![Young Man Suspect Death After having Extramarital Affair in Bapatla - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/6/6556.jpg.webp?itok=0CjMUQtS)
పేర్లి సురేష్ (ఫైల్)
కారంచేడు (బాపట్ల): వివాహేతర సంబంధం నెరపుతున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కారంచేడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామానికి చెందిన పేర్లి సురేష్ (35) కొంత కాలంగా కారంచేడు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కారంచేడులోని యువతి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు కానీ, తెల్లవారే సరికి సురేష్.. యువతికి చెందిన ఇంటి వరండాలో ఉరేసుకుని మృతిచెందాడు. అతడిని చంపి, ఉరేసినట్లు చిత్రీకరించే యత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇతని వ్యవహారం వల్లే భార్య ధనలక్ష్మి కొద్దిరోజుల కిందట అలిగి పుట్టింటికి వెళ్లింది.
మృతుడికి చందు, కిరణ్యలనే ఇద్దరు పిల్లలున్నారు. మృతుని శరీరంపై అనేక గాయాలున్నట్లు గుర్తించామని, తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు ఇమ్మానుయేలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి)
Comments
Please login to add a commentAdd a comment