర్‌కు చెందిన అన్నం సుధాకర్‌బాబులు పోలీసుల మని చెప్పి వారిని అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4500 నగదులో పాటు సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారు. సాల్మన్‌తో పాటు ఉన్న మహిళను బలవంతంగా లాక్కొని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు ద్విచక్రవాహనం పై పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్ సీఐ పి. భక్తవత్సలరెడ్డి నేతృత్వంలో ఎస్సై పున్నారావు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు. ప్రియుడి ప్లానేనా..? – బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు చీరాల: అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి అన్నారు. చీరాల–కారంచేడు రోడ్డులో కారంచేడు సమీపంలోని కాలువ బ్రిడ్జి వద్ద రెండు రోజులు క్రితం చీరాల విఠల్‌నగర్‌కు చెందిన మహిళ, మరో వ్యక్తి ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇరువురు దాడి చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఘటనలో బాధితురాలిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితురాలిని ఆదివారం మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి ఏరియా వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలను అమెను అడిగి తెలుసుకున్నారు. కారకులైన వారికి శిక్ష పడేలా చేసి న్యాయం చేస్తామన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ బి.నాగమణి ఉన్నారు. ఈ సంఘటనలో లైంగికదాడి చేసిన వారితో ఆమె ప్రియుడికి కూడా సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఓటేయాలని దాడి..!
-
పచ్చ నేతలకు పిచ్చెక్కిందా..!
సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్యాన్ గాలి వీస్తోందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దేశంలోని అన్ని సర్వే సంస్థలు చెప్తుండటం.. వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో ఆయన వెన్నంటి నడుస్తున్న అశేష జనవాహినిని చూసి పచ్చ తమ్ముళ్ల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఫ్యాన్ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారు. ఓటమి భయంతో నిరాశలో మునిగిపోయిన టీడీపీ నేతలు ఓటర్లను అభ్యర్థించే బదులు.. దౌర్జన్యం చేసి మరీ.. ‘టీడీపీకి ఓటు వేస్తారా..! చస్తారా..!’ అని బెదిరింపులకు దిగుతున్నారు. ఎదురు మాట్లాడితే దాడులకూ తెగబడుతున్నారు. జిల్లాలోని చీరాల మండలం కారంచేడు గేటు వద్ద తప్పతాగిన టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కారుకు అడ్డుగా నిలవడంతోపాటు టీడీపీకి ఓటు వేయాలంటూ దురుసుగా మాట్లాడారు. ఇదేంటని ప్రశ్నించిన పాపానికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. తల, మొహంపై గాయాలపాలైన జాండ్రపేటకు చెందిన శోభన్‌బాబు, నాగరాజు, రాజేంద్రబాబు చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడింది రామ్‌నగర్‌కు చెందిన వారుగా స్థానికులు చెప్పారు. -
సరస్వతీ పుత్రుడికి ‘రక్త’ పరీక్ష
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు. పిల్లలను మంచిగా చదివించాలని పట్టుదలతో శ్రమిస్తున్న ఆ తల్లిదండ్రులకు తీరని కష్టం. ఉద్యోగం కోల్పోయినా కుల వృత్తి చేసుకుంటూ అతడు, కూలీ పనికి వెళ్తూ ఆమె కుటుంబాన్ని పోషిస్తున్నారు. కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా కొడుకు సరస్వతీ పుత్రుడు. చదువులో రాణిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సరస్వతీ పుత్రుడికి విధి ‘రక్త’ పరీక్ష పెట్టింది. కొడుకు ప్రాణాలకు ముప్పుండడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం సర్వం ధారపోశారు. అయినా సరిపోకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబ దీనగాథ ఇదీ... ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన జరుగుమల్లి రంగయ్య, అంజన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు రాజేశ్బాబును విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాజేశ్ ఇంటర్ ఫస్టియర్‌లో అత్యధిక మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఇంతలో ఊహించని విధంగా రాజేశ్ అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆస్పత్రుల చుట్టూ తిప్పినా జబ్బును కనిపెట్టలేకపోయారు. చివరకు నిమ్స్‌కు తీసుకురగా, అతడికి ‘అప్లాస్టిక్ అనీమియా’ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో రంగయ్య హతాశుడయ్యాడు. క్షౌ రవృత్తి చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్న అతడు వైద్య పరీక్షల కోసమే రూ.8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. తనకున్న కొద్దిపాటి పొలం, బంగారం అమ్మేసి కొడుక్కి వైద్యం చేయించాడు. డబ్బులు సరిపోకపోవడంతో దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. మొత్తం ఇప్పటివరకు రూ.12 లక్షల వరకు ఖర్చుచేశారు. ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో మూల కణాల మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయాలని నిమ్స్ వైద్యులు నిర్ణయించారు. వంద శాతం మూల కణాలు సరిపోలిన వ్యక్తి నుంచి రాజేశ్‌కు స్టెమ్ సెల్స్ ఎక్కిస్తే అతడికి వ్యాధి నయమవుతుందని నిమ్స్ హెమటాలజీ నిపుణురాలు డాక్టర్ రాధిక చెప్పారు. ధాత్రి ఫౌండేషన్ ద్వారా మూలకణ దాత దొరికాడు. చికిత్సకు మొత్తం రూ.25 లక్షలు ఖర్చవుతుంది. అయితే ఈ చికిత్స అందించే నిపుణులు అందుబాటులో లేకపోవడంతో వేలూరు(తమిళనాడు)లోని సీఎంసీకి సిఫార్స్ చేశారు. నిమ్స్ వైద్యుల సహాయంతో సీఎంసీలో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తండ్రి రంగయ్య సతమతమవుతున్నాడు. మరోవైపు కుమారుడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఆందోళన చెందుతున్నాడు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నాడు. సహాయం చేయాలనుకునేవారు 92473 56545 నంబర్లో రంగయ్యతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంకు వివరాలు.. పేరు: జరుగుమల్లి రంగయ్య ఆంధ్రాబ్యాంక్, కారంచేడు బ్రాంచ్ అకౌంట్ నంబర్: 033210100033069 ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏఎన్‌డీబీ 0000332 అప్లాస్టిక్ అనీమియా అంటే? మన శరీరంలో తగినన్ని కొత్త రక్త కణాలు తయారు కాకపోవడాన్ని అప్లాస్టిక్ అనీమియాగా పేర్కొంటారు. దీని బారినపడితే తరచూ ఆయాసం వస్తుంది. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. రక్తస్రావం అధికంగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చర్మం పాలిపోయి స్కిన్‌పై రాషెష్ వస్తాయి. కళ్లు తిరగటం, తలపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ముక్కు, చిగుళ్ల నుంచి కూడా రక్తం రావొచ్చు. వ్యాధి ముదిరిన వారికి మూలకణ మార్పిడి చేయాల్సిందే. ఇది చాలా సుదీర్ఘమైన, క్లిష్టమైన చికిత్స. తేడా వస్తే ప్రాణాలే పోవచ్చు. -
పోలీసులపై ముద్రగడ ఫైర్
-కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాకినాడ : ప్రకాశం జిల్లా కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో కాపు వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ బొప్పన పరిపూర్ణచంద్రరావును పోలీసులు అరెస్టు చేసి లాకప్‌డెత్ చేసిన ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. తప్పు చేసిన వ్యక్తిని న్యాయస్థానం ద్వారా శిక్షించాలి తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని లాకప్‌డెత్‌కు పాల్పడటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారే ప్రజల ప్రాణాలు తీయడమేమిటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఆటో నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అపహరించి మూడు రోజులపాటు చిత్రహింసలు పెట్టడమే కాకుండా, కొట్టి చంపడం చూస్తూంటే ఈ ప్రభుత్వమే పథకం ప్రకారమే కాపు సామాజిక వర్గం ప్రతిష్టను దెబ్బతీసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఉందని ఆరోపించారు. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన వ్యక్తిని విచారణ పేరుతో ఎందుకు కారంచేడు తరలించారని ముద్రగడ పోలీసులను ప్రశ్నించారు. లాకప్‌డెత్‌పై ఉన్నత స్థాయి విచారణ జరిపి... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి ముద్రగడ విజ్ఞప్తి చేశారు. పోలీసుల దుశ్చర్యను ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. -
కౌలు రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కారంచేడు మండలం కేశవరప్పాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చిరుమాల ఏలియా (45) నాలుగేళ్లుగా ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు, పత్తి సాగు చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి వ్యవసాయం కోసం చేసిన అప్పు రూ.3 లక్షలకు తోడు వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయి. అప్పులు తీరే మార్గం తెలియక శనివారం ఇంటి నుంచి పొలానికి వెళ్లిన ఏలియా అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలియా ఇంటికి రాకపోవడంతో ఎక్కడికెళ్లాడో తెలియక కుటుంబ సభ్యులు వెతకగా.. మంగళవారం గ్రామానికి చెందిన పగడాల చెంచుపున్నయ్య పత్తి చెట్ల మధ్యలో పడి ఉన్న ఏలియా మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే సమాచారం కుటుంబసభ్యులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
కారంచేడులో భారీ అగ్ని ప్రమాదం
ఒంగోలు: ప్రకాశం జిల్లా కారంచేడులోని ధాన్యం గోదాములో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతూ... ఆ పక్కనే ఉన్న షాపులోకి కూడా ఆ మంటలు వ్యాపించాయి. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసి పడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఫైరింజన్లతో వారు అక్కడి చేరుకుని అగ్నికీలలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో షాపులోని ఫర్నిచర్ దగ్ధమైంది. సుమారు రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. అయితే ధాన్యం గోదాములో అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కడ‘గండ్లు’ తీరేదెన్నడు
కారంచేడు, న్యూస్‌లైన్: భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి కన్నీటి పర్యంతమవుతున్న రైతులను ఓదార్చేవారే కరువయ్యారు. పాలకులు వచ్చారు..వెళ్లారు అన్నట్లుగా వ్యవహరిస్తుంటే..అధికారులు మాత్రం మాకెందుకులే అన్నట్లు చోద్యం చూస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలు కారంచేడు ప్రాంత రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. రైతులు వరి సాగుకు ఎకరాకు రూ 15 వేల వరకు ఖర్చు చేశారు. తాగు, సాగునీరందించే కొమ్మమూరు కాలువకు జిల్లాలో సుమారు 50 చోట్ల గండ్లు పడ్డాయి. నీటి ఉధృతికి సాగుచేసిన పంటలు కొట్టుకుపోగా..మిగిలిన 10-20 శాతం పంటలను బతికించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కాలువకు గండ్లు పడటంతో అధికారులు నీటి సరఫరా నిలిపేశారు. దీంతో కాలువ పూర్తిగా ఎండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు తగ్గి పదిహేను రోజులవుతున్నా పాలకులు, అధికారుల్లో స్పందన లేదు. కారంచేడు, చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం, సంతనూతలపాడు మండలాల్లో కొమ్మమూరు కింద సుమారు లక్ష ఎకరాల్లో అధిక భాగం పంట తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన పంటలను కాపాడుకోవాలంటే రైతులకు నీరు అవసరం. అవి లేకపోవడంతో తీరేదెన్నడు పంటలు ఎండుముఖం పడుతున్నాయి. చివరకు మురుగు కుంటల్లో నిలిచిన నీటిని రైతులు డీజిల్ ఇంజన్ల ద్వారా పొలాలకు తరలిస్తూ అదనపు ఖర్చుతో అల్లాడుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ తుడిచిపెట్టుకు పోయింది. రబీకి సిద్ధపడుతున్న అన్నదాతలు నార్లు పోసుకోవాలంటే నీరు కావాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొమ్మమూరుకు పడిన గండ్లు పూడ్చి కాలువకు నీరు వదిలి తమ కడగండ్లు తీర్చాలని రైతులు కోరుతున్నారు. -
ఇలా అయితే మళ్లీ క్రాప్ హాలిడేనే!
కారంచేడు, న్యూస్‌లైన్: సరికొత్త విధానాలతో శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తూ కారంచేడుకు జిల్లా ధాన్యాగారంగా పేరు తీసుకొచ్చిన ఆ ప్రాంత రైతులు ప్రస్తుతం వ్యవసాయమంటే హడలిపోతున్నారు. ప్రతి ఏటా ప్రకృతి కన్నెర్రజేయడం.. పంటలు నీటిపాలవడం లేదా ఎండిపోవడం సాధారణంగా మారింది. గిట్టుబాటు ధరలు మృగ్యమయ్యాయి. దీంతో వ్యవసాయానికి ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికి తోడు కొమ్మమూరు, రొంపేరు కాలువలు ఆధునికీకరణకు నోచుకోకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. గతంలో సంభవించిన ఓగ్ని తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కారంచేడులో పర్యటించి ఆ రెండు కాలువల వల్లే పంటలకు అధికంగా నష్టం కలుగుతున్నట్లు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించారు. కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల పాత కథే పునరావృతమవుతోంది. నాటి గిట్టుబాటు ధరలు ఏవీ.. వైఎస్ హయాంలో రైతులంతా ఆత్మతృప్తి చెందేవారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. అప్పట్లో క్వింటా ధాన్యం రూ. 1450 వరకు పలకడం రికార్డుగా ఉండేది. ఆయన తదనంతరం రైతుల గురించి పట్టించుకొనేవారు లేకపోవడంతో కారంచేడు ప్రాంతంలో పండిన ధాన్యం ఇళ్లకే పరిమితమైంది. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో గ్రామం నిండా నిండిన పురులే దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కానీ ఎంతోకొంత ధరకు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. 2011-12 సంవత్సరంలో అయితే నీరు లేక.. పాలకుల నుంచి ఎలాంటి హామీ లేక రాష్ట్రం మొత్తం మీద మొదటిసారిగా ఈ ప్రాంత రైతులు ‘క్రాప్‌హాలిడే’ ప్రకటించాల్సి వ చ్చింది. దీంతో వేల ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఈ ఏడాదైనా తమ జీవి తాలు మారతాయనుకుంటున్న తరుణంలో బంగాళాఖాతం రూపంలో దురదృష్టం మళ్లీ తలుపు తట్టింది. చాలా కాలం నుంచి ధాన్యం తడవకుండా ఇంటికి వచ్చిన సందర్భాలే తక్కువని అన్నదాతలు వాపోతున్నారు. తుఫానులు లేదా వరదలు లేదా అకాల వర్షాల వంటి కారణాలు రైతు కంటిమీద కునుకులేకుండా చేయడం పరిపాటిగా మారింది. వ్యవసాయం లాటరీగా మారిన నేపథ్యంలో పెట్టుబడులన్నీ ఆవిరైపోవడం.. అప్పులు పెరగడం సాధారణమైంది. ఇంకా నీటిలోనే.. కారంచేడు గ్రామానికి ఉత్తరం, దక్షిణం, కుంకలమర్రు తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సుమారు 5 వేల ఎకరాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వారానికి పైగా ఇలాంటి పరిస్థితే ఉండడంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. పర్చూరు వాగుకు ఎగువన, స్వర్ణ, రంగప్పనాయుడువారిపాలెం ప్రాంతాల్లో పొలాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.